‘అల్లు అర్జున్‌కు ఆ సలహా ఇచ్చిందెవరు?’ | V Hanumantha Rao Comments On Allu Arjun Issue | Sakshi

‘అల్లు అర్జున్‌కు ఆ సలహా ఇచ్చిందెవరు?’

Dec 23 2024 1:33 PM | Updated on Dec 23 2024 1:51 PM

V Hanumantha Rao Comments On Allu Arjun Issue

హైదరాబాద్‌: బెయిల్ మీద ఉన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడని, ఆయనకు సలహా ఇచ్చింది ఎవరని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ వి. హనుమంత రావు ప్ర‌శ్నించారు. గాంధీ భవన్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. శ్రీతేజ్ కోలుకోవాలని అల్లు అర్జున్ మృత్యుంజయ యాగం చేయాలన్నారు. 

శ్రీతేజ్ కోలుకోవాలని తాను దేవుణ్ణి కోరుకుంటున్నట్లు తెలిపారు. పుష్ప సినిమా టికెట్ రేట్‌ను సీఎం రేవంత్ రెడ్డి పెంచారు.. ఈ విష‌యం అల్లు అర్జున్ ఆలోచించాలని.. పుష్ప సినిమాకు వచ్చిన లాభాలలో కొంత మొత్తం యాదగిరిగుట్ట దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి హుండీలో వేయండని సూచించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement