
సాక్షి,ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ పక్క తాగునీటికి తీవ్ర కొరత ఏర్పడి జలమండలి ఆఫీసులపై దాడులు జరుగుతున్నాయి. మరోపక్క అక్కడి ఎయిర్‌పోర్టుకు కరెంటు కోతలు తప్పడం లేదు. సోమవారం(జూన్17) ఎయిర్‌పోర్టు టర్మినల్ మూడులో కరెంటు కష్టాలు ఎదురయ్యాయి.
కరెంటు కోతల వల్ల ప్రయాణికులు చెకింగ్,బోర్డింగ్ సమయంలో ప్రయాణికులు కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కరెంటు సమస్యను పరిష్కరించామని, కేవలం 10 నిమిషాలే కరెంటు పోయిందని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(డయల్) ఒక ప్రకటనలో తెలిపింది.