ఇకపై డోర్ కొట్టకూడదట..! | Door-to-door sales should be banned! | Sakshi
Sakshi News home page

ఇకపై డోర్ కొట్టకూడదట..!

Published Mon, Sep 28 2015 5:16 PM | Last Updated on Sun, Sep 3 2017 10:08 AM

ఇకపై డోర్ కొట్టకూడదట..!

ఇకపై డోర్ కొట్టకూడదట..!

డోర్ టు డోర్ ప్రచారం చేసేవాళ్ళు... సేల్స్ మెన్స్ తలుపు కొట్టి విసిగించడం చాలామందికి అనుభవమే అయ్యుంటుంది. అదే అనుభవం లండన్ లోని బ్రాడ్ పోర్డ్ కు చెందిన  మహిళ విషయంలోనూ జరిగింది. పదే పదే జనం విసిగించకుండా ఉండేందుకు ఆమె తమ ఇంటి డోర్ పై ఓ స్టిక్కర్ ను అతికించింది. అయినా ఆమెకు  బాధ తప్పలేదు. దీంతో విసిగిపోయిన ఆ మహిళ కోర్టును ఆశ్రయించింది. అంతే కాకుండా గట్టిగా తన వాదనను వినిపించి... మొత్తానికి అనుకున్నది సాధించింది. ఏకంగా డోర్ టు డోర్ సేల్స్ నే బ్యాన్ చేసేట్టు చేసింది.

వివరాల్లోకి వెళితే...రోజుకు కనీసం మూడు, నాలుగు సార్లు డోర్ కొట్టి విసిగిస్తున్న సేల్స్ మెన్స్ బాధ నుంచి తప్పించుకునేందుకు లండన్ కు చెందిన కెల్లీ రోజ్ తనవంతు ప్రయత్నం చేసింది. ''నా అడ్రస్ తో ఏదైనా పార్శిల్ వచ్చినా దయచేసి నన్నుడిస్ట్రబ్ చేయొద్దు'' అంటూ కెల్లీ తన ఇంటి డోర్ పై ఓ సూచనను అతికించింది. ఆ స్టిక్కర్ చూసైనా సేల్స్ వాళ్ళు తనను అనవసరంగా విసిగించరని అభిప్రాయ పడింది. తలుపు కొట్టొద్దు అన్న సంకేతాన్ని స్టిక్కర్ తో సూటిగా చెప్పాననుకుంది. కానీ లాభం లేకపోయింది. ఆ విషయాన్ని పట్టించుకున్న నాధుడే కనిపించలేదు. ఎప్పట్లాగే తలుపు కొడుతూనే ఉన్నారు.

 

హడావిడిగా బయటకు వెడుతున్న సమయంలోనూ అడ్డుకొట్టేవారూ లేకపోలేదు. దీంతో సహనం కోల్పోయిన ఆమె తలుపు కొట్టిన వారిని కోపంగా ప్రశ్నించింది కూడా. తలుపుపై అంటించిన స్టిక్కర్ మీకు కనిపించలేదా అని.. దానికి కొందరు తాము గమనించలేదని, మరి కొందరు మరో అడుగువేసి ఆ స్టిక్కర్ పై ఎటువంటి లీగల్ అథారిటీ లేదని చెప్పడాన్ని తట్టుకోలేక పోయింది. ఇరుగు పొరుగులను కూడా సంప్రదించింది. వారూ అదే సమస్యతో ఇబ్బందులు పడుతూనే ఉన్నామని చెప్పారు. మరొకరు ఇప్పటికే లీగల్ అథారిటీతో స్టిక్కర్ తీసుకున్నామని చెప్పారు. సమస్యను నివారించేందుకు ఏం చేయాలో కెల్లీ తీవ్రంగా ఆలోచించింది.

ఇంటికి వచ్చిన సేల్స్ బాయ్స్ తాలూకు ఏజెన్సీకి ఫోన్ చేసింది. తాను బుక్ చేయకుండానే వారి ఏజెన్సీనుంచి సేల్స్ బాయ్స్ వచ్చి తలుపు కొట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఏజెన్సీ నుంచి కూడ కెల్లీకి భంగపాటు ఎదురైంది. మేడమ్..! మీకు ఎవరూ డిస్ట్రబ్ చేయడం నచ్చకపోతే అఫీషియల్ స్టిక్కర్ ను అతికించుకోమన్న సమాధానం రావడంతో ఆగ్రహంతో ఊగిపోయింది.

 

ఇక లాభం లేదనుకున్న కెల్లీ... డోర్ టు డోర్ ప్రచారం, సేల్స్ వంటివి బ్యాన్ చేయించడం తప్పితే... సమస్యకు పరిష్కారం లేదని భావించింది. ఇంతకు ముందే ఇటువంటి గుర్తింపులేని, నిబంధనలు ఉల్లంఘించి అమ్మకాలు జరుపుతున్న పలువురు వ్యాపారస్తుల కేసుల్లో శిక్షార్హులైన వారి ఆధారాలను సేకరించింది. సౌత్ వేల్స్ లోని  న్యూ పోర్ట్ క్రౌన్ కోర్టులో దావా వేసి గట్టిగా తన వాదనను వినిపించి... చివరికి కేసు గెలిచింది. ఆప్రాంతంలో డోర్ టు డోర్ సేల్స్ బ్యాన్ చేయించింది.

అయితే ఇలా డోర్ టు డోర్ ప్రచారాలు, అమ్మకాలకు విసిగిపోయేవారితో పాటు వారికి సపోర్ట్ ఇచ్చేవారూ  ఉన్నారనేందుకు కెల్లీ కేసు ఉదాహరణగా నిలుస్తోంది. ఆమె కేసు గెలిచి, డోర్ టు డోర్ సేల్స్ బ్యాన్ చేయించడాన్ని కొందరు తప్పు బడుతున్నారు. అలా బ్యాన్ చేయడం వల్ల అవసరమైన, ముఖ్యమైన సమాచారం, పార్శిళ్ళు, కొరియర్లు మిస్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. అలాగే .. కడుపు నింపుకునేందుకు  సేల్స్ పై ఆధారపడి జీవించే వారు ఉంటారని, అటువంటి వారికి ఇది పెద్ద అవరోధమని అంటున్నారు.

డిస్ట్రబెన్స్ వద్దనుకునేవారు ఇటీవల అందుబాటులో ఉన్న  ఐ-బెల్  వంటి (తలుపు తెరవకుండా, తమ ఫోన్లలో డోర్ బయట ఉన్నవారి వివరాలు చూసే) యాప్ లను డౌన్ లోడ్ చేసుకొని,   ఆధునిక పద్ధతులను అమలు చేసి సేల్స్ వారి బాధనుంచీ దూరమవ్వొచ్చనీ అంటున్నారు.  అంతేతప్ప.. మొత్తానికే నిరోధించడం సరికాదని అభిప్రాయ పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement