విజయనగరం : విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం తారాపురం వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు...రామభద్రాపురం మండలం కొత్తెక్కి గ్రామానికి చెందిన కొందరు ప్రయాణికులు సాలూరు గ్రామంలో వివాహానికి హాజరై ఆటోలో వస్తుండుగా తారాపురం వద్ద టాటా ఏసీ వాహనం ఢీకొట్టింది.
దీంతో తీవ్ర గాయలైన ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వారితో పాటు టాటా ఏసీ వాహనం డ్రైవర్‌తో ,ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారు కొత్తెక్కి గ్రామానికి చెందిన తల్లి, కూతురు గా గుర్తించారు. స్తానికుల స్పందించి క్షతగాత్రులను బాడింగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
(రామభద్రాపురం)