Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

YS Jagan Phone Call To Uppala Harika1
ఉప్పాల హారికను ఫోన్‌లో పరామర్శించిన వైఎస్‌ జగన్‌

సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ ఉప్పాల హారికను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. ఆమెతో మాట్లాడి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్న వైఎస్‌ జగన్‌.. బీసీ మహిళపై జరిగిన పాశవిక దాడిని ఆయన ఖండించారు. టీడీపీ, జనసేన మూకలు దాడి చేసిన విషయం పార్టీ నాయకులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు.ఒక బీసీ మహిళ, జిల్లా ప్రథమ పౌరురాలు భయంతో వణికిపోయే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయంటే ఇంతకంటే దారుణం ఉంటుందా? అంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ప్రజాస్వామ్య హననం జరుగుతోందని, ఆటవిక పాలన సాగుతోందని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. హారిక ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసానిచ్చారు.బీసీ మహిళ, జడ్పీ ఛైర్మన్ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాల దాడికి పాల్పడ్డారు. ఆమె కారును చుట్టుముట్టి విచక్షణారహితంగా దాడికి దిగారు. వైఎస్సార్‌సీపీ సమావేశానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.కృష్ణా జిల్లా జెడ్పీ ఛైర్‌పర్సన్‌ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాల దాడి అమానుషం అని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. టీడీపీ, జనసేన గూండాలు పట్టపగలే విచక్షణారహితంగా దాడికి పాల్పడడం దారుణమన్నారు. కూటమి పార్టీ కార్యకర్తలు ఉన్మాదంతో దాడి చేస్తున్నా.. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దారుణం. రెడ్ బుక్ రాజ్యాంగంలో మహిళా ప్రజా ప్రతినిధికే రక్షణ లేదు. ఇక సామాన్య మహిళలకు ఈ ప్రభుత్వం ఏం రక్షణ ఇస్తుంది.?’’ అంటూ వరుదు కల్యాణి ప్రశ్నించారు...ఒక జిల్లా ప్రథమ పౌరురాలికే పోలీసులు రక్షణ కల్పించలేకపోవడం సిగ్గు చేటు. చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌లు దీనికేం సమాధానం చెబుతారు?. మహిళా హోంమంత్రి అనిత ఎందుకు స్పందించడం లేదు?. ఈ అకృత్యాలకు కచ్చితంగా ప్రజా కోర్టులో తగిన గుణపాఠం చెప్పే రోజు త్వరలోనే ఉంది’’ అని వరుదు కళ్యాణి హెచ్చరించారు.

YSRCP ZP Chairperson Harika Condemns Attack On Her2
‘భయంతో కారులోంచి బయటకు రాలేదు’

గుడివాడ: తనను టార్గెట్‌ చేసే టీడీపీ, జనసేన గూండాలు దాడికి పాల్పడ్డారని కృష్ణా జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక కన్నీటి పర్యంతమయ్యారు. ఈరోజు(శనివారం, జూలై 12) వైఎస్సార్‌సీపీ కార్యక్రమానికి ఉప్పాల హారిక వెళుతున్న సమయంలో ఆమె కారును పచ్చమూకలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలోనే ఆమె కారుపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. ఈ అరాచక ఘటనపై ఉప్పాల హారిక మాట్లాడుతూ.. గుడివాడ ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందన్నారు. కారులో ఉన్న తమను చంపడానికి యత్నించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడితో భయపడిపోయి తన భర్త, తాను కారులోంచి బయటకు రాలేదన్నారు. తనను అసభ్య పదజాలంతో దూషించారని, తన కారు అద్దాలను ధ్వంసం చేశారన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆమె తెలిపారు. టీడీపీ గూండాలు తన కారుపై దాడి చేస్తున్నా పోటీసులు పట్టించుకోకుండా వారికి సహకరించినట్లు వ్యవహరించారన్నారు. కారును చుట్టుముట్టి..కృష్ణా జిల్లాలోని గుడివాడలో పచ్చమూకలు రెచ్చిపోయాయి. కృష్ణా జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక కారుపై టీడీపీ, జనసేన గూండాలు దాడికి పాల్పడ్డారు. ఆమె కారులో వెళుతుండగా టీడీపీ, జనసేన గూండాలు బరితెగించి మరీ దాడికి దిగారు. ఆమె కారును చుట్టుముట్టి విచక్షణారహితంగా దాడికి దిగారు. వైఎస్సార్‌సీపీ సమావేశానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.మహిళ అని చూడకుండా దాడికి పాల్పడ్డాయి పచ్చమూకలు. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారు. వాళ్లు దాడి చేసుకుంటారు.. మనకెందుకులె అన్న చందంగా వ్యవహరించారు. వైఎస్సార్‌సీపీ సమావేశానికి వెళుతున్న దారిలోనే ప్రభుత్వ సమావేశం జరుగుతుంది. దాంతో ఆమెను వైఎస్సార్‌సీపీ సమావేశానికి వెళ్లకుండా చేసేందుకు కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. గంటకు పైగా ఆమె కారును కదలనీయకుండా నానా బీభత్సం సృష్టించారు. దీనిపై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఒక మహిళా జడ్పీ చైర్‌పర్సన్‌ పార్టీ కార్యక్రమానికి వెళుతుండగా ఈ రకంగా దాడికి పాల్పడటం ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందనడానికి నిదర్శమని వైఎస్సార్‌సీపీ మండిపడుతోంది.

Swiatek wins title after crushing 6-0, 6-0 defeat of Anisimova3
Wimbledon 2025: వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేత స్వియాటెక్

ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో స‌రికొత్త ఛాంపియ‌న్ అవ‌త‌రించింది. వింబుల్డ‌న్-2025 టోర్నీ మ‌హిళ‌ల సింగిల్స్ విజేత‌గా పొలాండ్‌కు చెందిన ఇగా స్వియాటెక్ (Iga Swiatek) నిలిచింది. శ‌నివారం జ‌రిగిన ఫైన‌ల్లో అమెరికాకు చెందిన అమందా అనిస్మోవాకను 6-0, 6-0 తేడాతో చిత్తుగా ఓడించిన స్వియాటెక్.. తొలి వింబుల్డ‌న్ టైటిల్‌ను సొంతంచేసుకుంది. రెండు సెట్ల‌లోనూ పొలాండ్ భామ జోరు ముందు అమందా నిల‌వ‌లేక‌పోయింది. క‌నీస పోటీ కూడా ఇవ్వ‌లేక‌పోయింది.

Kutami Prabhutvam Police Troubles Vallabhaneni Vamsi Again4
వల్లభనేని వంశీకి ఆగని వేధింపులు

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్‌సీపీ నేత వల్లభనేని వంశీకి వేధింపులు ఆగడం లేదు. జైలు నుంచి బయటకు వచ్చాక కూడా పోలీసులను పెట్టుకుని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తోంది. తాజాగా.. ఓ కేసులో పీఎస్‌ విచారణకు హాజరైన ఆయన్ని ఉద్దేశపూర్వకంగానే ఇబ్బంది పెట్టడంపై వైఎస్సార్‌సీపీ మండిపడుతోంది. సాక్షి, కృష్ణా జిల్లా: రాజకీయ కక్షలో భాగంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులపైకి పోలీసులను కూటమి ప్రభుత్వం ప్రయోగిస్తుండడంపై ఆర్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే.. వల్లభనేని వంశీని ఇవాళ పోలీసులు బాగా ఇబ్బంది పెట్టారు. పలు కేసుల్లో ఈ మధ్యే బెయిల్‌ మీద బయటకు వచ్చిన.. కోర్టు ఆదేశాలు మేరకు క్రైమ్ నంబర్ 142/25 మైనింగ్ కేసులో వంశీ విచారణ కోసం గన్నవరం పీఎస్‌కు వెళ్లారు. మధ్యాహ్నాం 12గం. సమయంలో ఆయన స్టేషన్‌కు వెళ్లి విచారణ కోసం సంతకాలు చేశారు. అయితే అప్పటికి విచారణ అధికారి రాలేదు. గత నాలుగు రోజులుగా వంశీ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని.. కాస్త త్వరగా విచారించి వంశీని పంపించాలని ఆయన అనుచరులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు.అయితే అధికారి రానిది తామేమీ చేయలేమని కిందిస్థాయి సిబ్బంది చెప్పారు. అలా.. మూడు గంటలు గడిచింది. అనారోగ్యంతో ఇబ్బంది పడుతూనే ఆయన పీఎస్‌లో బెంచీపై అలా కూర్చుని ఉండిపోయారు. చివరకు అధికారి ఇవాళ రాడని.. మళ్లీ విచారణ ఎప్పుడనేది లేఖ ద్వారా తెలియజేస్తామని చెప్పారు. ఈ పరిణామంతో ఆయన అనుచరులు ఒకింత అసహనానికి గురయ్యారు. పోలీసులను అడ్డుపెట్టుకుని వంశీని ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు. ఆ సమయంలో వంశీ వారిని సముదాయించారు. అక్కడి నుంచి నేరుగా విజయవాడ ఆస్పత్రికి వెళ్లారాయన. ఇదీ చదవండి: ఇంత అణచివేతనా? ఇది పోలీసుల రాజ్యమా? లేక..

Janasena Leader Vinutha Kotaa Driver Srinivasulu Case Details5
వినూతతో సన్నిహితంగా ఉంటున్నాడనే రాయుడి హత్య?

సాక్షి, తిరుపతి: శ్రీకాళహస్తి యువకుడు శ్రీనివాసులు అలియాస్‌ రాయుడి హత్య కేసులో సంచలన విషయం వెలుగు చూసింది. వినూతతో సన్నిహితంగా ఉండడమే రాయుడు హత్యకు ప్రధాన కారణం అయి ఉంటుందని చెన్నై పోలీసులు ప్రాథమిక అంచనాకి వచ్చారు. తన దగ్గర పని చేసిన శ్రీనివాసులు అలియాస్‌ రాయుడిని హత్య చేసిన కేసులో జనసేన పార్టీ ఇంచార్జి(తాజా మాజీ) వినూత కోటా (Vinutha Kotaa) శనివారం అరెస్ట్‌ అయ్యారు. ఈ కేసులో ముగ్గురు నిందితులు ఇచ్చిన సమాచారంతో వేకువజామున 3గం. టైంలో వినూత, ఆమె భర్త చంద్రబాబు (Chandrababu Kotaa)ను చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటిదాకా సాధించిన పురోగతి వివరాలను చెన్నై కమిషనర్‌ ఏ అరుణ్‌ మీడియాకు వెల్లడించారు. శ్రీనివాసులు(రాయుడు)ని ఆంధ్రాలో హత్య చేసి.. చెన్నైకి తీసుకొచ్చి పడేశారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారానే నిందితులను గుర్తించాం. హత్యకు ఉపయోగించిన కారు నెంబర్‌ ట్రేస్‌ చేసి నిందితులను అరెస్ట్‌ చేశాం. ప్రస్తుతం ఐదుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. విచారణ కొనసాగుతోంది అని అన్నారాయన. కోటా వినూతతో శ్రీనివాసులు సన్నిహితంగా మెలగడమే హత్యకు కారణమని భావిస్తున్నట్లు చెప్పారాయన.ఏం జరిగిందంటే.. చెన్నై మింట్ పీఎస్ పరిధిలో ఈ నెల 8వ తేదీన కూవం నదిలో ఓ గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో.. పోస్టుమార్టంలో చిత్రహింసలకు గురి చేసి హత్య చేసినట్లుగా తేలింది. చేతి మీద జనసేన సింబల్‌తో పాటు వినూత అనే పేరు ఉండడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా.. ముగ్గురు నిందితులు దస్త సాహెబ్(షేక్‌తసన్‌), శివకుమార్, గోపిలను అరెస్ట్‌ చేశారు. వాళ్లు ఇచ్చిన సమాచారంతో శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జి వినూత కోటా, ఆమె భర్త చంద్రబాబులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆపై మృతదేహం ఆమె మాజీ డ్రైవర్‌ శ్రీనివాసుల(రాయుడు)దిగా నిర్ధారించారు. చిత్రహింసలకు గురి చేసి..బొక్కసంపాలెం గ్రామానికి చెందిన యువకుడు సీహెచ్‌ శ్రీనివాసులు(రాయుడు) గత 15 ఏళ్లుగా వినూత కోటా దగ్గర నమ్మిన బంటుగా ఉన్నాడు. డ్రైవర్‌గా, ఆమెకు వ్యక్తిగత సహాయకుడిగానూ పని చేశాడు. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ.. జూన్‌ 21వ తేదీన ఆమె ఓ బహిరంగ ప్రకటన చేశారు. అతను చేసిన ద్రోహానికి విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఇటు పేపర్‌లో.. అటు సోషల్‌ మీడియాలో ఆమె పోస్టు చేశారు. ఇక మీదట శ్రీనివాసులుకి, తమకు ఎలాంటి సంబంధం లేదని అందులో పేర్కొన్నారు. అయితే.. ప్రత్యర్ధుల దగ్గర డబ్బు తీసుకుని తమ సమాచారం వాళ్లకు చేరవేస్తున్నారనే అనుమానంతో రాయుడిని ఆమె విధుల నుంచి తొలగించామని తొలుత ఆ దంపతులు పోలీసులకు చెప్పారు. అయితే లోతైన విచారణలో.. డ్రైవర్‌తో తన భార్య సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం భరించలేక చంద్రబాబు ఈ హత్య చేయించినట్లు తేలింది. ఈ క్రమంలో.. ఆ భార్యభర్తలు ప్లాన్‌ చేసి మరో ముగ్గురి సహాయంతో కాళహస్తిలోని ఓ గోడౌన్‌లో రాయుడిని టార్చర్‌ చేసి చంపారు. ఆపై రాయుడి మృతదేహాన్ని చెన్నైలో తమ వాహనంలో ఆ భార్యభర్తలు మృతదేహాన్ని మోసుకెళ్లి పడేశారు. ఇదిలా ఉంటే..శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ తరఫున ఆమె చేసిన హడావిడి అంతాఇంతా కాదు. హత్య కేసు తెర మీదకు రావడంతో వినూత కోటాను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు జనసేన ప్రకటించింది.చ‌ద‌వండి: ప‌వ‌న్ @ పెద్ద‌మ్మ భాషా పితామ‌హ..

YS Jagan Slams CM Chandrababu Over Crushed Of Democratic Process6
పోలీసు రాజ్యమా?.. బాబు నియంతృత్వ రాజ్యమా?

ప్రశ్నించే గొంతుకలను ప్రభుత్వ యంత్రాంగంతో అణిచివేస్తున్న చంద్రబాబు సర్కార్‌పై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారుసాక్షి, గుంటూరు: ప్రశ్నించే గొంతుకలను ప్రభుత్వ యంత్రాంగంతో అణిచివేస్తున్న చంద్రబాబు సర్కార్‌పై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు ఎక్స్‌ ఖాతాలో శనివారం ఆయన సుదీర్ఘమైన ఓ పోస్ట్‌ ఉంచారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నించే హక్కుతో పాటు, నిరసన వ్యక్తం చేయడం అనేవి ఒక పునాది వంటివి. ప్రజలు తమ సమస్యలు ప్రస్తావించి, వాటి పరిష్కారం కోరడం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ, దురదృష్టశాత్తూ మన ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన ప్రాథమిక హక్కులను, చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తోంది. పోలీసు యంత్రాంగాన్ని, వారి అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ప్రశ్నించే గొంతుకలను నిర్దాక్షిణ్యంగా నొక్కేస్తున్నారు. అది ఏ స్థాయికి చేరిందంటే, అసలు మనం అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక నియంతృత్వంలోనా? అనే సందేహం కలుగుతోంది’.‘ప్రజలు తమ సమస్యలు లేవనెత్తినా, వారికి మద్దతుగా విపక్షం గళం విప్పినా ప్రభుత్వం సహించడం లేదు. దారుణంగా వేధిస్తున్నారు. లేని కేసులు సృష్టిస్తూ వారి గళాన్ని నొక్కడంతో పాటు, అసలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారే ఉండకూడదన్న విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రక్రియలో రాష్ట్రంలో ఏ ఒక్కరిని కూడా ఈ ప్రభుత్వం విడిచిపెట్టడం లేదు. అలా ప్రజాస్వామ్య స్ఫూర్తి, పౌర హక్కులకు తీవ్ర భంగం కలిగిస్తున్నారు’.‘దీని వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం ఒక్కటే. ఒక పద్దతి ప్రకారం ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలిగించడంతో పాటు, ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలి. అలాగే ప్రశ్నించే ఏ గొంతుకా ఉండొద్దు’. అదే ఈ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.ఆ దిశలో ఈ ప్రభుత్వం చేసిన, చేస్తున్న చర్యలు. పద్దతి ప్రకారం ప్రజాస్వామ్యాన్నే అణిచి వేసేలా వ్యవహరిస్తున్న తీరు.. వివరాలు చూస్తే..👉 ఫిబ్రవరి 19, 2025. గుంటూరు మిర్చియార్డు.దారుణంగా ధరలు పతనం కావడంతో, మిర్చి రైతులు పడుతున్న కష్టాలు తెలుసుకుని, వారిని పరామర్శించేందుకు గుంటూరు మిర్చియార్డును సందర్శించాను. మిర్చి ధరలు రూ.27 వేల నుంచి ఏకంగా రూ.8 వేలకు పడిపోయాయి. ఆ పరిస్థితుల్లో నేను గుంటూరు మిర్చియార్డు సందర్శించి, ఆ రైతులను పరామర్శిస్తే కేసు నమోదు చేశారు.👉ఏప్రిల్‌ 8, 2025. శ్రీ సత్యసాయి జిల్లా. రామగిరి.‘టీడీపీ మూకల చేతిలో దారుణహత్యకు గురైన మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరిలో పర్యటించాను. దానిపైనా కేసు నమోదు చేశారు. వైయస్సార్‌సీపీ రాప్తాడు నియోజకవర్గం కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపైనా కేసు పెట్టారు.👉జూన్‌ 11. 2025. ప్రకాశం జిల్లా పొదిలి.‘ఏ మాత్రం గిట్టుబాటు ధర లేక నానా ఇక్కట్లు పడుతున్న పొగాకు రైతులను పరామర్శకు వెళ్తే ఏకంగా మూడు కేసులు నమోదు చేశారు. పొగాకు బోర్డు సూచన మేరకు రైతులు 20 శాతం పొగాకు ఎక్కువ సాగు చేశారు. కానీ, ధరలు మాత్రం దారుణంగా పతనమయ్యాయి. ఈ పరిస్థితుల్లో నేను పొగాకు రైతుల పరామర్శకు వెళ్తే 3 కేసులు పెట్టారు. 15 మంది రైతులను జైళ్లకు పంపడంతో పాటు, నలుగురిని అరెస్టు చేశారు. చివరకు న్యాయస్థానం కూడా ఈ చర్యను తప్పు బట్టింది.👉జూన్‌ 18, 2025. పల్నాడు జిల్లా సత్తెనపల్లి.‘గత ఏడాది ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పోలీసుల దారుణ వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకున్న మా పార్టీ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు రెంటపాళ్ల వెళ్తే, అక్కడా కేసులు నమోదు చేశారు. 5 కేసులు నమోదు చేయడంతో పాటు, ఏకంగా 131 మందికి నోటీసులు జారీ చేశారు. ఇంకా సినిమా పోస్టర్లు ప్రదర్శించిన ఇద్దరిని అరెస్టు చేశారు.👉జూలై 9, 2025. బంగారుపాళ్యం. చిత్తూరు జిల్లా.‘ఏ మాత్రం కొనుగోళ్లు లేక తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన తోతాపురి మామిడి రైతులను పరామర్శించేందుకు చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యంలోని మార్కెట్‌యార్డును సందర్శిస్తే.. అక్కడా ఏకంగా 5 కేసులు నమోదు చేశారు. 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజులు గడిచినా, వారి అరెస్టు చూపలేదు. కోర్టులో ప్రవేశపెట్టలేదు. వారంతా ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నారు.‘ప్రతి కేసుకు సంబంధించి ఒక ముగ్గురు, నలుగురి పేర్లు పెట్టి.. ఇంకా ఇతరులు అని రాస్తున్నారు. ఆ విధంగా తాము టార్గెట్‌ పెట్టుకున్న వారిని ఆ తర్వాత ఆ కేసులో జోడిస్తున్నారు. నా ప్రతి పర్యటనలో కూడా ప్రజలెవ్వరూ రాకుండా, తీవ్ర నిర్భంధం విధిస్తున్నారు. వైయస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు నోటీసులు జారీ చేయడమే కాకుండా, వారిని ముందస్తుగా హౌజ్‌ అరెస్ట్‌ చేస్తున్నారు. చివరకు రైతులను కూడా ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. వారు రాకుండా నియంత్రించే కుట్ర చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ చెక్‌పోస్టులు పెట్టి, అడ్డుకుంటున్నారు’.రాష్ట్రంలో ఉన్నది ఒకే ఒక విపక్షం. ప్రజా సమస్యలపై పోరాడేది కూడా విపక్షమే. కానీ మా పార్టీని కూడా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ.. అణిచివేసే ప్రయత్నాన్ని సీఎం చంద్రబాబుగారు నిరంతరం కొనసాగిస్తున్నారు. లేని కేసులు బనాయించడం, అరెస్టులు చేయడం, ఆ విధంగా దారుణంగా వేధించడం పరిపాటిగా మారింది. ఆ విధంగా ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం కలిగించడమే కాకుండా, వాయిస్‌లెస్‌ పీపుల్‌ వాయిస్‌ను నొక్కేస్తున్నారు’. విధంగా అడ్డగోలు హామీలిచ్చి, ఏవీ అమలు చేయకుండా ఉన్న తమను ఎవరూ ప్రశ్నించకూడదు. వాటిపై ఎవరూ మాట్లాడకూడదు అనే విధంగా ఈ ప్రభుత్వం అత్యంత దారుణంగా వ్యవహరిస్తోంది’.CM @ncbn suppressing dissent with state machineryThe right to question, protest, and assemble forms the bedrock of democracy, empowering citizens to freely express their grievances and demand accountability. In Andhra Pradesh, however, this fundamental democratic process is…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 12, 2025

Russian Woman Found Living In Cave With 2 Daughters In Karnataka7
గుహలో తన ఇద్దరు పిల్లలతో రష్యన్‌ మహిళ నివాసం.. ఆ తర్వాత ట్విస్ట్‌ ఏంటంటే?

గత రెండు వారాలుగా ఓ రష్యన్ మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ప్రమాదకరమైన గుహలో నివసిస్తున్న ఘటన కర్ణాటకలో సంచలనం రేపింది. ఉత్తర కన్నడ జిల్లా కుమ్టా తాలూకాలోని రామతీర్థ కొండల్లోని మారుమూల గుహ నుంచి నినా కుటినా అలియాస్ మోహి (40), ఆమె ఇద్దరు పిల్లలను పోలీసులు రక్షించారు. ఈ నెల 9న సాయంత్రం 5 గంటల సమయంలో గోకర్ణ పోలీసులు పర్యాటకుల భద్రత కోసం గోకర్ణ అడవి ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తుండగా.. గుహ వద్ద వారి కదలికలు కనిపించాయి. ఆ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి గుహలో నివసిస్తున్నట్లు కనుగొన్న పోలీసులు.. వారిని కాపాడారు.కొన్నేళ్ల క్రితం బిజినెస్ వీసాపై భారత్‌కు వచ్చిన మోహి.. గోవా నుంచి ఆధ్యాత్మిక తీర ప్రాంతమైన గోకర్ణకు చేరుకుంది. ఆమె వీసా గడువు కూడా ముగిసింది. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ఆకర్షితురాలైన ఆమె తన ఇద్దరు పిల్లలు ప్రయా (6), అమా (4)లతో కలిసి రెండు వారాల క్రితం గోకర్ణలోని దట్టమైన అటవీప్రాంతంలోకి వెళ్లింది. అక్కడ ఒక గుహలో తన ఇద్దరు పిల్లలతో కలిసి నివసించడం ప్రారంభించింది.ఆ గుహను ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చేసిన ఆ మహిళ.. రుద్ర విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో పాటు పూజలు నిర్వహించేంది. నిత్యం ధ్యానం చేస్తూ రోజులు గడిపింది. అయితే ఆ మహిళ, ఆమె పిల్లలు అడవిలో ఉన్న సమయంలో ఆహారాన్ని ఎలా సంపాదించారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2024 జూలైలో గుహ ఉన్న రామతీర్థ కొండ ప్రాంతం నుంచి పెద్ద పెద్ద కొండచరియలు విరిగిపపడ్డాయి. విష పూరిత పాములు సహా ప్రమాదకరమైన వన్య ప్రాణులకు నిలయమైన ఆ ప్రాంతం. చాలా ప్రమాదకరమైన ప్రదేశంగా పోలీసులు తెలిపారు. ఆ రష్యన్‌ మహిళకు కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసుల బృందం.. కొండ కిందకు తీసుకెళ్లింది. ఆమె అభ్యర్థన మేరకు కుంటా తాలూకాలోని బంకికోడ్ల గ్రామంలో 80 ఏళ్ల మహిళా సన్యాసిని యోగరత్న సరస్వతి నిర్వహిస్తున్న ఆశ్రమానికి తరలించారు. మోహి వీసా గడువు 2017లోనే ముగిసిందని అధికారులు తెలిపారు. ఆమె భారత్‌లో ఎంత కాలం నుంచి ఉంటుందో తెలుసుకునే పనిలో అధికారులు పడ్డారు. స్థానిక స్వచ్ఛంద సంస్థ సాయంతో రష్యా రాయబార కార్యాలయాన్ని అధికారులు సంప్రదించారు.

If Rs 25 Crore Is Enough To Retire In India asks Indian Origin Couple8
యూఎస్‌కు బైబై : ఇండియాలో రూ.25 కోట్లతో బతికేయొచ్చా? చెప్పండి ప్లీజ్‌!

కూటి కోసం కోటి తిప్పలు..ఇది సగటు మనిషి ఆలోచన. మెరుగైన జీవితం కోసం డాలర్‌ డ్రీమ్స్‌ ఎందరివో. విదేశాలకు వెళ్లాలి. డాలర్లలో సంపాదించాలి అనేది లెక్కలేనంతమంది భారతీయు యువతీ యువకుల ఆశ, ఆశయం. కానీ డాలర్‌ డ్రీమ్స్‌ ఇపుడు మసక బారుతున్నాయి. ముఖ్యంగా ఎక్కువమంది భారతీయ టెకీలు నివసించే అమెరికాలోరోజు రోజుకీ మారుతున్న పరిణామాలు భారతదేశానికి తిరిగి పయనమయ్యేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెడ్డిట్‌లో అమెరికాలో ఉంటున్న ఒక యువజంట పోస్ట్‌ వైరల్‌గా మారింది. ఈ జంట గత 15 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తోంది. వీరి ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) హోదాను కలిగి ఉన్నారు, ఇది వారికి ఏ దేశంలోనైనా నివసించడానికి, పని చేయడానికి వెసులుబాటునిస్తుంది. కుమారుడికి కూడా అమెరికా పౌరసత్వం ఉంది. ముగ్గురు సభ్యుల ఫ్యామిలీ ఇండియాకు తిరిగి రావాలని ప్లాన్‌ చేస్తోంది. ‘‘మేం ఇద్దం 30ల్లో ఉన్నాం. టెక్నాలజీ, ఇక్కడ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో భారతదేశానికి తిరిగి వెళ్లాలని భావిస్తున్నాం. ఒక ముగ్గురు సభ్యులున్న కుటుంబం ఇండియాలో బతకాలంటే రూ. 25 కోట్లు సరిపోతాయా... రిటైర్‌ మెంట్‌ తరువాత పిల్లలను పెంచుకుంటూ, హ్యాపీగా జీవించాలి అసలు ఎంత కావాలి దయచేసి తెలపండి’’ అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. ఇండియాకు వెళ్లాక కొంతకాలం విరామం తీసుకోవచ్చు. ఆ తరువాత ఇంట్రస్ట్‌ను బట్టి ఉద్యోగాలు వెదుక్కుంటాం. కానీ అది మా జీవితాలను ప్రభావితం చేయకూడదని పేర్కొన్నారు. దాదాపు 5.5 మిలియన్ల డార్లు (సుమారు రూ. 47.21 కోట్లు) ఉన్నాయంటూ తమ ఆస్తులకు సంబంధించిన వివరాలను కూడా అందించారు.రెడ్డిటర్లు ఈ పోస్ట్‌పై స్పందించారు. అది మీరుండే నగరం, ఇల్లు,అలవాట్లు, జీవన శైలిసహా అనేక అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని కొందరు సాధారణంగా భారతీయ నగరంలో జీవించడానికి రూ. 25 కోట్లు సరిపోతాయని మరి కొందరు చెప్పగా, టైర్ 2 స్మార్ట్/బాగా అభివృద్ధి చెందిన నగరంలో నివసిస్తుంటే ప్రామాణిక ఖర్చులు అద్దె, ఆహారం, కొన్ని అవసరమైన వస్తువులు సహా 75 వేల రూపాయలు సరిపోతాయి. సొంత ఇల్లు ఇంకా మంచిది. పిల్లవాడికి ఒక మాదిరి స్కూలు ఫీజు నెలకు 30-50 వేలు చాలు. నికరంగా ఒక స్టాండర్డ్‌ లైఫ్‌కి నెలకు 2 లక్షలు బేషుగ్గా సరిపోతాయి రెండు మూడేళ్ల తరువాత ఏదో ఒక ఉద్యోగం వెతుక్కుంటే చాలు అని ఒకరు వివరించారు. (Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!)ముగ్గురే కాబట్టి ఇక్కడ సౌకర్యవంతంగా బతకాలంటే జీవనశైలి బట్టి నెలకు కనీసంగా రూ. 4 లక్షలు, గరిష్టంగా రూ. 8 కోట్లు సరిపోతాయని లెక్కలు చెప్పారు. మరో యూజర్‌ ఏమన్నారంటే.. "నేను ఇటీవల భారతదేశంలో (ముఖ్యంగా బెంగళూరులో) కొంత సమయం గడిపాను. US కి దగ్గరగా జీవించాలనుకుంటే ఇండియాచాలా ఖరీదైనది. US సబర్బన్ లాంటి, బెంగళూరులోని ఆదర్శ్, బ్రిగేడ్ లేదా ప్రెస్టీజ్ వంటి కొన్ని ప్రీమియర్ గేటెడ్ కమ్యూనిటీలు 2000 చదరపు అడుగులు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో రూ. 5 కోట్లు కంటే ఎక్కువ ఖర్చు అవుతాయి కానీ మీరు ఇంతకంటే చవగ్గా కూడా బతకొచ్చు. కాబట్టి మూడు మిలియన్‌ డాలర్లు సరిపోతాయా లేదా అనేది మీమీదే ఆధారపడి ఉంటుదని మరొకరు వ్యాఖ్యానించారు.అంతేకాదు “ఇండియాలో ట్రాఫిక్, దుమ్ము, కాలుష్యం, అవినీతి, శాంతిభద్రతల సమస్యలు, వేడి, నీటి కొరత లాంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.” అని మరో రెడ్డిటర్ వ్యాఖ్యానించాడు.ఇదీ చదవండి: Lishalliny Kanaran : భారతీయ పూజారిపై మిస్‌ గ్రాండ్‌ మలేషియా సంచలన ఆరోపణలు!

Praveena Paruchuri Interesting Comments at Kothapallilo Okappudu Movie Trailer Launch9
హీరోను తిట్టా, కొట్టా.. సారీ మాత్రం చెప్పను: దర్శకురాలు

ప్రవీణ పరుచూరి (Praveena Paruchuri).. అమెరికాలో సెటిలైన ఈ తెలుగమ్మాయి అక్కడ కార్డియాలజిస్ట్‌గా పని చేసింది. కానీ సినిమాలపై పిచ్చితో తన వృత్తిని వదిలేసి స్వదేశానికి తిరిగొచ్చింది. టాలీవుడ్‌లో అడుగుపెట్టి కేరాఫ్‌ కంచరపాలెం సినిమాతో నిర్మాతగా హిట్టు కొట్టింది. సినిమాను నిర్మించడంతోపాటు అందులో సలీమా అనే వేశ్య పాత్రలోనూ నటించింది. ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య అనే సినిమాకు సైతం ప్రొడ్యూసర్‌గా వ్యవహరించింది.డైరెక్షన్‌ కష్టంతాజాగా ప్రవీణ దర్శకురాలిగా మారింది. కొత్తపల్లిలో ఒకప్పుడు అనే సినిమా చేస్తోంది. ఈ చిత్రం జూలై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ప్రవీణ.. నటీనటులతో మంచి పర్ఫామెన్స్‌ రాబట్టేందుకు వారిపై చేయి చేసుకున్నానని వెల్లడించింది. ప్రవీణ పరుచూరి మాట్లాడుతూ.. డైరెక్షన్‌ చాలా కష్టమైనది. డైరెక్షన్‌ చేసేటప్పుడు చాలా డౌట్స్‌ వస్తాయి. ఈ పర్ఫామెన్స్‌ ఓకేనా? ఈ బీజీఎం వర్కవుట్‌ అవుతుందా? ఈ ఎడిట్‌ ఓకేనా? ఇలా ఎన్నో ప్రశ్నలు వెంటాడాయి. షూటింగ్‌ మాత్రం 33 రోజుల్లో త్వరగా అయిపోయింది.హీరోను కొట్టా, తిట్టా..హీరో మనోజ్‌ చంద్ర సిటీ అబ్బాయి. ఇతడిని పల్లెటూరి కుర్రాడిలా తయారుచేయడమే అసలైన కష్టం. అలాగే కొత్త హీరోయిన్‌ను పరిచయం చేస్తున్నాం. వీరిద్దరి మధ్య సీన్లు పండకపోతే సినిమా పండదు. కాబట్టి ఈ ఇద్దరిపైనే ఎక్కువ దృష్టి పెట్టాను. నిజం చెప్పాలంటే వీళ్లను తిట్టాను, కొట్టాను, రాళ్లు విసిరాను. ఎందుకంటే నా దృష్టిలో నటించడం అంటే జీవించడం. అందుకే నేను చేసిన పనికి వీళ్లకు సారీ చెప్పను. నేను డాక్టర్‌ను కాబట్టి ఏదైనా అయితే బాగానే చూసుకున్నాను అని ప్రవీణ చెప్పుకొచ్చింది.చదవండి: రేణు దేశాయ్‌కు సర్జరీ.. అసలేమైంది?

how EV battery recycling process will become emerging business10
భవిష్యత్తులో కొదవలేని బిజినెస్‌ ఇదే..

భారతదేశం కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీని పెంచుతోంది. ఈవీలో ప్రధానపాత్ర పోషించేది బ్యాటరీలే. వీటిలో లిథియం బ్యాటరీలను ఎక్కువగా వాడుతున్నారు. భవిష్యత్తులో వీటి సామర్థ్యం తగ్గాక తిరిగి రీసైక్లింగ్ చేసే వ్యవస్థను రూపొందించాలి. ప్రస్తుత రీసైక్లింగ్ మౌలిక సదుపాయాలు భవిష్యత్ డిమాండ్‌లను తీర్చలేవని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా స్థిరమైన వ్యవస్థను ఏర్పరచాలని సూచిస్తున్నారు. ఈమేరకు ప్రభుత్వం మరిన్ని స్టార్టప్‌లను ప్రోత్సహించాలని చెబుతున్నారు.కార్లలో ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీలు సగటున 7-8 సంవత్సరాలు పనిచేస్తాయి. కస్టమర్ల వినియోగాన్ని బట్టి ఒక దశాబ్దం వరకు మన్నిక రావొచ్చు. అన్ని రకాల లిథియం అయాన్ బ్యాటరీల్లో లిథియం ఫెర్రో ఫాస్ఫేట్, నికెల్ మాంగనీస్ కోబాల్ట్ ఆక్సైడ్ (ఎన్‌ఎంసీ), లిథియం నికెల్ కోబాల్ట్ అల్యూమినియం ఆక్సైడ్(ఎన్‌సీఏ)లను విరివిగా వాడుతారు. భారత్‌లో ఈవీలు వేగంగా విస్తరిస్తున్నాయి. దాంతో ఈ దాతువుల వినియోగం సైతం పెరుగుతోంది.ప్రధాన సమస్యలివే..ఈ బ్యాటరీల తయారీలో రెండు ప్రధాన సమస్యలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకటి.. బ్యాటరీల్లో వాడే రసాయన దాతువులను సంగ్రహించడం. రెండు.. ఈ బ్యాటరీలను వాడిన తర్వాత ఆయా దాతువులను భూమిలో వేస్తే కలిగే ప్రమాదాలను నివారించడం. ఈ సమస్యలకు ‘రిసైక్లింగ్‌’ పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం రీసైక్లింగ్ పద్ధతుల్లో హైడ్రోమెటలర్జీ, పైరోమెటలర్జీ, డైరెక్ట్ రీసైక్లింగ్, ఇంటిగ్రేటెడ్ కార్బోథర్మల్ రిడక్షన్ వంటి మెకానికల్ ప్రక్రియలు అనుసరిస్తున్నారు. ఈ పద్ధతుల్లో బ్యాటరీలను కంప్రెస్‌ చేయడం, ముక్కలు చేయడం, ప్రత్యేక ద్రావకాలు లేదా వేడితో కరిగించి విలువైన పదార్థాలను వెలికితీస్తారు. ఈ ప్రక్రియనంతటిని ‘బ్లాక్ మాస్’ అని పిలుస్తారు. భారత్‌లో పైరోమెటలర్జీ(అధిక ఉష్ణోగ్రతల వద్ద బ్యాటరీలను కరిగించడం)తో పోలిస్తే తక్కువ ఉద్గారాలతో కూడిన హైడ్రోమెటలర్జికల్(ప్రత్యేక ద్రావణాలతో కరిగించడం) ప్రక్రియను ఎక్కువగా వాడుతున్నారు. ఇందులో దాదాపు 95 శాతం యానోడ్‌, కేథోడ్‌లను సంగ్రహిస్తున్నారు. దేశీయంగా 80% హైడ్రోమెటలర్జీ ప్రక్రియనే వాడుతున్నారు.స్టార్టప్‌లు అందిపుచ్చుకోవాల్సిందే..అభివృద్ధి చెందుతున్న ఈవీ రంగంలో రి మరిన్ని స్టార్టప్‌లకు అవకాశం ఉంది. ఈవీ తయారీ వైపే కాకుండా బ్యాటరీ రీసైక్లింగ్‌ విభాగంలోనూ కంపెనీలు పుట్టుకొచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో రాబోయే ఈ ట్రెండ్‌ను స్టార్టప్‌లు అందిపుచ్చుకోవాలని చెబుతున్నారు. ఈవీ రంగంలో పెట్టుబడి పెట్టే వెంచర్‌ కాపిటలిస్ట్‌లు ఈ విభాగాన్ని కూడా గమనించాలని సూచిస్తున్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement