holder
-
4 బంతుల్లో 4 వికెట్లు
బ్రిడ్జ్‌టౌన్ (బార్బడోస్): వెస్టిండీస్‌తో ఐదో టి20లో ఇంగ్లండ్ విజయానికి ఆఖరి ఓవర్లో 20 పరుగులు కావాలి. జోరు మీదున్న బిల్లింగ్స్ సహా నాలుగు వికెట్లు ఉండటంతో అసాధ్యమేమీ అనిపించలేదు. అయితే తొలి బంతికి ‘నోబాల్’ సహా రెండు పరుగులిచ్చిన జేసన్ హోల్డర్ మరుసటి బంతికి పరుగు ఇవ్వలేదు. ఆ తర్వాత అతని మ్యాజిక్ మొదలైంది. వరుసగా నాలుగు బంతుల్లో జోర్డాన్, బిల్లింగ్స్, రషీద్, సాఖిబ్ అవుట్... మరో బంతి మిగిలి ఉండగానే ఇంగ్లండ్ ఆలౌట్. 17 పరుగులతో నెగ్గిన వెస్టిండీస్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3–2తో సొంతం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కెప్టెన్ పొలార్డ్ (25 బంతుల్లో 41 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు), రవ్మన్ పావెల్ (17 బంతుల్లో 35 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్స్‌లు), బ్రెండన్ కింగ్ (31 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), కైల్ మేయర్స్ (19 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం ఇంగ్లండ్ 19.5 ఓవర్లలో 162 పరుగులే చేయగలిగింది. జేమ్స్ విన్స్ (35 బంతుల్లో 55; 7 ఫోర్లు, 1 సిక్స్), స్యామ్ బిల్లింగ్స్ (28 బంతుల్లో 41; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మినహా అంతా విఫలమయ్యారు. అకీల్ హొసీన్ 4 కీలక వికెట్లు పడగొట్టాడు. సొంత మైదానంలో కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన (5/27) కనబర్చి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన హోల్డర్... మొత్తం 15 వికెట్లతో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు కూడా అందుకున్నాడు. మార్పుల్లేకుండానే భారత్‌కు... భారత్‌తో జరిగే టి20 సిరీస్‌లో తలపడే వెస్టిండీస్ జట్టును సెలక్టర్లు ప్రకటించారు. ఇంగ్లండ్‌పై సిరీస్ నెగ్గిన టీమ్‌లో ఎలాంటి మార్పు చేయకుండా ఆ 16 మందినే భారత పర్యటనకు ఎంపిక చేశారు. తగిన ఫిట్నెస్ ప్రమాణాలు అందుకోలేకపోయిన హెట్‌మైర్‌కు, కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఎలాంటి మ్యాచ్‌లు ఆడని ఎవిన్ లూయిస్‌కు ఈసారి కూడా చోటు దక్కలేదు. భారత్, విండీస్ మధ్య ఈ నెల 16, 18, 20 తేదీల్లో కోల్‌కతాలో మూడు టి20 మ్యాచ్‌లు జరుగుతాయి. వెస్టిండీస్ జట్టు: కీరన్ పొలార్డ్ (కెప్టెన్), నికోలస్ పూరన్ (వైస్ కెప్టెన్), ఫాబియాన్ అలెన్, డారెన్ బ్రేవో, రోస్టన్ ఛేజ్, షెల్డన్ కాట్రెల్, డొమినిక్ డ్రేక్స్, జేసన్ హోల్డర్, షై హోప్, అకీన్ హొసీన్, బ్రండన్ కింగ్, రవ్మన్ పావెల్, రొమారియా షెఫర్డ్, ఒడియాన్ స్మిత్, కైల్ మేయర్స్, హేడెన్ వాల్‡్ష జూనియర్. అంతర్జాతీయ టి20ల్లో వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు తీసిన నాలుగో ఆటగాడు జేసన్ హోల్డర్. గతంలో లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (అఫ్గానిస్తాన్; 2019లో ఐర్లాండ్‌పై), లసిత్ మలింగ (శ్రీలంక; 2019లో న్యూజిలాండ్‌పై), క్యాంఫర్ (ఐర్లాండ్; 2021 లో నెదర్లాండ్స్‌పై) ఈ ఘనత సాధించారు. -
‘సిక్సర’ పాండే
హైదరాబాద్ చావోరేవో తేల్చుకుంది. రాజస్తాన్‌ను బంతితో ఉక్కిరి బిక్కిరి చేసింది. బ్యాట్‌తో చకచకా పరుగులు జతచేసింది. ముఖ్యంగా మనీశ్ పాండే ఆట నిజంగా హైలైట్సే! ఆరంభంలోనే స్టార్ ఓపెనర్ల (వార్నర్, బెయిర్‌స్టో)ను కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో ఉన్న దశలో మనీశ్ సిక్సర్లతో శివతాండవం చేశాడు. ఇన్నింగ్స్ ఆసాంతం అతని మెరుపులు...విజయ్ శంకర్‌తో కలిసి జోడించిన పరుగులు రాజస్తాన్‌ను చిత్తు చేశాయి. దుబాయ్: ఓడితే ముందడుగు కష్టమయ్యే పరిస్థితుల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ శ్రమించింది. ముందు బౌలింగ్‌తో తర్వాత మెరుపు బ్యాటింగ్‌తో ప్రత్యర్థిని చిత్తు చేసింది. గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 8 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై జయభేరి మోగించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. సంజూ సామ్సన్ (26 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడు. హోల్డర్ 3 వికెట్లు తీశాడు. తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసి గెలిచింది. మనీశ్ పాండే (47 బంతుల్లో 83 నాటౌట్; 4 ఫోర్లు, 8 సిక్స్‌లు) సిక్సర్ల జడివాన కురిపించాడు. విజయ్ శంకర్ (51 బంతుల్లో 52 నాటౌట్; 6 ఫోర్లు) రాణించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 93 బంతుల్లోనే అభేద్యంగా 140 పరుగులు జత చేశారు. సన్‌రైజర్స్ జట్టులో గాయపడిన కేన్ విలియమ్సన్, బాసిల్ తంపి స్థానాల్లో హోల్డర్, నదీమ్‌లను తీసుకుంది. చప్పగా సాగిన రాజస్తాన్ ఇన్నింగ్స్ ఇకపై ఆడే మ్యాచ్‌లన్నీ గెలిచి తీరాల్సిన స్థితిలో రాజస్తాన్ రాయల్స్ బాధ్యత విస్మరించింది. ముందు బ్యాటింగ్‌కు దిగిన రాయల్స్ బ్యాట్స్‌మెన్‌లో ఆ నిర్లక్ష్యం కనబడింది. రెండు ఫోర్లు, ఓ సిక్స్ కొట్టిన ఓపెనర్ రాబిన్ ఉతప్ప (19) రనౌటయ్యాడు. మరో ఓపెనర్ స్టోక్స్ (32 బంతుల్లో 30; 2 ఫోర్లు) చేసిన పరుగుల కంటే ఆడిన బంతులే ఎక్కువ. ఇతను, సంజూ సామ్సన్ చాలా సేపే క్రీజులో ఉన్నా... అప్పటికీ చేతిలో 9 వికెట్లున్నా... పెద్దగా బ్యాట్‌కు పనిచెప్పలేదు. దీంతో 8.1 ఓవర్ల పాటు క్రీజులో ఉన్న ఈ జోడీ కొట్టింది మూడే బౌండరీలు... సిక్సయితే ఒక్కటే! నింపాదిగా సాగిన వీరిద్దరి ఆట రాజస్తాన్ ఇన్నింగ్స్‌కు ఏమాత్రం అక్కరకు రాకుండా పోయింది. ఇదే అదనుగా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో హైదరాబాద్ పట్టు బిగించింది. సామ్సన్ను హోల్డర్, స్టోక్స్‌ను రషీద్ ఖాన్ వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చారు. ఆ తర్వాత బట్లర్ (9), కెప్టెన్ స్మిత్ (19) వచ్చినా రాజస్తాన్ రాత మార్చలేకపోయారు. స్మిత్‌ను, కాస్తోకూస్తో మెరిపించిన రియాన్ పరాగ్ (12 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్)ను కూడా హోల్డరే ఔట్ చేశాడు. ఆఖర్లో ఆర్చర్ (7 బంతుల్లో 16 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) కొట్టిన సిక్స్ ఫోర్‌తో రాయల్స్ 150 పరుగులు దాటగలిగింది. ఆరంభానికి ఆర్చర్ తూట్లు ఏమంత కష్టసాధ్యం కానీ లక్ష్యమే అయినా... హైదరాబాద్ తడబడింది. రాయల్స్ పేసర్ ఆర్చర్ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో సన్‌రైజర్స్ ఆరంభానికి తూట్లు పొడిచాడు. వరుస ఓవర్లలో డాషింగ్ ఓపెనర్లిద్దరినీ ఔట్ చేయడంతో హైదరాబాద్ ఆత్మరక్షణలో పడింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన ఆర్చర్ నాలుగో బంతికి వార్నర్ (4)ను అవుట్ చేశాడు. తన మరుసటి ఓవర్లో (ఇన్నింగ్స్ 3వ) బెయిర్‌స్టో (10)ను బౌల్డ్ చేశాడు. 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోవడంతో రాజస్తాన్ శిబిరంలో ఉత్సాహం ఒక్కసారిగా ఉరకలెత్తింది. భారీ భాగస్వామ్యం... అయితే రాయల్స్ ఆనందం అంతలోనే ఆవిరైంది. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన మనీశ్‌పాండే ప్రత్యర్థి బౌలర్లపై సిక్సర పిడుగులతో చెలరేగాడు. కార్తీక్ త్యాగి తొలి ఓవర్లో రెండు బౌండరీలు బాదిన పాండే... స్టోక్స్ వేసిన వరుసటి ఓవర్లో డీప్ స్క్వేర్ లెగ్, మిడ్ వికెట్ల మీదుగా రెండు సిక్సర్లు కొట్టాడు. మరో ఎండ్‌లో విజయ్ శంకర్ నింపాదిగా అడుతూ పాండేకు అండగా నిలిచాడు. అంతటితో ఆగని మనీశ్... త్యాగి మళ్లీ బంతి బౌలింగ్‌కు దిగితే తను మళ్లీ భారీ షాట్లు బాదాడు. ఒక ఫోర్, 2 సిక్సర్లు కొట్టడంతో ఆ ఓవర్లో 18 పరుగులు వచ్చాయి. 5.4 ఓవర్లలో హైదరాబాద్ స్కోరు 50 దాటేసింది. తర్వాత కాసేపటికే శ్రేయస్ గోపాల్ ఓవర్లో పాండే మరో సిక్స్ బాదాడు. 28 బంతుల్లో తనూ ఫిఫ్టీ (3 ఫోర్లు, 5 సిక్సర్లు) పూర్తి చేసుకున్నాడు. విజయ్ శంకర్ కూడా అడపాదడపా బౌండరీలు కొట్టడంతో హైదరాబాద్ స్కోరు, జోరు ఏమాత్రం తగ్గలేదు. 12.3 ఓవర్లలోనే సన్ 100 పరుగులను చేరుకుంది. వీరిద్దరి భాగస్వామ్యం ఇలాగే దూసుకెళ్లడంతో సమీకరణం సులువైంది. ఆఖరి 30 బంతుల్లో 37 పరుగులే చేయాలి. ఈ దశలో 16వ ఓవర్ వేసిన ఆర్చర్ బౌలింగ్‌లో శంకర్ వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. ఈ ఓవర్లో 13 పరుగులు రావడంతో మిగిలిన నాలుగు ఓవర్లలో బంతికో పరుగు చేసేలా మారిపోయింది. మనీశ్ ఓవర్‌కో సిక్స్ బాదడంతో 11 బంతులు మిగిలుండగానే హైదరాబాద్ గెలిచింది. పాండే, శంకర్ అబేధ్యమైన మూడో వికెట్‌కు 140 పరుగులు జోడించడం విశేషం. సన్‌రైజర్స్ తరఫున గతంలో పలు శతక భాగస్వామ్యాలు ఉన్నాయి. కానీ విదేశీ ఆటగాడి ప్రమేయం లేకుండా... ఇద్దరు భారత ఆటగాళ్లే కలిసి వంద పరుగులకు పైగా భాగస్వామ్యం నమోదు చేయడం మాత్రం ఇదే తొలిసారి. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (రనౌట్) 19; స్టోక్స్ (బి) రషీద్ ఖాన్ 30; సామ్సన్ (బి) హోల్డర్ 36; బట్లర్ (సి) నదీమ్ (బి) శంకర్ 9; స్మిత్ (సి) మనీశ్ పాండే (బి) హోల్డర్ 19; పరాగ్ (సి) వార్నర్ (బి) హోల్డర్ 20; తేవటియా (నాటౌట్) 2; ఆర్చర్ (నాటౌట్) 16; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 154. వికెట్ల పతనం: 1–30, 2–86, 3–86, 4–110, 5–134, 6–135. బౌలింగ్: సందీప్ శర్మ 4–0–31–0, హోల్డర్ 4–0–33–3, శంకర్ 3–0–15–1, నటరాజన్ 4–0–46–0, రషీద్ 4–0–20–1, నదీమ్ 1–0–9–0. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) స్టోక్స్ (బి) ఆర్చర్ 4; బెయిర్‌స్టో (బి) ఆర్చర్ 10; మనీశ్ పాండే (నాటౌట్) 83; విజయ్ శంకర్ (నాటౌట్) 52; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (18.1 ఓవర్లలో 2 వికెట్లకు) 156. వికెట్ల పతనం: 1–4, 2–16. బౌలింగ్: ఆర్చర్ 4–0–21–2, అంకిత్ రాజ్‌పుత్ 1–0–11–0, కార్తీక్ త్యాగి 3.1–0–42–0, స్టోక్స్ 2–0–24–0, గోపాల్ 4–0–32–0, తేవటియా 4–0–25–0. హోల్డర్‌కు సహచరుల అభినందన -
హోల్డర్ సెంచరీ
బ్రిడ్జ్‌టౌన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ విజయంపై కన్నేసింది. మ్యాచ్ మూడో రోజు వెస్టిండీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో టీ విరామానికి 6 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. కెప్టెన్ జేసన్ హోల్డర్ (195 బంతుల్లో 155 బ్యాటింగ్; 19 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా, డౌరిచ్ (191 బంతుల్లో 97 బ్యాటింగ్; 8 ఫోర్లు, 1 సిక్స్) కూడా రాణించాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలిపి విండీస్ ఏకంగా 561 పరుగులు ముందంజలో నిలిచింది. ఫలితంగా ఇంగ్లండ్‌కు అందనంత లక్ష్యాన్ని నిర్దేశించేందుకు సిద్ధమైంది. రెండో ఇన్నింగ్స్‌లో 120 పరుగుల వద్దే విండీస్ ఆరో వికెట్ కోల్పోయినా హోల్డర్, డౌరిచ్ అద్భుతంగా ఆడి భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. -
హోల్డర్‌పై టెస్టు మ్యాచ్ నిషేధం
వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ ఒక టెస్టు మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు. న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్లో సోమవారం ముగిసిన మొదటి టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా హోల్డర్‌పై ఐసీసీ టెస్టు నిషేధంతో పాటు 60 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించింది. మిగతా జట్టు సభ్యుల మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత పెట్టారు. ఏప్రిల్‌లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులోనూ విండీస్ స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. తాజా టెస్టులోనూ నిర్ణీత సయమానికి మూడు ఓవర్లు తక్కువ వేసింది. ఏడాదిలో రెండుసార్లు ఇలా జరగడంతో హోల్డర్ సస్పెన్షన్ ఎదుర్కోవాల్సి వచ్చింది. -
జాదూగాడురా..
పెళ్లిళ్లు చేయిస్తానని చెప్పి మోసానికి పాల్పడిన యువకుడు అరెస్టు యువతను మోసగిస్తున్న ఎంటెక్ పట్టభద్రుడు వివాహాలు చేయిస్తానని రూ.లక్షల్లో వసూలు నిందితుడి అరెస్టు, రూ.12 లక్షల సొత్తు స్వాధీనం కాకినాడ క్రైం : అతను ఇంజినీరింగ్‌లో పీజీ పూర్తిచేశాడు. పలు ఉద్యోగాలకు ప్రయత్నించినా సక్సెస్ కాలేకపోయాడు. సులువుగా డబ్బు సంపాదించేందుకు అడ్డదారిని ఎంచుకున్నాడు. ఇంటివద్దే ఉంటూ యువత ఆదాయం సంపాదించుకోవచ్చంటూ పేపర్లలో ప్రకటనలు ఇచ్చి పలువురిని మోసగించి, చివరకు పోలీసులకు దొరికిపోయాడు. కాకినాడ రెండో పట్టణ పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యాడు. అతడి వద్ద నుంచి పోలీసులు రూ.12 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకుని సోమవారం కోర్టులో హాజరు పరిచారు. మోసగించే విధానం ఇదీ.. తొండంగి మండలం, వేమవరానికి చెందిన మారేటి శ్రీనివాసరావు (24) అలియాస్ (ఈశ్వర్, రామిరెడ్డి) హైదరాబాద్‌లో ఎంటెక్ చేశాడు. సులువుగా అడ్డదారిన డబ్బు సంపాదించాలనుకున్నాడు. ఇందుకు పెళ్లికాని ఆశావహులు, యువతను ఎంచుకున్నాడు. వివాహ పరిణయ వేదిక మ్యారేజ్ బ్యూరోను 2014లో ఈశ్వర్ పి. వెంకటరామిరెడ్డి అనే పేరుతో ప్రారంభించాడు. భర్తలేని భార్యకు రెండో పెళ్లి అని... పీటలమీద పెళ్లి ఆగిపోయిందని ఎక్కువ మొత్తంలో కట్నం ఇస్తామని... కులమతాలతో ప్రసక్తి లేదంటూ ఇలా రకరకాల ఆకర్షణీయమైన ప్రకటనలు ఇచ్చి, అందమైన యువతుల ఫొటోలను చూపించి యువకులను ఆకర్షించేవాడు. శ్రీనివాసరావు మాయలో పడిన యువకుల నుంచి ప్రాసెసింగ్ ఖర్చుల కోసమంటూ రూ.10 వేల వరకూ వసూలు చేసేవాడు. టెలికాలర్ ఉద్యోగం పేరిట నెలకు రూ.12 వేల వరకూ ఆదాయం గడించవచ్చంటూ ప్రకటన లిచ్చి నిరుద్యోగ యువత నుంచి రూ.లక్షల్లో వసూలు చేశాడు. బాధితుల నుంచి ఆధార్, ఏటీఎం కార్డులతో పాటు పాస్‌పోర్టు సైజు ఫొటోలు తీసుకునేవాడు. ఇలా తీసుకున్న ప్రూఫ్స్‌తో వారి పేరుతో íసిమ్ కార్డులు తీసుకునేవాడు. వివాహాల కోసం, టెలికాలర్ ఉద్యోగం కోసం కట్టిన డబ్బులను తన ఖాతాలో డిపాజిట్ చేసుకోకుండా తన సంస్థలో టెలి కాలర్ ఉద్యోగం చేస్తున్న కొంతమంది ఖాతాల్లో వారికి తెలియకుండా డిపాజిట్ చేయించేవాడు. ఏటీఎం కార్డులతో వారికి తెలియకుండానే డబ్బులు డ్రా చేసేవాడు. ఒక్కో యువకుడితో ఒక నకిలీ సిమ్ కార్డుతో సంభాషణ సాగించి, పనిపూర్తయ్యాక ఆ సిమ్ తొలగించేవాడు. ఇలా ఇతను గుంటూరు నుంచి కృష్ణా, విజయవాడ, విశాఖపట్టణం, తూర్పుగోదావరి జిల్లాల నుంచే కాక తమిళనాడులోని కొంతమంది బాధితులను మోసగించినట్టు పోలీసుల తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కాకినాడ రెండో పట్టణ పోలీసులు నిందితుడ్ని పట్టుకునేందుకు అనేక మార్గాల్లో అన్వేషించారు. బ్యాంకు ఖాతాల లావాదేవీలు, సీసీ పుటేజీ వివరాలు, డబ్బు చెల్లించిన ఖాతాలను పరిశీలించగా పోలీసులు ఆధారాలు దొరికాయి. ఎట్టకేలకు కాకినాడ జగన్నాథపురం ఆంధ్రా బ్యాంకులో ఓ మహిళ ఖాతాకు రూ.4.50 లక్షల డిపాజిట్ అయినట్టు గుర్తించి, విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడిందని డీఎస్పీ వెంకటేశ్వరరావు వివరించారు. నిందితుడ్ని అతడి స్వగ్రామం వేమవరంలో పోలీసులు అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి ఎస్టీమ్ కారు, స్కూటర్, 9 బంగారు ఉంగరాలు, 2 బంగారు చైన్లు, 50 నకిలీ సిమ్‌కార్డులు, 10 సెల్ఫోన్లు, 15 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. సమావేశంలో సీఐ చైతన్యకృష్ణ, ఎస్సై వంశీధర్ పాల్గొన్నారు. -
ఖాతాదారులకు మెరుగైన సేవలు
ఆంధ్రాబ్యాంకు డీజీఎం శేషగిరిరావు కరీంనగర్: ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తూ్త ప్రభుత్వ పథకాల అమలులో ముందంజలో ఉన్నామని ఆంధ్రాబ్యాంకు కరీంనగర్ జోన్ డీజీఎం వీఎస్.శేషగిరిరావు తెలిపారు. మంగళవారం జోనల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరీంనగర్, ఆదిలాబాద్ జోన్లో ఆంధ్రాబ్యాంకు 98 శాఖలు, 102 ఏటీఎంలు, 64 నగదు జమ యంత్రాలతో ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. గంభీరావుపేట త్వరలో 99వ శాఖను ప్రారంభిస్తామన్నారు. 2015–16ఆర్థిక సంవత్సరంలో కరీంనగర్ జోన్ రూ. 7725 కోట్లు వ్యాపారం చేసిందని డిపాజిట్లు రూ. 4539 కోట్లు, రుణాలు రూ.3185 కోట్ల లావాదేవీలు జరిగాయన్నారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.9వేల కోట్ల లక్ష్యంగా నిర్ణయించగా జూన్ మాసానికి రూ. 7750 కోట్ల వ్యాపారం జరిగినట్లు ఆయన వెల్లడించారు. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాల అమలులో బ్యాంక్ మొదటిస్థానంలో ఉందని తెలిపారు. ఖ>తాదారులు తమ ఆధార్, మొబైల్ నెంబర్‌ను అనుసంధానం చేసుకోవాలని సూచించారు. బంగారంపై ప్రతి గ్రాముకు రూ. 2 వేల రుణం, స్థిరాస్తులపై ఆకర్షణీయ వడ్డీరేట్లతో ప్రాపర్టీ ఓవర్ డ్రాఫ్ట్, ప్రాపర్టీ టర్మ్ లోన్ ఇస్తున్నామని తెలిపారు. ఏజీఏం రాజేంద్రప్రసాద్, ముఖ్య అధికారి సాయిసుధాకర్, సత్యజిత్ పాల్గొన్నారు. -
ఈ పక్షులు తినిపిస్తాయి!
ఫ్రూట్ సలాడ్ (పండ్ల ముక్కలు) తినడానికి కచ్చితంగా ఫ్రూట్ ఫోర్క్స్ వాడటం మనకి అలవాటే. ప్లాస్టిక్, ఉడ్, మెటల్... ఇలా రకరకాల ఫోర్క్స్ దొరుకుతున్నాయి మార్కెట్లో. అయితే అవన్నీ దాదాపు ఒకేలా ఉంటాయి. అన్నింట్లో వెరైటీ ఉన్నప్పుడు వీటిలో మాత్రం ఎందుకు ఉండకూడదు అనుకున్నారో ఏమో... ఓ కంపెనీవాళ్లు ఇలాంటి కొత్తరకం ఫ్రూట్ ఫోర్క్స్ తయారు చేశారు. వీటికి ‘బర్డీ ఫ్రూట్ ఫోర్క్స్’ అని పేరు పెట్టారు. ఇవి ఓవైపు ఫోర్క్స్లా ఉపయోగపడుతూనే... మరోవైపు ఇంట్లో షోకేస్‌లో బొమ్మల్లాగా ఉండి ఇంటికి అందాన్ని కూడా తెస్తాయి. రంగు రంగుల పక్షుల బొమ్మలతో ఉండే ఈ ఫోర్క్స్‌ను అమర్చడానికి ఒక హోల్డర్ కూడా ఉంటుంది. అది చెట్టులాగా, ఇవన్నీ దానిమీద వాలిన పక్షుల్లా భలే అందంగా ఉంటాయి. పైగా యూజ్ అండ్ త్రో కాదు కాబట్టి, వాడిన తర్వాత కడిగేసి చక్కగా హోల్డర్‌లో పెట్టేసుకోవచ్చు. ఫైబర్‌తో చేయడం వల్ల ఎటువంటి హాని కూడా ఉండదు. వీటి ధర రూ. 150 వరకూ ఉంది. ఆన్లైన్లో అయితే రూ.120కే వచ్చేస్తున్నాయి! -
ఒలిచి పారేస్తుంది!
న్యూ ప్రొడక్ట్ దానిమ్మపండును ఒలవడానికి చాలామంది బద్ధకిస్తుంటారు. ఎందుకంటే అది ఈజీ కాదు కాబట్టి. పోనీ ముక్కలు కోద్దామా అంటే గింజలు పగిలిపోయి రసం బయటకు వచ్చేస్తుంది. చేయంతా రంగు మారిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే మీ దగ్గర ఇది ఉండాలి. దీన్ని ‘పొమగ్రనేట్ సీడ్ ఎక్స్ట్రాక్టర్’ అంటారు. ఓ మూడొందల రూపాయలు ఖర్చు చేస్తే మన ఇంటికి వచ్చేస్తుంది. దీనిలో మూడు భాగాలు ఉంటాయి... కప్, బ్లేడ్, హోల్డర్ (పైభాగం). కప్‌కి బ్లేడ్‌ని ఫిక్స్ చేయాలి. పైనుండే దళసరి తొక్క తీసేసి, పండును హోల్డర్‌లో పెట్టాలి. తర్వాత దాన్ని బ్లేడ్ మీద పెట్టి గిరగిరా తిప్పితే చాలు... గింజలన్నీ రాలి కింద ఉన్న కప్‌లో పడి పోతాయి. లోపల ఉండే తెల్లని పొరలన్నీ బ్లేడ్పైన ఉండి పోతాయి. క్షణాల్లో పనైపోతుంది! -
హోల్డర్‌కు విండీస్ వన్డే జట్టు పగ్గాలు
జమైకా: వెస్టిండీస్ వన్డే క్రికెట్ జట్టుకు మరో కొత్త కెప్టెన్ వచ్చాడు. గతేడాది డారెన్ స్యామీ స్థానంలో కెప్టెన్‌గా నియమితుడైన డారెన్ బ్రేవోను తప్పిస్తూ అతని స్థానంలో 23 ఏళ్ల యువ పేస్ బౌలర్ జాసన్ హోల్డర్‌కు జట్టు పగ్గాలు అప్పగించారు. వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు వన్డేల సిరీస్‌కు హోల్డర్ సారథ్యంలో వెస్టిండీస్ ఆడుతుందని విండీస్ క్రికెట్ బోర్డు సెలెక్షన్ కమిటీ చైర్మన్ క్లయివ్ లాయిడ్ తెలిపారు. దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌లో పాల్గొనే విండీస్ జట్టులో డారెన్ బ్రేవోతోపాటు స్యామీ, పొలార్డ్‌లకు స్థానం దక్కలేదు. గతేడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాపై వన్డేల్లో అరంగేట్రం చేసిన హోల్డర్ 21 మ్యాచ్‌లు ఆడి 29 వికెట్లు తీశాడు. విండీస్ క్రికెట్ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే హోల్డర్‌ను కెప్టెన్‌గా నియమించామని లాయిడ్ వివరించారు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్‌లో వెస్టిండీస్ ఎనిమిదో స్థానంలో ఉంది.