
వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ ఒక టెస్టు మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు. న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్‌లో సోమవారం ముగిసిన మొదటి టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా హోల్డర్‌పై ఐసీసీ టెస్టు నిషేధంతో పాటు 60 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించింది. మిగతా జట్టు సభ్యుల మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత పెట్టారు.
ఏప్రిల్‌లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులోనూ విండీస్ స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. తాజా టెస్టులోనూ నిర్ణీత సయమానికి మూడు ఓవర్లు తక్కువ వేసింది. ఏడాదిలో రెండుసార్లు ఇలా జరగడంతో హోల్డర్ సస్పెన్షన్ ఎదుర్కోవాల్సి వచ్చింది.