
Google Banned 150 Malicious Apps:గూగుల్ ప్లే స్టోర్‌లో పలు ప్రమాదకరమైన యాప్స్ ఉన్నట్లు గూగుల్ గుర్తించింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి సుమారు 150 ప్రమాదకరమైన యాప్‌లను నిషేధించింది. ఈ యాప్స్ అల్టీమాఎస్‌ఎమ్‌ఎస్ అనే ప్రచారంలో 150 హానికరమైన మెసేజేస్ యాప్స్ ఉన్నట్లు గూగుల్ గుర్తించి వాటిపై చర్యలను తీసుకుంది. ఈ హానికరమైన యాప్స్‌ను వాడుతున్న వారిలో ఎక్కువగా నటీనటులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అప్లికేషన్లు ప్లే స్టోర్ నుంచి సుమారు 10.5 మిలియన్ కంటే ఎక్కువ మంది డౌన్‌లోడ్ చేశారని గూగుల్ పేర్కొంది.
చదవండి: యాపిల్ నెంబర్ 1 స్థానంపై కన్నేసిన మైక్రోసాఫ్ట్..!
అసలు ఏంటీ అల్టీమాఎస్‌ఎమ్‌ఎస్..!
సైబర్‌నేరస్తులు కొత్త పుంతలు తొక్కుతూ పలు హానికరమైన యాప్స్‌ను తయారుచేసి వాటిని గూగుల్ ప్లే స్టోర్‌లో వచ్చేలా చేశారు. ఈ యాప్స్ ద్వారా తక్కువ ధరలోనే పలు ప్రీమియం ఎస్‌ఎమ్‌ఎస్ సేవలను అందిస్తామని యాప్స్ ప్రచారం చేసుకుంటాయి. ఈజిప్ట్, సౌదీ అరేబియా, పాకిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, టర్కీ, ఒమన్, ఖతార్, కువైట్, యునైటెడ్ స్టేట్స్, పోలాండ్‌లోని ఆండ్రాయిడ్ వినియోగదారులు ఎక్కువగా ప్రభావితమైనట్లుగా తెలుస్తోంది. ప్రీమియం సేవలను అందించడంతో పాటుగా యూజర్లు డబ్బులు సంపాదించే అవకాశం వస్తోందంటూ యూజర్లకు ఆఫర్లను అందిస్తాయి.
గూగుల్ బ్యాన్ చేసిన యాప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
అల్టీమాఎస్‌ఎమ్‌ఎస్ యాప్స్‌తో యూజర్ల డేటాను హ్యకర్లు చోరీ చేస్తారు. ప్రముఖ యాంటీ వైరస్ బ్లాగ్ అవాస్థ్ ప్రకారం...ప్లే స్టోర్ నుంచి యూజర్లు యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసినప్పుడు..వారి లోకేషన్‌ను, ఫోన్ ఐఎమ్‌ఈఐ నంబర్, ఫోన్ నంబర్‌ను సేకరిస్తుంది.వారి మెయిల్ అడ్రస్‌ను కూడా హ్యకర్లు తమ చేతికి చేజిక్కించుకుంటున‍్నట్లు అవాస్థ్ పేర్కొంది.
చదవండి:ప్రజలకు రెవోస్ కంపెనీ బంపర్ ఆఫర్.. రూ.1కే ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్!
Comments
Please login to add a commentAdd a comment