విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా పాడేరు మండలం గుత్తులపుట్టులో పేకాట స్థావరాలపై పోలీసులు శుక్రవారం దాడి చేశారు. 11 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 20 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.