
బాలీవుడ్ బాద్‌షా.. కింగ్.. షారుక్ ఖాన్ చేతిలో ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ ట్రోఫీ ఉండడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోను ఐసీసీనే స్వయంగా పంచుకుంది. ''కింగ్ కాన్ చేతిలో #CWC2023 ట్రోపీ.. మరింత దగ్గరగా..'' అంటూ క్యాప్షన్ జత చేసింది. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం ట్విటర్‌లో హల్‌చల్ చేస్తోంది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్‌తో రెచ్చిపోయారు. ఫోటో షేర్ చేసిన అరగంటకే పదివేల లైక్స్ రాగా.. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ దాదాపు లక్షా 50వేల మంది లైక్స్ కొట్టడం విశేషం.
ఇక అక్టోబర్ 5న మొదలవనున్న ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. పుష్కరకాలం తర్వాత టీమిండియా గడ్డపై వరల్డ్‌కప్ జరుగుతుండడంతో క్రికెట్ ఫ్యాన్స్ రోహిత్ సేన ట్రోపీ సాధిస్తుందని గంపెడాశతో ఉన్నారు. ఇప్పటికే ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌కు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేసింది. 10 వేదికల్లో 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. టీమిండియాతో పాటు అన్ని జట్ల మ్యాచ్‌ల షెడ్యూల్‌ను కూడా ప్రకటించారు. ఇక చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 15న(ఆదివారం) అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కోసం రెండు దేశాల అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
King Khan 🤝 #CWC23 Trophy
— ICC (@ICC) July 19, 2023
It’s nearly here … pic.twitter.com/TK55V3VkfA