distributing money
-
ఓటర్లకు నేరుగా డబ్బులు పంపిణీ చేసిన టీడీపీ నేత మోహన్ రెడ్డి
-
పట్టపగలే ఓటర్లకు డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిన సోమిరెడ్డి
-
ఒక్కో నేతకు 10 లక్షలు...అడ్డంగా దొరికిన టీడీపీ
-
ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికిన బీజేపీ మంత్రి కొడుకు.. వీడియో వైరల్
లక్నో: ఎన్నికలంటే చాలు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు గెలుపు కోసం నానాతంటాలు పడుతుంటారు. అయితే ఈ క్రమంలో కొందరు మాత్రం ఎన్నికల నియమాలను దాటి ప్రవర్తిస్తూ అడ్డంగా బుక్కవుతుంటారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ మంత్రి కొడుకు ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో.. త్వరలో యూపీ రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ( చదవండి: Anand Mahindra: మహీంద్రా షోరూంలో రైతుకు ఘోరఅవమానం.. ఎట్టకేలకు స్పందించిన ఆనంద్ మహీంద్రా ) ఇప్పటికే ఆ రాష్ట్రంలో ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్నాయి. ఇదిలా ఉండగా యూపీ మంత్రి, శిఖర్పూర్ స్థానం అభ్యర్థి అనిల్ శర్మ కుమారుడు ప్రజలకు డబ్బు పంచుతున్నట్లు వీడియో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి 24 గంటల్లో సదరు మంత్రిని ఈ ఘటనపై వివరణ కోరారు. ఆ వీడియోలో శర్మ కుమారుడు కుష్ తన వాహనం దగ్గర డ్రమ్ బీట్ల శబ్దాల మధ్య ప్రజలకు 100 రూపాయల నోట్లను పంచుతూ కనిపించాడు. ఎన్నికల నియమావళిని స్పష్టంగా ఉల్లంఘించినట్లు స్పష్టంగా కనిపిస్తోందని, 24 గంటల్లో మంత్రిని వ్రాతపూర్వక వివరణ కోరుతూ రిటర్నింగ్ అధికారి మంత్రికి నోటీసులు జారీ చేశారు. -
డబ్బులిస్తాం.. మా వెంట రండహో!
అడిగినంత ఇస్తాం.. మా వెంట రండీ.. అంటూ టీడీపీ శ్రేణులు పచ్చ నోట్లు చూపిస్తూ జనాన్ని మభ్య పెట్టే యత్నం చేస్తున్నారు. మద్యం తాగించి మరీ కొంత మందిని ఊరేగింపునకు రప్పించుకున్నారు. అనంతపురం జిల్లా కణేకల్లు మండలంలోని తుంబిగనూరు గ్రామ పంచాయతీలో గురువారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సర్పంచి స్థానానికి టీడీపీ మద్దతుతో ఆ పార్టీ నేత కొట్రేగౌడ్ కుమార్తె అర్చన నామినేషన్ వేశారు. టీడీపీ నేతలు ఇలా బహిరంగంగా ప్రలోభాలకు గురిచేశారు. సాక్షి, అమరావతి బ్యూరో: ‘అమ్మా.. మీ కుటుంబంలో ఎనిమిది మందికి ఓటు ఉంది. మీరంతా మేము బలపరుస్తున్న సర్పంచి అభ్యర్థికి ఓటు వేయండి. అందుకుగాను మీకు రూ.10 వేలు ఇస్తాం. డబ్బు తీసుకునే ముందు మా అభ్యర్థికే ఓటు వేస్తామని ఒట్టు వేయండి..’ ఇది కొద్దిరోజులుగా విజయవాడలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నందిగామ మండలానికి చెందిన ఓ కుటుంబాన్ని టీడీపీ నేతలు మంగళవారం అర్ధరాత్రి కలిసి ఓట్లు కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన తీరు. (చదవండి: 523 పంచాయతీల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవం) పార్టీ రహితంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు వ్యవహరిస్తున్న తీరు ఇది. పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఎన్నికలను సైతం భ్రష్టు పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఓట్లు కొనుగోలు చేసేందుకు నోట్లు పట్టుకుని ఇంటింటికి తిరుగుతున్నారు. ఒక్కో ఓటుకు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు ఇస్తామని చెబుతున్నారు. ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. ఉపాధి కోసం ఊరి నుంచి వచ్చి ఒకేచోట ఎక్కువమంది ఉంటున్న ప్రాంతాలకు వెళ్లి ఓట్లను గంపగుత్తగా కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిని విందులు, వినోదాలకు తీసుకెళుతున్నారు. కొన్నిచోట్ల నేరుగా అభ్యర్థులే వెళుతుండగా.. మరికొన్ని ప్రాంతాలకు అనుచరులను పంపుతున్నారు.(చదవండి: పల్లెల్లో చిచ్చు: టీడీపీ-జనసేన అడ్డదారులు..) రాకపోకల ఖర్చులకు ఆన్లైన్లో డబ్బులు.. కృష్ణా జిల్లాలో నందిగామ, జగ్గయ్యపేట, విజయవాడ రూరల్, గన్నవరం, పెనమలూరు, పామర్రు, మైలవరం మండలాల్లోని 234 గ్రామ పంచాయతీలకు మొదటి విడత ఎన్నికలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఆయా గ్రామాల్లో గతనెల 29న నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభం కాగా.. గురువారం ఉపసంహరణ గడువు ముగిసింది. దీంతో బరిలో ఉన్న టీడీపీకి చెందినవారి గెలుపునకోసం వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా నందిగామ, మైలవరం, పెనమలూరు, జగ్గయ్యపేట, విజయవాడ రూరల్ తదితర ప్రాంతాల నుంచి విజయవాడకు వచ్చి నివసిస్తున్న ఓటర్లపై టీడీపీ నేతలు దృష్టి సారించారు. సొంతూరు వచ్చి ఓటేసి తిరిగి వెళ్లేందుకు అయ్యే ఖర్చులకు సొమ్ము అందజేస్తున్నారు. విజయవాడ నుంచి స్వగ్రామాలకు తీసుకెళ్లేందుకు బస్సులు, కార్లు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. దూరప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లతో అభ్యర్థులు ఫోన్లలో నిత్యం మాట్లాడుతున్నారు. పోలింగ్ సమయానికి రావాలని, ఖర్చులన్నీ తాము చూసుకుంటామని హామీలిస్తున్నారు. కొందరికి ఖర్చులకోసం ముందే ఆన్లైన్లో డబ్బులు పంపుతున్నారు. -
నేటితో ప్రచారాలు సరి.. ప్రలోభాలే మరి!
సాక్షి, శ్రీకాకుళం పాతబస్టాండ్: సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ దగ్గర పడడంతో ఓటరుని ప్రసన్నం చేసుకునేందుకు టీడీపీ నాయకుల తాపత్రయం ఎక్కువైంది. ఇప్పటికే ప్రజలు టీడీపీని వ్యతిరేకిస్తున్నారన్న విషయం గుర్తించిన అధికార పార్టీ నాయకులు ఓటర్లను ప్రలోభ పెట్టే పనిలో పడ్డారు. ఓటరుని తమ వైపు తిప్పుకునేందుకు నగ దు, మద్యం, చీరలు, పంచెలు, ఇతర వస్తువులతో ప్రలోభాల పర్వానికి తెరతీశారు. ఇప్పటికే టీడీపీ కార్యకర్తలు ఈ నజరానాల పంపిణీలో తలమునకలై ఉన్నారు. గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోంది. ఓటింగ్ కేవలం రెండు రోజులే ఉన్నందున ఈ ప్రలోభాలు మరింత పెంచారు. ఇప్పటికే గ్రామాల్లో టీడీపీ కార్యకర్తల ఇళ్లకు నగదు, మద్యం నిల్వలు చేరవేశారు. ఐదేళ్లుగా అడ్డగోలుగా, టీడీపీ పాలకులు అక్రమ సంపాదనతో ఓట్లను కొనే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని చోట్ల ఓటుకి వెయ్యి నుంచి రెండు వేల వరకు పంపిణీ చేస్తున్నట్టు సమాచారం. పెచ్చుమీరుతున్న ఆగడాలు.. అధికార పార్టీ ఆగడాలు పెచ్చుమీరాయి. ఈ ఆగడాలను అరికట్టడంలో ఎన్నికల అధికారులు ఆశించినంతంగా విజయవంతం కావడం లేదు. ఫిర్యాదుల పరిశీలనే తప్ప వారు నేరుగా క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. వేర్వేరు మార్గాల్లో.. టీడీపీ కార్యకర్తలు ఎక్కువగా మహిళల ఓట్లను కొల్లకొట్టేందుకు టార్గెట్‌గా పెట్టుకున్నా రు. దీంతో డ్వాక్రా మహిళలను ప్రలోభాలకు గురి చేస్తూ ఈ పంపిణీ చేస్తున్నట్టు తెలుస్తోంది. గ్రామీణ మహిళలను ఈ ప్రలోభాలకు వినియోగించుకుంటున్నారు. వారి వద్ద నుంచే ఆయా సంఘాలకు డబ్బులు అందేలా చేస్తున్నారు. ఉపాధి హామీలో పనిచేస్తున్న వారిని కూడా పావులుగా వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో ఉపా«ధి పనుల్లో ప్రచారం, అక్కడ మేట్, క్షేత్ర సహాయకుల ద్వారా ఈ పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. టెక్కలి నియోజకవర్గంలోనూ, మెళియాపుట్టిలో ఎన్ఆర్ఈజీఎస్ క్షే త్ర సహాయకులు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలియడంతో ముగ్గురిని విధుల నుంచి తప్పించారు. డీలర్లను కూడా నాయకులు భయపెట్టి తమ దారిలోకి తెచ్చుకుంటున్నారు. నెల తొలి రోజులు కావడంతో సరుకుల పంపిణీతో పాటు తమ ప్రచారాలు కూడా చూసుకోవాలని బెదిరిస్తున్నారు. టెక్కలిలో.. టెక్కలి నియోజకవర్గానికి మంత్రి కింజరా పు అచ్చెన్నాయుడు ఈ సారి కూడా టీడీపీ తరఫున బరిలో ఉన్నారు. ఆయన గతంలో ప్రలో భాలతో గెలిచారని ఆ నియోజకవర్గం ప్రజలు చెబుతున్నారు. అయితే ఈ సారి కూడా అదే పంథాను సాగిస్తున్నారు. ఎన్నికల్లో ఓటర్లకు ఎర వేసేందుకు నగదు పంపిణీకి తెర తీశారు. సోమవారమే చాలా వరకు ఈ ప్రక్రియ ముగిసింది. మహిళలకు చీరలు, వృద్ధులకు పంచెలు, యువతకు డ్రస్సులు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ఓటుకు ఐదు వందల నుంచి రెండు వేల వరకు పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది. ♦ ఆమదాలవలస నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కూన రవికుమార్ అనుచరులు ప్రతి ఇంటికి వెళ్లి పింఛన్లు మంజూరు చేశామని, డ్వాక్రా డబ్బులు అందించామని, వాటితోపాటు చిరు ఉద్యోగాలు చేస్తున్న వారిని, వ్యాపారాలు చేస్తున్న వారిని బెదిరిస్తూ ఓట్లు వేయాలని ప్ర లోభాలకు గురి చేస్తున్నారు. కార్యకర్తలు కూడా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ♦ ఎచ్చెర్ల నియోజకవర్గంలో ప్రస్తుతం టీడీపీ దాదాపుగా గ్రామాలకు డబ్బులు, మద్యం చేరవేసింది. అడ్డతోవల్లో ఓట్లర్లను కొనుగోలు చేసేం దుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ♦ నరసన్నపేట నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి ఓటర్లును ప్రలోభ పెట్టేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో డబ్బు, మద్యం పెద్ద ఎత్తున తరలించిన పార్టీ శ్రేణులు వీటిని కార్యకర్తలకు ఇస్తున్నారు. అలాగే మహిళలను కూడా ప్రలోభ పె ట్టేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓటరకు వెయ్యి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ♦ పాలకొండ నియోజకవర్గంలో ప్రచార పర్వం పూర్తి కావస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ నేతలు నగదు పంపిణీ చేసే పనిలో పడ్డారు. పార్టీ దిగువ శ్రేణి నాయకులు, కార్యకర్తలకు ఒక్కొక్కరికి రూ. 5వేల చొప్పున నగదు ఇచ్చి ప్రతి ఇంటి యజమానికి రూ. 2వేల వంతున ప్రచార కరపత్రాల ద్వారా అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ♦ పలాస నియోజకవర్గం పరిధిలో టీడీపీ నాయకులు కార్యకర్తలకు రూ.500 చొప్పున రోజుకు అందిస్తున్నారు. భోజనాలు, వాహన సదుపాయం, వారికి నచ్చినటువంటి బ్రాండ్ మందు అందజేస్తున్నారు. ♦ పాతపట్నం నియోజవర్గంలో ఫిరాయింపు ఎమ్మెల్యే ఈ సారి పెద్ద ఎత్తునే ఖర్చు చేస్తున్నారు. ఆయన పార్టీ ఫిరాయించిన తర్వాత అక్రమార్జన పెరిగింది. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు ఓటరుని ప్రలోభాలకు గురి చేస్తూ, మద్యం, నగదు పెద్ద ఎత్తున పంపకాలు చేస్తున్నారు. -
పామూరులో టీడీపీ నేతల బరితెగింపు
సాక్షి, పామూరు (ప్రకాశం): సార్వత్రిక ఎన్నికల్లో ధనబలంతో గెలవాలని భావించిన టీడీపీ నాయకులు ఓటర్లకు ఎరగా నగదు పంపిణీకి సిద్ధమయ్యారు. అందుకు కేంద్రంగా ఏకంగా స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయాన్నే ఎంచుకున్నారు. సోమవారం కొందరు టీడీపీ నాయకులు ఓటర్ల జాబితా, స్లిప్పులు, ట్యాబ్‌లు తీసుకుని పంచాయతీ కార్యాలయానికి వచ్చారు. పంచాయతీ కార్యాలయానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి రాఘవులు రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకలాపాలు ఇక్కడ చేయకూడదని వారికి చెప్పారు. టీడీపీకి చెందిన మాజీ సర్పంచి ఇక్కడే చేసుకోమని చెప్పాడని ఆ పార్టీ నాయకులు తిరిగి సమాధానం చెప్పారు. రాఘవులు వారిని లోపలే ఉంచి తలుపునకు గొళ్లెం వేశాడు. విషయాన్ని పంచాయతీ కార్యదర్శి రంగయ్యకు చెబుదామనుకుంటే ఆయన అందుబాటులో లేకపోవడంతో పాత్రికేయులకు సమాచారం ఇచ్చారు. పాత్రికేయులు, వైఎస్సార్ సీపీ నాయకులతో పాటు పలువురు పంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్లే సరికే అప్పటికే అక్కడికి చేరుకున్న టీడీపీ నాయకులు సిబ్బంది రాఘవులుపై ఆగ్రహం వ్యక్తం చేసి డోర్ గొళ్లెం తీసుకుని హడావుడిగా బయటకు వెళ్లిపోయారు. ఓటరు జాబితా, నగదు, స్లిప్పుల బ్యాగ్‌తో టీడీపీ నాయకులు పంచాయతీ కార్యాలయం నుంచి పరారయ్యారు. విషయాన్ని తహసీల్దార్ వెంకటరత్నం, ఎంపీడీఓ, ఎన్నికల అధికారి రాజారత్నం, ఎస్ఐ టి.రాజ్‌కుమార్‌లకు తెలపగా వారు వివరాలు సేకరిస్తున్నారు. ఈవీఎం నమూనాలు సైతం పెద్ద సంఖ్యలో పంచాయతీ కార్యాలయంలో ఉంచారు. పంచాయతీ కార్యాలయానికి వచ్చే వారికి, పింఛన్ల కోసం వచ్చే వారికి సైకిల్ గుర్తుకు ఓటు వేయమని పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బందే ఎన్నికల ప్రచారంతో పాటు ఈ తంతులో భాగస్వాములుగా ఉండటం గమనార్హం. చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొంటున్నారు. -
‘పచ్చ’కోట్ల పబ్లిక్ జాతర
► టెర్రర్ గుప్పిట్లో సామాన్యుడి ‘చిల్లర’ ► నంద్యాల ఉప ఎన్నికల్లో అధికారపార్టీ అంతులేని అరాచకాలు ► పట్టించుకోని పోలీసులు, అధికారయంత్రాంగం ► ఒత్తిళ్లతో ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులపై దాడులు ► వారినుంచి సొంత అవసరాల సొమ్ములు స్వాధీనం ► టీడీపీ వందలకోట్లు వెదచల్లుతున్నా పట్టని పోలీసులు సాక్షి, అమరావతి/ కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికలో ఎన్ని అడ్డదారులు తొక్కి అయినా గెలిచేందుకు తెలుగుదేశం పార్టీ పబ్లిక్‌గా వందల కోట్ల రూపాయలను వెదజల్లుతోంది. సొంత పార్టీ నేతలకు కోట్ల కొద్దీ డబ్బులు ఇవ్వడంతో పాటు ఇతర పార్టీల నేతలకూ డబ్బు మూటలతో ఎరవేస్తోంది. ఇదంతా బహిరంగంగా కళ్లెదుటే జరుగుతున్నా పోలీసు, అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. మరోవైపు అధికార పార్టీ ఒత్తిళ్లతో ప్రతిపక్ష పార్టీలకు చెందిన, వారితో పరిచయమున్న వ్యక్తులో.. ఇతర చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారిపై మాత్రం దాడులు చేయిస్తున్నారు. సొంత అవసరాలు, వ్యాపారాల కోసం వారు దాచుకున్న చిన్నచిన్న మొత్తాలను స్వాధీనం చేసుకుంటున్నారు. అధికార పార్టీ ఎన్ని అరాచకాలకు తెగబడుతున్నా పట్టించుకోని యంత్రాంగం.. చిన్నచిన్న వ్యక్తులు, నాయకులను మాత్రం భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీ డబ్బును మంచి నీళ్ల ప్రాయంలా ఖర్చు చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ, అనుకూలంగా లేని వారిని బెదిరింపులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నా అడిగే నాథుడు లేడు. ప్రతిరోజూ ప్రచారం కోసమే రూ.12.75 కోట్లు ఖర్చు చేస్తోందంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నంద్యాలలో ఇప్పటి వరకు టీడీపీ చేసిన ఖర్చు రూ.100 కోట్లు దాటిపోగా, మరో 150 కోట్ల వరకు సిద్ధం చేయిస్తోంది. ఇవన్నీ ఒకవైపు చేస్తూనే మరోవైపు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై బురదజల్లే కార్యక్రమాలకు దిగుతోంది. తాము వేసిన రోడ్లపై నడుస్తూ, పెన్షన్లు, రేషన్ తీసుకుంటూ తమకు ఓటు వేయరా? అంటూ నోటిఫికేషన్‌కు ముందే సీఎం హోదాలో చంద్రబాబు ప్రజలను బెదిరించగా.. ఆ పరంపరను ఆ పార్టీకి చెందిన ఇతర నేతలు నంద్యాలలో రోజూ కొనసాగిస్తున్నారు. చివరకు సొంత పార్టీ కార్యకర్తలపై కూడా చేయి చేసుకుంటున్నారు. ఇలా దౌర్జన్యాలకు పాల్పడుతూ మరోపక్క ప్రతిపక్ష పార్టీపై నెపాన్ని నెట్టేలా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో అరాచకాలకు పాల్పడతారంటూ వైఎస్సార్ కాంగ్రెస్‌పై తన మీడియా ద్వారా బయటకు లీకులు ఇప్పించారు. అడ్డగోలుగా కోట్ల నిధులు పందేరం చేస్తూ అక్రమాలు, అరాచకాలకు పాల్పడుతూ మరోవైపు ప్రత్యర్థులపై నిందలు వేసేలా చంద్రబాబు తెరవెనుక వ్యూహాలకు తెరతీశారు. కీలక నేతలకు రూ.పది కోట్లకు పైగా ఆఫర్లు నంద్యాల ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడక ముందు నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో సహా తెలుగుదేశం నాయకులు నంద్యాలలో పర్యటించి అక్కడి పరిస్థితిని అంచనా వేశారు. ఈ ఎన్నికల్లో తమకు ఎదురుదెబ్బ తప్పదనే అంచనాకు వచ్చిన చంద్రబాబు.. ఆప్పటి నుంచే తన నిజరూపాన్ని బయట పెట్టారు. ఓటమి సీన్ స్పష్టం కావడంతో తీవ్ర అసహనంతో తాను వేసిన రోడ్లపై నడుస్తూ, రేషన్, పింఛన్ తీసుకుంటూ తనకు ఓట్లు ఎలా వేయరంటూ ప్రజలను ప్రశ్నించారు. ఒక దశలో నంద్యాల ప్రజలను బెదిరించేలా మాట్లాడారు. అయినా ప్రజల నుంచి వ్యతిరేకత మరింత పెరగడంతో ఇప్పుడు ఏకంగా వందల కోట్ల మేర డబ్బు సంచులను దించారు. నియోజకవర్గంలో ఆయా పార్టీల్లోని నేతలను గుర్తించి వారి బలా బలాలు, స్థాయిని అనుసరించి డబ్బు ముట్టజెప్పుతున్నారు. జిల్లా, మండల స్థాయి నేతలకు రూ.10 నుంచి రూ.12 కోట్ల వరకు ఇస్తూ తమకు అనుకూలంగా పని చేయాలని ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఇక గ్రామ, వార్డు స్థాయి నేతలకూ భారీగానే ముట్టజెపుతున్నారు. 50, 100 ఓట్లున్నాయనుకుంటే చాలు ఆ నేత వద్దకు వెళ్లి లక్షల్లో డబ్బులు ఇస్తూ లొంగదీసుకుంటున్నారు. ప్రచారానికి భారీ ఖర్చు ఎన్నికల్లో తమ ప్రచారం కోసం తెలుగుదేశం నేతలు భారీగా డబ్బులు వెచ్చిస్తున్నారు. ప్రతి పోలింగ్ పరిధిలో రూ.5 లక్షల చొప్పున వ్యయం చేస్తున్నారు. ప్రచారం కోసమే అచ్చంగా రోజుకు రూ.12.75 కోట్ల వరకు ఖర్చు అవుతున్నట్లు తెలుగేదేశం నేతలే చెబుతున్నారు. తమ ప్రచారంలో పొల్గొనే పార్టీ శ్రేణులతో పాటు.. వెంట భారీగా అనుసరించడానికి ఇతర జిల్లాల నుంచి వాహనాల్లో జనాలను తరలిస్తున్నారు. ఇలా రోజువారీ చెల్లింపులే ఒక్కో వార్డులోనే లక్షల్లో ఉంటోంది. అయినా ప్రజల నుంచి సరైన స్పందన లేకపోవడం, అదే సమయంలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో సహా ఆ పార్టీ ఇతర నేతల ప్రచారాలకు ప్రజల నుంచి విపరీత స్పందన వస్తుండడంతో టీడీపీ నేతలు కొత్త ఎత్తుగడలు పన్నుతున్నారు. ప్రతిపక్ష నేతల ప్రచార సభలకు ఓటర్లు వెళ్లకుండా ఉండేందుకు కూడా ఎదురు డబ్బులు ఇస్తున్నారు. ముఖ్యంగా వైఎస్ జగన్ ప్రచారం జరిగే ప్రాంతాల్లో వీరి కుట్రలకు అంతులేకుండా పోయింది. మీడియా మేనేజ్‌మెంటుతో మైండ్‌గేమ్ నంద్యాల ఓటర్లలో తమ పట్ల ఎలాంటి సానుకూలత లేకపోవడంతో మీడియా మేనేజ్మెంట్ ద్వారా చంద్రబాబు నాయుడు మైండ్‌గేమ్‌కు తెరతీశారు. తమ అనుకూల పత్రికలు, చానెళ్లలో తెలుగుదేశానికి అనుకూల వాతావరణం ఉందనో, ఆ పార్టీలోకి ఇతర పార్టీల నేతలు భారీగా చేరిపోతున్నారనో రోజుకోరకమైన కథనాలు వండివార్పిస్తూ ప్రజల మనసు మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు కోట్ల రూపాయల ప్యాకేజీలు ముట్ట జెబుతున్నారు. తమ పార్టీ శ్రేణుల ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించకపోవడంతో ఇతర జిల్లాలకు చెందిన కొందరు విద్యార్థులు, నారాయణ కాలేజీలకు సంబంధించిన సిబ్బందిని నంద్యాలకు రప్పించారు. వారితో కొంతకాలంగా ప్రభుత్వ అనుకూల ప్రచారం చేయిస్తున్నారు. వీరు ఇంటింటికీ తిరుగుతూ రేషన్ కార్డులు, పింఛన్లు ఇతర వివరాలు తెలుసుకుంటూ టీడీపీకి ఓటు వేయాలని, లేకపోతే ఈ పథకాలన్నీ వచ్చే కాలంలో నిలిపివేస్తామని బెదింపులకు దిగుతున్నారు. పైగా ఆయా ఇళ్ల యజమానుల బ్యాంకు ఖాతా నెంబర్లను కూడా తీసుకుంటుండడం విశేషం. ఎన్నికల్లో నేరుగా వారి అకౌంట్లలో డబ్బు జమ చేయించేందుకు వీలుగానే టీడీపీ ఇలాంటి అరాచకాలకు దిగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డబ్బులిస్తాం ఓటింగ్‌కు రావద్దు ఈ ఉప ఎన్నికలో ఓటమి పాలైతే రానున్న సాధారణ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపేలా రాష్ట్రంలోని పరిస్థితులను మార్పు చేస్తుందని భావిస్తున్న చంద్రబాబు ఈ ఎన్నికపై ఎలాగైనా పరువు దక్కించుకోవాలని అనేక పన్నాగాలకు తెరతీస్తున్నారు. తమ పార్టీకి ఓటు వేసేందుకు వీలుగా ప్రతి ఓటుకు దాదాపు రూ.5 వేల చొప్పున డబ్బులు పంపిణీ చేయిస్తుండడమే కాకుండా తమకు అనుకూలంగా లేని ప్రాంతాల్లోని ఓటర్లపై కూడా వల వేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న చోట్ల ఓటర్లు ఓటింగ్‌కు రాకుండా కట్టడి చేసేలా ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ‘మీరు మాకు ఓటు వేయకపోయినా ఫర్వాలేదు. ఆ రోజు మీరు ఓట్లు వేయడానికి రాకుండా ఉంటే చాలు’ అంటూ వారికి డబ్బులు ఎర చూపుతున్నారు. నంద్యాల పరిధిలోని చర్చిలు, మసీదులు, ఆలయాల గురించి ఇన్నాళ్లూ కనీసం పట్టించుకోని తెలుగుదేశం నేతలు ఇప్పుడు వాటిపై వాలుతున్నారు. మసీదులు, చర్చిలకు రూ.20 నుంచి 30 లక్షల వరకు పంపిణీ చేయించడానికి డబ్బులు సిద్ధం చేశారు. ఆయా మసీదులు, చర్చిల ద్వారా ఆయా వర్గాల ప్రజలను లోబర్చుకొనేందుకు ఈ డబ్బు వెదజల్లుతున్నారు. విజయవాడ నుంచి డబ్బు పంపిణీ ప్రతిపక్ష పార్టీకి చెందిన ముఖ్య నేతలతో పాటు ఓట్లు వేయించగలిగిన సామర్థ్యమున్న స్థానిక నేతలకు భారీ మొత్తాలను ఆశ చూపుతున్నారు. అటువంటి వారిని గుర్తించి నేరుగా విజయవాడకు పిలిపించి మరీ డబ్బును పంపిణీ చేస్తున్నారు. ముఖ్యనేత కార్యాలయం కేంద్రంగా ఈ పంపిణీ సాగుతున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం ఒక వర్గం ఓట్లు 100 ఉన్నాయని తెలిసి.. వారికి ఏకంగా రూ.20 లక్షలు ఇచ్చినట్టు తెలుస్తోంది. నంద్యాల మండలంలోని ఒక గ్రామానికి చెందిన నేతకు పారిశ్రామిక పాలసీ కింద బినామీ ఎస్సీ పేరుతో 40 శాతం సబ్సిడీతో జేసీబీ మంజూరు చేయాలని సంబంధిత మంత్రి.. అధికారులకు ఫోన్ చేసినట్టు సమాచారం. గోస్పాడు మండలంలోని ఒక గ్రామంలో రోడ్డు వేయించాలని నేరుగా జిల్లా ఉన్నతాధికారికే మరో ఎమ్మెల్యే ఫోన్ చేశారు. ఈ విధంగా అధికార పార్టీ అన్ని అడ్డదారులనూ తొక్కుతోంది. ఇప్పటి వరకు మొత్తం నగదు పంపిణీ వ్యవహారాన్ని నంద్యాల్లోని ఒక హోటల్ కేంద్రంగా నడిపిస్తున్న అధికార పార్టీ తమ స్థావరాన్ని మంగళవారం నుంచి మార్చినట్టు తెలుస్తోంది. ఒక కాలేజీలో రూ.8 కోట్ల మొత్తాన్ని దాచి ఉంచినట్టు ప్రచారం జరుగుతోంది. సీనియర్ నేత కార్యాలయంలో రూ.2 కోట్ల నగదు ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే వచ్చిన రూ.100 కోట్ల మొత్తాన్ని పట్టణంలో ప్రచారంతో పాటు గ్రామాల్లో ఓటర్లకు పంపిణీ చేసేందుకు వెచ్చిస్తున్నారు. ఏరులై పారుతున్న మద్యం ఒకవైపు భారీగా నగదు పంపిణీ చేస్తున్న అధికార పార్టీ.. మరోవైపు మద్యం పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కోట్ల విలువైన మద్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్లను కూడా ఏర్పాటు చేసింది. కొండాపురం కాలనీలోని ఒక ప్రాంతంలో భారీగా క్యూలైన్లో నిలబెట్టి మరీ మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. గ్రామాలకు కూడా మద్యం కేసులు తరలిస్తున్నారు. ఇప్పటికే రూ.30 కోట్ల విలువైన మద్యం సీసాలు వివిధ ప్రాంతాల్లో దాచి ఉంచినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీ నేతలను భయభ్రాంతులకు గురిచేసేందుకు దాడులకు తెగబడుతున్నారు. అల్లరి మూకలకు బాగా మద్యాన్ని తాపి పంపి.. రెచ్చగొట్టి అల్లర్లు చెలరేగేలా అధికార పార్టీ ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. కాగా, అధికార పార్టీ నేతలు గ్రామాల్లో ఇప్పటికే ఓటుకు రూ.2 వేల ప్రకారం పంపిణీ చేశారు. ఇది మొదటి విడత మాత్రమేనని, మరో రెండు విడతల్లో మరికొంత మొత్తం ఇస్తామని చెబుతున్నారు. -
పచ్చనేతల దాష్టీకం
సాక్షి, ఏలూరు:డబ్బులు పంచారు. మద్యం పోశారు.. బహుమతులు ఇచ్చారు. కులచిచ్చు పెట్టారు. మత విద్వేషాలు రెచ్చగొట్టారు. టీడీపీ నేతలు ఇన్ని చేసినా ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే పట్టం గడుతున్నారని గ్రహించి తట్టుకోలేకపోతున్నారు. విచక్షణ కోల్పోయి జిల్లాలో పలుచోట్ల వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై భౌతిక దాడులకు దిగారు. పెదవేగి మండలం రాయన్నపాలెంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కారుమూరి నాగేశ్వరావుపై టీడీపీ వర్గీయులు దాడికి యత్నించారు. ఈ ఘటనలో కారుమూరి గన్‌మెన్‌కు తీవ్రగాయాలయ్యాయి. తనకు ఓట్లు వేయకపోతే అంతుచేస్తానంటూ ఇక్కడి టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఓటర్లను బెదిరించినపుడే అధికారులు చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని కారుమూరి ఆవేదన వ్యక్తం చేశారు. దాడులకు పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే పరిణామాలు దారుణంగా ఉంటాయన్నాయన్నారు. దెందులూరులో ప్రజాస్వామ్యం లేదని, అక్కడి రౌడీయిజాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతానన్నారు. కామవరపుకోట మండలం తడికలపూడిలో వైఎస్సార్ సీపీ పోలిం గ్ ఏజెంట్ దాసరి జాన్‌ను బండబూతులు తిట్టిన ఏలూరు లోక్‌సభ టీడీపీ అభ్యర్థి మాగంటి బాబు దౌర్జన్యానికి పాల్పడ్డారు. తన కారును కామవరపుకోటలోని పోలింగ్ కేంద్రం వద్దకు నిబంధనలకు విరుద్ధంగా తీసుకువెళ్లేం దుకు మాగంటి బాబు ప్రయత్నించగా కామవరపుకోటలో ఎస్సై నిరాకరించడంతో అతనిపై చిందులేశారు. పాలకోడేరు మండలం మోగల్లు, శృంగవృక్షం, కోరుకొల్లు గ్రామాల్లో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. నిడదవోలులో టీడీపీ అభ్యర్థికి చెందిన విద్యాసంస్థల బస్సుల్లో అధికారులు ఈవీఎంలు తరలించేం దుకు ప్రయత్నించారు. దీంతో వైఎస్సార్ సీపీ అభ్యంతరం తెలిపింది. దేవరపల్లిలో 54 (ఏ) బూత్‌లో టీడీపీ రిగ్గింటగ్కు పాల్పడుతుండగా వైఎస్సార్ సీపీ అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రిగ్గింగ్‌పై వైఎస్సార్ సీపీ గోపాలపురం ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావు జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్‌కు ఫిర్యాదు చేశారు. ద్వారకాతిరుమల మండలం మారంపల్లిలో పోలింగ్ బూత్‌లోకి వైఎస్సార్ సీపీ ఏజెంట్‌ను వెళ్లనివ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఈ వ్యవహారాన్ని చక్కబెట్టేందుకు ప్రయత్నిం చిన మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ బుసనబోయిన సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యుడు కారుమంచి రమేష్‌పై టీడీపీ నేతలు పాల్పడ్డారు. దాడిచేసిన వారిని వదిలేసిన పోలీసులు వైఎస్సార్ సీపీ నాయకులను అదుపులోకి తీసుకుని ద్వారకాతిరుమల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఏజెంటును పోలింగ్ బూత్ లోపలికి అనుమతిం చారు. వీరవాసరం మండలం అండలూరులో అధికారులు టీడీపీకి అనుకూలంగా నడుచుకుంటున్నారని వైఎస్సార్ సీపీ ఫిర్యాదు చేయడంతో జిల్లా కలెక్టర్ స్వయంగా వైఎస్సార్ సీపీ భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌ను ఆ గ్రామానికి తీసుకువెళ్లి పరిస్థితిని సమీక్షించారు. గణపవరం మండలం అర్ధవరంలో ఓ ఇంటివద్ద అరుగుపై కూర్చున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలను పోలీసులు అకారణంగా కొట్టారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో కొద్దిసేపు పోలింగ్ నిలచిపోయింది. -
విందు.. మందు..
సాక్షి ప్రతినిధి, గుంటూరు :జనబలంతో నెగ్గలేని తెలుగుదేశం పార్టీ అక్రమాలకు తెరతీసింది. ధనబలంతోనైనా లొంగదీసుకునేందుకు చీకటి రాజకీయాలు మొదలెట్టింది. కార్పొరేట్ ఆశీస్సులు మెండుగా ఉన్న ఈ పార్టీకి డబ్బుకు కొదవలేకపోవడంతో రాబోయే ఎన్నికల్లో ప్రలోభాలకు పాల్పడుతోంది. ఇప్పటికే పోస్టల్‌బ్యాలెట్ల కొనుగోలులో తలమునకలైన ఆ పార్టీ నాయకులు రాబోయే పది రోజుల్లో ప్రచారం కన్నా ప్రలోభాలకే ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అవకాశం ఉన్న మేరకు విందులతో ఆకట్టుకోవాలని... అవసరమైన చోట్ల కరెన్సీ వెదజల్లాలని అధిష్టానం ఆలోచనగా ఉన్నట్టు దిగువస్థాయిలో చర్చజరుగుతోంది. మొదటి నుంచీ పార్టీని పెంచి పోషిస్తున్న కార్పొరేట్ వ్యవస్థలే ఈ ఎన్నికల్లోనూ ఆలంబనగా నిలుస్తున్నట్టు తెలుస్తోంది. పోస్టల్ బ్యాలెట్లతోనే శ్రీకారం.. జిల్లాలో పోస్టల్‌బ్యాలెట్లను తమవశం చేసుకునేందుకు ఆ పార్టీ నాయకులు విఫలయత్నమే చేశారు. దీనికి పాల్పడిన పలువురు నిఘా అధికారుల చేతికి చిక్కారు. నరసరావుపేటలో ప్రభుత్వోద్యోగులను తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని కోరుతూ డబ్బు పంపిణీ చేయబోతున్న ఓ ఉపాధ్యాయుడిని ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన నుంచి పదివేల రూపాయల నగదు స్వాధీన పర్చుకున్నారు. నాదెండ్ల మండలం గణపవరంలో ఇదే తరహాలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు పోస్టల్బ్యాలెట్లు పొందుతున్నవారిని ప్రలోభపెట్టేందుకు యత్నిస్తుండగా నియోజకవర్గ ఎన్నికల అధికారి, డీఆర్డీఏ ప్రాజెక్టు అధికారి ప్రశాంతి జోక్యంతో వారిని నిరోధించగలిగారు. ఇక రేపల్లెలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనగాని సోదరుడైన ఓ ఉపాధ్యాయుడు రేపల్లెలో పబ్లిక్‌గా నిధులు అందజేసేందుకు యత్నిస్తూ నిఘా కెమెరాకు చిక్కారు. ఎంపీ అభ్యర్ధిగా పోటీలో ఉన్న ఓ నాయకుడు ఏకంగా ఇతర పార్టీల్లోని ముఖ్య నేతలకు ఇన్వర్టర్లను బహుమతిగా పంపుతున్నారు. గెట్ టు గెదర్ పేరుతో వేలాది మందితో ఏసీ కల్యాణ మండపాల్లో విందు రాజకీయాలు చేస్తున్నారు. సోమవారం స్ధానిక విద్యానగర్‌లోని ఓ ఫంక్షన్హాల్లో కార్యకర్తలకు పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేశారు. రెండు రోజుల క్రితం అరండల్‌పేటలోని ఓ హాటల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెద్ద ఎత్తున విందు కార్యక్రమం నిర్వహించారు. దిగువస్థాయి నాయకులకూ నగదు ఎర డబ్బుకు ఆశపడే ప్రత్యర్థి పార్టీలకు చెందిన గ్రామ సర్పంచ్‌లు, సహకార సంఘాల అధ్యక్షులను డబ్బుతో కొనుగోలు చేస్తున్నారు. కార్యకర్తలను మద్యం మత్తులో ముంచేస్తున్నారు. సత్తెనపల్లి, నరసరావుపేట, పొన్నూరు, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో టీడీపీ విజయానికి ఎన్ఆర్ఐలను రంగంలోకి దించింది. కొంతమంది ఎన్ఆర్ఐలు గ్రామాల్ని దత్తత తీసుకుని ఆ గ్రామాల్లో టీడీపీకి మెజార్టీ ఓట్లు తీసుకువచ్చేందుకు కోట్లు కుమ్మరిస్తున్నారు. ఎన్నికల తరువాత గ్రామంలోని సమస్యలు పరిష్కరిస్తామని పెద్దమనుషుల సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. మసీదులు, చర్చిలు, దేవాలయాల మరమ్మతులు, శ్మశాన వాటికలకు భూమిని కొనుగోలు చేసేందుకు నగదు చెల్లిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అదనుగా మ్యాచ్‌ఫిక్సింగ్‌లు.. జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ ఓటమే లక్ష్యంగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కుట్రలు పన్నుతున్నాయి. జిల్లాలోని కొన్ని నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఓట్లనే చీల్చేందుకు కాంగ్రెస్ అభ్యర్థులకు టీడీపీ ఆర్థిక సహాయం అందజేస్తోంది. నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని రెండు నియోజకవర్గాల్లో తాము ఓడిపోతామనే కారణం చూపి కాాంగ్రెస్ అభ్యర్థులు పెద్దగా ప్రచారం సైతం చేపట్టలేదు. ఆయా నియోజకవర్గాల్లో సామాజిక వర్గాల వారీగా ఓట్లను చీల్చే అవకాశం ఉందన్న అంశాన్ని గుర్తించిన టీడీపీ నాయకులు వారిని కలిసి రూ. 1.50 కోట్ల వరకు నజరానాలు అందిస్తున్నారని తెలిసింది. ప్రజాలం, ప్రజల ఆశీస్సులు నిజంగా వీరికి ఉంటే ఇన్ని కుట్రలు, కుతంత్రాలు చేయాల్సిన అవసరం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.