సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల సమరం దగ్గర పడింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ఈ రోజుతో(గురువారం) ముగిసింది. ఎవరు పోటీలో ఉంటారు, ఎవరు ఉండరు అనేది ఈరోజుతో తేలిపోతుంది. తొలి విడతలో భాగంగా 20 రాష్ట్రాల్లో 91 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 10న ఎన్నికల షెడ్యూల్ విడులైన సంగతి తెల్సిందే. ఎన్నికల నోటిఫికేషన్ 18న విడుదల అయిన నాటి నుంచి 25వ తారీఖు వరకు నామినేషన్లు స్వీకరించారు.
నామినేషన్లను ఈ నెల 26న ఎన్నికల అధికారులు పరిశీలించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ రోజుతో గడువు ముగిసింది. ఏప్రిల్ 11న రెండు తెలుగు రాష్ట్రాలతో మరికొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. మే 23న లోక్‌సభతోపాటు, శాసనసభ ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు.
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
Published Thu, Mar 28 2019 3:45 PM | Last Updated on Thu, Mar 28 2019 4:13 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment