చంద్రగిరి : లారీ, ఓ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో 20 మంది గాయపడ్డారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాద వద్ద శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. తిరుపతి వైపు వెళ్తోన్న లారీ డ్రైవర్ వర్మ తప్పిదం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. నిద్రమత్తులో లారీ నడిపిన కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనలో లారీ డ్రైవర్ వర్మతో సహా క్లీనర్ మృతిచెందాడు. బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.
ఆర్టీసీ బస్సు - లారీ ఢీ..ఇద్దరు మృతి
Published Fri, May 15 2015 6:49 AM | Last Updated on Sun, Sep 3 2017 2:06 AM
Advertisement
Advertisement