
ఐపీఎల్ 16వ సీజన్‌ను యజ్వేంద్ర చహల్ ఘనంగా ఆరంభించాడు. ఆదివారం ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ రాజస్తాన్ బౌలర్ తన బౌలింగ్‌తో అదరగొట్టాడు. 4 ఓవర్లలో 17 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.ఈ నేపథ్యంలో చహల్ తన ఖాతాలో రెండు రికార్డులను జమ చేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించిన చహల్‌కు టి20ల్లో ఇది 300వ వికెట్. టీమిండియా తరపున ఈ ఫీట్ సాధించిన తొలి స్పిన్నర్‌గా.. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా ఏకకాలంలో రికార్డు సాధించాడు.
కాగా చహల్ సాధించిన ఈ ఘనతను భార్య ధనశ్రీ వర్మ ఎంజాయ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌కు ధనశ్రీ వర్మ హాజరైంది. భర్త టి20ల్లో 300వ వికెట్ సాధించగానే స్టాండ్స్‌లో ఉన్న ధనశ్రీ ఒక్కసారిగా సంతోషంతో గెంతులేసి చప్పట్లతో చహల్‌కు అభినందనలు పంపించింది. ఈ సమయంలో ఆమె మొహం నవ్వుతో వెలిగిపోయింది. ఈ సమయంలో అక్కడే ఉన్న అభిమానులు.. చహల్‌కు ఇంతలా సపోర్ట్ చేసే భార్య దొరకడం నిజంగా అతని అదృష్టం అని మనసులో అనుకునే ఉంటారు. ధనశ్రీ ఎంజాయ్ చేస్తున్న వీడియోపై మీరు ఒక లుక్కేయండి.
💗💗💗 pic.twitter.com/zdHh2WAzAW
— Rajasthan Royals (@rajasthanroyals) April 2, 2023