
భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ నెల ప్రారంభంలో స్వల్ప పెరుగుదలను నమోదు చేసి.. ఆ తరువాత వరుసగా తగ్గిన పసిడి ధరలు, గత మూడు రోజులుగా కదలిక లేకుండా నిశ్చలంగా ఉన్నాయి. ఈ రోజు గోల్డ్ రేటు ఏ రాష్ట్రంలో ఎలా ఉందనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఈ రోజు హైదరాబాద్, విజయవాడలలో తులం బంగారం రేటు రూ. 57800 (22 క్యారెట్స్), రూ. 63050 (24 క్యారెట్స్)గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పు లేదని తెలుస్తుంది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాజ్, బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతుంది.
చైన్నైలో కూడా ఈ రోజు పసిడి ధరలు ఏ మాత్రం పెరగలేదు, కాబట్టి ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ & 24 క్యారెట్స్ బంగారం ధరలు వరుసగా రూ. 58300, రూ. 63600గా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఈ రోజు బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి.
ఇదీ చదవండి: భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేదు.. ఐక్యరాజ్య సమితిపై మస్క్ కీలక వ్యాఖ్యలు
బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ వెండి ధరలు మాత్రం ఢిల్లీ, చెన్నై, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, ముంబై నగరాల్లో రూ. 500 తగ్గినట్లు తెలుస్తోంది. నిన్న, మొన్న స్థిరంగా ఉన్న వెండి ధరలు ఈ రోజు తగ్గుముఖం పట్టాయి.