EC
-
ఫీజు పోరుకు అనుమతి కోరుతూ ఈసీకి YSRCP లేఖ
-
సచివాలయాల్లో ఆగిన ‘ఈసీ’ సేవలు
సాక్షి, అమరావతి: ఇళ్లు, భూములు వంటి పలు రకాల స్థిరాస్తులను ఒకరి నుంచి మరొకరు కొనుగోలు సమయంలోనూ, రైతులు తమ వ్యవసాయ భూముల ఆధారంగా బ్యాంక్‌ల నుంచి తక్కువ వడ్డీకి పంట రుణాలు పొందడంలో అత్యంత కీలక డ్యాకుమెంట్‌గా ఉండే ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ)ల జారీ నాలుగైదు నెలలుగా గ్రామ వార్డు సచివాలయాల్లో ఆగిపోయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వీటి జారీ గ్రామ/వార్డు సచివాలయాల్లోనూ అందుబాటులో ఉంది. ఇప్పుడు కేవలం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా మాత్రమే ఈ సేవలు పొందాలి్సన పరిస్థితి. రెవెన్యూ శాఖలో ఉండే ఆన్లైన్ వెబ్సైట్లో సాంకేతిక అవాంతరాలు ఏర్పడి 2024 మార్చిలో గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ఈసీ జారీకి చిక్కులు ఏర్పడ్డాయి. మే నెలాఖరుకు ఆ వెబ్సైట్లో సాంకేతిక అవాంతరాలు పరిష్కరించబడినా ఇప్పటికీ ఆ సేవలను సచివాలయాల ద్వారా అందజేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు.సచివాలయాల టాప్ సేవల్లో ఒకటి..గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా గత ఐదేళ్లూ ప్రజలకు అందిన 540 పైబడిన సేవల్లో అత్యధికంగా అందిన ప్రజలు వినియోగించుకున్న సేవలు ఈసీ సర్టిఫికెట్ల జారీ ఒకటని అధికార వర్గాలు తెలిపాయి. సచివాలయాల శాఖ గణాంకాల ప్రకారం..2022 జనవరి నుంచి 2024 ఫిబ్రవరి మధ్య 3,73,907 మంది గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ఈసీ జారీ సేవలను వినియోగించుకున్నారు. కొన్ని సందర్భాల్లో మొత్తం సచివాలయాల సేవల్లో టాప్–15 జాబితాలోనూ ఈసీల జారీ సేవ ఉండేదని అధికారులు చెప్పారు. -
‘మహా’ ఎన్నికలు.. పెయిడ్ న్యూస్‌పై డేగ కన్ను
సోలాపూర్:ప్రింట్,ఎల్రక్టానిక్ మీడియాల్లో ప్రసారమయ్యే పెయిడ్‌న్యూస్‌తో పాటు సోషల్ మీడియా వినియోగంపై సునిశిత నిఘా ఉంచాలని జిల్లా స్థాయి మీడియా సర్టిఫికేషన్, నియంత్రణ కమిటీ (ఎంసీఎంసీ) కమిటీ పౌర సమాచార అధికారులను ఆదేశించింది. ఈ మేరకు సోలాపూర్ సిటీ నార్త్ ,సోలాపూర్ సిటీ సెంట్రల్,అక్కల్కోట్, దక్షిణ సోలాపూర్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకుడు మీనా తేజరాం, కమిటీ కార్యదర్శి జిల్లా సమాచార అధికారి సునీల్ సోను టక్కే, ప్రాంతీయ ప్రచార అధికారి అంకుష్ చవాన్ , డాక్టర్ శ్రీరామ్ రౌత్, గణేష్ బి రాజధార్, అంబదాస్ యాదవ్, సమీర్ మూలాని, రఫీక్ షేక్‌తో కూడిన కమిటీ సమావేశమై చర్చించింది. ఈ సందర్భంగా మీనా తేజారాం మాట్లాడుతూ ‘ఎన్నికల సమయంలో మీడియా సర్టిఫికేషన్,నియంత్రణ కమిటీ పాత్ర చాలా ముఖ్యమైనది.ఈ కమిటీ ప్రింట్,ఎల్రక్టానిక్,సోషల్ మీడియా ప్రచారాలపై దృష్టిసారించాలి. ఎన్నిక ల సంఘం ఇచ్చిన సూచనల మేరకు కమిటీ కచ్చితంగా పనిచేయాలి.పెయిడ్ న్యూస్‌పై నిఘా ఉంచాలి.అభ్యర్థుల ఎన్నికల ఖర్చులు , రోజువారీ చెల్లింపు వార్తల నివేదికను కమిటీకి ప్రతి రోజూ తప్పనిసరిగా సమర్పించాలి’అని సూచించారు.ఇదీ చదవండి: మహారాష్ట్ర ఎన్నికలు బరిలో 7995 మంది -
EVM బ్యాటరీ వెరిఫికేషన్ కు అంగీకరించని అధికారులు
-
అసాధారణ పోలింగ్ శాతం.. ఈసీ క్లారిటీ ఇవ్వాల్సిందే
-
నేటి నుంచి ఈవీఎంల పరిశీలన
ఒంగోలు అర్బన్: ఈవీఎంల్లో అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు అందిన క్రమంలో 12 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలు పరిశీలించాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల్లో అవకతవకలపై ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం నుంచి ఆరురోజుల పాటు రోజుకు రెండు పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలను పరిశీలించనున్నారు. డమ్మీ బ్యాలెట్‌ను ఏర్పాటు చేసి ఫిర్యాదుదారుల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఒంగోలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఈవీఎంలకు సంబంధించిన బెల్ కంపెనీ ఇంజనీర్ల సమక్షంలో ఈవీఎంల పరిశీలన జరగనుంది. ఈ ప్రక్రియను సీసీ కెమెరా నిఘాలో నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఒంగోలు నియోజకవర్గంలోని 6, 26, 42, 59, 75, 76, 123, 184, 192, 199, 245, 256 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను పరిశీలించనున్నారు. -
ఈవీఎంలపై ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ బాలినేని న్యాయ పోరాటం
-
ఇప్పుడు EC అధికారుల తీరు మరింత అనుమానాస్పదం
-
సీఐ నారాయణస్వామిపై ఈసీ చర్యలు
-
సీఐ నారాయణస్వామిపై ఈసీ చర్యలు
గుంటూరు/పల్నాడు, సాక్షి: ఎమ్మెల్యే పిన్నెల్లి పిటిషన్ ఎఫెక్ట్.. ఆపై హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు కదిలింది. కారంపూడి సీఐ నారాయణస్వామిని విధుల నుంచి తప్పించింది.తప్పుడు కేసులతో వేధిస్తున్నారంటూ నారాయణ స్వామితో పాటు ఇద్దరు పోలీస్ అధికారులపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన విచారణలో భాగంగా చర్యలు చేపట్టాలని సీఈవోకు ఏపీ హైకోర్టు ఆదేశించింది.దీంతో కోర్టు ఆదేశాల మేరకు ఈసీ సీఐ నారాయణ స్వామిని తప్పించింది. అంతేకాదు.. నారాయణ స్వామిపై సిట్ విచారణకు ఆదేశించారు ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఎంకే మీనా. ఆధారాలు సమర్పిస్తే ఇతర అధికారులపైనా విచారణ చేపడతామని ఆయన అంటున్నారు. -
పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై ఈసీ కొత్త నిబంధనలు ఎందుకు ?
-
పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పై అనుమానాలు
-
CEO జారీ చేసిన మెమోను ఉపసంహరించుకున్నట్లు హైకోర్టుకు తెలిపిన CEC
-
పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్..ఈసీ డబుల్ గేమ్
-
సీఈఓ మెమోపై భారీ ట్విస్ట్
-
ఎన్నికల కమిషన్ పై న్యాయ పోరాటం
-
Big Question: అడ్డదారిలో గెలవటానికి బాబు కుట్ర..అడ్డంగా దొరికిన ఈసీ
-
ఈసీకి చంద్రబాబు వైరస్
-
ఆ నిబంధనలను ఈసీ ఉపసంహరించుకోవాలి: వైఎస్సార్సీపీ
సాక్షి, గుంటూరు: అడిషనల్ సీఈవోను వైఎస్సార్సీపీ నేతలు పేర్ని నాని, మేరుగు నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి కలిశారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సడలింపు నిబంధనలపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది.అనంతరం మీడియాతో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ‘‘అన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై గతంలో నిబంధనలు పంపారు. పోస్టల్ బ్యాలెట్ కవర్లు, 13ఏ, 13 బీ నిబంధనలు చెప్పారు. గెజిటెడ్ అధికారం సంతకం పెట్టి స్టాంప్ వేయాలని గతంలో చెప్పారు. స్టాంప్ లేకపోయినా చేతితో రాసినా ఆమోదించాలని గతంలో చెప్పారు. ఇప్పుడు కొత్తగా స్టాంప్ వేయకపోయినా సరే ఆమోదించాలని అంటున్నారు’’ అని పేర్ని నాని నాని అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేనిది ఇక్కడే ఎందుకు తీసుకొచ్చారని ఆయన ప్రశ్నించారు.‘‘ఈసీ ఇచ్చిన ఆదేశాలు గొడవలకు దారి తీసే అవకాశం ఉంది. ఈసీ నిబంధనలు వలన ఓటు రహస్యత ఉండదు. ఏజెంట్లు అభ్యంతరం తెలిపితే ఘర్షణలకు దారి తీస్తుంది. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పని నిబంధనలను ఎలా అమాలు చేస్తారు అని అడిగాం. ఈ నిబంధనల పై పునరాలోచించాలి అని కోరాం’’ అని పేర్ని నాని వివరించారు.మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ, ‘‘చంద్రబాబు ఎన్నికల్లో అలజడులు సృష్టించారు. పేదల పైన టీడీపీ నేతలు దాడులు చేస్తే ఎన్నికల కమిషన్, టీడీపీ నేతలు చర్యలు తీసుకోలేదు. ఆఖరికి ఈసీఐ నిబంధనలని కూడా ఏపీలో మార్చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలో ఈసీఐకి విరుద్ధంగా సీఈఓ ఆదేశాలు ఇవ్వడం ఏంటి..? వెంటనే ఆ నిబంధనలను ఉపసంహరించుకోవాలి. స్పెసిమెన్ సంతకం ద్వారా ఆమోదించడం సమంజసం కాదు. పోలింగ్ రోజున అక్రమాలకు టీడీపీ పాల్పడింది. ఇప్పుడు లెక్కింపు సక్రమంగా జరగకూడదు అన్నది టీడీపీ కుట్ర’’ అంటూ మండిపడ్డారు. -
బెంగాల్ గవర్నర్‌పై ఈసీకి టీఎంసీ ఫిర్యాదు
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల వేళ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) రాష్ట్ర గవర్నర్ సీఏ ఆనంద బోస్పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో గవర్నర్ బీజేపీకి కోసం ప్రచారం చేస్తున్నారని టీఎంసీ ఆరోపణలు చేసింది. ఆయన కోల్‌కతాలోని ఓ రామాలయంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సమయంలో గవర్నర్ తన ఛాతికి ‘బీజేపీ లోగో’ ధరించారని టీఎంసీ పేర్కొంది. ఇలా గవర్నర్ బీజేపీ లోగో ధరించటం వల్ల ఓటర్లు ప్రభావితం అవుతారని తెలిపింది.లోక్‌సభ ఎన్నికల కోసం గవర్నర్ బీజేపీ ప్రచారం చేస్తున్నారని టీఎంసీ ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. రాష్ట్రపతి నియమించిన గవర్నర్‌కు రాజకీయ సిద్ధాంతాలు, ఆలోచనలు ఉండకూడదని టీఎంసీ ఈసీ దృష్టికి తీసుకువెళ్లింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవటం మానేయాలని గవర్నర్‌కు ఆదేశించాలని పోల్ ప్యానెల్‌కు విజ్ఞప్తి చేసింది. తమ ఫిర్యాదును పరిగణలోకి తీసుకొని గవర్నర్పరై తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. -
ఈసీకి సజ్జల 10 ప్రశ్నలు
-
అసలు వీడియో ఈసీ ఎందుకు దాస్తుంది?
-
టీడీపీపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: టీడీపీపై ఈసీకి వైఎస్సార్సీపీ బృందం ఫిర్యాదు చేసింది. నాలుగు అంశాలపై వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు తమకు ఓటు వేయలేదనే ఉక్రోషంతో.. టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా హింసను ప్రోత్సహిస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. తెలుగుదేశం అభ్యర్థులే రోడ్లపైకి వచ్చి దాడులకు తెగబడుతూ.. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు.‘‘కౌంటింగ్ సమయంలోనూ టీడీపీ అల్లర్లను సృష్టించే అవకాశం ఉంది. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరాము. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సమయంలో పాటించవలసిన రూల్స్‌ను 175 నియోజకవర్గాలలోనూ తూచా తప్పకుంగా పాటించేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరాం’’ మల్లాది విష్ణు అన్నారు.‘‘టీడీపీ అధికారంలో ఉండగా చింతమనేని ప్రభాకర్ చేసిన దారుణాలు అన్నీఇన్నీ కావు. చింతమనేని ప్రభుత్వ అధికారులపైనే దాడులకు తెగబడిన సందర్భాలు చూశాం. తాజాగా పోలింగ్ రోజు దెందులూరులో జరిగిన ఓ దాడి ఘటనలో టీడీపీకి చెందిన రాజశేఖర్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చింతమనేని ప్రభాకర్ స్టేషన్ పైనే దాడి చేసి పోలీసులపైన దౌర్జన్యం చేశారు. తక్షణమే చింతమనేనిని అరెస్ట్ చేసి.. ఆయనపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేయాలి’’ మల్లాది విష్ణు డిమాండ్ చేశారు.‘‘టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పోటీ చేస్తున్న టెక్కలి నియోజకవర్గంలో ఆపార్టీ అరాచకాలకు ఓ నిండు ప్రాణం బలైంది. నిమ్మాడ గ్రామంలో టీడీపీ అరాచకాలను అడ్డుకున్న వైఎస్సార్సీపీ బూత్ ఏజంట్ తోట మల్లేష్ ఇంటిపై దాడికి తెగబడి.. అతని చావుకు కారణమయ్యారు. ఘటనకు సంబంధించిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అచ్చెన్నాయుడిపైనా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాం. గురజాల, మాచర్ల, నరసరావుపేట, సత్తెనపల్లి, తాడిపత్రి సహా రాష్ట్రంలో జరిగిన అరాచకాలన్నింటికీ మూలకారణం టీడీపీ పార్టీనే. కానీ సిట్‌ను తప్పుదోవ పట్టించేలా స్థానిక వైఎస్సార్సీపీ అభ్యర్థులపై ఫిర్యాదులు చేస్తూ గందరగోళపరుస్తున్నారు’’ అని మల్లాది విష్ణు మండిపడ్డారు. -
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని.. టీడీపీ దాడులు చేస్తున్నా.. పోలీసులు పట్టించుకోలేదని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అసాంఘిక శక్తులు రాజకీయ కక్షతో దాడులు, హింసాకాండ కొనసాగిస్తున్నాయని మండిపడ్డారు.రాజకీయ కక్షతో బడుగు బలహీన వర్గాలపై దాడులకు చేశారు.ఈసీ ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. పోలింగ్ సమయంలో టీడీపీ గూండాలు ఎక్కడికక్కడ తెగబడ్డారు.పోలింగ్ సజావుగా జరగకూడదని టీడీపీ దాడులు చేసింది. టీడీపీ దాడులపై డీజీపీకి, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశాం’’ అని సజ్జల చెప్పారు.‘‘రిగ్గింగ్ చేయాలనే ఆలోచనతో దాడులకు తెగబడ్డారు. కూటమి నేతలు చెప్పినచోటే పోలీసు అధికారులను మార్చారు. ఈసీ నియమించిన పోలీస్ అధికారులకు రాష్ట్రంపై అవగాహన లేదు. టీడీపీ నేతలు ఇచ్చి పార్టీకి పోలీస్ అబ్జర్వర్ హాజరయ్యారు. పోలింగ్‌కు ముందే పోలీస్ ఉన్నతాధికారులను మార్చేశారు. ఎక్కడైతే పోలీస్ అధికారులను మార్చారో అక్కడే హింస జరిగింది. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?’’ అంటూ సజ్జల ప్రశ్నించారు.పోలింగ్ రోజు వైఎస్సార్సీపీ అభ్యర్థులను హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ అభ్యర్థులు మాత్రం యథేచ్చగా తిరిగారు. గురజాలలో ఓ గుడిలో తలదాచుకున్న దళితులపై దాడులు చేశారు. ఈసీ వైఫల్యం కారణంగానే పల్నాడులో గొడవలు జరిగాయి. వీటన్నిటికి ఎన్నికల కమిషనే బాధ్యత తీసుకోవాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.‘‘ఎన్నికల సంఘం విధుల్లో కూడా టీడీపీ దూరింది. పురందేశ్వరి ఎవరిపై ఫిర్యాదు చేశారో వారిని బదిలీ చేశారు. వారు కోరిన అధికారులను వేశారు. మొత్తం 29 మంది అధికారులను ఉన్నట్టుండి ట్రాన్సఫర్ చేశారు. విష్ణువర్ధనరావు అనే రిటైర్డ్ ఆఫీసర్ ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రా వెళ్లారు. విష్ణువర్ధన్ రావు టీడీపీ నేత సుజనాచౌదరికి దగ్గరి మనిషి. అలాంటి వ్యక్తి ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ వెళ్లితే ఇక ఎన్నికలు ప్రశాంతంగా ఎలా జరుగుతాయి?. టీడీపీ ఆఫీసులో రూపు దిద్దుకున్న ప్లాన్ ని దీపక్ మిశ్రా ద్వారా ఈసీ అమలు చేసింది. రెడ్డి, ఎస్సీ, ఎస్టీ అధికారులు అందరినీ వరుసపెట్టి ట్రాన్సఫర్ చేశారు. ఎవరిపై ఫిర్యాదు వచ్చినా విచారణ చేయకుండానే వెంటనే ట్రాన్సఫర్ చేశారు. ప్రకాశం, పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలలో అధికారులను మార్చారు. అక్కడే ఎక్కువ హింస చెలరేగింది’’ అని సజ్జల ధ్వజమెత్తారు.జరుగుతున్న దాడులన్నీ ఒన్ సైడే జరుగుతన్నాయి. మంత్రి అంబటి రాంబాబును అన్యాయంగా హౌస్ అరెస్టు చేశారు. ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి కుటుంబంపై దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. వెంటనే పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాని వెంటనే వెనక్కు పిలవాలి. ఎన్నికల కమిషన్ త్వరగా స్పందించి శాంతిభద్రతలను పరిరక్షించాలి. సంక్షేమ పథకాల నిధులను కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు చేసేందుకు కూడా టీడీపీ కుట్రలు పన్నుతోంది. కచ్చితంగా రెండోసారి జగన్ పాలన రాబోతోంది’’ అని సజ్జల చెప్పారు.‘‘సీఎస్, డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం పిలిపించటం అసాధారణం. పోలింగ్ తర్వాత కూడా పరిపాలన జరగకుండా చేయటం ఏంటి?. వీటన్నిటిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. పురందేశ్వరి ఇచ్చిన లేఖల ప్రకారం ఈసీ పనిచేయటంపై సీఈసీకి ఫిర్యాదు చేస్తాం. పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాని నియమించటం వెనుక కుట్ర ఉంది. లేకపోతే రిటైర్డ్ ఆఫీసర్ ని పోలీసు అబ్జర్వర్‌గా నియమించటం ఏంటి?. ఉద్యోగంలో ఉన్న ఆఫీసర్ని నియమిస్తే బాధ్యతతో వ్యవహరిస్తారు. రిటైర్డ్ అధికారిని నియమిస్తే బాధ్యత ఏం ఉంటుంది?’’ అంటూ సజ్జల ప్రశ్నించారు. -
ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు
-
ఏపీ సీఎస్, డీజీపీని ఢిల్లీకి పిలిచిన ఈసీఐ
-
తెనాలి ఎమ్మెల్యేపై యువకుడి దాష్టీకం
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలి వైఎస్సార్సీపీ అభ్యర్థిపై సామాజికవర్గం ముసుగులో కూటమికి చెందిన ఓ యువకుడు ఆయన భార్య సమక్షంలోనే అవమానించి... రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించారు. ఆగ్రహించిన ఆయన చేయి చేసుకోవడంతో సోషల్ మీడియాలో దు్రష్పచారానికి తెగబడ్డారు. అంతేగాకుండా ఈసీకి ఫిర్యాదు చేసి ఆయన్ను తిర గనీయకుండా గృహనిర్బంధం చేశారు. అయితానగర్‌లో సోమవారం ఉదయం ఓటు వేసేందుకు భార్యతో సహా వచ్చిన ఎమ్మెల్యే శివకుమార్‌ను అప్పటికే క్యూలో ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి గొట్టిముక్కల సుధాకర్ అడ్డుకున్నాడు.క్యూలో వెళ్లకుండా నేరుగా లోపలకు వెళ్లడమేంటన్న మిషతో దుర్భాషలాడాడు. అయినా మౌనంగా లోపలకు వెళ్లి ఓటేసి వస్తుంటే, మళ్లీ అదే వ్యక్తి అడ్డుకున్నాడు. కులాల పేర్లు ప్రస్తావిస్తూ ‘ఆ పార్టీలో ఉండటమేమిటి’ ను వ్వు కమ్మోడివి కావా?’ అని రెచ్చగొట్టాడు. ఇంకా కవి్వంపు చర్యలకు పాల్పడటమే గాకుండా భార్య ముందే అసభ్యంగా మాట్లాడటంతో తట్టుకోలేకపోయిన శివకుమార్ అతడి చెంపపై కొట్టాడు.సుధాకర్ కూడా తిరిగి చేయి చేసుకోవడంతో ఎమ్మెల్యే పక్కనే ఉన్న కార్యకర్తలు అతడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటనను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీనిని ఆసరాగా చేసుకుని టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదుచేసి, పోలింగ్ సరళిని పర్యవేక్షించే అవకాశం లేకుండా గృహనిర్బంధం విధించేలా చేశారు. ఈ ఘటనపై పోలీస్ కేసు నమోదు చేశారు. మనోహర్‌తో కలిసి చేసిన కుట్ర తనను రెచ్చగొట్టి ఏదోలా గొడవ సృష్టించి పోలింగ్ రోజున డ్యామేజ్ చేయాలని జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్, గొట్టిముక్కల సుధాకర్ కుట్ర పన్నారని ఎమ్మెల్యే శివకుమార్ ఆరోపించారు. -
ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు
హైదరాబాద్, సాక్షి: బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదైంది. పోలింగ్ సందర్భంగా ప్రిసైడింగ్ అధికారితో దురుసుగా ప్రవర్తించారనే అభియోగాలు నమోదు అయ్యాయి. దీంతో.. మంగళ్ హట్ పోలీస్ స్టేషన్లో రాజాసింగ్‌పై కేసు నమోదు చేశారు. -
ఖర్గే హెలికాప్టర్లో తనిఖీలు.. ‘బీజేపీ నేతలను తనిఖీ చేస్తున్నారా?’
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో ప్రతిపక్షాలను ఎన్నికల అధికారులు టార్గట్ చేసి మరీ తనిఖీలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హెలికాప్టర్‌ను బిహార్‌లోని సమస్తిపూర్‌లో పోలింగ్ అధికారులు తనిఖీ చేశారు. అయితే ఎన్డీయే కూటమి నేతలను మాత్రం ఎటువంటి తనిఖీలు చేయకుండా విదిలేస్తున్నారని కాంగ్రెస్ ఎన్నికల అధికారులపై విమర్శలు చేసింది. శనివారం మల్లికార్జున ఖర్గే.. సమస్తీపూర్, ముజఫర్పర్లో ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు.‘‘ఇప్పటికే కేరళలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హెలికాప్టర్‌ను ఎన్నికల అధికారలు తనిఖీ చేశారు. శనివారం మల్లికార్జన ఖర్గేను బిహార్‌లోని సమస్తీపూర్‌లో అధికారుల చేత తనిఖీ చేయబడ్డారు’’ అని ‘ఎక్స్’ వేదికగా కాంగ్రెస్ పార్టీ నేత రాజేష్ రాథోడ్ అన్నారు. బిహార్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఖర్గే హెలికాప్టర్ చెక్ చేశారని రాజేష్ రాథోడ్ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. వీడియోలో.. హెలికాప్టర్ చుట్టూ అధికారులు, పోలిసులు ఉండటం గమనించవచ్చు.श्री @RahulGandhi जी के बाद अब @INCIndia अध्यक्ष श्री @kharge जी का हेलीकॉप्टर की तलाशी बिहार के समस्तीपुर में सभा के दौरान चुनाव आयोग और पुलिसकर्मियों द्वारा करना चुनाव आयोग का दुर्भावना पूर्ण व्यवहार प्रतिपक्षों के लिए दर्शाता है यह लोकतंत्र की हत्या है l pic.twitter.com/tk1SUqcj5P— Rajesh Rathorre (@RajeshRathorre1) May 11, 2024 ‘‘కేవలం కాంగ్రెస్ నేతల హెలికాప్టర్లకు మాత్రమే తనిఖీలు చేస్తున్నారా? లేదా బీజేపీకి చెందిన అగ్రనాయకుల హెలికాప్టర్లును కూడా చెక్ చేస్తున్నారా? అనే విషయంపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇవ్వాలి. ఈ తనిఖీలు సమాచారాన్ని ఈసీ బహిరంగంగా ప్రజలకు అందుబాటులో ఉంచాలి. లేదంటే ప్రతిపక్షాలను అడ్డుకొని, ఎన్డీయే నేతలను ఫ్రీగా వదిలేసినట్లు అర్థమవుతుంది’’ అని రమేష్ రాథోడ్ అన్నారు. ఎన్నికల సమయంలో ఎన్నికల అధికారులు నేతల హెలికాప్టర్లను చెక్ చేసిన అన్ని వీడియోను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. -
AP: డీబీటీలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్
సాక్షి, విజయవాడ: రైతుల ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెన నిధులను విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ రైతులు, విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. డీబీటీలపై వాదనలు ముగియగా, తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది.కాగా, నిధుల విడుదలకు నిరాకరించిన ఈసీ.. పోలింగ్ తర్వాత నిధుల విడుదలకు అనుమతిస్తామని పేర్కొంది. కోడ్ వచ్చాక కొనసాగుతున్న పథకాలైనా, కొత్త పథకాలైన ఒక్కటే.. కోడ్ వచ్చాక నిధులు విడుదల చేస్తే ఓటర్లపై ప్రభావం ఉంటుందని ఈసీ తెలిపింది.అయితే, ఇప్పటివరకు వేర్వేరు రాష్ట్రాల్లో అనుసరించిన విధానాన్ని కొనసాగించాలని పిటిషనర్లు కోరారు. నోటిఫికేషన్ కంటే ముందు అమల్లో ఉన్న అన్ని పథకాలు అన్ని రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయన్న పిటిషనర్లు.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోకుండా ఈసీకి ఆదేశాలివ్వాలని పిటిషనర్లు కోరారు. -
ఈసీ మా ఫిర్యాదుల్ని పట్టించుకోవట్లేదు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కమిషన్ బీజేపీ కనుసన్నల్లో నడుస్తోందని.. తాము ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాముడి ఫొటోతో ఓట్లడిగిన వారిపై చర్యలేవీ? కేసీఆర్‌పై మాత్రం ఆగమేఘాల మీద చర్యలు తీసుకుంటారంటూ మండిపడ్డారు‘‘మతపరమైన రిజర్వేషన్లపై డైరెక్ట్‌గా ప్రచారం చేస్తున్న బీజేపీపై ఎందుకు మాట్లాడటం లేదు. మోదీ మాట్లాడిన మాటలకు నడ్డా సమాధానం ఇవ్వాలని తల తోక లేకుండా మాట్లాడింది ఎన్నికల సంఘం. అమిత్ షా రాముడు పటం పట్టుకొని ప్రచారం చేస్తున్న ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?. అధికారం కోసం ఎన్నికలలో రాముడ్ని అడ్డం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు. మోదీ, అమిత్ షా వాళ్ల బీజేపీ నేతలు ఇలా చేస్తుంటే ఇప్పటికీ చర్యలు తీసుకోరు. కానీ కేసీఆర్ ఒక్క మాట అన్నందుకు ఆగమేఘాల మీద నోటీసులు ఇచ్చారు.రైతుల సమస్యలు చెప్తూ మాట్లాడారు. చేనేత కార్మికుల గురించి కేసీఆర్వా రి బాధలు చెప్తూ భావోద్వేగంతో ఒక్క మాట అన్నారు. ఇలా చిన్న మాట అన్నందుకు 48 గంటలు నిషేధం విధించింది. కానీ రేవంత్ రెడ్డి కేసీఆర్‌పైనా ఇష్టానుసారంగా మాట్లాడారు. ఇలా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి పై 8 సార్లు ఫిర్యాదు చేశాం. కానీ చర్యలు లేవు. కేసీఆర్ తల నరకండి అంటే ఎందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవటం లేదు. 27 సార్లు పలువురు బీజేపీ, కాంగ్రెస్ నాయకులపై ఫిర్యాదు చేస్తే ఎన్నికల సంఘం పట్టించుకోలేదు’’ అంటూ కేటీఆర్ మండిపడ్డారు. -
జనసేన రెబల్స్ కు గాజుగ్లాసు గుర్తు పవన్ కళ్యాణ్ కు భారీ షాక్..!
-
హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీ సాయిచైతన్యపై ఈసీ వేటు
సాక్షి, హైదరాబాద్: నగర పోలీస్ కమిషనరేట్ సౌత్ జోన్ డీసీపీపై ఎలక్షన్ కమిషన్ వేటు వేసింది. ఎన్నికల విధుల నుంచి తొలగిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. సాయి చైతన్యకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగిందంటూ సీపీని ఆదేశించింది. బీజేపీ ఇచ్చిన ఫిర్యాదుతో సాయి చైతన్యపై ఈసీ చర్యలు తీసుకుంది. -
జనసేన నేతలపై చర్యలు తీసుకోవాలి: షేక్ జలీల్
-
తొలిదశకు ముందే రికార్డ్! రోజుకు రూ.100 కోట్లు..
న్యూఢిల్లీ, సాక్షి: ఈసారి సార్వత్రిక ఎన్నికలు తొలిదశకు ముందే రికార్డ్ సృష్టించాయి. 18వ లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు ముందు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు రికార్డు స్థాయిలో రూ. 4,650 కోట్ల విలువైన నగదు, బంగారం, మాదకద్రవ్యాలు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నాయని భారత ఎన్నికల సంఘం సోమవారం తెలిపింది. స్వాధీనం చేసుకున్న మొత్తంలో 45 శాతం విలువ మాదక ద్రవ్యాలదే కావడం గమనార్హం. ఈసారి స్వాధీనం చేసుకున్న మొత్తం 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో స్వాధీనం చేసుకున్న రూ.3,475 కోట్ల కంటే ఎక్కువ. ఈ ఏడాది మార్చి 1 నుంచి సగటున ప్రతిరోజూ రూ.100 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులు సీజ్ చేసినట్లు ఈసీ పేర్కొంది. సమగ్ర ప్రణాళిక, సహకారం, ఏజెన్సీల నుంచి ఏకీకృత నిరోధక చర్యలు, చురుకైన ప్రజల భాగస్వామ్యంతోపాటు ఆధునిక టెక్నాలజీని సమర్థంగా వినియోగించడంతోనే రికార్డ్ స్థాయిలో నగదు, ఇతర వస్తువులు పట్టుకోవడం సాధ్యమైందని ఎలక్షన్ కమిషన్ వివరించింది. -
ఇద్దరు ఓటర్లు.. 107 కిలోమీటర్లు.. ఎన్నికల అధికారుల సాహసం!
ముంబై, సాక్షి: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో లోక్‌సభ ఎన్నికల కోసం ఇద్దరు వృద్ధులతో ఓటేయించడానికి ఎన్నికల అధికారులు సాహసం చేశారు. ప్రమాదకరమైన మలుపులు, అడవుల గుండా 107 కిలోమీటర్లు ప్రయాణించారు. వివరాల్లోకి వెళ్తే.. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా మహారాష్ట్రలోని గడ్చిరోలి-చిమూర్ లోక్‌సభ నియోజకవర్గానికి ఏప్రిల్ 19న మొదటి దశలో పోలింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గంలో 100 ఏళ్లు, 86 సంవత్సరాల వయస్సు గల ఓటర్లు ఇద్దరు ఉన్నారు. ఎన్నికల సంఘం 85 ఏళ్లు పైబడిన వారికి, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని కల్పించింది. దీంతో ఎన్నికల అధికారులు అహేరి నుండి సిరొంచ వరకు 107 కిలోమీటర్లు ప్రయాణించి 100 ఏళ్ల కిష్టయ్య మదర్బోయిన, 86 ఏళ్ల కిష్టయ్య కొమెర ఇళ్లకు చేరుకున్నారు. వీరు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటేసే పరిస్థితిలో లేరు కానీ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తిగా ఉన్నారని ఎన్నికల అధికారి తెలిపారు. గడ్చిరోలి-చిమూర్ నియోజకవర్గంలో 1,037 మంది 85 ఏళ్లు పైబడిన ఓటర్లు, 338 మంది దివ్యాంగుల దరఖాస్తులను ఆమోదించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 1,205 మంది ఓటర్లు ఇంటి వద్ద నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
బీజేపీ నేత రఘునందన్‌రావుపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల నియమావళికి విరుద్ధంగా మోదీ ఫొటోలతో ముద్రించిన శ్రీరాముడి క్యాలెండర్లను ఓటర్లకు పంచుతున్నారంటూ బీజేపీ నేత రఘునందన్‌రావుపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన రఘునందన్‌రావును పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని ఈసీని కాంగ్రెస్ నేతలు కోరారు. కాగా, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై రఘునందన్‌రావు చేసిన వ్యాఖ్యలపై సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌కు గత నెల ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పరుష పదజాలంతో మాట్లాడి.. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని, విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు. -
చంద్రబాబుపై ఈసీకి ఎమ్మెల్యే విష్ణు ఫిర్యాదు
సాక్షి, అమరావతి: ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ సోషల్ మీడియాపై ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్ మీనాను కలిసి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో కూటమి అభ్యర్థులు ఎక్కడా ఎన్నికల నియమావళిని పాటించడం లేదని చెప్పారు. ముఖ్యంగా బహిరంగ సభల్లో చంద్రబాబు ప్రవర్తన జుగుప్సాకరమన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి బచ్చా అనడం, విషం చిమ్ముతున్నారంటూ మాట్లాడటం బాబు అనైతికతకు అద్దం పడుతోందని తెలిపారు. చంద్రబాబు వ్యాఖ్యలు ఓటర్లలో విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని చెప్పారు. వీటన్నింటిని వివరించి, తగిన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్లు తెలిపారు. సీఎం జగన్‌పై తప్పుడు ప్రచారమే చేయడం చంద్రబాబు ఏకైక అజెండా అని, ప్రజలకు మంచి చేసే ఉద్దేశం ఆయనకు లేదని అన్నారు. ఎంతకాలం వైఎస్సార్సీపీపై బురదచల్లుతారని నిప్పులు చెరిగారు. కోర్టు పరిధిలో ఉన్న వివేకానందరెడ్డి కేసు గురించి చంద్రబాబు, లోకేశ్, షరి్మల, సునీత పదేపదే మాట్లాడుతున్నారని, పైగా హంతకుడంటూ వైఎస్ అవినాశ్‌రెడ్డిని ఏ విధంగా విమర్శిస్తారని ప్రశ్నించారు. పింఛన్‌దారుల మృతిపైనా టీడీపీ వెబ్సైట్లలో ఏ విధంగా పోస్టులు పెడుతున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. శవ రాజకీయాలను మానుకోవాలని సూచించారు. రాయలసీమలో పర్యటిస్తున్న సీఎం జగన్ ఓ పేద ముస్లిం సోదరుడి సమస్యను పరిష్కరిస్తే, వాహనం ఆపలేదని టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం దిగజారుడుతనం కాదా అని ప్రశ్నించారు. మైనారీ్టలను కేబినెట్లో పక్కన కూర్చోబెట్టుకోలేని అసమర్థ నేత చంద్రబాబుకు మైనారీ్టల గూరించి మాట్లాడే అర్హత ఉందో లేదో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. టీటీడీపైనా రాజకీయాలు చేయడం బాధాకరమన్నారు. కలియుగ దైవం జోలికి వస్తే ఈసారి టీడీపీ పూర్తిగా భూస్థాపితం కావడం ఖాయమని చెప్పారు. కూటమి నేతలు కులాలు, మతాల ప్రస్తావన మానుకోవాలని సూచించారు. పవన్ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి గుర్తింపు లేని జనసేనకు అధినేత, పోటీ చేసిన రెండు చోట్లా ఘోర పరాజయం పాలైన పవన్.. 151 స్థానాలతో అధికారంలోకి వచి్చన సీఎం జగన్‌ని దుర్భాషలాడతారా అంటూ విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలైన స్కాం స్టార్లు ఎవరో జనసేన నేతలే బయటకు వచ్చి చెబుతున్నారన్నారు. జనసేన అధినేత తన మాటలను ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్లు తెలిపారు. ఓట్లు నివాసాలలో ఉండాలనే నిబంధనకు విరుద్ధంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోండా ఉమా ఓ కార్యాలయంలో ఓట్లు నమోదు చేసి ఉంచడాన్ని కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మలసాని మనోహర్ రెడ్డి, నాగ నారాయణమూర్తి, శ్రీనివాసరెడ్డి, ఒగ్గు గవాస్కర్, కొండపల్లి బుజ్జి పాల్గొన్నారు. -
చంద్రబాబు, టీడీపీ నేతలపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: చంద్రబాబు, టీడీపీ నేతలపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. కోడ్ ఉల్లంఘనపై నవరత్నాల వైస్ చైర్మన్ నారాయణ మూర్తి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. అయ్యన్నపాత్రుడు దిగజారి మాట్లాడుతున్నారు... సీఎస్, డీజీపీపై టీడీపీ నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నామని నారాయణమూర్తి అన్నారు. అయ్యన్నపాత్రుడు దిగజారి మాట్లాడుతున్నారని, ప్రజాస్వామ్యం బద్దంగా ఉన్న వ్యక్తులపై ఈ తరహా వ్యాఖ్యలు సరికాదన్నారు. చీరలు పంచితే తప్పేంటి అనడం ఎంతవరకు కరెక్ట్: మల్లాది విష్ణు ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, టీడీపీ నేతలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించి మాట్లాడుతున్నారు. 175 నియోజకవర్గాల్లో టీడీపీ వ్యవహరిస్తున్న తీరుపై ఎప్పటికప్పుడు ఈసీకి ఫిర్యాదు చేస్తున్నామన్నారు. సుజనా చౌదరి, కేశినేని చిన్ని ఎన్నికల ప్రచారంలో డబ్బులు యథేచ్ఛగా పంచుతున్నారు. ఓటర్లకు డబ్బులు ఇవ్వడం ద్వారా ప్రజాసేవ చేయకుండా గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ, బీజేపీ ప్రజల కోసం పాటుపడిన దాఖలాలు లేవు. ప్రత్యేక హోదాను ప్యాకేజ్‌గా మార్చిన వ్యక్తులు టీడీపీ, బీజేపీ నాయకులేనని మల్లాది విష్ణు దుయ్యబట్టారు. ‘‘అయ్యన్నపాత్రుడు భాష, వ్యవహార శైలి దారుణం. చీరలు పంచితే తప్పేంటి అనడం ఎంతవరకు కరెక్ట్. డీజీపీని దుర్భాషలాడిన ఘటనపై ఈసీకి ఫిర్యాదు చేశాం. పెన్షన్ ఇవ్వకపోతే చస్తారా అంటూ టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు. టీడీపీ అధికారం కోసం చేసే ప్రయత్నాలను ప్రజలు గమనించాలి. చంద్రబాబు రాహుల్‌ని కలిసి, కాంగ్రెస్ తో తిరిగి ఇప్పుడు మమ్మల్ని పిల్ల కాంగ్రెస్ అని విమర్శిస్తున్నారు. ఐదేళ్లు అమరావతి జపం చేసిన మిమ్మల్ని ప్రజలు ఎందుకు ఒడించారో ఆలోచించుకోవాలి. మైనార్టీల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు’’ అని మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. ‘‘వైఎస్సార్ మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చినపుడు కోర్టుకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేసిన వ్యక్తి చంద్రబాబు. మతతత్వ శక్తులతో కలిసి పనిచేసే నువు కూడా మైనార్టీల గురించి మాట్లాడతావా?. రైతులకు ఎవరి హయాంలో ఎంత మంచి జరిగిందో చర్చకు సిద్ధమా?. రుణమాఫీ చేస్తానని మోసం చేసిన చంద్రబాబుకు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదు, టీడీపీ, జనసేనకు చెందిన నాయకులంతా జగన్ వెంట నడుస్తున్నారు. కూటమి కచ్చితంగా ఓటమి పాలు అవుతుంది’’ అని మల్లాది విష్ణు పేర్కొన్నారు. -
అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడికి ఈసీ నోటీసులు
సాక్షి, విజయవాడ: టీడీపీ నేతలు అచ్చెన్నాయడు, అయ్యన్నపాత్రుడికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు తప్పుడు ఆరోపణలు చేశారు. ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా తప్పుడు ఆరోపణలు చేసిన టీడీపీ నేతలపై వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. కోడ్ ఉల్లంఘనపై వివరణ కోరుతూ అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడికి సీఈఓ ముఖేష్‌కుమార్ మీనా నోటీసులు ఇచ్చారు. కాగా, టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మార్చి 31న ఎమ్మిగనూరు సభలో చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. చంద్రబాబు ఎన్నికల కోడ్ నియమావళిని ఉల్లంఘించారని అందిన ఫిర్యాదుతో ఈసీ నోటీసులు ఇచ్చింది. 48 గంటల్లోగా అఫిడవిట్ రూపంలో వివరణ ఇవ్వాలని ఈసీ పేర్కొంది. -
వెన్నులో వణుకు చంద్రబాబుకు అన్నీ రివర్స్
-
బెదిరింపు ధోరణిలో పురందేశ్వరి లేఖ
-
వాలంటీర్లు, పెన్షనర్లు లక్ష్యంగా చంద్రబాబు క్షుద్ర రాజకీయాలు
-
‘ప్రజలు అన్నీ చూస్తున్నారు..’ వలంటీర్ల రాజీనామా
సాక్షి, అనకాపల్లి: ఓ అక్కా.. ఓ చెల్లి.. ఓ అవ్వా.. ఓ తాతా అంటూ ఒకటో తేదీన ఉదయాన్నే తలుపు తట్టి చిరునవ్వుతో ఫించన్ అందించే పరిస్థితికి బ్రేక్ పడింది. సీఎం జగన్ ఆలోచనల్లోంచి పుట్టి.. ఎండనకా వాననకా, ఆఖరికి కరోనాను సైతం లెక్క చేయకుండా నాలుగన్నరేళ్లు నిర్విరామంగా విధులు నిర్వహించారు వలంటీర్లు. అలాంటి వ్యవస్థకు ఆటంకాలు కలగజేయాలని కుట్ర కార్యరూపం దాల్చింది. పెన్షన్‌దారులు మండుటెండలో మళ్లీ క్యూలు కట్టాల్సిన పరిస్థితిని తెచ్చి పెట్టింది. 2019 అక్టోబర్ 2వ తేదీన పురుడుపోసుకున్న వలంటీర్ వ్యవస్థ ఇప్పుడు రాష్ట్రంలో బలంగా పాతుకుపోయింది. రెండున్నల లక్షల మందికిపైగా వలంటీర్లు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు సక్రమంగా అందటంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. అలాగే ప్రభుత్వంలోని వివిధ శాఖలకు చెందిన సుమారు 530 సేవలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధాన కర్తలుగా, సంక్షేమ వారధులుగా వలంటీర్లను సీఎం జగన్ అభివర్ణిస్తుంటారు. అయితే.. ఈ నాలుగున్నరేళ్లలో వలంటీర్లను మానసికంగా వేధించే ప్రయత్నాలు జరిగాయి. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, పలువురు టీడీపీ నేతలు.. ప్రజా సేవకులపై అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. అయినా అవమానాల్ని దిగమింగుకుని తమ సేవల్ని వలంటీర్లు కొనసాగిస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు.. ఈసీ కోడ్ పేరుతో తమ విధులకు విఘాతం కలిగించడాన్ని వలంటీర్లు భరించలేకపోతున్నారు. ఈ ఉదయం పెందుర్తి నియోజకవర్గంలో 23 మంది వలంటీర్లు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా తానం గ్రామ వలంటీర్లు సాక్షితో మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజలలోకి తీసుకునే వెళ్ళే అదృష్టం సీఎం జగన్ మాకు ఇచ్చారు. కానీ, మాజీ ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు మమ్మల్ని అనేక విధాలుగా మానసికంగా హింసించారు. పేదలకు, లబ్ధిదారులకు సేవ చేస్తుంటే.. స్లీపర్ సెల్స్ అని అపవాదు చేశారు. ఇప్పుడు ఇలా విధులకు ఆటంకాలు విధించారు. మళ్లీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుంటాం. అప్పుడే విధుల్లో చేరతాం’’ అని వలంటీర్లు శపథం చేశారు. ‘ ఏపీ ప్రజలు అన్ని చూస్తున్నారు.. మళ్లీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఓటేసి గెలిపించుకునే దిశగా అడుగులేస్తున్నారు’ అని వలంటీర్లు చెబుతున్నారిప్పుడు. పెందుర్తి పరిధిలోనే కాదు.. రాష్ట్రంలో పలుచోట్ల వలంటీర్లు స్వచ్ఛందంగా తమ విధులకు రాజీనామా చేస్తున్నట్లు తెలస్తోంది. -
బంగారం, మద్యం, నగదు.. ఈసీ ఇప్పటిదాకా పట్టుకున్నది ఎంతంటే..
కోల్‌కతా: ఈనెల లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించినప్పటి నుంచి పశ్చిమ బెంగాల్లో దాదాపు రూ.140 కోట్ల విలువైన బంగారం, డ్రగ్స్, మద్యంతోపాటు వివిధ వస్తువులు, రూ. 7 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన వివరాల ప్రకారం.. శనివారం (మార్చి 30) వరకు స్వాధీనం చేసుకున్న నగదు మొత్తం రూ.7.87 కోట్లు. అలాగే రూ. 33.86 కోట్ల విలువైన 12.7 లక్షల లీటర్ల మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇక రూ. 18.28 కోట్ల విలువైన 3.5 కిలోల మాదక ద్రవ్యాలు, రూ. 27.32 కోట్ల విలువైన బంగారం పట్టుబడినట్లు పేర్కొన్నారు. అలాగే ఇప్పటివరకు సుమారు రూ.36 కోట్ల విలువైన ఇతర వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. లెక్కలో చూపని నగదుతో సహా మొత్తం ఎలక్షన్ కమిషన్ స్వాధీనం చేసుకున్న బంగారం, మద్యం, ఇతర వస్తువుల విలువ రూ.147.19 కోట్లు ఉంటుందన్నారు. ఇదిలా ఉండగా, కోల్‌కతా పోలీసులు నగరంలోని జోరాబాగన్ ప్రాంతంలో చేపట్టిన తనిఖీలలో రూ.82 లక్షల విలువైన సుమారు 15 కిలోల బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. ఈ బంగారు కడ్డీలు బంగ్లాదేశ్ సరిహద్దు గుండా స్మగ్లింగ్ చేసినట్లు తెలుస్తోంది. -
వలంటీర్లపై ఈసీ నిర్ణయం దురదృష్టకరం
సాక్షి, అమరావతి/సత్తెనపల్లి: వలంటీర్లపై ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం వల్ల పెన్షన్ తీసుకునే అవ్వాతాతలు, వికలాంగులు తీవ్రంగా ఇబ్బంది పడతారని, ఈసీ నిర్ణయం దురదృష్టకరమని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈసీ నిర్ణయంపై శనివారం రాత్రి పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కక్షతో పేదలను ఇబ్బంది పెట్టేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వలంటీర్లపై చంద్రబాబు, పవన్ అనేక పర్యాయాలు అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. ఇప్పుడు ఏకంగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సాయంతో ఎన్నికల కమిషన్‌కు చంద్రబాబు ఫిర్యాదు చేయించారన్నారు. వారి వత్తిడికి తలొగ్గి వలంటీర్లను సంక్షేమ పథకాలు పంపిణీ చేయకుండా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవడం బాధాకరమన్నారు. కుట్రలతో చంద్రబాబు వలంటీర్లను బలి చేయాలనుకున్నారన్నారు. చంద్రబాబు తీరుతో రాష్ట్రంలో బలౌతున్నది వలంటీర్లు కాదని, అవ్వాతాతలు, వికలాంగులు, సంక్షేమ పథకాలు తీసుకుంటున్న లబి్ధదారులని మంత్రి అన్నారు. ఇప్పటికైనా ఈసీ తన నిర్ణయాన్ని పునరాలోచన చేసి వృద్ధులు, వికలాంగులకు అవస్థలు లేకుండా చూడాలని కోరారు. చంద్రబాబుకు బుర్రదొబ్బింది అత్యంత ఖరీదైన నేటి రాజకీయ పరిస్థితుల్లో సామాన్యులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టికెట్లు ఇస్తున్న చాణక్యతను, ఎత్తుగడలను అర్థం చేసుకోలేక చంద్రబాబుకు బుర్ర దొబ్బిందని మంత్రి రాంబాబు ఎద్దేవా చేశారు. విద్యావంతుడు, దళితుడు, టిప్పర్ డ్రైవర్‌గా జీవనం వెళ్లదీస్తున్న వీరాంజనేయులుకు సీఎం జగన్మోహన్రెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వడంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. చంద్రబాబు డబ్బున్న కోటీశ్వరులకు, ఎన్నారైలకు, సంపన్నులకు టికెట్లు ఇస్తుండగా.. సీఎం జగన్మోహన్రెడ్డి అత్యంత సామాన్యులకు టికెట్లు ఇస్తూ సరికొత్త సంప్రదాయాన్ని తీసుకొస్తున్న వీరుడన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన మోసగాడని విమర్శించారు. వృద్ధులు, వికలాంగులకు తీరని ద్రోహం: కారుమూరి వలంటీర్ల విధులు నిర్వహించకుండా జిత్తుల మారిన నక్కలా చంద్రబాబు అడ్డుకుని వృద్ధులు, వికలాంగులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు తీరని ద్రోహం చేస్తున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. ఈసీ నిర్ణయంపై స్పందిస్తూ.. నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఎలక్షన్ కమిషన్‌కు లేఖ రాయించి వలంటీర్ల సేవలు నిలిపి వేయించిన నీచుడు చంద్రబాబు అన్నారు. ప్రజలకు మేలు చేసే ఏ కార్యక్రమమైనా చంద్రబాబుకు ద్వేషమే అన్నారు. ఎవరైనా ఏడుస్తుంటే చంద్రబాబు ఆనందిస్తాడని, ప్రజలు సంతోషంగా ఉంటే చంద్రబాబు ఏడుస్తాడని అన్నారు. వలంటీర్లు రాకపోవడంతో ఎండల్లో గంటల తరబడి క్యూలైన్లో నిలబడి పెన్షన్ తీసుకునే అవ్వాతాతలు సొమ్మసిల్లి పడిపోతే చంద్రబాబుకు సంతోషమని మండిపడ్డారు. చంద్రబాబు, ఆయన తోక పారీ్టలకు ఏనాడూ వలంటీర్లంటే ఇష్టం లేదని, వారిపై కక్షగట్టి విధులికప అడ్డుకుని ప్రజలకు ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌తో ఫిర్యాదు చేయించడం దుర్మార్గం’ పెన్షన్ పంపిణీపై నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌తో చంద్రబాబు ఫిర్యాదు చేయించడం దుర్మార్గమని, చంద్రబాబు పెత్తందారీ పోకడలతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదని ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీని వాస్ మండిపడ్డారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పినట్టు ఇప్పుడు జరుగుతున్నది పేదలు, పెత్తందార్ల మధ్య యుద్ధమేనన్నారు. పేదలకు అందించే పెన్షన్లు నిలుపుదల చేయడం చాలా దారుణమన్నారు. మేధావుల ముసుగులో 64 లక్షల మంది పెన్షనర్ల నోట్లో మట్టికొట్టారన్నారు. నిమ్మగడ్డ రమేష్‌తో పాటు మరికొందరు చంద్రబాబు ఏజెంట్లుగా, తొత్తులుగా మారారన్నారు. చంద్రబాబు డైరెక్షన్లోనే పెన్షన్లు ఇవ్వొద్దని చెప్పించారన్నారు. దీనికి టీడీపీ కచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సిందేనని అన్నారు. చంద్రబాబు పాలనలో మూడు రోజులు క్యూలో నిలబడితేనే పెన్షన్లు వచ్చేవి కాదని, జగన్ పాలనలో ఇప్పుడు నేరుగా ఇంటికే అందిస్తున్నా చంద్రబాబు అండ్ కో కుట్రలు చేస్తున్నారన్నారు. వృద్ధుల ఉసురు బాబుకు కచ్చితంగా తగులుతుందన్నారు. పెన్షన్ల పంపిణీ అంశంపై ఎన్నికల కమిషన్ పునరాలోచించుకోవాలన్నారు. వృద్ధుల్ని కష్టపెడతారా: వాసిరెడ్డి పద్మ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల ఇంటిగడప వద్దకే చేరుస్తున్న వలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు, ఆయన బ్యాచ్ మొదటినుంచీ కుట్రలు చేస్తున్నారని, చివరకు ప్రజలకు సంక్షేమం అందకుండా చేయడానికి కూడా వెనుకాడలేదని వైఎస్సార్సీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఫిర్యాదుతో సంక్షేమ పథకాల పంపిణీలో వలంటీర్లను ఉపయోగించవద్దంటూ శనివారం ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇవ్వడంపై వాసిరెడ్డి పద్మ స్పందించారు. ఇంట్లో మగాళ్లు లేనప్పుడు వలంటీర్లు వచ్చి తలుపులు కొడతారని, వలంటీర్లు మీ ఇంటికి వస్తే తరిమేయాలని చంద్రబాబు గతంలో అనేక మాటలు అన్నారన్నారు. చంద్రబాబు ,పవన్ , పచ్చ మీడియా కలిసి మొత్తం వలంటీర్ల వ్యవస్థనే తుంచేసే కుట్రలు చేశారన్నారు. ఎన్నికల కమిషన్ సైతం ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకోకుండా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం బాధాకరమన్నారు. ‘వలంటీర్లపై ఫిర్యాదు చేయడానికి సిగ్గులేదా’ చంద్రబాబు ప్రయోజనాల కోసం పనిచేస్తున్న కొంతమంది మేధావుల ముసుగులో వలంటీర్లపై కుట్రలు చేస్తున్నారని శాసనమండలిలో విప్ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. వలంటీర్లు జీతాలు కోసం కాకుండా సేవా దృక్పథంతో పనిచేస్తున్నారన్నారు. చంద్రబాబు సహా ప్రతిపక్ష నాయకులంతా వలంటీర్లపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. స్వచ్ఛంద సంస్థల ముసుగులో కుహనా మేధావులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారన్నారు. వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు ఇవ్వడానికి వీలు లేదంటూ వలంటీర్లపై కంప్లైంట్స్ చేయటం దారుణమన్నారు. చంద్రబాబు ప్రయోజనాలను కాపాడటం కోసం నిమ్మగడ్డ రమేష్ పనిచేస్తున్నారన్నారు. పేదల కోసం పనిచేసే వలంటీర్లపై ఫిర్యాదు చేయటానికి సిగ్గు లేదా అని ప్రశి్నంచారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే: ఎమ్మెల్యే కన్నబాబు వలంటీర్లను నియంత్రించేందుకు చంద్రబాబు అండ్‌కో చేసిన ప్రయత్నాలు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయని ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు. వలంటీర్లు ప్రజలకు గొప్పగా సేవలు అందిస్తున్నారన్నారు. ఈ ఐదేళ్ళ కాలంలో వలంటీర్లు లాంటి వ్యవస్థ పెట్టడానికి వేరే రాష్ట్రం ధైర్యం చేయలేకపోయిందన్నారు. ప్రజలకు గొప్ప సేవలందించే వలంటీర్లను నియంత్రించాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడన్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా చంద్రబాబు, పవన్ వలంటీర్లపై దుర్మార్గమైన కామెంట్లు చేశారన్నారు. తాజాగా ఎన్నికల కమిషన్‌కు నిమ్మగడ్డ ద్వారా వలంటీర్లపై పిర్యాదు చేశారు. ఈ రెండు నెలలు పెన్షన్లు అందకుండా చేశామని చంద్రబాబు పండుగ చేసుకుంటున్నాడన్నారు. వలంటీర్లను నియంత్రిస్తే వైఎస్సార్సీపీని నియంత్రించామని అనుకోవడం చంద్రబాబు భ్రమ అన్నారు. -
ఈసీ ఆదేశాలు.. ఏపీలో డీఎస్సీ వాయిదా
సాక్షి, విజయవాడ: ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఏపీలో డీఎస్సీ వాయిదా పడింది. నేటి నుంచి ఏప్రిల్ 30 వరకు డీఎస్సీ పరీక్షలు జరగాల్సి ఉండగా, మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ ముగిసిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. జూన్ 4 తర్వాత డిఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. మార్చి 20 నుంచి పరీక్షా కేంద్రాల వెబ్ ఆప్షన్లు, 25 నుంచి హాల్ టికెట్ల డౌన్లోడ్ జరగాల్సి ఉంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఏపీలో డీఎస్సీ వాయిదా పడింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు డీఎస్సీని వాయిదా వేయాలని సీఈసీ స్పష్టం చేసేంది కాగా, ఎన్నికల కోడ్ ముగిసే వరకు టెట్ పరీక్షా ఫలితాల విడుదలకు ఈసీ బ్రేక్ వేసింది. -
వలంటీర్లపై తప్పుడు ప్రచారం.. ఖండించిన ఈసీ
సాక్షి, అమరావతి: పార్లమెంట్ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయటంతో శనివారం(మార్చి 17) నుంచి దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. నిష్పక్షపాత ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ అమలు చేస్తున్న ఈ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని.. జూన్ 6న పూర్తవుతుంది. అంటే.. మొత్తం 80 రోజుల పాటు ఎన్నికల నిబంధనలు అమల్లో ఉంటాయి. ఏపీలోనూ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో ఎన్నికల కోడ్ అమలవుతోంది. రాష్ట్రంలో మే 13న ఎన్నికలు పూర్తవుతున్నా, జూన్ 4న ఓట్లను లెక్కించనున్నారు. తాజాగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించి రాజకీయ ప్రచారాల్లో పాల్గొంటున్న గ్రామ వలంటీర్లు ఎవరైనా కనిపిస్తే ఎన్నికల సంఘానికి వాట్సాప్ చేయాలంటూ ఓ ప్రకటన చక్కర్లు కొడుతోంది. వలంటీర్ల ఫోటో తీసి వారి పేరు, ఊరు చెప్పాలని తెలిపారు. ఇందులో ఎన్నికల కమిషనర్ పేరుతో ఓ వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు. ఈ నెంబర్‌కు వలంటీర్లపై ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. అయితే వాలంటీర్లపై వైరలవుతున్న ప్రకటన ఫేక్ అని ఎన్నికల సంఘం పేర్కొంది. తాము ఏ ప్రకటన చేయలేదని వెల్లడించింది. ఎన్నికల కమిషనర్ సీఈవో పేరుతో తప్పుడు ప్రచారం జరుగుతోందని, 9676692888 సీఈఓ వాట్సాప్‌గా వైరల్ అవుతున్న నెంబర్ ఫేక్ అని స్పష్టం చేసింది. అలాంటి న్యూస్ నమ్మవద్దని తెలిపింది. అసలు ఆ ట్వీట్లో ఏముందంటే.. ‘రాజకీయ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న వాలంటీర్లు ఎవరైనా మీ కంటపడితే వెంటనే ఫోటో కానీ వీడియో కానీ తీసి, వాలంటరీ పేరు, ఊరు పేరు పేర్కొని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారికి వాట్సాప్(9676692888) చేయండి’ అని పేర్కొంది. దీనిపై ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా సీరియస్ అయ్యారు. అది ఫేక్ న్యూస్ అని, అటువంటి తప్పుడు ప్రచారం నమ్మొద్దని స్పష్టం చేశారు. చదవండి: 'భాజా, భజంత్రీల మీడియా'కు ఆపరేటర్‌గా బాబు! FAKE NEWS ALERT!#APElections2024 pic.twitter.com/pnWUZ8ZUqb — Chief Electoral Officer, Andhra Pradesh (@CEOAndhra) March 21, 2024 -
ఆలోచించండి ఓ అమ్మానాన్న.. ఈసీ వినూత్న ప్రయత్నం
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల గురించి ఉత్తరప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థులు త్వరలో తమ తల్లిదండ్రులకు లేఖలు రాయబోతున్నారు. "నా భవిష్యత్తు దేశంలోని బలమైన ప్రజాస్వామ్యంతో ముడిపడి ఉంది. దీని కోసం ఓటరు జాబితాలో మీ పేర్లను తప్పకుండా చూసుకుని రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసే ప్రతిజ్ఞ తీసుకోవాలని కోరుకుంటున్నాను" అని పిల్లలు తమ తల్లిదండ్రులను కోరనున్నారు. జాతీయ సగటుతో సమానంగా రాష్ట్రంలో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఎన్నికల సంఘం చొరవతో ఉత్తరప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నవదీప్ రిన్వా జిల్లా యంత్రాంగం, విద్యా శాఖల సహకారంతో కృషి చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ స్వీప్ (సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) చొరవలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఉత్తరప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు లేఖలు రాయడంలో సహాయం కోరుతూ డైరెక్టర్ జనరల్ (పాఠశాల విద్య)కి లేఖ రాసింది. 2024 లోక్‌సభ ఎన్నికలలో కుటుంబంలోని అర్హులైన సభ్యులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటామని పిల్లలు ఇచ్చే "ప్రతిజ్ఞ లేఖ"పై తల్లిదండ్రులు సంతకం చేయాల్సి ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ సగటు జాతీయ సగటు కంటే చాలా తక్కువగా నమోదవుతూ వస్తోంది. 2019లో జాతీయ సగటు 67.4 శాతం ఉండగా ఉత్తరప్రదేశ్‌లో 59.21 శాతం పోలింగ్ నమోదైంది. అదేవిధంగా 2014లో దేశ సగటు 66.44 శాతం ఉండగా ఉత్తరప్రదేశ్‌లో 58.44 శాతం ఓటింగ్ నమోదైంది. -
చంద్రబాబుకు ఎన్నికల కమిషన్ నోటీసులు
-
24 గంటల్లో తొలగించాలి.. చంద్రబాబుకు ఈసీ నోటీసులు
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసులు జారీ చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర సీఈవో ముఖేష్ కుమార్ మీనా.. చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టులు పోస్ట్ పెట్టింది. దీంతో టీడీపీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకీ ఫిర్యాదు చేశారు. ఎక్స్(ట్విటర్), ఫేస్ బుక్, యూట్యూబ్ ద్వారా టీడీపీ అసభ్యకర ప్రచారం చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ వ్యక్తిత్వంపై దాడిచేసే ప్రచారం చేస్తున్నారంటూ తెలిపారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన సీఈవో ముఖేష్ కుమార్ మీనా.. చంద్రబాబుకి నోటీసులు ఇచ్చారు. 24 గంటల్లోగా సీఎం వైఎస్ జగన్‌పై అసభ్య పోస్టులు తొలగించాలని సీఈవో ఆదేశించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉందని సీఈవో ముఖేష్ కుమార్‌మీనా స్పష్టం చేశారు. -
Lok sabha elections 2024: ఎన్నికల షెడ్యూల్ నేడే
సాక్షి, న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఇవాళ వెలువడనుంది. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించనుంది. లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, సిక్కిం శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను సైతం ప్రకటిస్తారు. అలాగే తెలంగాణలో ఖాళీగా ఉన్న ఒక అసెంబ్లీ స్థానానికి(కంటోన్మెంట్) ఉప ఎన్నిక షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఏప్రిల్ రెండు లేక మూడో వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ వెలువడిన వెంటనే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి(ఎలక్షన్ కోడ్) అమల్లోకి వస్తుంది. ప్రస్తుత లోక్‌సభ పదవీకాలం జూన్ 16వ తేదీతో ముగియనుంది. అలాగే.. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీల గడువు జూన్ 2వ తేదీతో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గడువు జూన్ 16తో, ఒడిషా అసెంబ్లీ గడువు జూన్ 24వ తేదీతో ముగియనున్నాయి. అంతకంటే ముందు ఎన్నికల్ని నిర్వహించాల్సి ఉంటుంది. గత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను 2019 మార్చి 10న ప్రకటించారు. ఏప్రిల్ 11 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి. మే 23న ఫలితాలు వెలువడ్డాయి. అయితే.. ఈసారి నాలుగు నుంచి ఐదు దశల్లోనే లోక్‌సభ ఎన్నికలను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు అంచనా. సార్వత్రిక ఎన్నికల కోసం 12 లక్షలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే జమ్ము కశ్మీర్ ఎన్నికల నిర్వహణపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పూర్తి వివరాలపై మధ్యాహ్నాం 3 గంటలకు స్పష్టత రానుంది. -
ఎలక్టోరల్ బాండ్ల డేటాపై 'జైరాం రమేష్' కీలక వ్యాఖ్యలు
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా వాడాలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి 'జైరాం రమేష్' ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద కుంభకోణంగా అభివర్ణించారు. దీనిపై ఎన్నికల సంఘం (EC) పంచుకున్న డేటా అసంపూర్ణమైనదని వ్యాఖ్యానించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లకు (ఈవీఎం) కాంగ్రెస్ వ్యతిరేకం కాదు. కానీ ఓటర్ తన ఓటును సరిగ్గా వేసినట్లు తెలుసుకోవడానికి పోలింగ్ ప్రక్రియలో ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ)ని ప్రవేశపెట్టాలని జైరాం రమేష్ అన్నారు. తమ పార్టీ గత సంవత్సరం నుంచి ఈసీతో అపాయింట్మెంట్ కోరుతూనే ఉందని, కానీ వారు ఇవ్వలేదని అన్నారు. ప్రతిపక్ష పార్టీలను కలవడానికి ఈసీ ఎందుకు, ఎవరికి భయపడుతోంది అని కేంద్ర మాజీ మంత్రి ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ప్రచురించిన ఎలక్టోరల్ బాండ్ల డేటాలో.. ''ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసి ప్రభుత్వ కాంట్రాక్టులు పొందిన వారు, దర్యాప్తు సంస్థల బెదిరింపుల కారణంగా బాండ్లు కొనుగోలు చేసిన వారు, కాంట్రాక్టులు పొందడానికి లంచంగా బాండ్లను కొనుగోలు చేసిన వారు, షెల్ కంపెనీల ద్వారా కొనుగోలు చేసినవారు'' మాత్రమే నాలుగు కేటగిరీలుగా ఉన్నారని జైరాం రమేష్ పేర్కొన్నారు. స్వతంత్ర భారతావనిలో ఇదే అతిపెద్ద కుంభకోణమని, సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని.. ప్రజాకోర్టుకు వెళ్తామని ఆయన అన్నారు. ఎలక్టోరల్ బాండ్ల డేటాను ఈసీ తమ అధికారిక వెబ్సైట్లో ఉంచిన ఒక రోజు తర్వాత జైరాం రమేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
రేపే ఎన్నికల షెడ్యూల్ ప్రకటన: ఈసీ
సాక్షి, ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల ఎప్పుడనే దానిపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా స్పందించింది. రేపు.. శనివారం(16 మార్చి) మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని.. ఈ మేరకు ప్రెస్‌మీట్ ఉంటుందని ఈసీఐ ప్రతినిధి ట్వీట్ ద్వారా తెలియజేశారు. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఏకకాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను రేపు ఈసీ అధికారికంగా వెల్లడించనుంది. Press Conference by Election Commission to announce schedule for #GeneralElections2024 & some State Assemblies will be held at 3 pm tomorrow ie Saturday, 16th March. It will livestreamed on social media platforms of the ECI pic.twitter.com/1vlWZsLRzt — Spokesperson ECI (@SpokespersonECI) March 15, 2024 ఈసీ డేటా ప్రకారం.. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీల గడువు జూన్ 2వ తేదీతో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గడువు జూన్ 16తో, ఒడిషా అసెంబ్లీ గడువు జూన్ 24వ తేదీతో ముగియనున్నాయి. ఈసీలతో సీఈసీ భేటీ కేంద్ర ఎన్నికల సంఘంలో.. ఇద్దరు సభ్యుల కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో షెడ్యూల్ ప్రకటన జాప్యం అవుతుందేమోనని అంతా భావించారు. ఈ నేపథ్యంలో.. గురువారం ప్రధాని నేతృత్వంలోని హైపవర్డ్ కమిటీ ఈసీ సభ్యుల ఎంపిక కోసం భేటీ అయ్యింది. తదనంతరం.. రెండు పేర్లను రాష్ట్రపతికి పంపగా.. వెంటనే ఆమోద ముద్ర లభించింది. అలా.. ఎన్నికల సంఘానికి నిన్న ఇద్దరు నూతన ఎన్నికల కమిషనర్ల నియామకం ఆఘమేఘాల మీద జరిగింది. శుక్రవారం ఉదయం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ సమక్షంలో జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖ్ బీర్ సింగ్ సంధు ఎన్నికల కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం కీలక భేటీ జరిగింది. ఈ భేటీలోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తేదీపై నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. -
ఈసీల నియామకం.. సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ
న్యూఢిల్లీ: కొత్త చట్టం ప్రకారం ఎన్నికల కమిషనర్ల నియామకం చేపట్టవద్దని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్)అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం(మార్చ్ 15) విచారించనుంది. ఫిబ్రవరిలో ఎన్నికల కమిషనర్ అనూప్‌చంద్ర పాండే రిటైర్ అవడం, ఇటీవలే మరో ఎన్నికల కమిషనర్ అరుణ్‌గోయెల్ ఆకస్మికంగా తన పదవికి రాజీనామా చేయడంతో లోక్‌సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఎన్నికల కమిషన్‌లో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ రెండు ఖాళీలను నింపేందుకు ప్రధాని నేతృత్వంలోని కమిటీ ఈ వారంలోనే సమావేశమవనుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏడీఆర్ వేసిన పిటిషన్‌ను లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కొత్త చట్టం ప్రకారం ఈ కమిటీలో ప్రధాని, కేంద్ర మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్షనేత సభ్యులుగా ఉంటారు. గతంలో ఉన్న చట్టం ప్రకారం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ) కమిటీలో సభ్యుడిగా ఉండగా కొత్త చట్టంలో ఆయన స్థానంలో కేంద్రమంత్రికి అవకాశం కల్పించారు. అయితే ఎంపిక కమిటీ నుంచి సీజేఐని తప్పించిన తర్వాత తొలిసారి ఈసీలను కేంద్రం ఎంపిక చేస్తుండటంతో ఏడీఆర్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు చెప్పనుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది. కాగా, లోక్‌సభ ఎన్నిలకు త్వరలో షెడ్యూల్ వెలువడనుండగా ఎన్నికల కమిషనర్ అరుణ్‌గోయెల్ ఇటీవల ఆకస్మికంగా రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. సీఈసీతో ఉన్న విభేదాల కారణంగానే గోయెల్ తన పదవికి రాజీనామా చేశారన్న ప్రచారం జరిగింది. అరుణ్‌గోయెల్ ఆకస్మిక రాజీనామాతో ఎన్నికల కమిషన్ విశ్వసనీయతపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఇదీ చదవండి.. ఈసీ కసరత్తులు చివరికి ఎల్లుండే షెడ్యూల్ -
‘ఎలక్షన్ కమిషన్ ప్రైవేటీకరణ’.. శివసేన ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు
సార్వత్రిక ఎన్నికల ముంగిట కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ రాజీనామా నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్‌పై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్ కమిషన్ బీజేపీ శాఖలా మారిందని ఆరోపించారు. ముంబైలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సంఘాన్ని బీజేపీ ప్రైవేటీకరించిందని మండిపడ్డారు. ’ఎలక్షన్ కమిషన్ బీజేపీ శాఖలా మారింది. టీఎన్ శేషన్ (మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్) హయాంలో ఉన్నట్టుగా వ్యవస్థ ఇప్పుడు లేదు. విశ్వసనీయమైన నియంత్రణ సంస్థగా ఉండే ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు విశ్వసనీయతను కోల్పోయింది. గత పదేళ్లలో ఎలక్షన్ కమిషన్ ప్రైవేటీకరించారు’ అన్నారు. ఎలక్షన్ కమిషన్ తీరును విమర్శిస్తూ ‘ఈ రోజుల్లో ఎలక్షన్ కమిషన్ ఎలా పని చేస్తోందో శివసేన (యూబీటీ), ఎన్సీపీ అనుభవించాయి. ఎన్సీపీ పార్టీని, ఎన్నికల గుర్తును అనర్హులకు అప్పగించారు.మనకు తెలిసిన ఎన్నికల కమిషన్ ఎప్పుడో చచ్చిపోయింది’ అన్నారు. ఎన్సీపీలో ఇటీవల చీలిక వచ్చింది. అజిత్ పవార్ వర్గానికే పార్టీ ఎన్నికల గుర్తు అయిన గడియారం గుర్తను ఎలక్షన్ కమిషన్ కేటాయించింది. పార్టీ చీలిక తర్వాత అజిత్ పవార్ మహారాష్ట్ర డిప్యటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇది శరత్ పవార్ వర్గానికి శరాఘాతంగా మారింది. ఇక శివసేన విషయంలోనూ తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే వర్గానికే పార్టీ అధికారిక బాణం, విల్లు ఎన్నికల గుర్తును ఎలక్షన్ కమిషన్ కేటాయించింది. దీంతో ఉద్దవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) కాగడా గుర్తును వినియోగిస్తోంది. -
ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు కొన్ని వారాల ముందర.. కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేయగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మ ఆ రాజీనామాను ఆమోదించారు. అరుణ్ గోయల్ పదవీకాలం 2027 వరకు ఉండగా.. ఇంత ముందుగానే ఆయన రాజీనామా చేయడానికి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన కమిషనర్‌తో పాటు మరో ఇద్దరు కమిషనర్లు సభ్యులుగా ఉంటారన్నది తెలిసిందే. అయితే అనూప్ చంద్ర పాండే ఫిబ్రవరిలో పదవీ కాలం పూర్తి చేసుకుని దిగిపోయారు. దీంతో ఖాళీ అయిన ఆ స్థానం భర్తీ చేసేందుకు కసరత్తులు కొనసాగుతున్నాయి. ఈలోపు అరుణ్ గోయల్ కూడా రాజీనామా చేయడంతో ఎన్నికల సంఘంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్‌కుమార్ మాత్రమే మిగిలారు. తాజా రాజీనామా పరిణామంతో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడడంపై ఏమైనా ప్రభావం పడుతుందా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీల భర్తీ ఓ ప్రక్రియను అనుసరించి జరుగుతుంది. సీఈసీ అండ్ ఓఈసీ యాక్ట్ Chief Election Commissioner and Other Election Commissioners (Appointment, Conditions of Service and Term of Office) Act, 2023 ప్రకారం.. న్యాయ శాఖ మంత్రి నేతృత్వంలోని కమిటీ(ఇద్దరు కేంద్ర కార్యదర్శులు కూడా సభ్యులుగా ఉంటారు) ఐదుగురు పేర్లతో కూడిన అభ్యర్థుల జాబితాను ప్రధాని నేతృత్వంలోని కమిటీకి (ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన స్వతంత్ర ఎంపిక కమిటీ) అందజేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్న ఖాళీ భర్తీ చేయడం కోసం ఈ కమిటీ భేటీ కావాల్సి ఉండగా.. పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు రెండు ఖాళీల నేపథ్యంలో ముందుకు వెళ్తుందా? అనేది చూడాలి. గోయల్ ఎన్నికల కమిషనర్ ఎంపికనే వివాదం అరుణ్ గోయల్ పంజాబ్ కేడర్‌కు చెందిన 1985 ఐఏఎస్ బ్యాచ్ అధికారి. 2022 నవంబర్ 18వ తేదీన ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. ఆ తర్వాతి రోజే ఆయన్ని ఎన్నికల కమిషనర్‌గా నియమించారు. ఈ నియామకంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అసోషియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ అరుణ్ గోయల్ నియామకాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. ఈ క్రమంలో.. కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్‌ను ఎందుకంత వేగంగా నియమించారని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. గోయల్ నియామకానికి సంబంధించిన ఫైళ్లను ‘మెరుపు వేగం’తో ఆమోదించడంపై సర్వోన్నత న్యాయస్థానం పెదవి విరిచింది. 24 గంటలు కూడా గడవకముందే మొత్తం నియామక ప్రక్రియ ఎలా పూర్తి చేశారని రాజ్యాంగ ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సంబంధిత వార్త: సీఈసీ, ఈసీ నియామకాలపై సుప్రీం అసహనం ‘ఇదేం నియామకం? ఇక్కడ మేం అరుణ్ గోయల్ సామర్థ్యాలను ప్రశ్నించట్లేదు. నియామక ప్రక్రియ గురించి మాట్లాడుతున్నాం. గోయల్ ఫైల్‌ను ఎందుకంత హడావుడిగా, వేగంగా ఆమోదించాల్సి వచ్చింది. ఫైల్ మొదలుపెట్టిన రోజే అపాయింట్మెంట్ ఎలా జరిగింది. ఈసీ పదవి కోసం నలుగురి పేర్లను షార్ట్‌లిస్ట్ చేసిన న్యాయశాఖ నవంబరు 18న ఆ ఫైల్‌ను ప్రధాని కార్యాలయానికి పంపించింది. అదే రోజున ప్రధాని ఒక పేరును ప్రతిపాదించారు. నలుగురి పేర్లను సిఫార్సు చేస్తే... వారిలో చిన్నవాడైన అరుణ్ గోయల్ పేరును ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు. దీనికి అనుసరించిన పద్ధతి ఏంటీ?’’ అని ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. సుప్రీం ప్రశ్నలకు అటార్నీ జనరల్ స్పందిస్తూ.. ‘‘ఎన్నికల కమిషనర్ ఎంపిక ప్రక్రియలో ఎక్కడా తప్పు జరగలేదు. గతంలో కూడా 12 నుంచి 24 గంటల్లో నియామకాలు జరిగిన సందర్భాలున్నాయి. న్యాయశాఖ ప్రతిపాదించిన నాలుగు పేర్లను డీఓపీటీ డేటాబేస్ నుంచే తీసుకున్నారు. ఆ వివరాలన్నీ బహిరంగంగానే అందుబాటులో ఉన్నాయి. ఇక, పేరు ఎంపిక సమయంలో సీనియార్టీ, పదవీ విరమణ వయసు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వయసుకు బదులుగా బ్యాచ్ ఆధారంగా సీనియార్టీని పరిగణిస్తారు’’ అని బదులిచ్చారు. అయితే ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్ ఎంపికను కొట్టేయలేమని చెబుతూనే.. ఆ పిటిషన్‌ను ఆ సమయంలో రాజ్యాంగ ధర్మాసనం పరిశీలనకు తీసుకోవడం గమనార్హం. -
త్వరలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్..?
దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 2024 లోక్‌సభ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 14 లేదా 15న ప్రకటించే అవకాశం ఉంది. 2019లో ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించినట్లుగానే ఈ సారి ఎన్నికలు అదే తరహాలో నిర్వహించే అవకాశం ఉందని జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. మీడియా కథనాల ప్రకారం మొదటి దశ లోక్‌సభ ఎన్నికల ఓటింగ్ ఏప్రిల్ రెండవ వారంలో జరగనుండగా.. మార్చి 14 నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. టార్గెట్ 400 కాగా, 2019లో ఏడు దశల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 303 సీట్లు గెలుచుకున్న బీజేపీ రెండోసారి కేంద్రంలో అధికారం చేపట్టింది. కాంగ్రెస్ కేవలం 52 సీట్లకే పరిమితమైంది. అయితే ఈ సారి బీజేపీ ఒంటరిగా 370 సీట్లు, ఎన్డీయేకు 400 సీట్లు రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ ఆలోచనల్లోనూ అవుట్‌డేట్ అయ్యిందని, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 40 సీట్లైనా రావాలని పార్లమెంట్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. -
లోక్‌సభ ఎన్నికలు.. పలు పోలింగ్ కేంద్రాల్ని మహిళలే నిర్వహించేలా
సాక్షి, కోల్‌కతా : ఉత్తర్‌ప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పూర్తిగా మహిళలతో కొన్ని పోలింగ్ కేంద్రాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో మహిళా భద్రతా సిబ్బందిని మోహరించడానికి మేము ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. #WATCH | Kolkata, West Bengal: Chief Election Commissioner Rajiv Kumar says, "There will be a few polling stations which will be run entirely by women. We will try to deploy female security personnel in those polling stations... Similarly, some polling stations will be… pic.twitter.com/vVQpgQ706o — ANI (@ANI) March 5, 2024 అదే విధంగా, కొన్ని పోలింగ్ కేంద్రాలు పూర్తిగా వికలాంగులే నిర్వహిస్తారని, తద్వారా ఇతరులకన్న వారు తక్కువగా కాదని నిరూపిస్తారని అన్నారు. -
ఎన్సీపీ నాదే.. సుప్రీంకోర్టుకు శరద్‌పవార్
న్యూఢిల్లీ: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌దే అసలైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అని ఎన్నికల సంఘం(ఈసీ)వెల్లడించిన నిర్ణయంపై ఆ పార్టీ పూర్వ అధినేత శరద్‌పవార్ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దేశ అత్యున్నత కోర్టులో సోమవారం ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అజిత్ పవార్‌దే అసలైన ఎన్సీపీ అని ఈ నెల 6వ తేదీన తేల్చిన ఈసీ ఆ మరుసటి రోజే శరద్‌పవార్ వర్గానికి ఎన్సీపీ-శరద్‌పవార్ అనే పేరు కేటాయించింది. 1999లో స్థాపించి నిర్మించిన ఎన్సీపీని ఈసీ లాక్కుని వేరే వాళ్లకు ఇచ్చేసిందని, గతంలో ఇలాంటి ఘటన దేశంలో ఎప్పుడూ జరగలేదని శరద్‌పవార్ మండిపడ్డారు. కాగా, గతంలో ఎన్సీపీ నుంచి వేరుపడిన శరద్‌పవార్ మేనల్లుడు అజిత్ పవార్ మహారాష్ట్ర బీజేపీ, శివసేన సంకీర్ణంలో చేరి ఉపముఖ్యమంత్రి అయ్యారు. తన వద్దే మెజారిటీ ఎమ్మెల్యేలున్నందున అసలైన ఎన్సీపీ తనదేనని అజిత్ పవార్లో ఈసీ తలుపు తట్టారు. దీంతో ఈసీ అసలైన ఎన్సీపీ అజిత్‌దేనని తేల్చింది. ఇదీ చదవండి.. ఎంఐఎం నేతను కాల్చి చంపిన దుండగులు -
ఈసీ కొత్త మార్గదర్శకాలు తప్పక పాటించాలి
సాక్షి, విశాఖపట్నం/తిరుపతి సిటీ: రానున్న ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా జారీచేసిన మార్గదర్శకాలు, సూచనలను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టంచేశారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కెమికల్ ఇంజరింగ్ బ్లాక్‌లో లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గ ఆర్వోలు, ఏఆర్వోలకు నిర్వహిస్తున్న తొలి విడత శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. మీనా మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల గురించి అధికారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో 1,000 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ ఇచ్చేందుకు జాతీయస్థాయి మాస్టర్ ట్రైనర్లు వచ్చారని, వారి నుంచి ఎన్నికల ప్రారంభం నుంచి ముగిసే వరకు కొనసాగాల్సిన ప్రక్రియపై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలని, సందేహాలను నివృత్తి చేసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం మాస్టర్ ట్రైనర్ సమీర్ అహ్మద్ జాన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లిఖార్జున ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. డీఆర్వో కె.మోహన్‌కుమార్, విశాఖ, విజయనగరం, అనకాపల్లి, పాడేరు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల జాయింట్ కలెక్టర్లు, ఏఆర్వోలు హాజరయ్యారు. -
సీఈసీతో ఎంపీ విజయసాయిరెడ్డి బృందం భేటీ
-
సీఈసీతో ఎంపీ విజయసాయిరెడ్డి బృందం భేటీ
-
పుణే ఉప ఎన్నికపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: పుణే ఎంపీ గిరీశ్ బాపత్ మృతితో తొమ్మిది నెలలుగా ఖాళీగా ఉన్న ఆ ఎంపీ స్థానానికి వెంటనే ఉప ఎన్నికలు నిర్వహించాలంటూ ఈసీని ఆదేశిస్తూ బాంబే హైకోర్టు ఇచి్చన ఉత్తర్వులను సుప్రీంకోర్టు పక్కనబెట్టింది. ప్రస్తుత లోక్‌సభ కాలపరిమితి జూన్ 16వ తేదీతో ముగుస్తున్న కారణంగా ఆ ఒక్క స్థానానికి ఉప ఎన్నిక నిర్వహణ వృథా అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం వ్యాఖ్యానించింది. ‘‘ ఈ స్థానం ఖాళీగా ఉంటే ఈసీ ఇన్ని రోజులు ఈసీ ఏం చేస్తున్నట్లు?. ఇలాంటి సందర్భాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే పాటించాల్సిన విధివిధానాలపై మార్గదర్శకాలను త్వరలో వెలువరిస్తాం’ అని బెంచ్ పేర్కొంది. గత ఏడాది మార్చి 29వ తేదీన ఇక్కడి బీజేపీ ఎంపీ గిరీశ్ బాపత్ కన్నుమూశారు. ఈ స్థానానికి ఉపఎన్నికలు ఉండవని ఈసీ చెప్పడంతో పుణేకు చెందినన సుఘోష్ జోషి గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. పుణే స్థానం ఖాళీ అయినప్పటి నుంచీ పలు అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఈసీ ఉప ఎన్నికలు నిర్వహించింది. పుణే విషయంలో ఈసీ గతంలో ఇచ్చిన వివరణ హేతుబద్ధంగా లేదు. అందుకే అక్కడ తక్షణం ఉప ఎన్నిక నిర్వహించండి’’ అంటూ ఈసీని బాంబే హైకోర్టు ఆదేశించింది. వాటిని ఈసీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. -
ఆ రెండు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌కే!
సాక్షి, హైదరాబాద్: ఈనెల 29వ తేదీన ఎమ్మెల్యేల కోటాలో జరిగే రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీనే దక్కించుకునే అవకాశముంది. సంఖ్యాబలం పరంగా చూస్తే కాంగ్రెస్‌కు ఒకటి, బీఆర్ఎస్కు ఒకటి రావాల్సి ఉన్నా.. ఈ రెండు స్థానాలకు వేర్వేరుగా నోటిఫికేషన్లు, వేర్వేరుగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో.. అధికార కాంగ్రెస్ పార్టీకి రెండు ఎమ్మెల్సీ స్థానాలు దక్కనున్నాయి. ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు రాజీనామా చేసిన ఏ సభ్యుడి స్థానంలో ఎన్నిక కావడానికి నామినేషన్ వేస్తున్నారో స్పష్టంగా పేర్కొనాలని కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో వారిద్దరూ గతనెల 9వ తేదీన తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీలుగా వీరిద్దరికీ 30 నవంబర్ 2027 వరకు గడువు ఉన్నా.. ప్రత్యక్ష ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో వేర్వేరుగా జరిగే ఈ ఎన్నికలకు బ్యాలెట్ పేపర్లలో ఒకటి తెల్ల, రెండోది గులాబీ రంగులో ముద్రించాలని స్పష్టం చేశారు. మొత్తం సభ్యులు(119), ఎన్నికవ్వాల్సిన స్థానాల సంఖ్య +1తో భాగించడంతో వచ్చే భాగఫలం(ఒకరికి కావాల్సిన ఓట్ల సంఖ్య 59.5)ను నిర్ధారిస్తారు. ప్రస్తుతం వేర్వేరుగా ఎన్నిక నిర్వహిస్తుండటం వల్ల ఒక అభ్యర్థికి కనీసం 59.5 ఓట్లు లభిస్తే ఆ అభ్యర్థి ఎన్నిక కావడానికి వీలుంటుంది. అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 64 మంది సభ్యులున్నందున, రెండు స్థానాలకు వేర్వేరుగా 119 మంది సభ్యులు రెండుసార్లు ఓట్లు వేయాల్సి ఉండడంతో ఈ రెండు స్థానాలూ కాంగ్రెస్‌కే దక్కనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకే నోటిఫికేషన్, ఒకే పోలింగ్ స్టేషన్ ఉంటే.. రెండింటికీ ఒకే నోటిఫికేషన్, ఒకే పోలింగ్ స్టేషన్ ఉన్న పక్షంలో మొత్తం సభ్యుల సంఖ్య(119)ని ఎన్నిక కావాల్సిన స్థానాలు రెండింటికి +1 కలప డం వల్ల 39.6 ఓట్లు లభిస్తే ఒక ఎమ్మెల్సీ స్థానం రావడానికి అవకాశం ఉండేది. ఈ లెక్కన కాంగ్రెస్‌కు ఒకటి, బీఆర్ఎస్కు ఒకటి కచ్చితంగా వచ్చేవి. రెండోస్థానం కైవసం చేసుకోవడానికి ఏ పార్టీకి కూడా మెజారిటీ లేనందున దాదాపు ఏకగ్రీవంగా ఎన్నిక జరిగే అవకాశం ఉండేది. అయితే ఎన్నికల సంఘం ఈ రెండింటికీ వేర్వేరుగా ఎన్నిక నిర్వహించాలని ఆదేశించింది. అసెంబ్లీలోని కమిటీ హాల్–1లో ఈ ఎన్నిక నిర్వహించనున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే వారు ఎస్సీ, ఎస్టీలు రూ. 5 వేలు, మిగిలిన కులాల వారైతే రూ.10 వేలు డిపాజిట్ కట్టాలని పేర్కొన్నారు. -
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల
-
డూప్లికేట్, డబుల్ ఓట్లపై ఈసీ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: పక్క రాష్ట్రాల ఓటర్లకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఓటు ఉన్నవారికి చెక్ పెడుతూ.. డూప్లికేట్, డబుల్ ఓట్లపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదుపై ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. అన్ని జిల్లాల కలెక్టర్లకు ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. వేరే రాష్ట్రాల్లో ఓటు ఉన్న వారికి ఏపీలో ఓట్లు ఉన్నాయని ఫిర్యాదులు రావడంతో ఈసీ చర్యలకు ఉపక్రమించింది. ఒక వ్యక్తికి ఒకే నియోజకవర్గం, ఒకే రాష్ట్రంలో ఓటు ఉండాలి. ఒక వ్యక్తి కి ఎక్కువ చోట్ల ఓటు ఉండటం నిబంధనలు కు విరుద్దం. ఫామ్ 6 ద్వారా కొత్త ఓటు నమోదు మాత్రమే చేయాలి. కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు డిక్లరేషన్ తీసుకోవాలి. వేరే ఎక్కడ ఓటు లేదని డిక్లరేషన్ ఇవ్వాలి. తప్పుడు డిక్లరేషన్ ఇచ్చే వారిపై కేసులు పెట్టాలి’’ అని ఈసీ పేర్కొంది. తప్పుడు డిక్లరేషన్‌తో ఓటు నమోదు దరఖాస్తు చేస్తే జైలు శిక్ష. 20 ఏళ్లు పైబడ్డ వాళ్లు ఫామ్ 6 ద్వారా దరఖాస్తు చేస్తే అధికారులు విచారించి రిమార్క్ ఇవ్వాలి. ఎక్కడ నివాసం ఉంటే అక్కడే ఓటు హక్కు. ఇళ్లు మారే వాళ్లు ఓటుకి ఫామ్ 8 ద్వారా డిక్లరేషన్ ఇవ్వాలి. తప్పుడు డిక్లరేషన్ ఇస్తే కేసు నమోదు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. -
ఈసీని కలిసిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, విజయవాడ: టీడీపీ నేతలు దొంగ ఓట్లు చేర్పిస్తున్నారంటూ వైఎస్సార్సీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. అనంతరం మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, ఒకరికి ఒక ఓటు మాత్రమే ఉండాలి. టీడీపీ నేతలు దొంగ ఓట్లు చేర్పించడంలో సిద్ధహస్తులు. ప్రజలను ఏ విధంగా మోసం చేయాలనేది టీడీపీ ఆలోచన’’ అంటూ మండిపడ్డారు వైఎస్సార్సీపీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుంది. టీడీపీ నేతలు అక్రమ మార్గంలో గెలిచేందుకే ప్రయత్నిస్తున్నారు. చాలమందికి రెండు రాష్ట్రాల్లో ఓట్లు ఉన్నాయి. వాటిని తొలగించాలని ఈసీని కోరాం. ఎవరికైనా సరే ఒకరికి ఒక ఓటు మాత్రమే ఉండాలి’’ అని వైఎస్సార్సీ నేతలు పేర్కొన్నారు. హైదరాబాద్, ఏపీలో 4 లక్షల 30 వేల 264 ఓట్లు ఉన్నాయి. ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్‌కు అందించాం. డబుల్ ఎంట్రీలు తొలగించాలని సీఈవోను కోరాం. దేశంలో ఒకేచోట ఓటు ఉండాలనేది వైసీపీ విధానం. ఇలాంటి ఓట్లపై విచారణ జరిపించి తొలగించాలని కోరాం. -మంత్రి జోగి రమేష్ ఎన్నికలు పారదర్శకంగా జరగాలనేది సీఎం జగన్ ఆకాంక్ష. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట. మోసాలు చేయడమే చంద్రబాబు ప్రధాన అజెండా. ఒక సామాజికవర్గం ఓట్లు ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉన్నాయి. టీడీపీ ప్రలోభాలతో ప్రజలను లోబరుచుకుంటుంది. డూప్లికేట్ ఓట్లను తొలగించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు తాను చేసిన తప్పులు ఇతరులపైకి నెడతారు. ఢిల్లీ వెళ్లి జాతీయ మీడియాలో అబద్ధాలు చెప్పాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. -మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఇదీ చదవండి: బాబు కోసం ఇంత బరితెగింపా!? -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఈసీ గుడ్‌న్యూస్ !
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు డీఏ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం(ఈసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉద్యోగులకు మొత్తం మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో ఒకటి రిలీజ్ చేసేందుకు అనుతివ్వాల్సిందగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈసీని కోరింది. డీఏ చెల్లింపులు ఎందుకు ఆలస్యమయ్యాయని, ఇప్పుడే ఎందుకివ్వాల్సి వస్తోందని ఈసీ ప్రభుత్వాన్ని అడిగినట్లు తెలిసింది. దీనికి ప్రభుత్వ సమాధానం సంతృప్తికరంగా ఉండటంతో డీఏ విడుదలకు ఈసీ ఓకే అంది. కాగా, ప్రభుత్వంతో పాటు ఉద్యోగసంఘాలు కూడా డీఏ విడుదలపై ఈసీకి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశాయి. ఇప్పటికే రాష్ట్రంలో పోలింగ్ ముగిసినందున ఈసీ వారి విజ్ఞప్తికి అంగీకరించింది. ఇదీచదవండి..కేటీఆర్‌ది మేనేజ్మెంట్ కోటా..నాది మెరిట్ కోటా : రేవంత్‌రెడ్డి -
రేపు సెలవు ఇవ్వడం లేదు.. ఈసీకి వరుస ఫిర్యాదులు
హైదరాబాద్: రేపు (నవంబర్ 30) జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కంపెనీల యాజమాన్యాలు సెలవు ఇవ్వడం లేదంటూ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు వెల్లువెత్తాయి. నగరంలోని పలు ఎంఎన్సీ కంపెనీలకు చెందిన ఉద్యోగులు ఎలక్షన్ కమిషన్‌కు సంబంధించిన ఓటర్ హెల్ప్‌లైన్ 1950 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదులు చేస్తున్నారు. ఓటేసేందుకు గురువారం తమ కంపెనీల యాజమాన్యాలు సెలవు ఇవ్వడం లేదని వాపోతున్నారు. పని చేయాల్సిందేనంటూ ఒత్తిడి తెస్తున్నారని, ఉద్యోగం కావాలా? ఓటు కావాలా? అంటున్నారని సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లందరూ ఓటు వేసేలా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు పోలింగ్ రోజున సెలవు ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే కొన్ని ప్రైవేటు కంపెనీల యాజమాన్యాలు తమకు సెలవు ఇవ్వడం లేదంటూ ఉద్యోగులు ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. -
రైతుబంధుకు ఈసీ గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్కు భారీ ఊరట లభించింది. ఈ యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధు పంట పెట్టుబడి ఆర్థిక సాయాన్ని విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపింది. తదనుగుణంగా రైతుబంధు సాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో డీబీటీ పద్ధతిలో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధును గతంలోలాగా తక్కువ భూవిస్తీర్ణం ఉన్న రైతులకు మొదటగా ఇచ్చే పద్ధతిలో పంపిణీ చేసే ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపింది. అయితే ఈ నెల 25, 26, 27 తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉండగా ఈ నెల 29, 30 తేదీల్లో రైతుబంధు పంపిణీకి ఎన్నికల కమిషన్ అనుమతించలేదని వ్యవసాయ శాఖ పేర్కొంది. దీంతో ఎన్నికలకు ముందు కేవలం 28వ తేదీనే రైతుబంధు సొమ్ము పంపిణీకి వీలుంది. విడతలవారీగా పంపిణీ చేస్తామని వ్యవసాయ శాఖ ప్రకటించడంతో ఒకేరోజు రైతుబంధు సొమ్ము రైతులందరి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉండదని అధికారులు అంటున్నారు. రైతుబంధు ద్వారా ఈ యాసంగి సీజన్లో 70 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. -
Madhya Pradesh election 2023: రాష్ట్ర చరిత్రలోనే అత్యధికం
భోపాల్: మధ్యప్రదేశ్ శాసనసభకు ఈసారి జరిగిన ఎన్నికల్లో రికార్డుస్థాయిలో పోలింగ్ నమోదైంది. శుక్రవారం మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగ్గా 76.22 శాతం ఓటింగ్ నమోదైంది. 1956లో మధ్యప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డనాటి నుంచి చూస్తే ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇంతటి భారీ స్థాయిలో పోలింగ్ జరగడం ఇదే తొలిసారికావడం విశేషం. ఇంతకాలం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన 75.63 శాతమే అధికంగా ఉండేది. శుక్రవారం నాటి పోలింగ్ ఆనాటి రికార్డును తుడిచేసింది. మిగతా జిల్లాలతో పోలిస్తే సివానీ జిల్లాలో అత్యధికంగా 85.68 శాతం పోలింగ్ నమోదైంది. గిరిజనులు ఎక్కువగా ఉండే అలీరాజ్‌పూర్ జిల్లాలో అత్యల్పంగా 60.10 శాతం ఓటింగ్ నమోదైంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలతో సరిహద్దు పంచుకుంటున్న నక్సల్స్ ప్రభావిత బాలాఘాట్ జిల్లాలో 85.23 శాతం పోలింగ్ నమోదైంది. ఛత్తీస్‌గఢ్‌లో 76.31 శాతం ఈ నెల ఏడున, 17న రెండు విడతల్లో జరిగిన ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో 76.31 శాతం పోలింగ్ నమోదైందని శనివారం ఎన్నికల ఉన్నతాధికారి వెల్లడించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన 76.88 శాతం కంటే ఈసారి కాస్తంత తక్కువ పోలింగ్ నమోదైంది. కురుద్ నియోజకవర్గంలో ఏకంగా 90.17 శాతం పోలింగ్ నమోదైంది. బీజాపూర్ నియోజకవర్గంలో అత్యల్పంగా 48.37 శాతం పోలింగ్ నమోదైంది. -
ఈసీ వద్ద పొలిటికల్ యాడ్స్ పంచాయితీ
-
కాంగ్రెస్‌కు షాక్ రేవంత్ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు
-
TS: ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తైంది. నవంబర్ 3వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే నామినేషన్ల ప్రక్రియ మొదలుకాగా.. ఇవాళ మధ్యాహ్నాం 3 గం.తో అది ముగిసింది. ఇవాళ నామినేషన్ల దాఖలుకు చివరిరోజు కావడంతో ఆర్డీవో ఆఫీస్‌ల వద్ద అభ్యర్థుల కోలాహలం కనిపించింది. తెలంగాణలో నిన్న దాకా వరకు మొత్తం 2,474 నామినేషన్లు దాఖలు కాగా.. ఇవాళ చివరిరోజు వెయ్యికి పైగా నామినేషన్లు దాఖలై ఉంటాయని అంచనా. ఈ మధ్యలో నిన్న(నవంబర్ 9) ప్రముఖ నేతలు ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు వేశారు. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం.. ఈ నెల 13వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అభ్యర్థులు 15వ తేదీలోపు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. మరోవైపు బీ-ఫామ్ సబ్మిట్కు సైతం గడువు ముగిసింది. బీ-ఫామ్ సమర్పించని అభ్యర్థుల్ని స్వతంత్ర అభ్యర్థులుగా ప్రకటిస్తుంది ఎన్నికల సంఘం. అలాగే నామినేషన్ సమయంలో వందకు పైగా అభ్యర్థులు అఫిడవిట్లు సమర్పించలేదు. దీంతో వాళ్లకు రిటర్నింగ్ ఆఫీసర్లు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు 94 రాజకీయ పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి 2,644 నామినేషన్లు దాఖలయ్యాయి. తాజా గణాంకాల ప్రకారం.. ఈసారి నామినేషన్ల సంఖ్యే ఎక్కువే ఉండొచ్చని స్పష్టమవుతోంది. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది. తెలంగాణ ఏర్పడ్డాక జరుగుతున్న మూడో శాసనసభ ఎన్నికల్లో 3.17 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్ నిర్వహణ, ఫలితాల వెల్లడి ఉంటుంది. తెలంగాణ ఎన్నికల సమగ్ర సమాచారం కోసం క్లిక్ చేయండి -
తెలంగాణలో జనసేనకు షాక్ ఇచ్చిన ఈసీ
-
సీఎం కేసీఆర్ బస్సులో తనిఖీలు..
సాక్షి,కొత్తగూడెం: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్‌గా జరిగేందుకు ఎన్నికల కమిషన్ అన్ని చర్యలు తీసుకుంటోంది. ఎంతటివారి వాహనాన్ని అయినా అధికారులు ఆపి చెక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం కొత్తగూడెంలో బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభ కోసం వచ్చిన సీఎం కేసీఆర్ ప్రయాణించే ప్రగతిపథం వాహనాన్ని ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. ఇటీవలే మంత్రి కేటీఆర్‌తో పాటు హోం మంత్రి మహమూద్ అలీల వాహనాలను కూడా ఎన్నికల అధికారులు తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం వాహనం తనఖీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఏదైనా సమాచారం మేరకు సీఎం బస్సును తనిఖీ చేశారా రొటీన్ చెకింగ్‌లో భాగంగా చేశారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. -
పోలింగ్‌కు ముందే రాష్ట్ర సరిహద్దుల మూసివేత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల పోలింగ్ జరిగే నవంబర్ 30వ తేదీకి ముందే రాష్ట్ర సరిహద్దులను మూసివేసి బయటి రాష్ట్రాల నుంచి వ్యక్తులు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అధికారులను ఆదేశించారు. తెలంగాణతో సహా 5 రాష్ట్రాల్లో శాసనసభ సాధారణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలతో పాటు వాటి సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్...ఎన్నికల కమిషనర్లు ఏసీ పాండే, అరుణ్ గోయెల్‌తో కలిసి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ రాష్ట్ర సచివాలయం నుంచి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా ఉందని, శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని శాంతికుమారి వివరించారు. సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో సంప్రదింపులు జరిపి సరిహద్దు చెక్‌పోస్టును కట్టుదిట్టం చేశామని వివరించారు. నవంబర్ 28 నుంచి పోలింగ్ జరిగే 30 వరకు రాష్ట్రంలో డ్రై డేగా ప్రకటించామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రశాంతంగా ఉన్నాయని, సాధారణ నేర కార్యకలాపాలు కూడా తగ్గుముఖం పట్టాయని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. -
డిజిటల్ లావాదేవీలను మానిటరింగ్ చేస్తున్న ఎలక్షన్ కమిషన్
-
ధాన్యం టెండర్లకు ఈసీ బ్రేక్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని రైస్ మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని విక్రయించేందుకు ప్రభుత్వం రెండో దఫా పిలిచిన టెండర్లకు ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. గతేడాది యాసంగికి సంబంధించిన సుమారు 67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లుల్లో మూలుగుతోంది. ఈ ధాన్యాన్ని సీఎంఆర్ కింద మిల్లింగ్ చేసేందుకు మిల్లర్లు ముందుకు రాలేదు. దీంతోపాటు గత వానాకాలం ధాన్యం కూడా మిల్లుల్లో సీఎంఆర్ కింద మిల్లింగ్ జరు గుతోంది. మరోవారంలో కొత్త పంట మళ్లీ మార్కె ట్లోకి రానుంది. ఈ నేపథ్యంలో మిల్లుల్లోని ధాన్యా న్ని వదిలించుకునేందుకు ప్రభుత్వం తొలి విడత 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం విక్రయించాలని నిర్ణయించింది. ఆగస్టులో పిలిచిన టెండర్లకు తక్కువ మొత్తంతో బిడ్లు రావడంతో వాటిని రద్దు చేసిన సర్కార్ ఈనెల 7న నిబంధనలు సడలిస్తూ రెండోసారి బిడ్లను ఆహ్వానించింది. ఈనెల 17తో గడువు ముగిసినప్పటికీ 21వ తేదీ వరకు గడువు పెంచారు. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్న ప్పుడు, టెండర్ల ప్రక్రియ ఎలా జరుపుతారని కాంగ్రెస్ సీనియర్ నేత జి.నిరంజన్ ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈసీ తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు టెండర్లను పిలవొద్దని ఆదేశించింది. -
తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు ఈసీ సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు ఈసీ సన్నాహాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 15 లక్షల మంది ఓటర్లుగా చేరారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. 3.38 లక్షల మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించామని వెల్లడించారు. వచ్చే నెల 3,4,5 తేదీల్లో తెలంగాణలో కేంద్ర ఎన్నికల బృందం పర్యటిస్తుందని తెలిపారు. ఈ పర్యటనలో దాదాపు 20 ఏజెన్సీలతో సమావేశాలు ఉంటాయని వికాస్ రాజ్ స్పష్టం చేశారు. తుది ఓటర్ల జాబితా తర్వాత జిల్లాల్లో సిబ్బందికి శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఈవీఎంల చెకింగ్ జరుగుతోందని తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇప్పటికే రాజకీయ పార్టీలు అభ్యర్థుల జాబితాలను సిద్ధం చేసుకోవడంలో నిమగ్నమయ్యాయి. అధికారిక పార్టీ పూర్తి అభ్యర్థుల లిస్టును విడుదల చేసింది. కాంగ్రెస్, బీజేపీ కూడా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను ఖరారు చేస్తున్నాయి. ఇదీ చదవండి: మీడియా కాన్ఫరెన్స్‌లో కాంగ్రెస్ నేతల రచ్చ -
రాజకీయ నేతలకు అనుకూలంగానే పోలీసు బదిలీలు.. ట్రాన్స్‘ఫర్’పై ఈసీ దృష్టి!
సాక్షి, హైదరాబాద్: ఇటీవల పోలీస్‌శాఖలో భారీఎత్తున జరిగిన బదిలీలపై ఎన్నికల సంఘం (ఈసీ) దృష్టి పెట్టింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ లాంగ్ స్టాండింగ్‌గా వివిధ శాఖల్లో ఉన్న అధికారుల బది లీకి ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే పోలీస్‌శాఖ విషయానికి వచ్చేసరికి కొందరు రాజకీయనేతలు తమకు అనుకూలంగా మార్చుకున్నారనే విషయం ఈసీ దృష్టికొచ్చింది. ఇలా కొత్త స్థానాల్లోకి వచ్చిన వారితో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించడం సాధ్యం కాదనే భావనలో ఉంది. ఈ వ్యవహారంపై మాజీ ఐపీఎస్‌లతో పాటు నిఘావర్గాల ద్వారా సమాచారం సేకరిస్తోంది. ఎలక్షన్ షెడ్యూల్ తర్వాత కోడ్ అమలులోకి వస్తుంది. ఆపై ప్రస్తుతం జరిగిన బదిలీల్లో అనేక స్థానాలు ప్రక్షాళన చేయాలని ఈసీ భావిస్తున్నట్టు సమాచారం. ఈసారి గతానికి భిన్నంగా ఎందుకంటే... పోలీసు విభాగంలో బదిలీలు సర్వసాధారణం. నిర్ణీత కాలపరిమితితో బదిలీలు జరుగుతూనే ఉంటాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బదిలీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే ఈసారి గతానికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, ఒకే పోస్టులో లాంగ్ స్టాండింగ్‌లో ఉన్న అధికారులతోపాటు, భారీ సంఖ్యలో పదోన్నతుల నేపథ్యంలో నాన్‌కేడర్ ఎస్పీ నుంచి ఇన్స్పెక్టర్ వరకు భారీ సంఖ్యలో అధికారులకు స్థానచలనం తప్పలేదు. సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈసారి స్టేషన్ హౌస్ఆఫీసర్లుగా ఉండే ఎస్ఐ పోస్టుల నుంచి నాన్‌కేడర్ ఎస్పీల వరకు అన్నింటిలోనూ రాజకీయ నాయకుల ప్రమేయం ఎక్కువైంది. ఓ అధికారి సమర్థత ఆధారంగా కాకుండా ఆయనకు ఎక్కడ పోస్టింగ్ కావాలో అక్కడి రాజకీయ నాయకులు ఇచ్చే సిఫార్సుల ఆధారంగా పోస్టింగ్ లభించింది. ఫోకల్ పోస్టులుగా పిలిచే శాంతిభద్రతల విభాగంతోపాటు మరికొన్ని కీలక వింగ్స్‌లో ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని పోస్టుల్లో బదిలీల బంతాట తమ సామాజికవర్గం కాదనో, విధేయులుగా ఉండరనో, ముక్కుసూటి అధికారులని భావించిన వారి బదిలీల విషయంలో బంతాట తప్పలేదు. పోస్టింగ్ వచి్చనవారు, ఆ పోస్టులో చేరకుండా, చేరినా ఆ సీట్లలో కూర్చోకుండా, కూర్చున్నా ఒక్కరోజు కూడా విధులు నిర్వర్తించకుండా అన్ని ప్రయత్నాలు చేశారు. పెద్దస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి తమకు అనుకూలమైన వారికి పోస్టింగ్ ఇప్పిస్తూ కొత్తగా వచి్చన అధికారులూ బదిలీ అయ్యేలా చేసి తమ పంతం నెగ్గించుకున్నారు. ప్రత్యేక బృందాలతో వివరాల సేకరణ రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే గత నెలలో హైదరాబాద్‌కు వచి్చన ఎన్నికల సంఘం అధికారులు పోలీసు సహా వివిధ విభాగాలతో భేటీ అయ్యారు. పోలీస్‌శాఖలో రాజకీయ నేతల సమ్మతి, సిఫార్సు ఆధారంగా పోస్టుల్లోకి వచి్చన వారి ప్రభావం ఎన్నికల ప్రక్రియపై ఉంటుందని ఈసీ గుర్తించింది. దీనిపై వివరాలు సేకరించడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపనున్నట్టు తెలిసింది. వీటిలో మాజీ ఐపీఎస్ అధికారులతో పాటు నిఘా వర్గాలకు చెందిన వారు ఉంటారని సమాచారం. రాష్ట్రంలో వివాదాస్పదమైన బదిలీల్లో కొన్ని... – మహబూబాబాద్ జిల్లాలోని ఓ డివిజన్లో ముగ్గురు డీఎస్పీలు నాలుగుసార్లు బదిలీ అయ్యారు. ఇవి కేవలం పక్షం రోజుల వ్యవధిలో చోటు చేసుకున్నాయి. – నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ డీఎస్పీ పోస్టింగ్ వివాదాస్పదమైంది. అక్కడకు వచ్చిన అధికారిని కొన్ని రోజుల్లో మార్చేశారు. ఆయన స్థానంలో అక్కడే ఇన్స్పెక్టర్గా పనిచేసి, ఇటీవలే పదోన్నతి పొంది, రేంజ్‌కు వెళ్లిన అధికారిని తీసుకొచ్చారు. – నిజామాబాద్ జిల్లాలో ఓ అధికారి ఏడాది క్రితమే డీఎస్పీగా ఓ డివిజన్లో చేరారు. స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్ పర్సన్ మధ్య విభేదాలతో ఈయన బదిలీ అయ్యారు. దీంతో ఎమ్మెల్యే పట్టుపట్టి మరీ తనకు అనుకూలమైన పాత అధికారినే తెచ్చుకున్నారు. – హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో ఎస్ఐ నుంచి ఏసీపీ వరకు అనేక పోస్టింగులు వివాదాస్పదమయ్యాయి. హైదరాబాద్‌లోని ఓ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించిన ఇన్స్పెక్టర్ రాజకీయ ఒత్తిళ్లతో విధులు నిర్వర్తించలేకపోయారు. చివరకు ఈయన బదిలీ కాగా, నేతలను అనుకూలమైన వ్యక్తికే పోస్టింగ్ వచ్చింది. – వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ఓ ఠాణా ఇన్స్పెక్టర్గా పనిచేసిన అధికారి తన పలుకుబడితే అదే సబ్‌డివిజన్‌లోని మరో పోలీస్‌స్టేషన్‌కు మారారు. స్థానిక నేతల అండదండలతోనే ఇది సాధ్యమైందని తెలుస్తోంది. -
జనసేన బి ఫారం చెల్లదట..!
-
ఏపీలో బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ గుర్తింపు ఉపసంహరణ
సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ గుర్తింపు తొలగించింది కేంద్ర ఎన్నికల సంఘం. 2014, 2019 ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడంతో ఆ పార్టీ గుర్తింపును ఉప సంహరించింది. ఇక పాండిచ్చేరిలో పీఎంకే, వెస్ట్ బెంగాల్లోలో ఆర్ఎస్పీల రాష్ట్ర గుర్తింపులను రద్దు చేసింది. అయితే యూపీలో ఆర్ఎల్డీకి మాత్రం రాష్ట్ర పార్టీ గుర్తింపు ఇచ్చింది ఈసీ. కాగా, ఆప్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదాను కల్పించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇదే సమయంలో మరో మూడు జాతీయ హోదా కలిగిన పార్టీలకు షాకిచ్చింది. తృణముల్ కాంగ్రెస్(టీఎంసీ), నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ), సీపీఐకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ మూడు పార్టీలు జాతీయ హోదాను కోల్పోయాయి. ఇక, ఏపీలో బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ గుర్తింపును ఈసీ తొలగించింది. అయితే, 2012లో స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ.. మొదట ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించింది. అనంతరం.. పలు రాష్ట్రాల్లో ఎన్నికల బరిలో దిగుతూ పంజాబ్‌లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలాగే, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ క్రమంలో గుజరాత్లో ఐదు అసెంబ్లీ స్థానాలు, 12 శాతం ఓట్లు సాధించి జాతీయ పార్టీకి కావాల్సిన అర్హత సాధించింది. -
..‘ఎస్ సర్’లే సీఈసీలా?!
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు బుధవారం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పలు కీలక సందేహాలు లేవనెత్తింది. ‘‘కేంద్రంలో అధికారంలో ఉండే ప్రతి పార్టీ ఎలాగోలా దాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోవాలని భావిస్తుంది. అందుకోసం అన్ని విషయాల్లోనూ తను చెప్పిన దానికి ‘ఎస్ సర్’ అనేవారినే సీఈసీగా నియమించుకునే ఆస్కారముంది’’ అని పేర్కొంది. ప్రస్తుత నియామక వ్యవస్థ అందుకు వీలు కల్పిస్తోందంటూ న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆక్షేపించింది. ఓవైపు ఈ అంశంపై తమ విచారణ కొనసాగుతుండగానే ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్‌ను ఎలా నియమిస్తారని కేంద్రాన్ని ప్రశ్నించింది. దీని వెనక వేరే రహస్య ఉద్దేశాలేమీ లేవు కదా అంటూ నిలదీసింది. ‘‘సీఈసీ, ఈసీల నియామక ప్రక్రియపై దాఖలైన పిటిషన్లపై గత గురువారం నుంచి మేం విచారణ జరుపుతున్నాం. ఓవైపు అది కొనసాగుతుండగానే కేంద్ర సర్వీసులో కొనసాగుతున్న ఐఏఎస్ అధికారిని ముందస్తుగా రిటైర్ చేయించి మరీ ఈసీగా ఎందుకు నియమించాల్సి వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నాం. గోయల్ నియామక ఫైలును పరిశీలన నిమిత్తం మాకు సమర్పించండి’’ అని కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్ఆర్.వెంకటరమణి ఇందుకు తీవ్రంగా అభ్యంతరాలు వెలిబుచ్చినా వాటిని తోసిపుచ్చింది. ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ హృషీకేశ్ రాయ్, జస్టిస్ సి.టి.రవికుమార్ సభ్యులుగా ఉన్నారు. ఈసీలు, సీఈసీ నియామకాలకు కొలీజియం తరహా వ్యవస్థ ఉండాలంటూ దాఖలైన పిటిషన్లపై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు మంగళవారం వాదనలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అవి బుధవారం రోజంతా కొనసాగాయి. కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకోవాలంటే అందులోకి నియామకాలను తొలి దశలోనే పూర్తిస్థాయిలో తనిఖీ చేసే వ్యవస్థ ఉండాలని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ అంశంపై ధర్మాసనానికి, కేంద్రం తరఫున వాదించిన ఏజీ వెంకటరమణికి మధ్య సుదీర్ఘ వాదోపవాదాలు జరిగాయి. ఈసీ స్వతంత్ర ప్రతిపత్తికి 1991 నాటి చట్టం పూర్తి రక్షణ కల్పిస్తోందని ఏజీ వాదించారు. ‘దినేశ్ గోస్వామి కమిటీ నివేదిక ఆధారంగా పార్లమెంటు ఆమోదించిన చట్టమిది. కాబట్టి దాని రూపకల్పన వెనక సరైన ఆలోచన చేయలేదని చెప్పలేం. సీఈసీ, ఈసీల జీతభత్యాలు, పదవీకాలం తదితరాలన్నింటికీ రాజ్యాంగపరమైన రక్షణ ఉంది. కనుక ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరమేదీ లేదు’’ అని స్పష్టం చేశారు. ‘‘కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శి స్థాయిల్లో ఉన్న అధికారులను ఎలక్షన్ కమిషనర్లుగా నియమించడం ఆనవాయితీగా వస్తోంది. అమల్లో ఉన్న విధానం ప్రకారం వారిలో సీనియర్ అధికారి సీఈసీగా నియమితులవుతారు’’ అని వివరించారు. ‘‘మేం ఆనవాయితీని పాటిస్తున్నాం. అలాగాకుండా సీఈసీ నియామకానికి జాతీయ స్థాయిలో ఎన్నికలు పెట్డం సాధ్యం కాదు’’ అన్నారు. ఈ వ్యవస్థ సరిగా పని చేయడం లేదని చెప్పడం తమ ఉద్దేశం కాదని ధర్మాసనం పేర్కొంది. అందుకు పారదర్శక వ్యవస్థ ఉండాలన్నది మాత్రమే తమ ఉద్దేశమని స్పష్టం చేసింది. ‘‘కేంద్రం ఒకవేళ తమ భావజాలమే ఉన్న, తాము చెప్పిన దానికల్లా తలూపే వ్యక్తిని సీఈసీగా నియమిస్తే? అందుకే సీఈసీ నియామక ప్రక్రియపై మేం మరింతంగా దృష్టి సారించాలనుకుంటున్నాం. అందులో సీజేఐనీ చేరిస్తే బాగుంటుంది’’ అని పేర్కొంది. గోయల్‌పై వాదోపవాదాలు ఈసీగా గోయల్ నియామకంపై వాడివేడి వాదనలు సాగాయి. ఓవైపు ఈ కేసులో విచారణ జరుగుతుండగానే కేంద్రం హడావుడిగా ఆయనను నియమించిందని పిటిషనర్ అనూప్ బరన్వాల్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ‘‘గోయల్ గురువారం దాకా కేంద్రంలో కార్యదర్శి స్థాయి అధికారిగా కొనసాగారు. ఉన్నట్టుండి ఆయనకు వీఆర్ఎస్ ఇచ్చి శుక్రవారానికల్లా ఈసీగా నియమించారు’’ అని గుర్తు చేశారు. తనకు తెలిసినంత వరకూ వీఆర్ఎస్ ఆమోదానికి మూడు నెలలు పడుతుందని జస్టిస్ జోసెఫ్ అన్నారు. గోయల్ ఆయన నియామక ఫైలును సమర్పించాలన్న ఆదేశించారు. దీనిపై ఏజీ తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. ‘‘విచారణ జరుగుతున్నది ఈసీలు, సీఈసీ నియామకాలకు సంబంధించిన విస్తృతమైన అంశం మీద. అలాంటప్పుడు ప్రశాంత్ భూషణ్ తెరపైకి తెచ్చిన ఈ వ్యక్తిగత నియామకాన్ని ఎలా పరిశీలనకు తీసుకుంటారు? దీనికి నేను తీవ్రంగా అభ్యంతరం తెలుపుతున్నా. విచారణ మధ్యలో ఇలా నియామక ఫైలును కోర్టు చూడటంపై చాలా అభ్యంతరాలున్నాయి’’ అన్నారు. వాటిని ధర్మాసనం తోసిపుచ్చింది. ‘‘మేం విచారణ మొదలు పెట్టిన తర్వాత నవంబర్ 19న గోయల్ నియామకం జరిగింది. దానికి కారణమేమిటో తెలుసుకోవడానికే ఫైలు చూడాలనుకుంటున్నాం. నియామకం పూర్తిగా నిబంధనలకు లోబడే జరిగిందని మీరంటున్నారు. దాన్నే మేం పరిశీలించదలచాం. నియామకంలో అక్రమాలేవీ జరగని పక్షంలో మీరు భయపడాల్సిందేముంది? రేపట్లోగా సంబంధిత ఫైలును మా ముందుంచాల్సిందే’’ అని స్పష్టం చేసింది. ‘‘ఫైలును సమర్పిస్తారా, లేదా? దాన్ని బయట పెట్టొద్దనుకుంటుంటే అదే విషయం చెప్పండి. మీరు (ఏజీ) గనక బిజీగా ఉంటే ఫైలును మాకు సమర్పించాల్సిందిగా ఇంకెవరికైనా పురమాయించండి’’ అని జస్టిస్ జోసెఫ్ అన్నారు. ఈసీగా మంగళవారం బాధ్యతలు చేపట్టిన గోయల్ 2025లో రాజీవ్‌కుమార్ రిటైర్మెంట్ అనంతరం సీఈసీ కానున్నారు. ఆయన కేంద్ర భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా డిసెంబర్ 31 దాకా పదవిలో కొనసాగాల్సి ఉండగా ముందస్తు రిటైర్మెంట్ తీసుకున్నారు. మనకిప్పుడో శేషన్ కావాలి! సీఈసీ, ఈసీల నియామకం విషయంలో రాజ్యాంగం మౌనాన్ని ప్రభుత్వాలు తమకు అనుకూలంగా దుర్వినియోగం చేసుకుంటూ వస్తున్నాయంటూ మంగళవారం విచారణ సందర్భంగా ధర్మాసనం అసహనం వెలిబుచ్చడం తెలిసిందే. ఇదో అవాంఛిత పోకడ అంటూ ఆక్షేపించింది. వారి నియామకానికి ఎలాంటి ప్రక్రియనూ ఆర్టికల్ 324 నిర్దేశించని విషయాన్ని గుర్తు చేసింది. ఇందుకోసం చట్టం చేయాలని రాజ్యాంగం నిర్దేశించినా 72 ఏళ్లుగా ఆ పని చేయలేదంటూ తప్పుబట్టింది. ‘‘2004 నుంచి ఒక్క సీఈసీ కూడా ఆరేళ్ల పదవీకాలం పూర్తి చేసుకోలేదు. ఇక పదేళ్ల యూపీఏ పాలనలో ఏకంగా ఆరుగురు సీఈసీలు మారారు. ప్రస్తుత ఎన్డీఏ ఎనిమిదేళ్ల పాలనలో ఏకంగా 8 మంది మారారు’’ అంటూ ఆక్షేపించింది. గట్టి వ్యక్తిత్వమున్న టి.ఎన్.శేషన్ వంటివారు సీఈసీగా రావాలని తాము కోరుకుంటున్నట్టు స్పష్టం చేసింది. ప్రధానిపై ఆరోపణలొస్తే.. సీఈసీ చర్యలు తీసుకోగలరా? ప్రధాని స్థాయి వ్యక్తితో సీఈసీ తలపడాల్సిన పరిస్థితి తలెత్తితే? అందుకాయన సిద్ధపడతారా, ససేమిరా అంటారా? మీకేమనిపిస్తోంది? ప్రధానిపై సీఈసీ చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే... ఆయన ఏ చర్యలూ తీసుకోలేదనుకుందాం. అప్పుడది వ్యవస్థ పూర్తిగా కుప్పకూలినట్టు కాదా? అందుకే సీఈసీకి రాజకీయ ప్రభావం నుంచి సంపూర్ణ రక్షణ తప్పనిసరి. – సుప్రీంకోర్టు ధర్మాసనం సీఈసీ, ఈసీలను పార్టీల ప్రభావం నుంచి దూరంగా ఉంచాలి. అప్పుడే వాళ్లు స్వతంత్రంగా పని చేయగలరు. ఇది జరగాలంటే సీఈసీ ఎంపికలో భారత ప్రధాన న్యాయమూర్తిని కూడా భాగస్వామిని చేయాలి. అప్పుడే కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తిని నిలుపుకుంటూ ఒత్తిళ్లకు అతీతంగా బాధ్యతలు నెరవేర్చగలుగుతుంది. – సుప్రీం ధర్మాసనం -
Election Commissioner: నచ్చినవాడికి ఇచ్చేద్దామా?
నిష్పక్షపాతంగా వ్యవహరించడమే కాదు, వ్యవహరించినట్టు కనిపించడం కూడా అంతే ముఖ్యం. కానీ, ప్రజాస్వామ్యానికి పునాది లాంటి ఎన్నికలు, వాటిని నిర్వహిస్తున్న మన ఎన్నికల వ్యవస్థ అలానే ఉన్నాయా? ఎన్నికల సంఘానికి పెద్ద అయిన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఇతర ఎన్నికల కమిషనర్ల (ఈసీల) నియామక ప్రక్రియ నిష్పాక్షికంగా, న్యాయబద్ధంగా జరుగుతోందా? దేశ సర్వోన్నత న్యాయస్థానం మంగళ, బుధవారాల్లో అన్న మాటలు, అడిగిన ఫైళ్ళు చూశాక సహజంగానే ఈ ప్రశ్నలు అడగాల్సినవే అనిపిస్తాయి. సీఈసీ, ఈసీల వ్యవస్థ రాజకీయ, ప్రభుత్వ జోక్యాలకు అతీతంగా ఉండేలా చూడాలంటూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ జోసెఫ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యలు ఆలోచన రేపుతున్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ లాంటి చోట్ల కూడా ఎన్నికల సంఘ నియామకాలు, చట్టాలు పారదర్శకంగా ఉంటే 72 ఏళ్ళ తర్వాతా మన వద్ద ఆ పరిస్థితి లేకపోవడం విషాదమే. ఈ నెల 18న స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి అరుణ్ గోయెల్‌ను ఆ వెంటనే 19వ తేదీన ఎన్నికల కమిషనర్‌గా ప్రభుత్వ పెద్దలు నియమించడం సైతం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మామూలుగా అయితే, ఈ ఏడాది ఆఖరుకు రిటైరవ్వాల్సిన వ్యక్తికి హఠాత్తుగా స్వచ్ఛంద పదవీ విరమణ ఇచ్చి, ఇలా ఎన్నికల సంఘంలో నియుక్తం చేయడంలో అంతా సవ్యంగానే జరిగిందా అన్నది ప్రశ్న. అది తెలుసుకొనేందుకే సుప్రీమ్ కోర్ట్ ఇప్పుడు అరుణ్ గోయెల్ నియామకం సహా నిర్ణీత ఫైళ్ళను పంపాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరడం గమనార్హం. అధికార పార్టీలు తమకు నచ్చిన ప్రభుత్వ ఉన్నతాధికారులను సీనియారిటీ ప్రాతిపదికన ఎన్నికల కమిషనర్లుగా నియమిస్తున్న విధానం తప్పనేది ప్రాథమికంగా పిటిషనర్ల వాదన. సీఈసీల నియామకంలోనూ కొలీజియమ్ తరహా విధానాన్ని పాటించాలని అభ్యర్థన. ఎన్నికల కమిషనర్ల నియామకం పూర్తిగా పాలకుల ఇష్టారాజ్యమైందన్నది చేదు నిజం. సుప్రీమ్ అన్నట్టు – క్యాబినెట్ నియమించిన సీఈసీ, ఈసీలు ఏ ప్రధానమంత్రి స్థాయి వ్యక్తికో వ్యతిరేకంగా నోరు విప్పగలరా అన్నది అనుమానమే. గణాంకాలు చూస్తే రాజ్యాంగం అమలులోకి వచ్చాక తొలి 46 ఏళ్ళలో (1950 –1996) సీఈసీగా వ్యవహరించింది పట్టుమని పది మందే! ఆ తర్వాత గత 26 ఏళ్ళలో ఇప్పటికి 15 మంది వచ్చారు, పోయారని కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. 2004 తర్వాత ఏ ఒక్కరూ పూర్తి ఆరేళ్ళ పదవీకాలం లేరు. కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ సారథ్య యూపీఏ అయినా, బీజేపీ నేతృత్వ ఎన్డీఏ అయినా ఇదే దుఃస్థితి. స్వల్పకాలమే ఉంటున్న ఈ ఎన్నికల పెద్దలు అనుకున్నది చేయగలరా? ఏ మేరకు స్వతంత్రంగా వ్యవహరించగలరు? సుప్రీమ్ ప్రశ్న కూడా ఇదే! దేశంలో తొలిసారిగా ఎన్నికల సంఘం గురించి సామాన్యులకు తెలిసింది – ఎన్నికల కమిష నర్గా శేషన్ సంస్కరణలు సాగించిన కాలంలోనే. ఇవాళ్టి ఓటర్ గుర్తింపుకార్డులు, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రవేశపెట్టిందీ ఆయనే. శేషన్ తర్వాత లింగ్డో లాంటి కొందరు నిర్భయంగా ఎన్నికల సంఘం అధికారాలను వినియోగించినా, గత దశాబ్దిన్నరలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎక్కడా ఎన్నికల వ్యయంపై నియంత్రణ లేకుండా పోయింది. ఇటీవలి మునుగోడు ఉప ఎన్నిక సహా అనేకచోట్ల మద్యం ఏరులై పారుతూ, కోట్లకొద్దీ నోట్ల కట్టలు తెగుతూ, ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతున్నా, ఎన్నికల సంఘం చేష్టలుడిగి చూస్తోంది. శేషన్ నాటికీ, నేటికీ అధికా రాల్లో మార్పు లేకపోయినా అంకితభావంలో మార్పు వచ్చింది. పదవీప్రసాద ప్రభుభక్తి పెరిగింది. రాజ్యాంగంలోని 324వ అధికరణం ఈసీల నియామక ప్రక్రియను వివరించలేదు. దానిపై పార్లమెంట్ చట్టం చేస్తుందని భావించింది. ఇన్నేళ్ళుగా అది జరగలేదు. తాజా కేసులోనూ సర్కారు 1991 నాటి చట్టాన్నీ, అలాగే రాష్ట్రపతికి ప్రధాని సారథ్యంలోని మంత్రివర్గ సిఫార్సుల పైనే నియా మకాలు జరుగుతున్న పూర్వోదాహరణల్నీ అడ్డుపెట్టుకుంటోంది. లా కమిషన్ సైతం కొలీజియమ్, లేదా ప్రధాని, ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన సెలక్షన్ కమిటీయే ఈసీలం దర్నీ నియమించాలని 2015 నివేదికలో పేర్కొంది. కొలీజియమా, కమిటీయా అన్నది పక్కన పెడితే ఈసీల నియామక ప్రక్రియలో తక్షణ సంస్కరణలు అవసరం. అయితే, దీనికి పార్లమెంట్ ఆమోదంతో రాజ్యాంగ సవరణ చేయాలి. అందుకు మన పాలకులెంత సిద్ధం ఉంటారో చెప్పలేం. అసలైనా అధికారంలోని వారి అభీష్టమైన ఈసీల నియామకంపై జడ్జీలు జోక్యం చేసుకోవడమే మిటనేది ప్రభుత్వ అనుకూల వర్గాల వాదన. ధర్మాన్ని నిలబెట్టాల్సిన న్యాయవ్యవస్థ సైతం దృష్టి సారించరాదంటే తప్పొప్పులు దిద్దేదెవరు? రాష్ట్ర విభజన జరిగాక ఏపీకి తొలి ఈసీగా నియుక్తులైన నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ లాంటి వారు బాధ్యత మరిచి, పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించడం తాజా ఉదాహరణే. ఇక, ఈసీల నియామకంపై వ్యాఖ్యానించిన సుప్రీమ్ తన సొంత జడ్జీల నియామక ప్రక్రియపై విమర్శలకు స్పందించదేమన్నది కొందరి విమర్శ. కొలీజియమ్ వ్యవస్థ ఆసరాగా ప్రధాన న్యాయమూర్తులు మెచ్చినవారినే జడ్జీలుగా నియమిస్తున్నారనీ, ఈ నియామకాల్లో పారద ర్శకత లేదనీ ఆరోపణ. న్యాయశాఖ మంత్రీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిజం చెప్పాలంటే, ఎన్నికల సంఘంలోనైనా, న్యాయవ్యవస్థలోనైనా నియామకాలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరపాలి. తటస్థ వ్యవస్థలుంటేనే విశ్వాసం బలపడుతుంది. ప్రజాస్వామ్య పరిపుష్టి సాధ్యమవుతుంది. -
ఈనెల 6న కౌంటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నాం : రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్
-
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆలస్యానికి కారణం అదే ..
-
మునుగోడు ఉపఎన్నికపై ఈసీ డేగ కన్ను
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికను సజావుగా నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. రేపటి పోలింగ్‌పై ఈసీ డేగ కన్ను వేసింది. హైదరాబాద్ ఎన్నికల కమిషన్ ఆఫీస్‌లో వెబ్ కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేశారు. 298 కేంద్రాల్లో సీసీ కెమెరాలతో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. పోలింగ్ సరళిని దగ్గరుండి ఎన్నికల ప్రధానాధికారి పర్యవేక్షించనున్నారు. ఎలాంటి సమస్య వచ్చిన తక్షణం స్పందించేలా ఏర్పాట్లు చేశారు. ఈవీఎంలలో టెక్నికల్ సమస్యలు వెంటనే తొలగించేలా టెక్నికల్ టీమ్‌ను అధికారులు అప్రమత్తం చేశారు. ఉప ఎన్నికకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. రేపు ఉదయం 6 గంటలకే మాక్ పోలింగ్ జరుగుతుందన్నారు. ప్రలోభాలు జరగకుండా ప్రతి గ్రామంలో తనిఖీలు చేపట్టామన్నారు. ఇప్పటివరకురూ.8 కోట్లు సీజ్ చేశామన్నారు. చదవండి: లెక్క తప్పొద్దు.. పట్టు వీడొద్దు.. టీఆర్ఎస్ నేతలకు అధిష్టానం ఆదేశం -
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఊరట..
-
తెలంగాణాలో బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు : తరుణ్ చుగ్
-
ఫార్మ్ హౌస్ హైడ్రామాపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు
-
నేడు గుజరాత్ , హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ షెడ్యూల్ విడుదల
-
బోగస్ ఓటర్లను చేర్చేందుకు టీఆర్ఎస్ ప్రయత్నం: తరుణ్ చుగ్
న్యూఢిల్లీ: మునుగోడు ఉప ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో అధికార, విపక్ష పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఈ క్రమంలో కొత్తగా నమోదైన ఓట్లపై అనుమానాలు వ్యక్తం చేసింది బీజేపీ. ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించగా.. ఇప్పుడు కొత్త ఓట్లను పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ బృందం ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు బీజేపీ తెలంగాణ ఇంఛార్జ్ తరుణ్ చుగ్. కొత్తగా చేరిన ఓటర్లను పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు చెప్పారు. ‘మునుగోడులో రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. కొత్తగా చేరిన ఓటర్లను పరిశీలించాలని ఈసీని కోరాం. స్వల్ప వ్యవధిలో 25వేల కొత్త ఓట్లు ఎలా వచ్చాయి? బోగస్ ఓటర్లను చేర్పించేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.’ అని ప్రభుత్వం, టీఆర్ఎస్పై ఆరోపణలు గుప్పించారు తరుణ్ చుగ్. ఇదీ చదవండి: రెండు నెలల్లో ఇన్ని దరఖాస్తులా? మునుగోడు ఓటర్ల జాబితాను సమర్పించాలని ఈసీకి హైకోర్టు ఆదేశం -
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై ఈసీకి పిర్యాదు
-
President Election Schedule 2022: రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్.... ఎప్పుడంటే..!
-
ఆప్ స్వీప్‌కి భయపడే బీజేపీ ఈసీకి లేఖ రాసింది
న్యూఢిల్లీ: ఆప్ స్వీప్‌కు భయపడి కేంద్రం ఒత్తిడి చేయడంతోనే ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల తేదీలను వాయిదా వేసిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. అంతేకాదు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ల (ఎంసీడీ) ఎన్నికల తేదీల ప్రకటనను వాయిదా వేయడం దేశ ప్రజాస్వామ్యానికే ముప్పు అని కేజ్రీవాల్ అన్నారు. కేంద్రం రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం ఇదే తొలిసారని చెప్పారు. ఇది రాజ్యాంగ విరుద్ధం అని అన్నారు. మూడు మునిసిపల్ కార్పొరేషన్లను ( నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, సౌత్ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్, తూర్పు ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్లను) కలపాలని కోరుతున్నందున ఎన్నికలను వాయిదా వేయాలని కేంద్రం ఈసీకి లేఖ రాయండంతోనే ఎన్నికలు వాయిదా పడ్డాయని చెప్పారు. గత ఏడెనిమదేళ్లుగా కేంద్రంలోనే ఉన్న బీజేపీ ఎన్నడూ ఈ మూడు కార్పొరేషన్లను ఎందుకు కలపలేదని ప్రశ్నించారు. కేవలం ఒక గంట ముందు ఈ మూడు కార్పోరేషన్లు కలపాలంటూ లేఖ రాయడం ఏమిటి అని ఆక్రోశించారు. మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలను వాయిదా వేయాలని కేంద్రం కోరడం ప్రజాస్వామ్యానిక మంచిది కాదని హితవు పలికారు. అయినా అలాంటి ఒత్తిడికి ఈసీ తలవంచకూడదని అన్నారు. "ఎన్నికలను రద్దు చేయవద్దని నేను ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఎన్నికల సంఘాన్ని బలహీనపర్చడమే కాక దేశాన్ని కూడా బలహీనపరుస్తుంది" అని కేజ్రీవాల్ అన్నారు. (చదవండి: ఫలితాలపై మోదీ కీలక వ్యాఖ్యలు.. సాహెబ్ జీ అంటూ కౌంటర్ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్) -
ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికిన బీజేపీ మంత్రి కొడుకు.. వీడియో వైరల్
లక్నో: ఎన్నికలంటే చాలు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు గెలుపు కోసం నానాతంటాలు పడుతుంటారు. అయితే ఈ క్రమంలో కొందరు మాత్రం ఎన్నికల నియమాలను దాటి ప్రవర్తిస్తూ అడ్డంగా బుక్కవుతుంటారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ మంత్రి కొడుకు ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో.. త్వరలో యూపీ రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ( చదవండి: Anand Mahindra: మహీంద్రా షోరూంలో రైతుకు ఘోరఅవమానం.. ఎట్టకేలకు స్పందించిన ఆనంద్ మహీంద్రా ) ఇప్పటికే ఆ రాష్ట్రంలో ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్నాయి. ఇదిలా ఉండగా యూపీ మంత్రి, శిఖర్పూర్ స్థానం అభ్యర్థి అనిల్ శర్మ కుమారుడు ప్రజలకు డబ్బు పంచుతున్నట్లు వీడియో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి 24 గంటల్లో సదరు మంత్రిని ఈ ఘటనపై వివరణ కోరారు. ఆ వీడియోలో శర్మ కుమారుడు కుష్ తన వాహనం దగ్గర డ్రమ్ బీట్ల శబ్దాల మధ్య ప్రజలకు 100 రూపాయల నోట్లను పంచుతూ కనిపించాడు. ఎన్నికల నియమావళిని స్పష్టంగా ఉల్లంఘించినట్లు స్పష్టంగా కనిపిస్తోందని, 24 గంటల్లో మంత్రిని వ్రాతపూర్వక వివరణ కోరుతూ రిటర్నింగ్ అధికారి మంత్రికి నోటీసులు జారీ చేశారు. -
ఎన్నికల తేదీలను ప్రకటించనున్న ఈసీ
-
ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ ఎన్నికల సంగం గ్రీన్ సిగ్నల్
-
ఎన్నికల కమిషన్‌ను రద్దు చేసిన తాలిబన్లు
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్ ఎన్నికల కమిషన్‌ను తాలిబన్ల ప్రభుత్వం రద్దు చేసింది. స్వతంత్ర ఎన్నికల కమిషన్, ఎన్నికల ఫిర్యాదుల కమిషన్‌ను రద్దు చేస్తున్నట్లు తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి (డిప్యూటీ) బిలాల్ కరీమి ఆదివారం వెల్లడించారు. ప్రస్తుత తరుణంలో అఫ్గాన్‌లో ఈ వ్యవస్థలు అనవసరం. భవిష్యత్తులో అవసరమైతే వీటిని పునరుద్ధరిస్తాం’ అని తెలిపారు. అలాగే పార్లమెంటరీ వ్యవహారాల శాఖను, శాంతి స్థాపన మంత్రిత్వ శాఖలనూ మూసివేస్తున్నట్లు బిలాల్ తెలిపారు. -
దళిత బంధు నిలుపుదలపై తెలంగాణ హైకోర్టులో పిల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళిత బంధు పథకం నిలుపుదలపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. సామాజికవేత్త మల్లేపల్లి లక్ష్మయ్య కోర్టులో ఈ పిల్ దాఖలు చేశారు. కాగా హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో దళిత బంధు ఆపాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ లక్ష్మయ్య పిల్ వేశారు. పిల్లో.. ప్రభుత్వ పథకాలు అన్ని అమలు అవుతున్నప్పుడు కేవలం దళిత బంధును మాత్రమే ఆపాలని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చిందని, కనుక దళిత బంధు పథకాన్ని యధావిధిగా అమలయ్యేలా చూడాలని పిటిషనర్ పేర్కొన్నారు. చదవండి: వెలుగులోకి మాజీ ఎమ్మెల్యే కొడుకు, ట్రైనీ ఐఏఎస్ నిర్వాకం.. -
బీజేపీ నేతలపై ఈసీ కొరడా, ప్రచారంపై ఆంక్షలు
న్యూఢిల్లీ: ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ బీజేపీ నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకుగానూ ఎన్నికల కమిషన్ మంగళవారం వారిపై చర్యలు తీసుకుంది. బీజేపీ నేత రాహుల్ సిన్హాపై 48 గంటల నిషేధాన్ని విధించింది. ఆ సమయం పూర్తయ్యేవరకు ప్రచారంలో పాల్గొనరాదని స్పష్టం చేసింది. మరోవైపు బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలకుగానూ నోటీసులు ఇచ్చింది. నందిగ్రామ్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సువేందు అధికారికి సైతం నోరు అదుపులో పెట్టుకోవాలంటూ హెచ్చరిక చేసింది. ఎన్నికల ప్రచారాల్లో వీరు చేసిన వ్యాఖ్యలకుగానూ ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. ముఖ్యమంత్రి మమతాపై సైతం ఎన్నికల కమిషన్ 24 గంటల నిషేధం విధిస్తున్నట్లు సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. బీజేపీ నేత సువేందు అధికారి ఓ చోట ఎన్నికల ప్రచారంలో.. బేగమ్‌కు ఓటేస్తే మినీ పాకిస్తాన్ ఏర్పాటవుతుందంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఈసీ స్పందిస్తూ.. ఇలాంటి వ్యాఖ్య మళ్లీ చేయరాదని హెచ్చరించింది. మరోవైపు బీజేపీ నేత రాహుల్ సిన్హా చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న ఎన్నికల కమిషన్ ఆయనకు నోటీసులు ఇవ్వకుండానే నిషేధం ప్రకటించింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఆ చర్య తీసుకుంటున్నట్లు వెల్లడించింది. సిన్హాపై మంగళవారం మధ్యాహ్నం 12 నుంచి ఏప్రిల్ 15న మధ్యాహ్నం 12 గంటల వరకూ నిషేధం ఉంటుందని పేర్కొంది. మరోవైపు బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలపై టీఎంసీ ఫిర్యాదు చేయడంతో, బుధవారం ఉదయంకల్లా వివరణ ఇవ్వాల్సిందిగా దిలీప్‌ను ఈసీ ఆదేశించింది. ( చదవండి: మారణహోమం.. బీజేపీ కుట్ర ) -
ప్రభుత్వ ఉద్యోగులకు ఈసీ బాధ్యతలొద్దు
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగులను ఎన్నికల కమిషనర్లుగా నియమించొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా అదనపు బాధ్యతలు ఒక ప్రభుత్వ అధికారికి అప్పగించడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని వ్యాఖ్యానించింది. మార్గోవా, మాపుసా, మార్ముగోవా, సంగెం, క్వీపెం మున్సిపల్ ఎన్నికలకు గోవా ఎన్నికల కమిషనర్ ఇచ్చిన నోటిఫికేషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ గోవా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ రోహింటన్ ఫాలీ నారీమన్, జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ హృషీకేష్‌రాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. చట్ట ప్రకారం మహిళలకు వార్డులు కేటాయించకపోవడంతో సదరు 5 మున్సిపాల్టీల్లో ఎన్నికలు నిర్వహించొద్దని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే, ఈ సందర్భం గా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల కమిషన్ స్వతంత్రతను రాజీ చేయలేమని, ఎన్నికల కమిషనర్లు స్వతంత్ర వ్యక్తులుగా ఉండాలని, ప్రభుత్వం లో పదవిలో ఉన్న వ్యక్తిని ఏ రాష్ట్రాలూ ఎన్నికల కమిషనర్‌గా నియమించజాలవని పేర్కొంది. ప్రభుత్వంలో పనిచేస్తున్న వ్యక్తి గోవాలో ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించడం బాధాకరమై న అంశమని ధర్మాసనం అభిప్రాయ పడింది. -
12 పంచాయతీలు, 725 వార్డులకు కొత్త నోటిఫికేషన్
సాక్షి, అమరావతి : ఎన్నికలు జరగని పంచాయతీలు, వార్డులకు కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. సాంకేతిక కారణాలు, నామినేషన్లు దాఖలు కాని 12 పంచాయతీలు, 725 వార్డులకు బుధవారం ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీచేసింది. వార్డులు, గ్రామాల వారీగా ఈనెల 4వ తేదీ నాటికి ఓటర్ల జాబితా ప్రదర్శన జరగనుంది. 6వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లకు గడువు.. 7వ తేదీ ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన.. 8వ తేదీ సా.5 గంటల వరకు నామినేషన్లపై ఫిర్యాదుల స్వీకరణ.. 9వ తేదీ నామినేషన్లపై వచ్చిన అప్పీల్ పరిశీలన.. 10 వ తేదీ మ.3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ.. అదే రోజు సాయంత్రం 4 గంటలకి అభ్యర్ధుల తుది జాబితా విడుదల కానుంది. 13వ తేదీ రాత్రి 7.30 గంటలతో అభ్యర్ధుల ప్రచారం ముగియనుంది. 15వ తేదీ ఉ.6.30 నుంచి మ.3.30 గంటల వరకు పోలింగ్.. సాయంత్ర 4 గంటలనుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. -
వ్యక్తులకు కొమ్ము కాస్తూ...
-
ఈసీనీ అడ్డుపెట్టుకుని బాబు కుట్ర చేస్తున్నారు
-
పరిపాలన స్తంభింప చేయటమే బాబు లక్ష్యమా?
-
ఎన్నికల వాయిదా రాజ్యాంగ విరుద్ధం కాదా?
-
నామినేషన్లు అడ్డుకునే వారిపై కఠిన చర్యలు
-
వరుస కాల్పులు, సీనియర్ అధికారిపై వేటు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని షాహీన్ బాగ్ వద్ద సుదీర్ఘంగా కొనసాగుతున్న పౌరసత్వ వ్యతిరేక సవరణ చట్టం (సిఎఎ) నిరసనలో వరుసగా కాల్పుల ఉదంతంతో ఎన్నికల సంఘం కీలక చర్య తీసుకుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, నాలుగు రోజుల వ్యవధిలో రెండు వరుస కాల్పుల సంఘటనలు జరిగిన తరువాత ఎన్నికల కమిషన్ సౌత్ ఈస్ట్ (ఆగ్నేయ) డిప్యూటీ కమిషనర్ చిన్మయ్ బిస్వాల్ ను పదవి నుండి తొలగించింది. అలాగే సీనియర్ అధికారి కుమార్ జ్ఞానేష్ తాత్కాలిక డీసీపీగా బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించింది. తగిన అధికారి కోసం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ లేదా ఢిల్లీ పోలీస్ కమిషనర్ మూడు పేర్లతో కూడిన ప్యానెల్ పంపవచ్చని ఎన్నికల సంఘం సూచించింది. దేశ రాజధానిలో సీఏఏ వ్యతిరేక నిరసనకు కేంద్రంగా ఉన్న షాహీన్ బాగ్ వద్ద భద్రతా పరిస్థితిని ఆదివారం సమీక్షించింది. స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికలను నిర్వహించడానికి బిస్వాల్ చర్యలు సంతృప్తికరంగా లేవని వ్యాఖ్యానించింది. కాగా గురువారం, జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయానికి సమీపంలో ఒక యువకుడు నిరసనకారులపై కాల్పులు జరిపిన ఘటనలో ఒక విద్యార్థి గాయపడ్డాడు. నివారం షాహీన్ బాగ్ వద్ద పోలీసు బారికేడ్ల దగ్గర నిలబడి షాట్లు పేల్చడంతో కపిల్ గుజ్జర్ (25) "జై శ్రీ రామ్" అంటూ కాల్పులకు తెగబడ్డాడు. తన దేశంలో హిందువులు మాత్రమే వుంటారని నినదించాడు. జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీలో ఆదివారం మరోసారి కాల్పుల సంఘటనతో ఉద్రిక్తత ఏర్పడింది. యూనివర్సిటీ 5వ నెంబర్ గేట్ దగ్గర కాల్పులు చోటు చేసుకున్నాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన కుమార్ జ్ఞానేష్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాల్పులకు నిరసనగా సీఏఏ వ్యతిరేక ఆందోళనకారులు భారీ ర్యాలీ నిర్వహించారు. జామియా మిలియా వద్ద ఆదివారం కాల్పుల ఘటన చదవండి : ఆజాదీ కావాలా అంటూ తెగబడిన ఉన్మాది -
మోగిన మున్సిపల్ ఎన్నికల నగారా
-
మోగిన మున్సిపల్ ఎన్నికల నగారా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో ఎన్నికల సంగ్రామం ప్రారంభం కాబోతుంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు లైన్‌క్లియర్ అయ్యింది. మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. ఎన్నికలకు సంబంధించిన షెడ్యుల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. జనవరి 7న నోటిఫికేషన్ విడుదల కానుంది. 8 నుంచి 10 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 11న నామినేషన్ల పరిశీలన, 14న ఉపసంహరణకు గడువు విధించారు. అలాగే 12, 13 తేదీల్లో తిరస్కరించిన నామినేషన్లను అప్పీలు చేసుకునే అవకాశం కల్పించారు. జనవరి 22న పోలింగ్ నిర్వహించి, 25న ఫలితాలను వెల్లడించనున్నారు. ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి రానుందని ఈసీ ప్రకటించింది. జనవరి బ్యాలెట్ పేపర్ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు జరుగనున్నాయి. కాగా పురపాలక సంఘాలకు పదవీకాలం ముగిసినప్పటికీ వార్డుల విభజన, న్యాయ వివాదాల కారణంగా ఆలస్యమైన విషయం తెలిసిందే. కోర్టుల్లో సుదీర్ఘ వాదనల అనంతరం ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. -
హుజూర్‌నగర్‌పై బులెటిన్ విడుదల చేసిన ఈసీ
సాక్షి, సూర్యాపేట : హుజూర్ నగర్ ఉపఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల ఖర్చుల వివరాలు, కేసులు, నగదు, పట్టుబడిన మద్యం వంటి వివరాలతో కూడిన బులిటెన్ ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి చంద్రయ్య ఆదివారం విడుదల చేశారు. మొత్తం ప్రచార వాహనాల సంఖ్య - 104 ఇప్పటి వరకు పట్టుకున్న నగదు : రూ.72,29,500 సీజ్ చేసిన మద్యం : 7000లీటర్ల కోడ్ ఉల్లంఘన కేసులు: 10 సి విజిల్ యాప్ ద్వారా నమోదైన కేసులు సంఖ్య: 15 కాగా, కేవలం మఠంపల్లి మండలంలోనే రూ. 1,25,200 మద్యం పట్టుబడడం గమనార్హం. అభ్యర్థులు ప్రచారం కోసం చేసిన ఖర్చు: టిఆర్ఎస్ - శానంపూడి సైదిరెడ్డి - రూ.8,65,112 కాంగ్రెస్ - పద్మావతి రెడ్డి - రూ.5,27,621 బీజేపీ - కోట రామారావు - రూ.4,22,258 స్వతంత్ర అభ్యర్థి - తీన్మార్ మల్లన్న - రూ.3,73,945. టిడిపి - చావా కిరన్మయి - రూ.3,46,968 స్వతంత్ర అభ్యర్థి దేశగాని సాంబశివ గౌడ్ - రూ. 10360 -
అసమ్మతిని ప్రస్తావించం
న్యూఢిల్లీ: ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘన కేసులకు సంబంధించిన తీర్పుల ఉత్తర్వుల్లో అసమ్మతి వివరాలను కూడా చేర్చాలంటూ ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా చేసిన డిమాండ్‌ను ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం 2–1 మెజారిటీ ఓటుతో తిరస్కరించింది. ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా, కమిషనర్లు సుశీల్ చంద్ర, లావాసాలతో కూడిన ఈసీ కమిటీ ఈ వివాదాస్పద విషయంపై చర్చించింది. అనంతరం ఈసీ ఓ ప్రకటన విడుదల చేస్తూ ‘ఎన్నికల నిబంధనావళి అంశంపై ఈసీ సమావేశం మంగళవారం జరిగింది. కమిషనర్లందరి అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకుంటాం. అసమ్మతి, మైనారిటీ అభిప్రాయాలను రికార్డు చేసినప్పటికీ ఉత్తర్వుల్లో వాటిని పేర్కొనం’ అని తెలిపింది. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై వచ్చిన ఫిర్యాదులపై చర్యల సమయంలో తన అసమ్మతిని పరిగణనలోనికి తీసుకోవడం లేదనీ, కాబట్టి ఇకపై తాను ఈ తరహా సమావేశాలకు వెళ్లదలచుకోవడం లేదని అశోక్ లావాసా ఇటీవల ప్రకటించడం తెలిసిందే. తాజా సమావేశంలోనూ లావాసా తన వాదనకు కట్టుబడగా, ప్రధాన కమిషనర్, మరో కమిషనర్ ఆయన వాదనను తోసిపుచ్చారు. ఈ సమావేశం అనంతరం లావాసా మాట్లాడుతూ పారదర్శకతే ప్రధానమని తాను ఇప్పటికీ నమ్ముతున్నానని అన్నారు. నిబంధనావళి ఉల్లంఘనలపై చర్యలు తీసుకునే ప్రక్రియ నిర్దిష్ట గడువులోగా పూర్తయ్యేలా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. -
ఈవీఎంలపై ఫిర్యాదులకు ఈసీ హెల్ప్‌లైన్
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలపై వచ్చే ఫిర్యాదులపై స్పందించేందుకు 24 గంటలపాటు పనిచేసే కంట్రోల్‌రూమ్‌ను ఎన్నికల సంఘం (ఈసీ) ఏర్పాటు చేసింది. ఎన్నికల్లో ఉపయోగించిన అసలైన ఈవీఎంల స్థానంలో కొత్త వాటిని స్ట్రాంగ్ రూమ్‌ల్లో పెట్టి, వాటిలోని ఓట్లనే లెక్కించనున్నారన్న ఆరోపణలు రావడం, అవన్నీ అవాస్తవాలేనని ఈసీ మంగళవారం కొట్టిపారేయడం తెలిసిందే. అయితే స్ట్రాంగ్ రూమ్‌ల్లో ఈవీఎంలను భద్రపరిచిన తీరు, స్ట్రాంగ్ రూమ్‌లకు కల్పించిన భద్రత, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద తమ ఏజెంట్లను నియమించేందుకు అభ్యర్థులకు అనుమతి, ఆ పరిసరాలపై సీసీటీవీ కెమెరాల ద్వారా నిఘా పెట్టడం, ఈవీఎంల తరలింపు సహా ఈవీఎంలకు సంబంధించిన ఏ సమస్యలపైనైనా ఫిర్యాదులు చేయవచ్చని ఈసీ వెల్లడించింది. ఈ ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా ఐదు లైన్లతో హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశామనీ, ఫిర్యాదుదారులు 011–23052123 నంబర్‌కు ఫోన్ చేసి తమ ఫిర్యాదులను నమోదు చేయవచ్చని ఈసీ తెలిపింది. -
ఊహాగానాలకు ఈసీ తెరదించాలి
లక్నో, న్యూఢిల్లీ: ఓట్ల లెక్కింపునకు మరో రెండురోజులు కూడా సమయంలేని నేపథ్యంలో ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలు మంగళవారం రాజకీయంగా దుమారం సృష్టించాయి. దీనిపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల తీర్పు తారుమారు వార్తలు తనను ఆందోళనకు గురిచేస్తున్నట్లు చెప్పారు. ఓట్ల లెక్కింపు యంత్రాల (ఈవీఎంలు)ను చుట్టుముట్టిన ఊహాగానాలన్నిటికీ తెరదించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పైనే ఉందని ఆయన చెప్పారు. తమ అధీనంలో ఉన్న ఈవీఎంలకు రక్షణ, భద్రత కల్పించాల్సిన బాధ్యత ఈసీపైనే ఉందన్నారు. కాంగ్రెస్ మాజీ దిగ్గజ నేత కూడా అయిన ప్రణబ్ ఈ మేరకు ట్వీట్ చేశారు. ప్రజా తీర్పు చాలా పవిత్రమైనదని, అది ఏ అతి చిన్న సందేహానికీ తావివ్వనంత ఉన్నతంగా ఉండాలని అన్నారు. ఎన్నికలు సమర్ధంగా నిర్వహించినందుకు ఈసీని ప్రణబ్ సోమవారం అభినందించిన సంగతి తెలిసిందే. విపక్షాల ఆందోళన ఈవీఎంల తరలింపు, ట్యాంపరింగ్ ఆరోపణల సంబంధిత వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం నిరసన ప్రదర్శనలకు దారితీసింది. కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్ట్రాంగ్ రూముల్లో ఉన్న ఈవీఎంల తరలింపు ఫిర్యాదుల పరిష్కారం దిశగా ఈసీ తక్షణమే సరైన చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. విపక్షాలు ఈవీఎంల విశ్వసనీయతను ప్రశ్నించడాన్ని బీజేపీ ఖండించింది. మళ్లీ మోదీ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చేలా ఓటర్లు తీర్పు ఇచ్చిన పక్షంలో, ఓటమిని హుందాగా అంగీకరించాలని కోరింది. ఘాటుగా స్పందించిన ఈసీ పోలింగ్ సందర్భంగా ఉపయోగించిన ఈవీఎంల స్థానంలో వేరే ఈవీఎంలను ఉంచుతున్నారనే ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ స్పందించింది. అవన్నీ తప్పుడు, పనికిమాలిన, నిరాధార ఆరోపణలుగా పేర్కొంది. ఏడు విడతల్లో వినియోగించిన ఈవీఎంలన్నీ స్ట్రాంగ్ రూముల్లో అత్యంత భద్రంగా ఉన్నాయని తెలిపింది. టీవీలు, సోషల్ మీడియాల్లో చూపిస్తున్న దృశ్యాలకు, పోలింగ్ సందర్భంగా వినియోగించిన ఈవీఎంలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. కేంద్రంలో మళ్లీ ఎన్డీయేనే అధికారం చేపట్టనుందని దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
నేడు ఢిల్లీలో యూపీఏ పక్షాల భేటీ
-
పొరపాట్లకు ఛాన్సివ్వొద్దు
సాక్షి, విశాఖపట్నం: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో చిన్న పొరపాటుకు కూడా ఆస్కారం ఇవ్వడానికి వీల్లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ జి.సృజన హెచ్చరించారు. ఒక్కోసారి చిన్నపొరపాటే కొంపముంచుతుందని, అందుకు భారీ మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందన్నారు. గురువారం స్థానిక స్వర్ణభారతి ఆడిటోరియంలో ఆర్వోలు, ఏఆర్వోలు, సూపర్వైజర్లకు ఓట్ల లెక్కింపుపై శిక్షణనిచ్చారు. ఈ సందర్భంగా మాక్ కౌంటింగ్ నిర్వహించి అవగాహన కల్పించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రతి ఒక్క అంశాన్ని వివరించారు. సువిధ యాప్ నిర్వహణపై పూర్తి స్థాయి అవగాహన ఉండాలన్నారు. డేటాను మొదట ఎంట్రీచేసిన తర్వాతనే రౌండ్ల వారీగా ఫలితాలను ప్రకటించాలన్నారు. శిక్షణలో జేసీ – 2 ఎం.వెంకటేశ్వరరావు, విశాఖ, అనకాపల్లి ఆర్డీవోలు తేజ్‌భరత్, సూర్యకళ పాల్గొన్నారు. -
తొలి ఫలితం విశాఖ దక్షిణానిదే
సాక్షి, విశాఖపట్నం : మరో ఆరు రోజుల్లో చేపట్టనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఆర్వోలు, ఏఆర్వోలు, సూపర్వైజర్లు, ఇతర కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. విశాఖలో మూడు లోక్‌సభ, 15 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు అత్యల్పంగా 17 రౌండ్లు, అత్యధికంగా 23రౌండ్ల వరకు సాగనుంది. తొలి రౌండ్ ఫలితం లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైన అరగంటలోనే వెల్లడికానుంది. 12 గంటలకు తొలి ఫలితం వెల్లడికానుంది. పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్లతోపాటు రౌండ్ల వారీగా ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మధ్యాహ్నం 1.30గంటలకల్లా పూర్తి కానుంది. వీవీ ప్యాట్ల స్లిప్‌ల కౌంటింగ్ పూర్తయితేకానీ అధికారికంగా ఫలితాలు వెల్లడించకున్నప్పటికీ మధ్యాహ్నం ఒంటి గంటకే దాదాపు అన్ని నియోజకవర్గాల ఫలితాలు వెల్లడి కానున్నాయి. తొలిసారి రౌండ్ల వారీగా ఫలితాలను సువిధ పోర్టల్‌లో నమోదు చేయనున్నారు. దీంతో ఏ అభ్యర్థికి ఏ రౌండ్లో ఎన్ని ఓట్లు పోలయ్యాయో పోర్టల్ ద్వారా క్షణాల్లో తెలుసుకునే వెసులుబాటు కలుగనుంది. తొలి ఫలితం విశాఖ దక్షిణానిదే బూత్‌ల సంఖ్యా పరంగా చూసినా, పోలైన ఓట్ల పరంగా చూసినా తొలి ఫలితం విశాఖ దక్షిణానిదే. ఈ నియోజకవర్గ పరిధిలో 236 పోలింగ్ బూత్‌లున్నాయి. పైగా జిల్లాలో అత్యల్ప ఓట్లు నమోదైన రెండో నియోజకవర్గం కూడా ఇదే. 2,09,186 ఓట్లకు గానూ 1,27,909 ఓట్లు పోలయ్యాయి. రౌండ్‌కు 14 ఈవీఎంలలో కౌంటింగ్ సాగనుండడంతో 17 రౌండ్లలోనే ఈ నియోజకవర్గ ఫలితం వెల్లడికానుంది. విశాఖ దక్షిణం తర్వాత కొద్ది నిముషాల తేడాలో రెండో ఫలితంగా విశాఖ పశ్చిమం వెల్లడికానుంది. ఈ నియోజకవర్గ పరిధిలో 237 పోలింగ్ బూత్‌లే ఉన్నప్పటికీ పోలైనవి 1,37,499 ఓట్లు కావడంతో దక్షిణం తర్వాత కొద్ది నిముషాల వ్యవధిలోనే పశ్చిమ ఫలితం వెల్లడవుతుంది. భీమిలి, పాడేరుల్లో 23 రౌండ్ల కౌంటింగ్ పోలైన ఓట్లను బట్టి చూస్తే ఆ తర్వాత వరుసగా పాడేరు, అరుకు, మాడుగుల, అరుకు, అనకాపల్లి, యలమంచలి, విశాఖ తూర్పు, విశాఖ ఉత్తరం, చోడవరం, పాయకరావుపేట, పెందుర్తి, గాజువాక, భీమిలి నియోజకవర్గాల వారీగా ఫలితాలు వెల్లడికావాల్సి ఉన్నప్పటికీ పోలింగ్ బూత్‌ల వారీగా చూస్తే మాత్రం మాడుగుల, విశాఖ పశ్చిమం, చోడవరం, యలమంచలి, అనకాపల్లి, నర్సీపట్నం, విశాఖ ఉత్తరం, విశాఖ తూర్పు, పెందుర్తి, అరుకు, పాడేరు, చివరగా భీమిలి నియోజకవర్గాల ఫలితాలు వెల్లడి కానున్నాయి. భీమిలి, పాడేరుల్లో 23 రౌండ్ల వరకు కౌంటింగ్ సాగనుంది. తొలి రౌండ్‌కు అరగంట సమయం పడుతుంది. ఇక ఆ తర్వాత ప్రతి రౌండ్‌కు 20 నిముషాలకు మించి సమయం పట్టే అవకాశాలు లేవు. ఏజెంట్లతో ప్రమాణంతో మొదలు.. 23వ తేదీ ఉదయం 7.55 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. తొలుత నియోజకవర్గాల వారీగా ఆర్వోలు సరిగ్గా 7.55 గంటలకు కౌంటింగ్ ప్రక్రియపై ఈసీ నియమ నిబంధనలను వివరిస్తూ ఏజెంట్లతో ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత సరిగ్గా 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. తొలుత సర్వీస్ ఓట్లు, పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపునకు శ్రీకారం చుడతారు. వీటి లెక్కింపు పూర్తయినా అవకపోయినా సరిగ్గా 8.30గంటలకు ఈవీఎంల కౌంటింగ్ ప్రక్రియ మొదలుపెడతారు. లోక్‌సభ, అసెంబ్లీల వారీగా ఈవీఎంలను వేర్వేరుగా రెండు స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపర్చారు. కౌంటింగ్ కోసం కూడా అదే విధంగా ప్రతి నియోజకవర్గానికి రెండు కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. సీరియల్ ప్రకారం పోలింగ్ బూత్‌ల వారీగా అసెంబ్లీ, లోక్‌సభ ఈవీఎంలను వేర్వేరుగా రౌండ్‌కు 14 చొప్పున బయటకు తీసుకొస్తారు. అసెంబ్లీ ఈవీఎంలను అసెంబ్లీ కౌంటింగ్ హాలుకు, లోక్‌సభ ఈవీఎంలను లోక్‌సభ కౌంటింగ్ హాలుకు తీసుకెళ్తారు. 8.30 గంటలకు తొలి రౌండ్ కౌంటింగ్‌కు శ్రీకారం చుడతారు. 14 టేబుల్స్‌లో కౌంటింగ్ పూర్తి కాగానే టేబలేషన్ (ఈవీఎంల వారీగా పోలైన ఓట్లను ఓ చార్ట్‌లో రౌండ్ల వారీగా కూడే విధానం) చేస్తారు. ఆ తర్వాత రౌండ్ల వారీగా వివరాలను ఈసీకి పంపడంతో పాటు సువిధ పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారు. అలా చేసిన తర్వాతే రౌండ్ ఫలితాలను అధికారికంగా వెల్లడిస్తారు. ఆ తర్వాత మళ్లీ రెండో రౌండ్‌కు సంబంధించిన ఈవీఎంలను కౌంటింగ్ హాలుకు తీసుకొస్తారు. ఇలా రౌండ్ల వారీగా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. తుది రౌండ్కొచ్చేసరికి సమాంతరంగా సర్వీస్, పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు పూర్తికావాల్సి ఉంటుంది. ఒక వేళ పోలైన ఓట్ల సంఖ్యను బట్టి వాటి లెక్కింపు ప్రక్రియ మరింత ఆలస్యమవుతుందని భావిస్తే తుది రౌండ్‌ను ఆపుతారు. సర్వీస్, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత తుది రౌండ్ ఫలితాలకు పోస్టల్, సర్వీస్ ఓట్లను కలిపి తుది ఫలితాలను నిర్ణయిస్తారు. మైక్రో అబ్జర్వర్కే సెల్‌ఫోన్ లోక్‌సభ ఓట్లను కౌంటింగ్ చేసే హాలులో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుళ్లకు 14 మంది ఏజెంట్లు ఉంటారు. ఇక లోక్‌సభ ఆర్వో టేబుల్ పక్కనే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం రెండు, సర్వీస్ ఓట్ల లెక్కింపు కోసం రెండు టేబుల్స్ ఏర్పాటు చేస్తారు. వీటి వద్ద ఒక్కో టేబుల్‌కు ఒక్కో ఏజెంట్ ఉంటారు. అలాగే అభ్యర్థితో పాటు జనరల్ ఏజెంట్‌గా మరొకరుంటారు. ఇక అసెంబ్లీ కౌంటింగ్ హాలులో మాత్రం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుల్స్ ఏర్పాటు చేస్తారు. 14 టేబుల్స్‌కు 14 మంది ఏజెంట్లు ఉంటారు. అసెంబ్లీ ఆర్వో పక్కనే పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్ల లెక్కింపు కోసం చెరో టేబుల్ ఏర్పాటు చేస్తారు. ఆయా టేబుల్స్ వద్ద ఒక్కో ఏజెంట్ ఉంటారు. ఇక్కడ కూడా అభ్యర్థితో పాటు ఓ జనరల్ ఏజెంట్ ఉంటారు. అభ్యర్థితో సహా ఏజెంట్లు ఎవ్వరూ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిగ్ పరికరాలను కౌంటింగ్ హాలులోకి తీసుకెళ్లడానికి వీల్లేదు. అలాగే కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్‌కు మాత్రమే సెల్‌ఫోన్ తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇక విధుల్లో ఉన్న ఇతర కౌంటింగ్ అధికారులు, సిబ్బంది ఎవరిని సంప్రదించాలన్నా హ్యాండ్సెట్ల ద్వారానే మాట్లాడాల్సి ఉంటుంది. -
మోదీ వ్యాఖ్యలపై ‘సుప్రీం’కు కాంగ్రెస్
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ అవినీతిలో నంబర్ వన్ అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గతవారం ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ప్రధాని ఈవిధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనని ఎన్నికల కమిషన్(ఈసీ)కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. రాజీవ్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మోదీతోపాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు ఈసీ క్లిన్‌చిట్ ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుస్మిత దేవ్ మరోసారి సుప్రీంకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేశారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి చెడు సంప్రదాయానికి ఒడిగట్టినవారిగా మోదీ, అమిత్ షాను ప్రకటించాలని ఆమె సుప్రీంకోర్టును కోరారు. వారికి ఈసీ క్లీన్చిట్ ఇచ్చినట్లు ఉన్న రికార్డులను తమ ముందు ఉంచాలని సుప్రీంకోర్టు పిటిషన్‌దారుకు సూచించింది. ఇటీవల ఎన్నికల కోడ్ ఉల్లంఘించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీఎస్పీ చీఫ్ మాయావతి, కేంద్ర మంత్రి మేనకా గాంధీ, ఎస్పీ నేత ఆజంఖాన్‌లపై ఈసీ చర్యలు తీసుకున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకు గుర్తు చేసింది. -
పోస్టల్ బ్యాలెట్ అక్రమాలపై ఈసీ సీరియస్
-
ఈసీ అనుమతి లేకుండా కేబినెట్ పెట్టకూడదు
-
వీవీప్యాట్ స్లిప్పులను లెక్కిస్తారిలా!
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి.. ఈసారి కొత్తగా ప్రవేశపెట్టిన వీవీప్యాట్ యంత్రాల్లో ఉన్న చీటీల (స్లిప్పులు) లెక్కింపు విషయంలో ఈసీ మార్గదర్శకాలను జారీచేసింది. ఆ మార్గదర్శకాల ప్రకారమే చీటీలను వెలికి తీసి అభ్యర్థుల వారీ పోలైన ఓట్లను లెక్కిస్తారు. 2014 ఎన్నికల్లో వీవీప్యాట్ యంత్రాలను వాడలేదు. ఈవీఎం యంత్రాల పనితీరుపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో.. ఈసీ కొత్తగా వీవీప్యాట్ యంత్రాలను ఈ ఎన్నికల్లో ప్రవేశపెట్టింది. తొలుత పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గానికి ఒక పోలింగ్ బూత్‌ను ఎంపికచేసి, అక్కడ ఉపయోగించిన వీవీప్యాట్ యంత్రంలోని చీటీలను లెక్కించాలని భావించారు. కానీ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్లో ఐదు బూత్‌లోని వీవీప్యాట్లను లెక్కించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు ఆయా యంత్రాల్లోని చీటీలను వెలికి తీసి, లెక్కింపు వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన పద్ధతులపై లెక్కింపు అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించనున్నారు. లెక్కింపు ఇలా... ఎంపిక చేసిన వీవీప్యాట్ యంత్రాల్లో ఉన్న చీటీలు, దానికి అనుసంధానమై ఉన్న బ్యాలెట్ యూనిట్లో ఉన్న ఓట్ల సంఖ్యతో సరిచూస్తారు. పోలింగ్ కేంద్రాల వారీ ఉన్న ఓట్లు, పోలైన ఓట్లు వంటి వివరాలతో రూపొందించిన ‘ఫారం–17ఏ’తో సరిపోల్చుతారు. అంతా సరిగ్గా ఉన్న తర్వాత వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులను ఏజెంట్ల సమక్షంలో బయటకు తీస్తారు. వీటిని అభ్యర్థుల వారీగా వేరుచేస్తారు. తదుపరి 25 చొప్పున కట్టలు కట్టి లెక్కిస్తారు. అభ్యర్థుల వారీ విడదీసి, లెక్కింపు పూర్తి చేయడానికి 2 గంటలకుపైగా పట్టే అవకాశం ఉంది. అయిదు యంత్రాల్లోని స్లిప్పులను మాత్రమే లెక్కించాల్సి ఉన్నందున సమాంతరంగా అన్నీ ఒకేసారి ప్రారంభిస్తారు. ఈవీఎం ఓట్లను లెక్కించే టేబుల్‌నే దీనికి వినియోగిస్తారు. చీటీలను మాత్రం ట్రేలో వేసి అభ్యర్థుల వారీ వేరుచేయనున్నారు. లాటరీ పద్ధతిలో ఎంపిక... లోక్‌సభ నియోజవర్గానికి సంబంధించి రాండమ్‌గా 35 వీవీప్యాట్ మెషీన్లను (అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు వీవీప్యాట్ మెషీన్ల చొప్పున) ఎంపికచేసి లెక్కిస్తారు. ఇదంతా అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో రిటర్నింగ్ అధికారి నిర్వహిస్తారు. లాటరీలో వచ్చిన నెంబర్ల వారీ యంత్రాలను వెలికి తీసి వాటిల్లో ఉన్న చీటీలను లెక్కించనున్నారు. లెక్కింపు ప్రక్రియ మొదలవగానే తొలుత పోస్టల్ బ్యాలెట్లను, సర్వీసు ఓట్లను గణిస్తారు. తదుపరి ఈవీఎం యంత్రాల్లో పోలైన ఓట్లను గణిస్తారు. చివరిగా వీవీప్యాట్ యంత్రాల్లో ఉన్న చీటీల లెక్కింపు ఆరంభిస్తారు. ఇదంతా పూర్తయ్యాక విజేత పేరును అధికారికంగా ప్రకటిస్తారు. వీవీప్యాట్ యంత్రాల్లో చీటీల లెక్కింపు ఆరంభం కాకమునుపే రౌండ్ల వారీ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలను వెల్లడించనున్నారు. వచ్చే నెలలో లెక్కింపు సిబ్బందికి ఈ అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను లెక్కిస్తారిలా.. .
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి.. ఈసారి కొత్తగా ప్రవేశపెట్టిన వీవీప్యాట్ యం త్రాల్లో ఉన్న చీటీల (స్లిప్పులు) లెక్కింపు విషయంలో ఈసీ మార్గదర్శకాలను జారీచేసింది. ఆ మార్గదర్శకాల ప్రకారమే చీటీలను వెలికి తీసి అభ్యర్థుల వారీ పోలైన ఓట్లను లెక్కిస్తారు. 2014 ఎన్నికల్లో వీవీప్యాట్ యంత్రాలను వాడలేదు. ఈవీఎం యంత్రాల పనితీరుపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో.. ఈసీ కొత్తగా వీవీప్యాట్ యంత్రాలను ఈ ఎన్నికల్లో ప్రవేశపెట్టింది. తొలుత పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గానికి ఒక పోలింగ్ బూత్‌ను ఎంపికచేసి, అక్కడ వినియోగించిన వీవీప్యాట్ యం త్రంలోని చీటీలను లెక్కించాలని భావించారు. కానీ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెగ్మెంట్‌కు లెక్కించే వీవీప్యాట్ సంఖ్యను పెంచాలని నిర్ణయిం చారు. ఈ మేరకు ఆయా యంత్రాల్లోని చీటీలను వెలికి తీసి, లెక్కింపు వరకు తీసుకోవాల్సిన జాగ్ర త్తలు, అనుసరించాల్సిన పద్ధతులపై లెక్కింపు అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించనున్నారు. లెక్కింపు ఇలా... ఎంపిక చేసిన వీవీప్యాట్ యంత్రాల్లో ఉన్న చీటీలు, దానికి అనుసంధానమై ఉన్న బ్యాలెట్ యూనిట్లో ఉన్న ఓట్ల సంఖ్యతో సరిచూస్తారు. పోలింగ్ కేంద్రాల వారీ ఉన్న ఓట్లు, పోలైన ఓట్లు వంటి వివరాలతో రూపొందించిన ‘ఫారం–17ఏ’తో సరిపోల్చుతారు. అంతా సరిగ్గా ఉన్న తర్వాత వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులను ఏజెంట్ల సమక్షంలో బయటకు తీస్తారు. వీటిని అభ్యర్థుల వారీగా వేరుచేస్తారు. తదుపరి 25 చొప్పున కట్టలు కట్టి లెక్కిస్తారు. అభ్యర్థుల వారీ విడదీసి, లెక్కింపు పూర్తి చేయడానికి 2 గంటలకుపైగా పట్టే అవకాశం ఉంది. అయిదు యంత్రాల్లోని స్లిప్పులను మాత్రమే లెక్కించాల్సి ఉన్నందున సమాంతరంగా అన్నీ ఒకేసారి ప్రారంభిస్తారు. ఈవీఎం ఓట్లను లెక్కించే టేబుల్‌నే దీనికి వినియోగిస్తారు. చీటీలను మాత్రం ట్రేలో వేసి అభ్యర్థుల వారీ వేరుచేయనున్నారు. లాటరీ పద్ధతిలో ఎంపిక... లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించి రాండమ్‌గా 35 వీవీప్యాట్ మెషీన్లను (అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు వీవీప్యాట్ మెషీన్ల చొప్పున) ఎంపికచేసి లెక్కిస్తారు. ఇదంతా అభ్యర్థులు/వారి ఏజెంట్ల సమక్షంలో రిటర్నింగ్ అధికారి నిర్వహిస్తారు. లాటరీలో వచ్చిన నెంబర్ల వారీ యంత్రాలను వెలికి తీసి వాటిల్లో ఉన్న చీటీలను లెక్కించనున్నారు. లెక్కింపు ప్రక్రియ మొదలవగానే తొలుత పోస్టల్ బ్యాలెట్లను గణిస్తారు. తదుపరి ఈవీఎం యంత్రాల్లో పోలైన ఓట్లను గణిస్తారు. చివరిగా వీవీప్యాట్ యంత్రాల్లో ఉన్న చీటీల లెక్కింపు ఆరంభిస్తారు. ఇదంతా పూర్తయ్యాక విజేత పేరును అధికారికంగా ప్రకటిస్తారు. వీవీప్యాట్ యంత్రాల్లో చీటీల లెక్కింపు ఆరంభం కాకమునుపే రౌండ్ల వారీ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలను వెల్లడించనున్నారు. వచ్చే నెలలో లెక్కింపు సిబ్బందికి ఈ అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. -
శ్రీకాకుళం మాజీ ఎస్పీకి మళ్లీ పోస్టింగ్!
అమరావతి: శ్రీకాకుళం మాజీ ఎస్పీ అడపా వెంకటరత్నంకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్లీ పోస్టింగ్ ఇచ్చింది. డెప్యూటేషన్‌పై ఏపీ ట్రాన్స్‌కోకు వెంకటరత్నంను బదిలీ చేసింది. ఏపీ ట్రాన్స్‌కో చీఫ్, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా వెంకటరత్నంను నియమించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెంకటరత్నంపై తీవ్రంగా రావడంతో ఎన్నికల కమిషన్ ఆయనను ఆకస్మికంగా విధుల నుంచి తప్పించిన సంగతి తెల్సిందే. అప్పటి నుంచి వెంకటరత్నం ఖాళీగా ఉన్నారు. తనను అన్యాయంగా బదిలీ చేశారంటూ గతంలో ఈసీకి వెంకటరత్నం బహిరంగ లేఖ రాశారు. ఎన్నికలు ముగియడంతో తిరిగి వెంకటరత్నంకు పోస్టింగ్ ఇచ్చారు. -
ఇక పురసమరం!
మండపేట: సార్వత్రిక ఎన్నికల వేడి చల్లారక ముందే స్థానిక సమరానికి ఎన్నికల కమిషన్ (ఈసీ) కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్న ఈసీ తాజాగా మున్సిపల్ పోరుకు కూడా రంగం సిద్ధం చేస్తోంది. జూలై రెండో తేదీతో నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లోని పాలక వర్గాల పదవీ కాలం ముగుస్తోంది. ఈలోగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ నెల 11న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. వీటి ఫలితాల కోసం మే 23 వరకూ వేచి చూడాల్సి ఉంది. ఈలోగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. గత ఏడాది ఆగస్టు ఒకటో తేదీతో పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. అప్పటినుంచీ పంచాయతీలన్నీ ప్రత్యేక పాలనలో ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం జూన్‌లో వీటికి ఎన్నికలు జరుగుతాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మే 10వ తేదీన పంచాయతీల్లో ఓటర్ల తుది జాబితాలు ప్రచురించాలని ఇప్పటికే ఈసీ ఆదేశాలిచ్చింది. మరోపక్క నగర, పుర పాలక సంస్థలు, నగర పంచాయతీల్లో పాలక వర్గాల పదవీ కాలం జూలై రెండో తేదీతో ముగుస్తుండటంతో పురపోరు తెరపైకి వచ్చింది. దీంతో నూతన పాలక వర్గాల ఎన్నికకు కూడా ఈసీ సన్నాహాలు చేపట్టింది. జిల్లాలోని కాకినాడ మినహా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, అమలాపురం, మండపేట, రామచంద్రపురం, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట, తుని మున్సిపాల్టీలు, ఏలేశ్వరం, ముమ్మిడివరం, గొల్లప్రోలు నగర పంచాయతీలకు 2014 మార్చి 30న ఎన్నికలు జరిగాయి. 2014 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మే చివరిలో ఫలితాలు వెలువడ్డాయి. జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం అనంతరం జూలై 3న స్థానిక సంస్థల కొత్త పాలక వర్గాలు కొలువుదీరాయి. జూలై 2వ తేదీతో ప్రస్తుత పాలకవర్గాల పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో వాటికి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ఆయా నగరాలు, పట్టణాల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేసి, మే ఒకటో తేదీన ప్రచురించాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చింది. గడువు తక్కువగా ఉండటంతో అసెంబ్లీ ఓటర్ల జాబితాల ప్రకారం, వార్డుల వారీగా జాబితాలు సిద్ధం చేసే పనిలో మున్సిపల్ అధికారులు తలమునకలై ఉన్నారు. ఇందుకోసం ఇంటి నంబర్, వార్డు నంబర్, పోలింగ్ కేంద్రం తదితర వివరాలు సేకరిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గ జాబితాలో ఉన్న ఓటర్లు ప్రస్తుతం ఏ వార్డులో ఉన్నారో చూసి, ఆ మేరకు కొత్త జాబితాను సిద్ధం చేయాల్సి ఉంది. -
కోడెలపై సీఈఓకు వైఎస్సార్సీపీ ఫిర్యాదు
అమరావతి: గుంటూరు జిల్లా ఇనిమెట్లలోని 160వ పోలింగ్ స్టేషన్‌లోనికి ప్రవేశించి టీడీపీ నేత కోడెల శివ ప్రసాద్ చేసిన హైడ్రామాపై వైఎస్సార్సీపీ నేతలు ఆంధ్రప్రదేశ్ సీఈఓ గోపాలకృష్ణ ద్వివేదీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన వారిలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, మర్రి రాజశేఖర్, సామినేని ఉదయభాను, ఎంవీఎస్ నాగిరెడ్డి తదితరులు ఉన్నారు. అనంతరం వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విలేకరులతో మాట్లాడుతూ..ఇనిమెట్లలోని 160 పోలింగ్ స్టేషన్లో కోడెల శివ ప్రసాద్ కచ్చితంగా దౌర్జన్యానికి పాల్పడ్డారని, అందుకు ఆ సమయంలో తీసిన వీడియోలే సాక్ష్యమన్నారు. దౌర్జన్యానికి సంబంధించి రాజుపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని పేర్కొన్నారు. దౌర్జన్యం చేసిన కోడెలతో కుమ్మక్కై వైఎస్సార్సీపీ నేతలపై కేసులు పెట్టారని ఆరోపించారు. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన తర్వాతే కోడెలపై రాజుపాలెం పోలీసులు కేసు నమోదు చేశారని వెల్లడించారు. చట్ట విరుద్దంగా ప్రవర్తించిన పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని సీఈఓ ద్వివేదీకి విన్నవించారు. -
అధికారులపై ఈసీ కొరడా
-
వెల్లూరులో ఎన్నిక రద్దు
న్యూఢిల్లీ: డీఎంకే నేతకు సన్నిహితుడి వద్ద ఇటీవల భారీ మొత్తంలో నగదు పట్టుబడిన నేపథ్యంలో తమిళనాడులోని వెల్లూరు లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికలను రద్దు చేస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం ఉత్తర్వులిచ్చింది. డీఎంకే కోశాధికారి దురైమురుగన్ కొడుకు కథీర్ ఆనంద్ ఈ నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థిగా ఉన్నారు. మార్చి 30న దురై మురుగన్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఆదాయపు పన్ను అధికారులు.. లెక్కలు లేని రూ. 10.5 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. మరో రెండ్రోజుల తర్వాత, ఏప్రిల్ 1న దురైమురుగన్ సన్నిహితుడికి చెందిన సిమెంట్ ఫ్యాక్టరీలో సోదాలు చేసి, ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉంచిన రూ. 11.53 కోట్ల నగదును సైతం పట్టుకున్నారు. దీంతో వెల్లూరులో స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా ఎన్నికలు జరిగే వాతావరణం లేనందున ఈ ఎన్నికను రద్దు చేస్తున్నట్లు ఈసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పరిణామంపై డీఎంకే, దాని మిత్రపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని మోదీ అన్ని స్వతంత్ర వ్యవస్థలను తన చెప్పుచేతల్లో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించాయి. ధన ప్రవాహం భారీగా ఉందన్న కారణంతో ఓ లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నిక వాయిదా పడటం బహుశా ఇదే తొలిసారి కావొచ్చు. వెల్లూరులో పోలింగ్ ఎప్పుడు నిర్వహించేది ఈసీ తర్వాత వెల్లడించే అవకాశం ఉంది. కాగా, అధికారులకు పట్టుబడిన రూ. 11.53 కోట్లలో 91 శాతం డబ్బు 200 రూపాయల నోట్ల రూపంలోనే ఉందనీ, అదంతా ఒకే బ్యాంకు శాఖ నుంచి తీసుకున్నదని ఆదాయపు పన్ను అధికారులు చెప్పారు. కనిమొళి ఇంట్లో ఐటీ సోదాలు చెన్నై: తమిళనాడులోని తూత్తుకుడిలో డీఎంకే నాయకురాలు కనిమొళి ఇంట్లో ఆదాయపు పన్ను (ఐటీ) అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. కనిమొళి తూత్తుకుడి స్థానం నుంచే బీజేపీ రాష్ట్రాధ్యక్షురాలు తమిలిసై సౌందరరాజన్‌తో పోటీ పడుతున్నారు. గురువారమే ఇక్కడ పోలింగ్ జరగనుంది. సోదాల్లో ఏం దొరికాయన్నది వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. చెన్నైలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ మాట్లాడుతూ ఓటమి భయంతోనే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందనీ, స్వతంత్ర సంస్థలను స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటూ ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల కమిషనర్లు, రాష్ట్రాలకు ఎన్నికల ప్రధానాధికారుల నియామకంలో సంస్కరణలు తెచ్చేందుకు తాము కృషి చేస్తామనీ, ఇందుకోసం సుప్రీంకోర్టుకైనా వెళ్తామని ఆయన పేర్కొన్నారు. -
వెల్లూరులో లోక్‌సభ ఎన్నికల రద్దుపై ఈసీ క్లారిటి
-
యడ్యూరప్ప హెలికాఫ్టర్‌లో ఎన్నికల సింబ్బంది తనిఖీలు
-
యూపీ సీఎంకు, మాయావతికి భారీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీఎస్పీ అధినేత్రి మాయావతికిఎలక్షన్ కమిషన్ భారీ షాక్ ఇచ్చింది. అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో వారిద్దరినీ ఎన్నికల ప్రచారం నుంచి కొంత సమయం పాటు బ్యాన్ చేసింది. మతపరమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఎలక్షన్ కోడ్‌ను ఉల్లంఘించారన్న ఆరోపణల నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. సీఎం యోగిని మూడు రోజులు (72 గంటల పాటు), మాయావతిని రెండు రోజులు (48 గంటల పాటు) ఎన్నికల ప్రచారంనుంచి నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆంక్షలు మంగళవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా యోగి, మాయావతి వివాదాస్పద వ్యాఖ్యలతో రెచ్చగొట్టే ప్రసంగాలనుఉదహరిస్తూ సోమవారం సుప్రీకోర్టు ఈసీపై విమర్శలు గుప్పించింది. ఎంతుకు ఉదాసీనంగా ఉంటున్నారని చురకలంటించింది. దీంతో రెండవ దశ ఎన్నికల బరిలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్న నేతలిద్దరికీభారీ ఎదురు దెబ్బ తగిలింది. ముఖ్యంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న యూపీ ఎన్నికల బరిలో యోగి మూడు రోజుల పాటు ప్రచారం నిర్వహించకుండా ఈసీ కట్టడి చేయడం రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలైన బీఎస్పీ, బీజేపీకి పెద్ద షాకే. -
ఏపీ ఎన్నికల సవాల్‌ని అధిగమించిన ఈసీ
-
బాబుకు ఈసీ స్ట్రాంగ్ కౌంటర్!
-
ఈవీఎంలపై చంద్రబాబు డ్రామా
-
చెప్పినట్లు చేయలేదనే ఈసీపై నిందారోపణలు
-
సీఎస్, డీజీపీలతో ఈసీ ప్రత్యేక భేటీ
హైదరాబాద్: తెలంగాణ సీఎస్, డీజీపీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి ప్రత్యేకంగా సోమవారం సమావేశం కానున్నారు. మాసాబ్ టాంక్‌లోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. అన్ని జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లతో ఈ నెల 18వ తేదీన హోటల్ మారియట్‌లో సమావేశం కానున్నారు. శాంతిభద్రతలు, ఎన్నికల ఏర్పాట్లపై చర్చించనున్నారు. 18వ తేదీ సమావేశం తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. పేపర్ బ్యాలెట్ ద్వారానే ఎన్నికల నిర్వహణ ఉంటుందని స్పష్టం చేశారు. ఎంపీటీసీలకు పింక్, జెడ్పీటీసీలకు వైట్ కలర్ బ్యాలెట్లు వినియోగించనున్నట్లు అధికారులు వెల్లడించారు. స్వతంత్ర అభ్యర్థుల కోసం ముందు జాగ్రత్తగా 100 గుర్తులను అధికారులు అందుబాటులో ఉంచారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి 57 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తాజాగా మరో 3 లక్షల మంది ఓటర్లు పెరిగే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. -
వైఎస్సార్సీపీ ఏజెంట్లపై రౌడీయిజం: గరటయ్య
అమరావతి: ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తాను చెప్పినట్లు ఎన్నికల కమిషన్ పని చేయలేదనే అక్కసుతోనే ఈసీపై నిందారోపణలు వేస్తున్నారని వైఎస్సార్సీపీ అద్దంకి ఎమ్మెల్యే అభ్యర్థి బాచిన చెంచు గరటయ్య విమర్శించారు. అమరావతిలో ఎన్నికల అధికారి మార్కండేయుల్ని శనివారం గరటయ్య కలిశారు. సంతమాగలూరు మండలంలో పోలింగ్ సిబ్బంది అండతో టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడిందని ఫిర్యాదు చేశారు. తంగేడుమల్లిలోని 56,57, అడవిపాలెంలోని 6,7, మక్కెనవారిపాలెంలోని 34, 43 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల అధికారులను విజ్ఞప్తి చేశారు. ఆరు పోలింగ్ స్టేషన్లలో వెబ్ కెమెరాలు తొలగించి రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ ఏజెంట్లపై రౌడీయిజం చేసి బయటికి నెట్టేశారని ఆరోపించారు. అధికార పార్టీతో స్థానిక అధికారులు చేతులు కలిపారని, ఈ విషయంపై ఫిర్యాదు చేసినా స్పందించలేదని చెప్పారు. ప్రధాన పార్టీ నుంచి పోటీ చేస్తోన్న అభ్యర్థినని కూడా చూడకుండా తనను బూత్‌లోకి రాకుండా అడ్డుకున్నారని వాపోయారు. వీడియోలను పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. సీఈఓ న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు. జిల్లాల్లో చంద్రబాబుకు అనుకూలంగా పని చేసేవారిని నియమించుకుని అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. -
ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం ఉంది: సీఈవో
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికలకు సం బంధించి ఎగ్జిట్ పోల్స్‌తోపాటు, ఫలితాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రచురించడం, వ్యాప్తి చేయడంపై చట్టం ప్రకారం ఆంక్షలున్నాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) రజత్‌కుమార్ తెలిపారు. అదేవిధంగా వాటి ని నిక్కచ్చిగా పాటించాలని బుధవారం విడుదల చేసిన ఒక లేఖలో పేర్కొన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం–1951కు సంబంధించిన సెక్షన్ 126ఎ లోని సబ్ సెక్షన్(1), (2)ల కింద సంక్రమించిన అధికారాలను వినియోగించి ఎన్నికల కమిషన్ ఈనెల 11న (గురువారం) ఉదయం 7 నుంచి, మే 19న సాయంత్రం 6.30 గంటల వరకు ఈ ఆంక్షలు ఉంటాయని ఆయన వివరించారు. ఈ మధ్య కాలంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ఎటువంటి ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ, ప్రచురణ లేదా సమాచారం వ్యాప్తి చేయకూడదని, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా ప్రకటించకూడదని తెలిపారు. పోలింగ్ ముగింపునకు నిర్ణయించిన సమయానికి ముందున్న 48 గంటల వ్యవధిలో, ఎటువంటి ఒపీనియన్ పోల్స్ ఫలితాలు, లేదా మరే ఇతర పోల్ సర్వే లు, తదితర ఎన్నికల సమాచారం ప్రకటన, ప్రచురణ వంటివి నిషిద్ధమని స్పష్టం చేశారు. -
కేసీఆర్‌కు ఈసీ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మార్చి 17న కరీంనగర్ సభలో ఆయన హిందువు లపై అమర్యాదకర వ్యాఖ్యలు చేశారంటూ అందిన ఫిర్యాదు ఆధారంగా ఈ నోటీసులు పంపింది. ‘‘ఈ హిందూ గాళ్లు.. బొందు గాళ్లూ.. దిక్కుమాలిన.. దరి ద్రపు గాళ్లు..’’అంటూ కేసీఆర్ వ్యాఖ్యలు చేశారని, అలాగే ‘‘దేశంలో అగ్గి పెట్టాలే. గత్తర లేవాలె’అంటూ హిందువులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు రాంరాజు చేసిన ఫిర్యాదును ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకుంది. దీనిపై శుక్రవారం సాయంత్రం 5లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కేసీఆర్ ప్రసంగాన్ని ఆంగ్లంలో తెప్పించుకోవడంతోపాటు రాష్ట్ర సీఈవో ద్వారా వాస్తవ నివేదిక తెప్పించుకొని పరిశీలించినట్లు సీఈసీ నోటీసులో పేర్కొంది. ‘కేంద్ర ఎన్నికల సంఘం ప్రాథమికంగా ఒక అభిప్రాయానికి వచ్చింది. మీరు చేసిన ప్రకటన.. మత సామరస్యానికి విఘా తం కలిగించేలా ఉంది. మతపర విభేదాలను పెంచేదిగా ఉంది. తద్వారా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని మీరు ఉల్లంఘించారు. దీనిపై సంజాయిషీ ఇచ్చేం దుకు కమిషన్ మీకు ఒక అవకాశం కల్పిస్తోంది. 12వ తేదీ సాయంత్రం 5లోగా మీరు వివరణ ఇవ్వండి. ఇందులో మీరు విఫలమైతే తదుపరి ఎలాంటి నోటీసు లేకుండా చర్యలు తీసుకుంటాం’ అని కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులో పేర్కొంది. చింతమడకలో కేసీఆర్ ఓటు సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ తన సొంత ఊరు చింతమడకలో సతీసమేతంగా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కేసీఆర్ గురువారం హెలికాప్టర్లో చింతమడకకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుని హెలికాప్టర్లోనే తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు. హెలికాప్టర్ దిగేందుకు వీలుగా చింతమడకలో ఏర్పాట్లు చేశారు. -
ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం
హైదరాబాద్: ఏప్రిల్ 11న జరుగనున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్‌తో పాటూ , ఫలితాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రచురించడం, వ్యాప్తి చేయడంపై చట్ట ప్రకారం ఆంక్షలున్నాయని, వాటిని నిక్కచ్చిగా పాటించాలని తెలంగాణా ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ రజత్ కుమార్ బుధవారం పత్రికా ప్రకటనలో తెలిపారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951కి సంబంధించిన సెక్షన్ 126ఏ లోని సబ్ సెక్షన్(1),(2)ల కింద సంక్రమించిన అధికారాలను వినియోగించి ఎన్నికల కమిషన్(ఈసీ) ఏప్రిల్ 11న ఉదయం 7 నుంచి, మే 19న సాయంత్రం 6.30 గంటల వరకు ఈ ఆంక్షల్ని విధించిందని ఆయన చెప్పారు. ఈ మధ్య కాలంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ఎటువంటి ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ, ప్రచురణ లేదా సమాచారం వ్యాప్తి చేయకూడదని, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా ప్రకటించకూడదని ఆయన స్పష్టం చేశారు. పోలింగ్ ముగింపునకు నిర్ణయించిన సమయానికి ముందున్న 48 గంటల వ్యవధిలో, ఎటువంటి ఓపీనియన్ పోల్స్ ఫలితాలు లేదా మరే ఇతర పోల్ సర్వేలు, తదితర ఎన్నికల సమాచారం ప్రకటన, ప్రచురణ కూడా నిషిద్ధమని వివరించారు. -
మాయావతి వ్యాఖ్యలపై ఈసీ ఆరా
సాక్షి, న్యూఢిల్లీ : బీఎస్పీ అధినేత్రి మాయావతి వివాదంలో చిక్కుకున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ముస్లింలు కాంగ్రెస్‌కు ఓటు వేయవద్దని కోరుతూ ఆమె చేసిన వ్యాఖ్యలను ఈసీ పరిశీలిస్తోంది. యూపీలోని దియోబంద్‌లో ఆదివారం జరిగిన ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్డీ ర్యాలీలో మాయావతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాయావతి ప్రసంగంపై నివేదిక పంపాలని సంబంధిత అధికారులను యూపీ ఎన్నికల ప్రధానాధికారి ఆదేశించారు. మహాకూటమిని ఓడించేందుకు ముస్లిం ఓట్లలో చీలికకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మాయావతి ఆరోపిస్తూ ఆ పార్టీకి ముస్లింలు ఓటు వేయవద్దని కోరారు. బీజేపీని ఓడించాలని భావించే ముస్లింలు యూపీలో మహాకూటమివైపే నిలవాలని సూచించారు. మాయావతి ఇంకా ఏమన్నారంటే..‘ బీజేపీని ఓడించే సామర్ధ్యం కాంగ్రెస్ పార్టీకి లేదు..మహాకూటమితోనే కాషాయ పార్టీని నిలువరించడం సాధ్యం..కాంగ్రెస్‌కు మాత్రం ఓటేయకండి..ఆ పార్టీ మహాకూటమి ఓటమిని కోరుకుంటోంద’ని మాయావతి అన్నారు. మాయావతి వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకున్న ఈసీ ఆమె వ్యాఖ్యలపై పూర్తి నివేదిక పంపాలని స్ధానిక అధికారులను కోరింది. -
ప్రకాశ్ రాజ్‌పై ప్రజావ్యాజ్యం వేస్తాం
శివాజీనగర : బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్ కర్ణాటకతో పాటు మూడు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలో పేరు ఉండటంతో హైకోర్టులో వ్యాజ్యం వేయనున్నట్లు శాంతినగర నివాసి కే.గిరీశ్ కుమార్ నాయుడు తెలిపారు. ఆదివారం బెంగళూరు ప్రెస్‌క్లబ్‌లో మూడు చోట్ల ఓటర్ల జాబితా ఉన్న విషయాన్ని తెలియజేసిన ఆయన, బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసిన సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ శాంతినగర అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో తమ పేరును చేర్చారు. మిగిలిన తమిళనాడులో, తెలంగాణ రాష్ట్రంలో సేర్‌లింగమ్ పల్లి శాసనసభ నియోజకవర్గ ఓటర్ల జాబితాను తమ పేరును అలాగే ఉంచుకొన్నారని ఆరోపించారు. రాజ్యాంగ ఎన్నికల నియమాల ప్రకారం ఒక వ్యక్తికి ఒకేచోటకంటే అధిక విధానసభా నియోజకవర్గ ఓటర్ల జాబితాలో పేరు ఉంచుకోవటం చట్ట ఉల్లంఘన అవుతుందన్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గతనెల 28న ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. హైకోర్టులో ఈ విషయంపై ప్రజావాజ్యం వేస్తామన్నారు. -
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్
-
ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో నెగ్గని చంద్రబాబు వాదన
-
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల సమరం దగ్గర పడింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ఈ రోజుతో(గురువారం) ముగిసింది. ఎవరు పోటీలో ఉంటారు, ఎవరు ఉండరు అనేది ఈరోజుతో తేలిపోతుంది. తొలి విడతలో భాగంగా 20 రాష్ట్రాల్లో 91 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 10న ఎన్నికల షెడ్యూల్ విడులైన సంగతి తెల్సిందే. ఎన్నికల నోటిఫికేషన్ 18న విడుదల అయిన నాటి నుంచి 25వ తారీఖు వరకు నామినేషన్లు స్వీకరించారు. నామినేషన్లను ఈ నెల 26న ఎన్నికల అధికారులు పరిశీలించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ రోజుతో గడువు ముగిసింది. ఏప్రిల్ 11న రెండు తెలుగు రాష్ట్రాలతో మరికొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. మే 23న లోక్‌సభతోపాటు, శాసనసభ ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు. -
బిగ్ బ్రేకింగ్: ఈసీ సంచలన నిర్ణయం
ఢిల్లీ: ఏపీ ఇంటెలిజెన్స్ ఐజీ ఏబీ వెంకటేశ్వర రావును ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. అలాగే శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం, కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మలను కూడా ఎన్నికల విధుల నుంచి తప్పించింది. పోలీస్ హెడ్ క్వార్టర్‌కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వీరికి ఎటువంటి ఎన్నికల పనులు అప్పగించవద్దని ఈసీ ఆదేశించింది. వారి స్థానాల్లో తదుపరి సీనియర్ అధికారులకు బాధ్యతలను అప్పగించాలని తెలిపింది. పోలీస్ వ్యవస్థలో కీలక అధికారులుగా ఉన్న వీరు ఈ సార్వత్రిక ఎన్నికల్లో తమ విధులను సక్రమంగా నిర్వర్తించకుండా తెలుగుదేశం కార్యకర్తల్లా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా పనిచేస్తుండటంతో ఈసీ కఠిన నిర్ణయం తీసుకుంది. ఏబీ వెంకటేశ్వర రావు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని, పలు దఫాలుగా వైఎస్సార్సీపీ, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెల్సిందే. దీనిపై విచారణ చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం వెంకటేశ్వరరావుతో పాటు ఇద్దరు ఎస్పీలను ఎన్నికల విధుల నుంచి తప్పించింది. -
పవన్ కల్యాణ్‌పై ఎంవీఎస్ ఫిర్యాదు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేదీని వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి కలిశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారంటూ పవన్ కల్యాణ్‌పై ఫిర్యాదు చేశారు. రెండు మూడు రోజులుగా నియమావళికి విరుద్ధమైన పదాలు వాడుతూ విద్వేషాలు రెచ్చగొడుతున్న పవన్ కల్యాణ్‌పై చర్యలు తీసుకోవాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. హెరిటేజ్ ఫార్మర్స్ వెల్ఫేర్ ట్రస్టు ముసుగులో రాష్ట్ర వ్యాప్తంగా డబ్బు పంపిణీ జరుగుతుందని చెప్పారు. ఆ విషయాన్ని కూడా ట్రస్ట్ అధికారిక ట్విట్టర్లో పోస్టు చేసిందని తెలిపారు. ఆ ఆధారాలను ఎంవీఎస్ నాగిరెడ్డి, ఎన్నికల ప్రధానాధికారికి సమర్పించారు. అలాగే వైఎస్సార్సీపీపై సోషల్ మీడియాలో చేస్తోన్న అసత్య ప్రచారాన్ని కూడా ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్లు నాగిరెడ్డి తెలిపారు. -
లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలపై తొలగని ఉత్కంఠ
సాక్షి, అమరావతి : రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై వచ్చిన ఫిర్యాదులను ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. సినిమా విషయంలో ఎన్నికల సంఘం నిబంధనల మేరకు వ్యవహరిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు.పరిశీలన తర్వాత తుది నిర్ణయం వెలువరిస్తామని ఆయన స్పష్టం చేశారు. మార్చి 25న ఓటర్ల తుది జాబితా ఈనెల 25న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామని గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు చోటుచేసుకోకుండా చూశామని, కొత్త ఓట్ల చేర్పుపై దుష్ప్రచారం చేయవద్దని కోరారు.రాష్ట్రంలో ఎవరి ఓటు తొలగించలేదని, దరఖాస్తు చేసిన వారిలో అర్హులైన వారందరికి ఓటు హక్కు కల్పించామని చెప్పారు. కాగా, రాష్ట్రానికి 75మంది ఎన్నికల పరిశీలకులను నియమించామని, ప్రతి రెండు లోక్‌సభ నియోజక వర్గాలకు ఓ పోలీస్ పరిశీలకుడు., ఓ సాధారణ పరిశీలకుడు,ప్రతి మూడు అసెంబ్లీ నియోజక వర్గాలకు ఓ సాధారణ పరిశీలకులు పర్యవేక్షిస్తారని చెప్పారు.రాజకీయ పార్టీలు, ప్రజలు పరిశీలకులకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చన్నారు.