
విమానంలో వెళ్లేటప్పుడూ..ప్రయాణికులు సేఫ్టీ కోసం పైలట్‌లు, అక్కడ సిబ్బంది మనకు కొన్ని సూచనలిస్తుంటారు. అలాగే జర్నీ పూర్తి అవుతుందనగా.. సేఫ్ ల్యాండింగ్ కోసం ప్రకటనలు చేస్తుంటారు. అయితే అలానే ఇక్కడొక పైలట్ కూడా ఒక ప్రకటన వెల్లడించాడు. అయితే అది ఎంత ఫన్నీగా ఉందంటే..జర్నీ బడలిక అంత ఉఫ్‌మని ఎగిరిపోయినంత ఆహ్లాదంగా ఉంది. ఇంతకీ అతడేం అనౌన్స్‌మెంట్ ఇచ్చాడంటే..
ఇదంతా డెల్టా ఎయిర్‌లైన్స్ విమానంలో చోటుచేసుకుంది. సురక్షితమైన ల్యాండింగ్ కోసం ప్రయాణికులకు భరోసా ఇచ్చేలా అనౌన్స్‌మెంట్ చేస్తుంటారు పైలట్‌లు. అది సర్వసాధారణం. అయితే ఇక్కడ ఈ పైలట్ ఇచ్చిన అనౌన్స్‌మెంట్ అత్యంత విభిన్నంగా నవ్వు తెప్పించేలా ఉంది.
సదరు పైలట్ మాట్లాడుతూ.."నాకు పెళ్లై 33 సంవత్సరాలు. భార్య, నలుగురు పిల్లలు, రెండు కుక్కలు, ఎనిమిది కోళ్లు ఉన్నాయి. నాబార్య ఈ చలిలో వాటిని చూసుకుంటూ అలిసిపోతుంది. అందువల్ల కచ్చితంగా శుక్రవారం సాయంత్రం కల్లా నేను ఇంటికి వెళ్లాల్సిందే. ఎందుకంటే ఆ కోళ్లను చూసుకోవాల్సింది నేనే కాబట్టి.
అదీగాక నేను గనుక ఇంటికి సమయానికి చేరుకోకపోతే ఆమె నన్ను చంపేస్తుంది అందువల్ల మనం కచ్చితంగా సేఫ్‌గా ల్యాండ్ అవుతామని హామీ ఇస్తున్నా..! అని అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు. ఆ ప్రకటన విన్న ప్రయాణికులు ఒక్కసారిగా షాకయ్యి..ఏం అనౌన్స్‌మెంట్ అంటూ అందరి ముఖాల్లో ఒక్కసారిగా నవ్వులు మెరిశాయి. జర్నీ చేసిన అలసట కూడా ఎగిరిపోయి ఉత్సాహంతో ఉన్నారంతా. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఏం చెప్పాడబ్బా..! అంటూ పైలట్‌ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: Sachin Tendulkar: ఇంత స్వచ్ఛంగా ఉంటే ఫిల్టర్లు ఎందుకు? సచిన్ మనుసుదోచిన గ్రామం..)