ఈ పక్షులు తినిపిస్తాయి!
ఫ్రూట్ సలాడ్ (పండ్ల ముక్కలు) తినడానికి కచ్చితంగా ఫ్రూట్ ఫోర్క్స్ వాడటం మనకి అలవాటే. ప్లాస్టిక్, ఉడ్, మెటల్... ఇలా రకరకాల ఫోర్క్స్ దొరుకుతున్నాయి మార్కెట్లో. అయితే అవన్నీ దాదాపు ఒకేలా ఉంటాయి. అన్నింట్లో వెరైటీ ఉన్నప్పుడు వీటిలో మాత్రం ఎందుకు ఉండకూడదు అనుకున్నారో ఏమో... ఓ కంపెనీవాళ్లు ఇలాంటి కొత్తరకం ఫ్రూట్ ఫోర్క్స్ తయారు చేశారు. వీటికి ‘బర్డీ ఫ్రూట్ ఫోర్క్స్’ అని పేరు పెట్టారు. ఇవి ఓవైపు ఫోర్క్స్‌లా ఉపయోగపడుతూనే... మరోవైపు ఇంట్లో షోకేస్‌లో బొమ్మల్లాగా ఉండి ఇంటికి అందాన్ని కూడా తెస్తాయి.
రంగు రంగుల పక్షుల బొమ్మలతో ఉండే ఈ ఫోర్క్స్‌ను అమర్చడానికి ఒక హోల్డర్ కూడా ఉంటుంది. అది చెట్టులాగా, ఇవన్నీ దానిమీద వాలిన పక్షుల్లా భలే అందంగా ఉంటాయి. పైగా యూజ్ అండ్ త్రో కాదు కాబట్టి, వాడిన తర్వాత కడిగేసి చక్కగా హోల్డర్‌లో పెట్టేసుకోవచ్చు. ఫైబర్‌తో చేయడం వల్ల ఎటువంటి హాని కూడా ఉండదు. వీటి ధర రూ. 150 వరకూ ఉంది. ఆన్‌లైన్లో అయితే రూ.120కే వచ్చేస్తున్నాయి!