![Over 20 lakh WhatsApp Accounts Banned in August - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/2/whatsapp.jpg.webp?itok=C-8AXdqd)
న్యూఢిల్లీ: ఆగస్టులో దాదాపు 20 లక్షలకు పైగా భారతీయ అకౌంట్లను నిషేధించామని వాట్సప్ తెలిపింది. గతనెల తమకు 420 ఫిర్యాదులు అందాయని కంపెనీ నెలవారీ అనువర్తననివేదిక(మంత్లీ కంప్లైయన్స్ రిపోర్టు)లో వెల్లడించింది. నిషేధిత 20లక్షల 70వేల అకౌంట్లలో అధికశాతం అకౌంట్లను బల్క్ మెసేజ్‌లను అనధీకృతంగా వాడినందున(స్పామ్) నిషేధించామని తెలిపింది. ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 80 లక్షల అకౌంట్లను తొలగించామని తెలిపింది. తమకందిన 420 ఫిర్యాదుల పరిశీలన అనంతరం 41 అకౌంట్లపై తగిన చర్యలు తీసుకున్నామని పేర్కొంది.
జూన్16–జూలై 31 కాలంలో ఇండియాలో సుమారు 30 లక్షల అకౌంట్లను వాట్సప్ నిషేధించింది. 594 ఫిర్యాదులు అందినట్లు తెలిపింది. మేలో వచ్చిన నూతన ఐటీ నిబంధనలను అనుసరించి వాట్సప్ తదితర సోషల్ మీడియా సంస్థలు నెలవారీ నివేదికలను విడుదల చేస్తున్నాయి. ఆగస్టులో సుమారు 3.17 కోట్ల కంటెట్ భాగాలపై, జూన్16– జూలై 31 కాలంలో 3.33 కోట్ల కంటెంట్ భాగాలపై చర్యలు తీసుకున్నామని సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్ సుమారు 22 లక్షల కంటెంట్ పీసెస్‌పై చర్యలు తీసుకుంది. ఆగస్టులో తమకు 904 యూజర్ ఫిర్యాదులు వచ్చాయని ఫేస్‌బుక్ తెలిపింది. వీటిలో 754 ఫిర్యాదులను పరిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment