వైజాగ్‌లో అనికేత్ వ‌ర్మ విధ్వంసం.. వీడియో వైర‌ల్ | SRH Batter Aniket Verma stuns DC bowlers with breathtaking 74 | Sakshi
Sakshi News home page

IPL 2025: వైజాగ్‌లో అనికేత్ వ‌ర్మ విధ్వంసం.. వీడియో వైర‌ల్

Published Sun, Mar 30 2025 6:38 PM | Last Updated on Sun, Mar 30 2025 6:52 PM

SRH Batter Aniket Verma stuns DC bowlers with breathtaking 74

ఐపీఎల్‌-2025లో వైజాగ్ వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ యువ ఆట‌గాడు అనికేత్ వ‌ర్మ అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. కిష‌న్‌, అభిషేక్ శ‌ర్మ‌, హెడ్ వంటి స్టార్ ప్లేయ‌ర్లు విఫ‌ల‌మైన చోట అనికేత్‌.. త‌న విరోచిత బ్యాటింగ్‌తో ఎస్ఆర్‌హెచ్ టీమ్‌ను ఆదుకున్నాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్‌హెచ్ కేవ‌లం 25 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఈ స‌మ‌యంలో క్రీజులోకి వ‌చ్చిన అనికేత్‌.. ప్ర‌త్య‌ర్ది బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగాడు. ముఖ్యంగా అక్ష‌ర్ ప‌టేల్ వంటి వ‌ర‌ల్డ్ క్లాస్ స్పిన్న‌ర్‌ను అనికేత్ ఊతికారేశాడు. త‌న విధ్వ‌సంక‌ర బ్యాటింగ్‌తో బౌండ‌రీల వ‌ర్షం కురిపించాడు. ఈ క్ర‌మంలో అనికేత్ కేవ‌లం 34 బంతుల్లోనే త‌న తొలి ఐపీఎల్ హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు.

హాఫ్ సెంచ‌రీ త‌ర్వాత కూడా త‌న దూకుడును వ‌ర్మ కొన‌సాగించాడు. స్టార్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్‌లో సిక్స‌ర్ బాదిన అనికేత్.. ఆ త‌ర్వాత బంతికి భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించి ఔట‌య్యాడు. ఓవ‌రాల్‌గా 41 బంతులు ఎదుర్కొన్న వ‌ర్మ‌.. 5 ఫోర్లు, 6 సిక్స్‌ల‌తో 74 ప‌రుగులు చేశాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 163 ప‌రుగుల ఫైటింగ్ స్కోర్ చేయ‌గ‌ల్గింది. అత‌డితో క్లాసెన్‌(32) ప‌రుగుల‌తో రాణించాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఐదు వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు కుల్దీప్ యాదవ్ మూడు, మొహిత్ శర్మ ఒక్క వికెట్ సాధిం‍చారు. కాగా అద్భుత ఇన్నింగ్స ఆడిన అనికేత్‌పై సోష‌ల్ మీడియాలో ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఎస్ఆర్‌హెచ్‌కు మ‌రో స‌రికొత్త హిట్ట‌ర్ దొరికాడ‌ని పోస్టులు పెడుతున్నారు. ఐపీఎల్‌-2025 మెగా వేలంలో రూ.30 ల‌క్ష‌ల బేస్ ప్రైస్‌కు ఎస్ఆర్‌హెచ్ కొనుగోలు చేసింది.
చ‌ద‌వండి: IPL 2025: అభిషేక్ శర్మ రనౌట్‌.. తప్పు ఎవరిది? వీడియో వైరల్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement