పచ్చనేతల దాష్టీకం
సాక్షి, ఏలూరు:డబ్బులు పంచారు. మద్యం పోశారు.. బహుమతులు ఇచ్చారు. కులచిచ్చు పెట్టారు. మత విద్వేషాలు రెచ్చగొట్టారు. టీడీపీ నేతలు ఇన్ని చేసినా ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే పట్టం గడుతున్నారని గ్రహించి తట్టుకోలేకపోతున్నారు. విచక్షణ కోల్పోయి జిల్లాలో పలుచోట్ల వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై భౌతిక దాడులకు దిగారు. పెదవేగి మండలం రాయన్నపాలెంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కారుమూరి నాగేశ్వరావుపై టీడీపీ వర్గీయులు దాడికి యత్నించారు.
ఈ ఘటనలో కారుమూరి గన్‌మెన్‌కు తీవ్రగాయాలయ్యాయి. తనకు ఓట్లు వేయకపోతే అంతుచేస్తానంటూ ఇక్కడి టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఓటర్లను బెదిరించినపుడే అధికారులు చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని కారుమూరి ఆవేదన వ్యక్తం చేశారు. దాడులకు పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే పరిణామాలు దారుణంగా ఉంటాయన్నాయన్నారు. దెందులూరులో ప్రజాస్వామ్యం లేదని, అక్కడి రౌడీయిజాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతానన్నారు. కామవరపుకోట మండలం తడికలపూడిలో వైఎస్సార్ సీపీ పోలిం గ్ ఏజెంట్ దాసరి జాన్‌ను బండబూతులు తిట్టిన ఏలూరు లోక్‌సభ టీడీపీ అభ్యర్థి మాగంటి బాబు దౌర్జన్యానికి పాల్పడ్డారు. తన కారును కామవరపుకోటలోని పోలింగ్ కేంద్రం వద్దకు నిబంధనలకు విరుద్ధంగా తీసుకువెళ్లేం దుకు మాగంటి బాబు ప్రయత్నించగా కామవరపుకోటలో ఎస్సై నిరాకరించడంతో అతనిపై చిందులేశారు.
పాలకోడేరు మండలం మోగల్లు, శృంగవృక్షం, కోరుకొల్లు గ్రామాల్లో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. నిడదవోలులో టీడీపీ అభ్యర్థికి చెందిన విద్యాసంస్థల బస్సుల్లో అధికారులు ఈవీఎంలు తరలించేం దుకు ప్రయత్నించారు. దీంతో వైఎస్సార్ సీపీ అభ్యంతరం తెలిపింది. దేవరపల్లిలో 54 (ఏ) బూత్‌లో టీడీపీ రిగ్గింటగ్‌కు పాల్పడుతుండగా వైఎస్సార్ సీపీ అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రిగ్గింగ్‌పై వైఎస్సార్ సీపీ గోపాలపురం ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావు జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్‌కు ఫిర్యాదు చేశారు. ద్వారకాతిరుమల మండలం మారంపల్లిలో పోలింగ్ బూత్‌లోకి వైఎస్సార్ సీపీ ఏజెంట్‌ను వెళ్లనివ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఈ వ్యవహారాన్ని చక్కబెట్టేందుకు ప్రయత్నిం చిన మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ బుసనబోయిన సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యుడు కారుమంచి రమేష్‌పై టీడీపీ నేతలు పాల్పడ్డారు.
దాడిచేసిన వారిని వదిలేసిన పోలీసులు వైఎస్సార్ సీపీ నాయకులను అదుపులోకి తీసుకుని ద్వారకాతిరుమల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఏజెంటును పోలింగ్ బూత్ లోపలికి అనుమతిం చారు. వీరవాసరం మండలం అండలూరులో అధికారులు టీడీపీకి అనుకూలంగా నడుచుకుంటున్నారని వైఎస్సార్ సీపీ ఫిర్యాదు చేయడంతో జిల్లా కలెక్టర్ స్వయంగా వైఎస్సార్ సీపీ భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌ను ఆ గ్రామానికి తీసుకువెళ్లి పరిస్థితిని సమీక్షించారు. గణపవరం మండలం అర్ధవరంలో ఓ ఇంటివద్ద అరుగుపై కూర్చున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలను పోలీసులు అకారణంగా కొట్టారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో కొద్దిసేపు పోలింగ్ నిలచిపోయింది.