ఖాతాదారులకు మెరుగైన సేవలు | best helpsto passbook holders | Sakshi
Sakshi News home page

ఖాతాదారులకు మెరుగైన సేవలు

Published Wed, Aug 10 2016 10:58 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM

best helpsto passbook holders

  • ఆంధ్రాబ్యాంకు డీజీఎం శేషగిరిరావు
  • కరీంనగర్‌:  ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తూ్త ప్రభుత్వ పథకాల అమలులో ముందంజలో ఉన్నామని ఆంధ్రాబ్యాంకు కరీంనగర్‌ జోన్‌ డీజీఎం వీఎస్‌.శేషగిరిరావు తెలిపారు. మంగళవారం జోనల్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరీంనగర్, ఆదిలాబాద్‌ జోన్‌లో ఆంధ్రాబ్యాంకు 98 శాఖలు, 102 ఏటీఎంలు, 64 నగదు జమ యంత్రాలతో ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. గంభీరావుపేట త్వరలో 99వ శాఖను ప్రారంభిస్తామన్నారు. 2015–16ఆర్థిక సంవత్సరంలో కరీంనగర్‌ జోన్‌ రూ. 7725 కోట్లు వ్యాపారం చేసిందని డిపాజిట్లు రూ. 4539 కోట్లు, రుణాలు రూ.3185 కోట్ల లావాదేవీలు జరిగాయన్నారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.9వేల కోట్ల లక్ష్యంగా నిర్ణయించగా జూన్‌ మాసానికి రూ. 7750 కోట్ల వ్యాపారం జరిగినట్లు ఆయన వెల్లడించారు. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాల అమలులో బ్యాంక్‌ మొదటిస్థానంలో ఉందని తెలిపారు. ఖ>తాదారులు తమ ఆధార్, మొబైల్‌ నెంబర్‌ను అనుసంధానం చేసుకోవాలని సూచించారు. బంగారంపై ప్రతి గ్రాముకు రూ. 2 వేల రుణం, స్థిరాస్తులపై ఆకర్షణీయ వడ్డీరేట్లతో ప్రాపర్టీ ఓవర్‌ డ్రాఫ్ట్, ప్రాపర్టీ టర్మ్‌ లోన్‌ ఇస్తున్నామని తెలిపారు. ఏజీఏం రాజేంద్రప్రసాద్, ముఖ్య అధికారి సాయిసుధాకర్, సత్యజిత్‌ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement