ఒలిచి పారేస్తుంది!
న్యూ ప్రొడక్ట్
దానిమ్మపండును ఒలవడానికి చాలామంది బద్ధకిస్తుంటారు. ఎందుకంటే అది ఈజీ కాదు కాబట్టి. పోనీ ముక్కలు కోద్దామా అంటే గింజలు పగిలిపోయి రసం బయటకు వచ్చేస్తుంది. చేయంతా రంగు మారిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే మీ దగ్గర ఇది ఉండాలి. దీన్ని ‘పొమగ్రనేట్ సీడ్ ఎక్స్‌ట్రాక్టర్’ అంటారు. ఓ మూడొందల రూపాయలు ఖర్చు చేస్తే మన ఇంటికి వచ్చేస్తుంది.
దీనిలో మూడు భాగాలు ఉంటాయి... కప్, బ్లేడ్, హోల్డర్ (పైభాగం). కప్‌కి బ్లేడ్‌ని ఫిక్స్ చేయాలి. పైనుండే దళసరి తొక్క తీసేసి, పండును హోల్డర్‌లో పెట్టాలి. తర్వాత దాన్ని బ్లేడ్ మీద పెట్టి గిరగిరా తిప్పితే చాలు... గింజలన్నీ రాలి కింద ఉన్న కప్‌లో పడి పోతాయి. లోపల ఉండే తెల్లని పొరలన్నీ బ్లేడ్‌పైన ఉండి పోతాయి. క్షణాల్లో పనైపోతుంది!