కోల్‌కతా : కరోనా వైరస్ ఉదృతంగా ఉన్న నేపథ్యంలో కోల్‌కతా ఎయిర్‌పోర్టు అధికారులు శనివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా విస్తరణ ఎక్కువగా ఉన్న ఢిల్లీ, ముంబై, పుణే, నాగ్‌పూర్, చెన్నై, అహ్మదాబాద్ ప్రాంతాల నుంచి కోల్‌కతాకు విమానాల సర్వీసులు రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. జూలై 6 నుంచి 19 వరకు ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని తెలిపారు. అంతకముందు కరోనా వైరస్ హాట్‌స్పాట్స్‌గా ఉన్న ప్రాంతాల నుంచి విమానాల సర్వీసులను నిలిపివేయాలంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment