
బరేలీ: ’లవ్ జిహాద్, ప్రపంచ కలహాలకు కేంద్రాలకు మారిన మదర్సాలను మూసివేయాలని వీహెచ్‌పీ నేత సాధ్వి ప్రాచి వ్యాఖ్యానించారు. ‘హిందువులు డబ్బు సంపాదన గురించే ఆలోచిస్తారు. ఒక ప్రత్యేకవర్గం మాత్రం భారత్‌ను పాలించాలని ఆలోచిస్తుంటుంది.
వెయ్యేళ్లు భారత్‌ను పాలించడమే వారి ఎజెండా’అని యూపీలోని బరేలీలో ఆదివారం ఆమె మీడియాతో అన్నారు. ‘లవ్ జిహాద్ మదర్సాల నుంచే మొదలవుతోంది. అక్కణ్నుంచే వ్యాప్తి చెందుతుంది. దేశంలో మదర్సాలు మూసేసిన రోజున లవ్ జిహాద్ ఉనికిలోనే ఉండదు. అప్పుడు ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచం మొత్తంలో శాంతి సామరస్యాలు వెల్లివిరుస్తాయి’అని ఆమె మీడియాతో అన్నారు.