
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ ఉత్పత్తుల సంస్థ కెన్‌వ్యూ తమ స్కిన్‌కేర్ బ్రాండ్ న్యూట్రోజెనా కింద కొత్తగా హైడ్రోబూస్ట్ సన్‌స్క్రీన్ ఎస్‌పీఎఫ్ 50 ఉత్పత్తిని ఆవిష్కరించింది.
శక్తివంతమైన ఫలితాలను అందించేందుకు అధునాతన ఫార్ములేషన్స్‌తో దీన్ని రూపొందించినట్లు కెన్‌వ్యూ మార్కెటింగ్ వీపీ మనోజ్ గాడ్గిల్ తెలిపారు. తమ కొత్త ప్రచారకర్తగా బాలీవుడ్ నటి 'శ్రద్ధా కపూర్'ని నియమించుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ సందర్భంగా బ్యూటీ విత్ నో కాంప్రమైజ్ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది.
న్యూట్రోజెనా 'బ్యూటీ విత్ నో కాంప్రమైజ్'లో చేరడంపై శ్రద్ధా కపూర్ మాట్లాడుతూ.. నేను ఉపయోగించిన బ్రాండ్ న్యూట్రోజెనాతో భాగస్వామిగా ఉండటం చాలా ఆనందంగా ఉంది. అందం, చర్మ సంరక్షణ సరళంగా ఉండాలి కానీ ప్రభావవంతంగా ఉండాలి. మహిళలు ఎంతగానో ఉపయోగకరమైన ఉత్పత్తులను అందిస్తూ ముందుకు సాగుతున్న న్యూట్రోజెనాతో చేరడం సంతోషంగా ఉందని అన్నారు.