దుబాయ్ : బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీలంక జట్టుకు ‘ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్’(ఐసీసీ) గట్టి షాక్ ఇచ్చింది. శ్రీలంక కెప్టెన్ దినేశ్ చండిమాల్‌పై ఐసీసీ ఒక టెస్టు మ్యాచ్ నిషేధంతో పాటు మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత విధించింది. దీంతో వెస్టిండీస్‌తో జరుగనున్న టెస్టు సిరీస్ చివరి మ్యాచ్‌కు చండిమాల్ దూరం కానున్నాడు.
గత శనివారం సెయింట్ లూసియా టెస్టు మ్యాచ్‌లో భాగంగా శ్రీలంక జట్టుపై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ మ్యాచ్‌లో చండీమాల్ బాల్ కండీషన్ మార్చడానికి ప్రయత్నించాడనే ఆరోపణల ఎదుర్కొన్నాడు. దాంతో వీడియో ఫుటేజీ ఆధారంగా ఈ విషయాన్ని పరిశీలించిన ‘ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్’ను చండిమాల్ అతిక్రమించాడని నిర్ధారించి ఈ చర్యలు తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment