
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియాపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) తాత్కాలిక నిషేధం విధించింది. మార్చి 10వ తేదీన సోనెపట్‌లో నిర్వహించిన జాతీయ రెజ్లింగ్ ట్రయల్స్ సందర్భంగా బజరంగ్ సెమీఫైనల్లో ఓడిపోయాక డోపింగ్ పరీక్షకు హాజరుకాకుండానే బయటకు వెళ్లిపోయాడు.
దాంతో ‘నాడా’ ఏప్రిల్ 23న బజరంగ్‌పై తాత్కాలిక నిషేధం విధించింది. డోపింగ్ పరీక్షకు ఎందుకు హాజరుకాలేదో వివరణ ఇవ్వాలని కోరుతూ మే 7వ తేదీ వరకు బజరంగ్‌కు గడువు ఇచి్చంది. మరోవైపు తాను డోపింగ్ పరీక్షకు హాజరయ్యేందుకు నిరాకరించలేదని... ‘నాడా’ అధికారులు ఆరోజు గడువు తీరిన కిట్స్‌తో తన నుంచి శాంపిల్స్ సేకరించేందుకు వచ్చారని బజరంగ్ ఆరోపించాడు. ‘నాడా’ అధికారులకు తన న్యాయవాది సమాధానం ఇస్తాడని బజరంగ్ తెలిపాడు.
ఇవి చదవండి: రవీంద్రజాలం... జడేజా ఆల్రౌండ్ షో..