సాక్షి, వైఎస్సార్ : కరువు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ. 2వేల కోట్లతో కెలావిటి రిలీఫ్ ఫండ్‌ను తీసుకొచ్చిందని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి మధుసూదన్ రెడ్డి తెలిపారు. సోమవారం రాయచోటి నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. పలుచోట్ల పంటల పరిశీలించిన ఆయనకు మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్ రెడ్డి కరువు పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా మధుసూదన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు ఈ ఏడాదిలోనే పెట్టుబడి సాయం క్రింద రూ. 12500, అలాగే ప్రభుత్వమే భీమా భరించడం, 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణనిధి ఏర్పాటు చేశారని వెల్లడించారు. ప్రతి నియోజకవర్గానికి ఒక బోర్వేల్ వాహనాన్ని ఏర్పాటు చేసి అవసరమైన రైతులకు ఉచితంగా బోరు వేయించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోందన్నారు.
తీవ్ర వర్షాభావం కారణంగా ఇంతవరకు పంటవేయలేని రైతులకు వందశాతం సబ్సిడీ ఉలవ, పేసర విత్తనాలు పంపిణీ చేస్తామని తెలిపారు. గతేడాది నుంచి జిల్లాకు రూ. 150 కోట్లు, రాష్ట్రానికి రూ. 2 వేల 400 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ కేంద్రం నుంచి అందాల్సివుందన్నారు. వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుని రైతులకు ఉపశమనం కల్గించనుందని పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment