tractor overturned
-
పెళ్లి ట్రాక్టర్ బోల్తా.. 13 మంది మృతి
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడిన ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. అందులో నలుగు చిన్నారులు ఉన్నారు. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో రాజగఢ్ పిప్లోడి వద్ద ఓ వివాహ ఊరేగింపులో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో గాయపడిన మరో 15 మందిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసుల ఘటనాస్థలానికి చేరకుని పరిశీలించారు. రాజస్థాన్‌లోని మోతీపురా నుంచి కులంపూర్‌కు ఊరేగింపుగా వెళ్తున్న క్రమంలో ట్రాక్టర్ బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందినవారిలో రాజస్థాన్‌కు చెందినవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది.ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్‌యాదవ్ స్పందించారు. ‘‘రాజస్థాన్ ప్రభుత్వం, పోలీసులతో టచ్‌లో ఉన్నాం. రాజస్తాన్ పోలీసులు ప్రమాద స్థలానికి చేరకున్నారు. గాయపడినవారు రాజగఢ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరి కొంతమందిని భోపాల్ తరలించాం’’ అని ఎక్స్‌లో తెలిపారు. -
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. నీముచ్ జిల్లాలో భక్తులతో వెళుతున్న ఓ ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడిన దుర్ఘటనలో 11మంది దుర్మరణం చెందగా, మరో 12మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఒక్కొక్కరికి రెండు లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మరోవైపు జమ్మూకశ్మీర్ రాజౌరీ జిల్లా షోపియాన్ సమీపంలోని ఫూంచ్ వద్ద స్కూలు బస్సు ప్రమాదానికి గురైందని, లోయలో పడిందని తొలుత కథనాలు వచ్చాయి. 40 మంది విద్యార్థులతో వెళ్తున్న ఈ బస్సు నిజానికి అసలు ప్రమాదానికి గురికాలేదని, అది సురక్షితంగా పూంచ్ చేరుకుందని ఏఎస్పీ మస్రూర మిర్ తెలిపారు. గరిబ్ నవాజ్ స్కూలు విద్యార్థులు విహార యాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా బస్సు ప్రమాదానికి గురైనట్లు తొలుత వదంతులు వచ్చాయి. దాంతో బస్సులో ఉన్న మొత్తం 40 మంది విద్యార్థులూ మరణించారని కూడా వార్తలు వెలువడ్డాయి. అయితే వీటన్నింటినీ మిర్ ఖండించారు. -
ట్రాక్టర్ బోల్తా: 15 మందికి గాయాలు
కడప: వైఎస్ఆర్ జిల్లాలోని గోపవరం మండలం పీపీకుంటలో పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా గురువారం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పుటాయపల్లి నుంచి పెంచలకోన వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాక్టర్ బోల్తా : ఇద్దరు మృతి
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని నవీపేట మండలం సిర్నపల్లి సమీపంలో శుక్రవారం ఇసుక ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను స్వాధీనం చేసుకుని... పోస్ట్‌మార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాక్టర్ బోల్తా: ముగ్గురు కూలీలు మృతి
నల్గొండ : నల్గొండ జిల్లా మఠంపల్లి మండలం అవరేనికుంట తండ వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్చి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. మృతదేహలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మేళ్లచెరువు మండలంలో మిర్చి పంట కోసేందుకు వారంతా ట్రాక్టర్లో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ట్రాకర్ట్ అధిక వేగమే ఈ ప్రమాదానికి కారణమని కూలీలు వెల్లడించారు. -
ట్రాక్టర్ బోల్తా, ముగ్గురు మృతి
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా పరిగిలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. ఇసుక లోడ్‌తో వెళుతున్న ఓ ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు అక్కడిక్కడే మరణించారు. దీంతో పరిగి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలెట్టారు. మృతులు మహబూబ్‌నగర్ జిల్లా కెందుర్గు మండలానికి చెందినవారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పరారీలో ఉన్న ట్రాక్టర్ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా: 20 మందికి గాయాలు
మహబూబ్‌నగర్ జిల్లాలోని ధరూర్ మండలంలోని గద్వాల్- రాయచూర్ రహదారిపై కూలీలతో వెళ్తున్న ఆటో ఆదుపుతప్పి బోల్తా పడింది. ఆ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 18 మందికి గాయపడ్డారు. 19 మంది కూలీలతో శుక్రవారం ఉదయం గంగన్పల్లి గ్రామం నుంచి కర్ణాటకలోని రయాచూర్ వెళ్తుండగా ఆ ప్రమాదం చోటు చేసుకుంది. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి 108కి సమాచారం అందించారు. దాంతో క్షతగాత్రులను 108లో గద్వాల్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అదే జిల్లాలోని ఖిల్లా ఘన్పూర్ శివారులో పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ ఈ రోజు తెల్లవారుజామున బోల్తా పడింది. ఆ ఘటనలో పది మందికి తీవ్ర గాయాలు, మరో పది మందికి స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.