RM veerappan
-
నా స్పీచ్‌తో అతని పదవి పోయింది.. రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు
సూపర్‌స్టార్ రజనీకాంత్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మధ్య కొన్నాళ్ల పాటు రాజకీయ వైర్యం కొనసాగిన సంగతి తెలిసిందే. 1996లో జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికల సమయంలో రజనీకాంత్, జయలలిత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. "జయలలిత మళ్లీ అధికారంలోకి వస్తే, దేవుడు కూడా తమిళనాడును రక్షించలేడు" అని ఆయన చేసిన ప్రకటన రాజకీయ రంగంలో సంచలనం రేపింది. ఈ వ్యాఖ్యలు ఆ ఎన్నికల్లో జయలలిత అధికారం కోల్పోవడానికి ఒక కారణంగా నిలిచాయి. తాజాగా ఈ ‘రాజకీయ వివాదం’పై రజనీకాంత్ స్పందించారు. జయలలితను తీవ్రంగా వ్యతిరేకించడానికి గల కారణం ఏంటో ఆయన వివరిస్తూ.. మాజీ మంత్రి వీరప్పన్ పట్ల జయలలిత వ్యవహరించిన తీరే.. తనను వ్యతిరేకంగా మాట్లాడేలా చేసిందని చెప్పారు.వీరప్పన్ పదవి పోయిందిసినీ నిర్మాత, రాజకీయ నాయకుడు ఆర్.ఎం. వీరప్పన్, రజనీకాంత్ మధ్య మంచి స్నేహబంధం ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కలయికలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. వీరప్పన్ సత్య మూవీస్ బ్యానర్‌పై నిర్మించిన ‘బాషా’ చిత్రం అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా 100 రోజుల వేడుకలో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యల కారణంగా వీరప్పన్ మంత్రి పదవి కోల్పోవలసి వచ్చిందట. ఈ వేడుకల్లో రజనీకాంత్ మాట్లాడుతూ.. తమిళనాడులో వారసత్య రాజకీయాల కారణంగా బాంబు సంస్కృతి పెరిగిపోయిందని.. రాష్ట్రం ఓ స్మశానంలా మారిందని అన్నారు. రజనీ వాఖ్యలు జయలలిత కోపానికి కారణం అయ్యాయట. దీంతో మంత్రిగా ఉన్న వీరప్పన్ని పదవి నుంచి తొలగించారట. జయలలితపై వ్యతిరేకంగా మాట్లాడడానికి ఇదే ప్రధాన కారణం అని రజనీ అన్నారు.వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దని చెప్పారు ‘నేను జయలలితకు వ్యతిరేకంగా మాట్లాడటం వెనుక వ్యక్తిగత కారణాలు ఏమీ లేవు. తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం, ఆ రోజుల్లో పరిస్థితులను బట్టి అలా మాట్లాడాను. అయితే నా స్పీచ్ కారణంగా వీరప్పన్ పదవి పోయిందని తెలిసి చాలా బాధపడ్డాను. మరుసటి రోజు ఫోన్ చేసి మాట్లాడాను. జయలలితతోనూ మాట్లాడతానని చెప్పాను. అయితే వీరప్పన్ మాత్రం దానికి అంగీకరించలేదు. ‘నీ వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దను. నాకు ఏ పదవి అవసరం లేదు’ అని చెప్పారు. ఆయన ఈ విషయాన్ని లైట్ తీసుకున్నా.. నేను చాలా బాధపడ్డాను. జయలలితను తీవ్రంగా వ్యతిరేకించడానికి ప్రధాన కారణాలలో ఇది ఒకటి’ అని రజనీకాంత్ అన్నారు. వీరప్పన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిన ‘ఆర్వీఎం: ది కింగ్‌మేకర్’ డాక్యుమెంటరీ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో రజనీకాంత్ ఈ వివాదం గురించి స్పందించాడు. -
వీరప్పన్‌ను కలిసిన సూపర్ స్టార్
పెరంబూర్: సూపర్‌స్టార్ రజనీకాంత్ ఎంజీఆర్ కళగం పార్టీ అధ్యక్షుడు ఆర్ఎం.వీరప్పన్‌ను శుక్రవారం ఆయన ఇంటిలో కలిసి గంటకు పైగా మంతనాలు జరిపారు. వీరి కలయిక తమిళ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. రజనీకాంత్‌కు ఆర్ఎం.వీరప్పన్‌కు మధ్య చాలాకాలంగా సత్సంబంధాలున్న విషయం తెలిసిందే. రజనీకాంత్ కథానాయకుడిగా సత్యామూవీస్ పతాకంపై ఆర్ఎం.వీరప్పన్ బాషా, మూండ్రముగం వంటి సంచలన విజయాలను సాధించిన చిత్రాలను నిర్మించారన్నది గమనార్హం. కాగా 1995లో బాషా చిత్ర విజయోత్సవ వేదికపై రజనీకాంత్ అన్నాడీఎంకే పార్టీని తీవ్రంగా విమర్శించారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయాల్లో పెను కలకలాన్నే సృష్టించాయి. అంతే కాదు ఆ ప్రభావం ఆర్ఎం.వీరప్పన్పైనా పడింది. అప్పట్లో మంత్రిగా ఉన్న ఆయన పదవి కోల్పోయారు. తరువాత రజనీకాంత్‌తో ఆయన రాజకీయ గురువుగా చెప్పబడిన చోరామస్వామి, ఆర్వీ.వీరప్పన్లు రాజకీయ సమాలోచనలు జరిపారు. ఇలాంటి పరిణామాల తరువాత తాజాగా జయలలిత మరణానంతరం తమిళ రాజకీయాల్లో నెలకొన్న పరిణామాల మధ్య ఆర్ఎం.వీరప్పన్‌ను రజనీకాంత్ కలవడంలో ఆంతర్యం ఏమిటన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇటీవల భారతీయ జనతా పార్టీ రజనీకాంత్‌కు గాలం వేయడం, అదే సమయంలో ఆయన అభిమానులు రాజకీయాల్లోకి రావాలని తరచూ ఒత్తిడి చేస్తున్నారు. అదే విధంగా ఈ నెల 12 నుంచి 17 వరకూ రజనీకాంత్ తన అభిమానులతో సమావేశం కానుండటం లాంటి పరిస్థితులను గమనిస్తున్న రాజకీయ వర్గాలు ఈ ఊహించని పరిణామంతో రజనీ ఆలోచనా ధోరణిని అంచానా వేసే పనిలో పడ్డాయి. అదే విధంగా ప్రస్తుతం ఆర్ఎం.వీరప్పన్, రజనీకాంత్ కలయికలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, తదితర పలు అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. రజనీకాంత్ తన అభిమానుల ఆకాంక్షను నెరవేర్చడానికి సిద్ధం అవుతున్నారా? తన రాజకీయరంగ ప్రవేశానికి తగిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నారా? అందుకే ఆర్ఎం.వీరప్పన్‌ను కలిసి మంతనాలు జరుపుతున్నారా? లాంటి ప్రశ్నలు రాజకీయవర్గాల్లో తలెత్తుతున్నాయి. -
ఎప్పటికీ ఒకే ఒక్క బాషానే
నేను ఒక్కసారి చెబితే నూరు సార్లు చెప్పినట్లు. ఇది కాలాంతరం నిలిచిపోయే డైలాగ్ ,ముఖ్యంగా రజనీకాంత్ అభిమానులకు గుర్తుండిపోయే డైలాగ్ అని చెప్పవచ్చు. 20 ఏళ్ల క్రితం బాషా చిత్రం లో రజనీకాంత్ చెప్పిన సంభాషణ అది. ఆ చిత్రాన్ని సీనియర్ నిర్మాత,మాజీ మంత్రి ఆర్వి. వీరప్పన్ నిర్మించిన చిత్రం బాషా. ఆయన పుట్టిన రోజు వేడుకను బుధవారం చెన్నైలో జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో నటుడు రజనీకాంత్ సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గోన్నారు. రజనీకాంత్ మాట్లాడు తూ ఆర్వి.వీరప్పన్ నిర్మించిన బాషా చిత్రంలో నేను నటించాను.ఆ చిత్ర 125 రోజు విజయోత్సవంలో పా ల్గొన్న నేను బాంబుల సంస్కృతి గురించి మాట్లాడాను. ఆ మరునాడే వీరప్పన్ మంత్రి పదవి పోయింది.నాకు చాలా బాధేసింది.ఈ విషయాన్ని ఆయనకు ఫోన్ చేసి చెప్పాను.అప్పుడాయన నవ్వుతూ ఇది కాల నిర్ణయం అంటూ సర్వ సాధారణంగా అన్నారు.వీరప్పన్ ఇప్ప టి వరకూ ఒక్క సారి కూడా ఆస్పత్రికి వెళ్లలేదని చెబుతున్నారు.అలా ఆస్పతికెళ్లొచ్చిన బాధ ఏమిటో నాకు తెలుసు.దయచేసి ఎవరూ ఆస్పత్రికి వెళ్ళే అవకాశం లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోండి.ముఖ్యంగా 50 ఏళ్లపై బడిన వాళ్లుఎక్సర్సైజ్ చేయండి అని సూపర్‌స్టార్ హితవు పలికారు.కాగా ప్రస్తుతం నేను కబాలి చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నాను.ఈ చిత్రం బాషాను అధిగమిస్తుందా? అని అడుగుతున్నారు.ఆ విషయం నేను చెప్పలేను.అయితే ఎప్పటికీ ఒకే ఒక్క బాషానే.అని రజనీ అన్నారు.