ఏలూరు: రైలు పట్టాలపై సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్న ఇద్దరు యువకులు రైలు ఢీకొని ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పట్టణం రామకృష్ణాపురం ప్రాంతంలోని రెడ్డి కశాశాల వద్ద గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. ఆవాల మావూళ్లమ్మ కుమార్(18), మోహన్(18) అనే ఇద్దరు సైకిల్ పై రైలు పట్టాల మీదుగా వెళ్తున్నారు. అదే సమయంలో విజయవాడ వైపు వెళ్తున్న ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ వారిని ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు.