చాట్‌జీపీటీలో మరో కీలక పరిణామం! | Sam Altman Returns To OpenAI's Board With Three New Directors | Sakshi

చాట్‌జీపీటీలో మరో కీలక పరిణామం!

Mar 10 2024 9:46 AM | Updated on Mar 10 2024 1:24 PM

Sam Altman Returns To Openai Board With Three New Directors - Sakshi

ప్రముఖ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ఓపెన్‌ ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ తిరిగి సంస్థ బోర్డ్‌ సభ్యుడిగా అడుగుపెట్టారు. 

గత ఏడాది సీఈఓగా ఆల్ట్‌మన్‌ని తొలగిస్తూ సంస్థ బోర్డ్‌ మెంబర్స్‌ నిర్ణయం తీసుకోవడం ఓ సంచలనం. అయితే కంపెనీలో ఆల్ట్‌మన్‌ తొలగింపుతో ఓపెన్‌ఏఐ పరిస్థితులపై న్యాయ సంస్థ విల్మర్హేల్ రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టింది. తాజాగా, సంస్థలో పరిస్థితులు చక్కబడడంతో దర్యాప్తు నిలిపివేసింది. ఆల్ట్‌మన్‌ సైతం బోర్డ్‌లోకి వచ్చినట్లు ప్రకటించింది. 

ఈ సందర్భంగా ఓపెన్‌ ఏఐ బోర్డ్‌లోకి ఆల్ట్ మన్‌తో పాటు బోర్డ్‌లోకి బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ మాజీ సీఈవో స్యూ డెస్మండ్-హెల్ మన్, సోనీ ఎంటర్ టైన్ మెంట్ మాజీ అధ్యక్షుడు నికోల్ సెలిగ్ మన్, ఇన్ స్టాకార్ట్ సీఈఓ ఫిడ్జీ సిమోలను కొత్త డైరెక్టర్లుగా బాధ్యతలు చేపట్టారు. ఆల్ట్ మన్ కొత్త బోర్డు సభ్యులను స్వాగతించారు. కంపెనీ భవిష్యత్‌ లక్ష్యాల్ని వారికి వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement