అనంతపురంలో అత్యధికంగా 59 కరువు మండలాలు
సాక్షి, హైదరాబాద్: వర్షాభావ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని 2013 ఖరీఫ్ సీజన్‌లో 119 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. 7 జిల్లాల్లో కరువు మండలాలను గుర్తించారు. జిల్లా కలెక్టర్ల నుంచి అందిన ప్రతిపాదనలను రాష్ట్రస్థాయి కమిటీ పరిశీలించాక 119 మండలాల్ని కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని సర్కారుకు సిఫార్సు చేసింది. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 59 మండలాలు కరువు బారిన పడ్డాయి. చిత్తూరులో 33, వైఎస్సార్ జిల్లాలో 16, విజయనగరంలో 5, మహబూబ్‌నగర్‌లో 3, మెదక్‌లో 2, నల్లగొండ జిల్లాలో ఒక మండలం కరువు జాబితాలో ఉన్నాయి.
ఏడు జిల్లాల్లో 119 కరువు మండలాలు
Published Sat, Jan 4 2014 2:10 AM | Last Updated on Sat, Sep 2 2017 2:15 AM
Advertisement