పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా: 20 మందికి గాయాలు | 20 people injured as tractor overturned | Sakshi
Sakshi News home page

పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా: 20 మందికి గాయాలు

Published Fri, Nov 29 2013 9:06 AM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM

20 people injured as tractor overturned

మహబూబ్నగర్ జిల్లాలోని ధరూర్ మండలంలోని గద్వాల్- రాయచూర్ రహదారిపై కూలీలతో వెళ్తున్న ఆటో ఆదుపుతప్పి బోల్తా పడింది. ఆ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 18 మందికి గాయపడ్డారు. 19 మంది కూలీలతో శుక్రవారం ఉదయం గంగన్పల్లి గ్రామం నుంచి కర్ణాటకలోని రయాచూర్ వెళ్తుండగా ఆ ప్రమాదం చోటు చేసుకుంది. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి 108కి సమాచారం అందించారు. దాంతో క్షతగాత్రులను 108లో గద్వాల్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

అదే జిల్లాలోని ఖిల్లా ఘన్పూర్ శివారులో పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ ఈ రోజు తెల్లవారుజామున బోల్తా పడింది. ఆ ఘటనలో  పది మందికి తీవ్ర గాయాలు, మరో పది మందికి  స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement