
న్యూఢిల్లీ: క్రెడిట్ కార్డ్ దిగ్గజం ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ బిజినెస్ వృద్ధికి అవసరమైన నిధుల సమీకరణ చేపట్టనున్నట్లు పేర్కొంది. మార్పిడిరహిత డిబెంచర్ల(ఎన్‌సీడీలు) జారీ ద్వారా రూ. 3,000 కోట్లు సమకూర్చుకోనున్నట్లు తెలియజేసింది. ఇందుకు కంపెనీ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించింది. ఒకేసారి లేదా దశలవారీగా ప్రయివేట్ ప్లేస్‌మెంట్ పద్ధతిలో ఎన్‌సీడీల జారీని చేపట్టనున్నట్లు తెలియజేసింది. ఈ వార్తల నేపథ్యంలో ఎస్‌బీఐ కార్డ్ షేరు ఎన్‌ఎఎస్‌ఈలో స్వల్ప లాభంతో రూ. 918 వద్ద ముగిసింది.