
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు ఇటీవల కొంత శాంతించినట్లు కనిపించినా తిరిగి జీవితకాల గరిష్టాలను చేరుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో మంగళవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rate) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.85,100 (22 క్యారెట్స్), రూ.92,840 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.850, రూ.930 పెరిగింది.
ఇదీ చదవండి: కొత్త ఆర్థిక సంవత్సరం.. 1,160 పాయింట్లు పడిన సెన్సెక్స్
చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.850, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.930 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.85,100 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.92,840 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.
దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.850 పెరిగి రూ.85,250కు చేరుకోగా..24 క్యారెట్ల ధర రూ.930 పెరిగి రూ.92,990 వద్దకు చేరింది.
వెండి ధరలు
బంగారం ధరలు పెరుగుతున్నట్లు వెండి ధరల్లోనూ మంగళవారం మార్పులు వచ్చాయి. నిన్నటితో పోలిస్తే ఈ రోజు వెండి ధరలు పెరిగాయి. కేజీ వెండి రేటు(Silver Price) సోమవారంతో పోలిస్తే రూ.1000 పెరిగి రూ.1,14,000 వద్దకు చేరింది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)