Today Gold and Silver Prices: బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. గత కొన్ని సెషన్లుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర గురువారం కాస్త నెమ్మదించింది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రా. 22 క్యారెట్ల పసిడి ధర రూ. 150 తగ్గి రూ. 55,050గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10గ్రా. బంగారం ధర 180 రూపాయలు ఎ గిసి 60,050 వద్ద ఉంది. మరోవైపు కిలో వెండి ధర హైదరాబాద్‌లో రూ.78 వేలు పలుకుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. (డేటా భద్రత నిబంధనలు: తేడా వస్తే రూ. 250 కోట్ల వరకు జరిమానా)
ముఖ్యంగా ఫెడ్ వడ్డీరేట్లు యధాతథంగాఉంచడంతో డాలర్ బలంపుంజుకుంది. డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి స్వల్పంగా నష్టపోతోంది. ఇక స్టాక్‌మార్కెట్ల విషయానికి వస్తే గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఆరంభంలోనే భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ ఏకంగా 500పాయింట్లకుపైగా కుప్పకూలగా, 147 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 19800 స్థాయిని కూడా కోల్పోయి మరింత బలహీన సంకేతాలందించాయి. అటు ఆయిల్ రేట్లు భగ్గుమన్నాయి.