లక్నో: ఎన్నికలంటే చాలు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు గెలుపు కోసం నానాతంటాలు పడుతుంటారు. అయితే ఈ క్రమంలో కొందరు మాత్రం ఎన్నికల నియమాలను దాటి ప్రవర్తిస్తూ అడ్డంగా బుక్కవుతుంటారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ మంత్రి కొడుకు ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో.. త్వరలో యూపీ రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ( చదవండి: Anand Mahindra: మహీంద్రా షోరూంలో రైతుకు ఘోరఅవమానం.. ఎట్టకేలకు స్పందించిన ఆనంద్ మహీంద్రా )
ఇప్పటికే ఆ రాష్ట్రంలో ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్నాయి. ఇదిలా ఉండగా యూపీ మంత్రి, శిఖర్‌పూర్ స్థానం అభ్యర్థి అనిల్ శర్మ కుమారుడు ప్రజలకు డబ్బు పంచుతున్నట్లు వీడియో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి 24 గంటల్లో సదరు మంత్రిని ఈ ఘటనపై వివరణ కోరారు. ఆ వీడియోలో శర్మ కుమారుడు కుష్ తన వాహనం దగ్గర డ్రమ్ బీట్‌ల శబ్దాల మధ్య ప్రజలకు 100 రూపాయల నోట్లను పంచుతూ కనిపించాడు. ఎన్నికల నియమావళిని స్పష్టంగా ఉల్లంఘించినట్లు స్పష్టంగా కనిపిస్తోందని, 24 గంటల్లో మంత్రిని వ్రాతపూర్వక వివరణ కోరుతూ రిటర్నింగ్ అధికారి మంత్రికి నోటీసులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment