ఆ ఎనిమిది రాష్ట్రాల్లో కోవిడ్‌ విలయ తాండవం | Eight States Account 81 Percent Covid Cases Reported Last 24 Hours | Sakshi
Sakshi News home page

ఆ ఎనిమిది రాష్ట్రాల్లో కోవిడ్‌ విలయ తాండవం

Published Sat, Apr 3 2021 2:48 PM | Last Updated on Sat, Apr 3 2021 5:47 PM

 Eight States Account 81 Percent Covid Cases Reported Last 24 Hours - Sakshi

న్యూఢిల్లీ : దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 81,466 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,23,03,131కి చేరుకుంది. ఇక నమోదవుతున్న కేసులను పరిశీలిస్తే కొన్ని రాష్ట్రాల్లోనే అత్యధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతాల్లో కరోనా విలయ తాండవం చేస్తోంది. అత్యధిక కేసులు వస్తున్నప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ నివారణా చర్యలను ముమ్మరం చేయాలనే ఉద్దేశ్యంతో‌ కేసులకు సంబంధించి గణాంకాలను కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసింది.

ఈ ఎనిమిది రాష్ట్రాల ప్రజలు జర జాగ్రత్తగా ఉండాలి
మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గడ్‌, ఢిల్లీ, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్. కేవలం ఈ ఎనిమిది రాష్ట్రాల నుంచి కేసులు 81.42 శాతం నమోదయ్యాయి. ఇక జిల్లాల పరంగా చూస్తే..పుణె, ముంబై, నాగ్‌పూర్, థానే, నాసిక్, బెంగళూరు అర్బన్, ఔరంగాబాద్, ఢిల్లీ, అహ్మద్‌నగర్, నాందేడ్. ఈ పది జిల్లాలు నుంచి 50 శాతం కేసులు నమోదయ్యాయి. కేసుల పెరుగుదల పరంగా..మహారాష్ట్రలో కేసుల పెరుగుదల తొమ్మిది రెట్లుగా ఉండగా, శాతాల పరంగా పంజాబ్ అత్యధిక శాతంగా నమోదు అవుతున్నాయి. ఇక దేశం మొత్తం మీద ఒక్క మహారాష్ట్ర నుంచి మాత్రమే 59.36 శాతం కేసులు ఉన్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర డేంజర్‌ జోన్లో ఉన్నట్లు చెప్పాలి. అక్కడి రోజువారీ అత్యధికంగా 47,913 కేసులు వస్తున్నాయి. తరువాత స్థానంలో కర్ణాటక 4,991కాగా, ఛత్తీస్‌గడ్‌‌లో 4,174 కేసులు ఉన్నాయి. మహరాష్ట్ర, ఛత్తీస్‌గడ్‌, పంజాబ్, కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, కేరళతో కలిపి ఈ పన్నెండు రాష్ట్రాలు రోజువారీ కొత్త కేసులలో పెరుగుదల ఎక్కువగా ఉందంటూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

శనివారం ఒక రోజులో 89,129 కొత్త కేసులు నమోదయ్యాయి. గత ఆరున్నర నెలల్లో రోజువారీ అత్యధిక పెరుగుదలలో ఇదే అత్యధిక కేసుల నమోదయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా కేసులు సంఖ్య 1.23 కోట్లకు పైగా నమోదు కాగా, మొత్తం మరణాల 1,64,110 కు పెరిగింది, ఒక రోజులో 714 మరణాలు సంభవించాయి, ఇది అక్టోబర్ నెల తరువాత ప్రస్తుత గణాంకాలే నమోదే అధికం. ఒక రోజులో 714 మరణాలు సంభవించాయి, కొత్త మరణాలలో ఆరు రాష్ట్రాలు 85.85 శాతం ఉన్నాయి. మహారాష్ట్రలో గరిష్టంగా 481 మంది మరణించగా, 57 మంది పంజాబ్‌లో మరణించారు.

గత 24 గంటల్లో ఒక్క మరణం కూడా నమోదు కాని రాష్ట్రాలు 
13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి గత 24 గంటల్లో ఒక్క మరణం కూడా నమోదుకాలేదు. అవి ఒడిశా, అస్సాం, లడఖ్, దాద్రా  నగర్ హవేలి ,డామన్ అండ్ డియు, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, సిక్కిం, లక్షద్వీప్, మిజోరం, అండమాన్ మరియు నికోబార్ దీవులు అవి ఒడిశా, అస్సాం, లడఖ్, దాద్రా నగర్ హవేలి( చదవండి: కరోనా : పుణేలో రాత్రి కర్ఫ్యూ, థియేటర్ల మూత )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement