
ఢిల్లీ: కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖపై కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి స్పందిస్తూ దీదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బెంగాల్‌లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నప్పటికీ.. పనితీరు బాగా లేదని విమర్శించారు. మహిళలకు భద్రత కల్పించడంలో బెంగాల్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం ఘటనలో ప్రధాని మోదీ నేరుగా స్పందించాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోరారు. ఈ క్రమంలో 22వ తేదీన ఈ ఘటనపై తాను లేఖ రాసినా ఎలాంటి సమాధానం రాలేదని శుక్రవారం రాసిన మరో లేఖలో ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా మమత లేఖపై కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ మంత్రి అన్నపూర్ణా దేవీ స్పందించారు.
महिलाओं को सशक्त बनाना और उन्हें सुरक्षित वातावरण प्रदान करना भारत सरकार की सर्वोच्च प्राथमिकता है। सरकार महिला सुरक्षा के प्रति पूर्णतः समर्पित है और इसे अपनी प्रमुख जिम्मेदारी मानती है। (1/2) ...@narendramodi | @MamataOfficial pic.twitter.com/zKNa1AzNyN
— Annapurna Devi (@Annapurna4BJP) August 30, 2024
ట్విట్టర్ వేదికగా అన్నపూర్ణా దేవీ.. దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, నేరాలకు సంబంధించి కఠినమైన చట్టాలు, శిక్షలు ఇప్పటికే అమలులో ఉన్నాయి. కానీ, బెంగాల్‌లో ఫాస్ట్ కోర్టుల పనితీరు బాగాలేదు. పశ్చిమ బెంగాల్‌లో 48,600 అత్యాచార, పోక్సో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అత్యాచారం, పోక్సో కేసులను ప్రత్యేకంగా పరిష్కరించేందుకు బెంగాల్ ప్రభుత్వం అదనంగా 11 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ, అమలు చేయలేదు. ఇవి ప్రత్యేకమైన పోక్సో కోర్టులు లేదా రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా అత్యాచారం, పోక్సో కేసులు రెండింటినీ విచారిస్తాయి అని చెప్పుకొచ్చారు. ముందుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని హితవు పలికారు.