
ఐపీఎల్-2024లో టీమిండియా స్టార్, ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి దుమ్ములేపుతున్నాడు. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన కింగ్ కోహ్లి.. 316 పరుగులతో ఈ లీగ్ టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అయితే కోహ్లి అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడుతున్నప్పటికి అతడి స్ట్రైక్ రేట్‌పై మాత్రం చాలా మంది విమర్శలు చేస్తున్నారు.
కోహ్లి చాలా స్లోగా ఆడుతున్నాడని, టీ20 వరల్డ్‌కప్-2024కు అతడి స్ధానంలో యువ ఆటగాళ్లకు అవకాశమివ్వాలని కొంతమంది మాజీలు సూచిస్తున్నారు. మరి కొంత మంది విరాట్ లాంటి ఆటగాడు కచ్చితంగా వరల్డ్‌కప్ జట్టులో ఉండాలని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. విరాట్‌ను వరల్డ్‌కప్‌కు భారత సెలక్టర్లు ఎంపిక చేయకూడదని మాక్సీ అభిప్రాయపడ్డాడు.
"ఇప్పటివరకు నా జీవితంలో నేను చూసిన అత్యుతమ క్రికెటర్ విరాట్ కోహ్లి. విరాట్ చాలా డెంజరస్ ఆటగాడు. 2016 టీ20 ప్రపంచకప్‌లో మొహాలీలో మాపై అతను ఆడిన ఇన్నింగ్స్ ఇప్పటికీ నాకు గుర్తుంది. ఆ ఇన్నింగ్స్ ఎప్పటికి అతడి కెరీర్‌లో చిరస్మరణీయంగా మిగిలిపోతుంది.
మ్యాచ్ గెలవడానికి తాను ఏమి చేయాలన్న విషయంపై ఫుల్ క్లారిటితో విరాట్ ఉంటాడు. టీ20 వరల్డ్‌కప్‌కు భారత సెలక్టర్లు కోహ్లిని ఎంపిక చేయకూడదని ఆశిస్తున్నాడు. ఎందుకంటే అతడి లేకపోతే మా జట్టుకు చాలా ప్రయోజనం చేకురుతుందని" ఈఎస్పీఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాక్సీ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌లో విరాట్,మాక్స్‌వెల్ ఇద్దరూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.