banned
-
చెలరేగిపోతున్న యూట్యూబర్లు.. కేదార్‌నాథ్‌లో కొత్త రూల్
కేదార్నాథ్: హిందువులు అత్యంత పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రాలుగా భావించేవాటిలో కేదార్నాథ్(Kedarnath) ఒకటి. ప్రతీయేటా లక్షలాదిమంది భక్తులు కేదార్‌నాథ్‌ను సందర్శిస్తుంటారు. అయితే గత కొంతకాలంగా ఇక్కడికి వచ్చే యూట్యూబర్లు ఆలయ పరిసరాల్లో వీడియోలు, రీల్స్ తీస్తూ వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఇతరుల ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆలయ కమిటీ ఇటువంటి చర్యలకు అడ్డుకట్ట వేసే దిశగా నిర్ణయం తీసుకుంది.ఈ ఏడాది(2025)లో చార్ధామ్ యాత్ర(Chardham Yatra) ఏప్రిల్ 30న ప్రారంభం కానుంది. తొలుత యమునోత్రి, గంగోత్రి ఆలయాలు తెరవనున్నారు. మే 2న కేదార్నాథ్, మే 4న బద్రీనాథ్ ఆలయాల ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఇటువంటి తరుణంలో కేదార్నాథ్ ఆలయ సముదాయంలో రీల్స్ చేయడాన్ని నిషేధిస్తూ చార్ధామ్ మహా పంచాయతీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.ఉత్తరాఖండ్‌లోని నాలుగు ధామ్‌లలో అత్యధికంగా రీల్స్, వీడియోలు కేదార్నాథ్ ధామ్(Kedarnath Dham)లోనే రూపొందిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన పలువురు యూట్యూబర్లు విరివిగా వీడియోలు , రీల్స్ చేసి వాటిని వైరల్ చేస్తున్నారు. వీటి ప్రభావం తీర్థయాత్రపై పడుతోందని ఆలయ అధికారులు గుర్తించారు. భక్తి విశ్వాసాలతో మెలిగేవారు ఇటువంటి రీల్స్ చూసి ఆందోళన చెందుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ఇక్కడ రీల్స్ చేయడాన్ని పూర్తిగా నిషేధించారు.ధామ్ పవిత్రతను కాపాడటానికి ఇటువంటి నిర్ణయం తీసుకున్నామని ఆలయ అధికారులు తెలిపారు. కేదార్నాథ్ తీర్థ పురోహిత సమాజ్ కూడా ఇక్కడ రీల్స్ చేయడాన్ని వ్యతిరేకించింది. ప్రభుత్వం దీనిపై చర్య తీసుకోవాలని కోరింది. ఈ నేపధ్యంలో ఆలయ ప్రాంగణంలో రీల్స్, వీడియోలు తీయడాన్ని నిషేధించాలని చార్ ధామ్ మహా పంచాయతీ సమావేశంలో నిర్ణయించారు. దీనితో పాటు ఆలయంలో వీఐపీ దర్శనాలను కూడా నిషేధించారు. ఎవరైనా ఆలయ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.ఇది కూడా చదవండి: Switzerland: సొరంగాల స్వర్గం.. ప్రభుత్వ కృషి అమోఘం -
85 లక్షల ఖాతాలపై నిషేధం!.. వాట్సప్ కీలక నిర్ణయం
ప్రముఖ మెసేజింగ్ యాప్ 'వాట్సాప్' సెప్టెంబర్ నెలలో భారతదేశంలోని 85 లక్షల కంటే ఎక్కువ ఖాతాలను నిషేధించినట్లు తెలిపింది. ఇందులో సుమారు 16,58,000 ఖాతాలపైన ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినప్పటికీ.. ఐటీ రూల్స్ ఉల్లంఘించిన కారణంగా చర్యలు తీసుకుంది.భారతదేశంలో సుమారు 600 మిలియన్ల కంటే ఎక్కువ మంది వాట్సాప్ ఉపయోగిస్తున్నట్లు సమాచారం. నియమాలకు ఉల్లంఘించిన ఖాతాదారుల అకౌంట్లను వాట్సాప్ ఎప్పటికప్పుడు నిషేధిస్తూ ఉంది. ఇందులో భాగంగానే గత నెలలో భారీగా సంఖ్యలో ఖాతాలను నిషేధించింది.ఇదీ చదవండి: తండ్రి నుంచి అప్పు తీసుకుని మరీ!! మకుటం లేని మహరాజుగా ఎదిగి..మోసం లేదా తప్పుడు సమాచారం చేరవేయడం.. వంటి చర్యలకు పాల్పడిన యూజర్లపైన వాట్సాప్ చర్యలు తీసుకుంటోంది. గత ఆగస్టు నెలలో కూడా వాట్సాప్ 84.58 లక్షల ఖాతాలను వాట్సాప్ నిషేదించింది. దీన్ని బట్టి చూస్తే.. రాబోయే రోజుల్లో కూడా నియమాలను అతిక్రమించిన వారి ఖాతాలను వాట్సాప్ తొలగించనున్నట్లు స్పష్టమవుతోంది. -
దీపావళి టపాసులు.. వివిధ రాష్ట్రాల నిబంధనలివే..
న్యూఢిల్లీ: చలికాలం సమీపిస్తున్న కొద్దీ దేశంలోని పలు నగరాల్లో గాలి విషపూరితంగా మారుతుంటుంది. ఇదే కాకుండా దీపావళి సందర్భంగా పటాకులు కాల్చినప్పుడు వాయు కాలుష్యం మరింత విజృంభిస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని వివిధ రాష్ట్రాలు పటాకులు కాల్పడంపై నిషేధం విధించాయి. మరికొన్ని రాష్ట్రాల్లో కేవలం రెండు గంటలపాటు మాత్రమే టపాసులు వెలిగించేందుకు అనుమతినిచ్చారు.ఢిల్లీఢిల్లీ- ఎన్సీఆర్లలో అక్టోబరు 31న అంటే దీపావళి నాడు సాయంత్రం 8 నుంచి 10 గంటల మధ్యలో మాత్రమే గ్రీన్ టపాసులు కాల్చుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.మహారాష్ట్రమహారాష్ట్ర నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) సూచనల మేరకు మహారాష్ట్రలో బాణసంచా కాల్చడాన్ని నిషేధించారు. అయితే గ్రీన్ క్రాకర్స్ కాల్చడానికి మాత్రమే అనుమతి ఉంది. గ్రీన్ క్రాకర్స్ సాధారణ క్రాకర్స్ కంటే 30శాతం తక్కువ కాలుష్యాన్ని విడుదల చేసేలా తయారు చేస్తారు.పశ్చిమ బెంగాల్పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో దీపావళి సందర్భంగా కాలుష్యం గణనీయంగా పెరుగుతుంది. ఈ కారణంగా గత కొన్నేళ్లుగా ఇక్కడ సాధారణ పటాకులు పేల్చేందుకు అనుమతి ఇవ్వడం లేదు. అయితే కోల్‌కతాలో గ్రీన్ క్రాకర్లు కాల్చవచ్చు. కోల్‌కతాలో రాత్రి 8 నుండి 10 గంటల వరకు గ్రీన్ క్రాకర్స్ కాల్చడానికి అనుమతి ఉంది.పంజాబ్పంజాబ్లో గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు మాత్రమే అనుమతి ఉంది. పంజాబ్‌లో దీపావళి రోజున (అక్టోబర్ 31) ఉదయం 4 నుండి 5 గంటల వరకు, రాత్రి 9 నుండి 10 గంటల వరకు టపాసులు కాల్చేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.బీహార్ పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని బీహార్ ప్రభుత్వం రాష్ట్రంలోని నాలుగు నగరాల్లో బాణాసంచా కాల్చడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. రాజధాని పాట్నా, ముజఫర్‌పూర్, హాజీపూర్, గయలో ఈ ఏడాది బాణాసంచా కాల్చడానికి అనుమతి లేదు. ఈ నగరాల్లో పటాకుల అమ్మకానికి లైసెన్స్ కూడా ఇవ్వలేదు. ఎవరైనా రహస్యంగా పటాకులు విక్రయిస్తున్నట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.హర్యానాదీపావళి నాడు హర్యానాలో గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చాలంటూ ప్రభుత్వ ఆదేశాలు జారీ అయ్యాయి. దీపావళి నాడు రాత్రి 8 నుండి 10 గంటల వరకు, క్రిస్మస్ రోజున 11.55 నుండి 12.30 గంటల వరకు గ్రీన్ క్రాకర్లు కాల్చేందుకు అనుమతినిచ్చారు.తమిళనాడుతమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి దీపావళి రోజున పటాకులు కాల్చేందుకు మార్గదర్శకాలను విడుదల చేసింది. తమిళనాడులో దీపావళి రోజున ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు పటాకులు కాల్చేందుకు ప్రభుత్వం సమయం నిర్ణయించింది.ఇది కూడా చదవండి: ఈసారి 33 విమానాలకు బెదిరింపులు -
భారత ఫుట్‌బాలర్ అన్వర్ అలీపై నిషేధం
కోల్‌కతా: ఆటగాళ్ల బదిలీకి సంబంధించి ఉన్న నిబంధనలను ఉల్లంఘించిన భారత ఫుట్‌బాల్ ప్లేయర్ అన్వర్ అలీపై అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) చర్యలు తీసుకుంది. అతనిపై నాలుగు నెలల నిషేధాన్ని విధిస్తున్నట్లు ప్రకటించింది. మోహన్ బగాన్ సూపర్ జెయింట్ జట్టుతో కాంట్రాక్టు కుదుర్చుకున్న తర్వాత అన్వర్ ఆ కాంట్రాక్ట్‌ను పాటించకుండా అనూహ్యంగా ఈస్ట్ బెంగాల్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టుకు మారాడు. మరోవైపు వచ్చే ఏడాది వరకు కొత్త ఆటగాళ్లను తీసుకోవడంపై నిషేధం ఉన్నా సరే... దానిని ధిక్కరించి ఢిల్లీ ఎఫ్‌సీ కూడా అన్వర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ అంశం తీవ్ర వివాదం రేకెత్తించింది. దాంతో విచారణ జరిపిన ఏఐఎఫ్ఎఫ్ అన్వర్‌పై నిషేధంతో పాటు భారీ జరిమానా విధించింది. అన్వర్ అలీ నుంచి రూ.12 కోట్ల 90 లక్షలు నష్టపరిహారం పొందేందుకు మోహన్ బగాన్ క్లబ్ జట్టుకు అర్హత ఉందని స్పష్టం చేసింది. జరిమానా మొత్తాన్ని ఈస్ట్ బెంగాల్ క్లబ్, ఢిల్లీ ఎఫ్‌సీ, అన్వర్ కలిసి చెల్లించాలని ఏఐఎఫ్ఎఫ్ ఆదేశించింది. -
156 ఔషధాలపై కేంద్రం నిషేధం
న్యూఢిల్లీ: రోగుల ఆరోగ్యానికి హాని కలిగంచే 156 రకాల ఔషధాలను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. జ్వరం, జలుబు, అలర్జీ, దురద, నొప్పికి ఉపయోగించే 156 ఫిక్స్డ్ డోస్ కాంబినేషనల్‌ను నిషేధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.ఈ మందుల ఉత్పత్తి, నిల్వ అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ మందులు మనుషులకు ప్రమాదకరమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మందులకు సురక్షితమైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయని తెలిపింది.ఈ 156 ఎఫ్డీసీ మెడిసిన్స్ తయారీని, అమ్మకాన్ని, డిస్ట్రిబ్యూషన్‌ను నిషేధిస్తూ గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ (డీటీఏబీ), నిపుణుల కమిటీ సిఫార్సుతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. ఆగస్ట్ 12న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. నిషేధిత ఔషధాలలో 'అసెక్లోఫెనాక్ 50ఎంజీ+ పారాసెటమాల్ 125ఎంజీ టాబ్లెట్, మెఫెనామిక్ యాసిడ్ + పారాసెటమాల్ ఇంజెక్షన్, సెట్రిజైన్ హెచ్‌సిఎల్ + పారాసెటమాల్+ ఫినైల్ఫ్రైన్ హెచ్‌సీఎల్+ పారాసెటమాల్ వంటివి ఉన్నాయి. -
1.9 లక్షల 'ఎక్స్' అకౌంట్స్ నిషేధం!.. కారణం ఇదే
బిలినీయర్ ఇలాన్ మస్క్ (Elon Musk) ఆధీనంలోని ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విటర్) మే 26 నుంచి జూన్ 15 మధ్య భారతదేశంలో ఏకంగా 194053 ఖాతాలను నిషేధించినట్లు పేర్కొంది. కంపెనీ నియమాలను పాటించకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది.కొత్త ఐటీ రూల్స్ 2021 ప్రకారం.. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ తన ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా ఖాతాలను తొలగించింది. వచ్చిన మొత్తం ఫిర్యాదులలో 12570 భారతదేశం నుంచి వచ్చినట్లు సమాచారం. ఇందులో సెన్సిటివ్ అడల్ట్ కంటెంట్, వేధింపులు వంటి వాటికి సంబంధించినవి మాత్రమే కాకుండా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే చర్యలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.మస్క్.. ఎక్స్ ప్లాట్‌ఫామ్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంది. ఇందులో భాగంగానే ఫోటోను ఇతరులకు కనిపించకుండా కూడా చేసింది. ఇది యూజర్ గోప్యతను మెరుగుపరుస్తుంది. రూల్స్ అతిక్రమించిన వారి అకౌంట్స్ ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల 194053 ఖాతాలను తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. -
..................
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జింగ్ ఉన్ విచిత్రమైన పాలనా తీరుతో తరచు వార్తల్లో నిలుస్తుంటాడు. ఓ నియంతలా పాలిస్తుంటాడు. అర్థంకానీ నిబంధనలతో ప్రజలను కష్టపెడుతుంటాడన్న విషయంలో తెలిసిందే. అంతేగాదు మహిళల వ్యక్తిగత ఫ్యాషన్‌లో భయానక నిబంధనలను విధించాడు కిమ్. ఫ్యాషన్ ప్రపంచంలో మహిళలు ఎంతో ఇష్టపడు రెడ్ లిప్‌స్టిక్‌ని కూడా బ్యాన్ చేశాడంటే కిమ్ మామ ఆలోచన విధానం ఏంటో క్లియర్‌గా తెలుస్తుంది. కనీసం వారి వ్యక్తిగత అలకంరణ, ఫ్యాషన్ విషయాల్లో స్వేచ్ఛని కూడా లాగేసుకుంటే వామ్మో ఇదేం నాయకుడు రా బాబు అనిపిస్తుంది కదూ. అక్కడ ఫ్యాషన్ విషయంలో ప్రజలకు విధించిన ఆంక్షలు ఏంటో సవివరంగా చూద్దామా..!ఉత్తర కొరియాలో ధరించే దుస్తుల దగ్గరనుంచి అలకరణ వరకు కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. అక్కడ ప్రజలు వాటిని తప్పనిసరిగా పాటించాల్సిందే. వ్యక్తిగత ఫ్యాషన్, అందానికి సంబంధించిన వాటిల్లో చాలా కఠిన నిబంధనలు ఉంటాయి. వాటిల్లో ముఖ్యంగా రెడ్ లిప్‌స్టిక్‌ని పూర్తిగా బ్యాన్ చేసింది. మహిళలు ఎంతో ఇష్టంగా వేసుకుని రెడ్ లిప్‌స్టిక్‌ని ఉత్తర కొరియాలో మహిళలు వేసుకోకూడదు. అక్కడ దీన్ని బ్యాన్‌చేశారు. ఎందకంటే ఎరుపు లిప్‌స్టిక్ వేసుకున్న మహిళలు అందర్నీ ఆకర్షిస్తారు, ఇది తమ దేశ నైతిక విలువలను మంటగలుపుతుందనేది అక్కడ వారి వాదన. తమ దేశం సైద్ధాంతిక, సాంస్కృతికలతో బలంగా ముడి పడి ఉంది. ఇలాంటి ఫాషన్లు కారణంగా తమ దేశ విలువ పడిపోతున్నది వారి భయం. తమ ప్రభుత్వంసాంప్రదాయక, నిరాడంబర సౌందర్యాన్నే ప్రోత్సహిస్తుందని అక్కడ అధికారులు చెబుతున్నారు. అందువల్ల అక్కడ ఉండే మహిళలు చాలా సింపుల్ సిటీని మెయింటెయిన్ చేయక తప్పనిస్థితి. అంతేగాదు అక్కడ మహిళలు కళ్లు గప్పి ఆధునిక పోకడలను వంటబట్టించుకుని ఫ్యాషన్‌గా ఉంటున్నారేమోనని పార్టీ పెట్రోలింగ్ పేరుతో తనిఖీలు కూడా చేయిస్తుందట ఉత్తరకొరియా. ఒకవేళ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘించినట్లయితే వారికి తీవ్రమైన జరిమానాలు ఉంటాయి. అలాగే కేశాలంకరణ విషయంలో కూడా కఠినమైన రూల్స్ ఉన్నాయి. జుట్టును పొడవుగా పెంచుకోవడం లేదా స్టైల్‌గా వదులుగా వదిలేయడం వంటివి అస్సలు చేయకూడదు. చిన్నగా అలంకరించుకోవచ్చు. కచ్చితంగా జుట్లుని అల్లుకోవాల్సిందే. అలాగే హెయిర్ కలరింగ్ వంటి ఆధునిక ఫ్యాషన్ స్టయిల్స్ ఏమీ ట్రై చేయకూడాదు. ఉత్తర కొరియా కేశాలంకరణకు సంబంధించి పురుషులకు(10), మహిళలు(18) కొన్ని ప్రామాణీకరించిన స్టయిల్స్ మంజూరు చేసింది. వాటినే ఫాలో అవ్వవాల్సిందే. (చదవండి: ప్యాకేజ్డ్ స్నాక్స్, ఫిజీ డ్రింక్స్ నిజంగానే మంచివి కావా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..) -
అక్కడ శృతి మించిందో.. మీ పాట శాశ్వతంగా రద్దే!
‘ఫాస్ట్ బీట్ వద్దు.. మెలోడీయే ముద్దు’ అంటూ ఓ కొత్త నినాదాన్ని అందుకున్నాడు చెచెన్యా అధ్యక్షుడు రమ్జాన్ కాదిరోవ్. ‘చెచెన్ సంగీతం చెచెన్ మనస్తత్వానికి అనుగుణంగానే ఉండేట్టు చూడండి’ అంటూ ఆ దేశపు సాంస్కృతిక శాఖ మంత్రి మూసా దాదయేవ్కి ఆదేశాలూ ఇచ్చాడు. విషయం ఏంటంటే.. చెచెన్యా బహిరంగ వేడుకలు, సంబరాల్లో ఫాస్ట్ బీట్ మ్యూజిక్‌ని రద్దుచేశారు.ఇది కిందటి నెల నుంచే అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఆ దేశ సంప్రదాయ సంగీతం ఆధునిక పాశ్చాత్యా సంగీత బాణీలతో ప్రేరణ, స్ఫూర్తి చెందకుండా.. తమ కల్చర్‌కి తగ్గట్టే ఉండాలి. ప్రదర్శనల్లో పాటలకు, ఆ పాటల మీద డాన్స్‌లకు ప్రేక్షకులు వెర్రెత్తి ఊగినా.. ఈలలతో గోల చేసినా ఆ షోకి ఇక అంతే సంగతులు.అప్పటికప్పుడు దాన్ని రద్దు చేస్తారు. అందుకే బీట్స్ మరీ స్పీడ్‌గా కాకుండా అలాగని మరీ స్లోగా కాకుండా నిమిషానికి 80 నుంచి 116 మధ్యలో ఉండాలని చెచెన్యా సర్కారు వారి ఆనతి. తమ దేశం మీద వెస్టర్న్ ఇన్‌ఫ్లుయెన్స్‌ని రూపుమాపడానికే ఈ చర్య కాకపోతే.. సంగీతానికి హద్దులు, నిషేధాలు ఏంటని అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు కొంతమంది గ్లోబల్ మ్యూజిక్ లవర్స్.అయితే స్థానిక సంగీతకారులు మాత్రం.. ఈ రద్దును జూన్ నుంచి అమలు చేయాల్సిందిగా అధ్యక్షుల వారిని కోరుతున్నారట. రద్దుకు ముందే ఖరారై, అన్నిరకాలుగా ప్రిపేర్ కూడా అయిన మే నెలలోని తమ ప్రోగ్రామ్స్‌కి కొత్త ఉత్తర్వుల ప్రకారం తిరిగి మ్యూజిక్ నోట్స్ రాసుకోవడం.. రిహార్సల్స్.. రికార్డింగ్స్ ఎట్సెట్రాకు టైమ్ కావాలి కాబట్టి.. వాళ్లంతా ఆ రద్దును జూన్ వరకు వాయిదా వేయమని కోరుతున్నారు. సర్కారు మాత్రం సమస్యేలేదంటోందట.ఇవి చదవండి: ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..! -
TN: పీచు మిఠాయి విక్రయాలు.. తమిళనాడు సంచలన నిర్ణయం
చెన్నై: చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ ఎంతగానో ఇష్టపడే కాటన్ క్యాండీ(పీచు మిఠాయిల)పై తమిళనాడు ప్రభుత్వం నిషేదం విధించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ వెల్లడించారు. వీటిల్లో క్యాన్సర్ కారక రసాయనాలున్నందునే నిషేదం విధించినట్లు తెలిపారు. రాజధాని నగరం చెన్నై వ్యాప్తంగా ఇటీవల ఫుడ్‌సేఫ్టీ అధికారులు పీచు మిఠాయిల నమూనాలను సేకరించారు. వీటిని పరిశీలించగా కాటన్ క్యాండీల్లో రోడమైన్-బి అనే రసాయనం ఉన్నట్లు గుర్తించారు. కృత్రిమ రంగుల కోసం దీన్ని పీచు మిఠాయిల్లో వినియోగించినట్లు తేలింది. రోడమైన్-బిని ఇండస్ట్రియల్ డైగా పిలుస్తారు. దుస్తుల కలరింగ్, పేపర్ ప్రింటింగ్‌లో ఎక్కువగా వినియోగిస్తారు. ఆహారంలో రంగు కోసం దీన్ని వాడరు. దీనివల్ల దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని అధికారులు తెలిపారు. ఇది ఎక్కువ మొత్తంలో శరీరంలోకి వెళ్తే కిడ్నీ, లివర్ పనితీరుపై ప్రభావం చూపిస్తుందని, క్యాన్సర్‌కు కూడా దారితీసే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదీ చదవండి.. జీఎస్ఎల్వీ ఎఫ్-14 రాకెట్ ప్రయోగం సక్సెస్ -
హుక్కా కేంద్రాల నిషేధం.. బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం కొనసాగుతున్నాయి. దివంగత మాజీ ఎమ్మెల్యేలు మశ్చేందర్రావు, పి నర్సారెడ్డి, బిరుదు రాజమల్లుకు సభ సంతాపం తెలిపింది. అనంతరం హుక్కా సెంటర్లపై నిషేధానికి సంబంధించి సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ అమెండ్మెంట్ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరపున మంత్రి శ్రీధర్ బాబు సభలో ప్రవేశపెట్టారు. దీనిపై ఎలాంటి చర్చలేకుండానే బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ మేరకు స్పీకర్ ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. ఈ బిల్లు రాకతో ఇక నుంచి తెలంగాణలో హుక్కా సెంటర్లు మూతపడనున్నాయి. హుక్కా నిషేధం అమల్లోకి రానుంది.బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి యువతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సిగరెట్ పొగ కంటే హుక్కా మరింత హానికరమని చెప్పారు. యువతకు హుక్కా వ్యసనమయ్యే అవకాశం ఉందన్నారు. బొగ్గు ఉపయోగించడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతుందని దీన్ని సేవించే వారి వల్ల చుట్టుపక్కల వారికి కూడా ప్రమాదమని తెలిపారు. హుక్కా పార్లర్లపై నిషేధం అవసరమని సీఎం భావించారని పేర్కొన్నారు. చదవండి: TS: అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ అప్డేట్స్ -
హుక్కాపై నిషేధం!
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా ఆరోగ్యాన్ని రక్షించే లక్ష్యంతో హుక్కా ధూమపానంపై నిషేధం విధించింది. రాష్ట్ర ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు గురువారం ఈ మేరకు ప్రకటన జారీ చేశారు. "ప్రజా ఆరోగ్యం, యువతను రక్షించే ఉద్దేశంతో హుక్కాపై రాష్ట్రవ్యాప్త నిషేధం విధించాం. హుక్కా ధూమపానంతో తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలు ఉన్నాయి. అందుకే సిగరెట్లు,ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం (COTPA)ను సవరించాం. హుక్కా ధూమపానాన్ని నిషేధించాలని నిర్ణయించాం." అని ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు తెలిపారు. ప్రభుత్వం హుక్కా బార్లపై నిషేధాన్ని యోచిస్తోందని, పొగాకు వినియోగానికి చట్టపరమైన వయస్సును 18 నుండి 21 సంవత్సరాలకు పెంచుతున్నట్లు ఆరోగ్య మంత్రి దినేష్ సెప్టెంబరు 2023లోనే ప్రకటించారు. హుక్కాలో ఉపయోగించే పదార్థాలు వ్యసనానికి దారితీస్తాయని అన్నారు. గతేడాది ఇదే తరహాలో హర్యానా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, వాణిజ్య సంస్థల్లో వినియోగదారులకు హుక్కా సేవించడంపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇదీ చదవండి: కాశీ, అయోధ్య.. ఇక మథుర: యోగి -
'గోబీ మంచూరియా'ని ఆ నగరం పూర్తిగా బ్యాన్ చేసిందట!
గోబీ మంచూరియాని ఇష్టపడిని వాళ్లు ఉండరు. దాన్ని చూస్తేనే నోటిలో నీళ్లు ఊరిపోతాయి. అలాంటి గోబీ మంచూరియాని భారత్‌లోని ఆ నగరం పూర్తిగా నిషేధం విధించింది. అంతేకాదండోయ్ అక్కడ స్టాల్స్‌లో దీన్ని ఎక్కడైన అమ్మితే అధికారులు వాటిపై దాడులు కూడా నిర్వహిస్తారట. ఎందుకని ఇంతలా గోబీ మంచూరియాపై యుద్ధం చేస్తున్నారో వింటే కచ్చితంగా మనం కూడా బుద్ది తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తామేమో!. ఏంటీ ఇలా అంటున్నారేంటీ అనుకోకండి. వింత రుచుల మాయలో అందులో ఏం వాడుతున్నారు? ఎలాంటివి తినేస్తున్నాం అనేవి మర్చిపోతున్నాం. జిహ్వ చాపల్యంతో కోరి కష్టాలు తెచ్చుకునే నేటి జనరేషన్‌కు ఇదొక కనువిప్పు అనే చెప్పాలి. ఎందుకిలా చెబుతున్నానంటే.. గోబీ మంచూరియా రుచే వేరబ్బా!. తింటే వదలరు అనేంత టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా శాకాహారులకు ఎంతో ఇష్టమైన వంటకం ఇది. అయితే దీన్ని కార్న్‌ప్లోర్ పిండిలో ముచి వేయించి ఆ తర్వాత సోయా సాస్, వెనిగర్, పంచదార, టొమోటా సాస్‌తో కాస్త గ్రేవీ లేదా డ్రైగా చేసి ఇస్తారు. ఇలా స్పెషల్‌గా చేసే వంటకం కావడంతోనే నిషేధం విధించింది భారత్‌లోని గోవా నగరం. అందులో వినియోగించే పదార్థాల వల్ల ఆరోగ్య సమస్యలు తప్పవు. అయితే దాని రుచికి ఫిదా అయ్యి ప్రజలు అవేమీ పట్టించుకోకుండా లొట్టలేసుకుంటూ లాగించేస్తున్నారు. దీంతో గోవా మపుసా మున్సిపల్ కౌన్సిల్ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రెసిపీ విక్రయాలను పూర్తిగా నిషేధించింది. ఎక్కడైన ఫుడ్ స్టాల్స్‌లో ఈ డిష్ ఉంటే వెంటనే వాటిపై దాడులు నిర్వహించడం వంటివి చేసేలా అధికారులుకు ఆదేశాలను జారీ చేసింది కూడా. కేవలం మున్సిపల్ పౌర సంస్థే కాదు. గోవాలోని శ్రీ దామోదర్ ఆలయంలో వాస్కో సప్తాహ్ ఫెయిర్ సందర్భంగా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) గోబీ మంచూరియా అమ్మే స్టాళ్లను తీసేయాలని మోర్ముగావ్ మున్సిపల్ కౌన్సిల్‌కు ఆదేశాలు జారీ చేసింది. అంతేగాదు ఆ డిష్ అమ్మకాలు అరికట్టేలా ఎప్డీఏ స్టాల్స్‌పై పలు దాడులు కూడా నిర్వహించింది. దీంతో ఆ వంటకం గోవా వీధుల్లోని స్టాల్స్‌లో ఎక్కడ కనిపించదనే చెప్పొచ్చు. నిజానికి ఈ గోబీరియా మంచూరియా అత్యంత ప్రజాదరణ పొందిన వంటకం. ముంబైకి చెందిన చైనీస్ పాక శాస్త్ర నిపుణుడు నెల్సన్ వాంగ్ ఈ వంటకాన్ని కనిపెట్టాడు. 1970లలో క్రిక్ట్ క్లబ్ ఆప్ ఇండియాలో క్యాటరింగ్ చేస్తున్నప్పుడూ చికెన్ మంచూరియాను తయారు చేశాడు. అతను చికెన్ నగ్గెట్‌లను స్పైసీ కార్న్‌ఫ్లోర్ పిండిలో వేయించి పొడిగా లేదా సోయా సాస్, వెనిగర్, పంచదార లేదా టోమాట సాస్‌లో గ్రేవీ రూపంలో సర్వ్ చేసేవాడు. ఇక శాకాహార ప్రియులకు ఆ లోటును భర్తీ చేసేలా దాని స్థానంలో గోబీ మంచూరియాని తీసుకొచ్చాడు. అలాంటి గోబీ మంచూరియాని ప్రజల ఆరోగ్యం కోసం గోవా నగరం నిషేధించడం విశేషం. ఇలా ప్రతీ నగరంలోని అధికారులు భావిస్తే ప్రజలు అనారోగ్యం బారినపడటం తగ్గుముఖం పడుతుంది కదూ!. (చదవండి: బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ నో షుగర్ డైట్!అలా చేస్తే శరీరంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి?) -
ఆ రాష్ట్రంలోనూ హిజాబ్ చిచ్చు?
విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించడంపై రాజస్థాన్‌లోనూ వివాదం మొదలైంది. రాష్ట్రంలోని భజన్‌లాల్ సర్కారు కూడా హిజాబ్ నిషేధానికి సంబంధించి సన్నాహాలు మొదలుపెట్టిందనే వార్తలు వినిపిస్తున్నాయి. కేబినెట్ మంత్రి కిరోరి లాల్ మీనా ఇటీవల హిజాబ్, బురఖాపై నిషేధం విధించాలని వ్యాఖ్యానించారు. అనేక ముస్లిం దేశాలలోనే హిజాబ్‌ను నిషేధించినప్పుడు ఇక్కడ హిజాబ్ ఇంకా ఎందుకు కొనసాగాలని ప్రశ్నించారు. ఈ నేపధ్యంలోనే ఇతర రాష్ట్రాల్లో హిజాబ్ నిషేధానికి సంబంధించిన స్థితిగతులు, రాజస్థాన్‌లో దాని ప్రభావాలకు సంబంధించిన వివరాలపై ఒక నివేదికను రూపొందించి, దానిని రాష్ట్ర విద్యా మంత్రి మదన్ దిలావర్‌కు విద్యాశాఖాధికారులు పంపినట్లు సమాచారం. రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే బాల ముకుందాచార్య హిజాబ్‌కు సంబంధించిన ప్రశ్నను తొలుత లేవనెత్తారు. గణతంత్ర దినోత్సవం రోజున వివిధ పాఠశాలలను సందర్శించిన ఆయన పాఠశాలలో రెండు రకాల డ్రెస్ కోడ్లు ఉన్నాయా? అని ప్రశ్నించారు. పాఠశాలల్లో డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ఈ నేపధ్యంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పలువురు విద్యార్థినులు నిరసనకు దిగారు. ఇదిలావుండగా రాష్ట్రంలో హిజాబ్‌ను నిషేధించాలని ముఖ్యమంత్రిని కోరినట్లు కేబినెట్ మంత్రి కిరోరి లాల్ మీనా పేర్కొన్నారు. స్కూళ్లలో డ్రెస్ కోడ్ ఉంటుందని, హిజాబ్ ధరించి రావడాన్ని ఆయన తప్పుబట్టారు. ముస్లిం సమాజంలో మత ఛాందసవాదం ఉందని, కాంగ్రెస్ దానికి వత్తాసు పలుకుతున్నందున తాము హిజాబ్ నిషేధం దిశగా ముందుకు సాగలేకపోతున్నామని అన్నారు. -
భారత్‌లో 71 లక్షల వాట్సాప్ అకౌంట్స్ బ్యాన్ - కారణం ఇదే!
2023 నవంబర్ నెలలో ప్రముఖ మెసేజింగ్ యాప్ 'వాట్సాప్' భారతదేశంలో ఏకంగా 71 లక్షల అకౌంట్స్ నిషేధించింది. పెరుగుతున్న ఆన్లైన్ స్కామ్‌లను తగ్గించడంలో భాగంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 2021 కొత్త ఐటీ రూల్స్‌ని దృష్టిలో ఉంచుకుని యూజర్స్ నుంచి స్వీకరించిన వినతుల కారణంగా వాట్సాప్ 71 లక్షల అకౌంట్స్ మీద నిషేధం విధించింది. యూజర్ రిపోర్ట్లు రాకముందే కంపెనీ నవంబర్ 1 నుంచి 30 వరకు 19,54,000 ఖాతాలను ముందస్తుగా నిషేధించింది. దీనికి ప్రధాన కారణం సంస్థ నిబంధనలను అతిక్రమించడమే. గత నవంబర్‌లో యూజర్ల నుంచి వాట్సప్ 8841 వినతులను అందుకుంది. ఇందులో స్పామ్ ఖాతాలకు సంబంధించిన కంప్లైంట్స్ వంటివి ఉన్నాయి. 'అకౌంట్స్ యాక్షన్డ్' కింద వాట్సాప్ ఖాతాలను బ్యాన్ చేయడం లేదా పునరుద్ధరించడం వంటివి చేస్తుంది. దీనితో పాటు, మిలియన్ల మంది భారతీయ సోషల్ మీడియా వినియోగదారులు లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించడానికి కేంద్రం గ్రీవెన్స్ అప్పీలేట్ కమిటీ (GAC)ని ప్రవేశపెట్టింది. ఇదీ చదవండి: అమితాబ్ బచ్చన్ ఆస్తులు అద్దెకు - సంవత్సరానికి అన్ని కోట్లా.. వాట్సాప్ తప్పుడు సమాచార వ్యాప్తిని, వ్యక్తిగత డేటాకు భంగం కలగకుండా మెటా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే కంపెనీ రూల్స్ అతిక్రమించిన వారి అకౌంట్స్ నిషేధిస్తోంది, రానున్న రోజుల్లో మరింత పటిష్టమైన భద్రతను అందించడానికి ఏఐ వంటి ఆధునిక టెక్నాలజీతో పనిచేయడానికి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. -
తెహ్రీక్-ఎ-హురియత్‌పై కేంద్రం నిషేధం
జమ్మూ కశ్మీర్: జమ్ముకశ్మీర్‌లో ముస్లిం సంస్థ తెహ్రీక్-ఎ-హురియత్‌పై కేంద్రం నిషేధం విధించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం(ఊపా) కింద చట్టవిరుద్ధమైన సంస్థగా తెహ్రీక్-ఎ-హురియత్ని కేంద్రం ప్రకటించింది. కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ గతంలో ఈ సంస్థకు నేతృత్వం వహించారు. జమ్మూ కశ్మీర్‌ను భారత్ నుంచి విడదీసి ఇస్లామిక్ పాలనను నెలకొల్పేందుకు ఈ సంస్థ నిషేధిత కార్యకలాపాలకు పాల్పడుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జమ్మూ కశ్మీర్లో వేర్పాటువాదానికి ఆజ్యం పోసేందుకు భారత వ్యతిరేక విధానాన్ని ప్రచారం చేస్తూ ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తుందని గుర్తించినట్లు అమిత్ షా స్పష్టం చేశారు. "ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పీఎం నరేంద్ర మోదీ ప్రభుత్వం జీరో టాలరెన్స్ పాలసీని పాటిస్తోంది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఏ వ్యక్తి లేదా సంస్థనైనా అడ్డుకుంటాం " అని అమిత్ షా ఎక్స్‌లో పోస్టు చేశారు. దేశవ్యతిరేక, వేర్పాటువాద కార్యకలాపాలలో పాల్గొన్నందుకు జమ్మూ కశ్మీర్లో ముస్లిం లీగ్‌ను కేంద్రం ఇప్పటికే నిషేధించింది. కశ్మీర్లో ఇస్లామిక్ పాలనను స్థాపించడానికి ప్రజలను ప్రేరేపిస్తోందని ప్రభుత్వం గుర్తించింది. ఈ పరిణామాల తర్వాత తెహ్రీక్-ఎ-హురియత్ సంస్థపై నిషేధం పడింది. ఇదీ చదవండి: కొత్త ఏడాది తొలిరోజే ఇస్రో కీలక ప్రయోగం.. వాటిపైనే అధ్యయనం -
టయోటా హైలక్స్ యాడ్ బ్యాన్ చేసిన యూకే - కారణం ఇదే!
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందుతున్న జపనీస్ వాహన తయారీ దిగ్గజం 'టయోటా' (Toyota)కు యూకేలో గట్టి షాక్ తగిలింది. సామాజిక బాధ్యత ప్రమాణాలను ఉల్లంఘించినందుకు కంపెనీ ప్రకటనను నిషేధిస్తూ ఏఎస్ఏ ఆదేశాలు జారీ చేసింది. టయోటా హైలక్స్ యాడ్ నిలిపేయడం వెనుక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? గతంలో ఇలాంటి నిషేధాలు విధించారా? అనే మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.. యూకే అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ అథారిటీ (ASA) పర్యావరణ బాధ్యతారహిత డ్రైవింగ్‌ను ప్రోత్సహిస్తున్న రెండు టయోటా ప్రకటనలను నిషేధించింది. ఇందులో ఒకటి పోస్టర్, మరొకటి వీడియో. వీడియోలో టయోటా హైలెక్స్ పికప్ ట్రక్కులు కఠినమైన భూభాగాల్లో న్యావిగేట్ చేస్తున్నాయి. ఇందులో రివర్స్ క్రాసింగ్ కూడా ఉంది. ఆ తరువాత పట్టణ ప్రాంతం గుండా వెళ్లడం చూడవచ్చు. రోడ్డులో వాటికవి విడిపోవడం చూడవచ్చు. ఇవన్నీ వినియోగదారులను కొంత తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని చెబుతున్నారు. పోస్ట్ విషయానికి వస్తే.. ఇందులో తిరగటానికే పుట్టాను అన్నట్లు రాసి ఉంది. అంతే కాకుండా కొండల్లో దిగటం, ఎత్తైన ప్రదేశాల్లో దుమ్ములేపుకుంటూ ప్రయాణించడం వంటివి ఇందులో చూడవచ్చు. ఈ ప్రకటనలు పర్యావరణ హానికరమైన ప్రవర్తనను ఆమోదించాయని, అధిక కార్బన్ ఉత్పత్తులు ప్రొడ్యూస్ చేస్తున్నట్లు వెల్లడిస్తూ.. ఈ ప్రకటనలను నిషేదించింది. ఈ ప్రకటనలపై అడ్‌ఫ్రీ సిటీస్ కో-డైరెక్టర్ వెరోనికా విగ్నాల్ మాట్లాడుతూ.. వాహనాలు నదులు, అడవి గడ్డి మైదానాల గుండా వేగంగా డ్రైవింగ్ చేస్తే.. ప్రకృతి దెబ్బతింటుందని చెబుతూ, యూకేలో చాలా వాహనాలు పట్టాన ప్రాంతాలకు పరిమితమయ్యాయి. అలాంటిది ఇలాంటి ప్రకటలను ఎలా చిత్రీకరిస్తారని వాదించింది. ఇదీ చదవండి: లక్షల విలువ చేసే కారులో 'హోమ్ మేడ్ ఫుడ్' బిజినెస్.. వీడియో వైరల్ ఈ ప్రకటనను కంపెనీ సమర్థిస్తూ.. వ్యవసాయ, అటవీ ప్రాంత వాసులకు ఇలాంటి కార్లు చాలా ఉపయోగపడతాయని చెప్పినప్పటికీ, ప్రకటనలో అలాంటి కార్మికులు కనిపించలేదని సంబంధిత అధికారులు వెల్లడించారు. కానీ ఫుటేజీని యూకే వెలుపల ఉన్న ప్రైవేట్ భూమిలో చిత్రీకరించినట్లు, పోస్టర్ మాత్రం కంప్యూటర్ ద్వారా క్రియేట్ చేసినట్లు ప్రతినిధి స్పష్టం చేశారు. ఇందులో మళ్ళీ మార్పులు చేస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. -
వాట్సాప్ యూజర్లకు షాక్! 71.1 లక్షల అకౌంట్లపై నిషేధం
మెటా యాజమాన్యంలోని వాట్సాప్ (WhatsApp) గత సెప్టెంబర్ నెలలో భారత్‌కు చెందిన 71.1 లక్షల వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేసింది. ఈ ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ విడుదల చేసిన తాజా ఇండియా నెలవారీ నివేదిక ప్రకారం.. వాట్సాప్ సెప్టెంబర్‌లో ఐటీ నిబంధనలకు అనుగుణంగా 71.1 లక్షల ఖాతాలను నిషేధించింది. 2023 సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీల మధ్య 71,11,000 ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ పేర్కొంది. వీటిలో 25,71,000 అకౌంట్లను వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రాకముందే ముందస్తుగా బ్యాన్ చేసినట్లు వివరించింది. ఇదీ చదవండి: బిగ్ డీల్స్: రూ.15 వేల కంటే తక్కువకే బెస్ట్ 5జీ ఫోన్లు! వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వాటిపై వాట్సాప్ తీసుకున్న సంబంధిత చర్యలు, అలాగే ప్లాట్ఫామ్లో దుర్వినియోగాన్ని అరికట్టడానికి వాట్సాప్ చేపట్టిన సొంత నివారణ చర్యలు తదితర వివరాలు ‘యూజర్ సేఫ్టీ రిపోర్ట్’లో ఉన్నాయి. ఈ రిపోర్ట్ ప్రకారం.. సెప్టెంబర్ 1 నుంచి 30 మధ్య గ్రీవెన్స్ అప్పీలేట్ కమిటీ నుంచి వాట్సాప్‌కు ఆరు ఆర్డర్లు రాగా అన్నింటినీ పరిష్కరించింది. కాగా వాట్సాప్ గత ఆగస్టులో 74 లక్షల ఖాతాలను నిషేధించింది. వీటిలో 35 లక్షల ఖాతాలను ముందస్తుగా బ్యాన్ చేసింది. -
ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాల్సిందే
సాక్షి, హైదరాబాద్: పర్యావరణానికి ప్రమాదంగా మారిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని స్వచ్ఛందంగా నిషేధించాలని సీఎస్ శాంతి కుమారి పిలుపునిచ్చారు. సచివాలయంలో వీటి వాడకాన్ని నిషేధించి, ప్రత్యామ్నాయాలను వాడడం ద్వారా కార్యదర్శులు మొదలు ప్రతీ అధికారి, ఉద్యోగులు ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 17 లక్షల మంది స్వయం సహాయక బృందాల మహిళలతో వీటి నిషేధంపై పౌరులను చైతన్య పరుస్తున్నామని తెలిపారు. శనివారం సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం నిషేధంపై జరిగిన వర్క్ షాప్‌లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ రాజీవ్ శర్మ తోపాటు వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నా..సామాజిక భాద్యతతోనే సాధ్యం శాంతి కుమారి మాట్లాడుతూ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో స్టీల్, పింగాణీ వస్తువుల వాడకాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ నిషేధంపై ఇప్పటికే ప్రభుత్వం పలు ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల వల్ల ఇది సాధ్యం కాదని, స్వచ్ఛందంగా సామాజిక బాధ్యతతో పాటించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం వినియోగిస్తున్న ప్లాస్టిక్ లో కేవలం 9 శాతం మాత్రమే రీ–సైక్లింగ్ జరుగుతోందని, మిగిలిన ప్లాస్టిక్ వ్యర్థాలు నాలాలు, చెరువులు, నదీ జలాల్లో కలుస్తూ జీవనానికి పెను ముప్పుగా పరిణమిస్తున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించి భూమిని కాపాడుకొందాం’అనే నినాదంతో రూపొందించిన పోస్టర్‌ను ఈ సందర్భంగా శాంతి కుమారి, రాజీవ్ శర్మ ఆవిష్కరించారు. -
Manipur violence: మణిపూర్‌లో ఉద్రిక్తతలకు అవే కారణం
న్యూఢిల్లీ/ఇంఫాల్: మణిపూర్‌లో కొన్నేళ్లుగా నిద్రాణంగా ఉన్న ఉగ్రవాదుల ముఠాలు ప్రజల నిరసనల నేపథ్యంలో మళ్లీ చురుగ్గా మారాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇటీవల ఓ సైనికా« దికారిపై కాల్పులు జరిపి, తీవ్రంగా గాయపరిచిన ఘటనను వారు ఉదహరిస్తున్నారు. నిషేధిత యునై టెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్(యూ ఎన్ఎ ల్‌ఎఫ్), పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) ఉగ్రవాదులు దీని వెనుక ఉన్నారని వారు ఆరోపిస్తున్నారు. మణిపూ ర్లో నిరసనలకు దిగుతున్న పౌరులతో కలిసిపోయి ఉద్రిక్తతలు పెంచుతున్నారని చెబుతున్నారు. గత వారం టెంగ్నౌపల్ జిల్లా మొల్నోయి గ్రామంలో గిరిజనులపై దాడికి యత్నించిన కొందరు ఆందోళన కారులను అస్సాం రైఫిల్స్, ఆర్మీ బలగాలు అడ్డుకోగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో లెఫ్టినెంట్ కల్నల్ రమణ్ త్యాగి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన గువాహటిలో చికిత్స పొందుతున్నారు. ఆందోళనకారుల్లో కొందరు నిషేధిత గ్రూపులకు చెందిన ఉగ్రవాదులు కూడా ఉన్నట్లు అనంతరం చేపట్టిన దర్యాప్తులో వెల్లడైందని అధికారులు వివరించారు. యూఎన్ఎల్ఎఫ్, పీఎల్ఏతోపాటు కంగ్లీ యవోల్ కన్బా లుప్(కేవైకేఎల్), పీపుల్స్ రివల్యూషనరీ పార్టీ ఆఫ్ కంగ్లీపాక్ (పీఆర్ఈపీఏకే) లు కూడా రాష్ట్రంలో యాక్టివ్‌గా అయ్యాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. యూఎన్ఎల్ఎఫ్కు 330, పీఎల్ఏకు 300, కేవైకేఎల్ 25 మంది కేడర్ కలిగి ఉన్నాయన్నారు. కేవైకేఎల్ చీఫ్ టాంబా అలియాస్ ఉత్తమ్ సహా ఆ గ్రూప్‌లోని 12 మంది జూన్‌లో పట్టుబడ్డారన్నారు. ఈ గ్రూపులన్నిటికీ ఆర్మీపై దాడులు, బలవంతపు వసూళ్లు, డ్రగ్స్ రవాణా, స్మగ్లింగ్ వంటి ఘటనలకు పాల్పడిన చరిత్ర ఉందని వివరించారు. మణిపూర్‌లో అల్లర్లు మొదలైనప్పటినుంచి పోలీస్ స్టేషన్ల నుంచి ఎత్తుకెళ్లిన మెషిన్ గన్స్, రైఫిళ్లు వంటి 4,537 ఆయుధాలు, 6.32 లక్షల రౌండ్ల వరకు బుల్లెట్లు వీరి వద్దే ఉండొచ్చని భావిస్తున్నామన్నారు. రాష్ట్రంలో మే నుంచి తెగల మధ్య కొనసాగుతున్న హింసాత్మక ఘటనల్లో 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. -
రష్యాలో సోషల్ మీడియా సంస్థ రెడిట్‌కు భారీ షాక్!
ఉక్రెయిన్‌లో రష్యా సైనిక ప్రచారానికి సంబంధించిన "నకిలీ" సమాచారం ఉందనీ, సంబంధిత "నిషేధించిన కంటెంట్"ను తొలగించ నందుకు రష్యా భారీ జరిమానా విధించింది. రెడిట్‌కు బారీ పెనాల్టీ విధించిందని మాస్కో కోర్టును ఉటంకిస్తూ ఆర్టీఏ మంగళవారం నివేదించింది. కోర్టు రెడ్డిట్‌కి 2 మిలియన్ రూబిళ్లు (20,365 డాలర్లు ) జరిమానా విధించింది. అయితే దీనిపై రెడిట్ ఇంకా స్పందించలేదు. వికీమీడియా, స్ట్రీమింగ్ సర్వీస్ ట్విచ్ గూగుల్‌తో సహా మాస్కో చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను తీసివేయడంలో విఫలమైనందుకు రష్యాలో పరిశీలనలో ఉన్న సైట్ల జాబితాలో రెడిట్ చేరింది. గత సంవత్సరం ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుండి, రష్యా మీడియా , బ్లాగర్ల ద్వారా సంఘర్షణ కవరేజీపై నియంత్రణలను కఠినతరం చేసింది, దాని సాయుధ దళాల చర్యలను అవహేళన చేసినా, లేదా వాటి గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచురించినా కఠినమైన శిక్షలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. -
వారి ఇలాకాలో కాలు మోపితే.. ఎవరికైనా నెక్స్ట్ బర్త్‌డే ఉండదు!
ప్రపంచంలో రహస్యాలతో కూడిన ప్రాంతాలు అనేకం ఉన్నాయి. వీటికి కొన్ని రహస్యమైనవే కాదు.. ప్రమాదభరితమైనవి కూడా. అలాంటి ఒక ప్రాంతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అది ఒక ద్వీపం. అక్కడకు వెళ్లినవారెవరూ తిరిగి వచ్చిన దాఖలాలు లేవు. ఇది వినగానే అక్కడ భయంకర క్రూర జంతువులు ఉంటాయని అనుకుంటున్నారేమో.. కానీ అక్కడి మనుషులే ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికి అంతమొందిస్తుంటారు. ఈ ప్రాంతంలో ఉండే మనుషులు ఇతరులకు భిన్నంగా ఉంటారు. అది ఏమి ద్వీపమో ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంతో సంబంధం లేకుండా.. నార్త్ సెంటినెల్ ద్వీపం అండమాన్ దీవుల సమూహంలోని ఒక ద్వీపం. ఇది దక్షిణ అండమాన్ జిల్లా పరిధిలోకి వస్తుంది. అయితే ఇక్కడికి వెళ్లడానికి ఎవరికీ అనుమతి లేదు. ఈ ద్వీపాన్ని ఎవరూ కూడా సందర్శించకపోవడానికి ప్రధాన కారణం.. ప్రపంచంతో సంబంధం లేని తెగలు ఇక్కడ ఉంటున్నాయి. నార్త్ సెంటినెల్ ద్వీపం 23 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న ఒక చిన్న ద్వీపం. దీనిలో మనుషులు 60 వేల సంవత్సరాలుగా నివసిస్తున్నారు. అయితే వారు తీసుకునే ఆహారం, వారి జీవనం ప్రపంచానికి నేటికీ మిస్టరీగానే ఉన్నాయి. ఈ ద్వీపం అండమాన్, నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్‌కు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. సెంటినలీస్ తెగ వారు ఈ ద్వీపంలో నివసిస్తున్నారు. వారు ఇప్పటి వరకు వారు ఇతరుల నుంచి ఎటువంటి దాడిని ఎదుర్కోలేదు. ఈ మనుషుల తక్కువ ఎత్తు కలిగివుంటారు. కార్బన్ డేటింగ్ పరిశోధన ద్వారా ఈ తెగ రెండు వేల ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇక్కడి గిరిజనులను రక్షించేందుకు.. నార్త్ సెంటినెల్ ద్వీపాన్ని బయటి వ్యక్తులు సందర్శించేందుకు అనుమతి లేదు. ఇక్కడి గిరిజనులను రక్షించేందుకు భారత ప్రభుత్వం అండమాన్,నికోబార్ దీవుల నియంత్రణ, 1956 చట్టాన్ని జారీ చేసింది. అడ్మినిస్ట్రేషన్ మినహా ఇతరుల ప్రవేశాన్ని ఇక్కడ నిషేధించారు. నార్త్ సెంటినెల్ ద్వీపంలో నివసించే గిరిజనులు బయటి ప్రపంచం నుండి ఎవరైనా తమ ప్రాంతానికి రావడాన్ని ఇష్టపడరు. ఇతర ప్రాంతాలవారు వస్తే అక్కడి గిరిజనులు వారిని హింసించి, హత్య చేస్తారని చెబుతుంటారు. 2006లో ఈ ద్వీపంలో ఇద్దరు మత్స్యకారులు మృతి చెందారు. 2018 నవంబరులో అమెరికాకు చెందిన జాన్ అలెన్ చౌ అనే వ్యక్తి చట్టవిరుద్ధంగా ఈ ద్వీపానికి వెళ్లి, అక్కడి గిరిజనుల చేతిలో హత్యకు గురయ్యాడని చెబుతారు. ఇది కూడా చదవండి: భార్యకు సన్‌ఫ్లవర్ అంటే ఇష్టమని.. దిమ్మతిరిగే గిఫ్ట్ ఇచ్చిన భర్త! -
మా నిర్ణయంలో తప్పులేదు.. ఉక్రెయిన్‌కు సాయంపై బైడెన్
వాషింగ్టన్: రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఆయుధ నిల్వలుతరిగిపోయిన కారణంగా ఉక్రెయిన్ అమెరికాపై ఒత్తిడి తీసుకురావడంతో వారు ఉక్రెయిన్ దేశానికి క్లస్టర్ బాంబులను పంపించనున్నట్లు ప్రకటించింది. క్లస్టర్ బాంబులు తీవ్రస్థాయిలో ప్రాణనష్టం చేకూరుస్తాయని తెలిసి కూడా అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడాన్ని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ సమర్ధించుకున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై ఒకటిన్నర సంవత్సరం పూర్తి కావస్తోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఆస్తి నష్టం, భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరిగింది. ఇంకా జరుగుతూ ఉంది. సుదీర్ఘ కాలంగా యుద్ధం చేస్తోన్న నేపథ్యంలో ఉక్రెయిన్ వద్ద ఆయుధ నిల్వలు తగ్గిపోతూ ఉన్నాయి. అందుకే అగ్రరాజ్యాన్ని సాయం కోరుతూ ఉక్రెయిన్ అధ్యక్షులు వ్లాదిమిర్ జెలెన్స్కీ జో బైడెన్ పై ఒత్తిడి చేశారు. దీంతో చాలాకాలంగా వారి ఆయుధ కర్మాగారంలో నిల్వ ఉండిపోయిన క్లస్టర్ బాంబులను ఉక్రెయిన్‌కు పంపించాలన్న నిర్ణయానికి వచ్చింది అగ్ర రాజ్యం. ఈ నిర్ణయాన్ని పలు మానవ హక్కుల సంఘాలు, డెమొక్రాట్లు తప్పుబట్టిన కూడా జో బైడెన్ తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. క్లస్టర్ బాంబుల తీవ్రత గురించి తెలుసు.. అందుకే ఇన్నాళ్లు వాటిని ఉక్రెయిన్‌కు పంపలేదు. కానీ ఇప్పుడు వారి వద్ద ఆయుధ నిల్వలు బాగా తగ్గిపోయాయి. ఈ సమయంలో వారిని అలా వదిలేయలేము. నాటో మిత్రదేశాలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు జేక్ సుల్లివాన్ ఈ విషయంపై స్పందిస్తూ.. సాధారాణ ఆయుధాలతో పోలిస్తే ఈ క్లస్టర్ బాంబులు పెను విధ్వాంసాన్ని సృష్టిస్తాయి. వీటి కారణంగా భారీగా ప్రాణనష్టం జరిగినట్లు చరిత్ర చెబుతోంది. అందుకే వీటిని ఉక్రెయిన్‌కు పంపే విషయమై తీవ్ర జాప్యం చేశామని అన్నారు. ఆయుధాలు కొరవడిన సమయంలో మిత్రదేశాన్ని అలా వదిలేయకూడదని బాగా ఆలోచించే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపారు. క్లస్టర్ బాంబుల ప్రత్యేకత ఏంటి? ఒక క్లస్టర్ బాంబు అంటే అది అనేక బాంబుల సముదాయం. దాన్ని ఒక రాకెట్ ద్వారా గానీ ఫిరంగుల ద్వారా గానీ ఈ క్లస్టర్ బాంబును సంధిస్తే సుమారు 24-32 కిలోమీటర్ల దూరాన ఉన్న లక్ష్యాన్ని కూడా తునాతునకలు చేయవచ్చు. ఒక్కటే బాంబుగా రిలీజైన ఈ క్లస్టర్ గాల్లో చిన్న చిన్న బాంబులుగా విడిపోయి అక్కడక్కడా చెదురుముదురుగా పడి పేలతాయి. కాబట్టే వీటివలన భారీగా ప్రాణనష్టం కూడా వాటిల్లుతుంది. పైగా ఇవి నేల మీద పడిన వెంటనే విస్ఫోటం చెందవు. కొన్ని అప్పుడే పేలగా కొన్ని మాత్రం ఎప్పుడో పేలుతుంటాయి. అందుకే ఐక్యరాజ్యసమితి 2008లో ఈ క్లస్టర్ బాంబుల వాడకాన్ని నిషేధిస్తూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. బ్రిటన్, ఫ్రాన్స్ సహా 120 దేశాలు వీటి వినియోగాన్ని నిషేధిస్తూ సంతకాలు కూడా చేశాయి. 2003లో ఇరాక్ పై చేసిన యుద్ధంలో అమెరికా ఈ క్లస్టర్ బాంబులనే అధికంగా ప్రయోగించింది. అటు తర్వాత అమెరికా వాటిని మళ్ళీ ఎక్కడా ఉపయోగించలేదు. అందుకే వారి వద్ద లక్షల సంఖ్యలో క్లస్టర్ బాంబుల నిల్వ ఉండిపోయింది. ప్రస్తుతం ఉక్రెయిన్‌కు సాయం చేస్తూ నిల్వలను తగ్గించుకుంటోందని అమెరికా చెబుతుంటే.. అందులో రష్యాపై గెలవాలన్న వారి కాంక్షే కనిపిస్తోందని అత్యధికులు అభిప్రాయపడుతున్నారు. ఇది కూడా చదవండి: బ్రెజిల్లో పేకమేడలా కూలిన భవనం, 8 మంది మృతి -
భారత్‌లో 47 లక్షల వాట్సాప్ అకౌంట్స్ బ్యాన్
-
లుంగీలు, నైటీలపై తిరగొద్దు.. చూడలేకపోతున్నాం!
నోయిడా: నోయిడాలోని ఒక అపార్ట్ మెంట్ సముదాయంలో వింత నోటీసు ఒకటి జారీ చేసింది సొసైటీ కమిటీ. సాయంత్రం వేళ సొసైటీలో వాకింగ్ చేస్తున్న కొందరు మహిళలు నైటీలలో వస్తుంటే పురుషులు మాత్రం లుంగీలలో వచ్చి పార్కు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట. వారలా తిరగడం కొందరికి అసౌకర్యం కలిగించడంతో నేరుగా వెళ్లి సొసైటీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఇంకేముంది సొసైటీ పెద్దలు సీరియస్ గా రియాక్టయి ఇకపై కాలనీ బహిరంగ ప్రదేశాల్లో నైటీలను, లుంగీలను నిషేదిస్తూ సొసైటీ నివాసులందరికీ నోటీసులు పంపించారు. నోయిడాలోని హిమసాగర్ అపార్ట్ మెంట్స్ లోని సుమారు 200 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆ కాలనీ వాసులు రోజంతా భగభగ మండుతున్న ఎండ తాకిడికి ఉక్కిరిబిక్కిరై ఉండటంతో ఉపశమనం కోసం సాయంత్రం పూట చల్లగాలికి కాలనీ కామన్ ఏరియాల్లోనూ, కమ్యూనిటీ పార్కుల్లోనూ వాకింగ్ చేస్తుంటారు. వేసవికాలం కాబట్టి చాలామందికి ఇది దైనందిన జీవితంలో భాగమే. చూడలేకపోతున్నాం.. కానీ ఆ కాలనీలోని వాసులు మహళలైతే నైటీల్లోనూ పురుషులైతే లుంగీల్లోనూ వాకింగ్ చేస్తుండటమే అసలు తగువుకు తెరతీసింది. వారలా తిరుగుతుండటం చూసి కొందరికి అసౌకర్యంగా అనిపించి వెంటనే సొసైటీ పెద్దలను కలిసి.. బహిరంగ ప్రదేశాల్లో లుంగీ, నైటీల్లో వాకింగ్ చేస్తుంటే చూడలేకున్నాం తక్షణమే చర్యలు తీసుకోండని ఫిర్యాదు చేశారట. ఇంకేముంది అప్పటికప్పుడు సమావేశమై అపార్ట్ మెంట్ వాసుల వస్త్రధారణ విషయమై కూలంకషంగా చర్చించి హిమసాగర్ వాసులకు డ్రెస్ కోడ్ విధిస్తూ నోటీసు సిద్ధం చేసి జూన్ 10న కాలనీ వాసులందరికీ పంపించారు సొసైటీ పెద్దలు. ఇదే నోటీసు.. సోసైటీ పరిధిలో తిరిగేవారికి డ్రెస్ కోడ్.. మన కాలనీలోని పార్కుల్లోనూ, బహిరంగ ప్రదేశాల్లోనూ తిరిగేటప్పుడు మీ వస్త్రధారణ ఇతరులకు అభ్యంతరకరంగానూ అసౌకర్యంగానూ ఉండకుండా చూసుకోగలరు. ఇకపై ఎవ్వరూ ఈ పరిసర ప్రాంతాల్లో ఇళ్లల్లో వేసుకునే లుంగీలు, నైటీలు వంటి దుస్తులు వేసుకుని తిరగవద్దని అభ్యర్ధిస్తున్నామని రాశారు. తప్పేముంది - ముమ్మాటికీ తప్పే దీంతో కాలనీ వాసుల్లో కొందరు ఒక్కసారిగా ఖంగుతున్నారు. అసలే వేసవికాలం.. ఎండలు భగ్గుమంటున్నాయి.. రిలాక్స్ గా ఉంటుందని లుంగీలు, నైటీలు వేస్తుకుంటుంటాం. ఎవరికో అసౌకర్యంగా ఉందని వద్దంటే ఎలా అని వాపోతున్నారు. మరికొంత మంది మాత్రం ఇది చాలా మంచి నిర్ణయమని ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. హిమసాగర్ అపార్ట్ మెంట్ కమిటీ జారీ చేసిన ఈ నోటీసు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. ఇది కూడా చదవండి: మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కూడా గెలిచేది మేమే.. -
అలెర్ట్ : ఈ వెహికల్స్‌ను బ్యాన్ చేయండి.. కేంద్రం వద్దకు ప్రతిపాదనలు!
న్యూఢిల్లీ: పది లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాల్లో డీజిల్ ఆధారిత ఫోర్ వీలర్లను 2027 నాటికి నిషేధించాలని చమురు మంత్రిత్వ శాఖ సూచించింది. ఎలక్ట్రిక్, గ్యాస్ ఆధారిత వాహనాలను ప్రోత్సహించాలని చమురు మంత్రిత్వ శాఖ మాజీ సెక్రటరీ తరుణ్ కపూర్ నేతృత్వంలోని కమిటీ విన్నవించింది. ‘ఇంటర్నల్ కంబషన్ ఇంజన్‌తో తయారైన మోటార్‌సైకిళ్లు, స్కూటర్లు, త్రిచక్ర వాహనాల తయారీని 2035 నాటికి దశలవారీగా నిలిపివేయాలి. సుమారు 10 ఏళ్లలో పట్టణ ప్రాంతాల్లో డీజిల్ సిటీ బస్సులను నూతనంగా జోడించకూడదు. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ ఆధారిత ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను దశలవారీగా నిర్మూలించడానికి ఎలక్ట్రిక్ వెహికిల్స్ సరైన పరిష్కారంగా ప్రచారం చేయాలి. చదవండి👉 దేశంలోని ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్! మధ్యంతర కాలంలో మిశ్రమ నిష్పత్తిని పెంచుతూ ఇథనాల్‌తో కూడిన ఇంధనానికి విధాన మద్దతు ఇవ్వాలి. డీజిల్‌తో నడిచే ఫోర్ వీలర్లను వీలైనంత త్వరగా తొలగించవచ్చు. అందువల్ల 10 లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాలు, అధిక కాలుష్యం ఉన్న అన్ని పట్టణాలలో డీజిల్‌తో నడిచే నాలుగు చక్రాల వాహనాలపై నిషేధాన్ని ఐదేళ్లలో అమలు చేయాలి. ఫ్లెక్స్ ఫ్యూయల్, హైబ్రిడ్లతో కూడిన వాహనాలను ప్రోత్సహించేలా స్వల్ప, మధ్యస్థ కాలంలో ప్రచారం చేయాలి. పన్నుల వంటి ఆర్థిక సాధనాల ద్వారా ఇది చేయవచ్చు. ఈవీల వినియోగాన్ని పెంచేందుకు ఫేమ్‌ను కొనసాగించాలి. నగరాల్లో సరుకు డెలివరీ కోసం ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే కొత్తగా రిజిస్ట్రేషన్లకు అనుమతించాలి. కార్గో తరలింపు కోసం రైల్వేలు, గ్యాస్‌తో నడిచే ట్రక్కులను ఎక్కువగా ఉపయోగించాలి. ఈ సూచనలు అమలైతే 2070 నాటికి ఉద్గారాల విషయంలో భారత్ నెట్ జీరో స్థాయికి చేరుకుంటుంది’ అని నివేదిక పేర్కొంది. చదవండి👉 ఈ చెట్టు లేకపోతే ప్రపంచంలో కూల్‌డ్రింక్స్ తయారీ కంపెనీల పరిస్థితి ఏంటో? -
మణిపూర్‌లో హైటెన్షన్..144 సెక్షన్ విధింపు
మణిపూర్‌లోని చురాచంద్పూర్ జిల్లా తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ పర్యటనకు ముందు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. గురువారం రిజర్వ్ చేసిన రక్షిత అడవులు, చిత్తడి నేలలు, వంటి ప్రాంతాలపై బీజేపీ ప్రభుత్వం చేసిన సర్వేని ఆదివాసి గిజన నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి షెడ్యూల్ కార్యక్రమానికి చెందిన వేదికను ఓ గుంపు ధ్వంసం చేసి, నిప్పంటించారు. దీంతో అధికారులు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనులు తలెత్తకుండా 144 సెక్షన్‌ని విధించి నిషేధాజ్ఞాలు జారీ చేశారు. ఉద్రిక్తతలు మరింతగా చెలరేగేలా..ప్రజలు ఎవరితోనూ కమ్యూనికేట్ చేయకుండా ఉండేందుకు ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. ప్రజల ప్రాణలు, ఆస్తులకు తీవ్ర ప్రమాదం ఉందని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. తాము శాంతి భద్రతలకు భంగం కలగకుండా ఉండేలా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు చురాచంద్పూర్ జిల్లా అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఎస్ థియెన్‌లట్‌జోయ్ గాంగ్టే ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం చేసిన సర్వేను ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరమ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే జిల్లాలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జిల్లా బంద్‌కు గిరిజన నాయకుల ఫోరం పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, రైతులు, ఇతర గిరిజన నిర్వాసితులు రిజర్వు అటవీ ప్రాంతాలను తొలగించడం కోసం కొనసాగుతున్న డ్రైవ్‌ను నిరసిస్తూ ప్రభుత్వానికి పదేపదే మెమోరాండంలు సమర్పించారు. అయినప్పటికీ తమ కష్టాలను పరిష్కరించడంలో ప్రభుత్వం సుముఖత లేదా చిత్తశుద్ధి చూపలేదని గిరిజన నాయకుల ఫోరం పేర్కొంది. ఈమేరకు కుకీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ కూడా ఫోరమ్‌కు మద్దతుగా నిలిచింది. ఆదివాసులపై ప్రభుత్వం సవతి తల్లి మాదిరిగా ప్రవర్తిస్తుందిన కుకీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆరోపించింది. మత కేంద్రాలను కూల్చివేయడం, గిరిజన గ్రామాలను అక్రమంగా తొలగించడం వంటి వాటితో గిరిజన హక్కులను నిర్వీర్యం చేస్తుందని, దీన్ని తాము ఖండిస్తున్నట్లు ఆర్గనైజేషన్ పేర్కొంది. కాగా, మణిపూర్‌లోని మూడు చర్చిలను ప్రభుత్వం ఈ నెల ప్రారంభంలో కూల్చివేసి, వాటిని అక్రమ నిర్మాణాలుగా పేర్కొనడం గమనార్హం. (చదవండి: ఐఏఎస్ ఆఫీసర్ నిర్వాకం..స్మారక కట్టడాన్ని కూల్చి బంగ్లాగా..) -
కాంతారకు బిగ్ షాక్ ఇచ్చిన కేరళ హైకోర్ట్
-
టిక్.. టిక్.. టిక్.. షేరింగ్‌కు సమయం లేదు మిత్రమా!
మన దేశంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ అలరించిన మొబైల్ ఫోన్ అప్లికేషన్(యాప్) టిక్‌టాక్. యాప్‌లో స్వయంగా వీడియోలు రూపొందించి, సోషల్ మీడియాలో పోస్టుచేసి, లైక్‌లు కొట్టేయడం, కామెంట్లు చూసుకొని మురిసిపోవడం ఒక మధురానుభూతి, ఒక జ్ఞాపకం. చైనాకు చెందిన ఈ యాప్‌పై భారత ప్రభుత్వం నిషేధం విధించడంతో ఇప్పుడు ఎవరికీ అందుబాటులో లేకుండాపోయింది. ప్రపంచవ్యాప్తంగా టిక్‌టాక్‌ను నిషేధిస్తున్న దేశాల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. అమెరికాలో సగానికిపైగా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాల్లో యాప్ వాడకాన్ని నిషేధించారు. అమెరికా సైనిక దళాల్లో యాప్‌పై నిషేధం అమలవుతోంది. తాజాగా ఈ జాబితాలో కెనడా చేరింది. జనానికి నచ్చిన టిక్‌టాక్‌ను ప్రభుత్వాలే వారి నుంచి దూరం చేస్తుండడానికి కారణాలు ఏమిటో తెలుసుకుందాం.. ఎందుకీ నిషేధం? ► టిక్‌టాక్‌ను నిషేధించడానికి ప్రభుత్వాలు చెబుతున్న ప్రధాన కారణం దేశ భద్రత. ► యూజర్ల డేటాతో పాటు బ్రౌజింగ్ హిస్టరీ, లొకేషన్ వంటి వివరాలు నేరుగా చైనా ప్రభుత్వానికి చేరే ప్రమాదం ఉందని వివిధ దేశాలు అనుమానిస్తున్నాయి. ► ఇతర దేశాలపై, అక్కడి ప్రభుత్వాలపై దుష్ప్రచారం చేయడానికి టిక్‌టాక్ యాప్ చైనా చేతిలో ఒక ఆయుధంగా మారు తుందని భావిస్తున్నాయి. ► తప్పుడు ప్రచారం సాగించి, ఎన్నికల ఫలితాలను సైతం ప్రభావితం చేసే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ► టిక్‌టాక్ వల్ల యూజర్ల డేటాకు భద్రత లేదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వాలు ఇచ్చే ఫోన్లలోనూ టిక్‌టాక్ వాడుతున్నారని, దానివల్ల జాతీయ భద్రత ప్రమాదంలో పడుతుందని అంటున్నారు. ► విదేశాల సమాచారం చైనా చేతుల్లోకి వెళ్తే అక్కడి కంపెనీలు దాన్ని ఒక అవకాశంగా వాడుకొని లబ్ధి పొందుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఏయే దేశాలు నిషేధించాయి? ► 2021 జనవరిలో భారత్ టిక్‌టాక్‌ను పూర్తిస్థాయిలో నిషేధించింది. డేటా ప్రైవసీ, జాతీయ భద్రత కోసమంటూ చైనాకు చెందిన ఇతర యాప్‌లపైనా నిషేధం విధించింది. ► ఇండోనేషియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్లో తాత్కాలిక నిషేధం విధించారు. నిర్ధారణ కాని, అనైతిక సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నందుకే ఈ చర్య తీసుకున్నట్లు అక్కడి ప్రభుత్వాలు వెల్లడించాయి. ► అమెరికా, కెనడా, యూరోపియన్ యూనియన్(ఈయూ)లో ప్రభుత్వం ఇచ్చిన అన్ని ఫోన్ల నుంచి టిక్‌టాక్‌ను తొలగించాలంటూ ఉద్యోగులకు ఇటీవలే ఆదేశాలు అందాయి. ► అమెరికాలో 50కిపైగా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఎలక్ట్రానిక్ పరికరాల్లో టిక్‌టాక్‌ను బ్యాన్ చేశారు. కేవలం ప్రభుత్వ ఫోన్లలోనే కాదు, సాధారణ ప్రజలు సైతం టిక్‌టాక్ వాడకుండా పూర్తిగా నిషేధించాలని అమెరికాలో కొందరు పార్లమెంట్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ► అమెరికా సైనిక దళాల్లో టిక్‌టాక్ వాడకాన్ని ఇప్పటికే నిషేధించారు. ► తైవాన్‌లో ప్రభుత్వ ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్ కంప్యూటర్లలో టిక్‌టాక్ యాప్ ఉపయోగించడాన్ని 2022 డిసెంబర్లో నిషేధించారు. టిక్‌టాక్ వాదనేంటి? ► తమ యాప్ వల్ల డేటా భద్రత ఉండదన్న వాదనను టిక్‌టాక్ యాజమాన్యం ఖండించింది. ► యాప్ కారణంగా డేటా చౌర్యం జరుగుతోందని తేల్చడానికి ఎలాంటి ఆధారాల్లేవని స్పష్టం చేసింది. ► యూజర్ల వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లే అవకాశమే లేదని, యాప్‌ను నిశ్చింతగా వాడుకోవచ్చని భరోసా ఇచ్చింది. ► కొన్ని దేశాలు టిక్‌టాక్‌ను నిషేధించడం విచారకరమని పేర్కొంది. డేటా ప్రైవసీకి తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించింది. ► యాప్‌ను నిషేధించడం యాజర్లను తప్పుదోవ పట్టించడమే అవుతుందని యాజమాన్యం ఆక్షేపించింది. ► నిషేధం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ఆరోపించింది. ► కొన్ని పాశ్చాత్య దేశాలు అభద్రతాభావంతో టిక్‌టాక్‌ను తొలగిస్తున్నాయని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని చైనా ప్రభుత్వం విమర్శిస్తోంది. యాప్‌పై నిషేధం విధించడం ఆయా దేశాల్లో వ్యాపార వాతావరణాన్ని దెబ్బతీయడం ఖాయమని తేల్చిచెప్పింది. అసలు ఏమిటీ యాప్? చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్ అనే కంపెనీ ‘డౌయిన్’ పేరిట 2016 సెప్టెంబర్‌లో యాప్‌ను ప్రారంభించింది. తొలుత చైనాలోనే అందుబాటులోకి వచ్చిన ఈ యాప్ యూజర్లను విశేషంగా ఆకట్టుకుంది. రికార్డుస్థాయిలో డౌన్లోడ్లు జరిగాయి. దాంతో బైట్‌డ్యాన్స్ కంపెనీ 2017లో అంతర్జాతీయ వెర్షన్‌ను ప్రారంభించింది. దీనికి టిక్‌టాక్ అనే పేరుపెట్టింది. 2018 ఆగస్టు నుంచి యాప్ ప్రపంచమంతటా బాగా వ్యాప్తిలోకి వచ్చింది. చైనాలో ఇది డౌయిన్ పేరిటే కొనసాగుతోంది. తక్కువ నిడివితో కూడిన వీడియోల షేరింగ్ కోసం టిక్‌టాక్ యాప్‌ను రూపొందించారు. ప్రాథమికంగా లిప్ సింకింగ్, డ్యాన్సింగ్ వీడియోలను ఇతరులతో పంచుకొనే వీలుంది. 3 సెకండ్ల నుంచి 10 నిమిషాల నిడివిల వీడియోలు ఉంటాయి. యూజర్ల అభిరుచులు, ఆసక్తిని బట్టి వీడియోలు ప్రత్యక్షం కావడం ఇందులోని మరో ప్రత్యేకత. ప్రపంచవ్యాప్తంగా 40కిపైగా భాషల్లో టిక్‌టాక్ యాప్ అందుబాటులో ఉంది. -
ఫిక్సింగ్ బారిన క్రికెటర్.. రెండేళ్ల నిషేధం
పాకిస్తాన్ క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కొత్తేం కాదు. ఫిక్సింగ్ కలంకం ఏదో ఒక రూపంలో ఆ జట్టును చుట్టుముడుతునే వచ్చింది.గతంలో మహ్మద్ ఆసిఫ్, మహ్మద్ ఆమిర్, సల్మాన్ భట్ ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధానికి గురయ్యారు. తాజాగా మరోసారి ఫిక్సింగ్ కలకలం రేపింది. లెప్టార్మ్ స్పిన్నర్, ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ ఆసిఫ్ అఫ్రిది మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడినట్లు రుజువు కావడంతో పీసీఈబీ రెండేళ్ల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని పీసీబీ పేర్కొంది. 2022 ఏడాది సెప్టెంబర్‌లో ఆసిఫ్ అఫ్రిది కాశ్మీర్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొన్నాడు.అక్కడ రావల్కోట్ హాక్స్ జట్టు తరపున ఆడుతున్నప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. తమ విచారణలో ఫిక్సింగ్ ఆరోపణలు నిజమని తేలడంతో అతనిపై నిషేధం విధించింది.'' ఆర్టికల్ 2.4.10ని ఉల్లంఘించిన కారణంగా ఆసిఫ్ ఆఫ్రిదిపై రెండేళ్ల అనర్హత, దీంతో పాటు ఆర్టికల్ 2.4.4ను ఉల్లంఘించినందుకు ఆరు నెలల నిషేధం విధించాం. ఈ రెండు ఏకకాలంలో అమలు చేయబడుతాయి. 2024 సెప్టెంబర్ 12 వరకు ఈ నిషేధం అమల్లో ఉండనుంది.'' అని పీబీసీ పేర్కొంది. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా పేరు పొందిన ఆసిఫ్ అఫ్రిది 35 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 118 వికెట్లు తీశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో 59 వికెట్లు తీశాడు. ఇక ఫస్ట్‌క్లాస్ టి20ల్లో 63 వికెట్లు తీశాడు. పీఎస్ఎల్లో ముల్తాన్ సుల్తాన్స్ తరపున ఆడిన ఆసిఫ్ అఫ్రిది దేశవాళీ క్రికెట్లో ఖైబర్ పఖ్తున్ఖ్వా తరపున ప్రాతినిధ్యం వహించాడు. చదవండి: ఆసీస్‌తో సవాల్‌కు సిద్దం; బ్యాటింగ్‌లో ఏ స్థానమైనా ఓకే -
ఎయిర్ షో సందర్భంగా నాన్‌వెజ్ అమ్మకాలు బంద్!
ఏరో ఇండియా షో సందర్భంగా బెంగళూరులో నాన్‌వెజ్ అమ్మకాలను నిషేధించారు. ఈ మేరకు జనవరి 30 నుంచి ఫిబ్రవరి 20 వరకు మాంసం దుకాణాలు, మాంసాహార హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేయాలని బెంగళూరు పౌర సంస్థ ఆదేశించింది. అంతేగాదు యలహాంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు సుమారు 10 కిలోమీటర్లు పరిధిలో మాంసాహార వంటకాలు అందించడం, అమ్మడంపై నిషేధం ఉంటుందని బృహత్ మహానగర పాలికే(బీబీఎంపీ) తన పబ్లిక్ నోటీసులో పేర్కొంది. ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు ఏరో ఇండియా షో నిర్వహించనున్నారు. దీన్ని ఉల్లంఘిస్తే బీబీఎంపీ చట్టం 2020 తోపాటు ఇండియన్ ఎయిర్ క్రాప్ట్ రూల్ ప్రకరాం శిక్షార్హులని పేర్కొంది. బహిరంగ ప్రదేశాల్లో నాన్‌వెజ్ ఫుడ్ చాలా స్కావెంజర్ పక్షులను ఆకర్షిస్తోందని, మరీ ముఖ్యంగా గాలి పటాలు ఎయిర్ ప్రమాదాలకు కారణమని తెలిపింది. ఈ ఎయిర్ షో కోసం దాదాపు 731 మంది ఎగ్జిబిటర్లు, 633 మంది భారతీయులు, 98 మంది విదేశీయులు నమోదు చేసుకున్నట్లు ఏరో ఇండియా తన వెబ్సైట్లో పేర్కొంది. ఏరో ఇండియా 1996 నుంచి బెంగళూరులో ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఏరోస్పేస్ ఎగ్జిబిషన్లను విజయవంతంగా 13 సార్లు నిర్వహించి తనకంటూ ఒక ప్రత్యేక సముచిత స్థానాన్నిసంపాదించుకుంది. (చదవండి: ప్యాసింజర్లను ఎక్కించుకోని టేకాఫ్ ఘటన: ఎయిర్‌లైన్‌కు భారీ పెనాల్టీ) -
రష్యా, బెలారస్ జాతీయ జెండాలపై నిషేధం
ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో భాగంగా రష్యా, బెలారస్ దేశాల జాతీయ జెండాలపై నిషేధం విధించారు. టోర్నమెంట్‌లోని ఓ టెన్నిస్ కోర్టులో జరిగిన ఘటన ఆధారంగా నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మెల్బోర్న్ పార్క్‌లోకి జాతీయ జెండాలను తీసుకువచ్చేందుకు తొలుత ప్రేక్షకులకు అనుమతి ఇచ్చారు. అయితే ఉక్రెయిన్ ప్లేయర్ కేతరినీ బెయిడా, రష్యా ప్లేయర్ కమిల్లా రఖిమోవా మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో కొందరు ప్రేక్షకులు రష్యా జెండాలను ప్రదర్శించారు. దీంతో నిర్వాహకులు తక్షణమే ఆ రెండు దేశాల జెండాలపై బ్యాన్ విధించారు. అంతేకాదు తమ ప్లేయర్‌ను రష్యన్లు వేధించినట్లు ఉక్రెయిన్ అభిమానులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని టెన్నిస్ ఆస్ట్రేలియాను కోరారు. దీంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు ఈ రెండు దేశాల జాతీయ జెండాల ప్రదర్శించకుండా నిషేధం విధించింది. చదవండి: షార్ట్ టెంపర్‌కు మారుపేరు.. అభిమానిపై తిట్ల దండకం సంచలనం.. మాజీ వరల్డ్ నెంబర్ వన్‌కు బిగ్‌షాక్ -
రోడ్లపై నో " షో "
-
తాలిబన్ల మరో సంచలన నిర్ణయం.. యూనివర్సిటీ విద్యపై నిషేధం
కాబూల్: అఫ్గనిస్తాన్‌లోని తాలిబన్ల ప్రభుత్వంలో మహిళా లోకంపై అణచివేత నానాటికీ పెరుగుతోంది. అధికారాన్ని చేజిక్కుంచుకునే ముందు మహిళ హక్కుల కోసం పోరాడుతామని, ప్రజలకు స్వేచ్ఛాయుతమైన ప్రజాస్వామయ్య పాలన అందిస్తామని హామీ ఇచ్చిన తాలిబన్లు.. తరువాత తమ అనాలోచిత నిర్ణయాలు, అరాచక పాలనతో దేశంలోని పౌరుల నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. బాలికల స్వేచ్చను హరిస్తూ.. వారిని ఇప్పటికే ఉన్నత విద్యకు దూరం చేశారు. అనేక ఉద్యోగాల్లో మహిళలపై ఆంక్షలు విధించారు. దేశ మహిళలు బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ ధిరంచాల్సిందేనని ఆదేశించారు. ఈ క్రమంలో తాజాగా తాలిబన్లు మరో సంచలన నిబంధన తీసుకొచ్చారు. దేశ వ్యాప్తంగా మహిళలకు యూనివర్సిటీ(విశ్వవిద్యాలయ) విద్యను నిషేధిస్తూ తాలిబన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాలిబాన్ ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది. మహిళా విద్యార్థులు విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడాన్ని నిషేధిస్తున్నట్లు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీలకు ఉన్నత విద్యాశాఖ మంత్రి నేడా మహ్మద్ నదీమ్ ఉత్వర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని తెలుపుతూ మేరకు ట్వీట్ చేశారు. న్యూయర్క్‌లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశమై.. తాలిబన్లు నిర్భంధించిన ఇద్దరు అమెరికన్లు విడుదల చేస్తున్నట్లు యూఎస్ విదేశాంగశాఖ వెల్లడించిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది. అయితే తాలిబన్ల నిర్ణయంపై అమెరికాతోపాటు ప్రపంచ దేశాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తునఆనయి. మహిళలను ఆంక్షలకు గురిచేస్తున్న తాలిబన్లను.. ఆప్గనిస్థాన్‌లోని అందరి హక్కులను గౌరవించే వరకు అంతర్జాతీయ సమాజంలో చట్టబద్ధమైన సభ్యులుగా ఉండేందుకు ఆశించలేమని విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ ఒక ప్రకటనలో తెలిపారు. చదవండి: కాలిఫోర్నియాలో భారీ భూకంపం.. ఇద్దరు మృతి.. చీకట్లో వేల మంది.. -
నటి రష్మికను బ్యాన్ చేసే యోచనలో శాండిల్ వుడ్
-
ఆ ఊళ్లో ఎన్నికల ప్రచారమే ఉండదు! కానీ..
గుజరాత్లో మొత్తం 186 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 1 నుంచి 5 వరకు రెండు దశల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇక ఒక వారం మాత్రమే సమయం ఉన్నందున గుజరాత్లో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పార్టీల ప్రచార ర్యాలీల హోరుతో రసవత్తరమైన ఎన్నికల టెన్షన్‌తో ఉత్కంఠంగా ఉంది. కానీ, ఆ ఊరిలో మాత్రం ఎలాంటి కోలాహలం లేకుండా సాధారణ వాతావరణం కనిపిస్తుంటుంది. గుజరాత్లో రాజ్‌కోట్ జిల్లాలోని రాజ్ సమాధియాల అనే ఒక గ్రామం మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ గ్రామంలో ఎన్నికలు జరుగుతాయి కానీ అక్కడి రాజకీయ పార్టీల ప్రచార ప్రవేశం మాత్రం పూర్తిగా నిషేధం. అసలు అక్కడ ఏ రాజకీయ పార్టీ ప్రచారం జరగదు. అయినప్పటికీ అక్కడి గ్రామస్తులంతా ఓటేస్తారు. అదీ కూడా ఒక్కరు కూడా మిస్స్ కాకుండా ఫుల్‌గా ఓట్లు పడతాయి. ఆ గ్రామంలో ఎన్నికల సమయంలో అందరూ అత్యధికంగా ఓటు హక్కును వినియోగించుకునేలా చూస్తుంది అక్కడ గ్రామాభివృద్ధి కమిటీ. పైగా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఓటు వేసేందుకు రాకపోతే వారిపై రూ. 51/- జరిమాన కూడా విధిస్తుంది గ్రామాభివృద్ధి కమిటీ. అక్కడ గ్రామ సర్పంచ్‌ని కూడా అందరీ ఏకాభిప్రాయంతోనే ఎన్నుకుంటారు. అంతేగాదు పోలీంగ్‌కు కొన్ని రోజుల ముందు కమిటీ సభ్యులు, గ్రామస్తులు సమావేశం ఏర్పాటు చేస్తారు. అక్కడ ఎవరైనా ఓటు వేయకపోతే కారణాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. ఆ గ్రామంలో ఏ రాజకీయ పార్టీలు ప్రచారం చేయకూడదనే నియమం 1983 నుంచి ఉంది. పైగా ఇక్కడ ఏ పార్టీ కూడా ప్రచారం చేసేందుకు రాదని, ఒకవేళ ప్రచారం చేస్తే తమ భవిష్యత్తుకు నష్టం వాటిల్లుతుందని ఆయా రాజకీయ పార్టీలకు కూడా తెలుసుని గ్రామస్తులు చెబుతున్నారు. ఐతే తమ గ్రామంలో వైఫై ఇంటర్నెట్ కనెక్షన్, సీసీటీవీ కెమెరాలు, తాగునీరు అందించే ఆర్ఓ ప్లాంట్ తదితర అన్ని ఆధునిక సౌకర్యాలు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. తమ గ్రామంలో అభ్యుర్థులను ప్రచారం చేయడానికి అనుమతించరు కాబట్టి గ్రామ ప్రజలంతా తమకు మంచిదని భావించే నాయకుడికే ఏకగ్రీవంగా ఓటు వేస్తారుని ఆ గ్రామ సర్పంచ్ తెలిపారు. ఏ కారణం చేతనైనా ఓటు వేయలేని పక్షంలో ముందుగా తమ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని కూడా చెబుతున్నారు. (చదవండి: ప్రధాని తప్పు చేస్తే.. చర్యలు తీసుకునే సత్తా ఉన్న సీఈసీ కావాలి: సుప్రీం కోర్టు) -
అందం చూపించొద్దన్నారు.. మందు కూడా పాయే; ఏమిటీ కర్మ?
మాములుగా ఫుట్‌బాల్ మ్యాచ్‌ల్లో లిక్కర్(మద్యం) ఏరులై పారుతుంది. మ్యాచ్‌కు వచ్చే అభిమానులు బీర్లు తాగుతూ ఫుల్‌గా ఎంజాయ్ చేయడం చూస్తుంటాం. అవి శ్రుతిమించిన సందర్భాలు కూడా కోకొల్లలు. కానీ అలా చేస్తేనే ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఫుల్ కిక్కుగా ఉంటాయి. ఖతార్ వేదికగా జరగనున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో మాత్రం శుక్రవారం మద్యం ప్రియులకు చేదువార్త చెప్పారు అక్కడి నిర్వాహకులు. మ్యాచ్‌లు జరగనున్న స్టేడియాల్లో బీర్లు అమ్మడం నిషేధమని ఖతార్ దేశ ప్రభుత్వం పేర్కొంది. కావాలంటే స్టేడియాలకు దూరంగా బయట బీర్లను అమ్ముకోవచ్చు అని తమ ప్రకటనలో తెలిపింది. ఇది కఠినంగా అమలు చేయాలని స్టేడియం సిబ్బందిని ఆదేశించింది. కానీ ఫుల్బాల్ వరల్డ్‌కప్ ఆతిథ్య హక్కులు పొందే సమయంలో ఫిఫా వాణిజ్య ఒప్పందాలను గౌరవిస్తామని ఖతార్ అంగీకరించింది. ఆతిథ్య హక్కులు పొందే సమయంలో అన్ని వాణిజ్య ఒప్పందాలను అంగీకరిస్తామని చెప్పి.. ఇప్పుడిలా చేయడం ఏంటని ఫిఫా నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖతార్ ఒక ఇస్లామిక్ దేశం. అసలు బహిరంగంగా మద్యం తాగడం అక్కడ పూర్తిగా నిషేధం. అయితే ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్‌కప్ కావడంతో ఖతార్ కూడా కొన్ని నిబంధనలను సవరించింది. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడంపై నిషేధం అలాగే ఉన్నా.. మ్యాచ్‌లకు వచ్చే అభిమానులు స్టేడియాల్లో బీర్లను తాగేందుకు అనుమతించింది. కానీ స్టేడియంలో బీర్ల అమ్మకాలు జరపొద్దని మాత్రం స్పష్టంగా చెప్పింది. ఒకసారి ఆతిథ్య హక్కుల పొందాకా ఫిఫా కూడా ఈ విషయంలో ఏం చేయలేదు. ఖతార్ దేశ నియమాలను ఎవరైనా ఆచరించాల్సిందే అన్న విషయం మరోసారి అవగతమైంది. ఇక బీర్లు తయారు చేసే సంస్థ అయిన బడ్వైజర్తో(Budwizer Brand) ఫిఫాకు ఎన్నో ఏళ్లుగా ఒప్పందం ఉంది. ఇందులో భాగంగా వరల్డ్‌కప్ సమయంలో స్టేడియాల దగ్గర బడ్వైజర్ బీర్లు అమ్ముతుంటారు.స్టేడియాల్లోనే ఫ్యాన్స్ బీర్లు తాగుతూ మ్యాచ్‌లు చూస్తుంటారు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం.. అన్ని స్టేడియాల నుంచి బీర్లను నిషేధించే అవకాశం ఉంది. ప్రస్తుతం మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చే 8 స్టేడియాల దగ్గర బడ్వైజర్ స్టాండ్స్ ఉన్నాయి. అయితే వీటిని స్టేడియాలకు దూరంగా తరలించాలని ఖతార్ నిర్వాహకులు పేర్కొన్నారు. ఇక 2009లోనే ఖతార్ ఈ వరల్డ్‌కప్ ఆతిథ్య హక్కులను పొందింది. ఆల్కహాల్ పాలసీ ప్రకారం.. కార్పొరేట్ క్లైంట్లకు మాత్రమే స్టేడియాల్లోని రెస్టారెంట్లు, లాంజ్లలోనే షాంపేన్, వైన్స్, స్పిరిట్స్ ఇస్తారు. ఇక హైఎండ్ హోటల్స్, క్రూయిజ్ షిప్స్‌లలో ఉండే ఫ్యాన్స్ కూడా వివిధ రకాలైన ఆల్కహాల్ డ్రింక్స్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. ఖతార్‌లో బహిరంగంగా మద్యం తాగితే జైలు శిక్షతో పాటు భారీ జరిమానాలు విధిస్తారు. అయితే వరల్డ్ కప్ జరిగే సమయాల్లో మాత్రం ఇలాంటివి చూసీ చూడనట్లు ఉంటామని ఖతార్ సెక్యూరిటీ ఆపరేషన్స్ హెడ్ ఇప్పటికే ప్రకటించారు. తాగి గొడవలకు దిగితే మాత్రం అరెస్టులు తప్పవని హెచ్చరించారు. ఇక మ్యాచ్‌కు వచ్చే మహిళలు, యువతులు ఎట్టి పరిస్థితుల్లోనూ కురచ దుస్తులు వేసుకోవద్దని.. బాడీ పార్ట్స్ కనిపించేలా దుస్తులు ధరిస్తే జైలుకు పంపిస్తామని గురువారం ప్రకటించారు. తాజాగా బీర్ల అమ్మకాలపై కూడా నిషేధం విధించడం అభిమానులకు మింగుడు పడని విషయం. ''అందం చూడొద్దన్నారు.. ఇప్పుడు మందును కూడా దూరం చేశారు.. ఏంటి మాకు ఈ పరిస్థితి'' అంటూ అభిమానులు గోల చేస్తున్నారు. చదవండి: ఫిఫా చరిత్రలోనే తొలిసారి.. ఫైటర్ జెట్స్ సాయంతో ఖతార్‌కు అన్న అడుగు పడింది.. ఇప్పుడు తమ్ముడి వంతు FIFA: అందాల విందు కష్టమే.. అసభ్యకర దుస్తులు ధరిస్తే జైలుకే -
ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాల ప్రసారంపై నిషేధం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లేలా, పౌరుల మధ్య విద్వేషం పెంచేలా ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాల ప్రసారం వెంటనే ఆపేయాలని టీవీ చానళ్లను దేశ ఎలక్ట్రానిక్ మీడియా, రెగ్యులేటరీ అథారిటీ (పీఈఎంఆర్ఏ) ఆదేశించింది. వీటిని ఉల్లంఘిస్తే షోకాజ్ కూడా ఇవ్వకుండా నేరుగా లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించింది. ‘లాంగ్ మార్చ్ పేరిట ఇమ్రాన్ చేపట్టిన ర్యాలీ సందర్భంగా ఇటీవల చేసిన పలు ప్రసంగాల్లో.. తన హత్యకు కుట్ర పన్నాయంటూ సైన్యంసహా దేశ అత్యున్నత విభాగాలపై నిరాధార ఆరోపణలు చేశారు. ఈ ప్రసంగాలు ప్రజల మధ్య విద్వేషం పెంచే ప్రమాదముంది. శాంతిభద్రతలకు భంగం వాటిల్లే ఇలాంటి ప్రసంగాల ప్రసారం ఆపేయండి’ అని పేర్కొంది. -
ర్యాంటాక్, జింటాక్ టాబ్లెట్స్‌తో క్యాన్సర్?.. 26 ఔషధాలను నిషేధించిన కేంద్రం
న్యూఢిల్లీ: 26 రకాల ఔషధాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిషేధించింది. అత్యవసర జాబితా నుంచి ర్యాంటాక్, జింటాక్ టాబ్లెట్లను తొలగించింది. ర్యాంటాక్, జింటాక్ టాబ్లెట్లతో క్యాన్సర్ వస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయని కేంద్రం తెలిపింది. వాటితో పాటు 26 రకాల మందులను ఇండియా మార్కెట్ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ర్యాంటాక్, జింటాక్ మందులను ఎసిడిటీ సంబంధింత సమస్యలకు వైద్యులు సూచిస్తారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ 384 ఔషధాలను కలిగి ఉన్న కొత్త నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్‌ను విడుదల చేయగా జాబితా నుండి తాజాగా 26 ఔషధాలను తొలగించింది. ఆల్టెప్లేస్, అటెనోలోల్, బ్లీచింగ్ పౌడర్. కాప్రోమైసిన్, సెట్రిమైడ్, క్లోర్ఫెనిరమైన్, డిలోక్సనైడ్ ఫ్యూరోయేట్, డిమెర్కాప్రోల్, ఎరిత్రోమైసిన్, ఇథినైల్స్ట్రాడియోల్, ఇథినైల్స్ట్రాడియోల్(ఏ) నోరెథిస్టిరాన్ (బీ),గాన్సిక్లోవిర్, కనామైసిన్, లామివుడిన్ (ఎ)+నెవిరాపైన్ (బి)+ స్టావుడిన్ (సి),లెఫ్లునోమైడ్, మిథైల్డోపా, నికోటినామైడ్, పెగిలేటెడ్ ఇంటర్ఫెరాన్ ఆల్ఫా 2a, పెగిలేటెడ్ ఇంటర్ఫెరాన్ ఆల్ఫా 2బి, పెంటమిడిన్, ప్రిలోకైన్ (A) + లిగ్నోకైన్ (B, ప్రోకార్బజైన్, రానిటిడిన్, రిఫాబుటిన్, స్టావుడిన్ (ఎ) + లామివుడిన్ (బి), సుక్రాల్ఫేట్, వైట్ పెట్రోలేటం నిషేధించిన 26 ఔషధాలు జాబితాలో ఉన్నాయి. -
దాదాపు 24 లక్షల అకౌంట్లకు షాకిచ్చిన వాట్సాప్
న్యూఢిల్లీ: సోషల్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ జూలైలో భారతదేశంలో 23.87 లక్షలకు పైగా ఖాతాలను నిషేధించింది. ఈ ఖాతాలపై వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా ఈచర్చ తీసుకుంది. ఇదే ఏడాది జూన్‌లో 22 లక్షలకు పైగా ఖాతాలను, మేలో 19 లక్షల ఖాతాలు బ్యాన్ చేసింది. ఇది చదవండి : 100 డాలర్లు రీఫండ్ అడిగితే, కోటి ఇచ్చారా? ఇదెక్కడి చోద్యం రా మామా! మార్గదర్శకాలు,నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ ఖాతాలను బ్యాన్ చేసినట్టు ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ వెల్లడించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్-2021 నిబంధనల కింద తాజా నివేదికలో వాట్సాప్ఈవివరాలను అందించింది. అలాగే యూజర్ల ఫిర్యాదులు దానిపై తాము తీసుకున్న చర్యల వివరాలు కూడా పొందుపరిచామని వాట్సాప్ తెలిపింది. ఇదీ చదవండి: WhatsApp:బీ అలర్ట్: ఈ ఫోన్లలో వాట్సాప్ అక్టోబరు నుంచి పనిచేయదు జూలైలో అందిన 574 ఫిర్యాదుల నివేదికల్లో 392 నివేదికలు 'బ్యాన్ అప్పీల్' గాను, మిగిలినవి ఖాతా,ప్రొడక్ట్స్, భద్రత లాంటివి వచ్చాయని చెప్పింది. జూలై 1, 2022 , జూలై 31, 2022 మధ్య, 23,87,000 వాట్సాప్ ఖాతాలు నిషేధించామని, వీటిలో 14,16,000 ఖాతాలు ముందుగా బ్యాన్ చేశామని నెలవారీ నివేదిక పేర్కొంది. అంతకుముందు జూన్‌లో వాట్సాప్‌కు 632 ఫిర్యాదుల నివేదికలు అందగా, మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాటిలో 64పై చర్య తీసుకున్న సంగతి తెలిసిందే. -
8 యూట్యూబ్ ఛానెళ్లు బ్లాక్ చేసిన ఐటీశాఖ
-
కేంద్రం సీరియస్.. యూట్యూబ్ ఛానల్స్‌పై నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో 8 యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేసినట్టు గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, సదరు ఛానళ్లు దేశ భద్రత, విదేశీ వ్యవహారాలపై తప్పుడు ప్రచారం చేసినందుకు తాము ఛానళ్లను బ్లాక్ చేసినట్టు కేంద్రం పేర్కొంది. బ్లాక్ చేసిన ఛానళ్లలో 7 భారత్‌కు చెందినవి కాగా, ఒక ఛానల్ పాకిస్తాన్‌కు చెందినది. ఇదిలా ఉండగా.. కేంద్రం అంతకు ముందు కూడా 2021 ఐటీ రూల్స్ ను ఉల్లంఘిస్తున్నారన్న కారణాలతో 22 యూట్యూబ్ ఛానెల్స్, మూడు ట్విట్టర్ అకౌంట్స్, ఓ ఫేస్ బుక్ అకౌంట్, ఒక వార్తా వెబ్ సైట్‌ను బ్లాక్ చేసింది. ఇక, గత ఏడాది డిసెంబర్ నుండి సోషల్ మీడియాలో బ్లాక్ చేస్తున్న అకౌంట్ల సంఖ్య తాజాగా 102కి చేరుకుంది. ఇక, ఈ ఛానళ్లు సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. తాజాగా బ్లాక్ చేసిన 8 యూట్యూబ్ ఛానల్స్.. దాదాపు 86 లక్షల మంది సబ్స్క్రైబర్లు, 114 కోట్ల మంది వ్యూస్‌తో అకౌంట్లను కలిగి ఉన్నాయి. కాగా, ఈ ఛానల్స్ భారతదేశంలోని మత వర్గాల మధ్య ద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నాయని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. .@MIB_India blocks 8 YouTube channels for spreading disinformation related to India’s national security, foreign relations and public order, 7 Indian and 1 Pakistan based YouTube news channels blocked under IT Rules, 2021#YouTube #channels#blocked #MIB pic.twitter.com/rHVSHTX2Ou — BIKASH KUMAR ROUTRAY (@Bikash_Media) August 18, 2022 ఇది కూడా చదవండి: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తత్కాల్ టికెట్స్‌పై ఐఆర్సీటీసీ కీలక నిర్ణయం -
వీఎల్సీ మీడియా ప్లేయర్‌పై నిషేధం, వెబ్సైట్, డౌన్లోడ్ లింక్ బ్లాక్
ముంబై: పబ్జీ మొబైల్, టిక్‌టాక్, కామ్‌స్కానర్ సహా వందలాది చైనీస్ యాప్‌లను బ్లాక్ చేసిన కేంద్రం తాజాగా ప్రముఖ మీడియా ప్లేయర్ సాఫ్ట్వేర్, వీడియో స్ట్రీమింగ్ సర్వర్ వీఎల్సీ మీడియా ప్లేయర్‌ను కూడా బ్యాన్ చేసింది. ఇండియాలో వీఎల్సీ మీడియా ప్లేయర్ వెబ్సైట్, డౌన్లోడ్ లింక్‌ను కూడా బ్లాక్ చేసింది. మీడియా వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయగానే ఐటీ చట్టం కింద నిషేధించిన సందేశం కనిపిస్తోంది. అంటే ఇకపై దేశంలో ఎవరూ ఏ పని కోసం ప్లాట్‌ఫారమ్‌ను యాక్సెస్ చేయలేరన్నమాట. ఇటీవల బీజీఎంఐ అనే పబ్జీ మొబైల్ ఇండియన్ వెర్షన్‌ను బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే. తాజా నివేదికల ప్రకారం IT చట్టం, 2000 ప్రకారం వీడియోలాన్ ప్రాజెక్ట్ వీఎల్సీ మీడియా ప్లేయర్‌కు చెక్ చెప్పింది కేంద్రం. అయితే చైనా-మద్దతు గల హ్యాకింగ్ గ్రూప్ సికాడా సైబర్ దాడులకు ప్లాట్‌ఫారమ్ అయినందున VLC మీడియా ప్లేయర్ దేశంలో బ్లాక్ చేసినట్టు కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. దీర్ఘకాలంగా సైబర్ దాడులు, హానికరమైన మాల్వేర్ లోడ్ కోసం సికాడా వీఎల్సీ మీడియా ప్లేయర్‌ని ఉపయోగిస్తోందని కొన్ని నెలల క్రితం భద్రతా నిపుణులు కనుగొన్నారు. VideoLAN ప్రాజెక్ట్ ద్వారా తయారైన వీఎల్సీ ప్లేయర్ భారతదేశంలో దాదాపు రెండు నెలల క్రితం కేంద్రం బ్లాక్ చేసింది. (Kia Seltos:కియా మరోసారి అదరగొట్టింది,సెల్టోస్ కొత్త రికార్డు) అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు కంపెనీ నుంచి,ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ గగన్‌దీప్ సప్రా అనే ట్విటర్ యూజర్లలో ఒకరు వీఎల్సీ వెబ్సైట్ స్క్రీన్‌షాట్‌ను ట్వీట్ చేసారు, "ఐటి యాక్ట్, 2000 ప్రకారం ఎలక్ట్రానిక్స్ ,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆర్డర్ ప్రకారం వెబ్సైట్ బ్లాక్ చేయబడింది" అని చూపిస్తుంది. ప్యారిస్‌కు చెందిన వీడియోలాన్ సంస్థ వీఎల్సీ మీడియాని అభివృద్ధి చేసింది. (Maruti Suzuki Swift S-CNG వచ్చేసింది, ఫీచర్లు చూసి వావ్ అనాల్సిందే!) Anyone know why @NICMeity has banned VLC Downloads in India? @internetfreedom pic.twitter.com/lQubbyK0Yi — Gagandeep Sapra (@TheBigGeek) August 12, 2022 #blocked Videolan project’s website “https://t.co/rPDNPH4QeB” cannot be accessed due to an order issued by @GoI_MeitY. It is inaccessible for all the major ISPs in India including #ACT, #Airtel and V!. #WebsiteBlocking pic.twitter.com/LBKgycuTUo — sflc.in (@SFLCin) June 2, 2022 -
మూఢ విశ్వాసం: ఆడపిల్ల దున్నితే అరిష్టమట! తగ్గేదెలే!
రెండు రోజుల క్రితం జార్ఖండ్‌లో ఈ వింత జరిగింది. తన పొలంలో దున్నడానికి కొత్తగా కొనుక్కున్న ట్రాక్టర్‌తో బయలుదేరిన 22 ఏళ్ల యువతి మంజును గ్రామస్తులు ఆపేశారు. ఆడపిల్ల పొలం దున్నడం అరిష్టమన్నారు. మహమ్మారి కమ్ముకుంటుందన్నారు. జరిమానా వేస్తామన్నారు. సాంఘిక బహిష్కరణ చేస్తామన్నారు. మంజు లెక్క చేయలేదు. బుద్ధి, జ్ఞానం ఉన్న ఎవరైనా అదే పని చేస్తారు కదా. ఆడపిల్ల ఎదిగితే ఆపాలని మూఢ విశ్వాసాల పేరుతో చూసే కుట్ర ఇది. జార్ఖండ్ రాష్ట్రం. గుమ్లా జిల్లా. సిసాయి మండలం. డహుటోలి గ్రామం. 22 ఏళ్ల మంజూ ఉరవ్ తన పొలం మీద వచ్చిన ఆదాయంతో సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ కొంది. ట్రాక్టర్ నడపడం నేర్చుకుంది. దాంతో తన పొలం దున్నుకోవాలనుకుంది. ఆడపిల్ల పొలం ఎందుకు దున్నాలనుకుంటోంది? మంజు డిగ్రీ ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యింది. అయితే ఉద్యోగం వెతుక్కునేలోపు కరోనా వచ్చి పడింది. ఊళ్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. మంజూకు తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఐదెకరాల పొలం ఉంది. చిన్నప్పటి నుంచి పొలం పనులు చేస్తూ పెరిగింది. ఈ కరోనా ఎప్పుడు పోతుందోనని వ్యవసాయం మొదలెట్టింది. చదువుకున్న అమ్మాయి, పైగా వ్యవసాయం అంటే ఇష్టం. కష్టపడే తత్వం ఉంది. ఐదెకరాల్లో వరి, మొక్కజొన్న, బంగాళాదుంప, టొమాటో వేసింది. రెండేళ్లు చేసిన సేద్యం ఆమెకు లాభం తెచ్చింది. జబ్బల్లో సత్తువ ఉంటే ఎవరు అడ్డుకుంటారు. ఇంకో పదెకరాల పొలం ఇటీవల కౌలుకు తీసుకుంది. అంటే ఇప్పుడు తన కింద 15 ఎకరాలు ఉన్నాయన్న మాట. అన్ని ఎకరాల పొలం దున్నాలంటే ట్రాక్టర్ ఉంటే మేలు కదా. కొత్త ట్రాక్టరుకు డబ్బు లేదు. సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ కొంది. తన పొలం తనే దున్నుకోగలదు అనుకుంది. అయితే ఈమె పాటికి ఈమె ఇలా డెవలప్ అయిపోతే ఎలా అనుకున్నారో నిజంగానే ఈమె ప్రతాపానికి భయపడ్డారోగాని పొలం దున్నుకోవడం మొదలెట్టిన మంజూను గ్రామస్తులు అడ్డుకున్నారు. పంచాయతీ పెట్టి పిలిపించారు. మంజూ వెళ్లింది. ‘దుక్కి దున్నే పని మగవాడిది. ఆ సంగతి నీకు తెలియదు. మగవాళ్లు కాకుండా ఆడవాళ్లు నాగలి పట్టినా, ట్రాక్టర్‌తో దున్నినా ఊరికి అరిష్టం. కరువొచ్చి పడుతుంది. లేని పోని మహమ్మారులు చుట్టు ముడతాయి. కనుక వెంటనే నువ్వు దున్నడం ఆపేయాలి. తప్పు కట్టి ఇక ఈ పని చేయనని హామీ ఇవ్వాలి. కాదూ కూడదని మళ్లీ దున్నావో నిన్ను, నీ కుటుంబాన్ని ఊరి నుంచి బహిష్కరిస్తాం’ అన్నారు. మంజు జంకలేదు ‘ఇవాళ ఆడపిల్లలు రాకెట్లు ఎక్కి అంతరిక్షానికి వెళుతుంటే నేను నేల మీద దున్నకూడదా? ఇలాగని ఏ పుస్తకంలో ఉంది. అమ్మాయి మంచి పని చేస్తున్నదని మెచ్చుకోవాల్సింది పోయి అడ్డు పుల్ల వేస్తారా? మీరు చెప్తే ఆగేది లేదు. మీరు చెప్పిన తప్పు కట్టేది లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి’ అని ట్రాక్టర్ ఎక్కి పని చేసుకోవడానికి వెళ్లిపోయింది. మీడియాకు ఈ సంగతి తెలిసి వార్తయ్యింది. లోకల్ పోలీసులు ఇరు వర్గాలను కూచోబెట్టి ‘ఇది మూఢ విశ్వాసం. ఆ అమ్మాయిని దండించేందుకు పంచాయితీకి హక్కు లేదు. అలా ఆపడానికి లేదు’ అని ఊరి పెద్దలకు చెప్పారు. ఊరు వింటేగా? ఎందుకు? ఒక అమ్మాయి తన కాళ్ల మీద తాను నిలబడి సక్సెస్ఫుల్ రైతుగా ఎదిగితే కుర్రకారు దానిని స్ఫూర్తిగా తీసుకోవాల్సింది పోయి అవమానంగా భావిస్తారు. పేదవాళ్లు పేదగా ఉండాలిగాని ఇలా ఎదిగితే ఉన్నోళ్లు కన్నెర్ర చేస్తారు. ఆడవాళ్లు నాలుగ్గోడల్లో ఉండకుండా ఇలా ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తే మగవాళ్లు ఆగ్రహిస్తారు. వీటన్నింటి ఫలితమే ‘అరిష్టం’ అనే మూఢవిశ్వాసం. ఆడవాళ్లు ముందుకు సాగేకొద్ది ఎక్కడో ఒక చోట అడ్డు పడే పురుష ప్రపంచం ఉంటుంది. వారిని ఓడించి ముందుకు సాగే మంజు వంటి యువతులూ ఉంటారు. ఉండాలి కూడా. ఇవాళ ఆడపిల్లలు రాకెట్లు ఎక్కి అంతరిక్షానికి వెళుతుంటే నేను నేల మీద దున్నకూడదా? ఇలాగని ఏ పుస్తకంలో ఉంది. అమ్మాయి మంచి పని చేస్తున్నదని మెచ్చుకోవాల్సింది పోయి అడ్డుపుల్ల వేస్తారా? మీరు చెప్తే ఆగేది లేదు. మీరు చెప్పిన తప్పు కట్టేది లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి. – మంజూ ఉరవ్ -
కొత్త అవతారంలో నిషేధిత యాప్‌లు ప్రత్యక్షం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వం నిషేధించిన యాప్‌లు కొత్త అవతారంలో మళ్లీ ప్రత్యక్షమవుతున్న విషయం వాస్తవమేనని ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ బ్లాక్ చేసిన యాప్‌లు పేర్లు మార్చుకుని కొత్త అవతారంలో మళ్ళీ ప్రత్యక్షమవుతున్నట్లు తమ మంత్రిత్వ శాఖకు నివేదికలు, ఫిర్యాదులు అందుతున్నాయని ఆయన చెప్పారు. చదవండి: జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక వ్యాఖ్యలు ఈ ఫిర్యాదులను తదుపరి పరిశీలన కోసం తాము హోం మంత్రిత్వ శాఖకు పంపిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిషేధించిన యాప్‌లను బ్లాక్ చేయాల్సిందిగా తమ మంత్రిత్వ శాఖ థర్డ్ పార్టీ యాప్ స్టోర్స్ అయిన గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే నిషేధిత యాప్‌లకు సంబంధించిన ఐపీ అడ్రస్‌లను బ్లాక్ చేయవలసిందిగా టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు ఇస్తున్నట్లు వెల్లడించారు. -
ప్రభుత్వ ఆఫీసుల్లో ఫొటోలు, వీడియోలపై నిషేధం
శివాజీనగర: ప్రభుత్వ కార్యాలయాల్లో ఇకపై ప్రజలు ఫొటో తీయటానికి, వీడియోలు చిత్రీకరించడానికి ఆస్కారం లేకుండా కర్ణాటక ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ప్రైవేట్ వ్యక్తులు కార్యాలయాల్లోకి వచ్చి ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో ఉంచుతున్నారు. దీనివల్ల మహిళా ఉద్యోగుల గౌరవానికి భంగం వాటిల్లుతోందని, అనధికారికంగా ఫొటోలు, వీడియోలు తీయకుండా చర్యలు తీసుకోవాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ప్రభుత్వానికి విన్నవించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం కూలంకుషంగా పరిశీలించింది. ఇకపై పనివేళల్లో అనధికారికంగా ఫొటోలు, వీడియోలు తీయరాదని ఆదేశిస్తూ సిబ్బంది, పరిపాలనా విభాగం కార్యదర్శి కే.వెంకటేశప్ప ఆదేశాలు జారీచేశారు. గవర్నర్ ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులు శుక్రవారం నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. కాగా చట్టవిరుద్ధంగా ఫొటోలు, వీడియోలు తీసేవారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయాన్ని ఆ ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. -
వాట్సాప్ యూజర్లకు షాక్: లక్షల ఖాతాలపై నిషేధం
న్యూఢిల్లీ: మెసేజింగ్ యాప్ వాట్సాప్ మే నెలలో భారత్‌కు చెందిన 19.10 లక్షల ఖాతాలను నిషేధించింది. ఉల్లంఘనలను నిరోధించడానికి, గుర్తించడానికి ఏర్పాటు చేసిన సొంత యంత్రాంగంతోపాటు వినియోగదారుల ఫిర్యాదుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వాట్సాప్ ప్రకటించింది. ఈ ఏడాది మార్చిలో 18.05 లక్షలు, ఏప్రిల్‌లో 16 లక్షల భారతీయ ఖాతాలను వాట్సాప్ నిషేధించింది. గతేడాది అమల్లోకి వచ్చిన నూతన ఐటీ నియమాల ప్రకారం 50 లక్షలకు పైగా వినియోగదారులు ఉన్న పెద్ద డిజిటల్ వేదికలు ప్రతి నెలా ఫిర్యాదుల నివేదికలను ప్రచురించాల్సి ఉంటుంది. -
జూలై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం
సాక్షి, హైదరాబాద్: పర్యావరణానికి హాని కలిగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్(ఎస్యూపీ) ఉత్పత్తులపై నిషేధం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనుందని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. జూలై 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒకసారి వినియోగించి పడేసే ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం అమలుకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(టీపీసీబీ) చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఎస్యూపీ సరఫరా ముడి సరుకులు, ప్లాస్టిక్ డిమాండ్ తగ్గింపునకు చర్యలు, ఈ ఉత్పత్తులకు ప్రత్యామ్నాయాల ప్రోత్సాహం, ప్రజల్లో అవగాహన వంటివి చేపడతామన్నారు. వీటితోపాటు పట్టణ స్థానిక సంస్థలు, జిల్లా పాలనాయంత్రాంగానికి అవగాహన కల్పన, మార్గనిర్దేశానికి ఈ ప్రణాళికలో భాగంగా పీసీబీ బహుముఖ విధానాన్ని అవలంబిస్తోందన్నారు. ఎస్యూపీలపై నిషేధం అమలుకు, ప్రత్యామ్నాయ వస్తువుల ప్రోత్సాహానికి కంపోస్టబుల్ ప్లాస్టిక్ వస్తువుల తయారీకి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వన్ టైం సర్టిఫికెట్లు జారీ చేస్తుందన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మద్దతుగా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజనీరింగ్–టెక్నాలజీ (సిపెట్), జాతీయ ఎమ్మెస్ఎంఈ శిక్షణ సంస్థ, ప్లాస్టిక్ మాన్యుఫ్యాక్చరింగ్ అసోసియేషన్, ఇతర ఇండస్ట్రియల్ అసోసియేషన్ల సహకారంతో ఎస్యూపీలకు బదులుగా ఎమ్మెఎస్ఎంఈ యూనిట్లకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తూ టీపీసీబీ వర్క్‌షాపులను నిర్వహిస్తుందన్నారు. నిబంధనలు ఉల్లంఘించినవారిపై ఫిర్యాదు చేయడానికి సీపీసీబీ ఎస్యూపీ–సీపీసీబీ ప్రత్యేక ఆన్లైన్ యాప్ కూడా అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఎస్యూపీ వస్తువుల వినియోగానికి స్వస్తి చెప్పి ప్రత్యామ్నాయ వస్తువులు వినియోగించాలని సూచించారు. నిషేధిత జాబితాలోని ప్లాస్టిక్ వస్తువులు ఇవే ఇయర్ బడ్స్(ప్లాస్టిక్ పుల్లలున్నవి), బెలూన్లకు వాడే ప్లాస్టిక్ స్టిక్స్ (ప్లాస్టిక్ పుల్లలతో), ప్లాస్టిక్ జెండాలు, క్యాండీ స్టిక్స్–పిప్పరమెంట్లకు వాడే ప్లాస్టిక్ పుల్లలు, ఐస్‌క్రీమ్ పుల్లలు(ప్లాస్టిక్ పుల్లలతో), అలంకరణ కోసం వాడే థర్మోకోల్, ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులతోపాటు ప్లాస్టిక్ గ్లాసులు, ఫోర్క్‌లు, కత్తులు, స్పూన్లు, స్ట్రాలు.. వేడి పదార్థాలు, స్వీట్ బాక్సుల ప్యాకింగ్‌కు వాడే పల్చటి ప్లాస్టిక్ ఆహ్వానపత్రాలు, సిగరెట్ ప్యాకెట్లు, వంద మైక్రాన్లలోపు ఉండే ప్లాస్టిక్ లేదా పీవీసీ బ్యానర్లు,, ద్రవ పదార్థాలను కలిపేందుకు వాడే పుల్లలు(స్ట్రిరర్స్). -
అబార్షన్లపై నిషేధమా?
వాషింగ్టన్: అబార్షన్ విషయమై అమెరికాలో భిన్నాభిప్రాయాలు ఇప్పటివి కాదు. మత విశ్వాసాలను నమ్మే సంప్రదాయవాదులకు, వ్యక్తి స్వేచ్ఛకు ప్రాధాన్యమిచ్చే ప్రగతిశీలవాదులకు మధ్య ఈ విషయమై ఎన్నేళ్లగానో పోరు నడుస్తోంది. 50 ఏళ్ల క్రితం రో వెర్సస్ వేడ్ కేసు తర్వాత రాజ్యాంగపరంగా సంక్రమించిన అబార్షన్ హక్కులకు సుప్రీంకోర్టు మంగళం పలికి, దాన్ని నిషేధించేందుకు రాష్ట్రాలకు అధికారాలు కట్టబెట్టడంపై మహిళలు భగ్గుమంటున్నారు. పిల్లలను మోసి కనే శ్రమ ఆడవాళ్లదే కాబట్టి దానిపై నిర్ణయం తీసుకునే హక్కు తమకే ఉండాలంటూ దేశవ్యాప్తంగా భారీగా నిరసనలకు దిగారు. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఏడు రాష్ట్రాలు అలబామా, అర్కన్సాస్, కెంటకీ, లూసియానా, మిసోరి, ఒక్లహామా, సౌత్ డకోటా అబార్షన్లను నిషేధించే ప్రక్రియను ప్రారంభించాయి. మరో 23 రాష్ట్రాలు అదే బాటలో ఉన్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో అబార్షన్ క్లినిక్స్ మూసేస్తున్నారు. మహిళల పునరుత్పత్తి హక్కులపై అధ్యయనం నిర్వహించే గట్మ్యాచర్ ఇనిస్టిట్యూట్ గణాంకాల ప్రకారం అమెరికాలో ప్రతి నలుగురిలో ఒకరు 45 ఏళ్ల వయసులోనూ అబార్షన్ చేయించుకుంటున్నారు. 20–30 ఏళ్ల వయసు వారిలో ఏకంగా 60 శాతం అబార్షన్లు జరుగుతున్నాయి. వీరిలో ఆఫ్రికన్ నిరుపేద, అందులోనూ నల్లజాతి మహిళలే ఎక్కువ. ఇన్సూరెన్స్ లేని టీనేజర్లు, వలస వచ్చిన మహిళలపై తీర్పు తీవ్ర ప్రభావం చూపించనుంది. ఆలస్యమూ కొంప ముంచుతుంది డెమొక్రాట్ల పట్టున్న కాలిఫోర్నియా, న్యూయార్క్, వాషింగ్టన్ సహా 10 రాష్ట్రాల్లో అబార్షన్లకు చట్టబద్ధత కొనసాగనుంది. దాంతో నిషేధమున్న రాష్ట్రాల మహిళలు అబార్షన్‌కు వందలాది మైళ్ల దూరం ప్రయాణించి ఇలాంటి రాష్ట్రాలకు వెళ్లాలి. -
35 వాట్సాప్ గ్రూప్‌లపై నిషేధం విధించిన కేంద్రం
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆందోళనకారులు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని.. ప్లాన్స్ సిద్దం చేసుకున్నారు. ఈ క్రమంలో అగ్నిపథ్ పథకం, అగ్నివీర్లకు సంబంధించి వాట్సాప్ గ్రూప్‌లో తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. దీంతో, 35 వాట్సాప్ గ్రూప్‌లను నిషేధించినట్లు కేంద్ర సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేసినవారిని, హింసాత్మక సంఘటనలకు ప్రేరేపించినవారిని గుర్తించేందుకు పోలీసులు కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. అయితే, నిషేధం విధించిన వాట్సాప్ గ్రూపుల వివరాలను మాత్రం కేంద్రం గోప్యంగా ఉంచింది. ఇక, ఈ వాట్సాప్ గ్రూపులకు సంబంధించి 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దాడుల నుంచి మొదలు కొని బీహార్‌లో ఈ నెల 17న ఉప ముఖ్యమంత్రి దాడి, రైల్వే ఆస్తులకు నష్టం కలిగించడం సహా పలు రాష్ట్రాల్లో నిరసనలపై కేంద్ర హోం శాఖ ఫోకస్ పెట్టింది. ఈ దాడులకు వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగిస్తున్నారనే నివేదికలపై చర్యలు చేపట్టింది. ప్రజలను రెచ్చగొట్టేందుకు, ఆస్తికి నష్టం కలిగించే ఉద్దేశంతో పుకార్లను వ్యాప్తి చేసేందుకు అభ్యంతరకరమైన కంటెంట్‌ను ప్రసారం చేయడానికి ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ క్రమంలో ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. Centre bans 35 WhatsApp groups for spreading misinformation on Agnipath scheme, 10 arrested for fake news#AgnipathScheme pic.twitter.com/Fqv0N8DF2n — Pandurang Dhond (@PandurangDhond7) June 20, 2022 ఇది కూడా చదవండి: భారత్ బంద్ ఎఫెక్ట్: విద్యా సంస్థలు మూసివేత, పరీక్షలు రద్దు -
భారత గోధుమల ఎగుమతిపై యూఏఈ కీలక నిర్ణయం
గోధుమల ఎగుమతులపై యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి దిగుమతి చేసుకున్న గోధుమలు, గోధుమ పిండిని ఇతర దేశాలకు ఎగుమతి చేయకుండా నాలుగు నెలల పాటు నిషేధం విధిస్తున్నట్టు తెలిపింది. అయితే, మే 14న భారత్ గోధుమ ఎగుమతులను నిషేధించడంతో యూఏఈ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఎగుమతులు, దిగుమతులపై ప్రభావాన్ని దృష్టిలో పెట్టకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూఏఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరోవైపు, దేశీయ వినియోగం కోసం యూఏఈకి గోధుమలను ఎగుమతి చేయడానికి భారత్ ఆమోదించిందని పేర్కొంది. కాగా, ప్రపంచంలోనే గోధుమలను ఎక్కువగా పండించే దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. ఇక, తమకు గోధుమలను సరఫరా చేయాలని ఇండోనేసియా, ఒమన్, యూఏఈ, బంగ్లాదేశ్, యెమన్ దేశాలు భారత్‌ను కోరాయి. దీంతో, యూఏఈ ప్రజల అవసరాలకు సరిపడా గోధుమలను పంపేందుకు భారత్ సుముఖత వ్యక్తం చేసింది. భారత్‌తో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు చేసిన నేపథ్యంలో.. తమ దేశం మీదుగా భారత గోధుమలు విదేశాలకు ఎగుమతి కాకుండా యూఏఈ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, మే 13కి ముందు యూఏఈకి తీసుకువచ్చిన భారతీయ గోధుమలను ఎగుమతి చేయాలనుకునే లేదా తిరిగి ఎగుమతి చేయాలనుకునే కంపెనీలు ముందుగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపింది. గోధుమల షిప్మెంట్, గోధుమలు ఏ దేశం నుంచి వచ్చాయి, చెల్లింపులు జరిపిన తేదీ తదితర డాక్యుమెంట్లను తనిఖీ కోసం సబ్మిట్ చేయాలని ఆదేశించింది. కాగా, భారత్ నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన గోధుమలు, గోధుమ పిండిని కంపెనీలు ఎగుమతి చేసుకోవచ్చని యూఏఈ స్పష్టం చేసింది. కానీ, ఇందు కోసం కూడా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని ఆ దేశ ఆర్థిక శాఖ ఆదేశించింది. -
14 ఏళ్ల టీనేజర్‌కి నగర బహిష్కరణ... మూడేళ్ల వరకు నిషేధం
ఇదివరకు పూర్వం గ్రామంలో ఎవరైన దారుణమైన పనులు చేస్తే గ్రామపెద్దలు గ్రామ బహిష్కరణ వంటి శిక్షలు వేసేవారు. అదీకూడా అలాంటి పనులు మరెవరు చేయకూడదని అలాంటి శిక్షలు విధించేవారు. రాను రాను అవి కొన్ని కొన్ని విషయాల్లో ఇబ్బందిగా ఉండటమే కాకుండా ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో కనుమరుగైపోయాయి. ఇంతలా టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ స్మార్ట్ యుగంలో కూడా నగర బహిష్కరణలు ఉన్నాయంటే నమ్ముతారా!. ఔను నిజం ఒక దేశంలోని టీనేజర్ని ఒక నగరం మొత్తం బహిష్కరించింది. ఎందుకు బహిష్కిరించారు ఏం జరిగిందనే కదా. వివరాల్లోకెళ్తే....యూకే చెందిన 14 ఏళ్ల కీలాన్ ఎవాన్స్ని ఒక పట్టణం మొత్తం బహిష్కరించింది. కీలాన్ యూకేలోని వెస్ట్ మెర్సియా అనే పట్టణంలో నివశిస్తున్నాడు. ఐతే అతను ఆ పట్టణంలోని వ్యాపారులను, స్థానికులను చాలా ఇబ్బందులకు గురిచేశాడు. ఆన్లైన్లో కూడా చాలా మందిని పలు రకాలుగా వేధించాడు. దీంతో ఆ టీనేజర్‌పై చాలా మంది ఫిర్యాదులు చేశారు. ఈ మేరకు వెస్ట్ మెర్సియా పోలీసులు అతనిపై చర్యలు తీసుకోవడమే కాకుండా అదుపులోకి తీసుకుని అరెస్టు కూడా చేశారు. అంతేకాదు యూకేలోని కోర్టు అతని క్రిమినల్ బిహేవియర్ కారణంగా అతను పట్టణంలో ఉండకుండా నిషేధిస్తున్నట్లు తెలిపింది. అతను 2025 వరకు కూడా పట్టణంలోకి ప్రవేశించకూడదని చెప్పింది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తుల సముహంలో కూడా ఉండకూడదని కూడా పేర్కొంది. ఎప్పుడైనా ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే భారీ జరిమాన ఎదుర్కొవలసి ఉంటుందని వెల్లడించింది. ఈ శిక్షలు అతను భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి పనులు చేయకుండ ఉండేందుకేనని కోర్టు స్పష్టం చేసింది. ఐతే యూకేలో యువకులపై ఇలాంటి శిక్షలు చాలా అసాధారణం. కానీ కీలాన్ దారుణమైన ప్రవర్తన కారణంగానే యూకే ఇలాంటి శిక్షలు విధించింది. (చదవండి: రైల్వే ఫ్లాట్ ఫారం పై పుస్తకాలతో కుస్తీ పడుతున్న యువకులు: ఫోటో వైరల్) -
భారతీయులకు షాక్.. వాట్సాప్ ఖాతాలపై నిషేధం
న్యూఢిల్లీ: మొబైల్ మెసేజింగ్ సంస్థ అయిన వాట్సాప్.. భారతీయులకు బిగ్ షాక్ ఇచ్చింది. హానికర కార్యకలాపాలను నిరోధించే ప్రక్రియలో భాగంగా భారతీయ యూజర్లు వినియోగిస్తున్న లక్షల సంఖ్యలో ఉన్న వాట్సాప్ ఖాతాలను నిషేధించింది. దీనికి సంబంధించి ఆయా వివరాలను సంస్థ పొందుపరిచింది. అయితే, కొందరు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఐటీ నిబంధనలను ఉల్లంఘించే యూజర్లపై గత కొంతకాలంగా చర్యలు తీసుకుంటున్న వాట్సాప్.. తాజాగా ఏప్రిల్ నెలకు సంబంధించిన నివేదికను విడుదల చేసింది. ఒక్క ఏప్రిల్ నెలలోనే భారత్‌లో 16.6 లక్షల ఖాతాలను నిషేధించినట్టు వెల్లడించింది. కొత్త ఐటీ రూల్స్‌కు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. కాగా, అడ్వాన్స్డ్ మెషీన్ లెర్నింగ్ సిస్టమ్ ద్వారా నిరంతరాయంగా ఇలా అపాయకర ఖాతాలను గుర్తించి, నిరోధించే ప్రక్రియ కొనసాగుతుందని సంస్థ తెలిపింది. అనుమానిత అకౌంట్‌పై నెగటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చినపుడు, ఇతరులు ఆ అకౌంట్‌ను బ్లాక్ చేసినపుడు ఆ అకౌంట్‌ను పర్యవేక్షించి తగు కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఇదిలా ఉండగా.. కొత్త ఐటీ నిబంధనలు- 2021 ప్రకారం.. 50లక్షలకుపైగా యూజర్లు కలిగిన డిజిటల్ ప్లాట్‌ఫాంలు వాటికి సంబంధించిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యలపై నెలవారీగా ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే ఏప్రిల్ 1 నుంచి 30 వరకు వాట్సాప్ వేదికపై రూల్స్‌కు విరుద్ధంగా ప్రవర్తించిన 16,66000 ఖాతాలపై నిషేధం విధించినట్టు వాట్సాప్ తెలిపింది. సందేశాలనూ సరిచేయొచ్చు! వాట్సాప్‌లో ఇతరులకు పంపే మెసేజ్‌లను మళ్లీ ఎడిట్/రీ–రైట్ చేసే ఆప్షన్ త్వరలో అందుబాటులోకి రావచ్చు. ఇది ప్రస్తుతం పరీక్ష దశలో ఉంది. Out of the total, 122 accounts were banned based on user complaints while 16.66 lakh accounts were barred to prevent harmful activity on the app, said the Facebook-owned messaging app.https://t.co/Xq6CXFimui — Mint (@livemint) June 1, 2022 -
శ్రీలంక: మహింద రాజపక్సకు భారీ షాక్
కొలంబో: శ్రీ లంక మాజీ ప్రధాని మహింద రాజపక్సకు భారీ షాక్ తగిలింది. ఆందోళనకారులకు భయపడి.. ఆయన తన కుటుంబం, అనుచరగణంతో భద్రంగా తలదాచుకున్న విషయం తెలిసిందే. కాస్త అవకాశం దొరికినా దేశం విడిచిపోవాలని చూస్తున్నారంటూ స్థానిక మీడియాలు కథనాలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొలంబో కోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. మాజీ ప్రధాని మహింద రాజపక్స, ఆయన తనయుడు నమల్, రాజపక్స మిత్రపక్షాలకు చెందిన సభ్యులను దేశం విడిచి వెళ్లడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ప్రధాని భవనం టెంపుల్ ట్రీస్ వద్ద శాంతియుతంగా ధర్నా చేపట్టిన నిరసనకారుల మీద జరిగిన దాడులు.. ఆ తర్వాత చెలరేగిన హింస మీద దర్యాప్తు చేపట్టాలని పోలీస్ శాఖను మెజిస్ట్రేట్ ఆదేశించారు. ఇదిలా ఉంటే.. సోమవారం మహింద రాజీనామా ప్రకటన నేపథ్యంలో హైడ్రామా జరిగింది. ఆయన మద్ధతుదారులు.. నిరసనకారుల మీద విరుచుకుపడ్డారు. ఆ తర్వాత హింస చెలరేగింది. ఈ హింసలో ఇప్పటిదాకా తొమ్మిది మంది మరణించగా(అనధికారికంగా ఇంకా ఎక్కువే!).. వందల సంఖ్యలో గాయపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే నిరసన, ఆందోళనకారులపై కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసింది శ్రీ లంక రక్షణ శాఖ. మరోవైపు రాజీనామా హైడ్రామా నడిపిన మహింద రాజపక్స, ఆపై చెలరేగిన హింసతో నిజంగానే రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆపై కుటుంబం, అనుచర గణంతో నేవీ బేస్‌లో తలదాచుకున్నారాయన. మరోవైపు ఆగ్రహంతో ఊగిపోయిన నిరసనకారులు.. రాజపక్స కుటుంబం, బంధువులు, అనుచరణ గణానికి చెందిన ఇళ్లను తగలబెట్టేస్తున్నారు. మరోవైపు మహీంద, ఆయన మద్దతుదారులు దేశం విడిచిపారిపోకుండా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన నిరసనకారులు.. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ తరుణంలో దేశం దాటిపోకుండా కోర్టు నిషేధం విధించడం విశేషం.\ చదవండి: గొటబయా రాజపక్స కీలక ప్రకటన -
పాప్ స్టార్ జస్టిన్ బీబర్‌కు భారీ షాక్!
అమెరికన్ పాప్ స్టార్ జస్టిన్ బీబర్‌కు ఇటాలియన్ సూపర్ కార్ మ్యానిఫ్యాక్చరర్ ఫెరారీ సంస్థ భారీ షాకిచ్చింది. ఈ పాప్ స్టార్ ఫెరారీ కారును వినియోగించేందుకు వీలు లేదని హెచ్చరించింది. ఇటలీకి చెందిన ప్రముఖ మీడియా సంస్థ ఇల్ జియోర్నాలే నివేదిక ప్రకారం..ఫెరారీ సంస్థ జస్టిన్ బీబర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.ఫెరారీ కార్ల పట్ల జస్టిన్ బీబర్‌కు నైతిక విలువలు లేవని, వాటిని మెయింటెన్స్ చేయడంలో విఫలం అయ్యాడని,అందుకే ఫెరారీ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియా సంస్థ తెలిపింది. ఫెరారీ సంస్థ తన కార్లను సరైన రీతిలో వినియోగించని సెలబ్రిటీలపై ఆంక్షలు విధించడం సర్వసాధారణం. గతంలో హాట్ మోడలింగ్‌తో గ్లోబల్ వైడ్‌గా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కిమ్ కర్దాషియన్‌తో పాటు, నికోలస్ కేజ్, ర్యాపర్ 50సెంట్ వంటి ప్రముఖులు ఫెరారీ కార్లను వినియోగించకుండా నిషేధించింది. తాజాగా ర్యాపర్ జస్టిన్ బీబర్‌పై అదే తరహాలో చర్యలు తీసుకుంది. జస్టిన్ బీబర్‌కు చెందిన ఎఫ్ 458ను నిర్వహణలో అలసత్వం వహించడం వల్లే ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. జస్టిన్ బీబర్ ఫెరారీ రంగును మార్చడం, వేలం వేయడం వంటి అంశాలే ఫెరారీ సంస్థ జస్టిన్ బీబర్‌పై నిషేదం విధించే కారణాల్లో ఇవి కూడా ఉన్నాయి. గతంలో జస్టిన్ బీబర్ తన ఎఫ్ 458ని కొనుగోలు చేసిన కొన్ని నెలల తరువాత బెవర్లీ హిల్స్ నైట్ క్లబ్ వెలుపల పార్కింగ్ చేశాడు. నాటి నుంచి బీబర్‌కు ఫెరారీ కార్ల విషయంలో ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటుంన్నాడు. బెవర్లీ హిల్స్ నైట్ క్లబ్లో పార్కింగ్ చేసిన తర్వాత ఆ కారు మిస్ అవ్వడం కలకలం రేగింది. దీంతో బీబర్ సహాయకుడు ఆ సూపర్ కార్‌ను గుర్తించాడు. కారు అదృశ్యంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఈ కెనడియన్ ర్యాపర్ తన ఫెరారీ కారును తెలుపు రంగును బ్లూకి మార్చాడు. అంతేకాదు కారు స్టీరింగ్ వీల్ మీద గుర్రం సింబల్ రంగును, అల్లాయ్ వీల్స్, రిమ్స్ మీద బోల్ట్ లను మార్చాడు. దీంతో ఫెరారీ సంస్థ బీబర్‌పై గుర్రుగా ఉంది. దీనికితోడు రంగును మార్చి వేలం వేయడంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన ఫెరారీ సంస్థ.. ఇకపై బీబర్ తమ సంస్థకు చెందిన కారును వినియోగించే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇచ్చినట్లు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. చదవండి👉టాటా ఎలక్ట్రిక్ వెహికల్,లాంచ్ చేసిందో లేదో.. హాట్ కేకుల్లా బుకింగ్స్ -
దేశ భద్రతకు ముప్పు.. 16 యూట్యూబ్ ఛానళ్లు బ్లాక్!
దేశ భద్రతకు ముప్పుగా పరిణమించిన 16 యూట్యూబ్ ఛానళ్లను భారత ప్రభుత్వం నిషేధించింది. దేశ భద్రత, సమగ్రతలకు సంబంధించి తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నందన ఈ నిర్ణయం తీసుకుంది. తాగాగా నిషేధం విధించిన ఛానళ్లలో 6 పాకిస్తాన్‌కి చెందినవి ఉన్నాయి. యూట్యూబ్ ఛానళ్లతో పాటు ఫేస్బుక్ అకౌంట్‌ని కేంద్ర ప్రసార శాఖ బ్లాక్ చేసింది. తాజాగా నిషేధిత జాబితాలో చేరిన యూ ట్యూబ్ ఛానళ్లకు రికార్డు స్థాయిలో 68 కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. భారీ స్థాయిలో చందాదారులను కలిగిన ఈ ఛానళ్లు అదే పనిగా భారత విదేశాంగ విధానం, అంతర్గత వ్యవహారాలు, దేశ సమగ్రతకు సంబంధించిన అంశాల్లో తప్పుడు సమాచారాన్ని వెదజల్లుతున్నట్టు కేంద్ర ప్రసార శాఖ గుర్తించింది. దీంతో వాటిపై నిషేధం విధించింది. నిషేధించిన యూట్యూబ్ ఛానళ్లు ఎస్బీబీ న్యూస్, తహ్‌ఫుజ్ ఈ దీన్ ఇండియా, ది స్టడీ టైం, లేటెస్ట్ అప్డేట్, హిందీ మే దేఖో, డిఫెన్స్ న్యూస్ 24/7, టెక్నికల్ యోగేంద్ర, షైనీ ఎడ్యుకేషనల్ రీసెర్చ్, ఆజ్ తే న్యూస్, ఎంఆర్ఎఫ్ టీవీ లైవ్ వంటి ఇండియా ఛానళ్లు ఉన్నాయి. ఇక పాకిస్తాన్ బేస్డ్ ఛానళ్ల విషయానికి వస్తే బోల్ మీడియా బోల్, ఖైసర్ ఖాన్, ది వాయిస్ ఆఫ్ ఏషియా, డిస్కవర్ పాయింట్, రియాల్టీ చెక్, ఆజ్‌తక్ పాకిస్తాన్ ఛానళ్లు ఉన్నాయి. వీటితో పాటు తహ్‌ఫుజ్ ఈ దీన్ మీడియా సర్వీసెస్ ఇండియా అనే ఫేస్బుక్ అకౌంట్ కూడా ఉంది. చదవండి: Truecaller: గూగుల్ షాకింగ్ నిర్ణయం..ఇకపై ట్రూకాలర్‌లో ఈ ఫీచర్ పనిచేయదు. -
Bike: బైక్‌పై ఇద్దరు పురుషులు ప్రయాణించరాదు.. ఎక్కడో తెలుసా..?
తిరువనంతపురం: ద్విచక్రవాహనంపై వెనుక సీటులో పురుషులు ప్రయాణించడంపై నిషేధం విధించారు. జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు కేరళలోని పాలక్కడ్‌లో ఈ రూల్ అమలులోకి వచ్చింది. కాగా, ఇటీవలే ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్య కేసు నేపథ్యంలో ఈ నిబంధన విధించినట్టు తెలిపారు. తాజా నిషేధం నుంచి మహిళలు, చిన్నారులకు మినహాయింపును ఇచ్చారు. ఈ ఆదేశాలు ఏప్రిల్ 20వరకు అమల్లో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈ నెల 15వ తేదీన ఆర్ఎస్ఎస్ కార్యకర్త శ్రీనివాసన్ షాపులో ఉండగా.. ఇద్దరు వ్యక్తులు వచ్చి దారుణంగా హత్య చేశారు. అయితే, పోలీసుల విచారణలో ఈ హత్య అదే రోజున ఎస్డీపీఐ కార్యకర్త సుబెయిర్ హత్యకు ప్రతీకారంగానే జరిగినట్టు తెలిసింది. దీంతో ఒకే రోజులో ఇలా రెండు హత్యలు జరగడం స్థానికంగా కలకలం రేపింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ రెండు హత్యలే కాక మరిన్ని మర్డర్లకు ప్లాన్స్ చేసినట్టు పోలీసులకు సమాచారాం అందింది. దీంతో అడిషన్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ రూల్ నుంచి పిల్లలు, మహిళలను మాత్రం మినహాయించారు. -
విజయ్ 'బీస్ట్' రిలీజ్‌కు అక్కడ నిషేధం.. కారణం ఇదే..
Vijay Starrer Beast Movie Banned In Kuwait Here Is The Reason: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, బుట్టబొమ్మ జోడిగా నటించిన చిత్రం 'బీస్ట్'. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం విజయ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సెషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 13న విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే ఇటీవల విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది. కానీ ఈ ట్రైలర్‌తో 'బీస్ట్' చిక్కుల్లో పడ్డాడు. ఈ ట్రైలర్లో షాపింగ్ మాల్‌ను హైజాక్ చేసిన ఉగ్రవాదులను ఒక గూఢాచారి ఎలా అంతమొందిచాడనేది చూపించారు. దాదాపు ఈ సినిమా ఉగ్రవాద నేపథ్యంతో తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. అయితే అరబిక్ దేశాలు ప్రోత్సహించని ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నందున గల్ఫ్ దేశాల్లో ఒకటైన కువైట్ 'బీస్ట్'ను నిషేధించింది. అరబ్ దేశాలను విలన్లుగా, టెర్రరిస్టులకు నిలయంగా చూపించే ఏ సినిమాను గల్ఫ్ దేశాలు అంగీకరించవని తెలిసిందే. టెర్రరిస్టులు ఎక్కువగా కువైట్ వంటి గల్ఫ్ దేశాల్లో దాక్కుంటారని, అందుకు అక్కడ చట్టాలు కూడా సహకరిస్తాయని టాక్ ఉంది. అయితే యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్, బహ్రెయిన్ వంటి గల్భ్ దేశాల్లో 'బీస్ట్' రిలీజ్‌కు మార్గం సుగమం అయింది. -
బిగ్‌బాస్ తర్వాత నన్ను రెండేళ్లు బ్యాన్ చేశారు: అలీ రెజా
అలీ రెజా.. బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు బాగా సుపరిచితం. అప్పటివరకు సీరియల్స్‌లో నటించినా రాని గుర్తింపు బిగ్‌బాస్ సీజన్-3తో సంపాదించుకున్నాడు. ఫిజికల్ టాస్కుల్లో తనదైన స్టైల్లో ఆడి ప్రేక్షకుల్ని మెప్పించిన అలీ బిగ్‌బాస్ అనంతరం బుల్లితెరపై పెద్దగా కనిపించలేదు. తాజాగా ఓ షోలో పాల్గొన్న అలీ తెరపై కనిపించకుండా ఉండటం వెనకున్న బలమైన కారణాన్ని బయటపెట్టాడు. ఈ మధ్య టీవీల్లో కనిపించడం లేదేంటి అని హోస్ట్ అడగ్గా.. తనను బ్యాన్ చేశారని చెప్పి షాకిచ్చాడు. అప్పట్లో నాకు బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది. ఆ టైంలో చిన్న మిస్టేక్ చేశా. ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కి రావాలని ఫోన్ చేశారు. నేను వెళ్లేసరకి అలీ రెజా రెండేళ్లు బ్యాన్ అన్నారు. ఆ మాట విని నాకు హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైంది అంటూ చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
పుతిన్ ఆంక్షలు... రష్యన్లు దేశం విడిచి వెళ్లకుండా కట్టడి!
Putin has banned Russians from leaving country: ఉక్రెయిన్ రష్యాల మధ్య పోరు నివరవధికంగా సాగుతూనే ఉంది. ప్రపంచదేశాల ఆంక్షలు, హెచ్చరికలు లక్ష్య పెట్టక తనదైన యుద్ధ వ్యూహ రచనతో ఉక్రెయిన్‌పై దాడి కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే ప్రపంచదేశాలన్ని పలు ఆంక్షలతో రష్యాని కట్టడిచేసేందుకు ప్రయత్నిస్తోంది. అంతేకాక బ్యాంకులను దిగ్బంధం చేసి స్విఫ్ట్ కొరడ ఝళిపించేందుకు యత్నిస్తోంది. దీంతో ఇప్పుడు పుతిన్ సుమారు రూ.7 లక్షలకు పైగా విదేశీ కరెన్సీతో రష్యన్లు ఎవరు దేశం విడిచి పారిపోకుండా ఉండేలా నిషేధించారని ఉక్రెయిన్ స్థానిక మీడియా పేర్కొంది. అందుకు సంబంధించిన డిక్రి పై కూడా పుతిన్ సంతకం చేశారని తెలిపింది. ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు రష్యాపై అమెరికా దాని మిత్రదేశాలు, ఈయూ , ఇతర దేశాలు విధించిన ఆంక్షలను అనుసరించి పుతిన్ ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించింది. మరోవైపు యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయన్‌కు బహిరంగంగా తన మద్ధతను బలపరిచారు. రష్యాపై పోరాటంలో యూఎస్ ప్రమేయం లేదని చెప్పారు. అయితే తమ దేశం తన మిత్రదేశాలతో కలిసి నాటో భూభాగాలను కాపాడుతుందని చెప్పారు. ఈ మేరకు జోబైడెన్ మాట్లాడుతూ...ఉక్రేనియన్లు స్వచ్ఛమైన ధైర్యంతో పోరాడుతున్నారని,రాబోయే కొద్ది రోజులు, వారాలు లేదా నెలలు వారికి కఠినంగా ఉండొచ్చు. అంతేకాదు పుతిన్ ఉక్రెయిన్ రాజధాని కైవ్‌ను ట్యాంకులతో చుట్టు ముట్టవచ్చునేమో కానీ ఉక్రెయిన్ ప్రజల మనస్సులను గెలవలేడు. ప్రపంచ దేశాల ధృఢ సంకల్పాన్ని పుతిన్ ఎన్నటికీ బలహీనపరచలేడు అని అన్నారు. (చదవండి: మెళ్లకు మైళ్లు నడిచి..) -
కేంద్రం సంచలన నిర్ణయం.. ఆ వార్తా సంస్థ టీవీ, యాప్స్‌పై నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. సిక్కు వేర్పాటువాద సంస్థతో సంబంధాలు కలిగి ఉన్న ‘పంజాబ్ పాలిటిక్స్ టీవీ’పై కేంద్ర ప్రభుత్వం కేంద్రం కొరడా ఝుళిపించింది. సదరు వార్తా సంస్థకు చెందిన వెబ్సైట్, యాప్‌లు, సోషల్ మీడియా అకౌంట్లను నిషేధించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. అయితే, నిఘా వర్గాల సమాచారం మేరకు Sikhs For Justice (SFJ)తో ఆ వార్తా సంస్థకు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఇదిలా ఉండగా.. ఈ ఛానెల్ ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా తప్పుడు వార్తలను ప్రసారం చేసినట్టు నిఘా వర్గాలు తెలిపాయని కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో, ఐటీ నిబంధనల్లోని అత్యవసర అధికారాలను ఉపయోగించి వార్తా సంస్థపై నిషేధం విధించినట్టు కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. Ministry of Information & Broadcasting has ordered blocking of apps, website, and social media accounts of foreign-based “Punjab Politics TV” having close links with Sikhs For Justice — ANI (@ANI) February 22, 2022 -
చైనాకు భారత్ మరో షాక్.. 54 చైనా యాప్‌లపై నిషేధం
న్యూఢిల్లీ: దేశ భద్రతకు, ప్రైవసీకి ప్రమాదంగా మారుతున్నాయంటూ మరో 54 చైనా మొబైల్ యాప్‌లను సోమవారం కేంద్రం నిషేధించింది. కేంద్ర హోం శాఖ సిఫార్సు మేరకు ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ మధ్యంతర ఉత్తర్వులిచ్చినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ‘‘ఈ యాప్స్ యూజర్ల తాలూకు వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేస్తున్నాయని, ఎప్పటికప్పుడు శత్రు దేశపు సర్వర్లకు పంపుతున్నాయి. తద్వారా దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి సమస్యగా మారాయి. దేశ రక్షణకు కూడా ముప్పుగా తయారయ్యాయి’’ అని వివరించాయి. గెరెనా ఫ్రీ ఫైర్–ఇల్యుమినేట్, టెన్సెంట్ ఎక్స్‌రివర్, నైస్‌వీడియో బైదు, వివా వీడియో ఎడిటర్, బ్యూటీ కెమెరా: స్వీట్ సెల్ఫీ హెచ్డీ, మ్యూజిక్ ప్లేయర్, మ్యూజిక్ ప్లస్, వాల్యూమ్ బూస్టర్, వీడియో ప్లేయర్స్, యాప్‌లాక్, మూన్‌చాట్, బార్కోడ్ స్కానర్–క్యూఆర్ కోడ్‌స్కాన్ వంటివి ఈ జాబితాలో ఉన్నట్టు వివరించాయి. -
ఏ భర్తకు ఇటువంటి కష్టం రాకూడదు!
Australian Man Banned From Leaving Israel: ఇటీవల కాలంలో రకరకాల విడాకులు చట్టాలు గురించి విన్నాం. అయితే వాటిలో భార్యకు విడాకులు ఇవ్వాలంటే అత్యంత పెద్ద మొత్తంలో భరణం ఇవ్వడం వంటివి చూశాం. కానీ ఇక్కడ ఒక దేశంలో భరణం పూర్తిగా చెల్లించేంత వరకు దేశం విడిచి పెట్ట వెళ్లకుండా నిషేధించారు. (చదవండి: ప్రపంచపు తొలి డ్యూయల్ మోడ్ వాహనం) అయితే అసలు విషయంలోకెళ్లితే....ఆస్ట్రేలియన్‌కి చెందిన 44 ఏళ్ల నోమ్ హుప్పెర్ట్ 2012లో తన పిల్లల కోసం అని తన భార్య కోసం ఇజ్రాయెల్ దేశానికి వెళ్లాడు. అయితే అతని భార్య ఇజ్రాయెల్ కోర్టులో విడాకుల కేసు వేసింది. దీంతో కోర్టు 2013లో హుప్పెర్ట్కి వ్యతిరేకంగా "స్టే-ఆఫ్-ఎగ్జిట్"(దేశాన్ని విడిచి వెళ్లకూడదు) ఆర్డర్‌ని జారీ చేసింది. అంతే కాదు పిలల్లకు 18 ఏళ్లు వచ్చే వరకు ప్రతి నెల రూ లక్ష భరణం చెల్లించాల్సి ఉంటుంది. ఈ కారణంగా అతను దేశాన్ని విడిచిపెట్టడానికి వీలు లేకుండా ఆదేశాలు జారీ చేసింది. అంటే హుప్పెర్ట్ పిల్లల భవిష్యత్తు ఖర్చుల నిమిత్తం సుమారు రూ 18 కోట్లు చెల్లించాలి. ఈ మొత్తం చెల్లించేంత వరకు హుప్పెర్ట్ డిసెంబర్ 31, 9999వ సంవత్సవరం వరకు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లకుండా ఇజ్రాయెల్ కోర్టు నిషేధించింది. పైగా సెలవు కారణంగానో లేక పని మీదనో కూడా వెళ్లడానికి వీల్లేదు. అంతేకాదు ఒకసారి ఇజ్రాయెల్ కోర్టు నుంచి ఇలాంటి ఆదేశాలు(నో ఎగ్జిట్ ఆర్డర్) వచ్చిన వాళ్లు కనీసం 21 రోజులు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అయితే ఫార్మాస్యూటికల్ కంపెనీకి సంబంధించిన రసాయన శాస్త్రవేత్త అయిన హుప్పెర్ట్ దీనిపై ఆవేదన వ్యక్తం చేశాడు.. ఇజ్రాయెల్ వివాహ చట్టాలు చాలా కఠినమైనవని పైగా పురుషుల ఆర్థిక పరిస్థితి పై కోర్టు ఎటువంటి విచారణ జరపకుండా పురుషుల ఆదాయంలో 100 శాతం చెల్లించాల్సిందేనని ఆదేశిస్తుందని అని తన గోడు బ్రిటీష్ మీడియాకి వెల్లబోసుకున్నాడు.. (చదవండి: ప్రధాని మోదీ విరాళం ఎంతో తెలుసా!!) -
గూగుల్ ప్లే స్టోర్‌లో అలజడి..! భారీగా నిషేధం..!
Google Banned 150 Malicious Apps:గూగుల్ ప్లే స్టోర్‌లో పలు ప్రమాదకరమైన యాప్స్ ఉన్నట్లు గూగుల్ గుర్తించింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి సుమారు 150 ప్రమాదకరమైన యాప్‌లను నిషేధించింది. ఈ యాప్స్ అల్టీమాఎస్‌ఎమ్‌ఎస్ అనే ప్రచారంలో 150 హానికరమైన మెసేజేస్ యాప్స్ ఉన్నట్లు గూగుల్ గుర్తించి వాటిపై చర్యలను తీసుకుంది. ఈ హానికరమైన యాప్స్‌ను వాడుతున్న వారిలో ఎక్కువగా నటీనటులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అప్లికేషన్లు ప్లే స్టోర్ నుంచి సుమారు 10.5 మిలియన్ కంటే ఎక్కువ మంది డౌన్లోడ్ చేశారని గూగుల్ పేర్కొంది. చదవండి: యాపిల్ నెంబర్ 1 స్థానంపై కన్నేసిన మైక్రోసాఫ్ట్..! అసలు ఏంటీ అల్టీమాఎస్‌ఎమ్‌ఎస్..! సైబర్‌నేరస్తులు కొత్త పుంతలు తొక్కుతూ పలు హానికరమైన యాప్స్‌ను తయారుచేసి వాటిని గూగుల్ ప్లే స్టోర్‌లో వచ్చేలా చేశారు. ఈ యాప్స్ ద్వారా తక్కువ ధరలోనే పలు ప్రీమియం ఎస్ఎమ్ఎస్ సేవలను అందిస్తామని యాప్స్ ప్రచారం చేసుకుంటాయి. ఈజిప్ట్, సౌదీ అరేబియా, పాకిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, టర్కీ, ఒమన్, ఖతార్, కువైట్, యునైటెడ్ స్టేట్స్, పోలాండ్లోని ఆండ్రాయిడ్ వినియోగదారులు ఎక్కువగా ప్రభావితమైనట్లుగా తెలుస్తోంది. ప్రీమియం సేవలను అందించడంతో పాటుగా యూజర్లు డబ్బులు సంపాదించే అవకాశం వస్తోందంటూ యూజర్లకు ఆఫర్లను అందిస్తాయి. గూగుల్ బ్యాన్ చేసిన యాప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. అల్టీమాఎస్‌ఎమ్‌ఎస్ యాప్స్‌తో యూజర్ల డేటాను హ్యకర్లు చోరీ చేస్తారు. ప్రముఖ యాంటీ వైరస్ బ్లాగ్ అవాస్థ్ ప్రకారం...ప్లే స్టోర్ నుంచి యూజర్లు యాప్స్‌ను డౌన్లోడ్ చేసినప్పుడు..వారి లోకేషన్‌ను, ఫోన్ ఐఎమ్ఈఐ నంబర్, ఫోన్ నంబర్‌ను సేకరిస్తుంది.వారి మెయిల్ అడ్రస్‌ను కూడా హ్యకర్లు తమ చేతికి చేజిక్కించుకుంటున్నట్లు అవాస్థ్ పేర్కొంది. చదవండి:ప్రజలకు రెవోస్ కంపెనీ బంపర్ ఆఫర్.. రూ.1కే ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్! -
ప్లాస్టిక్‌పై మరో సమరం
సాక్షి, హైదరాబాద్: పర్యావరణానికి హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగంపై పురపాలక శాఖ యుద్ధం ప్రకటించింది. 75 మైక్రాన్లలోపు మందం కలిగిన క్యారీ బ్యాగులు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ క్రయవిక్రయాలు, వినియోగంపై గురువారం నుంచి రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో నిషేధాన్ని విధించింది. ఈ నెల 14 నుంచి వచ్చే ఏడాది జూన్ 30 వరకు ఈ నిషేధం అమలుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయనుంది. వచ్చే ఏడాది జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు 120 మైక్రాన్లలోపు మందం కలిగిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగులపై నిషేధం విధించనుంది. నిషేధం అమల్లోభాగంగా చేపట్టాల్సిన కార్యక్రమాలకు గడువులను ప్రకటిస్తూ పురపాలక శాఖ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని పురపాలికలు కూడా నోటిఫికేషన్ జారీ చేశాయి. ఇప్పటివరకు 50 మైక్రాన్లలోపు మందం కలిగిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగులపై నిషేధం ఉంది. గత సెప్టెంబర్ 30 నుంచి 75 మైక్రాన్లలోపు, వచ్చే ఏడాది డిసెంబర్ 31 నుంచి 120 మైక్రాన్లలోపు మందం కలిగిన ప్లాస్టిక్ బ్యాగుల వినియోగంపై నిషేధాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. టాస్క్‌ఫోర్స్ కమిటీల ఏర్పాటు నిషేధాన్ని కఠినంగా అమలు చేసేందుకు మున్సిపల్ కమిషనర్, హెల్త్ ఆఫీసర్, శానిటరీ సూపర్వైజర్, శానిటరీ ఇన్స్పెక్టర్, పోలీసు కానిస్టేబుల్, ఇద్దరు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో అన్ని పురపాలికల్లో టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏర్పాటయ్యాయి. ఈ నెల 22 నుంచి వారంపాటు దాడులు జరిపి నిషేధిత ప్లాస్టిక్ వినియోగిస్తున్న వారిపై జరిమానా విధించనుంది. 25 నుంచి నెలకోసారి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, పెద్ద సముదాయాలపై దాడులు నిర్వహించనుంది. ఆలోగా నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచారం నిర్వహించనున్నారు. ఇక చెత్త వేస్తే జరిమానా పురపాలికల్లోని వాణిజ్య ప్రాంతాలను ఈనెల 31 నుంచి చెత్తరహిత ప్రాంతాలుగా పురపాలికలు ప్రకటించనున్నాయి. ఆ తర్వాత వాణిజ్య ప్రాంతాల్లోని రోడ్లపై చెత్తను పడేసే వారిపై జరిమానా విధించనున్నాయి. రోజుకు 100 కిలోలకుపైగా వ్యర్థాలను ఉత్పత్తి చేసే వాణిజ్య సముదాయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్‌హాళ్లు, కూరగాయాల మార్కెట్లు ఇకపై ఆన్సైట్ కంపోస్టింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. లేని పక్షంలో నవంబర్ 10 నుంచి జరిమానా విధించనున్నారు. కాలనీలు, వెల్ఫేర్ అసోసియేషన్లు, అపార్ట్మెంట్లు సైతం విధిగా తడి, పొడి చెత్తను వేరుగా నిర్వహించాలి. ఆన్సైట్లో కంపోస్టింగ్ చేపట్టని పక్షంలో నవంబర్ 28 నుంచి వీటిపై సైతం జరిమానా విధించనున్నారు. నవంబర్ 28 నుంచి గుర్తించిన కాలనీలను చెత్తరహిత ప్రాంతాలుగా ప్రకటించి, చెత్త పడేసే వారిపై జరిమానా వడ్డించనున్నారు. -
ఆర్గానిక్ సాగుతో శ్రీలంక కొత్త చరిత్ర
రసాయనిక ఎరువులు, పురుగుమందుల దిగుమతులను నిషేధించడం ద్వారా శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే పర్యావరణ హితమైన ఆహారోత్పత్తులు, ఆర్గానిక్ సాగుపై విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. రసాయనిక ఎరువులను, పెస్టిసైడ్స్‌ని నిషేధించిన మొట్టమొదటి దేశం శ్రీలంక. తమ ప్రయోజనాలకు గండి పడుతోందన్న విషయం గ్రహించిన అంతర్జాతీయ వాణిజ్య వ్యవసాయ సంస్థలు... ఆర్గానిక్ ఉత్పత్తుల వల్లే శ్రీలంకలో ఆహార సంక్షోభం ఏర్పడిందంటూ ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ అంతర్జాతీయంగా ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో శ్రీలంక తప్పకుండా లబ్ధి పొందుతుంది. తన పంటలకు ఆర్గానిక్ ట్యాగ్ ద్వారా ప్రపంచ మార్కెట్లో శ్రీలంక ప్రభంజనం సృష్టించగలదు. రసాయనిక ఎరువులు, పురుగుమందులను సంపూర్ణంగా నిషేధిస్తూ ఆర్గానిక్ ఆహారోత్పత్తుల వైపు అడుగు వేస్తూ శ్రీలంక తీసుకున్న విప్లవాత్మక నిర్ణయానికి వ్యతిరేకంగా ఊహించినట్లే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్గానిక్ పంటలపై అవే వాదనలు, అవే మానసిక భయాలు, ప్రపంచాన్ని తిరోగమనం పాలుచేసిన నకిలీ సైద్ధాంతిక ఆలోచనలు! ప్రపంచ వ్యవసాయ వాణిజ్య దిగ్గజాల సాధికారిక సమతుల్యతను ఎవరైనా విచ్ఛిన్నపరుస్తున్నారని పసిగడితే చాలు.. పదేపదే వారికి వ్యతిరేకంగా నిరసనలు, వ్యతిరేకతల రొద మిన్నుముట్టడం మనకు తెలిసిందే. ఆరోగ్యకరమైన, మరింత నిలకడైన, న్యాయబద్ధమైన ఆహార వ్యవస్థల వైపు వెళ్లవలసిన అవసరాన్ని ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవస్థల సదస్సు ఇంకా గుర్తించకముందే, కొన్ని నెలల క్రితం శ్రీలంక సాహసోపేతమైన చర్యకు శ్రీకారం చుట్టింది. రసాయనిక ఎరువులు, పురుగుమందుల దిగుమతులను నిషేధించడం ద్వారా వ్యవసాయ పర్యావరణ పరివర్తన అనే భావనను ఎంతోముందుగా ఆచరణలోకి తెచ్చింది. మే 6న దేశాధ్యక్షుడి అధికార ప్రకటన ద్వారా ఆర్గానిక్ ఆహార ఉత్పత్తుల వైపు తొలి అడుగు వేసిన దేశంగా శ్రీలంక చరిత్రకెక్కింది. అంతకుముందు పామ్ ఆయిల్ దిగుమతులపై నిషేధం విధించి, ఇప్పటికే సాగు చేస్తున్న పామాయిల్ తోటలను దశలవారీగా తొలగించాలని ఆదేశాలు జారీచేసి ఆరోగ్యకరమైన, స్థిరమైన భవిష్యత్తు వైపు గొప్ప నిబద్ధతను ప్రదర్శించింది. సెప్టెంబర్ 22న న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సే మాట్లాడుతూ, శ్రీలంక జాతీయ విధాన చట్రంలో స్వావలంబన ఒక మైలురాయిగా అభివర్ణించారు. నేల ఫలదీకరణ, జీవ వైవిధ్యం, జల మార్గాలు, ఆరోగ్యం వంటివాటిపై ప్రభావం కారణంగా తమ ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రారంభంలోనే రసాయనిక ఎరువులు, పురుగుమందుల ఉపయోగాన్ని నిషేధించిందని పేర్కొన్నారు. శ్రీలంక భారీ స్థాయిలో విదేశీ రుణ ఊబిలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ప్రభుత్వ రాబడిలో 80 శాతం విదేశీ అప్పులు తీర్చడానికే వెచ్చించాల్సి వస్తోంది. అదే సమయంలో స్వదేశంలో తీవ్రమైన ఆహార పదార్థాల కొరతను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఆర్గానిక్ వ్యవసాయం చేబడితే ఆహార పదార్థాల ఉత్పత్తి తగ్గిపోయి ఆహార సంక్షోభం ఏర్పడక తప్పదంటూ నడుస్తున్న విష ప్రచారానికి వ్యతిరేకంగా శ్రీలంక అధ్యక్షుడు తన నిర్ణయానికి గట్టిగా కట్టుబడి ఉన్నారు. 1980లలో ఇండోనేషియా అధ్యక్షులు సుహార్తో ఒక్క కలం పోటుతో, వరి సాగుకు ఉపయోగిస్తున్న 57 రసాయనిక పురుగుమందులపై నిషేధం విధించినప్పుడు కొద్ది రోజులలోపే ఆయనపై పెట్టిన తీవ్ర ఒత్తిడి ఈ సందర్భంగా నాకు మళ్లీ గుర్తుకొచ్చింది. నిజానికి మే నెల ప్రారంభంలోనే శ్రీలంకలో రసాయనిక ఎరువులు, పురుగు మందులపై నిషేధం అమలులోకి వచ్చింది. అప్పటినుంచి ఒక పంట సీజన్ మాత్రమే పూర్తయింది. ఆ సీజన్లో వరినాట్లు మేలో మొదలై ఆగస్టులో పంటకోతలు పూర్తయ్యాయి. అయితే పంట ఇంకా మార్కెట్లోకి రాకముందే శ్రీలంకలో పంట దిగుబడులు తగ్గిపోయాయనే భయాందోళనలను వ్యాపింపజేయడానికి రసాయనిక ఎరువులు, పురుగుమందుల లాబీ పూనుకుంది. సాధారణంగా రసాయనిక ఎరువులను ఉపయోగించడం నిలిపివేశాక రెండు లేక మూడో సంవత్సరం వరకు మాత్రమే పంట దిగుబడులు కాస్త తగ్గుముఖం పట్టి నెమ్మదిగా మళ్లీ పెరగటాన్ని మనం చూస్తాం. రసాయన ఎరువులు, పురుగుమందులతో సాగే వ్యవసాయం కారణంగా సంభవించే దుష్ఫలితాలు సమాజం తప్పనిసరిగా చెల్లించవలసిన మూల్యంగా భావిస్తుంటారు. మరోమాటలో చెప్పాలంటే ఉత్తర శ్రీలంకలో వరి అధికంగా పండే ప్రాంతంలో, గ్రామీణ పేదల్లో మూత్ర పిండాలు భారీ స్థాయిలో విఫలం కావడానికి రసాయనిక ఎరువులు, పురుగుమందులను మోతాదుకు మించి వాడటమేనని ఎక్కువమంది నమ్ముతున్నారు. కానీ మూత్రపిండాల వైఫల్యానికి, రసాయనిక ఎరువుల వాడకానికి మధ్య ఉన్న లింకును పలువురు నిపుణులు పరిగణనలోకి తీసుకోవడం లేదు. శ్రీలంకలో దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి కారణంగా 20 వేలకంటే ఎక్కువమంది చనిపోయారనీ, గత 20 ఏళ్లుగా 4 లక్షలమంది వ్యాధిగ్రస్తులయ్యారనీ ‘ది ఇండిపెండెంట్’ నివేదిక చెబుతోంది. దేశంలో రెండో అతిపెద్ద ఎగుమతి సరుకైన తేయాకు విషయాన్ని పరిశీలిస్తే, అనవసరమైన పుకార్లు, భయాలను వ్యాప్తి చేశారు. నిజానికి తేయాకు దిగుబడులు శ్రీలంకలో చాలా తక్కువగానే ఉన్నాయి. కానీ గత దశాబ్దికాలంలో తేయాకు పంట దిగుబడి నిరంతరం తగ్గుముఖం పడుతూనే వస్తోంది. చాలా ప్రాంతాల్లో ఎకరాకు 350 నుంచి 400 కేజీలకు తేయాకు పంట పడిపోగా, కొన్ని సందర్భాల్లో ఎకరాకు 150 కేజీల తేయాకు పంట మాత్రమే సాధ్యమయింది. దేశంలో తేయాకు పంట దిగుబడులు తగ్గడానికి ప్రధాన కారణాల్లో నేల కోత ఒకటి. ఈ నేపథ్యంలో పూర్తిగా ఆర్గానిక్ సాగుకు మళ్లితే దాని ప్రయోజనం రాబోయే సంవత్సరాల్లో మాత్రమే కనిపిస్తుంది. వ్యవసాయ పర్యావరణానికి కట్టుబడటం ద్వారా శ్రీలంక నేల ఆరోగ్యాన్ని పరిరక్షించగలదు, తద్వారా తేయాకు తోటలను పునరుజ్జీవింప చేయగలదు. తన పంటలకు ఆర్గానిక్ ట్యాగ్ ద్వారా ప్రపంచ మార్కెట్లో శ్రీలంక ప్రభంజనం సృష్టించగలదు. అంతర్జాతీయంగా ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఆర్గానిక్ సాగు చేపడుతున్న మొదటి దేశంగా శ్రీలంక తప్పకుండా లబ్ధి పొందే స్థానంలో ఉంటుంది. అయితే ఈ పరివర్తనకు మార్గదర్శకం చేయడానికి శ్రీలంక సరైన చర్యలు చేపట్టవలసి ఉంది. ప్రస్తుతం శ్రీలంక ముందున్న సవాల్ ఏమిటంటే, తన పరిశోధన, అభివృద్ధి, పంటల పట్ల వైఖరిని సరికొత్తగా రూపొందించుకోవడమే. ఇందుకోసం విద్యాపరమైన కరిక్యులమ్‌ని మార్చడం ద్వారా జాతీయ వ్యవసాయ పరిశోధనా కార్యక్రమాలకు కొత్త రూపం ఇవ్వాల్సి ఉంది. వ్యవసాయ పరిశోధన కూడా కమ్యూనిటీ జ్ఞానాన్ని, ఆయా సామాజిక బృందాల సృజనాత్మక ఆవిష్కరణలను నిర్ధారించి, పరిరక్షించడంపై దృష్టి సారించాల్సి ఉంది. ప్రత్యేకించి పర్యావరణ మార్పులోని సంక్లిష్టతలను పరిష్కరించడం, సాంప్రదాయిక పంటల రకాలను, లభ్యమవుతున్న సుసంపన్నమైన వైవిధ్యతలను పరిరక్షించగలిగితే అది మొత్తం వ్యవసాయానికి గట్టి స్థిరత్వాన్ని తెచ్చిపెడుతుంది. మరీ ముఖ్యంగా ఆర్గానిక్ సాగు ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేయాల్సి ఉంది. బలవంతంగా ఆర్గానిక్ వ్యవసాయం వైపు మళ్లాలని రైతులను బలవంతపెడితే దీర్ఘకాలంలో అది పెద్దగా పనిచేయదు. వ్యవసాయ పర్యావరణం, ఆర్గానిక్, సహజ, జీవవైవిధ్యతతో కూడిన వ్యవసాయ వ్యవస్థలు ప్రపంచం మొత్తానికి ఆహారాన్ని అందించగలవా అని చాలామందికి సందేహాలు పుట్టుకొస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి ఆహార, వ్యవసాయ సంస్థ అత్యున్నత స్థాయి నిపుణుల ప్యానెల్ 2019లో వెలువరించిన ఒక నివేదిక వీటికి పరిష్కార మార్గాలను సూచించింది. వ్యవసాయ పర్యావరణ హితంతో కూడిన సాగు వ్యవస్థలు తీసుకొచ్చే ఆర్థిక ప్రయోజనాలను గురించి ఈ ప్యానెల్ సవివరంగా పేర్కొంది. ప్రత్యేకించి రఫేల్ డి అన్నోల్పో 2017లో చేసిన ఒక విశ్లేషణ ప్రకారం 61 శాతం కేసుల్లో ఆర్గానిక్ వ్యవసాయ దిగుబడులు పెరిగినట్లు, 20 కేసుల్లో మాత్రమే ఈ దిగుబడులు తగ్గుముఖం పట్టినట్లు తేటతెల్లమైంది. కాగా 66 శాతం కేసుల్లో ఆర్గానిక్ సాగు లాభదాయకత పెరిగిందని కూడా తెలిపింది. కాబట్టి ఆర్గానిక్ సాగు చేపట్టడానికి కావలిసింది సాహసం మాత్రమే. దేన్నయినా నమ్మినప్పుడు మాత్రమే దాని ప్రయోజనాలు సిద్ధిస్తాయి. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే ఆర్గానిక్ సాగు పట్ల నిబద్ధత కలిగి ఉండటం అనేది అంతర్జాతీయంగానే వ్యవసాయ భవిష్యత్తుకు తలుపులు తెరిచే అవకాశం ఉంది. దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహారం, వ్యవసాయరంగ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
ఆగస్టులో 20లక్షల వాట్సప్ అకౌంట్ల నిషేధం
న్యూఢిల్లీ: ఆగస్టులో దాదాపు 20 లక్షలకు పైగా భారతీయ అకౌంట్లను నిషేధించామని వాట్సప్ తెలిపింది. గతనెల తమకు 420 ఫిర్యాదులు అందాయని కంపెనీ నెలవారీ అనువర్తననివేదిక(మంత్లీ కంప్లైయన్స్ రిపోర్టు)లో వెల్లడించింది. నిషేధిత 20లక్షల 70వేల అకౌంట్లలో అధికశాతం అకౌంట్లను బల్క్ మెసేజ్‌లను అనధీకృతంగా వాడినందున(స్పామ్) నిషేధించామని తెలిపింది. ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 80 లక్షల అకౌంట్లను తొలగించామని తెలిపింది. తమకందిన 420 ఫిర్యాదుల పరిశీలన అనంతరం 41 అకౌంట్లపై తగిన చర్యలు తీసుకున్నామని పేర్కొంది. జూన్16–జూలై 31 కాలంలో ఇండియాలో సుమారు 30 లక్షల అకౌంట్లను వాట్సప్ నిషేధించింది. 594 ఫిర్యాదులు అందినట్లు తెలిపింది. మేలో వచ్చిన నూతన ఐటీ నిబంధనలను అనుసరించి వాట్సప్ తదితర సోషల్ మీడియా సంస్థలు నెలవారీ నివేదికలను విడుదల చేస్తున్నాయి. ఆగస్టులో సుమారు 3.17 కోట్ల కంటెట్ భాగాలపై, జూన్16– జూలై 31 కాలంలో 3.33 కోట్ల కంటెంట్ భాగాలపై చర్యలు తీసుకున్నామని సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తెలిపింది. ఇన్స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్ సుమారు 22 లక్షల కంటెంట్ పీసెస్‌పై చర్యలు తీసుకుంది. ఆగస్టులో తమకు 904 యూజర్ ఫిర్యాదులు వచ్చాయని ఫేస్బుక్ తెలిపింది. వీటిలో 754 ఫిర్యాదులను పరిష్కరించారు. చదవండి: (వాట్సాప్‌లో రూపాయి సింబల్ ఫీచర్..ఎందుకంటే) -
వర్చువల్ కరెన్సీలపై చైనా ఉక్కుపాదం
-
మగపిల్లలకు మహిళా టీచర్లు బోధించొద్దు
పాత పరిపాలనను గుర్తు చేస్తూ తాలిబన్లు విధాన నిర్ణయాలను ప్రకటిస్తున్నారు. తాజాగా హెరాత్ ప్రావిన్స్‌లోని పాఠశాలలు, యూనివర్సిటీల్లో కోఎడ్యుకేషన్‌ను నిషేధిస్తున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. సమాజంలో అన్ని అనర్థాలకు కోఎడ్యుకేషనే కారణమని, అందుకే దీన్ని నిషేధిస్తున్నామని తాలిబన్లు తెలిపారు. పలువురు ప్రొఫెసర్లు, ప్రైవేటు కాలేజీల అధిపతులతో చర్చించిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నామని తాలిబన్ వర్గాలు వెల్లడించాయని ఖామా ప్రెస్ ఏజెన్సీ తెలిపింది. అఫ్గాన్ స్వాధీనం చేసుకున్న అనంతరం తాలిబన్లు జారీ చేసిన తొలి ఫత్వా ఇదే! చదవండి: తాలిబన్ల పైశాచికత్వం: వంట బాలేదని మంటల్లో వేశారు మగపిల్లలకు మహిళా టీచర్లు బోధించొద్దు ఉన్నత విద్యపై తాలిబన్ ప్రతినిధి ముల్లా ఫరీద్ మూడుగంటలు ఈ చర్చలు జరిపారు. కోఎడ్‌కు ప్రత్యామ్నాయం లేదని, దీన్ని నిలిపివేయడమే మార్గమని అభిప్రాయపడ్డారు. అలాగే మహిళా ఉపాధ్యాయులు కేవలం మహిళా విద్యార్థులకే బోధించాలని, మగ విద్యార్థులకు బోధించకూడదని ఆదేశించారు. పౌర పాలనలో అఫ్గాన్ ప్రభుత్వాలు పలు యూనివర్సిటీలు, కాలేజీలు, పాఠశాలలు స్థాపించి కోఎడ్‌ను ప్రోత్సహించాయి. తాలిబన్ల తాజా నిర్ణయంతో ప్రైవేట్ విద్యాసంస్థలకు ఇబ్బందులు ఎక్కువని నిపుణులు భావిస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం దేశంలోని వివిధ యూనివర్సిటీలు, కాలేజీల్లో సుమారు 40 వేల మంది విద్యార్థులు, 2వేల మంది బోధనా సిబ్బంది ఉన్నారు. షరియా చట్టం కింద మహిళా హక్కులు గౌరవిస్తామని ఈవారం ఆరంభంలో తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ విలేకరుల సమావేశంలో అట్టహాసంగా ప్రకటించారు. అయితే గతంలో తమ విధానాలనే తాలిబన్లు కొనసాగించేందుకు నిర్ణయించుకున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. -
తాలిబన్‌పై ఫేస్బుక్ నిషేధం
లండన్: తాలిబన్ ముఠాను ఉగ్రవాద సంస్థగా తాము పరిగణిస్తున్నట్లు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ప్రకటించింది. తాలిబన్ ఉగ్రవాదులను సమర్థించే అన్ని రకాల సమాచారాన్ని(కంటెంట్) నిషేధిస్తున్నట్లు, దాన్ని తమ వేదిక నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్లు స్పష్టం చేసింది. తాలిబన్లను సంబంధించిన సమాచారాన్ని పరిశీలించి, తొలగించడానికి అఫ్గానిస్తాన్ నిపుణులతో కూడిన బృందం తమ సంస్థలో ఉందని తెలిపింది. తాలిబన్లు చాలా ఏళ్లుగా తమ భావజాలం, సందేశాలను ప్రజలకు చేరవేయడానికి సోషల్ మీడియాను చురుగ్గా ఉపయోగించుంటున్నారు. ‘‘అమెరికా చట్టాల కింద తాలిబన్ల ముఠాను ఉగ్రవాద సంస్థగా నిర్ధారించారు. డేంజరస్ ఆర్గనైజేషన్ పాలసీల కింద మా సేవల నుంచి తాలిబన్లను నిషేధించాం. తాలిబన్లు నిర్వహించే, వారి తరపున నిర్వహించే ఫేస్బుక్ ఖాతాలను తొలగించాం. మా సోషల్ మీడియా వేదికలో వారిని ప్రశంసించడాన్ని, సమర్థించడాన్ని, వారి తరపున వాదించడాన్ని మేము నిషేధించాం’’ అని ఫేస్బుక్ అధికార ప్రతినిధి ఓ వార్తా సంస్థతో చెప్పారు. దేశాల ప్రభుత్వాలను గుర్తించడంపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఈ విషయంలో అంతర్జాతీయ సమాజాన్ని అనుసరిస్తామని చెప్పారు. తాలిబన్ల కంటెంట్‌పై నిషేధం ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌లో సైతం అమలవుతుందని వెల్లడించారు. అయితే, తాలిబన్లు వాట్సాప్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై వాట్సాప్ యాజమాన్యం స్పందిస్తూ... తాలిబన్లకు సంబంధించిన ఖాతాలు ఏవైనా ఉంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. -
రెజ్లర్ సుమిత్‌పై నిషేధం
న్యూఢిల్లీ: డోపింగ్‌లో పట్టుబడిన కామన్వెల్త్గేమ్స్ చాంపియన్, భారత రెజ్లర్ సుమిత్ మాలిక్‌పై నిషేధం విధించారు. దీంతో 28 ఏళ్ల హరియాణా రెజ్లర్ ఒలింపిక్స్ ఆశలకు దాదాపు తెరపడినట్లే. అతను అప్పీల్ చేసుకునేందుకు ఒక వారం గడువిచ్చినప్పటికీ ఒలింపిక్స్ సమయానికల్లా ఈ విచారణ ముగిసే అవకాశాల్లేవు. గత నెల సోఫియాలో నిర్వహించిన ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో 125 కేజీల ఫ్రీస్టయిల్ కేటగిరీలో పోటీపడిన భారత రెజ్లర్ మెగా ఈవెంట్‌కు అర్హత సంపాదించాడు. కానీ ఆ పోటీ సందర్భంగా నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో అతను నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడంతో సస్పెన్షన్ వేటు వేశారు. తాజాగా ‘బి’ శాంపిల్‌ను కూడా పరీక్షించగా ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలింది. దీంతో ప్రపంచ రెజ్లింగ్ యూనియన్ (యూడబ్ల్యూడబ్ల్యూ) శుక్రవారం అతనిపై రెండేళ్ల నిషేధాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో చాంపియన్‌గా నిలిచిన సుమిత్ మాలిక్ అదే ఏడాది భారత ప్రభుత్వం నుంచి క్రీడాపురస్కారం ‘అర్జున’ అవార్డు అందుకున్నాడు. 2017లో న్యూఢిల్లీ ఆతిథ్యమిచ్చిన ఆసియా చాంపియన్‌షిప్, జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన కామన్వెల్త్ చాంపి యన్‌షిప్‌లలో అతను రన్నరప్‌గా నిలిచి రజత పతకాలు సాధించాడు. -
Nuwan Zoysa: మ్యాచ్ ఫిక్సింగ్.. మాజీ క్రికెటర్‌పై ఆరేళ్ల నిషేధం
దుబాయ్: శ్రీలంక మాజీ క్రికెటర్ నువాన్ జోయ్సాపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిషేధం విధించింది. మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో దోషిగా తేలడంతో ఆరేళ్లపాటు క్రికెట్ ఆడకుండా నిషేధిస్తూ ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఐసీసీ అవినీతి నిరోధక విభాగం నువాన్ జోయ్సా తప్పు చేసినట్లు నిర్ధారించింది. ఏడాదిన్నర కాలం నుంచి అతడిపై ఆరోపణలు ఉన్నాయి. టీ10 లీగ్‌లో చేసిన ఫిక్సింగ్ ఆరోపణలకుగానూ జోయ్సాపై నిషేధం విధించినట్లు తెలిపింది. శ్రీలంక తరపున1997-2007 మధ్య అంతర్జాతీయ క్రికెట్ ఆడిన జోయ్సా 30 టెస్టుల్లో 64 వికెట్లు.. 95 వన్డేల్లో 108 వికెట్లు తీశాడు కాగా జోయ్సాపై విధించిన ఆరేళ్ల నిషేధం 31 అక్టోబర్ 2018 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు ఐసీసీ యాంటీ కరప్షన్ ట్రిబ్యునల్ ప్రకటన చేసింది. ఆర్టికల్ 2.1.1 నిబందన ప్రకారం.. ఎవరైనా ఫిక్సింగ్ చేయడానికి యత్నించడం, ఇతరులను ఫిక్సింగ్ చేసేందుకు ప్రోత్సహించడం, మ్యాచ్ ఫలితాలు మార్చేందుకు యత్నించడం... ఆర్టికల్ 2.1.4 ప్రకారం, ఇతరులకు సూచనలు చేయడం, తప్పిదాలు చేసేందుకు ప్రోత్సహించడం, నేరుగా ఫిక్సింగ్‌కు పాల్పడటం, మ్యాచ్ ఫలితాలు మార్చివేసేందుకు యత్నించడం లాంటి యత్నాలు ఆర్టికల్ 2.1 కిందకి వస్తాయి. కాగా జోయ్సా ఐపీఎల్లో డెక్కన్ చార్జర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. చదవండి: యూఏఈ క్రికెటర్‌పై ఐసీసీ ఐదేళ్ల నిషేధం -
ఇండియాకు మాల్దీవులు షాక్.. అయోమయంలో బీటౌన్ లవ్‌బర్డ్స్
భారత్‌లో కరోనా వైరస్ రెండో దశ తీవ్రంగా విరుచుకుపడుతోంది. రోజూ మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో జర్మనీ, ఇటలీ, ఇరాన్, సింగపూర్, నెదర్లాండ్ , బంగ్లాదేశ్ వంటి దేశాలు ఇప్పటికే భారత ప్రయాణికులపై ఆంక్షలు విధించాయి. భారత్ నుంచి వచ్చే విమానాలు రద్దు చేశాయి. తాజాగా ఈ జాబితాలోకి మాల్దీవులు చేరింది. భారత్ నుంచి మాల్దీవులకు వచ్చే అన్ని విమానలను నిలిపివేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఈ మేరకు మాల్దీవులు పర్యాటక మంత్రిత్వశాఖ ట్విటర్ ద్వారా అధికారికంగా వెల్లడించింది. With effect from 27 April @HPA_mv suspends tourists travelling from #India to #Maldives from staying at tourist facilities in inhabited islands. We thank you for the support in our endeavour to make tourism safest possible with minimum inconvenience. — Ministry of Tourism (@MoTmv) April 25, 2021 ఆ ఆంక్షలు ఏప్రిల్ 27 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. భారత పర్యాటకులెవరూ మాల్దీవుల్లోని హోటళ్లు, రిసార్ట్లు, గెస్ట్ హౌజ్‌ల్లో బస చేయవద్దని నిషేధం విధించింది. తమ పర్యాటక రంగాన్ని సురక్షితంగా ఉంచడానికి చేస్తున్న ఈ ప్రయాత్నానికి మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ట్వీట్లో పేర్కొంది. అయితే బీటౌన్ తారలు, జాన్వీ కపూర్, దిశా పటాని, టైగర్ ష్రాఫ్‌తోపాటు మరికొంత మంది ఇటీవల వెకేషన్‌కు మాల్దీవులకు వెళ్లొచ్చారు. రణబీర్ కపూర్, అలియా భట్ కూడా కోవిడ్ -19 నుంచి కోలుకున్న వెంటనే మాల్దీవులు చుట్టొచ్చారు. అక్కడ దిగిన ఫోటోలను సైతం సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేశారు. మాల్దీవుల ప్రకటన అనంతరం బాలీవుడ్ సెలబ్రిటీలపై నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. ఫన్నీ మీమ్స్‌తో నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు. ఓ వైపు దేశమంతా కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రం తమ వినోదాల కోసం హాలీడే ట్రిప్పుల పేరుతో ఎంజాయ్ చేస్తున్నారని విరుచుకుపడుతున్నారు. దేశం తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే ట్రిప్పులు కవాల్సి వచ్చిందా అని విమర్శిస్తున్నారు. ఇండియా టూరిస్టులను మాల్దీవులు బ్యాన్ చేయడం మంచిపని అయ్యిందంటూ సంబరపడుతున్నారు. చదవండి: ‘తిండి లేక అల్లాడుతుంటే.. డబ్బులు నీళ్లలా ఖర్చుపెడుతున్నారు’ కరోనా బాధితులకే కరువైందంటే.. చేపలకు ఆక్సిజన్! With effect from 27 April @HPA_mv suspends tourists travelling from #India to #Maldives from staying at tourist facilities in inhabited islands. We thank you for the support in our endeavour to make tourism safest possible with minimum inconvenience. — Ministry of Tourism (@MoTmv) April 25, 2021 Maldives restricts entry of tourists from India Bollywood celebs rn: pic.twitter.com/Pa5ZU83lRu — Mawa_Jalebi 🦄 (@HighnPositive) April 26, 2021 Bollywood celebrities rushing for the Maldives while watching people in India die... #CovidIndia pic.twitter.com/KUFrVUixm1 — Delhi Decoded (@DelhiDecoded) April 26, 2021 Bollywood celebrities planning for tourism in Maldives Le Maldive's government suspends tourists from India :) pic.twitter.com/HYsTufAY2S — Anant (@Bihariladka_) April 26, 2021 View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) -
మావోయిస్టులపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: నిషేధిత మావోయిస్టు పార్టీపై మరో ఏడాదిపాటు నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. మావోయిస్టు పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న విరసం సహా 16 అనుబంధ సంఘాలపైనా వేటు వేసింది. పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ 1992 ప్రకారం వీటిపై మరో ఏడాదిపాటు నిషేధం కొనసాగుతుందని ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మార్చి 30న నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఈ విషయాన్ని శుక్రవారం వెల్లడించింది. అనుంబంధ సంఘాలివే.. తెలంగాణ ప్రజాఫ్రంట్ (టీపీఎఫ్), తెలంగాణ అసంఘటిత కార్మిక సమాఖ్య (టీఏకేఎస్), తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ), డెమొక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (డీఎస్‌యూ), తెలంగాణ విద్యార్థి సంఘం (టీవీఎస్), ఆదివాసీ స్టూడెంట్ యూనియన్ (ఏఎస్యూ), కమిటీ ఫర్ రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్ (సీఆర్పీపీ), తెలంగాణ రైతాంగ సమితి (టీఆర్ఎస్), తుడుందెబ్బ (టీడీ), ప్రజాకళామండలి (పీకేఎం), తెలంగాణ డెమొక్రటిక్ ఫ్రంట్ (టీడీఎఫ్), ఫోరం అగైనెస్ట్ హిందూ ఫాసిజం అఫెన్సివ్ (ఎఫ్‌ఏహెచ్‌ఎఫ్‌వో), సివిల్ లి బర్టీస్ కమిటీ (సీఎల్సీ), అమరుల బంధు మిత్రుల సంఘం (ఏబీఎంఎస్), చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్), విప్లవ రచయితల సంఘం (విరసం).. ఈ 16 సంస్థలు ప్రజాసంఘాల ముసుగులో ప్రజల్లోకి వెళ్లి మావోయిస్టు పార్టీ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ప్రభుత్వం ఆరోపించింది. చదవండి: వినూత్నం.. ఎంపీ, ఎమ్మెల్సీ గుర్రమెక్కి మరీ.. చదవండి: తెలంగాణ ఆదర్శం: వాయువేగాన ఆక్సిజన్ -
అవినీతి ఆరోపణలు.. మాజీ కెప్టెన్‌పై నిషేధం
దుబాయ్: జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్‌పై ఐసీసీ 8 ఏళ్ల పాటు నిషేధం విధించింది ఐసీసీ అవినీతి నిరోధక కోడ్‌ను ఐదుసార్లు ఉల్లంఘించినట్లు స్ట్రీక్‌పై ఆరోపణలు ఉన్నాయి. మొదట్లో ఈ ఆరోపణలను ఖండించిన స్ట్రీక్.. తాజాగా వాటిని అంగీకరించాడు. జింబాబ్వే తరపున హీత్ స్ట్రీక్ 189 వన్డేల్లో 239 వికెట్లు, 65 టెస్టుల్లో 216 వికెట్లు తీసి అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు. ఆటకు గుడ్‌బై చెప్పిన తర్వాత కోచ్‌గా వ్యవహరించిన హీత్ స్ట్రీక్ ఆ సమయంలోనే అవినీతికి పాల్పడినట్లు విచారణలో తేలింది. 2017, 2018లలో వివిధ మ్యాచ్‌ల సందర్భంగా అతడు తన టీమ్‌లోని ప్లేయర్స్ దగ్గరికి బుకీలను అనుమతించడాన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో కొన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా ఉండగా.. ఐపీఎల్, బీపీఎల్, ఆఫ్ఘనిస్థాన్ ప్రిమియర్ లీగ్‌లలోని మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్‌ల ఫలితాలపై అవి ఎలాంటి ప్రభావం చూపలేదని ఐసీసీ అవినీతి నిరోధక శాఖ స్పష్టం చేసింది. ఓ మాజీ కెప్టెన్, కోచ్‌గా ఎన్నో అవినీతి నిరోధక కౌన్సిలింగ్ సెషన్లకు హాజరైన స్ట్రీక్ ఇలా చేయడం బాధాకరమని ఐసీసీ జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ అన్నారు. చదవండి: మ్యాచ్ ఓడినందుకు షారుఖ్ క్షమాపణ.. స్పందించిన రసెల్ సుదీర్ఘ కాలంగా టాప్‌లో కోహ్లి; ఇప్పుడు అగ్రస్థానంలో పాక్ కెప్టెన్ -
ట్విట్టర్ నుంచి ట్రంప్ అవుట్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను శాశ్వతంగా నిషేధిస్తున్నట్టుగా సామాజిక మాధ్యమం ట్విట్టర్ ప్రకటించింది. ఒక దేశాధినేత అకౌంట్‌ని శాశ్వతంగా తొలగించడం ఇదే తొలిసారి. అమెరికా క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడికి దిగిన రెండు రోజుల తర్వాత ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజులుగా ట్విట్టర్ వేదికగా ట్రంప్ పెట్టే పోస్టులు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్విట్టర్ తెలిపింది. ఇప్పటికే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ట్రంప్ అధ్యక్షుడి హోదాలో ఉన్నంతవరకు ఆయన అకౌంట్‌ని బ్లాక్ చేస్తున్నట్టు ప్రకటించాయి. ‘కొద్ది రోజులుగా ట్రంప్ అకౌంట్ నుంచి వచ్చే ట్వీట్లను సమీక్షిస్తున్నాం. అవి ఎలా ప్రజల్లోకి వెళుతున్నాయి, ఏ విధంగా వాటిని అర్థం చేసుకునే అవకాశం ఉంది వంటి అంశాలను పరిశీలించాక అవి మరింతగా హింసను ప్రోత్సహించేలా ఉన్నాయని తేలింది’అని ట్విట్టర్ తెలిపింది. చూస్తూ ఊరుకోం: ట్రంప్ ట్విట్టర్ తీసుకున్న ఈ అసాధారణ నిర్ణయం తాను ఊహించిందేనని ట్రంప్ అన్నారు. ఈ విషయంలో తాను కానీ, తన మద్దతుదారులు కానీ చూస్తూ మౌనంగా ఊరుకోమని హెచ్చరించారు. తన అకౌంట్ నిషేధించాక ఆయన అమెరికా అధ్యక్షుడి హోదాలో అధికారిక ఖాతా ద్వారా వరస ట్వీట్లు చేశారు. ‘ట్విట్టర్లో స్వేచ్ఛగా భావాలను ప్రకటించే అవకాశం లేదు. రాడికల్ వామపక్ష భావజాలం కలిగిన వారినే ఆ సంస్థ ప్రోత్సహిస్తూ ఉంటుంది. వాక్ స్వాతంత్య్రాన్ని ఎప్పుడూ అడ్డుకుంటూ ఉంటుంది. అందుకే ఈ సారి కొత్త సామాజిక మాధ్యమం ద్వారా వస్తాను. వివిధ వెబ్సైట్లతో సంప్రదింపులు జరుపుతున్నాను’’అని ట్రంప్ తన ట్వీట్లలో పేర్కొన్నారు. ట్విట్టర్ చర్య నమ్మశక్యంగా లేదని ఇండియన్ అమెరికన్ పొలిటీషియన్ నిక్కీ హేలీ అన్నారు. 11న అభిశంసన? అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై అభిశంసనకు రంగం సిద్ధం అవుతోంది. క్యాపిటల్ హిల్‌పై దాడి ఘటన నేపథ్యంలో రాజీనామా చేయా లంటూ వెల్లువెత్తుతున్న డిమాండ్లను ట్రంప్ పెడచెవిన పెడుతుండటంపై డెమోక్రాట్లు ఆగ్రహంతో ఉన్నారు. త్వరలో బైడెన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనుండగా అంతకు ముందే అభిశంసనతో ట్రంప్‌ను సాగనంపే ప్రయత్నాలను వేగిరం చేశారు. తిరుగు బాటును ప్రేరేపించారనే కారణంతో చేపట్టే అభిశంసనకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయినట్లు మీడియా కథనాలు వెలువడుతున్నాయి. హౌస్‌లో అభిశంసన తీర్మానాలను ముగ్గురు కాంగ్రెస్ సభ్యులు సోమవారం ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని సీఎన్ఎన్ వర్గాలు తెలిపాయి. -
‘ఆన్లైన్ రమ్మీ’ కేసుల్లో పోలీసుల మీమాంస
సాక్షి, సిటీబ్యూరో: ఆన్లైన్లో ఆడి భారీ మొత్తం కోల్పోయినందుకు బాధితులా..? రాష్ట్రంలో నిషేధం ఉన్న ఈ గేమ్‌ను ‘అడ్డదారుల్లో’ ఆడుతున్నందుకు నిందితులా..? ఆన్లైన్ రమ్మీ గేమ్‌ల విషయంలో పోలీసుల మీమాంస ఇది. వివిధ రకాలైన యాప్‌లను వినియోగించి, జీపీఎస్ మార్చి ఆడుతూ... భారీ మొత్తాలు పోగొట్టుకుని తమ వద్దకు వస్తున్న వారి విషయంలో అధికారులు ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. విషయం ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ వరకు వెళితే ఆ గేమ్స్ ఆడిన వారికి కొత్త ఇబ్బందులు వచ్చిపడతాయని స్పష్టం చేస్తున్నారు. అక్రమ మైక్రో ఫైనాన్సింగ్ యాప్స్ వ్యవహారం వివాదాస్పదం కావడంతో ఈ ఆన్లైన్ రమ్మీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. చదవండి: పాణాలు తీసిన జొన్నరొట్టె మూడేళ్ల క్రితం దీనిపై నిషేధం... రాష్ట్రంలో కొన్నేళ్ల క్రితం వరకు పేకాటపై నిషేధం ఉన్నప్పటికీ.. ఆన్లైన్లో ఉండే రమ్మీ గేమ్‌లపై ఉండేది కాదు. అయితే ఈ గేమ్ ఉచ్చులో యువత చిక్కుకుంటున్నారని, అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఆన్లైన్ రమ్మీని నిషేధిస్తూ 2017లో ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ సైతం ఈ రకమైన చట్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఆయా సంస్థ తమ కార్యకలాపాలను నిలిపి వేశాయి. ఇక్కడ ఉండే వాళ్లు ఎవరైనా ఆ సైట్లలోకి ఎంటర్ అయినా..సేవలు అందుబాటులో లేవనే సందేశమే కనిపిస్తుంది. ఐపీ అడ్రస్‌తో పాటు లోకేషన్‌కు సంబంధించి అక్షాంశ రేఖాంశాల ఆధారంగా ఆ ప్లేయర్ ఎక్కడి వారో గుర్తించే పరిజ్ఞానం వెబ్‌సైట్స్ నిర్వాహకుల వద్ద ఉంది. చదవండి: లోన్‌యాప్స్ కేసులో ఆసక్తికర విషయాలు ఇబ్బడిముబ్బడిగా యాప్స్ రావడంతో... రాష్ట్రంలో ఆన్లైన్ రమ్మీపై నిషేధం ఉండటంతో దీనికి బానిసలైన వాళ్లు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించారు. గతంలో పొరుగు రాష్ట్రాలతో పాటు గోవా తదితర ప్రాంతాలకు వెళ్లి ఆడి వచ్చే వారు. ఇటీవల కాలంలో నకిలీ జీపీఎస్ యాప్‌లు గూగుల్ ప్లే స్టోర్స్‌లో ప్రత్యక్షమయ్యాయి. వీటిని తమ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్టాల్ చేసుకుంటున్న పేకాట రాయుళ్ళు తాము ఉన్న ప్రాంతం జీపీఎస్ లోకేషన్ తప్పుగా, వేరే ప్రాంతంలో ఉన్నట్లు చూపించేలా చూస్తున్నారు. ఇలా ఆన్లైన్ రమ్మీ నిషేధం లేని రాష్ట్రాల లోకేషన్స్‌ను ఈ యాప్‌లలో సెట్ చేసి గేమ్ ఆడుతున్నారు. లోకేషన్ వేరే ప్రాంతంలో చూపిస్తుండటంతో ఆయా వెబ్సైట్లు గేమ్ ఆడేందుకు అవకాశం ఇస్తున్నాయి. కేసుల నమోదుకు అవకాశం లేక... ఇలా ఆన్లైన్ రమ్మీ గేమ్స్‌ను రెండేళ్ల నుంచి ఆడుతున్న వారు కూడా ఉంటున్నారు. వీరంతా భారీ మొత్తాలు కోల్పోయిన తర్వాత మేల్కొంటున్నారు. ఆన్లైన్లో ఆడి తాము భారీ మొత్తాలు కోల్పోయి బాధితులుగా మారామంటూ వచ్చి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇలాంటి అంశాల్లో ఆయా సంస్థలపై కేసులు నమోదు చేయడం సాధ్యం కాదని అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి నకిలీ జీపీఎస్ వినియోగించి, రమ్మీపై నిషేధం ఉన్న చోట ఆడినందుకు వీరినే నిందితులుగా పేర్కొనవచ్చని చెప్తున్నారు. అయితే అనివార్య కారణాల నేపథ్యంలో అలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నామని స్పష్టం చేస్తున్నారు. ఈ గేమ్స్ ఆడుతూ అనేక మంది రూ.లక్షల్లో కోల్పోతున్నారు. వీరి లావాదేవీల విషయం ఆదాయపు పన్ను శాఖకు తెలిస్తే కొత్త కేసులు వచ్చిపడతాయని స్పçష్టం చేస్తున్నారు. ఈ తరహా పేకాటలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. -
ఒలింపిక్స్ నుంచి రష్యా ఔట్
జెనీవా : కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్) గురువారం రష్యాపై రెండేళ్ల నిషేధం విధించింది. దీని ప్రకారం రానున్న రెండు ఒలింపిక్స్ క్రీడల్లో లేదా రెండు ప్రపంచ చాంపియన్‌షిప్ ఈవెంట్లలో రష్యా దేశానికి ప్రాతినిధ్యం ఉండదు. ఆ దేశం తరఫున ఎవరూ పాల్గొనడానికి వీల్లేదు. అంతేకాకుండా రెండేళ్ల పాటు ఎలాంటి క్రీడల ఆతిథ్య హక్కుల కోసం రష్యా బిడ్డింగ్‌లో పాల్గొనకూడదు. అయితే డోపింగ్‌తో సంబంధం లేనట్లు నిరూపించుకునే రష్యా ఆటగాళ్లు వచ్చే ఏడాది జరుగనున్న టోక్యో ఒలింపిక్స్, 2022 బీజింగ్ వింటర్ గేమ్స్, ప్రపంచ చాంపియన్‌షిప్స్ టోర్నీల్లో తమ దేశం తరఫున కాకుండా ‘న్యూట్రల్’ అథ్లెట్లుగా పాల్గొనేందుకు అనుమతిచి్చంది. -
43 చైనా యాప్‌లపై నిషేధం
న్యూఢిల్లీ : సరిహద్దుల్లో చైనా తో ఘర్షణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో 43 చైనా మొబైల్ యాప్స్‌పై నిషేధం విధించింది. అలీబాబా గ్రూప్‌కి చెందిన ఈ కామర్స్ యాప్ అలీ ఎక్స్‌ప్రెస్ సహా కొన్ని డేటింగ్ యాప్‌లపై నిషేధం విధిస్తూ మంగళవారం ఉత్వర్వులు జారీ చేసింది. ఈ యాప్‌లు దేశ సార్వభౌమత్వానికి, ప్రాదేశిక సమగ్రతకు ముప్పుగా ఉన్నందున కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ నిషేధం విధించింది. ఈ విషయాన్ని ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. కేంద్ర హోంశాఖ, ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్‌కు అందిన సమాచారాన్ని క్రోడీకరించి దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని చైనా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న 43 యాప్‌లపై నిషేధం విధించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపింది. ఇప్పటివరకు మూడు దఫాలుగా చైనా యాప్‌లను కేంద్రం నిషేధించింది. గల్వాన్ లోయలో భారత్‌తో ఘర్షణలకు దిగిన డ్రాగన్ దేశానికి బుద్ధి చెప్పడం కోసం ఈ ఏడాది జూన్ 29న తొలిసారిగా 59 యాప్‌లపై నిషేధం విధించింది. భారత పౌరుల వ్యక్తిగత సమాచార భద్రత కోసం భారత్‌లో విస్తృతం ప్రాచుర్యం కలిగిన పబ్జి, టిక్‌టాక్ వంటి గేమింగ్ యాప్‌ల ఆటకట్టించింది. ఆ తర్వాత జూలై 27న ప్రజాదరణ పొందిన కామ్‌స్కానర్ వంటి మరో 47 యాప్‌లపై నిషేధం విధించింది. సెప్టెంబర్ 2న మరో 118 యాప్‌లను నిషేధించింది. పబ్జి, టిక్‌టాక్ వంటి గేమింగ్ యాప్‌లను తొలి దశలో నిషేధం విధించిన కేంద్రం ఇప్పుడు కామర్స్, డేటింగ్ యాప్‌లపై కొరడా ఝళిపించింది. తాజాగా 43 యాప్‌లతో మొత్తం నిషేధం విధించిన యాప్‌ల సంఖ్య 267కి చేరుకుంది. పౌరుల వ్యక్తిగత సమాచార భద్రత, దేశ సార్వభౌమత్వం, సమగ్రతలకు భంగం వాటిల్లితే ఎలాంటి చర్యలకైనా దిగుతామని కేంద్రం స్పష్టం చేసింది. -
తిరుమలలో ఆ వాహనాలు నిషేధం
సాక్షి, తిరుమల: కాలం చెల్లిన వాహనాలు ఇకపై తిరుమలతో పాటు, ఘాట్ రోడ్లపై అనుమతి కోల్పోనున్నాయి. ఈ మేరకు గురువారం తిరుమలలో నిర్వహించిన మీడియా సమావేశంలో తిరుమల అడిషనల్ ఎస్పీ మునిరామయ్య పాత వాహనాల నిషేధాన్ని వెల్లడించారు. పది ఏళ్లు పూర్తి చేసుకున్న వాహనాలను ఇకపై తిరుమలకి అనుమతించేది లేదని తెలిపారు. పాతవి, ఫిట్నెస్ లేని వాహనాలను తిరుమల ఘాట్ రోడ్లపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు. 2010 కంటే ముందు రిజిస్టరైన వాహనాలను తిరుమలకు తీసుకురాకూడదని, ఫిట్నెస్ లేని వాహనాలను తిరుమలకు అనుమతించమని ఆయన వెల్లడించారు. రెండో ఘాట్ రోడ్డులోని శ్రీవారి సహజ శిలా స్వరూపం కనిపించే ప్రదేశంలో వాహనాలు నిలిపేస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆ ప్రదేశంలో భక్తులు వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తిరుమల క్షేత్రం ‘నో హారన్’ జోన్ కావడంతో భక్తులు తమ వాహనాల హారన్ మోగించకూడదని సూచించారు. వాహనాల హారన్ మోగించిన వారిపై మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం జరిమానా విధిస్తామని ఏయస్పీ మునిరామయ్య తెలిపారు. -
అమ్మకాలపై అమెజాన్ బ్యాన్..
చికాగో: అమెరికాలో దిగుమతయిన వేలాది విదేశీ విత్తనాల అమ్మకాలపై ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ నిషేధం(బ్యాన్) విధించింది. వివరాల్లోకి వెళ్తె అమెరికాలోని రైతులకు వేలాదిగా దిగుమతైన విత్తనాల ప్యాకేట్లు అందాయి, కాగా విత్తనాల ప్యాకేట్లను తామేమి ఆర్డర్ చేయలేదని వారు అమెజాన్‌కు తెలిపారు. ఈ నేపథ్యంలో అక్రమంగా విదేశాల నుంచి దిగుమతయ్యే విత్తనాలను నిషేదిస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది. అయితే ఎక్కువగా చైనా నుంచే దిగుమతైనట్లు తెలుస్తుంది. కాగా ప్యాకేజీలలో లభ్యమయ్యే విత్తనాలను ఉపయోగించొద్దని అమెరికా వ్యవస్తాయ విభాగం జులైలో హెచ్చరించింది. ఒకవేళ ఆ విత్తనాలను అమెరికన్ రైతులు ఉపయోగిస్తే దేశానికే ప్రమాదమని పేర్కొంది. అయితే ఈ స్కామ్ జరిగినట్లు కచ్చితమైన ఆధారాలు లేవని, అమ్మకందార్లపై నిఘా పెట్టనున్నట్లు అమెరికా వ్యవసాయ విభాగం ఈ ఆగస్టులో పేర్కొన్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో వినియోగదారుల బధ్రతకు అమెజాన్ అధిక ప్రాధాన్యమిస్తుంది. కాగా వినియోగదారులకు చేరువకావడానికి అమెజాన్ సరికొత్త వ్యూహ్యాలను అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దిగ్గజ కంపెనీలు అమెజాన్‌తో జతకట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. (చదవండి: అమెజాన్.. జెఫ్ బెజోస్ సరికొత్త రికార్డ్) -
ఏపీ: రమ్మీ, బెట్టింగ్‌లపై నిషేధం
సాక్షి, అమరావతి: సమాజంలో చెడు ధోరణులకు కారణమవుతోన్న ఆన్లైన్, ఆఫ్‌లైన్ రమ్మీ, పోకల్ వంటి జూదం, బెట్టింగ్‌లను నిషేధిస్తూ ఏపీ గేమింగ్ యాక్ట్–1974కు చేసిన సవరణలను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఆడేవాళ్లకు ఆరు నెలల జైలు శిక్ష, నిర్వాహకులకు ఏడాది జైలు శిక్ష, జరిమానా.. రెండోసారి ఈ తప్పిదానికి పాల్పడితే రెండేళ్లు జైలు శిక్ష, జరిమానా విధించాలని నిర్ణయించింది. వెలగడిపూడిలోని సచివాలయంలో గురువారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలను సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మీడియాకు వెల్లడించారు. ♦ వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌కు నగదు బదిలీ పథకానికి ఆమోదం. ♦ అక్టోబర్ 5 నుంచి ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభించాలని మంత్రి వర్గం సూత్రప్రాయంగా నిర్ణయించింది. తదుపరి కేంద్రం జారీ చేసే మార్గదర్శకాల మేరకు నిర్ణయం తీసుకోనుంది. ♦ పంచాయితీరాజ్ శాఖలో మెరుగైన పాలన కోసం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు వలంటీర్లు, సచివాలయ వ్యవస్థలో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ (డీడీవో) పోస్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయం. ♦ జాయింట్ కలెక్టర్లకు కింద ఎంపీడీవో (మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్)లకు పైన డిప్యూటీ డైరెక్టర్ కేడర్‌లో డీడీవో పోస్టుల ఏర్పాటు. ఎంపీడీవోలకు పదోన్నతుల ద్వారా డీడీవో పోస్టుల భర్తీ. రహదారుల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి ♦ రహదారుల నిర్మాణం, నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు ఒక రూపాయి చొప్పున రోడ్ సెస్ విధించాలనే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి వర్గం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఇందుకు విధి విధానాలు రూపొందిం చాల్సిందిగా మంత్రివర్గం అధికారులను అదేశించింది. ♦ రహదారుల నిర్మాణం, నిర్వహణ కోసం గతంలోనే ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైంది. ఎన్నికల ముందు చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేషన్ పేరిట రూ.3,000 కోట్లు అప్పు చేసి ఇతర అవసరాలకు మళ్లించారు. దీంతో ఇప్పటి ప్రభుత్వ హయాంలో రహదారులు నిర్వహణకు నిధుల లభ్యత లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రత్యేక సెస్ విధించి ఆ మొత్తాన్ని ఖజానాకు మళ్లించకుండా కార్పొరేషన్ దగ్గరే ఉంచాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఏపీఎస్డీసీకి ఆమోదం ♦ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్డీసీ) ఏర్పాటు చేస్తూ విడుదల చేసిన జీవో ఎంఎస్ నంబర్ 80కి ఆమోదం. వంద శాతం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఏపీఎస్డీసీ ఏర్పాటు. ♦ నాడు–నేడు (మనబడి), నాడు–నేడు (వైద్యం), అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ రైతు భరోసా పథకాల అమలుకు ప్రణాళిక, ఫండింగ్ (నిధుల సమీరణ)తోపాటు సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ప్రాజెక్టుల అమలుకు అవసరమైన ప్రణాళికను ఈ కార్పొరేషన్ రూపొందిస్తుంది. వైద్య కళాశాలలకు భూమి కేటాయింపు ♦ గుంటూరు జిల్లా బాపట్ల మండలం మూలపాలెం, జమ్ములపాలెం గ్రామాల్లో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు అవసరమైన 51.07 ఎకరాల భూమి కేటాయింపు. ♦ ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు అవసరమైన 41.97 ఎకరాల భూమిని కేటాయింపు. మావోయిస్టుపార్టీపై మరో ఏడాది నిషేధం ♦ మావోయిస్టు పార్టీ, దాని అనుబంధ సంఘాల మీద మరో ఏడాదిపాటు నిషేధం పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. ♦ రాడికల్ యూత్ లీగ్ (ఆర్‌వైఎల్), రైతు కూలీ సంఘం (ఆర్సీఎస్) లేదా గ్రామీణ పేదల సంఘం (జీపీఎస్), రాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ఎస్యూ), సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస), విప్లవ కార్మిక సమాఖ్య(వికాస), ఆల్ ఇండియా రివల్యూషనరీ స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఏఐఆర్ఎస్ఎఫ్)లపై మరో ఏడాదిపాటు నిషేధం. మత్స్య విశ్వవిద్యాలయానికి గ్రీన్ సిగ్నల్ ♦ పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ కోసం రూపొందించిన ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ ఆర్డినెన్స్–2020కి మంత్రివర్గం ఆమోదం. ♦ మత్స్య రంగంలో సమగ్ర అభివృద్ధి కోసం ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటు. దీని ద్వారా రాష్ట్రంలో మత్స్య, ఆక్వా రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. ఈ యూనివర్సిటీ కోసం రానున్న ఐదేళ్లలో రూ.300 కోట్ల వ్యయం. ♦ ఆక్వా రంగంలో నిపుణుల కొరత కారణంగా ఏడాదికి సుమారు రూ.2,500 కోట్లు నష్టపోతున్నామని, వర్సిటీ ఏర్పాటు ద్వారా ఆ నష్టాన్ని నివారించవచ్చని అంచనా. తద్వారా సుమారు 90 వేల మంది ఆక్వా రైతులు, దీనిపై ఆధారపడ్డ మరో ఎనిమిది లక్షల మంది ప్రజలు ప్రయోజనం పొందుతారని ఆంచనా. కృష్ణాపై రూ.2,565 కోట్లతో మరో రెండు బ్యారేజీలు ♦ కృష్ణా డెల్టా చౌడు బారకుండా పరిరక్షించేందుకు ప్రకాశం బ్యారేజీకి దిగువన మరో రెండు కొత్త బ్యారేజీల నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ బ్యారేజీ నిర్మాణం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. సముద్రపు నీరు ఎగదన్నదు. కృష్ణా డెల్టాను పరిక్షించవచ్చు. తాగునీటికి ఇబ్బందులకు పరిష్కారం. రెండు కొత్త బ్యారేజీల నిర్మాణానికి రూ.2,565 కోట్ల వ్యయం. ♦ ప్రకాశం బ్యారేజీకి 12 కిలోమీటర్ల దిగువన కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం రామచంద్రాపురం మధ్య కృష్ణా నదిపై 2.70 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మాణం. దీనికి రూ.1,215 కోట్ల వ్యయం. ♦ ప్రకాశం బ్యారేజీకి 62 కిలోమీటర్ల దిగువన హంసలదీవికి ఎగువన కృష్ణా జిల్లా మోపిదేవి మండలం బండికోళ్లంక, గుంటూరు జిల్లా రేపల్లె మండలం తూరుపుపాలెం మధ్య కృష్ణా నదిపై 3.25 టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజీ నిర్మాణం. దీనికి రూ.1,350 కోట్ల వ్యయం. ♦ పల్నాడు తాగు, సాగునీటి అవసరాలు తీర్చడం కోసం వరికపూడిశెల ఎత్తిపోతల పథకం చేపట్టాలని నిర్ణయం. ఈ పథకం ద్వారా గుంటూరు జిల్లా వెల్ధుర్తి, దుర్గి, బొల్లాపల్లి మండలాలు సస్యశ్యామలం అవుతాయి. ఈ ఎత్తిపోతల పథకానికి రూ.1,273 కోట్ల వ్యయం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి గ్రీన్ సిగ్నల్ ♦ ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించి, సస్యశ్యామలం చేయడానికి బాబు జగజ్జీవన్ రామ్ ఉత్తరాంధ్రా సుజల స్రవంతి ప్రాజెక్టు పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ♦ 63.2 టీఎంసీల నీటిని తరలించి.. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సుమారు 8 లక్షల ఎకరాల సాగునీటిని అందించాలని నిర్ణయం. ఈ పథకానికి రూ.15,389.80 కోట్ల వ్యయం అవుతుంది. ♦ దుర్భిక్ష రాయలసీమ ప్రాంతంలో 14 రిజర్వాయర్లు, ఎత్తిపోతల పథకాల నిర్మాణం, ఇతర పనులకు సంబంధించిన పరిపాలనా పరమైన అనుమతులకు మంత్రివర్గం ఆమోదం. రాయలసీమ కరవు నివారణ ప్రణాళికలో భాగంగా ఈ పనులు చేపట్టాలని నిర్ణయం. (మద్యం ధరలను తగ్గించిన ఏపీ ప్రభుత్వం) -
'మా యాప్‌ను నిషేధించడం అన్యాయం'
స్టాక్‌హోమ్ : ప్రపంచవ్యాప్తంగా ట్రూకాలర్ యాప్ ఎంతో ఫేమస్. మొబైల్‌కు వచ్చే గుర్తుతెలియని నెంబర్ల వివరాలు తెలుపడం ఈ యాప్ ప్రత్యేకత. స్వీడన్‌లోని స్టాక్‌హోమ్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ట్రూకాలర్ .. కాలర్ ఐడీ.. స్పామ్ డిటెక్షన్, మెసేజింగ్, ఇతర డయలర్ సేవలను అందిస్తున్నది. తాజాగా చైనాతో సరిహద్దు వివాదం తర్వాత 89 రకాల సోషల్ మీడియా యాప్‌లను బ్యాన్ చేయాలని భారత్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. వాటిలో ట్రూకాలర్ యాప్ కూడా ఒకటి. దీనిపై ట్రూ కాలర్ యాప్ యాజమన్యం గురువారం స్పందిస్తూ .. మా యాప్‌ను నిషేధించడం అన్యాయం అని పేర్కొంది. కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ ను నిషేధిత దరఖాస్తుల జాబితాలో చేర్చడంపై ఆ సంస్థ తీవ్ర విచారం వ్యక్తంచేసింది. ఈ జాబితాలో ఇప్పటికే ప్రభుత్వం నిషేధించిన టిక్‌టాక్ వంటి చైనీస్ యాప్ లు మాత్రమే కాకుండా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్‌చాట్, జూమ్, రెడ్డిట్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లు కూడా ఉన్నాయి. జాతీయ భద్రతా సమస్యలపై ఈ యాప్‌లను తొలగించాలని భారత సైన్యం తన సిబ్బందికి సూచించింది. 'తమ సిబ్బంది కోసం భారత ఆర్మీ నిషేధించిన 89 యాప్ ల జాబితాలో ట్రూకాలర్ ఉన్నదని తెలుసుకుని నిరాశకు గురయ్యాం. ఇది చాలా అన్యాయం. ట్రూకాలర్ అనేది స్వీడన్ కేంద్రంగా పని చేస్తున్న యాప్.ట్రూకాలర్ యాప్ ను నిషేధిత యాప్ ల జాబితాలో ఉంచాడానికి ఎలాంటి కారణాలు లేవు. ఈ విషయంపై మరింత దర్యాప్తు చేస్తాం. ట్రూకాలర్ ఇండియాలో 170 మిలియన్లకు పైగా ప్రజలకు కీలకమైన సేవలను అందిస్తున్నది. నిత్యం వందల మిలియన్ల స్పామ్ కాల్స్, ఎస్ఎంఎస్లను గుర్తించి బ్లాక్ చేస్తుంది' అని ట్రూకాలర్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. -
కోల్‌కతాకు ఆరు ప్రాంతాల నుంచి విమానాలు బ్యాన్
కోల్‌కతా : కరోనా వైరస్ ఉదృతంగా ఉన్న నేపథ్యంలో కోల్‌కతా ఎయిర్‌పోర్టు అధికారులు శనివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా విస్తరణ ఎక్కువగా ఉన్న ఢిల్లీ, ముంబై, పుణే, నాగ్‌పూర్, చెన్నై, అహ్మదాబాద్ ప్రాంతాల నుంచి కోల్‌కతాకు విమానాల సర్వీసులు రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. జూలై 6 నుంచి 19 వరకు ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని తెలిపారు. అంతకముందు కరోనా వైరస్ హాట్‌స్పాట్స్‌గా ఉన్న ప్రాంతాల నుంచి విమానాల సర్వీసులను నిలిపివేయాలంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ పేర్కొన్నారు. -
RIP Tiktok: నెటిజన్ల రియాక్షన్ ఇదీ..
"పోయే.. పోయే.. టిక్‌టాక్ పోయే..." అంటూ కొందరు నవ్వుతూ, మరికొందరు ఏడుపుముఖంతో టిక్‌టాక్‌కు వీడ్కోలు చెబుతున్నారు. ఎంత కష్టపడి వీడియోలు చేసినా ఒక్క లైకూ ఇవ్వనందుకు టిక్‌టాక్‌కు తగిన శాస్తి జరిగిందని ఆఖరికి టిక్‌టాక్ యూజర్లు కూడా శాపనార్థాలు పెడుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టిక్‌టాక్‌లో సెలబ్రిటీలకు డూప్‌లు కూడా ప్రత్యక్షం కాగా వారు పాపులారిటీ సంపాదించుకున్నారు. చిన్నపాటి వీడియోలు చేస్తూ లైకులతో మురిసిపోయేవారు. కానీ యాప్ బ్యాన్‌తో వారి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. Happy with the step our government had taken....people wonder what they can do for their country? I'd say every bit counts, this is a good start.#DELETE #ChineseAppsBlocked pic.twitter.com/0iHMGz1yR2 — Karanvir Bohra (@KVBohra) June 29, 2020 అటు సెలబ్రిటీలు కూడా ప్రమోషన్లు చేసుకునేందుకు ఈ యాప్‌ను విచ్చలవిడిగా వాడుకున్నారు. అయితే టిక్‌టాక్‌తో సహా 58 యాప్‌లపై ప్రభుత్వం నిషేధించడాన్ని వీరు స్వాగతిస్తున్నారు. నటి నియాశర్మ స్పందిస్తూ "ఈ దేశాన్ని రక్షించినందుకు ధన్యవాదాలు. టిక్‌టాక్ అనే వైరస్‌ను ఇంకెప్పటికీ అనుమతించకండి" అని కోరింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంతోషాన్ని ఇచ్చిందని నటుడు కరన్వీర్ బోరా పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. తన టిక్‌టాక్ అకౌంట్‌ను తొలగించినట్లు వెల్లడించారు. (టిక్‌టాక్ బ్యాన్ : సెలబ్రిటీల కష్టాలు) #RIPTiktok RT If you happy after #tiktokbaninindia 😂😂😂👍🏻👍🏻 pic.twitter.com/i1er2bH8Pc — 🇮🇳 HINDUSTAN MERI JAAN 🇮🇳 (@prabinking) June 30, 2020 ఇవన్నీ పక్కన పెడితే టిక్‌టాక్ బ్యాన్‌తో దేశానికి పట్టిన పీడ విరగడైపోయిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో "#RIPTiktok" ట్రెండింగ్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఫన్నీ మీమ్స్, సరదా కామెంట్లతో నెట్టింట జోకులు పేలుతున్నాయి. (చైనాకు షాకిచ్చిన భారత్) #RIPTiktok Two minutes silence for them plss 😂🙏 pic.twitter.com/VUAaRkn3IW — Shivam yadav (@Shivamy93527382) June 30, 2020 దీంతో సోషల్ మీడియాలో ఓ రకమైన పండగ వాతావరణమే కనిపిస్తోంది. టిక్‌టాక్‌తో ఫేమస్ అయి, ఒక్క వీడియో పోస్ట్ చేస్తే చాలు లక్షల లైకులు వచ్చిపడే టిక్టాకర్లకు నెటిజన్లు రెండు నిమిషాల మౌనం పాటిస్తున్నారు. Meme material of the year 😅😅🤣 Kothe p raid pad gyii 🤣#RIPTiktok pic.twitter.com/f99c8Pxffn — Prakash Thakur (@Prakash34573571) June 30, 2020 జోకర్ సినిమాలో నటుడికి టిక్‌టాక్‌లో ఎంతోమంది డూప్‌లు ఉన్నారు. పనిలో పనిగా వారికి కూడా రిప్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక టిక్‌టాక్ శవపేటికను మోస్తూ డ్యాన్స్ చేస్తున్న వీడియో కూడా వైరల్ అవుతోంది. టిక్‌టాక్ తొలగింపుతో అందరికంటే ఎక్కువగా సంతోషంగా ఉండేది యూట్యూబర్ క్యారీమినటి అంటూ మరో ఫొటో కూడా నవ్వు తెప్పిస్తోంది. Meanwhile memers Abe hamara bhi hath hai #RIPTiktok pic.twitter.com/WdlHYiWsU4 — Bikram Singh (@BikramS97264319) June 30, 2020 అప్పుడే టిక్‌టాక్‌కు సమాధి కట్టేసి పూలదండలు కూడా వేస్తున్నారు. 'చైనాకు దెబ్బ, టిక్‌టాకర్ల అబ్బ' అంటూ కామెంట్లు పెడుతున్నారు #RIPtiktok with 58 Others 😀😀 pic.twitter.com/JfjCo4MWOh — 💞__𝐒𝐨𝐟𝐭𝐰𝐚𝐫𝐞__🎭 (@mr__bspatel) June 29, 2020 Tiktok got banned by government of india Tiktokers right now -#RIPTiktok pic.twitter.com/FAexCWYe3Q — Sneha ♥️Solo Sidheart♥️ (@Real_sneha_) June 30, 2020 THE END..!#RIPTiktok Picture source: twitter / internet pic.twitter.com/VBJNxksrW2 — ವನಿತ ಲಕ್ಷ್ಮಣ್ ಗೌಡ (@gulikenne_12) June 30, 2020 -
3 రాష్ట్రాల నుంచి రాకపోకలపై నిషేధం
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, ఏపీ రాష్ట్రాల నుంచి తెలంగాణకు రాకపోకలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ రాష్ట్రాల నుంచి తెలంగాణకు రావాలనుకుంటున్న తెలంగాణవాసులకు గత మూడు రోజులుగా పాసుల జారీ నిలిపేసింది. తదుపరి ఆదేశాలిచ్చే వరకు ఈ మూడు రాష్ట్రాల నుంచి వచ్చే వారికి పాసులు జారీ చేయొద్దని స్పష్టం చేసింది. ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. శనివారం నాటికి మహారాష్ట్రలో 29,100 మందికి కరోనా సోకగా, 1,068 మంది మృత్యువాత పడ్డారు. గుజరాత్లో 9,931 మందికి కరోనా సోకగా, 606 మంది మరణించారు. కేసుల సంఖ్యలో మహారాష్ట్ర, మరణాల రేటులో గుజరాత్ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి. దీంతో ఈ రాష్ట్రాల నుంచి తెలంగాణకు రావాలనుకుంటున్న వారికి పాసుల జారీని రాష్ట్ర ప్రభుత్వం నిలిపేసింది. పొరుగునే ఉన్న ఏపీలో 2,307 మందికి కరోనా సోకగా, 48 మంది మృతి చెందారు. ఏపీలో కేసుల సంఖ్య, మరణాల రేటు తక్కువగా ఉన్నా, రెండు రాష్ట్రాల ప్రజల మధ్య బంధుత్వాలు, విస్తృత రాకపోకలను దృష్టిలో పెట్టుకుని ఏపీ నుంచి రావాలనుకుంటున్న వారికి సైతం పాసుల జారీని రాష్ట్ర ప్రభుత్వం నిలిపేసింది. ఏపీ–తెలంగాణ సరిహద్దుల్లోని కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కరోనా ప్రభావం అధికంగా ఉండటం కూడా ఓ కారణమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 80 వేల మంది రాక కరోనా వైరస్ నియంత్రణ కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో లక్షల మంది తెలంగాణ ప్రజలు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. స్వరాష్ట్రానికి తిరిగి రావాలనుకుంటున్న తెలంగాణవాసులకు పాసులు జారీ చేసేందుకు రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వం 24 గంటల కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. ఇందులో 100 మంది అధికారులు 3 షిఫ్టుల్లో పని చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ కంట్రోల్ రూం ద్వారా 17,500 పాసులు జారీచేయగా, 80 వేల మంది తెలంగాణకు తిరిగి వచ్చారు. ఒక్కో పాస్ ద్వారా ముగ్గురు, నలుగురు వ్యక్తులకు సైతం అనుమతిస్తున్నారు. కంట్రోల్ రూం నంబర్లు(040–23450624)లకు రోజూ 2 వేల కాల్స్ వస్తుండగా, రోజుకు సగటున 500–600 పాసులు జారీ చేస్తున్నారు. పాస్ కోసం కాల్ చేసిన వ్యక్తులు తెలంగాణవాసులేనా? ఎందుకు రావాలనుకుంటున్నారు? అన్న విషయాలను రుజువు చేసుకున్న తర్వాతే వాట్సాప్ ద్వారా పాసులు జారీ చేస్తున్నారు. స్వరాష్ట్రానికి తిరిగి వచ్చే వ్యక్తుల పేర్లు, వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఈ పాసులు జారీ చేస్తున్నారు. ఇలా రాష్ట్రానికి తిరిగి వచ్చే వారిని రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసు, రెవెన్యూ, వైద్య అధికారులతో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద ఆపి జ్వరం, జలుబు, ఇతర లక్షణాల కోసం స్క్రీనింగ్ చేస్తున్నారు. ఎవరికైనా ఇలాంటి లక్షణాలుంటే వారిని తిప్పి పంపేస్తున్నారు. లక్షణాలు లేని వారి చేతులపై 14 రోజుల హోం క్వారంటైన్ ముద్ర వేసి ఇంటికి పంపుతున్నారు. కాగా, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన తెలంగాణవాసులను తిరిగి రాష్ట్రానికి రప్పించేందుకు మాత్రమే సచివాలయంలోని కాల్‌సెంటర్ పని చేస్తుండగా, తెలంగాణ నుంచి సొంత రాష్ట్రాలకు, రాష్ట్రంలోని ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లాలనుకుంటున్న వారు సైతం అవగాహన లేక కాల్స్ చేస్తున్నారు. ఇలాంటి వారికి స్థానిక పోలీసు స్టేషన్లలో పాసులు జారీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని అధికార వర్గాలు తెలిపాయి. -
సరైన సమయంలో కరోనా దెబ్బ..
సాక్షి, మచిలీపట్నం: సముద్రంలో మత్స్యసంపదను పెంపొందించే ప్రక్రియలో భాగంగా మరపడవలు, ఫైబర్ బోట్లతో చేపల వేటను మంగళవారం అర్ధరాత్రి నుంచి నిషేధించనున్నారు. ఈ నిషేధం జూన్ 14 అర్ధరాత్రి వరకు రెండు నెలల పాటు అమల్లో ఉండనుంది. జిల్లాలో 111 కిలోమీటర్ల సముద్ర తీరం నాలుగు మండలాల పరిధిలో విస్తరించి ఉంది. 64 తీరగ్రామాల్లో 1,63,877 మంది మత్స్యకారులుండగా, వారిలో 38,914 మంది పూర్తిగా వేట ఆధారంగానే జీవనోపాధి పొందుతున్నారు. జిల్లాలో 117 మెకనైజ్డ్, 1,530 మోటరైజ్డ్, 139 సంప్రదాయ బోటులు ఉన్నాయి. మెకనైజ్డ్ బోటుపై 8 మంది, మోటరైజ్డ్ బోటుపై ఆరుగురు, సంప్రదాయ బోటు లపై ముగ్గురు ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. సరైన సమయంలో కరోనా దెబ్బ.. సాధారణంగా వేట నిషేదానికి ముందు సాధ్యమైనంత ఎక్కువ వేట చేయాలన్న ఆలోచనతో బోట్లన్నీ సముద్రం మీదకు వెళ్తుంటాయి. ప్రతిరోజు కనీసం 50 శాతం బోట్లు వేటకెళ్తుంటాయి. గతేడాది నవంబర్ 21 నుంచి ఆయిల్ సబ్సిడీని పెంపు అమలులోకి రావడంతో వేటకు వెళ్లే బోట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో వేటకు వెళ్లే ప్రతి బోటుకు 2 నుంచి 3 టన్నులకు పైగా టూనా, రొయ్యలు పడుతుంటాయి. ఇటువంటి సమయంలో కరోనా మరమ్మారి విరుచుకుపడడంతో ఎగుమతులు నిలిచిపోవడంతో ఎక్కడ బోట్లు అక్కడే నిలిచిపోయాయి. వేటకు వెళ్లిన బోట్లు సైతం తీరానికి వచ్చేశాయి. జనతా కర్ఫ్యూ మొదలు నేటి వరకు ఒక్క బోటు కూడా వేటకు వెళ్లిన దాఖలాలు లేవు. జూన్ 14వ తేదీ వరకు మళ్లీ వేటకు వెళ్లే చాన్స్ లేదు. ఈ నేపథ్యంలో నిషేధ కాలంలో ఇచ్చే భృతిని లాక్డౌన్ సమయానికి కూడా వర్తింప చేయాలని మత్స్యకారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లాక్డౌన్ కాలానికీ భృతినివ్వాలి.. వేట నిషేధ భృతిని రూ.4వేల నుంచి రూ.10వేలకు పెంచడమే కాకుండా.. ఆయిల్ సబ్సిడీని రూ.9లకు పెంచడంతో ఎంతో సంబరపడ్డాం. గతంలో ఎన్నడూ లేని విధంగా బోట్లన్నీ వేటకు వెళ్తున్న వేళ కరోనా మహమ్మారి మా ఉపాధికి గండి కొట్టింది. ఈ నేపథ్యంలో వేట నిషేధ సమయంతో పాటు లాక్డౌన్ అమలులోకి వచ్చిన 21 రోజులు కూడా నిషేధ భృతినివ్వాలని కోరుతున్నాం. అలాగే కాలువలపై వేట సాగించే వారితో పాటు ఎండుచేపలు, మార్కెట్లపై ఆధారపడి జీవనం సాగించే మత్స్యకారులను కూడా ఆర్థికంగా ఆదుకోవాలి. – లంకే వెంకటేశ్వరరావు, బోట్ల యజమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు -
ఐపీఎల్ మ్యాచ్‌లపై నిషేధం
-
ఢిల్లీలో ఐపీఎల్ మ్యాచ్‌లపై నిషేధం
ఢిల్లీ : కరోనా వైరస్ నేపథ్యంలో ఐపీఎల్ 13వ సీజన్‌కు సంబంధించిన మ్యాచ్‌లను ఢిల్లీలో నిర్వహించకూడదని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఐపీఎల్ మ్యాచ్‌లతో పాటు మిగతా క్రీడా పోటీలపైనా నిషేధం విధిస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం పేర్కొంది.ఇదే విషయాన్ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా శుక్రవారం విలేకరులు సమావేశంలో వెల్లడించారు. ' ప్రస్తుతం కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహిస్తే స్టేడియంలో జనం పెద్ద సంఖ్యలో గూమిగూడే అవకాశం ఉంది. దాంతో కరోనా వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అందుకే ఢిల్లీలో ఐపీఎల్ మ్యాచ్‌లను నిషేధిస్తున్నాం. ఐపీఎల్‌తో పాటు మిగతా క్రీడలకు సంబంధించిన ఈవెంట్లను కూడా అనుమతించేది లేదు. ఒకవేళ బీసీసీఐ కొత్త ఫార్మాట్లో ఐపీఎల్లో నిర్వహించాలనుకుంటే అది వారి ఇష్టం' అని పేర్కొన్నారు. (భయంతో షేక్‌హ్యాండ్ ఇచ్చుకోని కెప్టెన్లు) మరోవైపు ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించాలా ? వద్దా? అనే దానిపై సందిగ్థత నెలకొనే ఉంది. ఇప్పటికే ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించలేమని కర్నాటక, మహారాష్ట్ర, హర్యానా ప్రభుత్వాలు తేల్చిచెప్పాయి. ఇదే విషయమై శనివారం(మార్చి 14) ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. -
కువైట్ బాటలో ఖతర్
మోర్తాడ్ (బాల్కొండ): ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కట్టడికి ఖతర్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. తమ దేశంలో కోవిడ్–19 కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వం వైరస్ నియంత్రణకు కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఈ క్రమంలో భారత్ సహా 14 దేశాల నుంచి తమ దేశంలోకి రాకపోకలపై నిషేధం విధించింది. దీంతో ఉపాధి కోసం ఖతర్ వెళ్లే తెలంగాణవాసు లు ఇప్పట్లో అక్కడకు వెళ్లే అవకాశం లేదు. పలువురు కార్మికులకు వీసాతో పా టు ముందస్తుగానే విమాన టిక్కెట్ కొనుకున్నా, తాజా పరిణామాలతో ఆ దేశం వెళ్లలేని పరిస్థితి.. విమాన సర్వీసుల ర ద్దుపై ఆదివారం నుంచే అమలులోకి వచ్చిన నిర్ణయం తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కొనసాగనుందని తెలుస్తోంది. కాగా, కరోనా వైరస్ వల్ల తమ దేశ ప్రజలు ఇబ్బందిపడుతున్నారని గుర్తించిన కువైట్ ప్రభుత్వం కూడా ఎనిమిది దేశాలకు విమాన సర్వీసులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అదే బాటలో తాజాగా ఖతర్ ప్రభుత్వం కూడా రాకపోకలపై నిషే ధం విధించింది. ఈ నిర్ణయంతో భారత్, చైనా, బంగ్లాదేశ్, ఈజిప్టు, ఇరాన్, ఇరాక్, లెబనాన్, నేపాల్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియా, శ్రీలంక, సిరియా, థాయిలాండ్ నుంచి ఖతర్‌కు రాకపోకలు నిలిచి పోయాయి. ఖతర్‌లో ఆదివారం వరకు 24 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో వైరస్ ప్రభావం ఉన్న ఈ 14 దేశాల నుంచి రాకపోకలపై నిషేధం విధించారు. కాగా, ఖతర్‌లో ఉన్న తెలంగాణవాసులు ఒకవేళ తమ సొంత ఊళ్లకు వెళ్లాలంటే అందుబాటులో ఉన్న విమాన సర్వీసుల ద్వారా ఇతర దేశాలకు వెళ్లి అక్కడి నుంచి రాష్ట్రానికి రావాల్సి ఉంటుంది. ఖతర్‌లోని వివిధ నిర్మాణ కంపెనీలు, వ్యాపార, వాణిజ్య సంస్థలలో వేలాది మంది తెలంగాణ వాసులు ఉపాధి పొందుతున్నారు. రోజూ పలువురు అక్కడి నుంచి స్వదేశానికి రాకపో కలు సాగిస్తారు. తాజా పరిణామాలతో ఇబ్బందులు ఏర్పడనున్నాయి. ఇప్పట్లో రాలేం..: ఖతర్ నుంచి ఇప్పట్లో ఇండియాకు రాలేం. అలాగే మన దేశం నుంచి ఖతర్‌కు వచ్చే వారు కూడా కొన్ని రోజుల పాటు ఓపిక పట్టాల్సిందే. కరోనా విస్తరించకుండా ఉండడానికి ఖతర్ ప్రభుత్వం 14 దేశాల రాకపోకల పై నిషేధం విధించింది. కొత్తగా వీసాలు తీ సుకున్న వారు కూడా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. – అబ్బగోని శ్రీధర్ గౌడ్, ఖతర్ -
ప్రముఖ కమెడియన్‌పై నిషేధం
న్యూఢిల్లీ : ఆంగ్ల వార్తాచానెల్ ‘రిపబ్లిక్ టీవీ’ ఎడిటర్, ప్రముఖ జర్నలిస్ట్ ఆర్నాబ్ గోస్వామిపై తమ విమానంలో అనుచితంగా ప్రవర్తించినందుకు స్టాండ్ అప్ కమెడియన్ కునాల్ కామ్రాపై ఇండిగో విమానయాన సంస్థ నిషేధం విధించింది. 6 నెలల పాటు తమ విమానాల్లో ప్రయాణించేందుకు కామ్రాను అనుమతించబోమని ట్వీట్ చేసింది. ముంబై నుంచి లక్నో వెళ్తున్న విమానంలో గోస్వామితో కామ్రా అభ్యంతరకరంగా, ఎగతాళి చేసినట్లుగా ప్రవర్తించాడని పేర్కొంది. ఇండిగో తరహాలో ఇతర విమానయాన సంస్థలు కామ్రాపై నిషేధం విధించాలని కేంద్ర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరి కోరారు. -
రష్యాకు శృంగభంగం!
అంతర్జాతీయ ఈవెంట్లలో అవకాశం దొరికిందే తడవుగా క్రీడాభిమానుల్ని అబ్బురపరిచి వారి హృదయాల్లో శాశ్వత స్థానం పొందడానికి.. చరిత్ర పుటల్లోకెక్కడానికి క్రీడాకారులంతా శక్తివంచన లేకుండా కృషి చేస్తారు. అందుకోసం తమ క్రీడా నైపుణ్యానికి నిరంతరం పదును పెట్టుకుంటూ, ఎంచుకున్న ఆటలో ప్రత్యర్థిని మట్టికరిపించడానికి అవసరమైన మెలకువలన్నీ నేర్చుకుంటారు. కానీ రష్యా ఈ మార్గాన్ని విడిచిపెట్టి తన ప్రతిభాపాటవాలన్నిటినీ దొంగచాటుగా నిషిద్ధ ఉత్ప్రేరకాలు వాడటంలో చూపించి, వాటి సాయంతో పతకాలు కొల్లగొడుతోందని ఏడెనిమిదేళ్లుగా ఆరోపణలుంటున్నాయి. వాటిని ఎప్పటికప్పుడు ఆ దేశం కొట్టిపడేస్తోంది. తమ క్రీడాకారుల్ని చూసి అసూయతో ఇలా తప్పుడు ఆరోపణలకు దిగుతున్నారని విరుచుకుపడుతోంది. కానీ గత నెలాఖరున ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ ‘వాడా’ నియమించిన కమిటీ అవన్నీ పచ్చి నిజాలని ధ్రువీకరించి, నాలుగేళ్ల పాటు రష్యాకు ఏ అంతర్జాతీయ పోటీల్లోనూ ప్రవేశం లేకుండా నిషే«ధించాలని సిఫార్సు చేసింది. తాజాగా ఆ సిఫార్సును ‘వాడా ఆమోదించిన పర్యవసానంగా వచ్చే ఏడాది టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్‌తోపాటు అదే సంవత్సరం జరిగే పారాలింపిక్స్, 2022లో జరగబోయే యూత్ ఒలిపింక్స్, వింటర్ ఒలింపిక్స్ క్రీడోత్సవాల్లో రష్యా జట్లు పాల్గొనడానికి వీలుండదు. అంతేకాదు... వచ్చే నాలు గేళ్లలో అది ఏ అంతర్జాతీయ క్రీడా పోటీలకూ ఆతిథ్యం కూడా ఇవ్వడం సాధ్యపడదు. విశ్వవేదికల్లో నిర్వహించే క్రీడలు సమీపిస్తున్నాయంటే అందరిలోనూ ఉత్సాహం ఉంటుంది. స్వయంగా వీక్షిద్దామని వెళ్లినవారికి సరే... ప్రపంచంలో మూలమూలనా క్రీడాభిమానులకు అవి సాగినన్నాళ్లూ పండగే. అయితే వాటిల్లో ఆడుతున్నవారంతా ఉత్ప్రేరకాలు మింగి చెలరేగుతున్నారని తెలిస్తే వారంతా ఎంతో నొచ్చుకుంటారు. సోవియెట్ యూనియన్‌గా ఉన్నప్పుడు ఏ క్రీడలోనైనా పతకాలు రాబట్టుకోవడానికి అది విశేషమైన కృషి చేసేది. తాము నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగా మొదట్లో అది అంతర్జాతీయ క్రీడోత్సవాలకు దూరంగా ఉన్నా 1952లో మొదటిసారి ప్రవేశించింది మొదలుకొని ఆ దేశ క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరిచేవారు. అన్ని ఈవెంట్లలో పోటీబడి పతకాలు సొంతం చేసుకునేవారు. సోవియెట్ విచ్ఛిన్నమయ్యాక 1992 నుంచి నాలుగేళ్లు అది అంత ర్జాతీయ పోటీలకు దూరంగా ఉండిపోయింది. తిరిగి 1996లో తొలిసారి అట్లాంటా ఒలింపిక్స్‌లో ఆడింది. గత వైభవాన్ని అందుకోవడానికి రష్యా చేస్తున్న కృషిని ప్రపంచమంతా ప్రశంసించింది. అన్ని దేశాలూ దాని స్ఫూర్తితో తమ క్రీడాకారుల ప్రతిభాపాటవాలకు పదును పెట్టడానికి కృషి చేశాయి. కానీ రష్యా ప్రతిభకు మూలాలు నిషిద్ధ ఉత్ప్రేరకాల్లో ఉన్నాయని వెల్లడయ్యాక ప్రపంచమే నివ్వెరపోయింది. తొలిసారి 2014లో జర్మనీకి చెందిన చానెల్ ఏఆర్డీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ అందరినీ దిగ్భ్రాంతిపరిచింది. రష్యన్ అథ్లెట్లు ఒక పద్ధతి ప్రకారం డోపింగ్‌కు పాల్పడుతూ ప్రపంచ క్రీడలకు మచ్చ తెస్తున్నారని అది తేల్చి చెప్పింది. పర్యవసానంగా ఆ దేశానికి చెందిన క్రీడా బాధ్యులు పలువురు పదవులనుంచి తప్పుకున్నారు. ఈ చానెల్ వెల్లడించిన అంశాల్లో నిజానిజాలు తేల్చడానికి ‘వాడా’ అప్పట్లోనే ఒక నిజనిర్ధారణ సంఘాన్ని నియమించింది. ఆ మరుసటి ఏడాది ఏఆర్డీ రెండో డాక్యుమెంటరీ విడుదల చేసింది. రష్యా, కెన్యా అథ్లెట్లు అసాధారణమైన రీతిలో డోపింగ్‌కు పాల్పడ్డా రని అంతర్జాతీయ అథ్లెటిక్ సంఘాల సమాఖ్య(ఐఏఏఎఫ్) డేటా ఆధారంగా ఆ డాక్యుమెంటరీ తేల్చి చెప్పింది. క్రీడా ప్రపంచంలో ఉన్నతంగా నిలవడం కోసం డోపింగ్‌ను రష్యా రాజ్య వ్యవస్థే ఒక క్రమ పద్ధతి ప్రకారం ప్రోత్సహిస్తున్నదని ‘వాడా’ నివేదిక కూడా ఆరోపించింది. ఇప్పుడు రష్యాపై విధించిన నిషేధంమాటెలా ఉన్నా ఇన్నాళ్లుగా ‘వాడా’ ఏం చేసిందన్న ప్రశ్నలు తలెత్తకమానవు. రష్యా డోపింగ్ నిరోధక సంస్థ ‘రుసాదా’ తమ నిబంధనలకు అనుగుణంగా పని చేయడం లేదని 2015లోనే ‘వాడా’ ప్రకటించింది. కానీ ఆ తర్వాత కూడా రష్యా క్రీడాకారులు విశ్వ క్రీడావేదికల్లో పాలుపంచుకున్నారు. ఇప్పుడు కూడా ‘మచ్చలేని’ రష్యా క్రీడాకారులు స్వతంత్ర హోదాలో ఒలింపిక్స్‌లో పాల్గొనవచ్చునని ‘వాడా’ చెబుతోంది. తమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవడం లేదని ‘రుసాదా’పై అభియోగం మోపినప్పుడు అప్పట్లోనే నిషేధం దిశగా ఆలోచిం చివుంటే వేరుగా ఉండేది. ‘వాడా’ నివేదిక చూశాక రష్యా ప్రభుత్వం ‘రుసాదా’ అధిపతిని వెళ్లగొ ట్టింది. కానీ తమ క్రీడా మంత్రిత్వ శాఖకు ఈ కుంభకోణంతో ప్రమేయం లేదని తెలిపింది. ఈ విష యంలో నిష్పాక్షికంగా విచారణ జరిపితే తాము అన్నివిధాలా సహకరిస్తామని దేశాధ్యక్షుడు పుతిన్ అప్పట్లో తెలిపారు. కానీ మాస్కోలోని ల్యాబొరేటరీల్లో డోపింగ్ పరీక్షల నివేదికలన్నీ తారుమారయ్యా యని ‘వాడా’ 2016లో తేల్చింది. అప్పట్లో జరిగిన ఒలింపిక్స్‌లో రష్యా అథ్లెటిక్స్ విభాగంలో పోటీ పడకుండా నిషేధించింది. పూర్తిస్థాయి నిషేధానికి మరో మూడేళ్లు పట్టింది. ఈ మూడేళ్లలోనూ జరి గిన వివిధ క్రీడోత్సవాల్లో రష్యా పాల్గొనడం వల్ల వేరే దేశాల క్రీడాకారులకు అన్యాయం జరిగివుం డదా అన్న సందేహం ఎవరికైనా కలుగుతుంది. నిరుడు సెప్టెంబర్‌లో ‘రుసాదా’ను తిరిగి చేర్చుకున్న ప్పుడు మాస్కో ల్యాబొరేటరీల్లోని డేటా తమకు ఇవ్వాలని ‘వాడా’ షరతు పెట్టింది. కానీ ఇష్టాను సారం మార్చి తమకు అందజేశారని అది ఆలస్యంగా తెలుసుకుంది. రష్యా క్రీడా ప్రపంచంలోని చీకటి కోణాల గురించి ఇప్పటికి పుంఖానుపుంఖాలుగా కథనాలు వెలువడ్డాయి. కొత్త కుంభకోణం వెల్లడైనప్పుడల్లా పాతది వెలవెలబోవడం రివాజుగా మారింది. పతకాల మోజులో పడి, అడ్డదారిలో వాటిని కొల్లగొట్టడానికి ప్రయత్నించి రష్యా ఇప్పుడు ప్రపంచం ముందు దోషిగా నిలబడింది. తన క్రీడాకారుల బంగారు భవిష్యత్తును తానే నాశనం చేసింది. ‘వాడా’ విధించిన నిషేధంపై అప్పీల్‌కు వెళ్లి ఇంకా తాను సుద్దపూసనని అది చెప్పుకోవడానికి ప్రయత్నిస్తుందా లేక క్షమాపణ చెప్పి నాలు గేళ్లపాటు అన్నిటికీ దూరంగా ఉండి ప్రాయశ్చిత్తం చేసుకుంటుందా అన్నది వేచి చూడాలి. -
వేల కోట్ల కుంభకోణం : కార్వీకి సెబీ షాక్!
న్యూఢిల్లీ: ఓ క్లయింటుకు సంబంధించిన రూ. 2,000 కోట్ల విలువ చేసే సెక్యూరిటీస్‌ను దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్)పై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆంక్షలు విధించింది. స్టాక్ బ్రోకింగ్ కార్యకలాపాల కోసం కొత్తగా క్లయింట్లను తీసుకోకుండా నిషేధించింది. అలాగే, క్లయింట్ల పవర్ ఆఫ్ అటార్నీల ఆధారంగా కేఎస్‌బీఎల్ ఎలాంటి సూచనలు ఇచ్చినా.. పరిగణనలోకి తీసుకోరాదంటూ ఎన్ఎస్డీఎల్, సీడీఎస్‌ఎల్‌ను ఆదేశించింది. క్లయింట్ సెక్యూరిటీల విషయంలో కేఎస్‌బీఎల్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిందంటూ ఎన్ఎస్ఈ సమర్పించిన ప్రాథమిక నివేదిక ఆధారంగా సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. క్లయింట్ల షేర్లు మరింతగా దుర్వినియోగం కాకుండా నియంత్రణ సంస్థ తక్షణం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందంటూ 12 పేజీల ఎక్స్‌పార్టీ మధ్యంతర ఉత్తర్వుల్లో సెబీ హోల్ టైమ్ మెంబర్ అనంత బారువా వ్యాఖ్యానించారు. క్లయింట్ల నిధులు, సెక్యూరిటీలను దుర్వినియోగం చేసినందుకు గాను డిపాజిటరీలు, స్టాక్ ఎక్సే్చంజీలు తగు క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని సెబీ సూచించింది. అభ్యంతరాలేమైనా ఉన్న పక్షంలో 21 రోజుల్లోగా తెలియజేయాలంటూ కేఎస్‌బీఎల్‌కు సమయమిచ్చింది. -
ఐదుగురు లిఫ్టర్లు డోపీలు
సాక్షి, భువనేశ్వర్: భారత వెయిట్‌లిఫ్టర్లు డోపింగ్‌లో దొరికిపోయారు. నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్న ఐదుగురు డోపీల్లో కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్, ఒడిశాకు చెందిన కత్తుల రవికుమార్ ఉన్నాడు. 2010లో బంగారం నెగ్గిన రవి... 2014లో రజతం గెలిచాడు. అతనితో పాటు జూనియర్ కామన్వెల్త్ గేమ్స్ పతక విజేత పూర్ణిమా పాండే, హీరేంద్ర సారంగ్, దీపిక శ్రీపాల్, గౌరవ్ తోమర్ ఉన్నారు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నిర్వహించిన పరీక్షల్లో వీరంతా నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడంతో వీరిపై సస్పెన్షన్ వేటు వేశారు. స్టార్ లిఫ్టర్ రవి ‘ఒస్టారిన్’ అనే ఉత్ప్రేరకం తీసుకున్నాడు. ఇది కండరాల శక్తిని పెంచేది. విశాఖపట్నంలో జరిగిన జాతీయ చాంపియన్‌షిప్‌లో అతనికి నిర్వహించిన పరీక్షల్లో దొరికిపోవడం జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ వర్గాల్ని కలవరపరిచింది. అయితే ఈ డోపింగ్ ఉదంతంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ కోటా బెర్తులకు వచ్చిన ముప్పేమీ లేదని భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎల్ఎఫ్) కార్యదర్శి సహదేవ్ యాదవ్ స్పష్టం చేశారు. ‘నాడా’ భారత్‌కు సంబంధించిన సంస్థ అని అంతర్జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) చేసే పరీక్షల్నే అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) పరిగణిస్తుందని ఆయన చెప్పారు. కొత్త ఐడబ్ల్యూఎఫ్ నిబంధనల ప్రకారం 2008 నుంచి 2020 వరకు ఏదైనా దేశంలో 20 లేదా అంతకంటే ఎక్కువ డోపీలు పట్టుబడితే ఒలింపిక్స్ కోటా బెర్తుల్ని ఆ దేశం కోల్పోతుంది. -
'15ఏళ్లు పైబడిన ప్రభుత్వ వాహనాలు నిషేధం'
పాట్నా : బీహార్‌లో నితీశ్‌కుమార్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో 15 సంవత్సరాలకు పైబడిన ప్రభుత్వ వాహనాలను సోమవారం నుంచే పూర్తిగా నిషేదించినట్లు నిర్ణయం తోసుకుంది. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణపై ముఖ్యమంత్రి అధ్యక్షతన నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశం అనంతరం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి దీపక్ కుమార్ విలేకరులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఇటివలే పండుగ సీజన్లో నమోదైన కాలుష్య స్థాయిని గమనిస్తే అందులో ఈ వాహనాల నుంచి వెలువడే పొగ కాలుష్యం అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అందుకే పాట్నా మెట్రో పాలిటన్ ఏరియాలో 15 ఏళ్లకు పైబడిన ప్రభుత్వ వాహనాలను నిషేదించామని తెలిపారు. అయితే ప్రైవేటు వాహనాలను ఈ నిషేధం నుంచి మినహాయించామని, కానీ యజమానులు తమ వాహనాలకు కొత్తగా కాలుష్య పరీక్షలు చేయించి ధృవీకరణ పత్రాలను పొందాల్సి ఉంటుదన్నారు. దీని కోసం ప్రత్యేకంగా మంగళవారం నుంచి ఇంటెన్సివ్ డ్రైవ్ నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మంగళవారం జారీ చేస్తామని, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అలాగే కిరోసిన్‌తో నడుస్తూ అధిక కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఆటో రిక్షాలు కొత్తగా పొల్యుషన్ టెస్ట్‌ను చేయించుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో డీజిల్‌తో నడుస్తున్న ఆటో రిక్షాలను త్వరలోనే పూర్తిస్థాయి సీఎన్జీ లేదా ఎలక్ట్రిక్‌తో నడిచే విధంగా రూపొందించనున్నట్లు తెలిపారు. వీటిని మార్చుకోవడానికి ఆటో యజమానులకు ప్రోత్సాహం కింద సబ్సిడీలు కూడా అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రజా ప్రాధిపాదిత ప్రాజెక్టుల నిర్మాణ స్థలాల కోసం ప్రభుత్వం మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందించింది. అదే విధంగా ప్రైవేట్ భవనాలకు సంబంధించి మునిసిపల్ కార్పొరేషన్లకు ఆదేశాలు ఇచ్చామని ఆయన చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో సౌండ్‌లెస్ జనరేటర్లను మాత్రమే ఉపయోగించుకునేలా సూచనలు జారీ చేసినట్లు తెలిపారు. చెత్తను పారవేసే ట్రక్కులు, ఇతర వ్యాన్లు డంపింగ్ యార్డుకు తీసుకెళ్లే మార్గంలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చెత్తను పూర్తిగా కవర్లతో కప్పి ఉంచాలని ఆదేశించినట్లు తెలిపారు. -
అగ్రశ్రేణి క్రికెటర్‌ను తాకింది...
ఢాకా/దుబాయ్: బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) రెండేళ్ల నిషేధం విధించింది. ఫిక్సింగ్ చేసేందుకు తనను కొందరు బుకీలు సంప్రదించిన సమయంలో అవినీతి నిరోధక బృందానికి షకీబ్ సమాచారం ఇవ్వకపోవడంతో అతనిపై చర్య తీసుకున్నట్లు ఐసీసీ ప్రకటించింది. 2018లో జరిగిన రెండు టోర్నీల సందర్భంగా షకీబ్‌ను బుకీ సంప్రదించాడు. బంగ్లా కెప్టె న్పై ఐసీసీ మూడు వేర్వేరు ఆరోపణలు చేసింది. అతను తన తప్పు అంగీకరించడంతో శిక్ష విధించింది. ‘అవినీతికి పాల్పడేందుకు ఎవరైనా సంప్రదించినప్పుడు ఏదైనా తప్పనిసరి కారణం ఉంటే తప్ప ఆలస్యం చేయకుండా వెంటనే సమాచారం అందించాలి. ఎంత ఆలస్యం చేస్తే విచారణ అంత సంక్లిష్టంగా మారుతుంది. సరిగ్గా చెప్పాలంటే ఏ మ్యాచ్ కోసమైతే సంప్రదించారో ఆ మ్యాచ్ ముగిసేవరకు కూడా ఆగరాదు’ అని ఐసీసీలోని అవినీతి నిరోధక విభాగంలో నిబంధన 2.4.4 చెబుతోంది. దీని ప్రకారం కనీసం ఆరు నెలల నుంచి గరిష్టంగా ఐదేళ్ల వరకు శిక్ష విధించవచ్చు. ఈ నిబంధనను షకీబ్ అతిక్రమించాడు. అత్యంత అనుభవజ్ఞుడైన షకీబ్‌కు నియమ నిబంధనలపై అన్ని రకాలుగా అవగాహన ఉందని, అయినా సరే అతను దీనిని వెల్లడించకపోవడం తప్పిదంగా భావిస్తున్నట్లు ఐసీసీ జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ వ్యాఖ్యానించారు. ప్రపంచ క్రికెట్లో చిన్నపాటి కుదుపు. మళ్లీ ఫిక్సింగ్ తుఫాన్ ఒక అగ్రశ్రేణి క్రికెటర్‌ను తాకింది. అయితే ఈ సారి కొంత భిన్నమైన రూపంలో! మ్యాచ్‌లు ఫిక్స్ చేయకపోయినా, అందుకు ప్రేరేపించిన వారి గురించి ఐసీసీకి సమాచారం ఇవ్వడంలో విఫలమైనందుకు తీవ్ర చర్య! బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్, ప్రపంచ నంబర్‌వన్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌పై రెండేళ్ల నిషేధం పడింది. ఫిక్సింగ్‌కు సంబంధించిన వివాదంలో ఒక అంతర్జాతీయ కెప్టెన్‌పై ఈ తరహాలో వేటు పడటం అనూహ్య, అరుదైన పరిణామం. తాజా శిక్ష నేపథ్యంలో 32 ఏళ్ల షకీబ్ కెరీర్ ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి. ఏడాది తర్వాత ఆడవచ్చు... రెండేళ్ల నిషేధంలో మొదటి సంవత్సరంలో షకీబ్ పూర్తిగా ఆటకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఈ మధ్య కాలంలో అతను మళ్లీ ఎలాంటి తప్పూ చేయరాదు. ఐసీసీ అవినీతి నిరోధక ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొనాల్సి ఉంటుంది. ఆ తర్వాతి 12 నెలలు అతనిపై ఐసీసీ పర్యవేక్షణ (సస్పెండెడ్ సెన్టెన్స్) కొనసాగుతుంది. 2020 అక్టోబర్ 29 నుంచి షకీబ్ మళ్లీ క్రికెట్ బరిలోకి దిగేందుకు అర్హుడవుతాడు. వరల్డ్ కప్‌కు దూరం... తాజా పరిణామంలో షకీబ్ భారత్‌తో జరిగే టెస్టు, టి20 సిరీస్‌లకు దూరమయ్యాడు. ప్రస్తుతం ఐసీసీ ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో 3వ (టెస్టు), 1వ (వన్డే), 2వ (టి20) స్థానాల్లో అతను కొనసాగుతున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా పలు లీగ్‌లలో షకీబ్ కీలక ఆటగాడు. నిషేధం నేపథ్యంలో వచ్చే ఏడాది ఐపీఎల్లో అతను ఆడే అవకాశం లేదు. అయితే అన్నింటికి మించి ఆస్ట్రేలియాలో జరిగే టి20 ప్రపంచ కప్ అవకాశాలు కోల్పోవడం బంగ్లాదేశ్ జట్టుకు పెద్ద దెబ్బ. ఈ టోర్నీ అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు జరుగుతుంది. అక్టోబర్ 29 నుంచి అతను అందుబాటులోకి వస్తున్నా నిషేధం కొనసాగుతున్న సమయంలో అతడిని ఎంపిక చేసే సాహసం బంగ్లా బోర్డు చేస్తుందా అనేది సందేహమే. విభేదాలే కారణమా! కొన్నాళ్ల క్రితం బంగ్లాదేశ్ క్రికెట్లో ఫిక్సింగ్‌కు సంబంధించి వార్తలు వచ్చాయి. ఇవేవీ నిర్ధారణ కాకున్నా బంగ్లా బోర్డుకు దీనిపై సమాచారమైతే ఉంది. అయితే ఇప్పుడు సరిగ్గా భారత్‌తో సిరీస్‌కు ముందు ఏడాది క్రితంనాటి అంశం బయటపడటం సందేహాలు రేకెత్తించింది. వారం రోజుల క్రితం తమ కాంట్రాక్ట్ ఫీజులు పెంచడం మొదలు ఇతర సమస్యలు తీర్చాలంటూ బంగ్లా క్రికెటర్లు సమ్మె చేయగా దీనికి షకీబ్ నాయకత్వం వహించాడు. చర్చలు సఫలమై సమ్మె ముగిసినా... అంతర్గతంగా పరిస్థితి చక్కబడలేదు. షకీబ్ తదితర ఆటగాళ్లు తిరుగుబాటు చేసి భారత్‌తో సిరీస్‌కు వెళ్లకుండా కావాలని అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ స్వయంగా బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ బహిరంగ వ్యాఖ్య చేయడం దీనిని నిర్ధారించింది. బుధవారం బంగ్లా జట్టు భారత్‌కు బయల్దేరాల్సి ఉంది. బోర్డు రాజకీయాలకు, షకీబ్ నిషేధానికి ఏదైనా సంబంధం ఉండవచ్చని వినిపిస్తోంది. ఐపీఎల్ వరకు ఆగమంటావా!...షకీబ్‌తో బుకీ వాట్సప్ సంభాషణ బంగ్లాదేశ్, శ్రీలంక, జింబాబ్వే పాల్గొన్న ముక్కోణపు వన్డే టోర్నీ, ఐపీఎల్లో ఒక మ్యాచ్‌కు సంబంధించి బుకీలు షకీబ్‌తో ఫిక్సింగ్ చేయించేందుకు ప్రయత్నించినట్లు ఐసీసీ వెల్లడించింది. ఈ మొత్తం వ్యవహారంలో భారత బుకీగా అనుమానిస్తున్న అగర్వాల్ అనే వ్యక్తి షకీబ్‌తో వాట్సప్ చాటింగ్ చేశాడు. ముందుగా 2017 నవంబర్‌లో ఢాకా ప్రీమియర్ లీగ్ సమయంలో ఒక మిత్రుడి ద్వారా షకీబ్ ఫోన్ నంబర్‌ను అగర్వాల్ తెలుసుకున్నాడు. ఆ తర్వాత తనను కలవాలనుకుంటున్నట్లు మెసేజ్‌లు పెట్టాడు. 2018 జనవరిలో ముక్కోణపు టోర్నీ సందర్భంగా ‘మనం ఈ టోర్నీలో పని చేద్దామా లేక ఐపీఎల్ వరకు ఆగమంటావా’ అని అగర్వాల్ సందేశం పంపాడు. 2018 ఏప్రిల్‌లో పంజాబ్, సన్‌రైజర్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. సన్‌రైజర్స్ తరఫున ఆ మ్యాచ్‌లో ఎవరెవరు ఆడుతున్నారో బుకీ తెలుసుకునే ప్రయత్నం చేశాడు. దీనికీ షకీబ్ స్పందించలేదు. ఆ తర్వాత అగర్వాల్‌ను బుకీగా భావించి తాను దూరమైనట్లు షకీబ్ ఐసీసీ విచారణలో వెల్లడించాడు. అయితే ఈ సమాచారం మొత్తం తమకు అందించకపోవడమే షకీబ్ చేసిన తప్పని ఐసీసీ చెప్పింది. నిషేధం కారణంగా నేను ఎంతో ప్రేమించే ఆటకు దూరం కావడం చాలా బాధగా ఉంది. అయితే బుకీ సంప్రదించిన విషయాన్ని చెప్పనందుకు నాపై విధించిన శిక్షను అంగీకరిస్తున్నాను. అవినీతికి వ్యతిరేకంగా పని చేయడంలో ఆటగాళ్లు ముందు వరుసలో ఉండాలని ఐసీసీ కోరుకుంటుంది. ఈ విషయంలో నా బాధ్యత నిర్వర్తించలేకపోయాను. క్రికెట్ అవినీతి రహితంగా ఉండాలనే చాలా మందిలాగే నేనూ కోరుకుంటున్నా. ఇకపై ఐసీసీ అవినీతి నిరోధక విభాగంతో కలిసి పని చేస్తా. నేను చేసిన తప్పును కుర్రాళ్లు చేయకుండా చూస్తా. –షకీబ్ అల్ హసన్ కెప్టెన్లుగా మోమిన్, మహ్ముదుల్లా షకీబ్ దూరమైన నేపథ్యంలో భారత్‌తో జరిగే టెస్టు, టి20 సిరీస్‌లకు బంగ్లాదేశ్ కొత్త కెప్టెన్లను ప్రకటించింది. టెస్టు జట్టుకు మోమినుల్ హక్, టి20 జట్టుకు మహ్ముదుల్లా కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. ఈ పర్యటనలో భారత్–బంగ్లా మధ్య 3 టి20 మ్యాచ్‌లు, 2 టెస్టులు జరుగుతాయి. మరోవైపు షకీబ్‌కు తాము అండగా నిలుస్తామని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రకటించారు. ‘షకీబ్ తప్పు చేశాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ విషయం తనకూ తెలుసు. ఐసీసీ నిర్ణయంలో ప్రభుత్వం చేసేదేమీ లేదు కానీ అతను తన తప్పు తెలుసుకొని మరింత తెలివైన ఆటగాడిగా తిరిగొస్తాడు’ అని హసీనా వ్యాఖ్యానించారు. వివాదాల ‘హీరో’ అంతర్జాతీయ క్రికెట్లో దాదాపు 12 వేల పరుగులు, 500కు పైగా వికెట్లు... మూడు ఫార్మాట్ల ర్యాంకింగ్స్‌లోనూ అగ్రస్థానంలో నిలిచిన ఏకైక ఆల్‌రౌండర్... ఒకే టెస్టులో సెంచరీ చేయడంతో పాటు రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి పది వికెట్లు పడగొట్టిన అరుదైన రికార్డు... 13 ఏళ్ల కెరీర్లో షకీబ్ అల్ హసన్ సాధించిన ఘనతలెన్నో... మరో మాటకు తావు లేకుండా, నిస్సందేహంగా అతను బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాడు. జట్టు సారథిగా కూడా అతను ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించాడు. అయితే అంతే స్థాయిలో అతను వివాదాలతో కూడా సహవాసం చేశాడు. తాజా నిషేధం నేపథ్యంలో గతంలో షకీబ్ చేసిన తప్పుల జాబితాను చూస్తే... ►2010 సైట్‌స్క్రీన్‌కు అడ్డుగా వచ్చిన అభిమానిని దూషించి బ్యాట్‌తో కొట్టేందుకు ప్రయత్నించాడని ఆరోపణ. మ్యాచ్ రిఫరీ హెచ్చరిక. కొన్నాళ్లకు ఢాకాలోని సొంత మైదానంలోనే ప్రేక్షకులు గేలి చేయడంతో వారిని తిడుతున్న ఫోటోలు బయటకు వచ్చాయి. మూడేళ్ల తర్వాత ఇదే మైదానంలో మ్యాచ్ చూస్తున్న తన భార్యపై కామెంట్ చేశారంటూ ఒక అభిమానితో గొడవ. మ్యాచ్ సమయంలో డ్రెస్సింగ్ రూమ్ వదిలి వెళ్లడంపై హెచ్చరిక. ►2014 షకీబ్ కెరీర్లో ఇది తీవ్ర ఘటన. శ్రీలంకతో మ్యాచ్‌లో తాను అవుటైన తీరును భారీ స్క్రీన్‌పై కెమెరామెన్ చూపించడంతో...అక్కడ కాదు ‘ఇక్కడ’ చూడమన్నట్లుగా అసభ్య సైగలు చేశాడు. మూడు వన్డేల నిషేధం, జరిమానా పడగా, ఆ తర్వాత క్షమాపణ కోరాడు. ►2014 ప్రవర్తన ఏమాత్రం సరిగ్గా లేదంటూ బంగ్లా బోర్డు ఆరు నెలల నిషేధం విధించింది. ఆ తర్వాత జట్టు కోచ్ హతురసింఘేతో గొడవ పడ్డాడు. ►2018 శ్రీలంకతో నిదాహస్ ట్రోఫీ మ్యాచ్‌లో అంపైర్లు ‘నో బాల్’ ఇవ్వనందుకు నిరసనగా సహచరులతో సహా మైదానం వీడి మ్యాచ్‌ను బహిష్కరించే ప్రయత్నం చేశాడు. ఐసీసీ 25 శాతం మ్యాచ్ ఫీజు జరిమానాగా విధించింది. షకీబ్ అంతర్జాతీయ కెరీర్ -
మా ఊళ్లో మద్యం వద్దు !
మరికల్ (నారాయణపేట): గాంధీజీ కన్న కలలను సాకారం చేసేందుకు మండలంలోని మాధ్వార్ గ్రామస్తులు అడుగులు వేస్తున్నారు. ఆగస్టు 15 నుంచి సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం మంగళవారం గ్రామస్తులు తిర్మానం చేశారు. మద్య నిషేధ సమయంలో గ్రామంలో ఎవరైనా మద్యం అమ్మకాలు చేపడితే రూ.40వేల జరిమానా విధిస్తామని సర్పంచ్ పుణ్యశీల తిర్మానించారు. మహిళా సర్పంచ్ ముందడుగు.. మరికల్ మండలం మాధ్వార్‌లో 845 కుటుంబాలు ఉండగా 3,568 మంది జనాబా ఉంది. ఇటీవల కాలంలో గ్రామంలో మద్యం సేవించి భవిష్యత్‌ను బుగ్గిపాలు చేసుకుంటున్న యువతను మార్చేందుకు మాహిళ సర్పంచ్ పుణ్యశీల ముందుగా నడుం బిగించారు. ఆమె పిలుపు అందుకున్న మిగితా ప్రజాప్రతినిధులు, యువకులు, గ్రామస్తులు, మహిళలు పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు తిర్మానించారు. ఇందుకు గ్రామస్తులు సైతం ముందుకు వచ్చి తమ సంసారాలు బాగుపడుతాయంటే ఇంతకంటే ఏం కావాలంటూ పంచాయతీ కార్యాలయం ఎదుట మద్యం నిషేదిస్తున్నట్లు ప్రతిజ్ఞా చేశారు. ఆగష్టు 15 తర్వాత మాధ్వార్‌లో ఎవరైన మద్యం అమ్మకాలు చేప్పడితే రూ. 40 వేలు జరిమాన విధిస్తామని తిర్మానం చేశారు. అంతలో ఏమైన మద్యం మిగిలివుంటే ఆగస్టు 14 వరకు విక్రయించుకోవాలని వారికి వెసులుబాటు కల్పించి మిగితా గ్రామాలకు ఆదర్శంగా నిలిచారు. యువత పెడదారి పట్టొద్దనే నిర్ణయం యువత పెడదారి పట్టకుండా ఉండేందుకే గ్రామంలో మద్యం నిషేదించడం జరిగింది. ఇటీవల కాలంలో గ్రామంలో యువకులతో పాటు మహిళలు కూడా మద్యం సేవించి అలర్లకు కారణమవుతున్నారు. మాధ్వార్ గ్రామాన్ని ఒక ప్రశాంతమైన గ్రామంగా తీర్చేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది. – పుణ్యశీల, సర్పంచ్, మాధ్వార్ -
టిక్ టాక్‌కు మరో షాక్ : గూగుల్ బ్యాన్
సోషల్ మీడియా సంచలనం, చైనా యాప్ 'టిక్ టాక్'కు మరో షాక్ తగిలింది. ఇటీవల మద్రాస్ హైకోర్టు బ్యాన్, సుప్రీం ఆదేశాలు, కేంద్ర ప్రభుత్వం చర్యల నేపథ్యంలో టిక్ టాక్ యాప్‌ను గూగుల్ బ్యాన్ చేసిందని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. టిక్‌టాక్ డౌన్లోడ్లను నిషేధించాలనే కోర్టు ఆదేశాలకు అనుగుణంగా గూగుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. టిక్ టాక్ యాప్ నిషేధంపై స్టే విధించాలంటూ చైనాకు చెందిన బైటెన్స్ టెక్నాలజీ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించిన కొన్ని గంటల తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం భారతదేశంలో గూగుల్ ప్లే స్టోర్‌లో టిక్ టాక్ అందుబాటులో లేదు. అయితే యాపిల్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. తాజా పరిణామంపై గూగుల్, యాపిల్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఏప్రిల్ 3నాటి మద్రాస్ కోర్టుతీర్పును సవాల్ చేస్తూ బైటెన్స్ టెక్నాలజీ అభ్యర్థను సుప్రీంకోర్టు ఆశ్రయించింది. కింది కోర్టు తీర్పును సమర్ధించిన చీఫ్ జస్టిస్ రంజన్ గోగొయ్ నేతృత్వంలోని కమిటీ తదుపరి విచారణను ఈ నెల( ఏప్రిల్) 22కి వాయిదా వేసింది. మద్రాస్ హైకోర్టు విధించిన నిషేదం అప్పటి వరకూ కొనసాగుతుందని చెప్తూనే గూగుల్, ఆపిల్ సంస్థలను టిక్ టాక్ వాడకంలో ఉండడం వల్ల నష్టాలేంటో లిఖిత వివరణ ఇవ్వాలని ఆదేశించింది. యాప్ స్టోర్ల నుంచి టిక్ టాక్‌ను తొలగించాలని పేర్కొంది. చైనా ఆధారిత యాప్ అయిన టిక్ టాక్‌ను తమిళనాడులో నిషేదించాలన్న అభ్యర్థన సమర్దించిన మద్రాస్ హైకోర్టు యాప్‌పై నిషేధాన్ని విధించింది. అలాగే గూగుల్, ఆపిల్ స్టోర్లలో ప్రమాదకరమైన యాప్‌ను తొలగించాలని కేంద్రాన్ని కోరింది. టిక్ టాక్, హలో యాప్‌లు దేశవ్యాప్తంగా టీనేజర్లు, యువతపై దుష్ర్పభావాన్ని చూపిస్తున్నయని పేర్కొంది. దీనికి అనుకూలంగానే సుప్రీం కూడా తీర్పునివ్వడంతో గూగుల్ ఈ చర్యకు తీసుకున్నట్టు సమాచారం. కాగా కొద్ది రోజుల ముందే టిక్ టాక్‌లో అభ్యంతరకర వీడియోలు ఉన్నాయంటూ ఫిర్యాదు అందడంతో 6 మిలియన్ వీడియోలను తొలగించింది టిక్ టాక్. ప్రపంచవ్యాప్తంగా ఉన్నయాప్లలో గూగుల్, ఆపిల్ తర్వాత టిక్ టాక్ మూడో స్థానంలో కొనసాగుతోంది. సెన్సార్ టవర్ ఫిబ్రవరిలో అందించిన సమాచారం ప్రకారం ఇదిభారతదేశంలో 240 మిలియన్లకంటే ఎక్కువసార్లు డౌన్లోడ్ అయింది. 30 మిలియన్ల కంటే ఎక్కువమంది వినియోగదారులు 2019 జనవరిలో ఈ యాప్‌ను ఇన్స్టాల్ చేశారట. గత ఏడాది ఇదే నెలలో పోలిస్తే ఇది 12 రెట్లు ఎక్కువ. అంతేకాదు భారతదేశంలో 250కు పైగా ఉద్యోగులను నియమించుకున్న సంస్థ తన వ్యాపారాన్ని విస్తరణకు ఎక్కువ పెట్టుబడులకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందట. మరోవైపు ఇప్పటికే అమెరికా, బ్రిటన్, హాంకాంగ్, ఇండోనేషియా దేశాల్లో దీనిపై పూర్తి నిషేధం అమల్లో ఉంది. -
జయసూర్యపై రెండేళ్ల నిషేధం
దుబాయ్: శ్రీలంక విఖ్యాత క్రికెటర్ సనత్ జయసూర్యపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) రెండేళ్ల నిషేధం విధించింది. నిషేధ సమయంలో అతను ఏ విధమైన క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు. క్రికెట్ బోర్డులో ఎలాంటి పదవులు చేపట్టకూడదు. 1996లో లంకకు వన్డే ప్రపంచకప్ అందించడంలో కీలకపాత్ర పోషించిన ఈ మాజీ డాషింగ్ ఓపెనర్ ఐసీసీ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించాడు. విచారణలో సహకరించకుండా, సాక్ష్యాల్ని ధ్వంసం చేసినట్లు ఏసీయూ ధ్రువీకరించింది. దీంతో మంగళవారం అతనిపై వేటు వేసింది. ఏదేమైనా అతనిపై గరిష్టంగా ఐదేళ్ల నిషేధం విధించే అవకాశాలున్నప్పటికీ అతని ‘గత చరిత్ర’ బాగుండటంతో రెండేళ్ల నిషేధంతో సరిపెట్టినట్లు ఏసీయూ జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ వెల్లడించారు. తీవ్రమైన అవినీతి ఆరోపణలెదుర్కొంటున్న జయసూర్యపై ఐసీసీ 2017లోనే విచారణకు ఆదేశించింది. ఏసీ యూ జనరల్ మేనేజర్ అలెక్స్ ఆధ్వర్యంలోని బృందం అతన్ని పలుమార్లు విచారించింది. 2017లో సెప్టెంబర్ 22, 23, ఆక్టోబర్ 5 తేదీల్లో జయసూర్యను విచారించాక... ఈ కేసులో ప్రధాన సాక్ష్యం ‘ఫోన్–సంభాషణే’ అని ఏసీయూ ప్రాథమికంగా ధ్రువీకరించింది. దీంతో అతని వద్ద ఉన్న రెండు మొబైల్ ఫోన్లను ఏసీయూకు సరెండర్ చేయాల్సిం దిగా ఆదేశించింది. కానీ లంక మాజీ ఓపెనర్ మాత్రం నిరాకరిస్తూ... చివరకు ఆ ఫోన్లను పగులగొట్టాడు. దీంతో ఐసీసీ ప్రవర్తన నియమావళిలోని 2.4.6 ఆర్టికల్ ప్రకారం విచారణకు సహకరించకపోవడం, 2.4.7 ప్రకారం సాక్ష్యాల్ని ధ్వంసం చేసినట్లు రుజువు కావడంతో అతనిపై ఐసీసీ శిక్షను ఖరారు చేసింది. రెండేళ్ల నిషేధం గత ఏడాది అక్టోబర్ 16 నుంచి అమలవుతుందని ప్రకటించింది. ఆటపట్ల ఉన్న ప్రేమ కారణంగా ఐసీసీ విధించిన నిషేధాన్ని తాను అంగీకరిస్తు న్నట్లు, దీనిపై ఎలాంటి అప్పీల్ చేసే ఉద్దేశం లేదని జయసూర్య వివరణ ఇచ్చాడు. -
టీడీపీ ఎంపీ సీఎం రమేష్ వాట్సాప్ అకౌంట్‌ను రద్దు
-
టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌కు వాట్సాప్ షాక్
సాక్షి, అమరావతి : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ అన్నంత పనీ చేసింది. అనుమానాస్పద, వివాదాస్పద ఖాతాలను తొలగిస్తామని ఇటీవల ప్రకటించిన వాట్సాప్ యాజమాన్యం టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌కు భారీ షాక్ ఇచ్చింది. సంస్థ నిబంధనలు ఉల్లంఘించడంతో ఆయన వాట్సాప్ అకౌంట్‌ను రద్దు చేసింది. వాట్సాప్ ఇతర వినియోగదారుల నుంచి అందిన ఫిర్యాదులపై విచారణ అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తన వాట్సాప్ అకౌంట్ పనిచేయడం లేదంటూ సీఎం రమేశ్ పంపిన లేఖకు స్పందించిన సంస్థ ఈ వివరణ ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వివాదాస్పద రాజకీయ పోస్టులు, కామెంట్లపై కఠినంగా వ్యవహరించనున్నట్లు సోషల్ మీడియా సంస్థలు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివిధ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల అకౌంట్లపై నిఘా పెట్టింది. అయితే ఇలా కీలకమైన ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం కావాలనే తనపై ఇలాంటి కుట్రలు చేస్తోందని సీఎం రమేష్ ఆరోపించారు. అయితే పొరపాటున తప్పు జరిగి వుంటే ..ఇకపై అలాంటిది జరగకుండా చూసుకుంటానని తన ఖాతాను పునరుద్ధరించాలని ఆయన వాట్సాప్‌ను కోరారు. -
తాజ్ వద్ద నమాజ్ వద్దు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : ‘తాజ్‌మహల్ ఏడో ప్రపంచ వింత.. కాబట్టి ఇక మీదట అక్కడ వద్ద నమాజ్ చేయరాద’ని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ ఏడాది, జనవరి 24న ఆగ్రా జిల్లా అదనపు కోర్టు.. ‘ఇకమీదట స్థానికులు మాత్రమే తాజ్‌మహల్ వద్ద ప్రార్ధనలు చేయాలి.. స్థానికేతరులకు తాజ్ వద్ద నమాజ్ చేసేందుకు అనుమతి లేదం’టూ తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని బెంచ్ ఆగ్రా ఏడీఎమ్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ తాజ్‌మహల్ వద్ద స్థానికేతరులు నమాజ్ చేయరాదని స్పష్టం చేసింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తాజ్ వద్దకు విదేశీ టూరిస్టులు కూడా వస్తుంటారని, భద్రత దృష్ట్యా నమాజ్ చేసుకోవడాన్ని నిలిపివేయాలని కోర్టు తెలిపింది. నేటికి ప్రతి శుక్రవారం తాజ్‌మహల్ సందర్శనకు యాత్రికులను అనుమతించరు. ఆ రోజున స్థానిక ముస్లింలు తాజ్ వద్ద నమాజ్ చేస్తారు. అయితే ఇటీవల బంగ్లాదేశ్‌తో పాటు ఇతర దేశాల ముస్లిం అక్కడకు వచ్చి నమాజ్ చేయడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తాజ్‌మహల్‌ను సందర్శించేందుకు విదేశీ టూరిస్టులు ఏడాది పాటు వస్తుంటారు. భద్రత దృష్ట్యా తాజ్ వద్ద స్థానికేతరులు నమాజ్ చేసుకోవడాన్ని నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కిషోర్ కుమార్‌ను వదల్లేదు
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఎమర్జెన్సీ’కి వ్యతిరేకంగా పోరాడిన వారిని ప్రశంసిస్తూ...వారికి కృతజ్ఞతలు తెలపడం కోసం మంగళవారం ముంబైలో ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 1975 నాటి రోజులను గుర్తు చేస్తూ ఎమర్జేన్సీ కాలంలో కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ కుటుంబం జయప్రకాశ్ నారాయణ్ , వాజ్‌పేయ్, అద్వాణీ వంటి ప్రముఖ నాయకులనే కాక మీడియాను కూడా తీవ్రంగా అణచి వేసిందని విమర్శించారు. ఎమర్జేన్సీని సాకుగా ఉపయోగించుకుని అలనాటి ప్రఖ్యాత గాయకుడు కిషోర్ కుమార్‌ను కూడా బ్లాక్ లిస్ట్‌లో చేర్చిందని మోదీ తెలిపారు. ఈ విషయం గురించి ‘ఎమర్జేన్సీ కాలంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఒక ర్యాలీ కోసం కిషోర్ కుమార్‌ను పాట పాడమని కోరారు. కానీ ఆయన అందుకు అంగీకరించలేదు. అదే ఆయన చేసిన పెద్ద నేరం. దాంతో టీవీల్లో, రేడియోల్లో ఆయనను కనిపించకుండా, వినిపించకుండా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంతేకాక ఆ సమయంలో ఆయన నేపధ్య గాయకుడిగా రూపొందించిన ‘ఆంధీ’(గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా తెరకెక్కిన పొలిటికల్ డ్రామా) చిత్రాన్ని విడుదల కాకుండా నిషేధించింది. ఇది ఆ పార్టీ మనస్తత్వం’ అంటూ మోదీ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. 1976 - 77 ఎమర్జేన్సీ కాలంలో సమాచార, ప్రసార శాఖ మంత్రిగా ఉన్న వీసీ శుక్లా కిషోర్ కుమార్‌ను బ్లాక్ లిస్ట్‌లో చేర్చారు. వీసీ శుక్లా అప్పట్లో ఇందిర గాంధీ చిన్న కొడుకు సంజయ్ గాంధీకి చాలా సన్నిహితంగా ఉండేవాడు. -
బాల్ ట్యాంపరింగ్; మరో క్రికెటర్‌పై నిషేధం
దుబాయ్ : బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీలంక జట్టుకు ‘ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్’(ఐసీసీ) గట్టి షాక్ ఇచ్చింది. శ్రీలంక కెప్టెన్ దినేశ్ చండిమాల్‌పై ఐసీసీ ఒక టెస్టు మ్యాచ్ నిషేధంతో పాటు మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత విధించింది. దీంతో వెస్టిండీస్‌తో జరుగనున్న టెస్టు సిరీస్ చివరి మ్యాచ్‌కు చండిమాల్ దూరం కానున్నాడు. గత శనివారం సెయింట్ లూసియా టెస్టు మ్యాచ్‌లో భాగంగా శ్రీలంక జట్టుపై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ మ్యాచ్‌లో చండీమాల్ బాల్ కండీషన్ మార్చడానికి ప్రయత్నించాడనే ఆరోపణల ఎదుర్కొన్నాడు. దాంతో వీడియో ఫుటేజీ ఆధారంగా ఈ విషయాన్ని పరిశీలించిన ‘ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్’ను చండిమాల్ అతిక్రమించాడని నిర్ధారించి ఈ చర్యలు తీసుకుంది. -
రిజర్వ్ ఫారెస్ట్‌లో ప్లాస్టిక్ నిషేధం
మన్ననూర్ (అచ్చంపేట) : అమ్రాబాద్ పులుల రక్షిత ప్రాంతం (కోర్ ఏరియా)లో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తున్నామని వాటి స్థానంలో పేపర్, బట్ట సంచులను అందుబాటులో ఉంచుతున్నట్లు ఫీల్డ్ డైరెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. మంగళవారం అటవీశాఖ ఈసీ సెంటర్ వద్ద డబ్లూడబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు. మానవ మనుగడతో పాటు జీవరాశులకు ముప్పు కలిగించే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. వన్యప్రాణులకు అమ్రాబాద్ అభయారణ్యం దేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగి ఉండటం గర్వకారణమని అన్నారు. ఈ క్రమంలో పర్యాటకులు, అటవీ సమీప గ్రామాల ప్రజలు ప్లాస్టిక్‌ను ఉపయోగించడం, పారబోయడంతో వాటిని తింటున్న వన్యప్రాణులు మృత్యవాతపడుతున్నాయని అన్నారు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ డైరెక్టర్ ఫరీదా టంపల్ మాట్లాడుతూ శ్రీశైలం – హైదరాబాద్ ప్రధాన రహదారి వెంట అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించి వన్యప్రాణులను కాపాడాలన్నారు. ఈ ప్రాంతంలో పేవర్ కవర్ల తయారీ కోసం కుటీర పరిశ్రమను మరో నెల రోజుల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పేపర్ కవర్ల తయారీ కోసం చెంచు మహిళలకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామన్నారు. అడవులను, జంతుజాలాన్ని రక్షించుకోవాలని కళాకారుల ఇచ్చిన ప్రదర్శన, ఆట పాటలు ఆకట్టుకున్నాయి. యాత్రికులకు పేపర్ కవర్లు అందజేత అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద డబ్ల్యూడబ్ల్యూఎఫ్, శ్రీనివాస ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శ్రీశైలం వెళ్లే యాత్రికులకు పేపర్ కవర్లు అందజేశారు. టోల్గేట్ రూ.20లకు అదనంగా రూ.5 వసూలు చేసి కవర్ అందిస్తున్నారు. దీంతోపాటు మరో రూ.25 అదనంగా వసూలు చేస్తున్నారు. మన్ననూర్ నుంచి దోమలపెంట వరకు ఎలాంటి చెత్త, వ్యర్థాలు ఉన్నా రోడ్డు పక్కన వేయకూడదు. కవర్లో వేసి దోమలపెంట చెక్‌పోస్టు వద్ద అటవీశాఖ సిబ్బందికి కవర్ అందించాలి. వారు రూ.25 తిరిగి ఇస్తారని అధికారులు తెలిపారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు పర్యావరణ రోజు సందర్భంగా అమ్రాబాద్, మన్ననూర్ రేంజ్ పరిధిలోని ఆయా పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో శ్రీనివాస ఛారిటబుల్ ట్రస్టు డైరెక్టర్ శ్రీనివాస్, డీఎఫ్ఓ జోజీ,ఎఫ్ఆర్ఓలు ప్రభాకర్, శ్రీదేవి ఎఫ్ఎస్ఓ రామాంజనేయులు సిబ్బంది బాబలి, వెంకటేశ్వర్లు, కనకయ్య, కళాకారులు మాడ్గుల నర్సింహ, లింగస్వామి, బీముడు, ఆయా చెంచుపెంటల మహిళలు పాల్గొన్నారు. -
మళ్లీ సిరంజీల కలకలం
గోల్డ్‌కోస్ట్: కామన్వెల్త్ క్రీడల్లో డోపింగ్ నిరోధానికి ఉద్దేశించిన సిరంజీ రహిత (నో నీడిల్స్) నిబంధన ఉల్లంఘించినందుకు భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు రాకేశ్ బాబు (ట్రిపుల్ జంపర్), ఇర్ఫాన్ (రేస్ వాకర్) శుక్రవారం బహిష్కరణకు గురయ్యారు. ఇర్ఫాన్ పడక గదిలో, రాకేశ్ బ్యాగ్‌లో సిరంజీలు బయటపడటంతో వారు తక్షణం క్రీడా గ్రామం వదిలి వెళ్లాలని కామన్వెల్త్ క్రీడా సమాఖ్య (సీజీఎఫ్) అధ్యక్షుడు లూయీస్ మార్టిన్ ఆదేశించారు. కాగా, ఇర్ఫాన్ తన విభాగమైన 20 కి.మీ. నడకలో 13వ స్థానంలో నిలిచి ఇప్పటికే పతకానికి దూరమయ్యాడు. రాకేశ్ శుక్రవారం పోటీలో పాల్గొనాల్సి ఉన్నా మోకాలి గాయంతో ముందే వైదొలిగాడు. మరోవైపు క్రీడల ప్రారంభానికి ముందు భారత బృందం బస చేసిన హోటల్ సమీపాన సిరంజీలు బయటపడటం కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజా ఘటనపై భారత చెఫ్ డి మిషన్ విక్రమ్ సిసోడియా, జనరల్ టీమ్ మేనేజర్ నామ్‌దేవ్ షిర్గోంకర్, అథ్లెటిక్స్ టీమ్ మేనేజర్ రవీందర్ చౌధరిలను సీజీఎఫ్ కోర్టు తీవ్రంగా హెచ్చరించింది. క్రీడలు ముగిశాక ఈ ఘటనపై విచారణ చేపట్టి అథ్లెట్లను శిక్షిస్తామని భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) పేర్కొంది. ఈ నిర్ణయాన్ని పూర్తిగా అంగీకరించలేమని, ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాత అప్పీల్‌కు వెళ్తామని షిర్గోంకర్ మీడియా సమావేశంలో తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) మాజీ కార్యదర్శి బీకే సిన్హా ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల విచారణ సంఘాన్ని నియమిస్తున్నట్లు ఏఎఫ్ఐ అధ్యక్షుడు ఆదిల్ సుమరివాలా తెలిపారు. వికాస్‌కు డోప్ పరీక్ష... ఈ క్రీడల్లో కాంస్య పతకం గెలిచిన భారత వెయిట్ లిఫ్టర్ వికాస్ ఠాకూర్ అనూహ్యంగా డోప్ పరీక్ష ఎదుర్కొన్నాడు. పోటీలు ముగిశాక బుధవారం తిరుగు పయనమైన అతడికి చివరి నిమిషంలో ఈ పరిస్థితి ఎదురైంది. ఇర్ఫాన్, రాకేశ్‌లతో పాటు మరో ఆటగాడిని పరీక్షించాలని కామన్వెల్త్ మెడికల్ కమిషన్ కోరడంతో వికాస్‌ను పంపినట్లు షిర్గోంకర్ తెలిపారు. అయితే... ఠాకూర్ ఎలాంటి పొరపాటు చేయనట్లు తేలిందన్నారు. -
యూట్యూబ్ సంచలన నిర్ణయం
న్యూయార్క్ : ప్రముఖ వీడియో వెబ్సైట్ ‘యూట్యూబ్’ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయుధాల తయారీ, అమ్మకాలకు సంబంధించిన వీడియోలను తమ సైట్లో నిషేధించాలని నిర్ణయించింది. ఆయుధాల వాడకంతో సమాజంలో చోటుచేసుకుంటున్న తీవ్ర పరిణామాలతో ఆంక్షలను యూట్యూబ్ కఠినతరం చేసింది. గత నెల అమెరికాలోని పార్క్‌లాండ్ స్కూల్లో చోటుచేసుకున్న సామూహిక కాల్పుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్ధ తెలిపింది. నాలుగు నెలలుగా ఈ విషయంపై సంస్థ నిపుణులతో చర్చలు జరిపి ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించింది. ఆయుధాలను ఎలా ఉపయోగించాలో తెలిపే వీడియోలను య్యూట్యూబ్ ఇదివరకే నిషేధించిన విషయం తెలిసిందే. ఈ వీడియోలను చూసి స్ఫూర్తి పొందిన ఓ వ్యక్తి లాస్‌వెగాస్‌లో 58 మందిని కాల్చి చంపాడు. ఈ ఘటన అనంతరం యూట్యూబ్ ఆయుధాలకు సంబంధించిన వీడియోలపై నిషేదం విధించింది. వచ్చే నెల నాటికి పూర్తి స్థాయిలో ఈ నిషేధాన్ని అమలులోకి తెస్తామని సంస్థ తెలిపింది. -
కాటన్ సీడ్.. మరో ఫ్రాడ్
సాక్షి, గద్వాల : నడిగడ్డలో విత్తనోత్పత్తి కంపెనీల బాగోతాలు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. ఇటీవల ఐటీ శాఖ అధికారులు చేసిన దాడుల్లో రైతుల సంతకాలు ఫోర్జరీ చేసి రైతుల భూములను లీజ్‌కు తీసుకున్నట్లు అగ్రిమెంట్లు సృష్టించినట్లు బహిర్గతమైన విషయం విదితమే. తాజాగా కేంద్ర ప్రభుత్వం నిషేధించిన అనుమతి లేని బీటీ–3 విత్తనాలను గద్వాల కేంద్రంగా వ్తితన కంపెనీలు సాగు చేస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ పరిశోధన శాస్త్రవేత్తల బృందం, డీఎన్ఏ పరిశోధన సంస్థ నిర్ధారించినట్లు తేలడం గమనార్హం. గతనెల 18న కేంద్ర వ్యవసాయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు, అ«ధికారులు, విత్తన ధ్రువీకరణ సంస్థల ప్రతినిధులు జోగుళాంబ గద్వాల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా 300 పత్తి విత్తనాల శాంపిళ్లను సేకరించి ఢిల్లీ ల్యాబ్‌లో పరీక్షించగా బీటీ–3 విత్తనాల సాగు జరుగుతోందని గుర్తించినట్లు తెలిసింది. గత నెలలోనే ఓ గోదాంలో పట్టుబడిన ఒక కంపెనీకి చెందిన ఐదు శాంపిళ్లలో మూడింటిలో బీటీ–3 విత్తనాలు ఉన్నట్లు రాష్ట్ర, కేంద్ర పరిశోధన బృందం నిర్ధారించినట్లు సమాచారం. ఈ నివేదికను జిల్లా వ్యవసాయశాఖకు పంపించినట్లు తెలిసింది. కానీ ఆ శాఖ అధికారులు మాత్రం అధికారికంగా ధ్రువీకరించడం లేదు. ఇన్‌కం ట్యాక్స్ దాడులు మరువకముందే.. జోగుళాంబ గద్వాల విత్తన పత్తికి ప్రసిద్ధి. జిల్లాలో దాదాపు కోటి ప్యాకెట్ల పత్తి విత్తనాలను రైతులు సాగు చేస్తున్నారు. అయితే పన్నుల చెల్లింపులో తేడాలు రావడంతో జనవరి నెలలో ఇన్‌కం ట్యాక్స్ అధికారులు విత్తన కంపెనీలపై దాడులు చేశారు. గద్వాలలో రైతుల వద్దకు, ఆర్గనైజర్ల వద్ద నేరుగా విచారణ జరిపారు. రైతుల భూములను లీజుకు తీసుకుని విత్తనాలను సాగు చేస్తున్నట్లు విత్తన కంపెనీలు తప్పుడు పత్రాలను సృష్టించినట్లు ఐటీ శాఖ తనిఖీల్లో తేలింది. రెండు విత్తన కంపెనీలు దాదాపు రూ.1,700 కోట్ల ఆదాయ పన్ను ఎగవేసినట్లు ఐటీ శాఖ గుర్తించింది. గత నెలలో కేంద్ర బృందాల ఆరా కేంద్ర ప్రభుత్వ అనుమతి లేని గడ్డిమందును తట్టుకునే పత్తి రకాలు సాగు చేస్తున్నారా, గడ్డి మందు అయిన హెచ్‌టీ(హెర్బిసైడ్ టాలరెంట్) వంటి మందు వాడకంపై కేంద్ర బృందాలు గత నెల 18న జిల్లాలో ఆరా తీశాయి. భారత ప్రభుత్వం తరపున న్యూఢిల్లీలోని భారతీయ పరిశోధన సంస్థ, నాగ్‌పూర్ కేంద్ర పత్తి పరిశోధన సంస్థ, బయోటెక్నాలజీ మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వశాఖ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల బృందంతో పాటు తెలంగాణ రాష్ట్ర విత్తన దృవీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కె.కేశవులు, తెలంగాణ వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయం జేడీ రాజారత్నం నేతృత్వంలోని బృందం జోగుళాంబ గద్వాల జిల్లాలోని మల్దకల్ మండలంలోని పెద్దపల్లి, బూడిదపాడు, అమరవాయి గ్రామాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా పత్తి పంటను పరిశీలించి గడ్డి మందు అయిన గ్రై ఫోసెట్, హెచ్‌టీ మందు వాడకంపై రైతులతో ఆరా తీశారు. ఈ సందర్భంగా కాటన్‌సీడ్ మిల్లుల్లో కాటన్ సీడ్ పత్తిని, విత్తనాలను, కెమికల్‌తో శుద్ది చేసిన విత్తనాల శాంపిళ్లను సేకరించి వాటిని పరిశోధనలకు పంపించారు. బీటీ–3పై నిషేధం ప్రస్తుతం దేశంలో సాగవుతున్న పత్తిలో బీటీ–1, బీటీ–2 విత్తనాలను రైతులు వినియోగిస్తున్నారు. ఇందులో కలుపు తొలగించేందుకు హెచ్‌టీ (హెర్బిసైడ్ టాలరెంట్) గడ్డి మందు స్ప్రే చేస్తే గడ్డితో పాటు పత్తి పంట కూడా చనిపోతుంది. దీంతో రైతులు ఎలాంటి మందులు వినియోగించకుండా కూలీలతో కలుపు తొలగించుకుంటుండగా ఎకరానికి రూ.10వేల వరకు ఖర్చవుతోంది. బీటీ–3 విత్తనాలతో సాగు చేస్తే హెచ్‌టీ స్ప్రే తట్టుకునే శక్తి పత్తి పంటకు ఉంటుంది. అ యితే, విత్తనాలకు కేంద్ర వ్యవసాయ పరిశోదన సం స్థ అనుమతి ఇవ్వలేదు. ఈ రకంపై హెచ్‌టీ గడ్డి మందులు వాడితే వాతావరణ సమతుల్యం దెబ్బతింటుందని, పర్యావరణానికి ముప్పు ఉంటుం దని కేంద్ర ప్రభుత్వం గుర్తించి, బీటీ– 3ను నిషేధించింది. కానీ కొన్ని కంపెనీలు ఈ విత్తనాలను సాగు చేయించి మార్కెట్లో అమ్మకాలు సాగిస్తున్నా యనే సమాచారం అందగా కేంద్ర వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తల బృందం దేశంలోని వివిధ ప్రాం తాలతో పాటు గద్వాలలో పర్య టించి శాంపిళ్లను సేకరించింది. ఈ క్రమంలోనే జిల్లాలో బీటీ–3 పండిస్తున్నట్లు గా గుర్తించినట్లు తెలిసింది. అయితే, దీనిని జిల్లా వ్యవశాఖ అధి కారి గోవింద్‌నాయక్ ధృవీకరించలేదు. -
పనిస్థలాల్లో సెల్ఫోన్ల నిషేధం
భద్రాద్రి కొత్తగూడెం : పని ప్రదేశాల్లో సెల్‌ఫోన్ వినియోగాన్ని నిషేధిస్తూ సింగరేణి యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. కార్మికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా భూగర్భగనులు, ఓసీపీల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ ఆదేశాలు కచ్చితంగా పాటించాలని సూచించింది. సెల్‌ఫోన్ వినియోగాన్ని నిలిపివేస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఈ నెల 21న సీఆర్పీ/ఐఎస్ఓ/2017/642 పేరున సర్క్యూలర్ విడుదల చేశారు. పనిస్థలాల్లోకి సెల్ఫోన్లు వాడటం మూలంగా ఏకాగ్రత తగ్గిపోయి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తు తం సెల్‌ఫోన్ వాడకం జీవితంలో నిత్యకృత్యం గా మారిందని, అదే సెల్‌ఫోన్ వల్ల ఓసీపీల్లోని భారీయంత్రాలు నడిపే ఈపీ ఆపరేటర్లు డంపర్ల వాడకం మూలంగా ప్రమాదాలు పెరిగిపోయినట్లు యాజమాన్యం గుర్తించింది. దీంతో సంస్థ వ్యాప్తంగా ప్రమాదాల సంఖ్య పెరిగిందని గుర్తించినట్లు పేర్కొంటున్నారు. డంపర్లలో సెల్ జామర్లు.. గతంలో డంపర్లలో సెల్ఫోన్లు పనిచేయకుండా సెల్‌జామర్లు అమర్చారు. జామర్లు ఏర్పాటు చేయడం వల్ల తమకు రేడియషన్ సమస్య ఏర్పడి ఇబ్బంది అవుతోందని కొన్ని ప్రాంతాల్లో ఈపీ ఆపరేటర్లు గొడవ చేయడంతో వాటిని తొలగించారు. ఇటీవల కాలంలో ఓసీపీ–1 లో రెండు డంపర్లు ఢీకొనడం, ఆరునెలల క్రితం ఓసీపీ–3లో డంపర్ ఢీకొని ఓవర్‌మెన్ మృతి చెందిన సంఘటలన్నీ కేవలం సెల్ఫోన్లు వాడటం వల్లే జరిగినట్లుగా ప్రాధమికంగా అధికారులు నిర్థారించారు. గనులపై అవగాహన సదస్సుల ఏర్పాటు గనులు, ఓసీపీల్లో సెల్‌ఫోన్ వాడకాన్ని నిషేధించిన నేపధ్యంలో గనులపై ఆయా గనుల మేనేజర్లు, ప్రాజెక్టు అధికారులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. సెల్‌ఫోన్ వాడకం వల్లే కలిగే అనర్థాలను వివరిస్తున్నారు. ఆయా ప్రాంతాల బాధ్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈమేరకు గనులపై బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. భారీ యం త్రాలు నడుపుతూ సెల్‌ఫోన్ వాడే ఉద్యోగులను గుర్తించి వార్నింగ్ లెటర్లు కూడా ఇస్తున్నారు. అన్ని గనులు, ఓసీపీల్లో కార్మికులు తమ వస్తువులు దాచుకునేందుకు సెల్ఫ్ లాకర్లు ఏర్పాటు కోరుతూ ఆయా గనుల నుంచి యాజమాన్యానికి సిఫారసు లేఖలు పంపారు. -
హోల్డర్‌పై టెస్టు మ్యాచ్ నిషేధం
వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ ఒక టెస్టు మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు. న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్లో సోమవారం ముగిసిన మొదటి టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా హోల్డర్‌పై ఐసీసీ టెస్టు నిషేధంతో పాటు 60 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించింది. మిగతా జట్టు సభ్యుల మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత పెట్టారు. ఏప్రిల్‌లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులోనూ విండీస్ స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. తాజా టెస్టులోనూ నిర్ణీత సయమానికి మూడు ఓవర్లు తక్కువ వేసింది. ఏడాదిలో రెండుసార్లు ఇలా జరగడంతో హోల్డర్ సస్పెన్షన్ ఎదుర్కోవాల్సి వచ్చింది. -
ఉబర్ స్మార్ట్ ఫోన్ యాప్స్ బ్యాన్
రైడ్-హైలింగ్ గ్రూప్ ఉబర్ స్మార్ట్ ఫోన్ యాప్స్ పై ఇటలీ నిషేధం విధించింది. ఉబర్ కార్ల కోసం వాడే స్మార్ట్ ఫోన్ యాప్స్ ను బ్యాన్ చేస్తున్నట్టు ఇటలీ కోర్టు తీర్పు చెప్పిందని అక్కడి మీడియా రిపోర్టు చేసింది. అన్యాయకరమైన పోటీ వాతావరణాన్ని వారు ఏర్పాటుచేస్తున్నారని కోర్టు పేర్కొంది. బ్లాక్, లక్స్, ఎస్యూవీ, ఎక్స్, ఎక్స్, వ్యాన్ ఫోన్ అప్లికేషన్లను ఉబర్ వాడటానికి వీలులేదని, వాటిని ప్రమోట్ చేయడాన్ని ఒప్పుకోమని కోర్టు తేల్చిచెప్పినట్టు పేర్కొంది. ఆ సర్వీసులను అడ్వర్ టైజ్ కూడా చేయొద్దని ఇటలీ కోర్టు తెలిపింది. ఒకవేళ ఈ శాన్ ఫ్రాన్సిస్కో కంపెనీ కోర్టు ఆర్డర్లను ఉల్లంఘిస్తే, రోజుకు 10వేల యూరోలు(10,590 డాలర్లు) చెల్లించాల్సి వస్తుందని ఉబర్ కు కోర్టు వార్నింగ్ ఇచ్చింది. అయితే కోర్టు ఆర్డర్ పై తాము అప్పీల్ కు వెళ్తామని, ఈ తీర్పుపై సస్పెన్షన్ ఇవ్వాలని కోరతామని ఉబర్ చెబుతోంది. ఈ తీర్పు తమల్ని షాక్ కు గురిచేసిందని ఉబర్ పేర్కొంది. -
రూ.10 నాణేలపై దుష్ప్రచారం
► నాణేలపై నిషేధం ఏమీ లేదు- ఆంధ్రా బ్యాంక్ డీజీఎం కర్నూలు: రూ.10 నాణేలను కేంద్ర ప్రభుత్వం కానీ, రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా కానీ ఎలాంటి నిషేధం విధించలేదు. కనీసం ఆ ఆలోచన కూడా ఆర్బీఐకి లేదు. రిజర్వుబ్యాంకు నుంచి యథావిదిగా నాణేలు సరఫరా అవుతున్నాయి. అయితే రూ. 10 నాణేలు చెల్లుబాటు కావన్న పుకార్లు షికార్లు చేస్తుండడంతో చిన్నచిన్న వ్యాపారులు, దుకాణదారులు వాటిని తీసుకునేందుకు జంకుతున్నారు. ఈ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యం గా డోన్, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, కోడుమూరు తదితర ప్రాంతాల్లో వ్యాపారులు వీటిని తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. బ్యాంకర్లు మాత్రం నాణేల చెల్లుబాటుకు ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతున్నారు. ఇందుకు సంబంధించి ఆంధ్రాబ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ రఘునాథ్‌ను వివరణ కోరగా పది రూపాయల నాణేలు చెల్లుబాటు కావన్నది దుష్ప్రచారం మాత్రమేనన్నారు. ఏ బ్యాంకుకు వెళ్లినా వాటిని తీసుకుంటారని తెలిపారు. ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు ఎవ్వరో ఉద్దేశపూర్వకంగా ఇలా ప్రచారం చేస్తున్నారన్నారు. -
అల్విరో పీటర్సన్ పై నిషేధం
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ అల్విరో పీటర్సన్పై రెండేళ్ల పాటు నిషేధం పడింది. 2014-15 సీజన్లో జరిగిన దేశవాళీ లీగ్‌లో పీటర్సన్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు తేల్చిన దక్షిణాఫ్రికా క్రికెట్.. అతనిపై రెండేళ్ల నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు పీటర్సన్ పై దర్యాప్తు ముగిసిన తరువాత అతను మ్యాచ్ ఫిక్సర్ గా పేర్కొంటూ నిషేధం విధించింది. ఈ మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో నిషేధానికి గురైన ఆరో క్రికెటర్ పీటర్సన్. తాజాగా రెండేళ్ల పాటు నిషేధానికి గురైన అల్విరో పీటర్సన్.. దక్షిణాఫ్రికా తరపున 36 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 2000వ సంవత్సరంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ హాన్సీ క్రానే ఫిక్సింగ్ కు కేసులో నిషేధం ఎదుర్కొన్న తరువాత మరొక అత్యున్నత ప్రొఫెల్ కల్గిన దక్షిణాఫ్రికా క్రికెటర్ పై నిషేధం పడటం ఇదే తొలిసారి. ప్రస్తుతం పీటర్సన్ వయసు 36 ఏళ్ల కావడంతో అతని అంతర్జాతీయ కెరీర్ దాదాపు ముగిసిపోయినట్లే. 2015 రామ్ స్లామ్ టోర్నీలో పలువురు క్రికెటర్లు మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారు. ఆ ఫిక్సింగ్ ఉదంతానికి సంబంధించి మిగతా క్రికెటర్లపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టనున్నట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ పేర్కొంది. -
జనవరి 1నుంచి ప్లాస్టిక్ కప్పుల నిషేధం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అంతకంతకూ పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీవ్రంగా స్పందించింది. ఢిల్లీ, దాని చుట్టుపక్కల ఎన్సీఆర్ పరిధిలో డిస్పోజబుల్ ప్లాస్టిక్ ను నిషేధిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు జనవరి 1, 2017 నుంచి అమల్లోకి వస్తాయని తేల్చి చెప్పింది. ముఖ్యంగా పచారీ సరుకుల్లో వినియోగించే ప్లాస్టిక్, వాడి పారేసే ప్లాస్టిక్ కప్పుల వాడకాన్ని బ్యాన్ చేసింది. ఎన్జీటీ అధ్యక్షుడు స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ కు, ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీకి స్పష్టమైన ఆదేశాలిచ్చింది. సత్వరమే చర్యలు చేపట్టాలని కోరింది. వ్యర్థాల తగ్గింపు, వ్యర్థాల వినియోగం కోసం చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ఎన్సీటీ సహా ఇతర ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఢిల్లీలో ఆందోళనకరంగా మారుతున్న వాయుకాలుష్యం, కప్పివేస్తున్న పొగమంచు పరిస్థితులపై ప్రభుత్వ ఉదాసీన వైఖరిపట్ల ఇటీవల ఎన్ జీటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
కొత్తనోట్లపై నేపాల్ సంచలన నిర్ణయం
భారత్ ఇటీవల రద్దుచేసిన రూ.500, రూ.1,000 నోట్లను మార్చుకోవడంలో నేపాలీ ప్రజలు పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో ఆ దేశ సెంట్రల్ బ్యాంకు గురువారం అనూహ్య నిర్ణయం తీసుకుంది. భారత్ తాజాగా విడుదల చేస్తున్న కొత్త నోట్లు రూ.500, రూ.2,000ను బ్యాన్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద భారత రిజర్వు బ్యాంకు కొత్త నోటిఫికేషన్ జారీచేయనంత వరకు భారత కొత్త కరెన్సీ నోట్ల ఎక్స్చేంజ్ ఉండద్దని నేపాల్ రాష్ట్ర బ్యాంకు తేల్చి చెప్పింది. ఈ నోటిఫికేషన్ వల్ల విదేశీ దేశాల పౌరులు భారత కరెన్సీని నిర్దిష్ట మొత్తంలో కలిగి ఉండేందుకు అనుమతి ఉంటుందని ఆ దేశ అధికారులు చెప్పారు. భారత వైపు నుంచి కొత్త ఏర్పాట్లు వచ్చేంతవరకు, భారత కొత్త కరెన్సీని చట్టవిరుద్ధమైనవిగానే పరిగణించాలని, వాటిని ఎక్స్చేంజ్ చేసే అవకాశం ఉండదని తూర్పు ప్రాంతానికి చెందిన నేపాల్ రాష్ట్ర బ్యాంకు చీఫ్ రాము పౌడెల్ చెప్పారు. ఇప్పటికీ భారత్ రద్దుచేసిన పాత కరెన్సీ నోట్లపై నేపాల్‌లో అనిశ్చిత కొనసాగుతుందని, ఈ సమయంలో కొత్త కరెన్సీ నోట్లను ఎలా మార్కెట్లోకి చట్టబద్దమైనవిగా అనుమతించాలని ప్రశ్నించారు. నేపాల్‌లో భారత కరెన్సీని విరివిగా వాడుతారని, చాలామంది ప్రజల దగ్గర రూ.500, రూ.1000నోట్లు ఉన్నాయని తెలిపారు. ఇరు దేశాల మధ్య సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న సంబంధాలతో పాటు, వివిధ కార్యకలాపాలతో భారత కరెన్సీని నేపాల్ లోకి ప్రవేశిస్తుంటుందని చెప్పారు. నేపాల్ ప్రజలు భారీ మొత్తంలో భారత్ రద్దుచేసిన నోట్లను వాడుతుంటారని, నోట్ల బ్యాన్‌తో వారు ఇబ్బందులు పడుతున్నట్టు ఆ దేశం ఇప్పటికీ భారత్‌కు విన్నపించిన సంగతి తెలిసిందే. తమకు నోట్లు మార్చుకోవడానికి సరియైన ఏర్పాట్లు చేయాలని ఆ దేశ సెంట్రల్ బ్యాంకు, మనదేశ ప్రభుత్వాన్ని, ఆర్బీఐను కోరింది. -
ఇదే చివరి అవకాశం..త్వరపడండి!
ముంబై: కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన పెద్ద నోట్లతో చెల్లింపులకు నేడే (నవంబర్ 24)చివరి రోజు. రద్దయిన రూ.500, రూ.1000 నోట్ల వినియోగానికి ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ ఇవాల్టితో ముగియనుంది. ముఖ్యంగా పెట్రోల్ బంకులు, హాస్పిటల్స్,రైలు, బస్సు టికెట్లు సహా ప్రభుత్వానికి సంబంధించిన బిల్లులు చెల్లించడానికి రద్దయిన పాతనోట్ల అనుమతికి రోజు అర్థరాత్రి వరకే అవకాశం ఉంది. పాతనోట్లని కేవలం బ్యాంకుల్లో మార్పిడికి, లేదా డిపాజిట్లు చేసేందుకు అవకాశం ఉంది. అది కూడా డిశెంబర్ 30 వరకే. 1.ప్రభుత్వాసుపత్రులు 2. రైల్వే టిక్కెట్లు 3.పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ 4. ఎయిర్ లైన్ టిక్కెట్లు 5. మిల్క్ బూత్స్ 6. బరియల్ గ్రౌండ్స్ (శ్మశానాలు) 7. పెట్రోల్ బంకులు 8, మెట్రో రైలు టిక్కెట్లు 9. నేషనల్ హైవేలపై టోల్ ఛార్జీలు 10. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్లతో మెడిసిన్స్ 11. ఎల్పీ జీ సిలిండర్స్ 12. రైల్వే కేటరింగ్స్ 13.కరెంట్, వాటర్ బిల్స్ 14. ఆర్కియాలజీ సర్వే డిపార్ట్ మెంట్ల ఎంట్రీ టిక్కెట్లు 15. కోఆపరేటివ్ స్టోర్లు 16. ప్రభుత్వశాఖలు విధించిన పన్నులు, జరిమానాలు 17. ప్రభుత్వ సంస్థలు విక్రయించే విత్తన విక్రయ కేంద్రాలు కాగా నవంబర్ 8 న కేంద్ర ప్రభుత్వం ప్రకటించి పెద్ద నోట్ల రద్దు దేశవ్యాప్తంగా ఆందోళన రాజేసింది. అటు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కూడా ఈ వ్యవహారంతో అట్టుడుకుతున్నాయి. మరోవైపు ఆర్థికశాఖ ఎన్ని ఉపశమన చర్యలు ప్రకటిస్తున్నప్పటికీ, 16రోజుల తర్వాత కూడా బ్యాంకుల వద్ద, ఏటీఏం సెంటర్ల వద్ద జనం పడిగాపులు మాత్రం కొనసాగుతున్నాయి. అటు పాత నోట్ల చలామణి గడువును పొడిగించాలన్న డిమాండ్ కూడా భారీగానే వినిపిస్తున్న సంగతి తెలిసిందే. -
నోట్ల రద్దు: నిబంధనలు-వెసులుబాటు
-
'పెద్ద నోట్ల రద్దులో శాస్త్రీయత లేదు'
-
'చిల్లర' చిక్కులు
* పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుడికి తప్పని తిప్పలు * పాల ప్యాకెట్ల కొనుగోలుతో కష్టాలు మొదలు * ప్రభుత్వ సంస్థల్లోనూ రూ.500, రూ. 1000 నోట్ల తిరస్కరణ * భారీగా తగ్గిన ఆదాయం * బోసిపోయిన దుకాణాలు.. సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో/సాక్షి, గుంటూరు : సామాన్యుడికి చిల్లర చిక్కులు బుధవారం ఉదయం నుంచే మొదలయ్యాయి. పాల ప్యాకెట్లు కొనడం, టీస్టాల్స్ వద్ద తేనీరు తాగడానికి రూ. 500 నోటు మార్చడానికి చేసిన తొలి ప్రయత్నం బెడిసికొట్టింది. హోటళ్లు, కూరగాయల దుకాణాలు, పచారీ షాపులు, బార్బర్ షాపులు.. ఎక్కడా రూ. 500, రూ. 1000 నోట్లను అంగీకరించకపోవడం ప్రజలకు ఇబ్బంది కలిగించింది. శుక్రవారం నుంచి బ్యాంకులు పెద్ద నోట్ల మార్పిడికి అవకాశం ఇవ్వడంతో కొంతలో కొంత ఊరట లభించనుంది. హోల్‌సేల్ మార్కెట్లదీ ఇదే దారి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని హోల్‌సేల్ మార్కెట్లలోనూ పెద్ద నోట్ల రద్దు కష్టాలు స్పష్టంగా కనిపించాయి. అన్ని రకాల హోల్‌సేల్ మార్కెట్లలోని వ్యాపారులు రూ. 500, రూ. 1000 నోట్లను తీసుకోవడానికి నిరాకరించారు. రూ. 100 నోట్లు ఉన్నవారు నిత్యావసరాల కొనుగోలు, అత్యవసర ఖర్చులకు మాత్రమే ఉంచుకోవడంతో వ్యాపారాల జోరు తగ్గిందని వ్యాపారులు చెప్పారు. హోల్‌సేల్ మార్కెట్లకు వచ్చిన వినియోగదారుల సంఖ్య సగానికి పైగా తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయాణం.. ప్రహసనం.. ప్రయాణం అందరికీ అత్యవసరం కిందే లెక్క. పెద్ద నోట్లను నమ్ముకుని ఆర్టీసీ బస్సులు ఎక్కినవారికి నిరాశే ఎదురైంది. ప్రజా రవాణా బస్సుల్లో పెద్ద నోట్లు చెల్లుబాటవుతాయంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన కాగితాలకే పరిమితమైంది. రూ. 500, రూ. 1000 నోట్లు తీసుకోవడానికి కండక్టర్లు నిరాకరించారు. గట్టిగా ఒత్తిడి చేసినవారికి పెద్ద నోట్లను తీసుకుని టికెట్లు ఇచ్చారు. వారి వద్ద చిల్లర లేకపోవడంతో ముగ్గురు నలుగురికి కలిపి రూ. 500 నోటు ఇచ్చి.. చిల్లర పంచుకోండన్నారు. ఆర్టీసీలో మంగళవారం రాత్రి వరకు వచ్చిన చిన్న నోట్లను అధికారులు దారిమళ్లించారు. బుధవారం ఉదయం తమకు చిల్లర అప్పగించి ఉంటే.. ప్రయాణంలో కష్టాలు తప్పేవని కొందరు కండక్టర్లు చెప్పారు. రైల్వే కౌంటర్లలో ఘర్షణ రైల్వే కౌంటర్లలో పెద్ద నోట్లు తీసుకోవడానికి సిబ్బంది సిద్ధపడినా.. ప్రయాణికులకు చిల్లర సమకూర్చడం సాధ్యం కాకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. ప్రభుత్వం చెప్పినా పెద్ద నోట్లు ఎందుకు తీసుకోరంటూ విజయవాడ రైల్వే కౌంటర్లలో గొడవపడ్డారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలు కౌంటర్లలో ఇలాంటి సమస్యలే తలెత్తాయని రైల్వే వర్గాలు తెలిపాయి. వెలవెలపోయిన మాల్స్.. పెద్ద నోట్లు తీసుకోవడానికి పలు షాపింగ్ మాల్స్ ముందుకు వచ్చినా.. పెద్దగా వ్యాపారం సాగలేదు. డెబిట్, క్రెడిట్ కార్డుల మీద వ్యాపారం కూడా సాధారణ స్థాయి కంటే చాలా తక్కువగా జరిగిందని వ్యాపారులు చెప్పారు. కస్టమర్లు పెద్దగా రాకపోవడంతో జంటనగరాల్లో పలు మాల్స్ వెలవెలపోయాయి. సినిమా హాళ్లు కూడా బోసిపోయాయి. వన్నె తగ్గిన బంగారం.. బంగారం ధర పెరగడం, పెద్ద నోట్ల రద్దు.. వెరసి బంగారు ఆభరణాల కొనుగోళ్లు బుధవారం మందగించాయి. బంగారం వర్తకంలో పన్నులు చెల్లించకుండా చేసే ‘జీరో’ బిజినెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం నుంచే బంగారం దుకాణాలను వ్యాపారులు మూసివేశారు. ఎయిర్‌పోర్ట్‌లోనూ అదే తీరు.. గన్నవరం విమానాశ్రయంలో వాటర్ బాటిళ్లు, స్నాక్స్ విక్రయించే దుకాణదారులు పెద్ద నోట్లను అంగీకరించకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. విమానం (ఆన్‌బోర్డ్)లోనూ ప్రయాణికులకు స్నాక్స్ విక్రయిస్తారు. కానీ పెద్ద నోట్లు తీసుకోకపోవడంతో ఇబ్బందులు తప్పలేదు. పదుల సంఖ్యలో టికెట్లు కొనడానికి బుధవారం ఉదయం పలువురు విమానాశ్రయం కౌంటర్లకు వచ్చారు. ఇద్దరికి టికెట్లు విక్రయించిన తర్వాత పెద్ద నోట్లు తీసుకోవడానికి నిరాకరించారు. ఆన్లైన్లో కొనుక్కోవాలని సూచించారు. పెట్రోల్ పంపుల్లోనూ చిల్లర ఇవ్వలేదు.. పెట్రోల్ పంపుల్లో పెద్ద నోట్లు అంగీకరించారు. కానీ రూ. 500 నోటు ఇస్తే ఆ మొత్తానికి ఇంధనం పోయించుకోవాలని సిబ్బంది తెగేసి చెప్పడం పలుచోట్ల కనిపించింది. కొన్ని చోట్ల కస్టమర్లు వాగ్వాదానికి దిగారు. ఇక టోల్గేట్ల వద్ద పెద్ద నోట్లు తీసుకోవడానికి నిరాకరించడం, కొన్నిచోట్ల తీసుకున్నా.. చిల్లర సమకూర్చడంలో జాప్యం జరగడంతో కిలోమీటర్ల వేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొనే తాత్కాలికంగా టోల్ రుసుము వసూలును కేంద్రం రద్దు చేసింది. కాజ టోల్గేట్ వద్ద సాయంత్రం నుంచి వసూళ్లు నిలిపివేశారు. ఇదే అదనుగా భావించిన మద్యం దుకాణాల యజమానులు మందుబాబుల వ్యసనాన్ని ఆసరాగా తీసుకుని రూ. 500 నోటు ఇస్తే రూ. 350కు మాత్రమే మద్యం ఇస్తూ అడ్డంగా దోచుకున్నారు. నీరసించిన రిజిస్ట్రేషన్లు.. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో రోజూ సరాసరి 1200–1300 రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. బుధవారం దశమి కావడంతో మంచిరోజుగా భావించి సరాసరి కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరుగుతాయని అధికార వర్గాలు భావించాయి. కానీ పెద్ద నోట్ల రద్దు కారణంగా 15 శాతానికి పడిపోయాయని అధికార వర్గాలు తెలిపాయి. విద్యుత్, రవాణా, మున్సిపల్ శాఖ కార్యాలయాల్లో బిల్లులు, రిజిస్ట్రేషన్లు, పన్నులు చెల్లించేందుకు వెళ్లినవారి వద్ద పెద్ద నోట్లు తీసుకోలేదు. రవాణా శాఖలో నాలుగో వంతు రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో రోజుకు రూ. 50 లక్షల పన్ను వసూళ్లవుతుంటాయి. బుధవారం రూ. 18.08 లక్షలు మాత్రమే వసూలైంది. గుంటూరు కార్పొరేషన్లో రోజుకు రూ. 12 లక్షలు వసూలయ్యే పన్ను రూ. 27వేలు మాత్రమే వసూలు కావడం గమనార్హం. రోజుకు రూ. 60 లక్షలు వసూలయ్యే విద్యుత్ బిల్లులు రూ. 37 లక్షలకు పడిపోయాయి. పోలీసు శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు.. బస్‌స్టేçÙన్లు, రైల్వే స్టేషన్లు, బ్యాంకుల వద్ద చిల్లర లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గురువారం బ్యాంకులు పనిచేయనుండడంతో బ్యాంకర్లతో మాట్లాడి అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయించడం, బారికేడ్లు ఏర్పాటు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. టోకెన్ సిస్టమ్ ద్వారా‡ డిపాజిట్లు, చెల్లింపులు చేయించేలా చూడాలని గుంటూరు రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. -
మందు బాబులకు షాక్
మందు బాబులకు ఢిల్లీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కార్లలో పార్టీలు చేసుకుంటూ మద్యం సేవించే యువత ఇకపై బాటిళ్లకు మూత పెట్టక తప్పదు. లేకపోతే డైరెక్ట్ గా జైలుకు వెళ్లాల్సిందే. వచ్చే నెల 7వ తేదీ నుంచి పబ్లిక్ లో మద్యం సేవించే వారికి కేజ్రీవాల్ ప్రభుత్వం పెద్ద ఎత్తున జరిమానా లేదా జరిమానాలతో కూడిన జైలు శిక్షను విధించనుంది. ఇందుకోసం ఎక్సైజ్ శాఖ చట్టాలను కూడా సవరించేందుకు ప్రభుత్వం సిద్ధమౌతోంది. బహిరంగ ప్రాంతాల్లో మద్యం సేవించేవారికి రూ. 5వేల జరిమానా విధించనున్నట్లు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మద్యం సేవించి గొడవ చేస్తే జరిమానాను డబుల్ చేయడంతో పాటు సదరు వ్యక్తికి అబ్కారీ శాఖ చట్టం కింద మూడు నెలల పాటు జైలు శిక్ష విధించనున్నట్లు చెప్పారు. కార్లలో స్నేహితులతో కలిసి మద్యం సేవించడం(కార్-ఓ-బార్) ఢిల్లీలో మామూలే. ఎక్కువ మంది మందు బాబులు లిక్కర్ షాపుల వద్ద లేదా ఫుడ్ కోర్టుల వద్ద నిలిపివున్న కార్లలో మద్యం సేవిస్తూ ఉంటారు. బార్లలో అధిక రేట్లు తట్టుకోలేని యువత ఈ పద్దతిని ఫాలో అవుతున్నారు. -
చైనా ఉత్పత్తుల నిషేధానికి పెరుగుతున్న మద్ధతు
-
ఆఫీసుల్లోనూ నోట్7 నిషేధం!!
శాంసంగ్ కంపెనీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. విమానాల్లోనే కాదు.. ఇప్పుడు కార్యాలయాల్లోనూ శాంసంగ్ మొబైల్స్ వాడొద్దని నిబంధనలు పెడుతున్నారు. తాజాగా చైనాలో చెంగ్డూలోని సిచువాన్ ప్రావిన్స్‌లో గల ఓ ప్రభుత్వ కార్యాలయంలో శాంసంగ్ గెలాక్సీ నోట్7 స్మార్ట్ఫోన్లపై నిషేధం విధించారు.. చెంగ్డూలోని ప్రభుత్వ వ్యవహారాల సర్వీసు సెంటర్ ఉద్యోగులు గెలాక్సీ ఫోన్లను వాడొద్దని పేర్కొంటూ తన మైక్రో బ్లాక్ అకౌంట్లో ఓ నోటీసును పోస్టు చేసింది. భద్రతా కారణాల నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొంది. ఒకవేళ ఎవరైనా బయటవ్యక్తులు ప్రభుత్వ కార్యాలయంలో ఈ ఫోన్లను రీఛార్జ్ పెడుతున్నట్టు గమనించినా.. వారికి నచ్చజెప్పి కార్యాలయంలో రీఛార్జ్ చేయకుండా చూడాలని నోటీసులో తెలిపింది. అయితే సందర్శకులను టార్గెట్ చేసుకునే ఈ సర్వీసు సెంటర్ గెలాక్సీ నోట్7 ఫోన్లపై రద్దును చేపడుతుందని పలు మీడియా సంస్థలు రిపోర్టు చేయడంతో, కేవలం ఈ పాలసీ ఉద్యోగులకు మాత్రమేనని వర్తింపజేస్తామని సందర్శకులకు కాదని తెలిపింది. ఇప్పటికే పలు దేశాల విమానయాన సంస్థలతో పాటు చైనా సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కూడా గెలాక్సీ నోట్7 ఫోన్లపై నిషేధం విధించింది. దేశీయ విమాన ప్రయాణాల్లో ఈ ఫోన్లను వాడటం కాని, రీఛార్జ్ కాని చేయకూడదని ఆదేశాలు జారీచేసింది. చైనాలో ఐదుగురు గెలాక్సీ నోట్7 యూజర్లు తమ ఫోన్లు పేలిపోయాయని ఫిర్యాదు చేశారు. అయితే ఈ పేలుడుకు సంబంధించి ఇంకా సరియైన కారణాలు వెల్లడికాలేదు. మరోవైపు బ్యాటరీ పేలుళ్ల సమస్యతో గెలాక్సీ నోట్7 ఫోన్లను శాంసంగ్ రీకాల్ చేపడుతున్న సంగతి తెలిసిందే. -
ఆ రెజ్లింగ్ కోచ్‌లపై నిషేధం!
రియో డీ జనీరో:ఇటీవల జరిగిన రియో ఒలింపిక్స్‌లో జడ్జిల నిర్ణయాన్ని తప్పుబడుతూ అర్థనగ్న ప్రదర్శనతో నిరసన చేపట్టి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన మంగోలియాకు చెందిన ఇద్దరు రెజ్లింగ్ కోచ్‌లపై మూడేళ్ల నిషేధం పడింది. కాంస్య పతక పోరులో తమ దేశానికి చెందిన గంజోరిగీన్ మందఖ్నారన్ గెలుపును జడ్జిలు అడ్డుకున్నారంటూ కోచ్ లు సెరెంబాతర్ సోగ్బాయర్, బయారాలు తీవ్రంగా నిరసించడంతో వారిపై నిషేధం విధిస్తూ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధం 2019 ఆగస్టు వరకూ అమల్లో ఉండనుంది. రియో ఒలింపిక్స్ రెజ్లింగ్ కాంస్య పతక పోరులో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన రెజ్లర్ కు పెనాల్టీ పాయింటు ఇవ్వడంతో పాయింట్ తేడాతో మంగోలియా రెజ్లర్ ఓడిపోయాడు. కాగా, అప్పటికి వరకూ తమవాడు గెలిచాడని భావిస్తున్న మంగోలియా కోచ్‌లు సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టేశారు. కానీ కొన్ని సెకండ్ల తర్వాత.. వాళ్లకు అసలు విషయం తెలిసింది. జడ్జీల నిర్ణయాన్ని సవాలు చేయాలని కోచ్‌లు భావించారు. కానీ, అలా చేయడానికి వీల్లేదని జడ్జీలు వాళ్లకు చెప్పారు. దాంతో ఒకరు షర్టు విప్పేయగా, మరొకరు షర్టు, ప్యాంటు రెండూ విప్పేసి రింగ్‌లోనే పడేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధం కావడంతో వారిపై కొన్నేళ్ల పాటు నిషేధం పడింది. -
పాఠశాలల్లో జంక్ ఫుడ్ పై నిషేధం
ఛండీగఢ్: పంజాబ్ లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో జంక్ ఫుడ్ ను పూర్తిగా నిషేధిస్తూ బాలల హక్కుల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. అనేక కమిటీల నివేదికల అనంతరం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కమిషన్ చైర్మన్ సుకేష్ కాలియా పేర్కొన్నారు. జంకు ఫుడ్ లో చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉన్న కారణంగా హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఒబెసిటీ, మానసిక సమస్యలు వస్తున్నాయని అందుకే ఈనిర్ణయం తీసుకున్నామని కాలియా తెలిపారు. -
ప్రకాశం బ్యారేజీపై రాకపోకలు నిషేధం
విజయవాడ : ప్రకాశం బ్యారేజీ మరమ్మతుల కారణంగా సోమవారం అర్ధరాత్రి నుంచి పనులు పూర్తయ్యే వరకూ అన్ని రకాల వాహనాల రాకపోకలను నిషేధించామని విజయవాడ నగర కమిషనర్ గౌతమ్ సావాంగ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, కృష్ణలంక (సీతమ్మవారి పాదాలు), కుమ్మరిపాలెం, వన్‌టౌన్ వైపు నుంచి, తాడేపల్లి, సీతానగరం వైపు నుంచి ప్రకాశం బ్యారేజీవైపు రాకపోకలు సాగించే వాహనాలు ఈ మార్పును గమనించాలని, పాదచారులను కూడా అనుమతించబోమని ఆయన పేర్కొన్నారు. ట్రాఫిక్ మళ్లింపు ఇలా.. గొల్లపూడి, కుమ్మరిపాలెం, వన్‌టౌన్ ప్రాంతాల నుంచి వచ్చే అన్ని రకాల వాహనాలు గొల్లపూడి వద్ద నుంచి సితారా సెంటర్, పాలఫ్యాక్టరీ, చిట్టినగర్ మీదుగా పంజా సెంటర్, రైల్వే వెస్ట్ బుకింగ్, ఆర్టీసీ టెర్మినల్, లోబ్రిడ్జి, పోలీస్ కంట్రోల్ రూమ్, బందరు లాకులు మీదుగా తొమ్మిదో నంబరు జాతీయ రహదారికి చేరుకుని.. అక్కడి నుంచి కనకదుర్గమ్మ వారధి మీదుగా ప్రయాణించాలి. ఏలూరు రోడ్డు, బందరు రోడ్డు వైపు నుంచి వచ్చే అన్ని రకాల వాహనాలు బందర్ లాకుల మీదుగా తొమ్మిదో నంబరు జాతీయ రహదారికి చేరుకుని అక్కడి నుంచి కనకదుర్గమ్మ వారధి మీదుగా ప్రయాణించాలి. గుంటూరు, తాడేపల్లి, సీతానగరంవైపు నుంచి వచ్చే వాహనాలు, పాదచారులను ప్రకాశం బ్యారేజీపైకి అనుమతించరు. స్కవర్ గేట్ల మరమ్మతుల కోసమే.. ప్రకాశం బ్యారేజీ ప్రధాన గేట్లకు ఇరువైపులా ఉండే స్కవర్ గేట్ల మరమ్మతులకు ఇరిగేషన్ అధికారులు శ్రీకారం చుట్టారు. నదికి వరద ఎక్కువ వచ్చినప్పుడు ఇసుక, వండ్రు కొట్టుకొస్తోంది. ఇలాంటి సమయంలో గేట్లు తెరవాల్సి వస్తోంది. నదికి కృష్ణాజిల్లా వైపు ఆరు, గుంటూరు జిల్లా వైపు ఎనిమిది స్కవర్ గేట్లు ఉన్నాయి. స్కవర్ గేట్లను 1998 తరువాత తీయలేదు. నీటి అడుగున ఉండటంతో గేట్లు బాగా తుప్పుపట్టిపోయాయి. వీటిని తరచూ తీయకపోవడంతో బ్యారేజీ ఎగువన రిజర్వాయర్‌లో ఇసుక నిండిపోతోంది. దీంతో ఈ ఏడాది స్కవర్ గేట్లు తీసి మరమ్మతులు చేయాలని, లేదంటే కొత్త గేట్లు ఏర్పాటుచేయాలని ఇంజినీర్లు నిర్ణయించారు. కృష్ణాడెల్టా ఆధునికీకరణకు కేటాయించిన నిధుల్లోనే స్కవర్ గేట్ల మరమ్మతులకూ నిధులు కేటాయించినట్లు ఇంజినీర్లు చెబుతున్నారు. మంగళవారం నుంచి పనులు ప్రారంభించి పదిరోజుల్లో పూర్తిచేస్తారు. దీంతో బ్యారేజీపై రాకపోకలు నిషేధించారు. -
వాట్సాప్ ను నిషేధించండి...!
వాట్సాప్... ప్రపంచ సమాచార మాధ్యమంగా ఎంత పాపులర్ అయిందో తెలియంది కాదు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ ఈ యాప్ ను మెసేజింగ్ యాప్ కోసం విపరీతంగా వినియోగిస్తుంటారు. ఇటు స్కూల్ విద్యార్థుల నుంచి అటు టాప్ మేనేజర్లు, పొలిటికల్ లీడర్ల వరకూ ఈ యాప్ కు బానిసలా మారుతున్నారు. అయితే ఈ యాప్ ను నిషేధించాలని కోరుతూ గుర్గావ్ కు చెందిన 27 ఏళ్ల సమాచార హక్కు కార్యకర్త(ఆర్టీఐ) సుధీర్ యాదవ్ సుప్రీంకోర్టు గడపతొక్కాడు. వాట్సాప్ యాప్ లో కొత్తగా ప్రవేశించిన ఎన్ క్రిప్షన్ ఫీచర్ ద్వారా టెర్రరిజం, రేవ్ పార్టీ వంటి దుర్వినియోగాలకు పాల్పడే ప్రమాదముందని హెచ్చరిస్తూ పిల్ దాఖలు చేశాడు.. తను కూడా వాట్సాప్ కు బానిసనేని, కానీ ఈ విప్లవాత్మక ఫీచర్ ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్, ఇద్దరి మధ్య జరిగే సంభాషణలను మూడో వ్యక్తి తెలుసుకునే వీలు లేకుండా ఉందని, దీనివల్ల దేశ భద్రతకు హానివాటిల్లే ప్రమాదముందని తెలిపాడు. దీనిపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్ ను) దాఖలు చేశాడు. అనుమానస్పద ప్రజల మధ్య జరిగే సంభాషణలను ఈ ఎన్ క్రిప్షన్ వల్ల ప్రభుత్వం తెలుసుకోలేదని, ఇది దేశభద్రతకు హానికరమని పిల్ లో పేర్కొన్నాడు. "వాట్సాప్ గ్రేట్ యాప్, దానిపై నేను చాలా గంటలను సమయాన్ని వెచ్చిస్తుంటా..కానీ డ్రగ్స్, రేవ్ పార్టీల సమాచారమంతా ఎక్కువగా వాట్సాప్ ద్వారానే జరుగుతుంటుంది. వాట్సాప్ ప్రవేశపెట్టిన ఈ ఎన్ క్రిప్షన్ ఫీచర్ ను ఉగ్రవాదులు అవకాశంగా మరల్చుకుని, కార్యకలాపాలు చేస్తుంటారు." అని యాదవ్ పేర్కొన్నాడు. ప్రపంచంలో ఏ మూలన కూడా ఉగ్రవాద చర్యలు పాల్పడాల్సినవసరం లేదని, ముఖ్యంగా భారత్ లో ఈ చర్యలను జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉందని యాదవ్ చెప్పాడు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ యాప్ ను నిషేధించాలని పిల్ లో సుప్రీంకోర్టును అభ్యర్థించాడు. హైక్, టెలిగ్రాం, వైబర్ వంటి 20 మెసేజింగ్ యాప్ లపై తన పిటిషన్ దాఖలు చేశాడు. అయితే వాట్సాప్ ఈ ఎక్రిప్షన్ ఫీచర్ ను ప్రారంభించిన ఏప్రిల్ నెల నుంచే దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
344 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ఔషధాలపై నిషేదం
జాబితాలో ఫైజర్ కోరెక్స్, అబాట్ ఫెన్సెడిల్ న్యూఢిల్లీ: దగ్గు సిరప్‌లతో సహా మొత్తం 344 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ఔషధాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిషేధించింది. వీటి వినియోగం మానవులకు హానికరమని, వీటికి సురక్షితమైన ప్రత్యామ్నాయ ఔషధాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ఈ నిషేధం తక్షణం వర్తిస్తుందని వివరించింది. నిషేధించిన ఔషధాలను తయారు చేస్తున్న కంపెనీలకు గతంలో షోకాజ్ నోటీసులు ఇచ్చామని, వివరణ ఇవ్వడానికి తగిన సమయం కూడా ఇచ్చామని ఆరోగ్య మం త్రిత్వ శాఖ ఉన్నతాధికారొకరు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ సూచనల మేరకే ఈ 344 ఔషధాలను నిషేధించామని వివరించారు. ఇలా నిషేధించిన వాటిలో ఫైజర్ కంపెనీ కోరెక్స్ బ్రాండ్ కింద విక్రయించే దగ్గు సిరప్, అబాట్ కంపెనీ ఫెన్సెడెల్ పేరుతో విక్రయించే దగ్గు సిరప్లు కూడా ఉన్నాయి. కోరెక్స్ తయారీ, విక్రయాలను తక్షణం నిలిపేశామని ఫైజర్ కంపెనీ, ఫెన్సెడిల్ విక్రయాలను ఆపేశామని అబాట్ కంపెనీలు పేర్కొన్నాయి. రెండు లేదా అంతకుమించిన యాక్టివ్ డ్రగ్స్‌ను ఒక సింగిల్ డోస్ రూపంలో తయారు చేసే ఔషధాలను ఫిక్స్డ డోస్ కాంబినేషన్ ఔషధాలుగా వ్యవహరిస్తారు. -
వృధా పదార్థాలు పడేయడంపై బ్యాన్
పారేసేది వాడెయ్యమన్నది నానుడి.. అంటే మనకు పనికి రానిది మరొకరికి ఉపయోగపడేలా చేయాలని అర్థం. ముఖ్యంగా ఆహార పదార్థాల విషయంలో ఇది వర్తిస్తుంది. వృధాగా పోయే పదార్థాలను ఆపన్నులకు అందించాలన్న సూత్రం ఈ సందర్భంలో వెల్లడవుతుంది. పేదవారికి ప్రత్యేకంగా సహాయం అందించలేక పోయినా.. ఇటువంటి నియమాలను పాటించడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటికే ఆహార పదార్థాలు వృధా చేయడంపై కొన్ని దేశాల్లో కఠినమైన చట్టాలు అమలవుతున్నాయి. తాజాగా ఫ్రాన్స్ లో సూపర్ మార్కెట్లలోని అమ్ముడుపోని పదార్థాలను చెత్తబుట్టల్లోకి విసిరేయడంపై నిషేధం విధించారు. ఫ్రాన్స్ లో సూపర్ మార్కెట్లలో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన సరుకులను చెత్తబుట్టలకు తరలిస్తుంటారు. ఇటువంటి పోకడలకు ఫ్రాన్స్ ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టేందుకు కఠిన చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. వస్తువులను వృధాగా పారేసేవారికి పరిమాణాన్ని బట్టి ఫైన్ వేసేందుకు నిర్ణయించింది. అంతేకాదు ఒక్కోసారి అవసరాన్ని బట్టి, తీవ్రతను బట్టి జైలు శిక్ష కూడ విధిస్తున్నారు. ముఖ్యంగా సూపర్ మార్కెట్లలో వస్తువులు ఎక్స్ పైరీ డేటుకు ముందే అనాధ శరణాలయాలకు, ఫుడ్ బ్యాంక్ లకు ఇచ్చేయాలని సూచిస్తున్నారు. ఇదే అంశంపై ఫ్రాన్స్ నేషనల్ అసెంబ్లీలో బిల్లు కూడ పాస్ చేశారు. ఫ్రాన్స్ లో ప్రతియేటా 7.1 మిలియన్ టన్నుల ఆహారం వేస్ట్ అవుతుండటం కూడా ఈ బిల్లు అమల్లోకి రావడానికి కారణంగా చెప్పాలి. ముఖ్యంగా ఈ వృధా చేస్తున్న పదార్థాల్లో అమ్మకందార్లు 11 శాతం వృధా చేస్తుంటే... కొని పారేసే వారు 67 శాతం, రెస్టారెంట్ల లో తినకుండా వదిలేసేవారు 15 శాతం ఉన్నట్లు గుర్తించారు. దీంతో ప్రభుత్వం అటువంటివారికి భారీ జరిమానా విధించేందుకు ఈ కఠిన చట్టాన్నిఅమలుపరుస్తోంది. ప్రపంచంలో ఎంతోమంది తిండి లేక నానా ఇక్కట్లూ పడుతున్నారు. మరోపక్క అవసరానికి మించి ఆహారం కొనుగోలు చేసి వృధా చేసేవారూ అధికంగానే ఉన్నారు. దీన్ని అరికట్టాలన్నదే ఫ్రాన్స్ ప్రభుత్వ లక్ష్యం. అందుకే అక్కర్లేని పదార్థాలను సేవా సంస్థలు, ఆహార బ్యాంకులకు దానం చేయమని సూచిస్తోంది. పారిస్ కు దగ్గరలోని కౌర్బివాయి కౌన్సిలర్... ఆరాష్ దెరాంబర్ష్ ప్రవేశ పెట్టిన పిటిషన్ ను ఫ్రెంచ్ సెనేట్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ఈ చట్టం అమల్లోకి వచ్చింది. 400 స్క్వేర్ మీటర్లు, అంతకు మించి ఉన్న సూపర్ మార్కెట్లన్నింటికీ ఈ నిబంధన వర్తిస్తుంది. ఉల్లంఘించిన వారికి ప్రభుత్వం 3750 యూరోల జరిమానా విధిస్తుంది. ఆహార పదార్థాల వృధాను అరికట్టేందుకు ఇదే చట్టాన్ని ఇప్పుడు యూరప్ లోని అన్ని సూపర్ మార్కెట్లకు వ్యాప్తి చేసేందుకు ఆరాష్ దెరాంబర్ష్ కృషి చేస్తున్నారు. ఈ పోరాటం ఇక్కడితో ఆగదని, రెస్టారెంట్లు, బేకరీలు, క్యాంటీన్లలోని ఆహారం... వృధా కాకుండా చూసేందుకు ప్రయత్నిస్తామని ఆయన అంటున్నారు. -
యాసిర్ షాపై మూడు నెలల నిషేధం
దుబాయ్:గతేడాది చివర్లో డోపింగ్ కు పాల్పడిన పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షాపై మూడు నెలల నిషేధం పడింది. యాసిర్ షా డోపీగా తేలడంతో అతనిపై సస్సెన్షన్ వేటు పడింది. యాసిర్ డోపింగ్ పాల్పడిన అనంతరం నిర్వహించిన టెస్టులో నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలడంతో అప్పుడే అతన్ని తాత్కాలికంగా సస్పండ్ చేస్తూ ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ మండలి) నిర్ణయం తీసుకుంది. కాగా, అతను మూడు నెలల పాటు సస్పెండ్ గురైనట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వర్గాలు ఆదివారం అంగీకరించాయి. యాంటీ డోపింగ్ కోడ్ ప్రకారం యాసిర్ క్లోర్ టేలిడాన్ అనే మాత్రను తీసుకున్నట్లు తేలింది. ఇలా తీసుకోవడం డబ్యూఏడీఏ (వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ) జాబితాలోని సెక్షన్- 5 ప్రకారం నిబంధనలను ఉల్లంఘించడం కావడంతో యాసిర్ ను అంతర్జాతీయ క్రికెట్ నుంచి మూడు నెలల పాటు సస్పెండ్ చేశారు. -
ఇకపై డోర్ కొట్టకూడదట..!
డోర్ టు డోర్ ప్రచారం చేసేవాళ్ళు... సేల్స్ మెన్స్ తలుపు కొట్టి విసిగించడం చాలామందికి అనుభవమే అయ్యుంటుంది. అదే అనుభవం లండన్ లోని బ్రాడ్ పోర్డ్ కు చెందిన మహిళ విషయంలోనూ జరిగింది. పదే పదే జనం విసిగించకుండా ఉండేందుకు ఆమె తమ ఇంటి డోర్ పై ఓ స్టిక్కర్ ను అతికించింది. అయినా ఆమెకు బాధ తప్పలేదు. దీంతో విసిగిపోయిన ఆ మహిళ కోర్టును ఆశ్రయించింది. అంతే కాకుండా గట్టిగా తన వాదనను వినిపించి... మొత్తానికి అనుకున్నది సాధించింది. ఏకంగా డోర్ టు డోర్ సేల్స్ నే బ్యాన్ చేసేట్టు చేసింది. వివరాల్లోకి వెళితే...రోజుకు కనీసం మూడు, నాలుగు సార్లు డోర్ కొట్టి విసిగిస్తున్న సేల్స్ మెన్స్ బాధ నుంచి తప్పించుకునేందుకు లండన్ కు చెందిన కెల్లీ రోజ్ తనవంతు ప్రయత్నం చేసింది. ''నా అడ్రస్ తో ఏదైనా పార్శిల్ వచ్చినా దయచేసి నన్నుడిస్ట్రబ్ చేయొద్దు'' అంటూ కెల్లీ తన ఇంటి డోర్ పై ఓ సూచనను అతికించింది. ఆ స్టిక్కర్ చూసైనా సేల్స్ వాళ్ళు తనను అనవసరంగా విసిగించరని అభిప్రాయ పడింది. తలుపు కొట్టొద్దు అన్న సంకేతాన్ని స్టిక్కర్ తో సూటిగా చెప్పాననుకుంది. కానీ లాభం లేకపోయింది. ఆ విషయాన్ని పట్టించుకున్న నాధుడే కనిపించలేదు. ఎప్పట్లాగే తలుపు కొడుతూనే ఉన్నారు. హడావిడిగా బయటకు వెడుతున్న సమయంలోనూ అడ్డుకొట్టేవారూ లేకపోలేదు. దీంతో సహనం కోల్పోయిన ఆమె తలుపు కొట్టిన వారిని కోపంగా ప్రశ్నించింది కూడా. తలుపుపై అంటించిన స్టిక్కర్ మీకు కనిపించలేదా అని.. దానికి కొందరు తాము గమనించలేదని, మరి కొందరు మరో అడుగువేసి ఆ స్టిక్కర్ పై ఎటువంటి లీగల్ అథారిటీ లేదని చెప్పడాన్ని తట్టుకోలేక పోయింది. ఇరుగు పొరుగులను కూడా సంప్రదించింది. వారూ అదే సమస్యతో ఇబ్బందులు పడుతూనే ఉన్నామని చెప్పారు. మరొకరు ఇప్పటికే లీగల్ అథారిటీతో స్టిక్కర్ తీసుకున్నామని చెప్పారు. సమస్యను నివారించేందుకు ఏం చేయాలో కెల్లీ తీవ్రంగా ఆలోచించింది. ఇంటికి వచ్చిన సేల్స్ బాయ్స్ తాలూకు ఏజెన్సీకి ఫోన్ చేసింది. తాను బుక్ చేయకుండానే వారి ఏజెన్సీనుంచి సేల్స్ బాయ్స్ వచ్చి తలుపు కొట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఏజెన్సీ నుంచి కూడ కెల్లీకి భంగపాటు ఎదురైంది. మేడమ్..! మీకు ఎవరూ డిస్ట్రబ్ చేయడం నచ్చకపోతే అఫీషియల్ స్టిక్కర్ ను అతికించుకోమన్న సమాధానం రావడంతో ఆగ్రహంతో ఊగిపోయింది. ఇక లాభం లేదనుకున్న కెల్లీ... డోర్ టు డోర్ ప్రచారం, సేల్స్ వంటివి బ్యాన్ చేయించడం తప్పితే... సమస్యకు పరిష్కారం లేదని భావించింది. ఇంతకు ముందే ఇటువంటి గుర్తింపులేని, నిబంధనలు ఉల్లంఘించి అమ్మకాలు జరుపుతున్న పలువురు వ్యాపారస్తుల కేసుల్లో శిక్షార్హులైన వారి ఆధారాలను సేకరించింది. సౌత్ వేల్స్ లోని న్యూ పోర్ట్ క్రౌన్ కోర్టులో దావా వేసి గట్టిగా తన వాదనను వినిపించి... చివరికి కేసు గెలిచింది. ఆప్రాంతంలో డోర్ టు డోర్ సేల్స్ బ్యాన్ చేయించింది. అయితే ఇలా డోర్ టు డోర్ ప్రచారాలు, అమ్మకాలకు విసిగిపోయేవారితో పాటు వారికి సపోర్ట్ ఇచ్చేవారూ ఉన్నారనేందుకు కెల్లీ కేసు ఉదాహరణగా నిలుస్తోంది. ఆమె కేసు గెలిచి, డోర్ టు డోర్ సేల్స్ బ్యాన్ చేయించడాన్ని కొందరు తప్పు బడుతున్నారు. అలా బ్యాన్ చేయడం వల్ల అవసరమైన, ముఖ్యమైన సమాచారం, పార్శిళ్ళు, కొరియర్లు మిస్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. అలాగే .. కడుపు నింపుకునేందుకు సేల్స్ పై ఆధారపడి జీవించే వారు ఉంటారని, అటువంటి వారికి ఇది పెద్ద అవరోధమని అంటున్నారు. డిస్ట్రబెన్స్ వద్దనుకునేవారు ఇటీవల అందుబాటులో ఉన్న ఐ-బెల్ వంటి (తలుపు తెరవకుండా, తమ ఫోన్లలో డోర్ బయట ఉన్నవారి వివరాలు చూసే) యాప్ లను డౌన్ లోడ్ చేసుకొని, ఆధునిక పద్ధతులను అమలు చేసి సేల్స్ వారి బాధనుంచీ దూరమవ్వొచ్చనీ అంటున్నారు. అంతేతప్ప.. మొత్తానికే నిరోధించడం సరికాదని అభిప్రాయ పడుతున్నారు. -
మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధం!
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కొనసాగుతున్న నిషేధాల పరంపర తారాస్థాయికి చేరింది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో నేటి (శనివారం మధ్యాహ్నం) నుంచి మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర డీజీపీ పీసీ ఠాకూర్ ప్రకటించారు. ఈ నిషేధం ఎంతకాలం ఉంటుందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. పటేల్ రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ అరెస్టు నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్త కూడదనే ఉద్దేశంతోనే ముందస్తుగా మొబైల్ ఇంటర్నెట్ పై నిషేధం విధించామని డీజీపీ వివరించారు. పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ పాస్ (పటీదార్ ఆరక్షణ్ ఆందోళన్ సమితి) నాయకుడు హార్దిక్ పటేల్ సూరత్ నుంచి ప్రారంభించిన ఏక్తా యాత్రాను పోలీసులు అడ్డుకున్నారు. శనివారం ఉదయం సూరత్‌లో హార్దిక్ సహా మరో 50 మందిని పోలీసులు అరెస్టు చేశారు. హార్దిక్ అరెస్టుతో మళ్లీ ఆ రాష్ట్రంలో ఉద్రిక్తతలు తలెత్తాయి. అన్ని జిల్లాల్లో పటేల్ కులస్తులు ఆందోళనలకు సిద్ధమయ్యారు. రాత్రిలోగా హార్దిక్ ను విడుదల చేయకుంటే జైల్ భరో కార్యక్రమానికి పూనుకుంటామని ఆనందిబెన్ సర్కారును హెచ్చరించారు. గత ఆగస్టు 25న అహ్మదాబాద్ లో పటేళ్లు నిర్వహించిన భారీ సభ అనంతరం చెలరేగిన హింసలో 10 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనూ మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిషేధించింది గుజరాత్ ప్రభుత్వం. సర్కారు చర్యను హైకోర్టు కూడా సమర్థించడం గమనార్హం. -
అదొక ప్రమీలా రాజ్యం..మగవాళ్లకు చోటు లేదు
నైరోబీ: అదొక ప్రమీలా రాజ్యం. అక్కడంతా మహిళలు, పిల్లలే ఉన్నారు. వారంతా మగవాళ్ల చేతుల్లో ఏదో రకంగా మోస పోయినవారే. వారిలో మూకుమ్మడి రేపులకు గురైనవారు, బాల్య వివాహాలకు బలైనవారు, గృహ హింసను తట్టుకోలేక పారిపోయి వచ్చిన వారూ ఉన్నారు. వారంతా మగ ప్రపంచానికి దూరంగా...స్వేచ్ఛగా, తమ కాళ్ల మీద తాము నిలబడి ఆనందంగా బతుకుతున్నారు. వారే కెన్యా దేశంలోని యుమోజా గ్రామస్థులు. ఉత్తర కెన్యాలోని సాంబూర్ ప్రాంతంలో యుమోజా గ్రామం ఉంది. దీన్ని మొట్టమొదట 1990లో రెబెక్కా లొలోసోలి అనే మహిళా నాయకత్వంలో ఓ 15 మంది బాధిత మహిళలు ఈ గ్రామాన్ని ఏర్పాటు చేశారు. వారిలో ఎక్కువ మంది బ్రిటన్ సైనికుల గ్యాంగ్ రేప్‌లకు గురై భర్తల నుంచి వేధింపులు ఎదుర్కొన్నవారే. ఆ గ్రామం ఏర్పడి ఇప్పటికి పాతిక సంవత్సరాలయింది. మగవారి తోడు, నీడ అవసరం లేకుండా ఇంతకాలం స్వతంత్రంగా బతికామన్న ఆనందంలో వారు 25వ గ్రామం వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. గ్రామం ఏర్పాటైన సంవత్సరం మినహా వారికి తేదీలు, నెలలు గుర్తులేవు. అందుకనే వారు ఈ ఏడాదంతా తమకు వార్శికోత్సవ పండుగేనని చెబుతున్నారు. 15 మందితో మొదలైన యుమోజి గ్రామంలో ఇప్పుడు 47 మంది మహిళలు, 200 మంది పిల్లలు ఉన్నారు. పిల్లల్లో కొంతమంది బాల్య వివాహాలకు బలై వచ్చిన వారు కాగా, ఎక్కువ మంది ఈ 47 మంది మహిళల పిల్లలే. సెక్స్ కోసం వారు మగవాళ్లను రాత్రిపూట గ్రామంలోకి అనుమతిస్తారు. తెల్లవారక ముందే మగవాళ్లు వెళ్లిపోవాలి. గ్రామంలో ఉండడానికి వీల్లేదు. ‘మగవాళ్లను మేము సక్స్ కోసం ఇప్పటికీ ఇష్టపడతాం. అయితే వారిని మా గ్రామంలో ఉండనీయం. నాకు ఐదుగురు పిల్లలు. వారంతా వేర్వేరు తండ్రులకు పుట్టిన వాళ్లే’ అని ఓ 30 ఏళ్ల యువతి పగలబడి నవ్వుతూ అక్కడికెళ్లిన ఓ మీడియా ప్రతినిధికి చెప్పింది. అందుకే వారి పిల్లల్లో రకరకాల జాతుల లక్షణాలు కనిపిస్తున్నాయి. . రకరకాల మగవాళ్ల వేధింపులతో ఈ గ్రామానికి చేరుకున్న తమలో ఎవరికి మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన రాలేదని, చేసుకునే ప్రసక్తే లేదని సియెరా కెనియా అనే నలభై ఏళ్ల పైబడిన ఓ తల్లి తెలిపింది. ఇక తమ పిల్లలను మాత్రం వారి ఇష్టానికే వదిలేస్తున్నామని, పెళ్లి చేసుకుంటే మాత్రం వారు ఊరిడిచి వెళ్లి పోవాల్సిందేనని ఆమె చెప్పారు. గ్రామస్థులు ప్రధానంగా పూసలతో చేసిన గాజులు, నగలను, వెదురు చాపలను పర్యాటకులకు విక్రయించడం ద్వారా లభించే ఆదాయంతో జీవిస్తున్నారు. గ్రామానికి కిలోమీటరు దూరంలో ఉండే ఓ నది పక్కన వారు ఓ స్థావరాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ విడిది చేసే పర్యాటకుల కోసం వారు అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. వంటచేసి పెడతారు. సమీపంలోని పర్వత ప్రాంతాల్లో విహరించాలనుకునే వాళ్లకు గైడ్‌గా వ్యవహరిస్తారు. గ్రామస్థులు స్థానిక ప్రభుత్వంపై పోరాటం జరిపి ఊరికి ఓ ప్రాథమిక పాఠశాలను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అమెరికాకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో యుమోజా గ్రామం పక్కనే ‘యునిటి’ పేరిట మరో కుగ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తాజాగా తమకు భూములపై హక్కులు కావాలని గ్రామం మహిళలు డిమాండ్ చేస్తున్నారు. కెన్యాలో భూములపై హక్కులు మగవాళ్లకే ఉంటాయి. గ్రామం ఏర్పడి తొలినాళ్లలో దాన్ని నాశనం చేసేందుకు ఎన్నోసార్లు దాడులు చేసి విసిగిపోయిన మగవాళ్లు ఇప్పుడు భూమిపై హక్కుల డిమాండ్‌తో మళ్లీ మండిపడుతున్నారు. ‘యుమోజ్విమెన్.నెట్’ పేరిట గ్రామస్థులకు వెబ్సైట్ కూడా ఉంది. -
పాక్ క్రికెటర్ పై రెండేళ్ల నిషేధం
లాహోర్: డోపింగ్ టెస్ట్‌లో పట్టుబడ్డ పాకిస్తాన్ స్పిన్ బౌలర్ రజా హసన్‌పై పాక్ క్రికెట్ బోర్డు రెండేళ్ల నిషేధం విధించింది. దేశవాళి క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా జరిపిన డోపింగ్ టెస్ట్ లో ఈ 22 ఏళ్ల ఎడమచేతి వాటం స్పిన్ బౌలర్ దొరికాడు. గత ఏడాది ఆస్ట్రేలియాతో దుబాయిలో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్లోకి రజా ఆరంగేట్రం చేశాడు. చివరగా డిసెంబర్లో న్యూజిలాండ్‌తో జరిగిన టీ-20 మ్యాచ్‌లో ఆడాడు. ఇప్పటి వరకు రజా 1 వన్ డే మ్యాచ్, 10 టీ-20 మ్యాచ్ లలో ఆడాడు.. -
విదేశీయులారా.. మీరు మా వర్సీటీల్లో వద్దు
లండన్: తమ దేశ విశ్వవిద్యాలయాల్లో విదేశీ విద్యార్థులకు అణు, జీవ, రసాయన యుద్ధాలకు సంబంధించిన విద్యను బోధించబోమని బ్రిటన్ వర్సిటీలు ప్రకటించాయి. ఆ కోర్సులు చదివేందుకు విదేశీ విద్యార్థులకు అనుమతి కూడా ఇవ్వకూడదని నిర్ణయించాయి. ఇప్పటికే ఈ కోర్సుల్లో ఉన్న దాదాపు 739 మంది విద్యార్థులను వాటిని చదవకుండా నిషేధించాయి. దేశ రక్షణ సంబంధమైన ఆందోళనల కారణంగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. విదేశాల నుంచి వచ్చే విద్యార్థులు సదరు కోర్సుల్లో పరిజ్ఞానం సంపాధించుకొని అనంతరం ఉగ్రవాద దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా సంస్థలు సూచించినందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నాయి. మానవ విధ్వంసం సృష్టించగల అణ్వాయుధాల తయారీని నేర్పించే సైన్స్ కోర్సుల్లో చదివేందుకు విదేశీ విద్యార్థులకు కూడా అవకాశం కల్పిస్తూ 2007లో ఒక పాలసీని తీసుకొచ్చారు. అయితే, వీటిల్లో స్వదేశీ కన్నా విదేశీ విద్యార్థులే ఎక్కువగా చేరుతున్నారని, ఇది దేశ భద్రతకు ముప్పు కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో బ్రిటన్ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. అణుపదార్ధాలు, జీవసంబంధ పదార్థాలు, రసాయన పదార్థాలతో చేసే ఆయుధాల తయారీ విజ్ఞానాన్ని విదేశీయులకు నేర్పించబోమని ప్రకటించింది. -
‘హెరిటేజ్’ పాలు నిషేధించాలి
టీఆర్ఎస్ నేతల డిమాండ్ తార్నాకలో భారీ ర్యాలీ..ఆందోళన తార్నాక:నాణ్యతలేకుండా పంపిణీ చేస్తున్న హెరిటేజ్ పాలను తెలంగాణ రాష్ట్రంలో నిషేదించాలని తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతే శోభన్‌రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హెరిటేజ్ పాలను పూర్తిగా నిషేదించాలని డిమాండ్ చేస్తూ బుధవారం విజయ డెయిరీ కార్మికులు, తెలంగాణ ట్రేడ్ యూనియన్ సెల్, తార్నాక మినీలారీస్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో లాలాపేట నుంచి తార్నాక చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. విజయ పాలు ముద్దు- హెరిటేజ్ పాలు వద్దు...విషపూరిత పాలు హెరిటేజ్ పాలు అంటూ ర్యాలీ పొడవునా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అనంతరం తార్నాక చౌరస్తాలో హెరిటేజ్ పాలను రోడ్డుపై పారబోసి నిరసన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ తార్నాక డివిజన్ వర్కింగ్ ప్రసిడెంట్ వేణుగోపాల్‌రెడ్డి, యుత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరెల్లి నాగరాజుగౌడ్, కార్మిక సంఘం నాయకులు శివానందం, చక్రవర్తిగౌడ్, పర్మేష్, అంజి, శంకర్, వెంకటస్వామి, శైలజ, రంగారెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వినియోగదారుల ఫిర్యాదు మన్సూరాబాద్: హెరిటేజ్ కంపెనీ వారు నాణ్యత లేని పాలు సరఫరా చేయడంతో అవి వేడి చేయగానే విరిగిపోయాయని పలువురు వినియోగదారులు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప్పల్ యూనిట్ నుంచి ఎల్బీనగర్ పరిసర ప్రాంతాలకు పరఫరా చేసిన యూ18 ఎస్టీ బ్యాచ్ నెంబర్ గోల్డ్ స్టాండరైజ్డ్ పాలను మిల్క్పార్లర్ల వద్ద వినియోగదారులు కొనుగోలు చేశారు. అయితే పాలు విరిగిపోవడంతో వెంటనే సమీపంలోని మిల్క్ ఏజెంట్లకు ఫిర్యాదు చేశారు. వారు కంపెనీ ప్రతినిధులకు సమాచారం అందించారు. ఎల్బీనగర్ ప్రాంతంలో నాణ్యతలేని పాలు దాదాపు 800 లీటర్లు సరఫరా అయ్యాయి. తయారీలో లోపం నిజమే... ఉప్పల్ యూనిట్ నుంచిసరఫరా అయిన పాల తయారీలో లోపం ఏర్పడిన మాట వాస్తవమేనని హెరిటేజ్ ఎల్బీనగర్ బ్రాంచి మేనేజర్ రాజిరెడ్డి పేర్కొన్నారు. వినియోగదారుల నుంచి ఫిర్యాదు రాగానే వెంటనే ఏజంట్లను అప్రమత్తం చేసి వాటిని అమ్మవద్దని కోరినట్లు తెలిపారు. ఫిర్యాదు చేసిన కొనుగోలుదారులకు రెగ్యులర్ టోన్డ్ పాలను అందజేయమని కోరామని, సుమారు 50 శాతం పైగా పాలను వెనక్కి తెప్పించామని చెప్పారు. ఒక్కరోజే 20 వేల లీటర్ల పాలు పాడయ్యాయి... -ట్విన్ సిటీస్ మిల్క్ వెండర్స్ అసోసియేషన్ ఆరోపణ వనస్థలిపురం: హెరిటేజ్ సంస్థ పాల విక్రయాల వల్ల తాము నష్టపోతున్నామని, బుధవారం ఒక్కరోజే 20 వేల లీటర్ల హెరిటేజ్ స్టాండర్డ్ (గోల్డ్) పాలు పాడైపోయాయని జంటనగరాల మిల్క్ వెండర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపించారు. బుధవారం వనస్థలిపురంలో టీఆర్ఎస్ నాయకులు, మిల్క్ వెండర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ముద్దగౌని రాంమోహన్‌గౌడ్ నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు కుంబ వెంకటేష్‌గౌడ్, ఉపాధ్యక్షులు రెహమాన్, కార్యదర్శి శ్రీరంగం తదితరులు మాట్లాడుతూ బుధవారం తాము సరఫరా చేసిన హెరిటేజ్ స్టాండర్డ్ (గోల్డ్) పాలు తాగి పలు ప్రాంతాలలో చిన్న పిల్లలు అస్వస్థతకు గురైనట్లు పలు ప్రాంతాల నుంచి ఫిర్యాదులు అందాయని అన్నారు. ఈవిషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా రాంమోహన్‌గౌడ్ తెలిపారు. -
గుట్కా కావాలా.. ప్రొద్దుటూరుకు రండి..
ప్రొద్దుటూరు క్రైం: ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గుట్కా పదార్థాలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. వీటిని విక్రయిస్తే కేసులు నమోదు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం ప్రతి రోజు టీవీలు, సినిమా థియేటర్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలు కూడా ఇస్తున్నాయి. అయినప్పటికీ యథేచ్ఛగా నిషేధిత గుట్కా పదార్థాలు పట్టణంలో లభిస్తున్నాయి. చిన్న చిన్న బీడీల షాపు నుంచి హోల్‌సేల్ షాపుల వరకూ వీటిని బాహాటంగానే విక్రయిస్తున్నారు. ప్రతి రోజు రూ. లక్షల్లో వీటి విక్రయాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రెట్టింపు ధరలకు విక్రయాలు ప్రొద్దుటూరులో పాన్‌పరాగ్, గుట్కా, రాజాఖైనీలతో పాటు బ్లూబుల్ ఖైనీ అనే పొగాకు ప్యాకెట్లను దుకాణాలలో విక్రయిస్తున్నారు. అన్నిటికంటే బ్లూబుల్ ఖైనీ విక్రయాలు అధికంగా జరుగుతున్నట్లు దుకాణ దారులు అంటున్నారు. దీనిపై అన్ని వివరాలు తెలుగు, ఇంగ్లీష్‌లో ఉన్నప్పటికీ తయారు చేసిన ప్రాంతం మాత్రం వేరే భాషలో ముద్రించారు. గతంలో అయితే ఈ ప్యాకెట్‌ను రెండు రూపాయలకు విక్రయించేవారు. రెండు రూపాయలు ఉన్న ఖైనీ ప్యాకెట్‌ను హోల్ సేల్ దుకాణంలోనే రూ.3లకు విక్రయిస్తున్నారు. వాటిని రిటైల్ షాపుల వారు రూ.5-6లకు వినియోగదారులకు విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. ఊరూ.. పేరు లేకుండా గుట్కా, ఖైనీ ప్యాకెట్ల బండిల్స్ నిత్యం వస్తు రవాణా వాహనాల ద్వారానే ప్రొద్దుటూరుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ట్రాన్స్‌పోర్టుల ద్వారా వచ్చే ఈ తరహా బండి ళ్లపై వ్యక్తులపేర్లు గానీ, దుకాణాల పేర్లు గానీ ఉండవు. ఇలా ప్రతి రోజు ప్రొద్దుటూరు పట్టణానికి హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాల నుంచి సరఫరా అవుతున్నాయి. గతంలో అధికారులు దాడులు నిర్వహించి రూ.లక్షలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇటీవల కాలంలో వీటిపై సంబంధిత అధికారుల నిఘా లేకపోవడంతో గుట్కాలను బహిరంగంగా విక్రయిస్తున్నారు. దుకాణాలలో వీటి లభ్యత అధికం కావడంతో మైనర్లు కూడా గుట్కా వ్యసనానికి లోనవుతున్నారు. అధికారులు చర్యలు తీసుకొని గుట్కా విక్రయాలను నిషేధించాలని ప్రజలు కోరుతున్నారు. -
నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వాడొద్దు
ఆదిలాబాద్ మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: నిషేధిత ప్లాస్టిక్ కవర్లను వాడొద్దని, ఎవరైనా వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ ఫుడ్, శానిటరీ ఇన్స్పెక్టర్లు మహ్మద్ అయాజ్, జగదీశ్వర్‌గౌడ్ హెచ్చరించారు. నిషేధిత పాలిథిన్ కవర్లపై సోమవారం మున్సిపల్ కార్యాలయంలో టిఫిన్ సెంటర్, మిల్క్ సెంట ర్ల నిర్వాహకులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ ప్రభుత్వం కొన్ని ప్లాస్టిక్ బ్యాగులను నిషేధించిందని తెలిపారు. నిషేధిత కవర్లు వాడితే పెద్ద ఎత్తున జరిమానాలు విధిస్తామని పేర్కొన్నారు. ఈ కవర్లతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందన్నారు. వీటిని తినడం ద్వారా ఆవులు, గేదెలు చనిపోతాయని, ఇవి భూమిలో కొన్ని లక్షల సంవత్సరాలు నిల్వ ఉంటాయని పేర్కొన్నారు. 40 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ కవర్లు వాడే వారికి రూ.250 నుంచి రూ.500, విక్రయించే దుకాణదారులకు రూ.2500 నుంచి రూ.5000 జరిమానా విధించి పర్యావరణ చట్టం 1986 ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతీ వారం ఆయా వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేసి నిషేధిత ప్లాస్టిక్ కవర్లపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. వీటికి సంబంధించిన ఫ్లెక్సీలను మిల్క్, టిఫిన్ సెంటర్ల వద్ద ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతానికి అందరూ సహకరించాలని కోరారు.