ప్రపంచకప్‌ 2023లో ఇవాళ 2 మ్యాచ్‌లు.. హైదరాబాద్‌లో ఓ మ్యాచ్‌..! | CWC 2023: 2 Matches To Be Played On October 10th First Eng Vs Ban, Second Pak Vs SL, Know Timings Details - Sakshi

Today Matches In CWC Oct 10th: ప్రపంచకప్‌ 2023లో ఇవాళ 2 మ్యాచ్‌లు.. హైదరాబాద్‌లో ఓ మ్యాచ్‌..!

Oct 10 2023 8:11 AM | Updated on Oct 10 2023 8:40 AM

CWC 2023: 2 Matches To Be Played On October 10th.. First Eng Vs Ban, Second pak Vs Sl - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో ఇవాళ (అక్టోబర్‌ 10) రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌-బంగ్లాదేశ్‌లు ధర్మశాల వేదికగా తలపడనుండగా.. హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియం (ఉప్పల్‌ స్టేడియం) వేదికగా మాధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో శ్రీలంక-పాకిస్తాన్‌ జట్లు పోటీపడతాయి.

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో ప్రస్తుత ప్రపంచకప్‌ బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో చావుదెబ్బ తిని బోణీ విజయం కోసం ఎదురుచూస్తుండగా.. బంగ్లాదేశ్‌ తమ తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై విజయం సాధించి మరో విజయం కోసం కసిగా ఎదురుచూస్తుంది.  

మరోవైపు తమ తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను మట్టికరిపించిన ఉత్సాహంలో ఉన్న పాక్‌.. ప్రపంచకప్‌లో రెండో విజయంపై కన్నేయగా.. తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో అపజయాన్ని ఎదుర్కొన్న శ్రీలంక.. పాక్‌పై ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని భావిస్తుంది. 

స్టోక్స్‌ ఎంట్రీ..
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితమైన బెన్‌ స్టోక్స్‌.. బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. స్టోక్సీ గత రెండు రోజులుగా నెట్స్‌లో కఠోరంగా శ్రమిస్తున్నట్లు సమాచారం.

శ్రీలంక జోరు కొనసాగించేనా..
సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక పరాజయంపాలైనప్పటికీ, ఆ జట్టులోని బ్యాటర్లంతా ఫామ్‌లోకి వచ్చారు. 429 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్య ఛేదనలో లంక బ్యాటర్లు అసమానమైన తెగువను చూపి భారీగా పరుగులు సాధించారు. కుశాల్‌ మెండిస్‌ (76), అసలంక (79), కెప్టెన్‌ షనక (68) మెరుపు అర్ధసెంచరీలతో విరుచుకుపడటంతో శ్రీలంక 44.5 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది. పాక్‌తో జరిగే మ్యాచ్‌లోనూ లంక బ్యాటర్లు ఇదే జోరును కొనసాగిస్తే పాక్‌కు కష్టాలు తప్పవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement