Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

TDP Janasena Leaders Over Action On BC Women ZP Chairperson1
ఏపీలో బీసీ మహిళా జెడ్పీ చైర్‌పర్సన్‌పై 'టీడీపీ గూండాయిజం'

గుడివాడ రూరల్‌/గుడివాడ టౌన్‌: రాష్ట్రంలో ప్రజాస్వామ్య హననం జరుగుతోందనడానికి మరో తార్కాణం.. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందనడానికి మరో నిదర్శనం.. రాష్ట్రంలో శాడిస్టు ప్రభుత్వం రాజ్యమేలుతోందనడానికి నిలువుటద్దం.. కృష్ణా జిల్లా గుడివాడలో శనివారం సాక్షాత్తు జిల్లా ప్రథమ పౌరురాలు, జెడ్పీ చైర్‌పర్సన్, బీసీ మహిళ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాలు విచక్షణా రహితంగా మారుణాయుధాలతో దాడి చేశారు. తాలిబన్లు, ఐసిస్, హమాస్, హిజ్‌బుల్లా ఉగ్రవాదులను మరిపించే రీతిలో పోలీసుల సమక్షంలోనే బూతులు తిడుతూ దాడికి తెగబడ్డారు. ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ’ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తుండగా అడ్డుకుని మరీ దాడి చేయడం విస్తుగొలుపుతోంది. మద్యం, గంజాయి సేవించి.. సైకోల్లా కేకలు వేస్తూ.. చంపండి.. కొట్టండి.. అని అరుస్తూ బండరాళ్లు, కర్రలతో దాడులు చేస్తున్నా పోలీసులు అడ్డుకోవడానికి ఏమాత్రం ముందుకు రాకపోవడం రాష్ట్రంలో రెడ్‌బుక్‌ పాలనకు అద్దం పడుతోంది. దాడిని నిలువరించక పోగా, సినిమా షూటింగ్‌ చూస్తున్నట్లు వ్యవహరించడం.. తీరా దాడి చేసి వెళ్లిపోతుండగా హంగామా చేయడం పోలీసులు ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు ఎంతగా లొంగి పోయారన్నది తేటతెల్లం చేస్తోంది. ఇదే రీతిలో నెల్లూరులో కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి ఇంటిపై కూడా టీడీపీ గూండాలు విచక్షణా రహితంగా దాడికి పాల్పడటం తెలిసిందే. దాడి చేసిన టీడీపీ మూకలపై ఇప్పటి దాకా కేసు కూడా నమోదు చేయని పోలీసులు.. బాధితుడైన ప్రసన్న కుమార్‌రెడ్డి పైనే కేసు నమోదు చేయడం చంద్రబాబు ప్రభుత్వ దురీ్నతిని బయట పెడుతోంది. అంతకు మందు ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ గూండాల తరఫున వకాల్తా పుచ్చుకున్న సీఐ.. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై రివాల్వర్‌ ఎక్కుపెట్టి.. కాల్చేస్తానని బెదిరించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హైకోర్టు అనుమతితో.. అదీ ఏడాది తర్వాత సొంత నియోజకవర్గం తాడిపత్రిలోని తన ఇంట్లో అడుగుపెట్టిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని టీడీపీ గూండాల ఒత్తిళ్లకు తలొగ్గి.. పోలీసులే ఆయ­న్ను బలవంతంగా వాహనంలోకి ఎక్కించి అనంతపురం పంపడం రాష్ట్రంలో ప్రభుత్వ దుర్మార్గానికి అద్దం పట్టింది. గుడివాడలో దాడి జరిగిందిలా.. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఊరారా ఎండగట్టేలా ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ’ కార్యక్రమాన్ని గుడివాడ మండలం లింగవరంలోని కె.కన్వెన్షన్‌లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిర్వహించ తలపెట్టాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఉమ్మడి కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్, బీసీ నాయకురాలు ఉప్పాల హారిక తన భర్త, ఇతరులతో కలిసి వాహనంలో బయలు దేరారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చాయి. ఈ విషయం తెలియడంతో కూటమి నేతల కన్ను కుట్టింది. గుడివాడ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం విజయవంతం కాకుండా చూడాలని ప్రభుత్వ పెద్దల నుంచి స్థానిక టీడీపీ, జనసేన నేతలకు ఆదేశాలు అందాయి. దీంతో ఆ కార్యక్రమానికి వచ్చే వైఎస్సార్‌సీపీ శ్రేణులను నాగవరప్పాడు వద్ద అడ్డుతగులుతూ, రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించారు. రాళ్లు, కర్రలు చేత పట్టుకుని యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. కర్రలు, రాడ్లతో సభకు వెళ్లే వారిని అడ్డగించి, అడ్డువచ్చిన వాహనాలపై దాడులకు తెగబడ్డారు. అయినప్పటికీ వైఎస్సార్‌సీపీ శ్రేణులు సంయమనం పాటించాయి. ఈ క్రమంలో సభకు హాజరయ్యేందుకు గుడివాడ మీదుగా లింగవరం వెళ్తున్న జెడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక కారు అక్కడికి రాగానే.. టీడీపీ, జనసేన నేతలు రాళ్లు, కర్రలు, రాడ్లతో పోలీసుల సమక్షంలో దాడులకు తెగబడ్డారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. కారుపై బండరాళ్లు విసిరారు. బీసీ మహిళ అని కూడా చూడకుండా బూతులు తిట్టారు. కారును ముందుకు కదలనివ్వకుండా అడ్డుకున్నారు. కారుపై పదిసార్లు విచ్చలవిడిగా దాడి చేయడంతో గంటన్నర సేపు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జెడ్పీ చైర్‌పర్సన్, ఆమె భర్త కారులోనే ఉండిపోయారు. ఈ తతంగం అంతా జరిగాక, అక్కడే ఉన్న పోలీసులు తాపీగా అక్కడికి చేరుకుని ఉప్పాల హారికను అక్కడి నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. దాడికి పాల్పడిన వారిని పల్లెత్తు మాట అనకుండా జెడ్పీచైర్‌పర్సన్, అమె భర్త, వైఎస్సార్‌సీపీ నేతలనే తప్పు పట్టేలా వ్యవహరించారు. చంపేస్తారనుకున్నా.. కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక కన్నీటి పర్యంతమయ్యారు. స్థానిక వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో శనివారం రాత్రి ఆమె విలేకరులతో మాట్లాడారు. గుడివాడ మండలం లింగవరం వద్ద వైఎస్సార్‌సీపీ తలపెట్టిన కార్యక్రమంలో పాల్గొనేందుకు తన భర్త రాముతో కలసి కారులో వెళ్తుంటే మార్గమధ్యంలో నాగవరప్పాడు వద్ద టీడీపీ, జనసేన నాయకులు గూండాల్లా కర్రలు, రాడ్లతో కారుపై పోలీసుల సమక్షంలోనే దాడి చేసి కారు అద్దాలను పగలకొట్టారని చెప్పారు. తమను హతమార్చేందుకు ప్రయత్నించారని కన్నీటిపర్యంతమయ్యారు. ఓ దశలో తనను చంపేస్తారనుకున్నానని చెప్పారు. తన మామ, తన భర్త, తాను రాజకీయాల్లో ఉన్నా, ఇప్పటి వరకు ఎవరినీ విమర్శించలేదని, తన దారిలో తాను వెళ్తుంటే బీసీ మహిళ అని కూడా చూడకుండా నోటితో చెప్పలేని విధంగా అసభ్య పదజాలంతో దూషించి తమను చంపేందుకు యత్నించారన్నారు. సీఐలు, ఎస్‌ఐలు, పోలీస్‌ సిబ్బంది పెద్ద సంఖ్యలో అక్కడ ఉండగానే, వారి సమక్షంలోనే తమపై దాడి చేశారన్నారు. కూటమి ప్రభుత్వంలో జిల్లా ప్రథమ పౌరురాలినైన తనకే రక్షణ లేకపోతే సామాన్య మహిళలకు ఏం రక్షణ ఉంటుందని ఆమె ప్రశ్నించారు. తనపై జరిగిన దాడికి సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తనపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని, ఇప్పటికే గుడివాడ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని తెలిపారు. జిల్లా ఎస్పీని కలసి దాడి గురించి ఫిర్యాదు చేస్తానని హారిక తెలిపారు. పెడన నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి ఉప్పాల రాము మాట్లాడుతూ టీడీపీ నేతలు మద్యం తాగి వచ్చి వీధి గూండాల్లా కర్రలు, రాడ్లతో తమపై దాడి చేసి తమను హతమార్చేందుకు ప్రయత్నించారన్నారు. దాదాపు 400 మంది పోలీసుల సమక్షంలోనే తమపై దాడి చేశారన్నారు. కారులో తాను ఒక్కడినే ఉంటే భయపడేవాడిని కాదని, మహిళ అయిన తన భార్య ఉండటంతో ఆందోళన చెందానన్నారు. తన భార్యను ఇష్టానుసారంగా దుర్భాషలాడి, తమను చంపేందుకు ప్రయత్నించారని, దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన నందివాడ జెడ్పీటీసీ సభ్యురాలి భర్త కందుల నాగరాజుపై కూడా దాడికి దూసుకు వచ్చారన్నారు. కూటమి నేతలకు బీసీ మహిళలు అంటే అంత చులకనా? ఓట్ల కోసమే బీసీలు కావాలా? అని ప్రశ్నించారు. ఈ దాడిపై గుడివాడ ఎమ్మెల్యే రాము స్పందించాలని, దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ముఖ్య నాయకుల హౌస్‌ అరెస్ట్‌ గుడివాడ కార్యక్రమానికి జిల్లా నాయకులు వస్తున్నారన్న సమాచారంతో ముందస్తుగానే అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో పోలీసులు హౌస్‌ అరెస్ట్‌లు చేశారు. మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని కృష్ణమూర్తి(కిట్టు)లను పోలీసులు ముందుగానే మచిలీపట్నంలో హౌస్‌ అరెస్ట్‌ చేశారు. కేవలం గుడివాడలో వైఎస్సార్‌సీపీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక టీడీపీ నేతలు గూండాలుగా మారి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఇదిలా ఉండగా టీడీపీ నాయకులు, గూండాలు వైఎస్సార్‌సీపీ తలపెట్టిన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. వైఎస్సార్‌సీపీ తలపెట్టిన కార్యక్రమంలో దాదాపు మూడు వేల మంది పాల్గొనడంతో గుడివాడ దద్దరిల్లిపోయింది. ఈ కార్యక్రమానికి వస్తున్న జెడ్పీ చైర్మన్‌ కారుపై పచ్చమూకలు దాడికి తెగబడ్డారన్న విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు రోడ్డుపైకి రావడంతో ఒక్కసా­రిగా టీడీపీ నేతల్లో కంగారు మొదలైంది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వైఎస్సార్‌సీపీ నాయకులకు సర్దిచెప్పారు. రాష్ట్రంలో ఆటవిక పాలన కృష్ణా జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌పై దాడిని తీవ్రంగా ఖండించిన వైఎస్‌ జగన్‌ ఉప్పాల హారికతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శ ధైర్యంగా ఉండాలని.. పార్టీ అండగా ఉంటుందని భరోసా కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన మూకల దాడిని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. శనివారం బాధితురాలితో ఫోన్‌లో మాట్లాడి దాడి వివరాలు తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దాడి జరిగిన విషయాన్ని పార్టీ నాయకులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఒక బీసీ మహిళ, జిల్లా ప్రథమ పౌరురాలు భయంతో వణికిపోయే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయంటే ఇంతకంటే దారుణం ఉంటుందా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ప్రజాస్వామ్య హననం జరుగుతోందని, ఆటవిక పాలన సాగుతోందని మండిపడ్డారు. వాహనాలు, అంబులెన్స్‌ను అడ్డుకుని వీరంగంగుడివాడలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సమావేశాన్ని అడ్డుకోడానికి కూటమి ప్రభుత్వంలోని టీడీపీ, జనసేన కార్యకర్తలు చేయని ప్రయత్నం లేదు. వారు శనివారం స్థానిక నాగవరప్పాడు వంతెన వద్ద వీరంగం సృష్టించారు. గంజాయి, మద్యం మైకంలో ఏమి చేస్తున్నారో తెలియక వచ్చి పోయే వాహనాలను అడ్డుకుని సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురిచేశారు. పోలుకొండ రోడ్‌లో రోగిని తీసుకెళ్లేందుకు వెళ్తున్న అంబులెన్స్‌ను సైతం అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో దానిని వదిలివేశారు. ఇలా ప్రతి వాహనాన్ని ఆపడం, అందులో ఉన్న వారిని గుర్తించి.. వైఎస్సార్‌సీపీ నాయకులని భావిస్తే వారిపై దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు సూర నరసారావు ఏలూరు వెళుతుండగా నాగవరప్పాడు వంతెన వద్ద టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. తాను సమావేశానికి వెళ్లడం లేదని, వ్యక్తిగత పనిపై ఏలూరు వెళుతున్నానని చెప్పినా వినిపించుకోకుండా కారుపై దాడి చేసి అద్దాలు పగులగొట్టేయత్నం చేశారు. అరాచకానికి పరాకాష్టరాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీసులను గుప్పిట్లో పెట్టుకుని, యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తూ.. పౌర హక్కులను కాలరాస్తోంది. తమను ప్రశ్నించే వారే ఉండకూడదన్నట్లు తాలిబన్లను మరిపిస్తోంది. ఇందులో భాగంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలను సైతం అడ్డుకుంటోంది. ఆయన కార్యక్రమాల్లో పాల్గొన్న వారిపై తప్పుడు కేసులు నమోదు చేస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ హామీలతో పాటు మిగతా హామీలన్నీ అమలు చేయాలన్న డిమాండ్‌ ప్రజల నుంచి రాకుండా ముందే భయభ్రాంతులకు గురి చేసేలా రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. ఈ కమ్రంలో ప్రజా సమస్యలు ఎత్తి చూపేందుకు ప్రజల్లో వెళ్తున్న వైఎస్‌ జగన్‌కు భద్రత కల్పించకుండా కుట్ర పూరితంగా వ్యవహరిస్తోంది. రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్‌ జగన్‌ గుంటూరు మిర్చి యార్డు పర్యటన, టీడీపీ గూండాల చేతిలో హతమైన బీసీ నాయకుడు కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఉమ్మడి అనంతపురం జిల్లా రామగిరి మండల పర్యటనకు వెళ్లినప్పుడు అడ్డంకులు సృష్టించింది. ఇదే రీతిలో ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు వెళ్లినప్పుడు, పల్నాడు జిల్లా సత్తెనపల్లెలో టీడీపీ గూండాల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న వైఎస్సార్‌సీపీ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లినప్పుడు, నిన్నటికి నిన్న చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మామిడి రైతులకు మద్దతు ధర కోసం గళం విప్పేందుకు వెళ్లినప్పుడు ఇదే తరహాలో అడ్డంకులు సృష్టించింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు, నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించింది.

Actor Kota Srinivasa Rao Passed Away2
ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు మృతి

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు (83) ఈ తెల్లవారుజామున 4 గంటలకు కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణా జిల్లా కంకిపాడులో 1942 జూలై 10న జన్మించిన కోట శ్రీనివాసరావు, 1978లో 'ప్రాణం ఖరీదు' చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సుమారు 750కి పైగా చిత్రాల్లో నటించారు.ఒక తండ్రిగా, ఒక తాతగా, ఒక విలన్‌గా, ఒక కమెడియన్‌గా, ఒక నిస్సహాయుడిగా, ఒక క్రూరుడిగా ఇలా ఆయన ఏ వేషం వేసినా.. దానికో ప్రత్యేక గుర్తింపు. విభిన్న రకాల పాత్రల్లో అవలీలగా ఒదిగిపోవడం ఆయనకే సాధ్యం. క్యారెక్టర్ నటుడిగా తనకంటూ ఒక స్థాయిని సెట్ చేసుకొని తెలుగు సినిమాకు పెట్టని కోటగా మారిన విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు. వెండితెరపై ఆయన పోషించని పాత్ర, పండించని రసం లేదంటే అతిశయోక్తి కాదేమో. సిల్వర్‌ స్క్రీన్‌ను విభిన్న పాత్రలతో సుసంపన్నం చేసిన కోటా శ్రీనివాస రావు తన సినీ ప్రయాణాన్ని ముగించారు.తొలి ఛాన్స్‌ ఎలా వచ్చిందంటే..‘ప్రాణం ఖరీదు’ (1978) సినిమాలో రావు గోపాలరావుగారు ప్రధాన పాత్రకు ఎంపిక అయ్యారు. అప్పటికే ‘ప్రాణం ఖరీదు’ నాటకం ప్రజల్లో ఆదరణ ఉంది. అందులో కోట నటించారు. ఆ నాటకాన్ని నిర్మాత వాసు, దర్శకుడు క్రాంతి కుమార్‌ చూసి సినిమా తీయాలనుకున్నారు. ఆ నాటిక రాసిన సీ.ఎస్‌.రావుగారే సినిమాకి కూడా రచయిత. ఆయనకు కోట అంటే చాలా సెంటిమెంట్‌ ఉండేది. దీంతో ‘ప్రాణం ఖరీదు’లో చిన్న వేషం ఉంది.. చేయాలని కోరారు. అలా కోట ప్రయాణం మొదలైంది. అయితే, ఈ సినిమా తర్వాత ఆయన సుమారు ఐదేళ్లు గ్యాప్‌ తీసుకున్నారు. హైదాబాద్‌లోని స్టేట్‌బ్యాంకులో మంచి ఉద్యోగం ఉండటంతో కుటుంబాన్ని చూసుకుంటూ ఉండేవారు. జంధ్యాలగారితో ఉన్న పరిచయం వల్ల అమరజీవి (1983) చిత్రంలో నటించారు. అదే ఏడాదిలో విజయశాంతి ప్రతిఘటనలో ఛాన్స్‌ వచ్చింది. 1985లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ అయింది. ఆ రాత్రికి రాత్రి కోట స్టార్‌ అయిపోయారు. ఆయనకు వరుసగా భారీ ఆఫర్లు రావడంతో 1986లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిగా సినిమాలకే పరిమితం అయ్యారు.

Pawan Kalyan Suspended Janasena Party Leader TV Rama rao3
అలా ప్రశ్నిస్తావా?.. చంద్రబాబు కోసం సేనాని సంచలన నిర్ణయం

నేనే పాతికేళ్ల పాటు చంద్రబాబు పల్లకి మోయాలని నిర్ణయించుకున్నాను. ఆయన ఎన్నాళ్ళు సీఎంగా ఉన్న ఆయన గుమ్మం ముందు కాపలాకు సిద్ధమయ్యాను.. అలాంటిది చంద్రబాబును, ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తే ఎలా ఊరుకుంటాను అన్నట్లుగా ఉంది పవన్ కళ్యాణ్ ఐడియాలజీ. ఏమైనా గానీ పార్టీలో ఎదగాలంటే పార్టీ అధినేత కనుసన్నల్లో.. ఆయన మనసెరిగి ప్రవర్తిస్తేనే ముందుకు వెళ్లగలరు.. ఉన్నతమైన స్థానాలు పొందగలరు. అలాకాకుండా అధినేత నిర్ణయాలకు వ్యతిరేకంగా న్యాయబద్ధమైన కావచ్చు ప్రశ్నలు సంధిస్తే మాత్రం ఖర్చయిపోతారు అని జనసేన అని రుజువు చేస్తున్నారు.వాస్తవానికి సేనాని పొత్తు లేకపోతే మొన్నటి ఎన్నికల్లో కూటమికి అధికారం దక్కేది కాదు. కానీ, గెలిచిన తర్వాత ప్రభుత్వంలో క్యాబినెట్‌లో పవన్ కళ్యాణ్‌కు ఏపాటి ప్రాధాన్యం దక్కుతుంది అన్నది జనం మొత్తానికి తెలుసు. ఇది ఎలా ఉంటే గ్రామాల్లో పట్టణాల్లో మండలాల్లో జన సైనికులను తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. జన సైనికులను రాజకీయ కార్యకర్తలుగా కన్నా డబ్బులు ఇస్తే వచ్చే కూలీలుగానే ట్రీట్ చేస్తూ వస్తున్నారు. ఏకంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన స్థాయిని తగ్గించుకుని చంద్రబాబు వద్ద తాబేదారుగా పని చేస్తున్నపుడు మధ్యలో మీరు ఎందుకు గొంతెత్తుతారు అన్నట్లుగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు.అంతేకాకుండా ప్రభుత్వం తరఫున జనసేనకు రావలసిన నామినేటెడ్ పదవులు విషయంలో కూడా అన్యాయం జరుగుతున్నది. ఎక్కడ ఏ విభాగంలో నామినేటెడ్ పోస్టులు నియామకాలు జరుగుతున్నా అక్కడ జన సైనికులకు కచ్చితంగా అన్యాయమే జరుగుతుంది. మంచి పోస్టులు ప్రాధాన్యం ఉన్న పోస్టులన్నీ తెలుగుదేశం వాళ్ళు తన్నుకుపోతుండగా మిగిలిపోయిన చిన్నా చితకా పదవులు నామ్ కే వాస్తే జన సైనికులకు దక్కుతున్నాయి. భారీ వేట అనంతరం సింహం తినగా మిగిలిన ఎముకలు బొమికలు దక్కించుకుని కుక్కలు నక్కలు పండగ చేసుకున్నట్లుగా జన సైనికుల పరిస్థితి ఉంది.మొన్న కొవ్వూరు నియోజకవర్గం పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు సంబంధించి చైర్మన్‌లను ప్రభుత్వం నియమించింది. మొత్తం 14 పదవులకు గాను 12 పదవులు తెలుగుదేశానికి కేటాయించారు. ఆ పదవులన్నీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలకే ఇచ్చారు. మిగిలిన రెండు పోస్టులు జనసేనకు చెందిన కాపు నేతలకు ఇచ్చారు. మొత్తం 14 పోస్టుల్లో దాదాపుగా 90 శాతం పదవులు తెలుగుదేశం వారే తీసుకోవడాన్ని అక్కడి జనసేన నియోజకవర్గం ఇంచార్జ్ టీవీ రామారావు అవమానకరంగా భావించారు.తమ పార్టీని ఇంత చిన్నచూపు చూడటమా.. మరీ బిచ్చం వేసినట్లు రెండంటే రెండు పదవులు ఇస్తారా అంటూ మీడియా ముందు తన ఆవేదన వెళ్లగక్కారు. వాస్తవానికి ఇలాంటి పదవులు పంపిణీ జరిగేటప్పుడు జనసేన, తెలుగుదేశం నాయకులు మధ్య సమన్వయం అవసరం. ఇరుపార్టీల నాయకులు చర్చించుకుని పదవులు పంచుకోవాలి. అయితే, రాష్ట్రంలో జనసేనకు పవన్ కళ్యాణ్ మినహా మరో నాయకుడు లేరు. నాగబాబు అప్పుడప్పుడు కనిపించి వెళ్లడమే తప్ప పార్టీలో ఆయనకు అధికారం లేదు.. బాధ్యత కూడా లేదు. దీంతో తమ కష్ట నష్టాలు ఎవరికి చెప్పుకోవాలో కూడా కార్యకర్తలకు నాయకులకు అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్‌ను కలవడం అసాధ్యం. దీంతో టీవీ రామారావు అలాంటి సీనియర్ నాయకులు ఇలా తమ ఆవేదనను వెళ్లగక్కుతుంటారు.కార్యకర్తలకు జరిగిన అన్యాయాన్ని మీడియా ముఖంగా బయట పెట్టినందుకు టీవీ రామారావుపై పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకున్నారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీని బలోపేతం చేసే ఉద్దేశమే పవన్ కళ్యాణ్‌కి ఉంటే ఇలాంటి అంశాలను నోట్ చేసుకొని.. కార్యకర్తలు నాయకులతో చర్చించి తమకు రావాల్సిన పదవులు వాటాను తెచ్చుకునేవారు. కానీ, పవన్‌కు పార్టీ మీద, కార్యకర్తల మీద ఎలాంటి ఆపేక్ష లేనట్లు ఈ సస్పెన్షన్‌తో అర్థమవుతుంది. నేనే చంద్రబాబుకు మరో పాతికేళ్ళు బేషరతుగా మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాక ప్రశ్నించడానికి మీరు ఎవరు?. పదవులు కానీ ఇంకేమైనా ప్రయోజనాలు కానీ చంద్రబాబు దయాదాక్షిణ్యలతో ఇస్తే తీసుకోవాలి తప్ప ప్రశ్నిస్తే ఊరుకునేది లేదు అన్నట్లుగా పవన్ నిర్ణయం తీసుకున్నారు. టీవీ రామారావు వంటి సీనియర్ నాయకుడికే పార్టీలో రక్షణ లేకపోతే కిందిస్థాయిలో ఉండే తమకు ఇంకేం ఉంటుందని మండల స్థాయి నాయకులు లోలోన కుమిలిపోతున్నారు-సిమ్మాదిరప్పన్న.

Weekly Horoscope In Telugu From 13-07-2025 To 19-07-20254
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం...మీ అవసరాలకు తగినంతగా డబ్బు అందుకుంటారు. అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి. బంధువులతో వివాదాలు తీరి సఖ్యతతో మెలగుతారు. ఆరోగ్యపరమైన చికాకులు కొంత బాధిస్తాయి. దూరపు బంధువుల సూచనలు పాటిస్తారు. ఆస్తి విషయాలలో ఒప్పందాలు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకూల మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో వృథా ఖర్చులు. మిత్రులతో కలహాలు. తెలుపు, నీలం రంగులు. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.వృషభం...విద్యార్థులకు నూతన అవకాశాలు దక్కుతాయి. ప్రముఖ వ్యక్తులు పరిచయమవుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు అన్ని విధాలా సహాయం అందిస్తారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడతాయి. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మరింత గుర్తింపు రాగలదు. రాజకీయవర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.మిథునం...ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. పరిచయాలు మరింతగా పెరుగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కోర్టు కేసులు కొన్ని పరిష్కారమవుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు భవిష్యత్తుపై భరోసా ఏర్పడుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళారంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఎరుపు, నేరేడు రంగులు. రాఘవేంద్రస్తుతి మంచిది.కర్కాటకం...ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉండి రుణాలు కూడా తీరుస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. పాతజ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. సంగీత, సాహిత్య విషయాలపై ఆసక్తి చూపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అనుకున్నంతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాల వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో అనారోగ్యం. బంధువిరోధాలు. నీలం, నేరేడు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.సింహం....అనుకున్న మేరకు డబ్బు చేతికందుతుంది. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. శ్రమ పెరిగినా ఫలితం కనిపిస్తుంది. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. మీ ప్రతిపాదనలు కుటుంబసభ్యులు అంగీకరిస్తారు. విద్య, ఉద్యోగావకాశాలు దక్కించుకుంటారు. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు తథ్యం. పారిశ్రామికవర్గాలకు కొత్త లైసెన్సులు లభిస్తాయి. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు. గణేశాష్టకం పఠించండి.కన్య....వ్యూహాత్మక వైఖరితో అనుకున్న విజయాలు సాధిస్తారు. పరపతి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు విద్యావకాశాలు దక్కుతాయి. కోర్టు వ్యవహారం ఒకటి అనుకూలిస్తుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. చాకచక్యంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. కళారంగం వారికి కొత్త అవకాశాలు. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. శ్రమా«ధిక్యం. బంధువిరోధాలు. నీలం, నేరేడు రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.తుల....కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులు పరిచయమవుతారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు, చికాకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఊహించని విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు. శివాష్టకం పఠించండి.వృశ్చికం...చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులతో వివాదాలు తీరతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రతి విషయంలోనూ సన్నిహితుల సాయం అందుతుంది. భూములు, వాహనాలు కొంటారు. ఇంటిలో శుభకార్యాలపై చర్చలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఒక ముఖ్య సమాచారం అందుతుంది. రాజకీయవేత్తలకు కొత్త పదవులు దక్కే అవకాశం. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. పసుపు, లేత గులాబీ రంగులు. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.ధనుస్సు...రాబడి కొంత తగ్గి రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు ఏర్పడతాయి. పనుల్లో ప్రతిబంధకాలు. మీపై ఆధిపత్యానికి ప్రత్యర్థులు యత్నిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలించదు. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు ఇబ్బంది కలిగిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు అనివార్యం. పారిశ్రామికవేత్తలకు నిరాశాజనకంగా ఉంటుంది. వారం చివరిలో కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. గులాబీ, లేత ఎరుపు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.మకరం...ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి. బంధువులు, ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ యత్నాలు ముమ్మరం చేస్తారు. ఒక సమాచారం ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. అనుకున్న ఆశయాలు సాధిస్తారు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగల సూచనలు. కళాకారులకు నూతనోత్సాహం.వారం ప్రారంభంలో ధనవ్యయం. మానసిక అశాంతి. ఆకుపచ్చ, నేరేడు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.కుంభం...ఇంతకాలం పడిన శ్రమ అనుకూలిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. ముఖ్యుల నుంచి ఒక కీలక సమాచారం అందుతుంది. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు దక్కుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు పైస్థాయి నుంచి ప్రశంసలు. కళాకారులకు అవార్డులు, సన్మానాలు. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. వృథా ఖర్చులు. ఆకుపచ్చ, లేత ఎరుపు రంగులు. గణేశ్‌ స్తోత్రాలు పఠించండి.మీనం...బంధువుల నుంచి శుభవార్తలు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. పనులు సజావుగా సాగుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వాక్చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకుంటారు. మీ నిర్ణయాలు ధైర్యంగా వెల్లడిస్తారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. కళాకారులకు ప్రభుత్వం నుంచి ఆహ్వానాల అందుతాయి. వారం చివరిలో అనుకోని ఖర్చులు. కుటుంబంలో చికాకులు. నీలం, పసుపు రంగులు. శివపంచాక్షరి పఠించండి.

Air India crash report shows pilot confusion over engine switch movement5
Ahmedabad: ఒక ఆడియో.. పలు ప్రశ్నలు

వారాల తరబడి వేచి ఉన్నాక, ప్రాథమిక దర్యాప్తు జరిగాక నివేదిక వెలువడితే ఆ విమానప్రమాద రహస్యాలు బయటికొస్తాయని అందరూ ఆశించారు. అయితే జూన్‌ 12న జరిగిన అహ్మదాబాద్‌ విమాన ప్రమాద ఘటన తాలూకు నివేదిక అందుకు భిన్నంగా మరిన్ని చిక్కుముడులు వేసేలా వెలువడటం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. విమానం ట్యాక్సీ స్థలం నుంచి మొదలై రన్‌వేపై పరుగెత్తి ఆకాశంలోకి ఎగిరేదాకా పైలట్ల సంభాషణలు రికార్డయితే కేవలం ఒకటి, రెండు వాక్యాలు మాత్రమే పొడిపొడిగా దర్యాప్తులో ప్రస్తావించడం కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది. ఆ వాక్యాలు కూడా పైలట్ల స్రత్పవర్తనను ప్రశ్నించేలా, వారి అంకితభావంపై అనుమానాలు రేకెత్తించేలా ఉన్నాయి. ]ఫ్యూయల్‌ స్విచ్‌ను ఎందుకు ఆఫ్‌ చేశావని ఒక పైలట్‌ను మరో పైలట్‌ అడగటం చూస్తుంటే మొదటి పైలట్‌ ఉద్దేశపూర్వకంగానే స్విచాఫ్‌ చేశాడనే అనుమానం రేకెత్తుతోంది. అయితే తాను స్విచాఫ్‌ చేయలేదని అతని కరాఖండీగా చెప్పడం, వెనువెంటనే ఇద్దరూ స్విచ్‌ ఆన్‌కు ప్రయత్నించడం చూస్తుంటే ఆ స్విచ్‌లలోనే ఏవైనా మెకానిక్, ఎలక్ట్రిక్‌ లోపాలు ఉండొచ్చనే అనుమానాలూ బలపడుతున్నాయి. అయితే స్విచింగ్‌ వ్యవస్థలో లోపాలు ఉన్నాయో లేదో ప్రాథమిక నివేదికలో పేర్కొనకపోవడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. అయితే స్విచాఫ్‌ చేయడాన్ని గమనించి పైలట్‌ ఇంకొరిని ప్రశ్నించాడా ? అనేది తేలాల్సి ఉంది. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత పాక్‌ ప్రతీకార చర్యల్లో భాగంగా సరిహద్దు సమీప రాష్ట్రాల గగనతలాలపై ఎగిరే విమానాల కోఆర్డినేట్స్‌ను మార్చి, కూల్చేసేందుకు పాక్‌ సైబర్‌ దాడులను యత్నిస్తోందన్న కథనాల నడుమ ఈ నివేదిక విడుదలైంది. అయితే ఫ్యూయల్‌ స్విచ్‌ను ఎందుకు ఆఫ్‌ చేశావని ప్రశ్నించిన పైలట్‌ పేరును నివేదికలో బహిర్గతం చేయకపోవడం వెనుక ఆంతర్యమేముందని పలువురు నిపుణులు ప్రశ్నిస్తున్నారు. పైలట్‌ల పూర్వచరిత్రపై కూపీలాగేందుకు, ఆ దిశగా దర్యాప్తు సజావుగా సాగాలని ఉద్దేశంతోనే వాళ్ల ఐడెంటిటీనీ ప్రభుత్వం బయటపెట్టలేదనే వాదనను అంతర్జాతీయ మీడియా తెరమీదకు తెచ్చింది. అయితే పైలట్లను ఈ నివేదిక ఎక్కడా తప్పుబట్టకపోవడం విశేషం. అలా అని ఇది పూర్తిగా మెకానికల్, ఎలక్ట్రికల్‌ సమస్య కారణంగా జరిగిందనీ పేర్కొనలేదు. ప్రభుత్వం ఫ్యూయల్‌ స్విచ్‌లు ఆఫ్‌ అయ్యాయని మాత్రమే ప్రస్తావించి అక్కడితో ముగించింది. కానీ ప్రజల్లో మాత్రం కొత్త ప్రశ్నల పరంపరకు పరోక్షంగా నాంది పలికింది. స్విచ్‌లను పొరపాటున ఆఫ్‌ చేశారా? లేదంటే స్విచింగ్‌ లోపాలా అనేది నివేదిక స్పష్టంగా పేర్కొనలేదు. దీంతో అసలు కారణం ఏమిటనే మిస్టరీ అలాగే మిగిలిపోయింది. మెకానికల్, ఎలక్ట్రికల్‌ సమస్యలే కారణమా? విమానం సెకన్ల వ్యవధిలో నేలరాలడానికి మెకానికల్, ఎలక్ట్రికల్‌ సమస్యలే కారణమై ఉంటాయని పలువురు అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక్కడే పైలట్‌ ఈ రెండు ఫ్యూయల్‌ స్విచ్‌లను ఒకేసారి ఆఫ్‌ చేయడం అసాధ్యమని కెనడాకు చెందిన విమాన ప్రమాదాల దర్యాప్తు అధికారి ఒకరు వెల్లడించారు. ‘‘ఫ్యూయల్‌ స్విచ్‌లను పొరపాటున ఆన్, ఆఫ్‌ చేయడం అంత సులభంకాదు. వీటికి లీవర్‌–లాక్‌లు ఉంటాయి. స్విచ్‌ను ఆన్‌ లేదా ఆఫ్‌ చేయాలంటే మొదటగా అక్కడున్న లీవర్‌ను పైకి లాగాల్సి ఉంటుంది. 1950వ దశకం నుంచే ఈ భద్రతా ఫీచర్‌ ఉంది. ఇవికాకుండా ప్రొటెక్టివ్‌ గార్డ్‌ బ్రాకెట్స్‌ అనేవి కూడా ఉంటాయి. పొరపాటున స్విచ్‌లు ఆన్‌/ఆఫ్‌ కాకుండా వాటిని ఈ బ్రాకెట్లు నిరోధిస్తాయి. ఈ లెక్కన ఒక్క చేతితో రెండు స్విచ్‌ల లీవర్‌లను ఒకేసారి పైకిలాగడం అసాధ్యం. పొరపాటున లాగారని భావించినా ఒకేసారి రెండింటినీ ఎవరూ లాగరు. ఈ లెక్కన వాటి పొజిషన్‌ను మార్చకపోయినా మెకానికల్, ఎలక్ట్రికల్‌ సమస్యల కారణంగా వాటి పొజిషన్‌ మారి ఉంటుంది’’అని ఆ నిపుణుడు వివరించారు. 737 మోడల్‌లో లాకింగ్‌ ఫీచర్‌లో సమస్యలు! బోయింగ్‌ 737 రకం విమానాల్లో అమర్చిన ఫ్యూయల్‌ స్విచ్‌లకు లాకింగ్‌ వ్యవస్థ సరిగా అనుసంధానం కాలేదన్న అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని యూఎస్‌ ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ సంస్థ స్పెషల్‌ ఎయిర్‌వర్తీ ఇన్ఫర్మేషన్‌ బులెటిన్‌ను 2018 డిసెంబర్‌లో విడుదలచేసింది. అందులో బోయింగ్‌ 737లోని ఫ్యూయల్‌ స్విచ్‌లతో లాకింగ్‌ ఫీచర్‌ సరిగా అనుసంధానం కావట్లేదని, అత్యవసర సమయాల్లో పనిచేయకపోవచ్చని, ఎప్పటికప్పుడు చెక్‌చేసుకుంటే మంచిదని సంస్థ తన అడ్వైజరీలో పేర్కొంది. అయితే ఈ సిఫార్సును ఏ విమానసంస్థ అయినా పట్టించుకుందో లేదో ఎవరికీ తెలీదు. అయితే ఇదే స్విచ్‌ డిజైన్‌ను బోయింగ్‌ 787–8 రకం విమానాల్లోనూ ఉపయోగించారు. అహ్మదాబాద్‌లో కూలిన వీటీ–ఏఎన్‌బీ విమానం ఈ రకానికి చెందినదే. అందుకే మీ వద్ద ఉన్న ఈ రకం విమానాలను స్వీయ తనిఖీ చేసుకుంటే బాగుంటుందని సిఫార్సుచేసింది. అయితే తనిఖీలకు ఎయిర్‌ఇండియా ఒప్పుకోలేదని తెలుస్తోంది. మొత్తం ఆడియో ఎందుకు బయటపెట్టలేదు? నువ్వెందుకు స్విచ్‌ ఆఫ్‌ చేశావని ఒక పైలెట్‌ను మరో పైలట్‌ అడగడం, నేను ఆఫ్‌చేయలేదని అతను బదులివ్వడం తప్పితే మరే ఇతర ఆడియో వివరాలు బహిర్గతం చేయకపోవడం సైతం అనుమానాలకు తావిస్తోందని నిపుణులు వ్యాఖ్యానించారు. ‘‘విమానం ట్యాక్సీ స్థలం నుంచి మొదలై రన్‌వే అటు కొనకు చేరుకుని రన్‌వేపై ప్రయాణించి, గాల్లోకి లేచి, కూలిపోయే చిట్టచివరి సెకన్‌ దాకా ఇద్దరు పైలట్ల మధ్య జరిగిన సంభాషణ మొత్తం రికార్డ్‌ అయంది. అలాంటప్పుడు మొత్తం ఆడియోను విడుదలచేస్తే నిపుణులు విశ్లేషించి ప్రమాదంపై ఓ అంచనాకు రాగలరు. వాళ్ల పరస్పర మాటలు, వాగ్వాదం లాంటివి వినగల్గితే స్విఛ్‌లు ఆఫ్‌ కావడం అనేది మానవతప్పిదమా? ఉద్దేశపూర్వకమా? లేదంటే అవి పాడైపోవడంతో పనిచేయడం మానేశాయా? అనేవి స్పష్టంగా తెలుస్తాయి’’అని అమెరికా నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డ్‌ మాజీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పీటర్‌ గోయెల్జ్‌ చెప్పారు. ఏమిటీ ఇంధన స్విచ్‌లు విమానంలో ఇంజన్లకు సరఫరా చేసే ఇంధనాన్ని కాక్‌పిట్‌లోని ‘ఫ్యూయల్‌ కంట్రోల్‌ స్విచ్‌’లతోనే నియంత్రిస్తుంటారు. టేకాఫ్, ల్యాండింగ్‌ సమయంలో ఇవే అత్యంత కీలకం. ఇంజన్‌ విఫలమైతే మాన్యువల్‌గా రీస్టార్ట్, లేదా షట్‌డౌన్‌ చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. టేకాఫ్‌ సయయంలో స్విచ్‌లను అచేతనావస్థలో (ఆఫ్‌ చేసి) ఉంచడం అత్యంత అసాధారణమని నిపుణులు చెబుతున్నారు. అహ్మదాబాద్‌లో ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదానికి ఇదే కారణం కావొచ్చని అంచనా వేస్తున్నారు.నివేదికపై పైలట్ల సంఘం తీవ్ర అభ్యంతరం నిష్పాక్షికంగా సమగ్ర దర్యాప్తు జరగాలని డిమాండ్‌ముంబై: అహ్మదాబాద్‌ విమాన ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు జరిగిన తీరు, నివేదికలో ప్రస్తావించిన కొన్ని అంశాలు పైలెట్లదే తప్పు అనే అర్థం గోచరించేలా ఉన్నాయని భారతీయ ఎయిర్‌లైన్‌ పైలెట్ల సంఘం(ఏఎల్‌పీఏ) వ్యాఖ్యానించింది. నివేదికపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. నిష్పాక్షికంగా సమగ్ర దర్యాప్తు కొనసాగించాలని ఏఎల్‌పీఏ అధ్యక్షుడు కెప్టెన్‌ శ్యామ్‌ థామస్‌ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ‘‘పైలెట్లదే తప్పు అని తేల్చేలా దర్యాప్తు జరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ప్రాథమిక దశలోనే ఇలాంటి నిర్ణయానికి రావడం విచారకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పైగా దర్యాప్తులో ఇంత గోప్యత ఎందుకు? ఇంత కీలకమైన కేసు దర్యాప్తు బృందంలో పైలట్ల రంగం నుంచి నిపుణులకు చోటివ్వకపోవడం శోచనీయం. కనీసం పరిశీలకులుగా అయినా పైలట్ల సంఘ ప్రతినిధులకు అవకాశం కల్పించాలి. అప్పుడే దర్యాప్తులో పారదర్శకత, జవాబుదారీతనం ఉంటాయి. ఫ్యూయల్‌ స్విచ్‌ గేట్స్‌ వంటి కీలక మెకానికల్, ఎలక్ట్రిక్‌ ఉపకరణాల వ్యవస్థలో లోపాలు ఉండొచ్చని ఆరోపణలున్నాయి. అవి సరిగా ఉన్నదీ లేనిదీ విమానం బయల్దేరే ముందే తనిఖీలు చేశారా? ఫ్యూయల్‌ కంట్రోల్‌ స్విచ్‌ల పొజిషన్లు మారడం సైతం ప్రమాదానికి కారణం కావచ్చని అమెరికాలోని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. భారత్‌లో దర్యాప్తు జరుగుతుండగా, ప్రాథమిక దర్యాప్తు నివేదిక అధికారికంగా విడుదల కాకముందే అందులోని అంశాలు ఎలా లీకయ్యాయి?’’ అని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.ఎల్రక్టానిక్‌ కంట్రోల్‌ యూనిట్‌లో సమస్య ఉందా? ‘‘విమానంలో ఎలక్ట్రానిక్‌ కంట్రోల్‌ యూనిట్‌ అనేది కీలకం. ఈ ప్రమాదం విషయంలో ఎల్రక్టానిక్‌ కంట్రోల్‌ యూనిట్‌ పాత్ర ఏమిటి అనేది ఎక్కడా పేర్కనలేదు. పైలట్‌ ప్రమేయం లేకుండా ఎల్రక్టానిక్‌ కంట్రోల్‌ యూనిట్‌లో సమస్య కారణంగా ఫ్యూయల్‌ స్విచ్‌ పొజిషన్‌ మారిందా లేదా అనేది తెలియల్సి ఉంది. ఒకవేళ అదే జరిగితే ఎల్రక్టానిక్‌ కంట్రోల్‌ యూనిట్‌ స్తంభించిపోవడం అనే అంశంపై తీవ్రంగా దృష్టిసారించాల్సిందే’’అని భారత్‌లో ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో మాజీ దర్యాప్తు నిపుణుడు కెపె్టన్‌ కిశోర్‌ చింతా అన్నారు. ‘‘ఇంజిన్లు ఆగిపోవడంతో వెంటనే మొదటి ఇంజిన్‌ను స్టార్ట్‌ చేసేందుకు పైలట్లు ప్రయత్నించారు. అది నెమ్మదిగా శక్తిని అందుకుంటోంది. రెండో ఇంజిన్‌నూ స్టార్ట్‌చేశారు. అది మరింత నెమ్మదిగా శక్తిని అందుకుంటోంది. పైలట్లు దురుద్దేశంతో ఇంజిన్లను ఆఫ్‌ చేస్తే మళ్లీ ఆన్‌ చేయాల్సిన అవసరం వాళ్లకు లేదు. కానీ వాళ్లు వెంటనే ఆన్‌ పొజిషన్‌కు మార్చారు. విమానాన్ని తిరిగి తమ అ«దీనంలోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఈ లెక్కన స్విచాఫ్‌లో వాళ్ల ప్రమేయం లేదని ఊహించుకోవచ్చు’’అని మరో నిపుణుడు వ్యాఖ్యానించారు. ఈ విమానంలో ఫ్యూయల్‌ స్విచ్‌లు గతంలో ఏమైనా పాడయ్యాయా? రిపేర్‌ చేశారా? కొత్తవి బిగించారా? అనే వివరాలు నివేదికలో లేకపోవడం సైతం ఫ్యూయల్‌ స్విచ్‌ల నాణ్యతపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Sakshi Editorial On Education sector in Andhra Pradesh Chandrababu Govt6
విద్యారంగంపై విషపు చూపు!

ఆయనో గాడిదను చూపెడతారు. దాన్ని గుర్రం అనాలంటారు. ఔనౌను అది గుర్రమేనని పెంపుడు మీడియా నమ్మ బలుకుతుంది. తామేది చెబితే జనం దాన్నే నమ్మాలనే నియ మావళిని ఆయన అమల్లోకి తెచ్చారు. అయ్యయ్యో, అది గుర్రం కాదు గాడిదని అమాయకంగా ఎవరైనా అరిస్తే వారి మీద పెంపుడు మీడియా దండుపాళ్యం బ్యాచ్‌ అనే ముద్రను వేస్తుంది. ఆ దండుపాళ్యం బ్యాచ్‌ను దండించడానికి ఖాకీ మూక కదులుతుంది. దేశంలో ఉన్న అత్యంత సీనియర్‌ రాజకీయ నాయకుల్లో ఆయనొకరు. ముఖ్యమంత్రి కుర్చీతో నాలుగు విడ తలుగా పదిహేనేళ్ల సావాసముంది. అయినా పచ్చి అబద్ధాలను పబ్లిగ్గా వల్లెవేయడానికి ఇప్పటికీ వెనకాడటం లేదు.ఎందుకంటే, ఆయనకది అచ్చొచ్చిన విద్య. ఆ విద్యతోనే రాజకీయంగా తనను తాను ప్రమోట్‌ చేసుకున్నారు. పెంపుడు మీడియా అండదండగా నిలబడింది. ఇతరులకు దక్కవలసిన ఘనతను లాఘవంగా లాగేసుకోవడంలో, ఇతరుల మెడలో వేయాల్సిన వీరతాళ్లను తన మెడలో వేసుకోవడంలో ఆయన ప్రదర్శించే దిగ్భ్రాంతికరమైన చొరవ జగమెరిగిన సత్యమే. ఆయన వయసు డెబ్బై ఐదు దాటింది. ఇంకో పదిహేనేళ్లు ఆయన నాయకత్వంలోనే పని చేస్తానని పవన్‌ కల్యాణ్‌ పదే పదే చెబుతున్నారు. పవన్‌ కల్యాణ్‌ శిరోధార్యంగా తలపోసే సనాతన ధర్మంపై సర్వహక్కులున్న ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ మాత్రం మరోరకంగా ఆలోచిస్తున్నారు. సెవెంటీ ఫైవ్‌ దాటిందంటే శాలువా కప్పుకొని తప్పుకోవలసిందేనని ఆయన కుండబద్దలు కొడుతున్నారు.ఆరెస్సెస్‌ బాస్‌ విధిస్తున్న ఈ సెవెంటీ ఫైవ్‌ డెడ్‌లైన్‌పై భారత రాజకీయాల్లో ఈ సంవత్సరం పెద్ద చర్చే జరిగే అవ కాశముంది. ఈ నేపథ్యంలో మన సెవెంటీ ఫైవ్‌ ప్లస్‌ బాబు కూడా తననింతటి వాడిని చేసిన గోబెల్స్‌ వ్యూహాన్ని తన వారసుడి కోసం కూడా అమలు చేయడం మొదలుపెట్టాడు. అమెరికా వాళ్లు ఇటీవల ఇరాన్‌ మీద ప్రయోగించిన బంకర్‌ బస్టర్‌ లాంటి బాంబునొకదాన్ని సత్యసాయి జిల్లా కొత్తచెరువు స్కూల్లో చంద్రబాబు జారవిడిచారు. అడపాదడపా ఇలా బాంబులేయడం రివాజే కనుక పెద్దగా గగ్గోలు పుట్టలేదు కానీ, ఈ రకమైన క్షుద్ర రాజకీయాలను ఇంకో తరం కూడా భరించ వలసిందేనా అనే ఆందోళన మాత్రం మొదలైంది.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలుచేసిన విప్లవాత్మక కార్యాచరణలో ‘అమ్మఒడి’ అనే పథకం అతి ముఖ్యమైనఅంశం. 2014 ఎన్నికలకు ముందు విడుదల చేసిన మేనిఫెస్టో లోనే ఆయనీ వాగ్దానం చేశారు. 2019లో గెలిచిన తర్వాత అమలు చేయడం, దీనిపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురవడం తెలిసిన విషయాలే. చంద్రబాబు ఈ పథకం పేరు ‘తల్లికి వందనం’గా మార్చి మరింత గొప్పగా చేస్తానంటూ తన సూపర్‌ సిక్స్‌ ఎన్నికల హామీల్లో చేర్చారు. ఏడాది ఎగనామం తర్వాత ఆంక్షల వర్తింపుతో అమల్లోకి తెచ్చి ఆ వీరతాడును మీడియా కెమెరాల సాక్షిగా తన కుమారుడి మెడలో వేశారు. పాఠశాల పిల్లలతో మాట్లాడుతూ ‘‘విద్యామంత్రి బాగా చదువుకున్నారు. మంత్రయ్యారు. ఇప్పుడు మీకోసం ‘తల్లికి వందనం’ అనే ఆలోచన ఆయనే చేశార’’ని నిస్సంకోచంగా చెప్పుకొచ్చారు. ఆ విధంగా తన గోబెల్స్‌ బాటన్‌ను మరుసటి తరం చేతికి అందజేశారు.‘మెగా పేరెంట్స్‌ – టీచర్స్‌ మీట్‌’ అనే మరో గిన్నీస్‌ బుక్‌ కార్యక్రమం ఈ వేడుకకు వేదికైంది. విద్యార్థుల డేటాబేస్‌ను నిర్వహించే కేంద్ర ప్రభుత్వ సంస్థ లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 87 లక్షలమంది విద్యార్థులుండాలి. ప్రతి విద్యార్థికీ ‘తల్లికి వందనం’ స్కీమును వర్తింపజేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం 67 లక్షలమందినే లెక్క తేల్చింది. అందులో తల్లికి వందనం నిధులు 60 లక్షల లోపు విద్యార్థులకే అందినట్టు లెక్కలున్నాయి. మెగా పీటీఎమ్‌ రికార్డు బ్రేకింగ్‌ కార్యక్రమానికి 61 వేల పాఠ శాలల్లోని 74 లక్షలమంది విద్యార్థులు పాల్గొన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వారి తల్లిదండ్రులతో సహా 2 కోట్ల 30 లక్షల మంది హాజరై రికార్డు సృష్టించినట్టు చెప్పారు. 67 లక్షల మంది పిల్లల లెక్క తీసుకున్నప్పుడు తల్లుల సంఖ్యను 42 లక్షలుగా చూపెట్టారు. 74 లక్షలకు అదే నిష్పత్తితో లెక్కిస్తే తల్లుల సంఖ్య 46 లక్షలవుతుంది. అదే సంఖ్యలో తండ్రులు కూడా హాజరై ఉంటారు. 3 లక్షల పైచిలుకు టీచర్లు హాజరయ్యారు. అంతా కలిపి 1 కోటీ 69 లక్షలు. ఇంకో 60 లక్షలమంది పరిశీలకులూ, దాతలని పేర్కొన్నారు. సగటున ప్రతి పాఠశాలకు వందమంది వీరే. కొన్ని ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థుల సంఖ్య కంటే దాతల సంఖ్యే ఎక్కువ కనిపించడం గిన్నిస్‌ బుక్‌లో చేర్చాల్సిన అసలు విషయం.విద్య ప్రభుత్వ బాధ్యత కాదు, కార్పొరేట్‌ సంస్థలే చూసుకోవాలన్న చంద్రబాబు కొటేషన్‌ మరీ పాతదేం కాదు. ఆరేడేళ్ల కిందటిదే. ఇంతలోనే ఈ బృహత్తర కార్యక్రమాన్ని అమలు చేయడం కోసం ఆయన తన ఫిలాసఫీని వదిలేసు కున్నారా? ఎంతమాత్రమూ కాదు. ఇది నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించడం అనే డబుల్‌ యాక్షన్‌ ప్లాన్‌. ఈ పథ కాన్ని అమలు చేసే నాటికే ప్రభుత్వ బడుల్లో నాలుగు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. ప్రభుత్వ స్కూళ్లలో ప్రైవేటు స్కూళ్లకు దీటుగా సౌకర్యాలు మెరుగుపరిచే ‘నాడు–నేడు’ కార్యక్రమం ఆగిపోయింది. విద్యార్థుల పౌష్టికాహారం కోసం 16 రకాల పదార్ధాలతో జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా పరిశీలించిన ‘గోరుముద్ద’ పథకం స్థానంలో బొద్దింకల భోజనం స్వయంగా మంత్రుల అనుభవంలోకే వచ్చింది. విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం కోసం ప్రాథమిక స్థాయిలోనే జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన సబ్జెక్ట్‌ టీచర్‌ బోధన ఎగిరిపోయింది. విద్యార్థులు లేక 4,700 పాఠశాలలు మూసివేతకు సిద్ధంగా ఉన్నాయి.పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కోసం వైసీపీ సర్కార్‌ వెయ్యి స్కూళ్లలో ప్రారంభించిన సీబీఎస్‌ఈ బోధనను చంద్రబాబు – లోకేశ్‌ల సర్కార్‌ తొలగించింది. వారి నైపుణ్యానికి పదును పెట్టే టోఫెల్‌ శిక్షణను మాయం చేశారు. నగరాల్లో ఉన్నత వర్గాల వారు వారి పిల్లలకోసం లక్షలు గుమ్మ రించి చెప్పించే ఐబీ సిలబస్‌ను పేద పిల్లలకు ఉచితంగా నేర్పించాలన్న జగన్‌ సంకల్పానికి గండికొట్టారు. పేద విద్యార్థులు కూడా డిజిటల్‌ ప్రపంచంలో ముందడుగు వేయాలన్న లక్ష్యంతో ఎనిమిదో క్లాసు విద్యార్థులకు ట్యాబ్‌లను అందజేయడం ప్రారంభించింది జగన్‌ ప్రభుత్వం. ఆయన హయాంలో సుమారు పది లక్షలమంది చేతుల్లోకి ట్యాబ్‌లు వచ్చాయి. ఈ కార్య క్రమాన్ని నిర్దాక్షిణ్యంగా ఆపేసి, పేద బిడ్డల్ని డిజిటల్‌ ప్రపంచానికి దూరం చేసే కుట్రను అమలుచేశారు. పేద ప్రజల పిల్లల్ని ఐక్యరాజ్యసమితి వేదికపై నిలబెట్టిన ఇంగ్లిష్‌ మీడియం బోధనకు వ్యతిరేకంగా ఎన్ని కుట్రలు చేశారో, ఎంతమంది కుహనా సాంస్కృతిక రాబందుల్ని రంగంలోకి దింపారో, పేద పిల్లల నోటి దగ్గరి ‘నాణ్యతా’ ముద్దను తన్నేయడానికి ఎన్ని గద్దలు ఎగిరాయో ఈ సమాజం జ్ఞాపకాల్లోంచి అంత త్వరగా చెరిగిపోయేవి కావు.పేదల విద్యాసాధికారత మీద ఇన్ని కుట్రలు చేసిన తెలుగుదేశం పెద్దల పుర్రెల్లో ‘తల్లికి వందనం’ ఆలోచన పుట్టిందని చెప్పడం కంటే హాస్యాస్పద విషయం ఇంకేముంటుంది? ‘నాడు–నేడు’ కార్యక్రమాన్ని నిలిపివేయడం, జగన్‌ ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను క్రమంగా ఉపసంహరించడం, మధ్యాహ్న భోజన పథకాన్ని నీరుగార్చడం వంటివన్నీ ఉద్దేశ పూర్వక చర్యలేనని అభిజ్ఞవర్గాల సమాచారం. ఈ చర్యలు ఇంకా చురుగ్గా సాగుతాయట! రెండో దశలో ఇంకో ప్రచారం మొదల వుతుంది. ప్రైవేట్‌ స్కూళ్లలో చదివినా తల్లికి వందనం వస్తున్న ప్పుడు సౌకర్యాలు లేని ప్రభుత్వ స్కూళ్లలో ఎందుకు చదవాలని టముకు వేస్తారు. చేరగలిగిన వాళ్లంతా ప్రైవేట్‌కు మారిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. ప్రైవేట్‌ స్కూళ్లలో చదివించే స్థోమత కలిగిన వారికి ప్రభుత్వ సాయమెందుకని పెంపుడు మీడియానే ప్రశ్నిస్తుంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు. విద్య ప్రభుత్వం బాధ్యత కాదనే చంద్రబాబు మాట నెగ్గి ప్రైవేట్‌ విద్య వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. నాణ్యమైన విద్యకు దూరమైన శ్రామిక వర్గాల పిల్లలు చౌక శ్రామికులుగానే మిగిలిపోతారు.బాల్యంలో వేగంగా నేర్చుకునే వయసులో ఉన్నప్పుడు వారికి అందే విద్యా ప్రమాణాలే వారి ఐక్యూ స్థాయులను నిర్ధారిస్తాయని అనేక సర్వేలు వెల్లడించాయి. పోషకాహార లేమి వేగంగా నేర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని కూడా చాలాకాలంగా నిపుణులు చెబుతున్నారు. ఉన్నత స్థాయి బోధనా పద్ధతులు, డిజిటల్‌ పరిజ్ఞానం. పౌష్టికాహారం కొంత మందికి మాత్రమే అందుబాటులో ఉండి ఎక్కువమంది బాలలకు అందని ద్రాక్షలుగా ఉన్న దేశాలు ఐక్యూ ర్యాంకుల్లో వెనుకబడి ఉండటానికి కారణం అదే. విద్యా వ్యవస్థపై శాస్త్రీయమైన మదింపు చేసిన తర్వాతనే జగన్‌ మోహన్‌రెడ్డి మన పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువు మాత్రమేనని తన ప్రసంగాల్లో, సందేశాల్లో పదేపదే ప్రస్తావించేవారు. జగన్,చంద్రబాబుల దృక్పథంలో ఉన్న మౌలికమైన తేడా ఇదే! పేద, ధనిక, కులం, మతం, ప్రాంతం, ఆడ, మగ తేడాల్లేకుండా చదువు అనే ఆస్తి అందరికీ సమకూరాలనేది జగన్‌మోహన్‌ రెడ్డి తాత్విక భూమిక. చదువు అనే ఆస్తి కూడా కొనుగోలు చేయగలిగినవాడికే చెందాలనేది చంద్రబాబు విచార ధార.అందుకే దాన్ని ప్రభుత్వ బాధ్యతగా కాకుండా కార్పొరేట్‌ బాధ్యతగా వర్గీకరించారు. ‘తల్లికి వందనం’ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో కాకుండా ఒక ఎరగా వేశారని నిపుణులు అభిప్రా యపడుతున్నది కూడా అందుకే!ఈ మౌలికమైన తేడా ఇప్పుడు ఉపాధ్యాయుల అనుభవంలోకి కూడా వచ్చినట్టుంది. మొన్నటి మెగా పీటీఎమ్‌ కార్య క్రమాన్ని ఒక ఈవెంట్‌లా నిర్వహిస్తున్నారంటూ వారి సామాజిక మాధ్యమ గ్రూపుల్లో విమర్శలు వెల్లువెత్తాయి. అందులో ఒక్క పోస్టును క్లుప్తంగా గమనిస్తే వారి అభిప్రాయం ఏమిటో తేటతెల్లమవుతుంది. ‘‘బాబుగారూ, లోకేశ్‌గారూ... మీరు ఈ సమావేశంలో కూర్చున్న బెంచీలు మీ ప్రభుత్వం ఇచ్చినవి కావు. మీ ఎదురుగా వున్న ఐఎఫ్‌పీ ప్యానెళ్లు మీరు ఏర్పాటు చేయలేదు. పైన తిరుగుతున్న ఫ్యాను, వెలుగుతున్న లైటూ కూడా మీరిచ్చినవి కావు. మిగిలిన నాలుగేళ్లయినా ఈ పనికి మాలిన సమావేశాలు మానేయండి. టీచర్ల కాలాన్ని వృథా చేయకండి. పిల్లల భవిష్యత్తును నాశనం చేయకండి. ఉపాధ్యా యుల్ని మీ కూటమి ప్రభుత్వం ఈవెంటు మేనేజర్లుగా మార్చేస్తున్నది. పిల్లల తల్లిదండ్రులతో టీచర్ల సమావేశాలు ప్రతినెలా జరుగుతూనే ఉన్నాయి. దయచేసి ఈ కార్యక్రమాన్ని రాజకీయ కార్యక్రమంగా మార్చవద్దు. ముఖ్య విషయం: పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న మీరు పాఠశాలలకు చేసిన మేలు ఒక్కటంటే ఒక్కటైనా ఉన్నదా?... చెప్పండి సీ.ఎం. సారూ!’’వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

YS Jagan Mohan Reddy fires on Chandrababu Naidu7
ప్రజాస్వామ్యంలో ఉన్నామా? నియంతృత్వంలో ఉన్నామా?: వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసు యంత్రాంగాన్ని.. వారి అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ప్రశ్నించే గొంతుకలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్దాక్షిణ్యంగా నొక్కేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం అసలు ప్రజా­స్వామ్యంలో ఉన్నామా.. లేక నియంతృత్వంలో ఉన్నామా? అన్న సందేహం కలుగుతోందని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం సామాజిక మాధ్య­మం ‘ఎక్స్‌’లో సుదీర్ఘ పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే.. ‘ప్రశ్నించే హక్కుతో పాటు, నిరసన వ్యక్తం చేయడం అనేవి ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది వంటివి. ప్రజలు తమ సమస్యలు ప్రస్తావించి, వాటి పరిష్కారం కోరడం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ, దురదృష్టవశాత్తు మన ఆంధ్రప్రదేశ్‌లో.. ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన ప్రాథమిక హక్కు­లను చంద్రబాబు సారథ్యంలోని ప్రభు­త్వం నిర్దాక్షిణ్యంగా అణిచి వేస్తోంది. పోలీసు యంత్రాంగాన్ని, వారి అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తోంది. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక నియంతృత్వంలో ఉన్నామా? అని సందేహం కలిగే స్థాయికి అది చేరింది. ప్రజలు తమ సమస్యలు లేవనెత్తినా, వారికి మద్దతుగా విపక్షం గళం విప్పినా ప్రభుత్వం సహించడం లేదు. దారుణంగా వేధిస్తున్నారు. లేని కేసులు సృష్టిస్తూ వారి గళాన్ని నొక్కడంతో పాటు, అసలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారే ఉండకూడదన్న విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రక్రియలో రాష్ట్రంలో ఏ ఒక్కరినీ కూడా ఈ ప్రభుత్వం విడిచి పెట్టడం లేదు. అలా ప్రజాస్వామ్య స్ఫూర్తి, పౌర హక్కులకు తీవ్ర భంగం కలిగిస్తున్నారు. దీని వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం ఒక్కటే. ఒక పద్ధతి ప్రకా­రం ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలిగించడంతో పాటు, ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలి.. అలాగే ప్రశ్నించే ఏ గొంతుకా ఉండకూడదన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ఆ దిశలో ఈ ప్రభుత్వం చేసిన, చేస్తున్న చర్యలు.. పద్ధతి ప్రకారం ప్రజాస్వామ్యాన్నే అణిచి వేసేలా వ్యవహరిస్తున్న తీరుకు ఈ ఘటనలు అద్దం పడుతున్నాయి. ఫిబ్రవరి 19, 2025. గుంటూరు మిర్చి యార్డు ‘దారుణంగా ధరలు పతనం కావడంతో మిర్చి రైతులు పడుతున్న కష్టాలు తెలుసుకుని, వారిని పరామర్శించేందుకు గుంటూరు మిర్చి యార్డును సందర్శించాను. మిర్చి ధరలు రూ.27 వేల నుంచి ఏకంగా రూ.8 వేలకు పడిపోయాయి. ఆ పరిస్థితుల్లో నేను గుంటూరు మిర్చి యార్డును సందర్శించి, ఆ రైతులను పరామర్శిస్తే కేసు నమోదు చేశారు. ఏప్రిల్‌ 8, 2025. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి టీడీపీ మూకల చేతిలో దారుణ హత్యకు గురైన మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరిలో పర్యటించాను. దానిపైనా కేసు నమోదు చేశారు. వైఎస్సార్‌సీపీ రాప్తాడు నియోజకవర్గం కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపైనా కేసు పెట్టారు. జూన్‌ 11, 2025. ప్రకాశం జిల్లా పొదిలి ఏ మాత్రం గిట్టుబాటు ధర లేక నానా ఇక్కట్లు పడుతున్న పొగాకు రైతులను పరామర్శించేందుకు వెళ్తే ఏకంగా మూడు కేసులు నమోదు చేశారు. పొగాకు బోర్డు సూచన మేరకు రైతులు 20 శాతం పొగాకు ఎక్కువ సాగు చేశారు. కానీ, ధరలు మాత్రం దారుణంగా పతనమయ్యాయి. ఈ పరిస్థితుల్లో నేను పొగాకు రైతుల పరామర్శకు వెళ్తే మూడు కేసులు పెట్టారు. 15 మంది రైతులను జైళ్లకు పంపడంతో పాటు, నలుగురిని అరెస్టు చేశారు. చివరకు న్యాయస్థానం కూడా ఈ చర్యను తప్పు బట్టింది.జూన్‌ 18, 2025. పల్నాడు జిల్లా సత్తెనపల్లి గత ఏడాది ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పోలీసుల దారుణ వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకున్న మా పార్టీ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు రెంటపాళ్ల వెళ్తే, అక్కడా కేసులు నమోదు చేశారు. ఐదు కేసులు నమోదు చేయడంతో పాటు ఏకంగా 131 మందికి నోటీసులు జారీ చేశారు. ఇంకా సినిమా పోస్టర్లు ప్రదర్శించిన ఇద్దరిని అరెస్టు చేశారు. జూలై 9, 2025. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ఏ మాత్రం కొనుగోళ్లు లేక తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన తోతాపురి మామిడి రైతులను పరామర్శించేందుకు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలోని మార్కెట్‌ యార్డును సందర్శిస్తే.. అక్కడా ఏకంగా ఐదు కేసులు నమోదు చేశారు. 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజులు గడిచినా, వారి అరెస్టు చూపలేదు. కోర్టులో ప్రవేశ పెట్టలేదు. వారంతా ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నారు. టార్గెట్‌ పెట్టుకున్న వారందరిపై కేసులు ప్రతి కేసుకు సంబంధించి ముగ్గురు, నలుగురి పేర్లు పెట్టి.. ఇంకా ఇతరులు అని రాస్తున్నారు. ఆ విధంగా తాము టార్గెట్‌ పెట్టుకున్న వారిని ఆ తర్వాత ఆ కేసులో జోడిస్తున్నారు. నా ప్రతి పర్యటనలో కూడా ప్రజలెవ్వరూ రాకుండా, తీవ్ర నిర్బంధం విధిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు నోటీసులు జారీ చే­యడమే కాకుండా, వారిని ముందస్తుగా హౌజ్‌ అరెస్ట్‌ చేస్తున్నారు. చివరకు రైతులను కూడా ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. వారు రాకుండా నియంత్రించే కుట్ర చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ చెక్‌పోస్టులు పెట్టి, అడ్డుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్నది ఒకే ఒక విపక్షం. ప్రజా సమస్యలపై పోరా­డేది కూడా విపక్షమే. అలాంటి మా పార్టీని.. సీఎం చంద్రబాబు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, అణిచి వేసే ప్ర­యత్నాన్ని నిరంతరం కొనసాగిస్తున్నారు. లేని కేసులు బనాయించడం, అరెస్టులు చేయడం, ఆ విధంగా దారుణంగా వేధించడం పరిపాటిగా మారింది. అలా ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం కలిగించడమే కాకుండా, వాయిస్‌లెస్‌ పీపుల్‌ వా­యిస్‌ను నొక్కేస్తున్నారు. అడ్డగోలు హామీలిచ్చి, ఏవీ అమలు చేయకుండా ఉన్న తమను ఎవరూ ప్రశ్నించకూడదు.. వాటిపై ఎవరూ మాట్లాడకూడదు.. అన్న విధంగా ఈ ప్రభుత్వం అత్యంత దారుణంగా వ్యవహరిస్తోంది’ అని పేర్కొన్నారు.

Donald Trump releases new tariff letters for Mexico, European Union8
ఈయూ, మెక్సికోపై 30% టారిఫ్‌లు 

వాషింగ్టన్‌: యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ), మెక్సికో దేశాల ఉత్పత్తులపై 30 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఆగస్టు 1వ తేదీ నుంచే ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని వెల్లడించారు. సుంకాలపై ఆయా దేశాలకు రాసిన లేఖలను సోషల్‌ మీడియాలో శనివారం పోస్టుచేశారు. అక్రమ వలసదారులు, మత్తు పదార్థాలు అమెరికాలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి మెక్సికో ప్రభుత్వం తమకు చక్కగా సహకరిస్తోందని మెక్సికోకు రాసిన లేఖలో ట్రంప్‌ ప్రశంసించారు. మత్తు పదార్థాల నియంత్రణకు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని మెక్సికో ప్రభుత్వానికి సూచించారు. అలాగే ఈయూతో అమెరికాకు వాణిజ్య లోటు ఉందని, ఇది తమ జాతీయ భద్రతకు ముప్పేనని తేల్చిచెప్పారు. ఈ లోటును పూడ్చడానికి కలిసికట్టుగా పనిచేద్దామని ఈయూకు రాసిన లేఖలో పిలుపునిచ్చారు. అమెరికా ఉత్పత్తులపై ఈయూ దేశాలు అధికంగా టారిఫ్‌లు విధిస్తున్నాయని ట్రంప్‌ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆయన ఇప్పటిదాకా 24 దేశాలతోపాటు 27 దేశాలతో కూడిన ఈయూపై టారిఫ్‌లను ప్రకటించారు. మరికొన్ని దేశాలపై సుంకాలను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఏ రెండు దేశాల మధ్యనైనా సరే టారిఫ్‌లు ఒకేరకంగా ఉండాలని ట్రంప్‌ వాదిస్తున్నారు. ఒక దేశం నుంచి వచ్చే ఉత్పత్తులపై అధికంగా సుంకాలు వసూలు చేస్తూ.. అదే దేశానికి ఎగుమతయ్యే మన ఉత్పత్తులపై సుంకాలు తక్కువగా ఉండాలని కోరుకోవడం న్యాయం కాదని అంటున్నారు.

Bangladesh Plane Stuck At Chhattisgarh Airport For Nine Years9
రెక్కలున్నా.. లెక్క తేలక... పదేళ్లుగా ఉన్నచోటే!

2015 ఆగస్టు 7 రాత్రి 7 గం.లకు ‘మెక్‌డొనెల్‌ డగ్లస్‌ ఎం.డి. 83’ అనే బంగ్లాదేశ్‌ బోయింగ్‌ విమానం మన దేశంలో దిగింది. నిజానికి, బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో టేకాఫ్‌ అయిన ఆ విమానం నేరుగా ఒమన్‌ రాజధాని మస్కట్‌ వెళ్లాలి. అయితే దారి మధ్యలో విమానంలోని ఒక ఇంజిన్‌ చెడిపోయింది. పైలట్‌ విమానాన్ని అత్యవసరంగా రాయ్‌పుర్‌ (ఛత్తీస్‌గఢ్‌)లోని స్వామి వివేకానంద ఎయిర్‌పోర్ట్‌లో దింపేశాడు. విమానంలో ప్రయాణిస్తున్న 176 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. తర్వాత వాళ్లంతా ప్రత్యేక విమానంలో మస్కట్‌ చేరుకున్నారు. అయితే రాయ్‌పుర్‌లో ఆ రోజు ల్యాండ్‌ అయిన ఆ ‘డగ్లస్‌ 83’ మాత్రం నేటికీ తిరిగి బంగ్లాదేశ్‌ చేరుకోలేదు! రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా పదేళ్లుగా ఇప్పటికీ అక్కడే అంగుళం అయినా కదలకుండా ఉండిపోయింది!పార్కింగ్‌కి రూ.4 కోట్ల బకాయిపదేళ్లుగా ఆ డగ్లస్‌ 83 విమానం నిలిపి ఉన్న స్థలం ‘ఎయిర్‌పోర్ట్స్‌ అధారిటీ ఆఫ్‌ ఇండియా’ (ఏఏఐ) కిందికి వస్తుంది. అక్కడ పార్క్‌ చేసినందుకు ‘బంగ్లాదేశ్‌ యునైటెడ్‌ ఎయిర్‌వేస్‌’ ఇప్పటికి రూ. 4 కోట్లకు పైగా బకాయి పడింది. ఇమ్మంటే ఇవ్వదు, విమానాన్ని తీసుకుపోమ్మంటే పోదు. చూసి, చూసి, ఐదేళ్లు ఓపిక పట్టిన ఏఏఐ 2021 జనవరి 18న అధికారికంగా లేఖ రాసింది. ఆ లేఖ కూడా పని చేయలేదు. విమానం లాగే ఎక్కడి విజ్ఞప్తులు అక్కడే ఉండిపోయాయి. ఇప్పుడిక బంగ్లాదేశ్‌లో ఉన్నది తాత్కాలిక ప్రభుత్వం కావటంతో ఏఏఐ కూడా చూసీ చూడనట్లు పోవలసి వస్తోంది. కొనేవాళ్ల కోసం ఎదురుచూపులు!రాయ్‌పుర్, స్వామి వివేకానంద విమానాశ్రయంలో ఉన్నవే 11 పార్కింగ్‌ బేస్‌లు. (మొదట ఎనిమిదే ఉండేవి). వాటిల్లో ఒక బేస్‌లో డగ్లస్‌ ఎం.డి.83 ఉండిపోయింది. దానిని డంప్‌ యార్డ్‌కు పంపటానికి లేదు, అలా పడి ఉంటుందిలే అని సర్దుకుపోయే వీలూ లేదు. రెండు మూడు మరమ్మత్తుల చేస్తే చాలు, పైకి ఎగిరే విమానమే అది. అయితే బంగ్లాదేశ్‌ ఆ పని కూడా చేయటం లేదు! ‘‘కొనేవాళ్ల కోసం ఎదురు చూస్తున్నాం. కాస్త టైమ్‌ ఇవ్వండి..’’ అని బంగ్లాదేశ్‌ యునైటెడ్‌ ఎయిర్‌వేస్‌ అంటోంది. విసిగి వేసారిన రాయ్‌పుర్‌ ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ ఎస్‌.డి. శర్మ, న్యాయపరంగా ఈ సమస్యకు ఒక పరిష్కారం వెతికేందుకు ఉన్న మార్గాల కోసం ప్రస్తుతం అన్వేషిస్తున్నారు. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ వస్తే చాలుఅసలు డగ్లస్‌ 83 అత్యవసరంగా ల్యాండ్‌ అయిన మూడు వారాల తర్వాత గానీ బంగ్లాదేశ్‌ పౌర విమానయాన శాఖ అధికారులు పర్యవేక్షణ కోసం రాయ్‌పుర్‌ రాలేదు! ఆ వచ్చిన వాళ్లు మాత్రం చెడిపోయిన ఇంజిన్‌ను తీసి, దాని స్థానంలో కొత్తది బిగించారు. అంతవరకు బాగానే ఉంది. అయితే అక్కడి నుంచి విమానాన్ని తీసుకెళ్లాలంటే బంగ్లాదేశ్‌ విమానయాన శాఖ నుంచి తప్పనిసరిగా.. ‘ఎగిరేందుకు ఫిట్‌గా ఉంది’ అన్న సర్టిఫికెట్‌ రావాలి. అది రావటం లేదు, ఇది ఎగరటం లేదు. మనవాళ్లు ఇప్పటికి లెటర్‌లు, ఈమెయిళ్లు, కలిపి దాదాపు 100 వరకు పంపారు. నెలనెలా గుర్తు చేస్తూనే ఉన్నారు. ‘‘ఇదిగో, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ రాగానే విమానాన్ని తీసుకెళతాం’’ అని గత పదేళ్లుగా ఒకటే సమాధానం. రాయ్‌పుర్‌ ఎయిర్‌పోర్టుకూ ఇబ్బందులు ఉన్నాయి. అక్కడి నుండి రోజూ 30 విమానాలు టేకాఫ్‌ అవుతాయి. 30 విమానాలు ల్యాండ్‌ అవుతాయి. ఉదయం 8–10 గం. మధ్య, సాయంత్రం 4–6 గం. మధ్య మొత్తం నాలుగు గంటల పాటు పదకొండు పార్కింగ్‌ బేస్‌లు విమానాలకు అవసరం అవుతాయి. డగ్లస్‌ 83 కారణంగా ఆ బేస్‌లో ఉంచవలసిన వాటిని వేరే బేస్‌కు తరలించాల్సి వస్తోంది. ... ఇక వాళ్ల కష్టాలు..!‘బంగ్లాదేశ్‌ యునైటెడ్‌ ఎయిర్‌వేస్‌’ నష్టాల్లో కూరుకుపోయి, 2016లోనే కార్యకలాపాలు ఆగిపోయాయి. ఆ సంస్థ నుండి ఇంతవరకు ఒక్క విమానం కూడా టేకాఫ్‌ అవలేదు. అక్కడి నుంచి ఎనిమిది విమానాలను తీసుకెళ్లి ఢాకా హజ్రత్‌ షాజాలాల్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌ ‘కార్గో అప్రోచ్‌ ఏరియా’లో వదిలేశారు. అక్కడ అవి కార్గో ఫ్లయిట్స్‌ కదలికలకు అడ్డుగా ఉన్నాయి. ఈ పరిస్థితిలో – రాయ్‌పుర్‌ విమానాశ్రయానికి పార్కింగ్‌ చార్జీలు చెల్లించలేక, విమానాన్ని తీసుకెళ్లలేక, ‘‘మీరే ఎవరైనా కస్టమర్‌ను వెతికి పట్టుకుని, డగ్లస్‌ 83ని వచ్చింతకు అమ్మేసి, మీ బకాయిలను మినహాయించుకుని, మిగిలిన డబ్బును మాకు పంపండి’’ అని బంగ్లాదేశ్‌ యునైటెడ్‌ ఎయిర్‌వేస్‌.. మన ఎయిర్‌పోర్ట్స్‌ అధారిటీ ఆఫ్‌ ఇండియాకు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ·అసలు ఆ రోజు ఏం జరిగిందంటే?‘మెక్‌డొనెల్‌ డగ్లస్‌ ఎం.డి. 83’ విమానం బంగ్లాదేశ్‌లో టేకాఫ్‌ అయింది. వారణాసి–రాయ్‌పుర్‌ గగనతల హద్దులోకి వచ్చేసరికి ఒక ఇంజిన్‌ పాడైపోయింది! లోపల 176 మంది ప్రయాణికులు ఉన్నారు. అత్యవసరంగా ల్యాండ్‌ అవకపోతే గాల్లోనే పేలిపోయే ప్రమాదం ఉందని ఫైలట్‌ షాబాజ్‌ ఇంతియాజ్‌ ఖాన్‌ గ్రహించారు. భూమికి 32 వేల అడుగుల ఎత్తున విమానం గాల్లో చక్కర్లు కొడుతోంది. విమానంలోని ఫ్లయిట్‌ ఇంజినీర్‌ ‘ప్రమాదంలో ఉన్నాం. ల్యాండింగ్‌కి అనుమతి ఇవ్వండి’ అని సంకేతం పంపారు. అయితే దురదృష్టవశాత్తూ ఆ సంకేతం కోల్‌కతాలోని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూమ్‌కి చేరలేదు. కోల్‌కతా చెబితేనే రాయ్‌పుర్‌ చేస్తుంది. ఏమైతే అది అయిందని విమానాన్ని రాయ్‌పుర్‌లో దించేయాలని పైలట్‌ నిర్ణయించుకున్నారు. అయితే అత్యవసరంగానే అయినా ఒక విమానాన్ని ల్యాండ్‌ చేయించే అధికారం రాయ్‌పుర్‌ ఎయిర్‌ పోర్ట్‌కు లేదు. కోల్‌కతా నుంచి ఆదేశాలు రావాలి. అయితే దురదృష్టంతో పాటుగా అదృష్టమూ వారి వెంట ఉన్నట్లుంది. పైలట్‌ ఇచ్చిన సంకేతాన్ని ముంబై నుండి కోల్‌కతా వెళుతున్న ఇండిగో ఫ్లయిట్‌ పైలట్‌ పికప్‌ చేసుకుని ఆ సమాచారాన్ని కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌కు అందించారు. కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌ అధికారులు వెంటనే రాయ్‌పుర్‌ అధికారులకు సమాచారం ఇచ్చి ల్యాండింగ్‌కి అనుమతి ఇవ్వాలని కోరారు. రాయ్‌పుర్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఎలా దిగాలో తెలిపే నేవిగేషన్‌ చార్టు లేకుండానే విమానం సురక్షితంగా దిగేందుకు ఇండిగో పైలట్‌ నిర్విరామంగా రేడియో కాంటాక్ట్‌లోఉండి అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేశారు. విమానం భద్రంగా ల్యాండ్‌ అయింది. ప్రయాణికులకు వేరే విమానం అందుబాటులో లేకపోవటంతో 27 గంటల పాటు వారు అక్కడే ఉండిపోవలసి వచ్చింది. బంగ్లాదేశ్‌ నుండి ఆగస్టు 8 రాత్రి 10.27 గం.లకు ప్రత్యేక విమానం వచ్చి వారిని మస్కట్‌ తీసుకెళ్లింది.

Sakshi Guest Column On Shiv Sena, Raj Thackeray, Uddhav Thackeray10
కలయిక సరే... లాభం ఎవరికి?

జూలై 9 నాటి, సాక్షి పత్రిక సంపా దకీయం– ‘ఠాక్రే సోదరుల యుగళం’ చదివాక, మరిన్ని వాస్తవాలు తెలియ జేయటానికి ఈ విశ్లేషణ. మరాఠీ అస్మిత (ఉనికి), మరాఠీ యువత ఉద్యోగావకాశాల కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా 1966 జూన్‌ 19న ఏర్పాటైన శివసేన ‘మరాఠీ మానసాంచా హక్‌ ఆని న్యాయ సాఠీ’ (మరాఠీ వాళ్ళ న్యాయమైన హక్కుల కోసం) అనే నినాదం ఆ రోజుల్లో యువతను ఆకట్టుకుంది. భూమి పుత్రుల (సన్స్‌ ఆఫ్‌ సాయిల్‌) ఉద్యోగ సమస్యలు పరిష్కరిస్తూ, చట్ట సభలో వారి గొంతు వినిపించాలని మొదట ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌కు, తర్వాత విధాన స¿ý కు ప్రతినిధులన పంపటంతో రాజకీయాలతో ప్రమేయం లేని శివసేన, రాజకీయ రంగు పులుముకుంది. 1960, 1970 దశకాలలో కమ్యూనిస్టులకు నిలయం బొంబాయి నగరం అనేవారు. శివసేన రాకతో క్రమేణా కమ్యూనిస్టులు ఈ నగరంలో తెరమరుగు కావటం అప్పట్లో కాంగ్రెసుకు కూడా కలిసొచ్చింది. 1984 నుండి రైట్‌ వింగ్‌ జాతీయ పార్టీ అయిన భాజపాతో చేతులు కలిపిన శివసేన 1995లో కాషాయ కూటమితో మహారాష్ట్రలో (శివ షాహి) అధికారం చేజిక్కించుకుని, రాష్ట్రంలో కాంగ్రెసుకు ముఖ్య విరోధిగా ఎదిగింది. సుమారు నాలుగు దశాబ్దాలు పార్టీ అధినేత బాలా సాహెబ్‌ ఠాక్రే, సర్వం తానై పార్టీని రిమోట్‌ కంట్రోల్‌ శైలిలో, పకడ్బందీగా నడిపించారు (అడపా దడపా వలసలు మినహా). బాల్‌ ఠాక్రే సోదరుడు శ్రీకాంత్‌ కొడుకు స్వరరాజ్‌. ఈయన్నే రాజ్‌ అని పిలుస్తారు. చిన్నప్పటి నుండీ సాహెబ్‌తో చనువుగా ఉండేవాడు. తొమ్మిది పదేళ్ల ప్రాయం నుండే అతడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని పార్టీ మీటింగుకు తరచుగా హాజరయ్యేవారు బాల్‌ ఠాక్రే. పెద నాన్న ముఖ కవళికలు కలిగిన రాజ్‌ ఆయనలాగే పొలిటికల్‌ కార్టూన్లు గీయటం హాబీగా చేసుకున్నారు. బాలా సాహెబ్‌ హావ భావాలు, ఆయన ఉపన్యాస శైలి, బాడీ లాంగ్వేజ్‌ను అప్పటినుండే పుణికిపుచ్చుకున్న రాజ్‌ను, కాలేజీ రోజుల్లోనే శివసేన విద్యార్థి విభాగం ‘భారతీయ విద్యార్థి సేన’ చీఫ్‌గా నియమించి రాజకీయ సెలయేటిలోకి దించారు బాలా సాహెబ్‌. 1990 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అధినేతకు కుడి భుజంగా మెదిలిన రాజ్‌ను... మున్ముందు అతడే పార్టీ పగ్గాలు చేపట్టే సాహెబ్‌ వారసుడు అని అప్పట్లో కార్యకర్తలు చెప్పు కోసాగారు. మరాఠీ యువతకు కొత్త ఒరవడి చూపిస్తూ, పార్టీ లోకి వారిని చేర్చుతూ నవ చైతన్యం ప్రోదిచేశారు రాజ్‌. అయినా, పుత్ర వాత్సల్యం ప్రభావమో, మరే కారణమో తెలియదు కానీ రాజకీయాలకు బహుదూరంగా ఉన్న తన చిన్న కొడుకు ఉద్ధవ్‌ ఠాక్రేను 2002 నుండి రాజకీయాల వైపు మరల్చటం మొదలెట్టారు బాలా సాహెబ్‌. 2003లో జరిగిన శివసేన కార్యకర్తల శిబిర్‌లో ఉద్ధవ్‌ను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంటుగా నియమించారాయన. అది రాజ్‌కు అస్సలు మింగుడు పడలేదు. ఆ లగాయతు పార్టీలో ఉద్ధవ్, రాజ్‌ మధ్య అంతర్గత యుద్ధం ముదిరింది. చివరికి 2005 నవంబర్‌లో పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి, నాలుగు నెలల తర్వాత (మార్చి 2006) సొంత కుంపటి, ‘మహారాష్ట్ర నవ నిర్మాణ సేన’ (ఎమ్‌ఎన్‌ఎస్‌) ఏర్పాటు చేసు కున్నారు రాజ్‌ ఠాక్రే. కానీ, రాజ్‌కు అనుకున్న ఫలితం దక్క లేదు. ఎమ్‌ఎన్‌ఎస్‌ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 13 సీట్లతో ఖాతా తెరిచింది. అయితే శివసేన ఓట్లను చాలా వరకు చీల్చింది. ఆ తర్వాత 2014, 2019ల్లో కేవలం ఒక్క సీటుకే పరిమితమై, మొన్నటి 2024 ఎన్నికల్లో 1.55 ఓటింగ్‌ శాతంతో ఆ ఒక్క సీటును సైతం పోగొట్టుకుంది. గత ఇరవై సంవత్సరాల నుండి ఉత్తర–దక్షిణ ధ్రువాలుగా ఉన్న ఈ సోదరులు మొన్నటి (జూలై 5) హిందీభాష వ్యతిరేక ఉద్యమ విజయోత్సవ ర్యాలీలో ఒకే వేదిక పైకి వచ్చినప్పటికీ, రాజ్‌ ఠాక్రే వ్యవహార తీరులో అనుకున్న స్పందన కనిపించ లేదని కొందరు విశ్లేషకుల అభిప్రాయం. రాజ్‌ దూకుడు వైఖరి, ఉద్ధవ్‌ నిదానమే ప్రధానం పద్ధతి వల్ల రాబోయే కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఇరుపార్టీలూ సీట్లు సర్దుబాటు చేసుకుని, ఓటర్ల ముందుకు రావటం క్లిష్ట సమస్యే కావచ్చు. అదీకాక, ఉద్ధవ్‌ కొడుకు, మాజీ మంత్రి ఆదిత్య; రాజ్‌ కొడుకు అమిత్‌ (మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు)ల రాజకీయ భవిష్యత్తులు కూడా ఈ కలయిక నేపథ్యంలో ఆలోచించాల్సిన మరో కోణం.కాంగ్రెస్‌ దోస్తీ పుణ్యమా అని శివసేన (ఉద్ధవ్‌) పార్టీకి గత లోక్‌సభ ఎన్నికల్లో మైనారిటీ ఓట్లు చాలానే కలిసి వచ్చాయి. ఇప్పుడు ఆ పార్టీకి ఎమ్‌ఎన్‌ఎస్‌తో స్నేహం కారణంగా ఆ మైనారిటీ ఓట్లే కాక ఉత్తర భారతీయుల ఓట్లు కూడా మున్ముందు దూరం కావచ్చు. ‘రాజ్‌ ఠాక్రే బహిరంగ సభలో జనాన్ని ఆకర్షించవచ్చు కానీ, ఆయన భాషణ్‌ బ్యాలెట్‌ లోకి ఓట్లను తేలేద’ని సీనియర్‌ మరాఠా అధినేత, శరద్‌ పవార్‌ గతంలో ఒకసారి ఘంటాపథంగా చెప్పారు. అది వాస్తవం కూడా. ఏది ఏమైనా రాజ్‌ ఠాక్రే, తన అన్నయ్య ఉద్ధవ్‌తో రాజకీయ మైత్రి నెరపడానికి కారణం ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే ఓటు బ్యాంక్‌కు చెక్‌ పెట్టడమే కావచ్చు. అయితే ఈ కలయిక ‘మహా వికాస్‌ అఘాడీ’ కూటమిని కూడా ఇరకాటంలో పడేసింది. చివరిగా, ఠాక్రే సోదరులు కలిసిపోయే ఎపిసోడ్‌కు స్క్రిప్ట్‌ రైటర్‌ రాష్ట్ర బీజేపీ నాయకుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీసే అని అంటున్న స్థానిక విశ్లేషకుల మాటా గమనార్హమే!జిల్లా గోవర్ధన్‌ వ్యాసకర్త విశ్రాంత పీఎఫ్‌ కమిషనర్, ముంబైమొబైల్‌ : 98190 96949

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement