
మల్లన్నకు ప్రత్యేక పూజలు
ఐనవోలు: సూర్యుడు మీనరాశి నుంచి మేష రాశిలోకి ప్రవేశించడం సందర్భంగా ఆదివారం ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో ప్రత్యేక సంక్రమణ పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయంలో నిత్య పూజలు నిర్వహించిన అనంతరం ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకులు ఐనవోలు మధుకర్ శర్మ, వేద పండితులు విక్రాంత్ వినాయక్ జోషి ఆధ్వర్యంలో స్వామి వారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, రుద్ర హోమం జరిపించారు. అలాగే గొల్లకేతమ్మ, బలిజ మేడలమ్మలతో శ్రీమల్లికార్జునస్వామి కల్యాణం నిర్వహించారు. కాగా.. ఒగ్గు పూజారులు పెద్దపట్నం వేసి, ఒగ్గు కథలు చెబుతూ.. మల్ల న్న కల్యాణంతో పాటు ప్రత్యేక ఒగ్గు పూజలు చేశారు. కార్యక్రమంలో ఈఓ అద్దంకి నాగేశ్వర్‌రావు, ఆలయ అర్చక సిబ్బంది పాల్గొన్నారు.