
హైదరాబాద్: తెలంగాణ సీఎస్, డీజీపీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి ప్రత్యేకంగా సోమవారం సమావేశం కానున్నారు. మాసాబ్ టాంక్‌లోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. అన్ని జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లతో ఈ నెల 18వ తేదీన హోటల్ మారియట్లో సమావేశం కానున్నారు. శాంతిభద్రతలు, ఎన్నికల ఏర్పాట్లపై చర్చించనున్నారు. 18వ తేదీ సమావేశం తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. పేపర్ బ్యాలెట్ ద్వారానే ఎన్నికల నిర్వహణ ఉంటుందని స్పష్టం చేశారు.
ఎంపీటీసీలకు పింక్, జెడ్పీటీసీలకు వైట్ కలర్ బ్యాలెట్‌లు వినియోగించనున్నట్లు అధికారులు వెల్లడించారు. స్వతంత్ర అభ్యర్థుల కోసం ముందు జాగ్రత్తగా 100 గుర్తులను అధికారులు అందుబాటులో ఉంచారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి 57 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తాజాగా మరో 3 లక్షల మంది ఓటర్లు పెరిగే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment