శాసనమండలిని రద్దు చేస్తున్నామని చెప్పడానికి గర్వపడుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. గతంలో ఎన్టీఆర్ శాసనమండలిని రద్దు చేసినప్పుడు ఈనాడులో ఆ నిర్ణయాన్ని కీర్తిస్తూ ఎడిటోరియల్స్ రాశారని అన్నారు. ఆనాడు కేవలం ఈనాడు అధిపతి రామోజీరావు కోసమే మండలిని రద్దుచేశారని గుర్తుచేశారు. కానీ నేడు కోట్లాది మంది ప్రజాప్రయోజనాల కోసం మండలి రద్దు నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.