విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్(64)కు ఎయిమ్స్ లో శనివారం కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సను నిర్వహించారు. ఎయిమ్స్ డైరెక్టర్ ఎమ్ సీ మిశ్రా, సర్జన్లు వీకే బన్సల్, వీ శీను, నెఫ్రాలజిస్టు సందీప్ మహాజన్ లు ఐదు గంటల పాటు ఆపరేషన్ ను నిర్వహించినట్లు తెలిసింది.