సాక్షి, శ్రీకాకుళం పాతబస్టాండ్: సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ దగ్గర పడడంతో ఓటరుని ప్రసన్నం చేసుకునేందుకు టీడీపీ నాయకుల తాపత్రయం ఎక్కువైంది. ఇప్పటికే ప్రజలు టీడీపీని వ్యతిరేకిస్తున్నారన్న విషయం గుర్తించిన అధికార పార్టీ నాయకులు ఓటర్లను ప్రలోభ పెట్టే పనిలో పడ్డారు. ఓటరుని తమ వైపు తిప్పుకునేందుకు నగ దు, మద్యం, చీరలు, పంచెలు, ఇతర వస్తువులతో ప్రలోభాల పర్వానికి తెరతీశారు. ఇప్పటికే టీడీపీ కార్యకర్తలు ఈ నజరానాల పంపిణీలో తలమునకలై ఉన్నారు. గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోంది. ఓటింగ్ కేవలం రెండు రోజులే ఉన్నందున ఈ ప్రలోభాలు మరింత పెంచారు. ఇప్పటికే గ్రామాల్లో టీడీపీ కార్యకర్తల ఇళ్లకు నగదు, మద్యం నిల్వలు చేరవేశారు. ఐదేళ్లుగా అడ్డగోలుగా, టీడీపీ పాలకులు అక్రమ సంపాదనతో ఓట్లను కొనే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని చోట్ల ఓటుకి వెయ్యి నుంచి రెండు వేల వరకు పంపిణీ చేస్తున్నట్టు సమాచారం.
పెచ్చుమీరుతున్న ఆగడాలు..
అధికార పార్టీ ఆగడాలు పెచ్చుమీరాయి. ఈ ఆగడాలను అరికట్టడంలో ఎన్నికల అధికారులు ఆశించినంతంగా విజయవంతం కావడం లేదు. ఫిర్యాదుల పరిశీలనే తప్ప వారు నేరుగా క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు.
వేర్వేరు మార్గాల్లో..
టీడీపీ కార్యకర్తలు ఎక్కువగా మహిళల ఓట్లను కొల్లకొట్టేందుకు టార్గెట్‌గా పెట్టుకున్నా రు. దీంతో డ్వాక్రా మహిళలను ప్రలోభాలకు గురి చేస్తూ ఈ పంపిణీ చేస్తున్నట్టు తెలుస్తోంది. గ్రామీణ మహిళలను ఈ ప్రలోభాలకు వినియోగించుకుంటున్నారు. వారి వద్ద నుంచే ఆయా సంఘాలకు డబ్బులు అందేలా చేస్తున్నారు. ఉపాధి హామీలో పనిచేస్తున్న వారిని కూడా పావులుగా వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో ఉపా«ధి పనుల్లో ప్రచారం, అక్కడ మేట్, క్షేత్ర సహాయకుల ద్వారా ఈ పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. టెక్కలి నియోజకవర్గంలోనూ, మెళియాపుట్టిలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ క్షే త్ర సహాయకులు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలియడంతో ముగ్గురిని విధుల నుంచి తప్పించారు. డీలర్లను కూడా నాయకులు భయపెట్టి తమ దారిలోకి తెచ్చుకుంటున్నారు. నెల తొలి రోజులు కావడంతో సరుకుల పంపిణీతో పాటు తమ ప్రచారాలు కూడా చూసుకోవాలని బెదిరిస్తున్నారు.
టెక్కలిలో..
టెక్కలి నియోజకవర్గానికి మంత్రి కింజరా పు అచ్చెన్నాయుడు ఈ సారి కూడా టీడీపీ తరఫున బరిలో ఉన్నారు. ఆయన గతంలో ప్రలో భాలతో గెలిచారని ఆ నియోజకవర్గం ప్రజలు చెబుతున్నారు. అయితే ఈ సారి కూడా అదే పంథాను సాగిస్తున్నారు. ఎన్నికల్లో ఓటర్లకు ఎర వేసేందుకు నగదు పంపిణీకి తెర తీశారు. సోమవారమే చాలా వరకు ఈ ప్రక్రియ ముగిసింది. మహిళలకు చీరలు, వృద్ధులకు పంచెలు, యువతకు డ్రస్సులు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ఓటుకు ఐదు వందల నుంచి రెండు వేల వరకు పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది.
♦ ఆమదాలవలస నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కూన రవికుమార్ అనుచరులు ప్రతి ఇంటికి వెళ్లి పింఛన్లు మంజూరు చేశామని, డ్వాక్రా డబ్బులు అందించామని, వాటితోపాటు చిరు ఉద్యోగాలు చేస్తున్న వారిని, వ్యాపారాలు చేస్తున్న వారిని బెదిరిస్తూ ఓట్లు వేయాలని ప్ర లోభాలకు గురి చేస్తున్నారు. కార్యకర్తలు కూడా డబ్బులు పంపిణీ చేస్తున్నారు.
♦ ఎచ్చెర్ల నియోజకవర్గంలో ప్రస్తుతం టీడీపీ దాదాపుగా గ్రామాలకు డబ్బులు, మద్యం చేరవేసింది. అడ్డతోవల్లో ఓట్లర్లను కొనుగోలు చేసేం దుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు.
♦ నరసన్నపేట నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి ఓటర్లును ప్రలోభ పెట్టేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో డబ్బు, మద్యం పెద్ద ఎత్తున తరలించిన పార్టీ శ్రేణులు వీటిని కార్యకర్తలకు ఇస్తున్నారు. అలాగే మహిళలను కూడా ప్రలోభ పె ట్టేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓటరకు వెయ్యి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
♦ పాలకొండ నియోజకవర్గంలో ప్రచార పర్వం పూర్తి కావస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ నేతలు నగదు పంపిణీ చేసే పనిలో పడ్డారు. పార్టీ దిగువ శ్రేణి నాయకులు, కార్యకర్తలకు ఒక్కొక్కరికి రూ. 5వేల చొప్పున నగదు ఇచ్చి ప్రతి ఇంటి యజమానికి రూ. 2వేల వంతున ప్రచార కరపత్రాల ద్వారా అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
♦ పలాస నియోజకవర్గం పరిధిలో టీడీపీ నాయకులు కార్యకర్తలకు రూ.500 చొప్పున రోజుకు అందిస్తున్నారు. భోజనాలు, వాహన సదుపాయం, వారికి నచ్చినటువంటి బ్రాండ్ మందు అందజేస్తున్నారు.
♦ పాతపట్నం నియోజవర్గంలో ఫిరాయింపు ఎమ్మెల్యే ఈ సారి పెద్ద ఎత్తునే ఖర్చు చేస్తున్నారు. ఆయన పార్టీ ఫిరాయించిన తర్వాత అక్రమార్జన పెరిగింది. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు ఓటరుని ప్రలోభాలకు గురి చేస్తూ, మద్యం, నగదు పెద్ద ఎత్తున పంపకాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment